‘‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ టైటిల్ చక్కగా ఉంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాటలు చాలా బాగున్నాయి. గోవర్ధన్‌కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావడం ఖాయం’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) అన్నారు. చంద్రకాంత్ హీరోగా, రాధిక, పల్లవి డోరా హీరోయిన్లుగా గోవర్ధన్ గజ్జల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్ రొయ్యూరు, శ్రీకాంత్ పద్మనాభం, గోవర్ధన్ గజ్జల నిర్మాతలు. నేడు విడుదలవుతోన్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. షూటింగ్ మొత్తం అమెరికాలో జరిగింది. మా చిత్రంలో నటించినవారు, పని చేసినవారు అమెరికాలోని తెలుగువారే కావడం విశేషం’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి సబ్జెక్ట్. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చంద్రకాంత్.
Comments
Please login to add a commentAdd a comment