radhika
-
రెండో విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ రెండో దశ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం కేటాయించింది. సీట్లు పొందిన వైద్యులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఇద్దరు లేదా ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కాలేజీల్లో చేరే వైద్యుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. ముఖ్యంగా స్థానికత, రిజర్వేషన్ల వారీగా నీట్ కటాఫ్ స్కోర్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. -
ఇంటింటికి సౌర సిరులు
మనకు సూర్యుడున్నాడు.వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.సిస్టమ్ ఉంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడు.కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్‌ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.మూడు తర్వాత బయటకు రారుపాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్‌లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె. సోలార్ ఉమన్రాధికకు యూఎస్‌లో ఎమ్ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్‌తో శాటిలైట్లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్‌లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్‌తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు. ‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె. ప్రత్యామ్నాయం ఇదిబొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్‌ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్‌ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.– రాధికా చౌదరి,కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ– వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
టిల్లు గాని 'రాధిక'.. ఇప్పుడేమో యమ హాట్‌గా! (ఫొటోలు)
-
రాధికా మర్చంట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అనంత్ పెళ్లిలో హైలెట్‌గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్‌లు, కార్లు అన్ని హైలెట్‌గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్ పతకం అత్యంత హైలెట్‌గా నిలిచింది. ముఖేశ్‌తో సహా అనంత్, ఆకాశ్ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్ చేసిన ఆభరణం ధరించారంటే..ఈ ఆభరణాన్ని కాంతిలాల్ ఛోటాలాల రూపొందించారు. అనంత్ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్ ఎంతగానో కేర్ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రోచ్‌లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట. ఈ పతకం జామ్‌నగర్‌లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్‌కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by Kantilal Chhotalal (@kantilalchhotalal)(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
అనంత్ రాధికల పెళ్లిలో లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహ వేడుకులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎందరో ప్రుముఖులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు విచ్చేశారు. ఈ వేడుకలో కేవలం సెలబ్రెటీలు, సినీ ప్రముఖులకు మాత్రమే గాదు తమ కుటుంబానికి సేవ చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పిలచింది అంబానీ కుటుంబం. అనంత్ రాధికల వివాహంలో బాగా హైలెట్‌గా నిలిచింది లలితా డిసిల్వా. అనంత్ పెళ్లికి వచ్చిన వారంలా ఈ లలితా డిసిల్వా గురించి మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఆ వివాహంలో ఆమెనే హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965)లలితా డిసిల్వా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ల కుమారులు తైమూర్, జెహ్‌ల సంరక్షణ చూచుకునే నానీ. ఆమె అనంత్ పెళ్లిలో సందడి చేయడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే..? ఆమె ఒకప్పుడూ అనంత్ బాల్యంలో అతడి సంరక్షణ బాధ్యతలు చూసుకున్న నానీనే లలితా డిసిల్వా. ఇన్నేళ్లు గడిచిపోయినా..అంబానీ కుటుంబం తనను గుర్తించుకుని మరీ ఇలా అనంత్ రాధికల పెళ్లికి పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నాడు అనంత్ బాధ్యతలను చూసుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965) అనంత్ బాబు, అంబానీ కుటుంబం తన జీవితంలోకి తెచ్చిన ఆనందం, ప్రేమలను ఎన్నటికీ మర్చిపోలేను. అతను చాలామంచి అబ్బాయి అని అన్నారు. అతను ఈ గొప్ప వేడుకతో సంతోషకరమైన వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న అనంత్‌కి శుభాకాంక్షలు అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దేవుడు ఈ జంటను తప్పక ఆశీర్వదిస్తారు అని అన్నారు. ఆమె ఇప్పుడూ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లిన్ కారాకు నానీ కూడా. ఆమె ఈ నేపథ్యంలో తాను పనిచేసిన సెలబ్రెటీ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలను సైతం షేర్ చేసింది.(చదవండి: 'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్..?) -
రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం చాలా లగ్జరీయస్‌గా జరిగిన సంగతి తెలిసిందే. వివాహ తంతులో భాగంగా జరిగే అప్పగింతల కార్యక్రమం ఎంతటి ధనవంతురాలైన కోడలుగా వేరే ఇంట అడుగుపెట్టే వేళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఇక ఈ వివాహతంతు తర్వాత నవ వధువు తను పుట్టిన చోటును వెళ్లిపోతున్నానన్న ఆలోచన తట్టుకోలేకపోతుంది. అలాంటి భావోద్వేగ సమయంలో ఆమెను చూస్తున్న వాళ్లు సైతం కన్నీళ్లుపెట్టుకుంటారు. అలాంటి తంతే అనంత రాధికల వివాహానంతరం సాగింది. దీన్ని వాళ్లు విదాయి వేడుక అంటారు. కోడలు రాధికా మర్చంట్ విదాయి వేడుకలో భాగంగా తనవాళ్లకు వీడ్కోలు పలుకుతూ కన్నీళ్లుపెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి మామగారు ముఖేష్ అంబానీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సున్నితమైన ఘట్టంలో రాధిక కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అనంత్ ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా..ఆ తంతుని చూసి ముఖేష్ కూడా చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కోడళ్లను చాలా ప్రేమానురాగాలో చూసుకుంటారు అనేందుకు ఈ ఘట్టమే ఉదాహరణ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏ ఆడపిల్లకైన జీవితంలో తప్పక ఎదురై ఈ ఘట్టం కంటతడి పెట్టించేలా చేస్తుంది కదూ. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: వింబుల్డన్ నేపథ్య చీరలో కంటెంట్ క్రియేటర్..!) -
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం. గరడు చాట్ అంటే..?కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్‌లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్‌లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్లో మరింత గ్రాండ్‌గా వివాహ మెనూ ఉండొచ్చు.(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్..!) -
రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్..!
ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి కోలాహలంతో సందడిగా ఉంది. రోజుకో ఈవెంట్లో కుటుబసభ్యులంతా కళ్లు చెదిరే ష్యాషన్ డిజైనర్ వేర్లతో అలరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం చాలా వేడుకగా జరుగుతోంది. అందులో భాగంగా అనంత్ రాధికల శివశక్తి వేడుక జరిగింది. ఈ వేడుకలో నీతా ధరించిన లెహంగా మిస్మరైజ్ చేస్తోంది. చక్కటి రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో నీతా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసిపోతోంది. ఆ గ్రాండ్ లెహంగాకి తగ్గట్టుగా ఆమె ధరించిన పెద్ద కుందన్ నెక్లెస్ సెట్ మిరుమిట్లు గొలిపే కాంతితో ఆమె ముఖ వర్చస్సు మరింత అందంగా కనిపిస్తోంది. అబు జానీ సందీప్ ఖోస్టో డిజైన్ చేసిన స్పెషల్ లెహంగాలో నీతా చాలా అందంగా కనిపించింది. ఆ లెహంగా..చిలుక ఆకుపచ్చ స్కర్ట్, పైన రిచ్ బ్లూ దుప్పట దానిపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, మిర్రర్లతో కూడిన జరీ వర్క్‌తో అందంగా తీర్చిదిద్దారు. నీతా ధరించిన లెహంగా మంచి రిచ్ లుక్‌లో ఉండగా, ముఖ్యంగా ఆమె నెక్కి ధరించిన కుందనపు నగ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెవులకు సైతం పెద్ద కుందనాలతో ఉన్న చెవిపోగులనే ధరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, అనంత్ రాధికల పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!) -
అనంత్ అంబానీ హల్దీ వేడుక: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్త్రధారణలో నీతా..!
ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యుల వస్త్రధారణ, నగలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. సోమవారం జరిగిన హల్దీ వేడుకలో నీతా, శ్లోకామెహతా, ఇషా తమదైన డిజైనర్‌వేర్ దుస్తులతో మెరిశారు. ఇషా,శ్లోకా రంగురంగుల లెహంగాలతో అలరించగా..నీతా వారిద్దర్ని తలదన్నేలా సరికొత్త లుక్‌లో కనిపించారు. అదికూడా మన హైదరాబాద్‌కు చెందిన 150 ఏళ్ల చౌగోషియ సంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నారు. ఇది అత్యంత అరుదైన హైదరాబాద్ కుర్తా. దీనికి ఖాదా దుప్పటా చీర మాదిరిగా అతిపెద్దగా వస్తుంది. చెప్పాలంటే 150 ఏళ్ల నాటి దుస్తుల శైలి. హైదరాబాదీ ముస్లీం మహిళలు తమ నికాహ్ లేదా వివాహ వేడుకల సమయంలో ఈవిధమైన దుస్తులను ధరిస్తారు. దీని మూలాలు 17వ శతాబ్దంలో మొఘల్ శకంలో ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంప్రదాయాన్ని హైదరాబాద్‌లో రాజవంశస్థులైన రాణి, బేగంలు అనుసరించేవారు. అలనాటి సంప్రదాయ వస్త్రధారణ శైలి ఫ్యాషన్ నుంచి బయటపడదని మరోసారి తేటతెల్లమయ్యింది. ఏళ్ల నాటి ముస్లిం రాణుల సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది నీతా. అందుకు తగ్గట్టు అద్భుతమైన ఆభరణాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన కమ్మలు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండగా, ఆ డిజైనర్ వేర్కి మ్యాచింగ్‌గా ధరించిన బ్రాస్లెట్, బిందీ తదితరాలన్ని ఆమె రూపాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేశాయి. చివరిగా స్టైలిష్ స్ట్రాపీ హీల్స్‌తో తన రాణి మాదిరి లుక్‌ని తెప్పించింది. పైగా ముఖానికి లైట్ మేకప్‌ని ఎంచుకున్నారు. మొత్తం ఈ హల్దీ వేడుకలో ఆమె ఏళ్ల నాటి సంప్రదాయాన్ని సరికొత్తగా గుర్తు చేశారు ఆమె. ముఖ్యంగా మన హైదరాబాదీ సంప్రదాయన్ని అంబానీలు అనుసరించడం విశేషం. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!) -
అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్‌గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్ఫుల్గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్‌ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు. ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్‌తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్‌తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్‌తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్‌గా ఉండగా, అందమైన నెక్లైన్తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా..!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఓ రేంజ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇంటిలో జరిగే ఆఖరి వివాహం కావడంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల లగ్జరీ క్రూయిజ్‌లో ఏకంగా 800ల మంది అతిథుల సమక్షంలో అనంత్-రాధికల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన అంబానీ కుటుంబ సభ్యుల వేషాధారణకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ వేడుకల్లో వధువు ధరించిన ప్రతి డ్రెస్ హైలెట్‌గా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రాధిక ధరించిన అనంత్ లవ్ లెటర్ని ముద్రించిన గౌను అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక ఈ వేడుకలో ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం ప్రిన్స్ రేంజ్లో తన వేషాధారణతో ఆకట్టుకుంది. ఈ వేడుకలో రాధికాకు ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఆహార్యం ఉంది. ముఖ్యంగా ఆమె ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధరించిన డ్రెస్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆమె నీలం- బంగారు డ్రెస్‌లో యువరాణిలో మెరిసింది శ్లోకా మెహతా. ఆమె ఈ వేడుకలో కోసం ధరించిన వెర్సాస్ బ్రాండ్ గౌనుని ఎంచుకుంది. ఈ గౌను 2018 మెట్ గాలో జిగి హడిద్ ఫ్యాషన్ శైలిని అనుకరించింది. ఈ గైనును రూపొందించింది స్టైలిస్ట్ దియా మెహతా జటియా. ఆమె ఈ వెర్సాస్ గౌను శ్లోకా మెహతా కోసం ఎందుకు రూపొందించారో వెల్లడించింది. శ్లోకా మెహతా ఇద్దరు పిల్లల తల్లి. మాతృత్వం రీత్యా శరీరాకృతి మారడం సహజం. అది బయటకు కనిపించకుండా ఉండేలా ఆమెలో ఉన్న యువరాణి లుక్‌ని వెలికి తీసేలా ప్రజెంట్ చేసేందుకు ఈ వెర్సాస్ గౌనుని రూపొందించామని చెప్పారు. మెట్ గాలాలో ఆకర్షణగా కనిపించిన జిగి హడిడ్ రూపాన్ని మెహాతాలో కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసేందుకు ఇలా నీలం బంగారు గౌనుని డిజైన్ చేశామని అన్నారు. శ్లోకా ఈ గౌనుకి తగ్గట్టుగా రోజీ మేకప్, డైమండ్ జ్యువెలరీని ధరించింది. ఈ గౌనులో శ్లోకా యువరాణి రేంజ్ స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఒత్తిడికి గరైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా? పరిశోధన ఏం చెబుతోందంటే..) -
ట్రెడిషనల్ లుక్‌లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్‌ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్‌లోనే ఒక ఫ్లాట్‌లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్‌లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్‌బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్‌కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..! -
Sara Ali Khan: అంబానీ ప్రీవెడ్డింగ్.. ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
-
అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)
-
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్‌కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్‌ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్‌లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్‌ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్‌కు అవార్డు బహూకరించనున్నారు. -
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్‌కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్‌ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని UN మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!) -
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్‌తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
విద్యానగర్ (కరీంనగర్): ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళానైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆర్థిక కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్–రాధిక వివాహ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్దస్టార్స్ కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యే వీవీఐపీలకు విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ కుటుంబం నిర్ణయించింది. వాటిలో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కూడా ఉన్నాయి. ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచి్చనట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతర త్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం 400 సంవత్సరాల నాటి పురాతన కళకు ప్రోత్సాహకంగా నిలు స్తుందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో జీఐ ట్యాగ్ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయా రు చేయడం, తీగలు అల్లడం ఈ కళ విశేషం. -
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
రాజస్థాన్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాధికా ఖేరా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనని వేధిస్తున్నారంటూ రాధికా ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం తాను విమర్శలకు గురైనట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారని, గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఇదే విషయంపై పార్టీ నేతలకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో పాటు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నందుకు అనేక విమర్శలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్పర్సన్ సుశీల్ ఆనంద్‌తో పాటు మరికొంత మంది తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్‌జర్గాల్ డొల్గొర్‌జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
అస్సలు బాధపడకండి..! వ్యాపారవేత్త రాధిక గుప్తా సలహా!
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టి, అనేక రకాల అవహేళనలను ఎదుర్కొంది. డెలివరీ సమయంలో చిన్న సమస్య కారణంగా రాధిక మెడ కొద్దిగా వంగింది. అంతేకాకుండా ఒక కంటిలో లోపం ఏర్పడింది. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. (పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత) పెన్సిల్వేనియాలో కంప్యూటర్సైన్స్లో పట్టభద్రురాలైన రాధిక ఉద్యోగం కోసం ప్రయత్నించగా దాదాపు 7 సార్లు రిజెక్ట్ అయిందనీ, దీంతో ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన కూడా వచ్చిందని స్వయంగా రాధిక ఒకసారి చెప్పారు. దీంతో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్త, స్నేహితులతో కలిసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించింది. కొనేళ్లకు ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు, ఆమె భర్త నలిన్ మోనిజ్. వీరికి 2022లోఒక కుమారుడుపుట్టాడు. View this post on Instagram A post shared by Radhika Gupta (@iamradhikagupta) షార్క్ ట్యాంక్ ఇండియా-3లో న్యాయనిర్ణేతగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు. అంట్రప్రెన్యూర్స్ ఎకోప్రెన్యూర్స్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఉండటమేకాదు అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది.. అరటి, పైనాపిల్, జనపనార ఆకులు, కాండంతో డెనిమ్స్, టీ షర్టులు చీరలు రూపొందించే సంస్థలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండే మోటివేషన్ అంటూఇన్స్టాలో ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్బంగా తన తల్లి ఇచ్చిన విలువైన సలహాను ఆమె పంచుకున్నారు. తన చేతుల్లో తన బిడ్డను పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె ఉద్యోగినులుగా పనిలో తలమునకలై పిల్లల గురించి, మీ గురించి పట్టించు కోలేకపోతున్నామని బాధపడుతున్నారా.. దీన్ని గుర్తుంచుకోండి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాతృత్వ బాధ్యతలతో పాటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టతరమైందే కానీ..దేనికీ బాధపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, కరియర్‌ను కొనసాగించా లన్నారు. ‘‘ఏ తల్లీ చెడ్డ తల్లి కాదని అమ్మ చెప్పింది. పదవారు, ధనవంతులు, విద్యావంతులు, చదువుకోనివారు, పని చేసేవారు, పని చేయకనివారు.. ఇలా ఎవరైనా అమ్మ అమ్మే.. ప్రతీ తల్లి తన బిడ్డకు మంచి చేయాలనే కోరుకుంటుంది’’ రాధిక గుప్తా అలాగే అటు తల్లి, ఇటు వ్యాపారవేత్తగా ఉంటూనే, రియాలిటీ షోలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నదీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తాను ఎక్కడికి వెళ్లినా, ప్రెపెస కాన్ఫరెన్స్‌లలో కూడా కుమారుడు తనతో పాటు ఉంటాడని, షార్క్ ట్యాంక్సెట్లలో ఎక్కువ సమయం ఉంటాడని కూడా వెల్లడించా రామె. మాతృత్వం మహిళల సవాళ్లను స్వీకరించే సామర్థ్యానికి అడ్డుకోకూడదని తాను భావిస్తానన్నారు. మహిళలకు పెళ్లి, పిల్లలు తరువాత కరియర్లో బ్రేక్ వస్తుంది. ప్రసూతి సెలవు తరువాత మళ్లీ ఉద్యోగంలోకి రావడం అనేది మానసికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే. పసిబిడ్డల్ని వదిలి వెళుతున్నామనే బాధ ఒకవైపు, ఉద్యోగంలో రాణించాలనే ఒక పట్టుదల ఒకవైపు వారిని స్థిరంగా ఉండనీయవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది తల్లులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. -
Swathi Muthyam@38: మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
బంగారంతో లెహంగా.. అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది!
అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యలు ధరించిన నగలు, ఫ్యాషన్ బ్రాండ్ డ్రస్లపైన తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మేడుకలు బాలీవుడ్ అగ్ర తారలు, ప్రముఖ పాప్ సింగర్లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ధరించిన డ్రస్‌లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్ అంబానీ రేంజ్‌కి తగ్గట్టు ఆమె డ్రస్‌లు నగలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అది కామనే. కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్లో డ్రస్‌లు డిజైన్ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ చివరి రోజున రాదిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్‌పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్ర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట. అంతేగాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధువరులు అనంత్ రాధికాలు తమ వివాహపత్రాలపై సంతాకాలు చేసినట్లు వోగ్ మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: వజ్రాలు వైఢ్యూర్యాల డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్‌భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్‌లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్‌వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్‌కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్‌లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్‌లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్‌ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్
70 Hour Week Remark controversy: వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్‌ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్ టైంని డిమాండ్ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ కూడా తమ కుమారుడి పెంపకంలో చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు, ఆఫీస్ పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు. చాలా కరెక్ట్‌గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్మెంట్ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్. అందరికంటే ముందు లేచేది అమ్మ.. అందరికంటే చివర్లో తినేది అమ్మే.. ఆఖరికి చివరగా నిద్రపోయేదీ అమ్మే అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. పితృస్వామ్యం అంతరించేంత వరకు ఈ వివక్ష పోదు. వెస్ట్రన్‌లో కూడా పూర్తి సమయం ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వీకెండ్లో పురుషులంతా పార్టీలు చేసుకుంటారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే వరకు...ఏదీ మారదు మరోయూజర్ వ్యాఖ్యానించారు. Between offices and homes, many Indian women have been working many more than seventy hour weeks to build India (through our work) and the next generation of Indians (our children). For years and decades. With a smile, and without a demand for overtime. Funnily, no one has… — Radhika Gupta (@iRadhikaGupta) October 29, 2023 కాగా ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్‌దాస్ పాయ్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా మన దేశం కూడా ఆర్థికంగా పుంజుకోవాలంటే యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారంటూ మీడియాలో పలు కథనాలు వెలు వడ్డాయి. దీంతో నెటిజన్లు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భవిష్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ సజ్జన్‌సిందాల్ సహా కొంతమంది పరిశ్రమ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. Infosys employee pic.twitter.com/FN8y5BgGTu — Gabbar (@GabbbarSingh) October 28, 2023 -
రాధిక కొత్త ప్రయాణం
కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్ హిట్. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్ రైల్’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్‌లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్‌కుమార్ (రాధిక భర్త), రేయాన్ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్ వాలిన్ దర్శకుడు. -
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరుకులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్‌టాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేకమంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయాయి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలని రూ.లక్షలు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యాలకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. ఆత్మీయ, అనురాగాలేవి ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూహాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్‌లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావడం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించిపోవడం కూడా మానíÜక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఫలితంగా గుండెపోటు, మెదడు పోటుకు దారి తీయవచ్చునంటున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. పాజిటివ్‌గా ముందుకు సాగాలి ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
మంత్రి ఆర్కే రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండించిన రాధికా
-
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
మెరుగైన పోర్ట్‌ఫోలియోకు 8 సూత్రాలు..
ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కాకుండా మధ్య మధ్యలో మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ కూడా ఉండాలి. అవసరమైతే రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఎన్నాళ్లకు ఈ ప్రక్రియ చేపట్టాలంటే.. ఐదేళ్లకోసారి అనేది నా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత గమనంలో ఈ అయిదేళ్ల వ్యవధిలో లక్ష్యాలు, పరిస్థితులు, అవసరాలు మారిపోతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న పెట్టుబడులు, సాధనాలు, వాటి పనితీరును మదింపు చేసుకోవడానికి కూడా ఈమాత్రం సమయం అవసరం. నా అనుభవం మేరకు ఫండ్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధించిన ఎనిమిది కీలక అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవేమిటంటే.. ఫండ్/ఏఎంసీ ఎంపిక .. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ సావర్ధ్యాలు ప్రాతిపదికగా ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి ఏఎంసీకి ఒక స్పె షాలిటీ అంటూ ఉంటుంది. మిడ్‌క్యాప్, వేల్యూ లేదా గ్రోత్ అంటూ వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకానుభవం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఏఎంసీ/ఫండ్ పరిమాణం.. ఏఎంసీ పరిమాణమనేది అప్రస్తుతం. చిన్న ఏఎంసీలతో పోలిస్తే పెద్ద ఏఎంసీలు వెనకబడిన సందర్భాలు చాలానే చూశాను. ఆ చిన్న ఏఎంసీలు తర్వాత రోజుల్లో మీడియం ఏఎంసీలుగా ఎదిగాయి కూడా. భారీ బుడగలాగా పెరిగిపోయిన స్కీములకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఎంత మంచి పనితీరు కనపర్చినా కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ విషయంలో దీన్ని మరింతగా దృష్టిలో పెట్టుకోవాలి. నిలకడ వర్సెస్ స్టార్ పెర్ఫార్మెన్స్.. స్టార్ రేటింగ్స్ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. నా కొత్త పోర్ట్‌ఫోలియోలో, టాప్ పోర్టల్ ర్యాంకింగ్స్ లేదా 5 స్టార్ ర్యాంకింగ్స్ లేదా అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఫండ్స్ ఏవీ లేవు. నిలకడగా రాణిస్తున్న వాటిని నేను షార్ట్ లిస్ట్ చేసుకుని, వాటిల్లో నుంచి ఎంచుకున్నాను. అత్యుత్తమ పనితీరుకన్నా నిలకడకే ప్రాధాన్యమివ్వొచ్చు. సిప్ మంచిదే.. నెలవారీ సిప్‌లు బాగా పనిచేస్తాయి. సిప్ల వల్లే ఫండ్ పనితీరు కన్నా ఓ ఇన్వెస్టరుగా నా పనితీరు దాదాపు మెరుగ్గా ఉంటోంది. ఎందుకంటే.. మార్కెట్లు పడినప్పుడు కూడా నేను యూనిట్స్ కొంటూనే ఉంటాను. అంతేగాకుండా సిప్ల పని తీరు సైతం మెరుగ్గా ఉంటోంది. బీఏఎఫ్ కేటగిరీల్లో 14 శాతం పైగా, మిడ్ క్యాప్ కేటగిరీల్లో 18 శాతం పైగా రాబడులు ఇస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పెరిగే ఆదాయాలకు అనుగుణంగా సిప్‌లను కూడా పెంచుకుంటూ ఉండటం మంచిది. పరిమిత సంఖ్యలో స్కీములు.. పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్ స్కీములు ఉండాలి అంటే.. 10 వరకూ ఫర్వాలేదు. అంతకు మించి ఉండొద్దు. స్కీముల సంఖ్యను ఒక స్థాయికి పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫండ్స్‌లో చాలా కేటగిరీలు ఉన్నందున ఇది అంత సులభం కాదు. నా మటుకు నేను ఫండ్స్‌ను ఆరు కేటగిరీల కింద వర్గీకరించుకున్నాను. ఒకో కేటగిరీలో ఒకటి లేదా రెండు స్కీములు ఉంటాయి. మొత్తం మీద 10కి మించవు. వీటిల్లో ఫ్లెక్సీ లేదా లార్జ్, మిడ్‌క్యాప్; మిడ్‌క్యాప్; స్మాల్ క్యాప్; అసెట్ అలొకేషన్ ఫండ్స్; ఇండో గ్లోబల్ ఫండ్స్ (పన్ను ప్రయోజనాలు కలి్పంచేవి); పూర్తి గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. పన్నులపరమైన కారణాల రీత్యా చివరిది కొత్తగా జోడించాను. డైవర్సిఫికేషన్ ప్రధానం.. వైవిధ్యమైన స్టయిల్ పాటించే ఫండ్ హౌస్‌కు నేను ప్రాధాన్యం ఇస్తాను. ఏ ఏఎంసీలోనైనా ఒక్క స్కీములో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి సమయంలోనైనా మెరుగైన పనితీరు కనపర్చగలిగే వివిధ రకాల పెట్టుబడి విధానాల గురించి తెలుస్తుంది. యాక్టివ్, పాసివ్ విషయానికొస్తే నేను ఎక్కువగా యాక్టివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతాను. రిస్క్ సామర్ధ్యాలు.. నా అసెట్ అలొకేషన్ విషయంలో నేను సంప్రదాయ పద్ధతిని పాటిస్తాను. అంటే నా ఫండ్ స్కీములు చాలా వాటిల్లో ఈక్విటీ పెట్టు బడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇంటి కొ నుగోలు వంటి ఆర్థిక లక్ష్యం అవసరం లేనందున నేను కొంత దూకుడైన విధానం వైపు మ ళ్లుతున్నాను. మా అబ్బాయి కాలేజి చదువుకు అవసరమయ్యే డబ్బు కోసం నేను ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కూడా ప్రారంభించాను. సంక్లిష్టమైన సాధనాల జోలికెళ్లొద్దు.. పెట్టుబడుల విషయంలో దూకుడైన తీరు ఉంటే ఉండొచ్చు, కానీ పోర్ట్‌ఫోలియోలో సంక్లిష్ట సాధనాలు లేదా క్లోజ్డ్ ఎండెడ్ సాధనాలను నివారించడమే మంచిది. మీరు ఇన్వెస్ట్ చేసే పథకం గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే ఉపసంహరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లిక్విడిటీ, అంటే కోరుకున్నప్పుడు నగదు రూపంలోకి మార్చుకోగలిగే వెసులుబాటు చాలా ముఖ్యం. -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్ నుంచి అహ్మద్‌నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!
బుల్లితెర నటిమణులు వెండి తెరకు పరిచయం కావడం కొత్తేమీ కాదు. ఆ మధ్య నటి ప్రియా భవానీశంకర్, వాణి భోజన్ బుల్లితెర నుంచి వచ్చి సినిమాలో సక్సెస్ అయిన వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వరుసలో చాలామందే ఉన్నారు. ఇకపోతే నటుడు శశికుమార్ కొత్త హీరోయిన్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. 'కారి' చిత్రంలో పార్వతి అరుణ్ అనే కొత్త నటికి అవకాశం కల్పించారు. ఇటీవల అయోత్తి చిత్రంలో ప్రీతి ఇస్రాణి అనే నూతన నటి శశికుమార్‌తో జత కట్టిన విషయం తెలిసిందే. ( ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) తాజాగా శశికుమార్ హీరోగా నటించనున్న చిత్రంలో బుల్లితెర నటి రాధిక ప్రీతి కథానాయకిగా పరిచయం కానున్నట్లు సమాచారం. ఈమె పూవే ఉనక్కాగ సీరియల్ ద్వారా పరిచయమైన కన్నడం నటి కావడం గమనార్హం. ఆ సీరియల్లో పూవరసీ అనే పాత్రలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఆ సీరియల్లో ప్రస్తుతం ఆమె నటించడం లేదు. కారణం సినిమాల్లో హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నించడమేనట. అలా అని ప్రయత్నం ఫలించి శశికుమార్ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రంతో రాధిక ప్రీతి సినీ కథానాయకిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ( ఇది చదవండి: నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో) -
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో.. ఎంతో 'అజాగ్రత్త'గా!
బాలీవుడ్ నటుడు శ్రేయాస్, రాధిక కుమారస్వామి జంటగా నటిస్తోన్న చిత్రం 'అజాగ్రత్త'. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు శ్రేయాస్. ఈ చిత్రానికి ఎం. శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. (ఇది చదవండి; విమానం నుంచి 'సిన్నోడా ఓ సిన్నోడా' లిరికల్ ప్రోమో రిలీజ్) సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్‌గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించనున్నారు. -
అంతరంగచిత్రం
హంస ముఖంలో ముఖం పెట్టి మురిపెంగా చూస్తున్న అమ్మాయి.నెమలి పింఛాన్ని ఆసక్తిగా చూస్తున్న బుట్టగౌను పాపాయి.ఏనుగు తొండాన్ని ఆత్మీయంగా నిమురుతున్న యువతి.ప్రకృతి... పక్షులు... సరస్సులు... పువ్వులు కళ్ల ముందే.థీమ్ ఏదయినా సరే... ఓ అమ్మాయి రూపం తప్పనిసరి.ఆర్టిస్ట్ ఆషా రాధిక బొమ్మల్లో కనిపించే ఆర్ద్రత ఇది. ఆషా రాధిక పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం అంతా హైదరాబాద్‌లోనే. ఆమె బొమ్మల్లో హైదరాబాద్ సంస్కృతితోపాటు హైదరాబాద్‌లో కనిపించని జీవనశైలి కూడా ద్యోతకమవుతుంటుంది. ఆమె 24 సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’ చిత్రలేఖన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిత్రకళా ప్రస్థానాన్ని ‘సాక్షిఫ్యామిలీ’తో పంచుకున్నారు. కుంచె నేర్పింది! ‘‘నాకు పెయింటింగ్ హాబీగా మారడానికి కారణం మా అమ్మనాన్న. అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది. దారంతో వస్త్రం మీద ఒక రూపం తీసుకురావాలంటే గంటల సేపు పని చేయాలి. బ్రష్‌తో అయితే నిమిషంలో వచ్చేస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టాను. స్కూల్లో కాంపిటీషన్లలో ప్రైజులు వస్తుంటే ఆ ఉత్సాహంతో మరికొన్ని బొమ్మలు వేసేదాన్ని. ఇక నాన్నగారు మహాసంప్రదాయవాది. ఆడపిల్లలు స్కూలుకి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇక దేనికీ బయటకు వెళ్లరాదన్నంత నియమం ఆయనది. ఖాళీ సమయం అంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో పెయింటింగ్స్‌లో ప్రయోగాలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. అలా కుంచే నాకు గురువైంది. సెవెన్త్ క్లాస్‌లో సమ్మర్ కోచింగ్ తప్ప పెయింటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ ఏదీ లేకనే చాలా బొమ్మలు వేశాను. పెద్దయిన తర్వాత టెంపూరా ఆన్ పేపర్ కళను తెలుగు యూనివర్సిటీ, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాసాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. కాన్వాస్లాగానే మైండ్ కూడా నా కుంచె గర్ల్ చైల్డ్ ప్రధానంగా జాలువారుతుంది. నేచర్, పక్షులు, పూలు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలను చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభావితమవుతాం. అయితే అది అనుకరణ కోసం కాదు. ఒక గమనింపు మనలో ఉంటుంది. ఆ చిత్రకారుల గీతను నిశితంగా గమనిస్తుంది మన మేధ. జగదీశ్ మిట్టల్ గారి కలెక్షన్స్‌లో 14వ శతాబ్దం నాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మీనియేచర్ ఆర్ట్ నా మెదడు మీద అలా ముద్రించుకుపోయింది. రామ్‌కుమార్, ప్రభాకర్ కోల్టే వేసే ఆబ్స్ట్రాక్ట్లు చాలా ఇష్టం. ఎన్ని చిత్రాలను చూసి, ఎన్నింటి నుంచి స్ఫూర్తి పొందినా మన మెదడు కాన్వాస్ మీద తనకు తానుగా ఓ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నేను బొమ్మ వేయడానికి కాన్వాస్ ముందు కూర్చునేటప్పుడు ఫలానా రూపం రావాలనే ఆలోచన ఉండదు. కాన్వాస్లాగానే మెదడు కూడా క్లియర్‌గా ఉంటుంది. రంగులు ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉంటే కొంత సేపటికి రూపం వస్తుంది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి తప్పనిసరిగా ఉంటుంది. ఇక థీమ్ అంటే ‘హర్ అబ్జర్వేషన్’ అని చెప్పవచ్చు. ఒక అమ్మాయి ప్రకృతిని, తన పరిసరాలను గమనించడంతోపాటు మమేకం కావడం నా బొమ్మల్లో ఉంటుంది. ఒక అమ్మాయిగా బాల్యంలో నేను చూసినవి, ఊహించినవి, పెద్దయిన తర్వాత నా గమనింపుకు వచ్చినవి, ఒక అమ్మాయికి తల్లిగా ప్రేమానుబంధం నా బొమ్మల్లో ఆవిష్కారమవుతుంటుంది. ఇంట్లోనే ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నాలుగు వేల బొమ్మలు వేసి ఉంటాను. సోలో ప్రదర్శనలను గుర్తు పెట్టుకుంటాను, కానీ గ్రూప్ ప్రదర్శనల లెక్క ప్రత్యేకంగా గణనలోకి తీసుకోలేదు. అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లోనూ నావి సోలో ప్రదర్శనలే. చిత్రలేఖనం పట్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ చదువు ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. ఎస్బీఐలో 1992లో ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు శంకరపల్లి బ్రాంచ్ మేనేజర్ని. ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’లో పాల్గొన్నాను. సోలో ఎగ్జిబిషన్లు 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 25వ ఎగ్జిబిషన్ నా చిత్రలేఖనం కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలనే ఆకాంక్షతో సిద్ధం చేస్తున్నాను’’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఆర్టిస్ట్ ఆషా రాధిక. – వాకా మంజులారెడ్డి -
జీవితగా వస్తున్న రాధికా శరత్ కుమార్..
రక్షిత్ అట్లూరి హీరోగా, సంకీర్తనా విపిన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జీవితపాత్ర చేస్తున్న రాధికా శరత్‌కుమార్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల తర్వాత ‘ఆపరేషన్ రావణ్’లో నటనకి ప్రాధాన్యం ఉన్న జీవితపాత్ర చేశాను. తెలుగుతోపాటు తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రాధిక. -
ఆమె నా ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరోయిన్: మెగాస్టార్
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ఓటీటీ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోనీలివ్‌లో ప్రసారమయ్యే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్‌గా పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా.. తొలి ఎపిసోడ్లో చిరంజీవి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ షో లో పాల్గొన్న మెగాస్టార్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోని కొంతమంది నట దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకున్నవారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. వాటి గురించి మెగాస్టార్ వివరించారు. సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్ఫెక్ట్ అని తెలిపారు. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. దివంగత శ్రీదేవి గురించి మాట్లాడుతూ..' ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మోసగాడు', 'ఎస్పీ పరశురామ్' లాంటి సూపర్ హిట్ సినిమాలు చేయగలిగా.' అని అన్నారు మెగాస్టార్. -
అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు
-
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్‌లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్‌కు స్పందన బాగానే లభిస్తోంది -
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
Beauty Tips: వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది: నటి
'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించింది ఢిల్లీ బ్యూటీ రాధికా మదన్. 2018లో పటాకా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా నటించి మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనితో పాటు రే వెబ్‌సిరీస్‌లోనూ తన నటనకు గానూ రాధిక విమర్శల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే కుట్టీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధికా.. తన బ్యూటీ సీక్రెట్ ఏమిటో అభిమానులతో పంచుకుంది. అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా.. ‘నా చర్మ సౌందర్య రహస్యం.. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాకే. ఇది మా అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా అందిన చిట్కా అని చెప్పొచ్చు. చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టీ స్పూస్ పసుపు, రెండు టీ స్పూన్ల బాదం పప్పు పొడి, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు పాలు.. అన్నిటినీ కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. దీనిని మొహానికి, మెడకు అప్లయ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసు కోవాలి. మెత్తటి టవల్‌తో తడిపొడిగా తుడుచుకుని మాయిశ్చరైజన్ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా.. మొహం డ్రై అవకుండా తేమతో నిగనిగలాడుతూ ఉంటుంది’’ అని రాధికా మదన్ చెప్పుకొచ్చింది. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో చెక్ పెట్టేయండి! -
‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్, సీనియర్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్‌గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. -
మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలో తెలుగు బ్యూటీ
పోటీలో తెలుగు బ్యూటీ మనకు... మిస్ యూనివర్స్ పోటీలు... బాగా తెలుసు. మిస్ వరల్డ్ కూడా... పరిచయమే. అలాగే... మిస్ ఎర్త్ గురించి తెలుసు. మరి... మిసెస్ యూనివర్స్? మిసెస్ వరల్డ్?? మిసెస్ ఇంటర్నేషనల్??? పెద్దగా తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్‌కు అర్హత సాధించిన తెలుగు మహిళ రాధికామూర్తిని పరిచయం చేసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్ పోటీల్లో దేహం కొలతల చట్రంలో ఇమడాల్సిన అవసరం లేదు. ఆత్మసౌందర్యం, అంతఃసౌందర్యమే ప్రధానం. అంతఃసౌందర్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఉలి. ఆ ఉలి చెక్కిన శిల్పమే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం... భావవ్యక్తీకరణలో బహిర్గతమవుతుంది. భావవ్యక్తీకరణకు సాధనం మాట. మాటలో వెలుగు చూసే భావమే అంతఃసౌందర్యానికి కొలమానం. బాధ్యతాయుతమైన వ్యక్తి అని, ఒక సామాజిక బాధ్యత అప్పగిస్తే కర్తవ్యానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనే విశ్వాసం కలిగించడానికి ఒక వేదిక ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పీజంట్. అమెరికాలో జరిగే ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే ఈ పోటీల్లో పొల్గొంటున్న వారిలో ఓ తెలుగు మహిళ ఉంది. ఆమె రాధికామూర్తి. మరో విశేషం ఏమిటంటే... ఆమె పాల్గొంటున్నది యూకే నుంచి. అవును, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా పన్నెండేళ్ల నాడు లండన్‌లో అడుగుపెట్టిన రాధిక అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. భర్త, ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ కెరీర్‌ను బాలెన్స్ చేసుకుంటూ గడిచిపోయిన కాలాన్ని, విద్యార్థి దశలో మొగ్గలు విచ్చుకున్న అభిరుచులను, సామాజిక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన శూన్యత తనను అంతరయానం చేయించిందన్నారు రాధికామూర్తి. రొటీన్ చట్రం బయట ప్రపంచం ఉంది ‘‘నేను పుట్టింది పెరిగింది, చదువుకున్నది అంతా నెల్లూరులోనే. ఉద్యోగం కోసం బెంగళూరులో ఐదేళ్లు ఉన్నాను. యూకేలో ఉద్యోగం రావడంతో 2010లో లండన్‌కి వచ్చాను. ఆరేళ్ల తర్వాత సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. పెళ్లి, ఇద్దరు అబ్బాయిలు, ఉద్యోగం... ఈ చట్రంలో గడిచిపోతూ ఉన్న సమయంలో కరోనా వచ్చింది. జ్ఞాపకాల్లోకి వెళ్లడానికి కొంత విరామం దొరికింది మనసుకి. స్కూల్లో, కాలేజ్‌లో నేను ఫ్యాషన్ షోలు, డాన్స్, పాటల పోటీలు, చిన్న చిన్న నాటికలు... ఇలా స్టేజ్ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. యూకేలో నివసిస్తున్న భారతీయులు పరస్పరం కలవడం కోసం మిసెస్ ఇండియా యూకే వంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. నా సెకండ్ ఇన్నింగ్స్ అలా మొదలైంది’’ అన్నారామె. కరోనా వదల్లేదు కరోనా తగ్గినట్లే తగ్గి తిరిగి విజృంభించడంతో ఆ పోటీలు ఎప్పటిలాగ ఆఫ్‌లైన్‌లో జరగలేదు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. అలా ఎంపికైన నేను ఈ ఏడాది యూఎస్‌లో జరిగే మిసెస్ ఇంటర్నేషనల్‌కు యూకే ప్రతినిధిగా పాల్గొంటున్నాను. ఈ పోటీల్లో ఉండే సంతృప్తి ఏమిటంటే... విజేతలు ఏ రంగంలో సేవలందించాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. నేను మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం పని చేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు రాధికామూర్తి. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కాలంతో పోటీ పడి పరుగులు తీస్తున్న సమయంలో కూడా రాధికామూర్తి ఫిట్నెస్ను నిర్లక్ష్యం చేయలేదెప్పుడూ. రోజూ వర్కవుట్‌కి, యోగసాధనకు తప్పనిసరిగా కొంత టైమ్ కేటాయిస్తారు. ఆమె ఒక హెర్బల్ ఉత్పత్తికి ప్రమోటర్ కూడా. కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి జీవనశైలి, ఆహారపు అలవాట్లను తెలుసుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. కుటుంబ బంధం సమాజం పట్ల బాధ్యత మిసెస్ పోటీల్లో పాల్గొనే వాళ్ల నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబాన్ని, కుటుంబంతో ఉన్న బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన ట్రాక్ రికార్డ్‌ను కూడా. స్థూలంగా చెప్పాలంటే సమాజంలో ఒక వ్యక్తిగా, కుటంబంలో కీలకమైన వ్యక్తిగా ఎంత బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యం. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతరుల పోస్టులకు ప్రతిస్పందించే తీరు కూడా ముఖ్యమైన అంశమే. సమాజాన్ని సానుకూల ధోరణిలో ప్రభావితం చేయగలరా లేదా అనే నిర్ధారణకు రావడానికి ఆ పోస్టులు కూడా కొలమానం అవుతాయి. నేను నా వంతు సామాజిక బాధ్యతగా చేసిన కొన్ని పనుల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రభావవంతంగా తెలియచేయగలిగాను. మిసెస్ ఇండియా యూకే టీమ్ గత ఏడాది నుంచి నాకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ పోటీలకు మనదేశం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి పరిచయం చేసుకుంటాను. – జె. రాధికా మూర్తి, ‘మిసెస్ ఇంటర్నేషనల్’ (యూకే) పార్టిసిపెంట్ – వాకా మంజులారెడ్డి -
Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్–ఫైవ్ జాబితాలో ఉండేది. అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది . డ్యూయల్ డిగ్రీ ఉన్నప్పటికీ.. ప్రతిష్టాత్మక వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లలో డ్యూయల్ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు. కౌన్సిలింగ్‌తో... నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్‌ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్ ఫోర్ఫ్రంట్ను కొనేసింది. ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్ గర్ల్ విత్ ఏ బ్రోకెన్ నెక్’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక. నాన్నే ప్రేరణ.. నాన్న ..ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను. – రాధికా గుప్తా -
రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం
Asian Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ మహిళల విభాగంలో శుక్రవారం భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్ (జపాన్)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది. అంతకుముందు అన్షు వరుసగా మూడు బౌట్లలో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించడం) పద్ధతిలో షోఖిడా (ఉజ్బెకిస్తాన్)పై... డానియెలా స్యు చింగ్ లిమ్ (సింగపూర్)పై, బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. భారత రెజ్లర్ రాధిక మూడు బౌట్లలో గెలిచి, ఒక బౌట్లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్బిట్ లీ (కొరియా)పై గెలిచింది. చదవండి: Rishabh Pant: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సండే సిరీస్..: ఏది నేరం? ఏది పాపం?
పాపం చేస్తే అంతర్లోకం కల్లోలం అవుతుంది. నేరం చేస్తే చట్టం వెంటబడి జీవితం బందీ అవుతుంది. అన్నీ బాగుంటే నేరం ఎందుకు చేస్తారు? అన్నీ బాగున్నా పాపం ఎందుకు చేస్తారు? మనిషి వీలైనంత వరకు నేరం, పాపం చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కాని నేరమో, పాపమో చేసే పరిస్థితులు వస్తే? జీ ఫైవ్‌లో తాజాగా విడుదలైన 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ జీవితంలో ఎదురయ్యే అనూహ్య ప్రహేళికలను ఆసక్తికరంగా చూపిస్తుంది. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. పాపం చేస్తే అంతరాత్మ శిక్షిస్తుంది. కాని పాపాన్ని ఆపబోయి నేరం చేస్తే? ‘గాలివాన’ కథ ఇదే. జీవితంలో కొన్ని ఎప్పటికీ జరక్కూడదు. కాని జరిగినప్పుడు వాటిని ఆచితూచి ఎదుర్కొనాలి. ఆ నష్టాన్ని నివారించాలి తప్ప ఆ నష్టానికి విరుగుడుగా మరిన్ని నష్టాలు తెచ్చే పని చేయకూడదు. ఉద్వేగాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఏ నిర్ణయమైనా స్థిమితంగా, ఆలోచనతో, వాస్తవిక అవగాహనతో చేయాలి. లేకుంటే చాలా ప్రమాదం. అవును... చాలా ప్రమాదం. జీ 5లో ప్లే అవుతున్న వెబ్ సిరీస్ ‘గాలివాన’ కథ ఏమిటి? ఒక గాలివాన రోజు. రాకపోకలకు వీలు లేని రాజోలు దగ్గర ఉన్న ఒక లంక దీవి. రెండు పెద్ద పెద్ద ఇళ్లు. ఆ ఇళ్లలోని ఒక ఇంటి అమ్మాయి, మరో ఇంటి అబ్బాయికి కొత్తగా పెళ్లయ్యింది. తర్వాత వాళ్లు హనీమూన్‌కు వైజాగ్ వెళ్లారు. వాన కురుస్తున్న రోజు అది. వైజాగ్‌లో అమ్మాయి, అబ్బాయి ఆ రాత్రికి హనీమూన్ జరుపుకోవాలి. ఇక్కడ అబ్బాయి ఇంటి వాళ్లు, అమ్మాయి ఇంటి వాళ్లు రొటీన్ పనుల్లో మునిగి ఉంటారు. కాని హటాత్తుగా వైజాగ్‌లో ఉన్న కొత్త జంటను ఒక దుండగుడు దారుణంగా హత్య చేస్తాడు. వధువు ఒంటి మీదున్న నగలను దొంగిలిస్తాడు. వాటిని అమ్మి దారిన పోయే కారును దొంగిలించి ఆ వానలో అదే లంక దీవి వైపు వస్తూ యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి ఇంటి ముందు కారుతో సహా బోర్లా పడతాడు. అప్పటికే దుర్వార్త ఆ రెండు ఇళ్లకు చేరింది. వధూవరులు హత్యకు గురయ్యారు. వాళ్లను చంపిన హంతకుణ్ణి టీవీలో చూపిస్తున్నారు. ఆ శోకంలో ఉన్న అబ్బాయి కుటుంబం వారు తమ ఇంటి బయట యాక్సిడెంట్‌కు గురైన కారు దగ్గరకు వస్తారు. తమ వాళ్లను హత్య చేసింది ఆ కారు నడుపుతున్నవాడే అని తెలియక ఇంట్లోకి తెచ్చి వైద్యం చేస్తారు. అమ్మాయి ఇంటి వారు కూడా హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడే ఆ ఆగంతకుడే హంతకుడు అని తెలుస్తుంది. అంటే తమ ఇంటి ముక్కుపచ్చలారని జంటను చంపింది ఇతడేనన్న మాట. వీణ్ణి కాపాడాలా? చంపేయాలా? అందరి భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఏం చేయాలన్న నిర్ణయాన్ని పోస్ట్‌పోన్ చేసి హంతకుణ్ణి గొడ్ల చావిడిలో పెడతారు. రాత్రి సమయం అది. గాలివాన. కాని తెల్లారే సరికి హంతకుడు చచ్చిపడి ఉంటాడు. ఎవరో అతణ్ణి చంపేసి ఉంటారు. ఆ చంపింది ఎవరు? అమ్మాయి తరఫు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? ఎవరు చంపారు? కాని అసలు ప్రశ్న తర్వాత వస్తుంది. అది– ఎందుకు చంపారు? బిబిసి వారు 2016లో తీయగా విపరీతమైన జనాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ఒన్ ఆఫ్ అజ్’కు తెలుగు రూపాంతరం ఈ సిరీస్. స్కాట్లాండ్లోని పర్వత ప్రాంతంలో జరిగినట్టుగా ఉండే ఒరిజినల్ కథను మన లంక దీవికి మార్చి తీశారు. హత్యకు గురైన వరుడి తల్లిగా రాధిక, వధువు తండ్రిగా సాయి కుమార్ కీలకమైన పాత్రలు. మిగిలిన పాత్రల్లో చాందినీ, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. బిబిసి, జీ 5 కలిసి ఈ నిర్మాణం చేశాయి. రచన చంద్ర పెమ్మరాజు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ దాదాపు మూడున్నర గంటల నిడివి ఉంది. మర్డర్ మిస్టరీ కనుక ఆసక్తి సహజం. అందులో ఉప కథలు కూడా ఉండటంతో వేదికలు మారుతూ కథ ముందుకు కదులుతుంది. హంతకుణ్ణి చంపాక తమలో ఎవరో ఒకరు చంపారు అని అందరికీ తెలుసు. కాని అందరూ అందరినీ కాపాడుకోవాలనే చూస్తారు. కాని వ్యక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా వారిని పీక్కు తిని లబ్ధి పొందాలని చూసే వారుంటారు. బ్లాక్మెయిల్ చేసి ఇంకా టెన్షన్ ఇస్తారు. అలా టెన్షన్ పెట్టే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి మనిషి నీచుడా, గొప్పవాడా అనేది తేలుతుంది. అదే సమయంలో నేరం, పాపం అనే చర్యల చర్చ కూడా ఉంటుంది. మన కుటుంబ సభ్యులను చంపినవాడిని చంపడం నేరం ఎలా అవుతుంది? అని అందరూ అనుకుంటారు. కాని అలా చంపడం పాపం కదా. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాలు పిల్లలను ఎలా వెంటాడుతాయో ఈ కథలో ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు, పెళ్లి తర్వాత విడాకులు అవి ఎక్కడికీ పోవు. తర్వాతి తరాలకు శాపాలుగా మారే అవకాశం ఉంటుందని చూపుతారు. అసలు కథేమిటంటే వీరిలో ఒకరు ఆ హంతకుణ్ణి చంపారు. నిజానికి వీరిలో ఒకరు ఆ కొత్త వధువరులను చంపడానికి కూడా కారకులయ్యారు. ఆ ఒకరు ఎవరు అనేదే కథ. ఖర్చుకు వెనుకాడకుండా రాధిక, సాయికుమార్ వంటి సీనియర్లను పెట్టి తీయడం వల్ల సిరీస్ నిలబడింది. కొడుకును కోల్పోయిన దుఃఖం, ఉన్నవారిని కాపాడుకోవాలనే తపన రాధికలో అలవోకగా పలికింది. సాయికుమార్ తన గొంతుతోనే సగం ఎఫెక్ట్ తీసుకు వచ్చాడు. సిరీస్‌కు మరో కీలకపాత్ర అయిన చాందిని తన శక్తికి మించి రక్తి కట్టించింది. నందిని రాయ్‌కు మంచి పాత్ర. కాని చివరి ఎపిసోడ్లు మరింత బాగుండాల్సింది. నేరం జరిగినా, పాపం జరిగినా అందుకు బదులుగా చేసే పని ఏదైనా కావచ్చుగాని ప్రాణం తీసేది మాత్రం కాకూడదు. మనిషి ప్రాణం తీస్తే అది ఏక కాలంలో నేరం, పాపం. రోజూ పేపర్లలో ఎన్నో క్షణికావేశాల చర్యలు కనిపిస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాలను కాపాడుకోవాలని ఈ సిరీస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైంది. జీ5లో చూడండి. -
చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే
Radhika Interesting Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై సినీయర్ నటి, అలనాటి హీరోయిన్ రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధిక, చిరంజీవి కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పరిశ్రమలో రాధిక, చిరంజీవిలు ఇప్పటికీ మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాధిక ఈ సందర్భంగా చిరంజీవి గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి సెల్ఫ్‌మేడ్ మ్యాన్ అంటూ కొనియాడారు. చదవండి: ‘గని’ టీంకు రాష్ట్ర ప్రభుత్వం షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ ‘ఆయన తన కష్టంతో పైకి వచ్చారు. ఇప్పటికీ అంతే డేడికేషన్‌తో పని చేస్తున్నారు. మెగాస్టార్ అయినప్పటికీ చాలా ఒదిగి ఉంటారు. అందరితో బాగా కలిసిపోతారు. మేమంతా కలిసినప్పడు చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేస్తారని అడగ్గా.. ఆయనకు విలన్‌గా ఆయినా చేస్తాను కానీ, తల్లి పాత్రలు అసలు చేయనంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అనంతరం తాను ఒక నటినని, ఎలాంటి పాత్రలైన చేస్తానని చెప్పారు. చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్! ప్రస్తుత టాలీవుడ్ హీరో గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న హీరోలందరూ తనకు ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్‌కు తాను అభిమానని తెలిపారు. తారక్ ఎనర్జీ లెవల్స్ ఫెంటాస్టిక్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు. అలాగే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఇప్పుడు వారు స్టార్ హీరోలుగా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో రాధిక, శర్వానంద్‌కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాధికతో పాటు ఖుష్బు సుందర్, ఊర్వశీలు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. -
గిన్నిస్ రికార్డు కెక్కిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్
Choreographer Radhika Guinness Record: ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు రాధిక గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఏఎంఎస్ ఫైన్ఆర్ట్స్ సంస్థ నిర్వాహకుడు, సమాజ సేవకుడు డాక్టర్ ఆర్.జె.రామనారాయణన్ నాట్యకళలను ప్రోత్సహించే విధంగా వాటిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా సినీ నృత్య దర్శకురాలు రాధిక బృందం నేతృత్వంలో చెన్నైలోని పలు వేదికలపైనా, అదే విధంగా ఆన్లైన్ ద్వారా రోజూ గంట చొప్పున 365 రోజులు నాట్యకళ వేడుకలను నిర్వహించారు. ఇందులో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా చివరిరోజున 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్యకళ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదైంది. న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డ్ బుక్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తిలకించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అతిథిగా పాల్గొని నాట్య కళాకారులను అభినందించడంతో పాటు గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాన్ని నృత్య దర్శకురాలు రాధికకు ప్రదానం చేశారు. -
నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి
Radhika Madan Opens Up About Love: 'నాకు ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించడం నచ్చదు. అందుకే లవ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. అయితే జీరో పర్సెంట్ లేదంటే 100%' అంటూ లవ్ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్. ఇటీవలె ఆమె నటించిన 'శిద్ధత్' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాధిక ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక 'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టెలివిజన్ షోతో కెరీర్ ప్రారంభం చేసిన రాధిక 'పటాకా' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్‌సిరీస్‌లో రాధిక నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందింది. తాను పోషించే ప్రతి పాత్రను సవాల్‌గా స్వీకరిస్తానని, 200శాతం బెస్ట్‌గా ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. కాగా ఈమె నటించి శిద్ధత్ సినిమా అక్టోబర్ 1నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
చేయూతలో మహా‘రాణి’
పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగూ ఆర్బాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికారాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సాధారణ జీవనశైలికి తన తండ్రే స్ఫూర్తి అని గర్వంగా చెబుతున్నారామె. గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే .. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్‌కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యనభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్‌కు వెళ్లేవారు. అక్కడి స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒక పక్క పత్రికకు కంటెంట్‌ను అందిస్తూనే మరోక్క పోస్టుగ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసారు. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం. బరోడా మహారాణి.. ఒకపక్క రాధిక తన చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమెకోసం వరుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఎంతోమందిని చూశాక బరోడా యువరాజు సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది. రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసి... బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసిన రాధిక.. పాతకాలం నాటి కళాఖండాలు, నేత పద్ధతులు, చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశ్యంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్డౌన్ సమయంలోను రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. అలా దాదాపు ఏడు వందల మంది కుటుంబాలను ఆదుకున్నారు. నాన్న దగ్గరే తొలిపాఠం నేర్చుకున్నాను.. ‘‘నేను సంప్రదాయ రాజరికపు హద్దులు దాటి బయటకు వచ్చాను. రాజరిక కట్టుబాట్లు దాటి మానాన్న గారు మహారాజ్ కుమార్ డాక్టర్ రంజిత్ సింగ్‌జి నాకన్నా ముందు బయటకు వచ్చారు. 1984 లోనే ఆయన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ్రçపజల ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలిపాఠం నేర్చుకున్నాను. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సేవచేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమయ్యింది. అప్పటినుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను. ఈ విషయంలో అమ్మకూడా ప్రోత్సహించేవారు. అందుకే నా ఇద్దరు కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు. వాళ్లకు నచ్చిన విధంగా చేయండని ప్రోత్సహిస్తున్నాను’’ అని రాధికరాజే చెప్పారు. నాన్నతో రాధికారాజే గైక్వాడ్ -
నటుడు మృతిపై కస్తూరి సంతాపం; మండిపడుతున్న నెటిజన్లు
తమిళ నటుటు, నిర్మాత వెంకట్ సుభా మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మే 29) తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్, నటి రాధిక శరత్ కుమార్‌లతో పాటు నటి కస్తూరి శంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కస్తూరి ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది. టెస్టులు చేసుకోగా ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్ ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అంటు కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. Shocked beyond belief. Venkat sir . Returned frm Udhaynidhi new film shoot , got fever next day, but not positive... after a week got sick... and now he is gone. he wasn't vaccinated it seems. I am so sorry subha. pic.twitter.com/trdZ41ZSBa — Kasturi Shankar (@KasthuriShankar) May 29, 2021 ఇక రాధిక ట్వీట్ చేస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు. వెంకట్ గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన మరణవార్త తెలియగానే గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారి జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు. So very saddened to say goodbye to Venkat, his wife Subaa has been associated with me for many years in Radaan. Venkat was a kind, strong thinking person& known him for many years. Subaa fought so strongly for his recovery, heartbreaking to see he lost the fight. Prayers to all pic.twitter.com/43oorm0lvz — Radikaa Sarathkumar (@realradikaa) May 29, 2021 -
వైరలవుతున్న నటి రాధిక న్యూ లుక్ ఫోటోలు
సినీ నటి రాధిక శరత్ శరత్‌కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా హెయిర్ కట్ చేయించి న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఈ కొత్త లుక్ మీ అందరికి నచ్చుతుందని ఆశాస్తున్నానంటూ పేర్కొన్నారు. మొన్నటి దాకా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు మేక్ఓవర్పై దృష్టి పెట్టినట్లున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న అనంతరం రాధిక ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆమెకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా స్పందించిన రాధిక..అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ పేర్కొంది. తనకు కరోనా సోకలేదని, కానీ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. Cheering myself up ,hope u all like the look😄😄😄😄 pic.twitter.com/M5XCMu4cgi — Radikaa Sarathkumar (@realradikaa) April 28, 2021 చదవండి : శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
నా ఆరోగ్యం బాగుంది!
సినీ సెలబ్రిటీల ఆరోగ్యంపై ఆన్లైన్లో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఒక్కోసారి ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియక వారి అభిమానులు కంగారు పడుతుంటారు. ఆ వార్తలు అటూ ఇటూ తిరిగి సంబంధిత సెలబ్రిటీ వద్దకు చేరాక ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. వదంతులు నమ్మొద్దు’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా నటి రాధికకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రాధిక ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా ట్విట్టర్ వేదికగా రాధిక స్పందిస్తూ– ‘‘మీరు (అభిమానులు) నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు. నాకు కరోనా సోకలేదు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఆఫీసుకు హాజరవుతున్నా’’ అన్నారు. -
ఆ విషయంపై కోర్టుకు వెళ్తా: రాధిక
నటి రాధికకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలను ఖండించిన రాధిక తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాస్త ఒళ్లునొప్పులతో బాధపడ్డానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి, చెక్ బౌన్స్ కేసు గురించి అసత్యవార్తలు రాస్తున్న వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాగోగుల గురించి ఆరా తీస్తున్నవారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే చెక్ బౌన్స్ కేసు విషయంలో ఉన్నత కోర్టులో పోరాడతానని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. నటుడు శరత్ కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకుంది. దీన్ని 2015 మార్చిలో చెల్లిస్తామని వారు మాటిచ్చారు. ఒకవేళ అప్పు తీర్చకపోతే టీవీ ప్రసార హక్కులు లేదా తర్వాత నిర్మించే సినిమా హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు అదనంగా కోటి రూపాయలు అప్పు తీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఈ డబ్బుతో మరో సినిమా నిర్మించారు. అయితే ఇక్కడ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో తమకు రావాల్సిన రూ.2.50 కోట్లను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలివ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డబ్బు చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పు వెలువరించడంతో రాధిక దంపతులు 7 చెక్కులు సదరు సంస్థకు అందజేశారు.. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. Thanks everyone for the love and affection, I am not down with corona virus, just body ache after second vaccine. On line press are just filing rubbish about health and case.We will fight it in higher courts. I am back at work, have a good day ❤️❤️❤️ — Radikaa Sarathkumar (@realradikaa) April 9, 2021 చదవండి: రాధిక, శరత్‌కుమార్ దంపతులకు షాక్ కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు: నటుడి ఆవేదన -
శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్ సంస్థకు అందజేశారు. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. -
రాధిక, శరత్‌కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది. చదవండి: రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు! -
మేము పోటీ చెయ్యం.. అభ్యర్థులకు ప్రచారం చేస్తాం
సాక్షి, చెన్నై: ఎస్ఎంకే నేత, నటుడు శరత్‌కుమార్, మహిళా నేత, నటి రాధికా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ మేరకు ఎస్ఎంకే వర్గాలు మంగళవారం ప్రకటించాయి. కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యంతో కలిసి ఎస్ఎంకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో ఎస్ఎంకే 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల జాబితాను శరత్‌కుమార్ ప్రకటించారు. ప్రతి ఎన్నికల్లోనూ శరత్‌కుమార్ పోటీ చేస్తూ వచ్చారు. ఈ సారి రాధిక కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా ఇది వరకే శరత్‌కుమార్ ప్రకటించారు. ఈ జాబితాలో ఆ ఇద్దరి పేర్లు లేవు. ఆ ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎస్ఎంకే ప్రకటించింది. అయితే కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇద్దరు ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా పోటీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. చదవండి: బెంగాల్ గెలుపు బీజేపీకి కీలకం -
రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!
హీరోలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. వారితో పోలిస్తే – హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే.. హీరో ఎప్పటికీ హీరోనే! 50 – 60 ఏళ్లు దాటినా హీరోగా చేయొచ్చు. కానీ హీరోయిన్‌కు 30 మహా అయితే 40 టచ్ అయ్యేవరకూ ఓకే. అది కూడా ఏ కొందరో 30 దాటినా హీరోయిన్లుగా చేయగలుగుతారు. చాలామటుకు 30 టచ్ అయ్యాక అక్కా, వదిన పాత్రలకు అడుగుతారు. 40 దాటితే అమ్మ పాత్రలు ఆఫర్ చేస్తారు. మేల్ యాక్టర్, ఫీమేల్ యాక్టర్‌కి ఉన్న ఈ వ్యత్యాసం గురించి ఓ కార్యక్రమంలో నటి రాధిక మాట్లాడుతూ – ‘‘నేను ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు బిజినెస్ ఉమన్ (సినిమా, సీరియల్ నిర్మాణం) గానూ మారాను. ఎందుకంటే నా కెరీర్ నా కంట్రోల్లో ఉండాలనుకున్నాను. భవిష్యత్తులో నన్ను రజనీకాంత్‌కి అమ్మ (రజనీ సరసన తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించారు రాధిక)గా చేయమని అడుగుతారని నాకు ముందే తెలుసు. నటుల విషయంలో ఎవరికీ ఎలాంటి ముందస్తు ఆలోచనలు ఉండవు. కానీ నటీమణుల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనా కెరీర్ పరంగా దాటుతున్న ప్రతి మైలురాయికీ నేనింకా బెటర్ అవుతున్నాను’’ అన్నారు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ – ‘‘చూసేవారికి నా కెరీర్ చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలున్నాయి. అసలు నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఒక డైరెక్టర్ నన్ను నటించమని అడిగారు. నేను లెజండరీ యాక్టర్ ఎం.ఆర్. రాధ కూతుర్ని అని ఆయనకు తెలియదు. వాస్తవానికి నేనప్పుడు అంత అందంగా కూడా ఉండేదాన్ని కాదు. ‘నా ముఖాన్ని ఎవరు చూస్తారు’ అని ఆయనతో అన్నాను. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండానే కెమెరా ముందుకొచ్చాను. ఇంతదాకా వచ్చేశాను’’ అన్నారు రాధిక. -
మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 35 వసంతాలు. కమలహాసన్, రాధిక మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. శతదినోత్సవ వేదికపై రాజ్‌కపూర్, ఎన్టీఆర్, ఏడిద క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! రాధికకు నటించి చూపిస్తూ కె. విశ్వనాథ్ తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
'నాంది' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు
ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు రాధిక. తనకు రెండు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడిని కలిశారామె. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు రాధిక. దర్శకులు విశ్వనాథ్‌ను ఆయన స్వగృహంలో కలిశారామె. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘‘విశ్వనాథ్‌గారు నాకు గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు ఇచ్చారు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక లెజెండ్. విశ్వనాథ్‌గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు రాధిక. ‘స్వాతిముత్యం’ లొకేషన్లో... -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పీల్‌కు కంపెనీ... అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్‌పై అప్పీల్‌కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్‌పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు. -
అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’
పత్రికల్లో పజిల్స్ వస్తుంటాయి. దారి చూపండి.. రంగులు వేయండి. ఆరు తేడాలను గుర్తించండి. ఖాళీలు నింపండి. అన్నీ.. చిన్నపిల్లలు చేసేవి. వీళ్లూ చిన్నపిల్లలే.. టెన్త్ పిల్లలు. స్పేస్ ఇండియా వీళ్లకో పెద్ద పజిల్ ఇచ్చింది. ‘కనుక్కోండి చూద్దాం?’ అంది. ఆ పజిల్నీ పూర్తి చేశారు! కొత్త ఆస్టరాయిడ్‌ను కనిపెట్టి.. ‘కనుక్కున్నాం చూడండి’ అన్నారు! పైన అంతరిక్షంలో అనేకం తిరుగుతుంటాయి. గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు! నక్షత్రాలు కూడా ఉంటాయి కానీ వాటిని ‘తిరుగుతున్నాయి’ అనకూడదు. వాటి దారి వేరే. సూర్యుడిలా సొంత రూట్లో ప్రయాణిస్తూ ఉంటాయి. అదొక మర్మదేశం. దేశం అంటే చిన్నదైపోతుంది. అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’. ఆదీ అంతమూ తెలియని రహస్యం. వాటిల్లో కొన్ని శాస్త్ర పరిశోధకులకు మాత్రమే కనిపించేవి. మరికొన్ని మామూలు కంటికి కూడా కనిపించేవి. కొన్ని రోజులుగా డాబాలపై నుంచి ‘నియోవైజ్’ అనే తోకచుక్క కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆ తోకచుక్కను వట్టి కంటితో చూడగలిగాం. దాదాపు 5 కి.మీ. పొడవున ఉన్న నియోవైజ్ భూమికి పది కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కూడా రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో తూర్పు దిక్కున పైకి తేలుతోంది. మళ్లీ 6,766 ఏళ్ల తర్వాతే నియోవైజ్ కనిపించడం! ఇప్పుడిక ‘నియోవైజ్’ తోక చుక్కను మించిన అద్భుతంలోకి వద్దాం. మనలాగే రోజూ ఆ తోకచుక్కను చూస్తూ, ఆశ్చర్యపడవలసిన ఇద్దరు అమ్మాయిలు.. ఆ తోక చుక్కను కూడా దాటిపోయి, ఆకాశంలో ఓ లఘు గ్రహాన్ని (ఆస్టరాయిడ్) కనిపెట్టారు! ఆ ఆస్టరాయిడ్ వీళ్ల కళ్లలో పడింది భూకక్ష్యలో ఉండి కాదు. అంగారకుడి చుట్టూ తిరుగుతూ!! నియోవైజ్ తోక చుక్క గురించి ‘నాసా’ వాళ్లు ప్రపంచానికి వెల్లడించక ముందు నుంచే గత రెండు నెలలుగా వైదేహి, రాధిక అనే ఆ ఇద్దరమ్మాయిలు కొత్త గ్రహాల కోసం ఖగోళాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ‘సవానీ చైతన్య విద్యాసంకుల్’లో టెన్త్ విద్యార్థినులు వాళ్లు. ‘ఆలిండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ 2020’ భాగంగా గగనాన్ని గాలిస్తున్నప్పుడు ఆ ఆస్టరాయిడ్‌పై వీళ్ల దృష్టి పడింది! ‘పాన్ స్టార్స్’ అనే టెలిస్కోప్‌లో పరిశీలిస్తూ ఇద్దరూ ఒకేసారి అంగారకుడి కక్ష్యలో ఆస్టరాయిడ్‌ను గుర్తించారు. అంత శక్తిమంతమైన టెలిస్కోప్ ఈ అమ్మాయిల చేతికి ఎలా వచ్చింది? ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐజక్) అనే బహుళ విశ్వవిద్యాలయాల సంస్థ, టెక్సాస్‌లోని హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. వాటితో ఒప్పందంలో ఉన్న ఇండియాలోని ‘స్పేస్ ఇండియా’ (హర్యానా) ఈ అన్వేషణ కోసం.. అంతరిక్ష పరిజ్ఞానం, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తుల నుంచి ఆహ్వానించి, పోటీ పరీక్ష నిర్వహించి వైదేహి, రాధికలను ఎంపిక చేసుకుంది. భూమికి కనుచూపు మేరలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కనిపెట్టడం సెర్చ్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. కరోనా సమయం కాబట్టి వీళ్ల ఈ అన్వేషణ అంతా ఇంటి నుంచే జరిగేలా స్పేస్ ఇండియా ఏర్పాట్లు చేసింది. అంతకుముందే అన్వేషణ విధానాలలో శిక్షణ ఇచ్చింది. అంతరిక్షంలో మొదట వీళ్లు దాదాపు ఇరవై ఖగోళ పదార్థాలేవో గుర్తించారు. అయితే అవేవీ ఆస్టరాయిడ్స్ కాదు. చివరికి అసలైన ఆస్టరాయిడ్ కంటికి చిక్కింది. అయితే అది ఆస్టరాయిడేనా?! నిర్థారణ కోసం ఆ లోకేషన్‌ని ‘స్పేస్ ఇండియా’ నాసాకు పంపింది. ‘ఎస్.. ఆస్టరాయిడే’ అంది నాసా. తాత్కాలికంగా ఆ ఆస్టరాయిడ్కు హెచ్.ఎల్.వి.2514 అనే పేరు పెట్టింది. దాని కక్ష్యను కూడా నాసా గుర్తించాక (ఇందుకు సంవత్సరాలు పడుతుంది) ఆ ఆస్టరాయిడ్కు పేరు పెట్టే అవకాశాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలకు ఇస్తుంది! హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీలో గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిల్లర్ పంపిన ప్రత్యేక అభినందనలలో వైదేహి రాధిక ఇప్పుడు మేఘాలలో విహరిస్తున్నారు. యు.ఎస్.లోని నాసా వరకు ఎగరాలన్నది వారి కోరిక. వైదేహి తండ్రి వస్త్రవ్యాపారి. రాధిక తండ్రి కంప్యూటర్స్ విడిభాగాలు దుకాణం. కూతుళ్లు ఇంత సాధించాక తల్లిదండ్రులు గాలితో తేలిపోకుండా ఉంటారా! -
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
రాజాం సిటీ: మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని అంతకాపల్లి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన దుప్పలపూడి రాధిక (17) సైకిల్‌పై రాజాం వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మరణ వార్త విన్న తల్లిదండ్రులు జయలక్ష్మి, మురళి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ లక్ష్మణరావు తెలియజేశారు.(చుక్కేసి.. చిక్కేసిన జూడాలు ) ప్రమాదకరంగా బ్రిడ్జి ప్రాంతం శ్రీకాకుళం రోడ్డులో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఒకవైపు ఎత్తుగా ఉండడంతో వచ్చిన వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడే గతేడాది ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. అలాగే గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది. అందువలన ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
తప్పుడు వార్తలపై ఏపీ సీఐడీ కొరడా
సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలన భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కోవిడ్‌పై అసత్య ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ప్రారంభించిన వాట్సాప్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదులకుగాను ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన (9071666666) వాట్సాప్ నంబర్‌కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 ,474 ఫిర్యాదుల అందాయి. ఊహించని విధంగా ప్రజల్లో స్పందన రావడంతో దీని కోసం సీఐడీ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. (ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు) దీనిపై ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక మాట్లాడుతూ.. స్టే సేఫ్, స్టే స్మార్ట్ అనే నినాదంతో నాలుగు వాట్సాప్ నంబర్లను ప్రారంభించామని తెలిపారు. సైబర్ బుల్లియింగ్‌లో సభ్యత లేకుండా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ పెడితే సుమోటాగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాట్సాప్, టిక్ టాక్, ట్విట్టర్లో వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారి ట్రాక్ రికార్డ్ మొత్తం సీఐడీ దగ్గర ఉంటుందని ఎస్పీ రాధిక వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తామని హెచ్చరించారు. త్వరలోనే మొబైల్ యాప్, డాష్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తామని ఎస్పీ రాధిక తెలిపారు. (చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాధిక కథ సినిమా తీయొచ్చు
ఇటీవల యాసిడ్ అటాక్ సర్వయివర్ జీవితం ఆధారంగా ‘చపాక్’ సినిమా వచ్చింది. ప్రమాదం వచ్చినా గెలిచి చూపిన అమ్మాయి కథ అది.రాధిక కథ అంతకు తక్కువ కాదు.గట్టిగా వేళ్లు విరుచుకుంటే ఆ వేళ్ల ఎముకలు విరిగిపోయేంత సున్నితమైన అరుదైన వ్యాధిఆమెకు ఉంది.ఇంత కర్కశమైన వ్యాధిలో ఎవరైనా కుంగిపోతారు. విరిగిపోతారు.రాధిక నిలబడింది.ప్రకృతి అన్యాయం చేసినా పోరాడి గెలవమని చెబుతోంది. రాధికకు అయిదేళ్లున్నప్పుడు ఆడుకుంటూండగా కిందపడింది. ఎడమ తొడ ఎముక విరిగింది. ఆడుకుంటూ పడితే తొడ ఎముక విరగడం విచిత్రం. అయితే డాక్టర్లు సీరియస్‌గా తీసుకోలేదు. పడటం వల్లే విరిగిందని అనుకున్నారు. ఆరునెలల తర్వాత ఉన్నట్టుండి నొప్పి మొదలైంది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ఆపరేషన్ చేసి ప్లేట్‌ను అమర్చారు. అక్కడితో నయం కాలేదు. దాంతో దాదాపు ఏడు సార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మాటిమాటికీ ఎందుకిలా జరుగుతోందని 2010లో మరిన్ని వైద్యపరీక్షలు చేయిస్తే తేలింది ఎముకలకు సంబంధించిన అరుదైన వ్యాధి అని, ఇది జన్యుపరమైనదనీ, ఈ జబ్బు వల్ల ఆమె ఎముకలు అత్యంత బలహీనంగా ఉన్నాయని. అంటే కోడిగుడ్డు పెంకుల్లా అన్నమాట. ఎముక మజ్జ పిండిలా అయిపోతుందన్నమాట. ఫలితంగా స్కూల్లో గంటలు గంటలు కూర్చోవడంతో వెన్నెముక వంగడం మొదలైంది. దీంతో రాధిక స్కూల్‌కి వెళ్లి చదువుకోలేక ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. కాస్త గట్టిగా కదిలినా ఫెళఫెళమని ఎముకలు విరగడమే. ఆపరేషన్లు జరగడమే. కోలుకొని ఇంటికొచ్చిన మర్నాడే మరో ఫ్రాక్చర్‌తో ఆసుపత్రికి పరిగెత్తేవారు. రాధిక సరే.. ఇంట్లో వాళ్లకూ బెంగ.. ఇలాగైతే పిల్ల పరిస్థితి ఏంటి అని. సగం టైమ్ ఆసుపత్రిలో.. సగం ఇంట్లోనే గడిచిపోయింది బాల్యము, కౌమారమూ. ఆపరేషన్ అయ్యి కోలుకోగానే.. ఎముకలు విరగకుండా నడవడం ప్రాక్టీస్ చేసేది. ఇదే జీవితం అయిపోయింది. ఏం చేయాలి? ‘అన్న స్కూల్‌కు, నాన్న ఆఫీస్‌కు వెళ్లేవాళ్లు. ఇంట్లో పనులతో అమ్మ బిజీ. నాతో మాట్లాడేవాళ్లే లేక దిగులు అనిపించేది. ఒకానొక టైమ్‌లో పిచ్చిపట్టినట్టే అయింది. నా స్థితి మీద నాకే జాలి. ఏదైనా వ్యాపకం మొదలుపెట్టుకోవాలనిపించింది. అప్పటికే నా చదువు డిస్టర్బ్ కావద్దని ట్యూటర్‌ను పెట్టి ఇంటి దగ్గరే చదువుకునే ఏర్పాటు చేశారు అమ్మా, నాన్న. అయినా బోలెడంత ఖాళీటైమ్. అయితే అదేపనిగా రెండుగంటల కంటే ఎక్కువ కూర్చోలేను.. కూర్చోకూడదు కూడా. ఆ రెండు రెండు గంటల టైమ్‌నే సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. చదువుకోసం కేటాయించుకున్నది పోను మిగిలిన టైమ్‌ని. ఫ్రెండ్స్ కోసం చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం, డ్రాయింగ్ వేయడం చేసేదాన్ని’ అంటూ తనను తాను తీర్చిదిద్దుకున్న తీరును చెప్తుంది రాధిక. తను తయారుచేసిన ఆఫ్రికన్ డాల్స్‌తో రాధిక యూ ట్యూబ్ మార్గం ఇలాగే ఒకసారి కూర్చోని డ్రాయింగ్ వేసుకుంటూంటే రాధిక వాళ్లన్నయ్య ఫ్రెండ్ మణికందన్.. ఆమెను చూసి క్రాఫ్ట్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియోస్‌ను ఆమెకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి రాధిక ఆ వీడియోలను చూడ్డం.. కొత్త కొత్త క్రాఫ్ట్స్‌ను నేర్చుకోవడం మొదలుపెట్టింది. వాల్ హ్యాంగింగ్స్, పెన్హోల్డర్స్, బుట్టలు, ఫొటో ఫ్రేమ్స్, బాక్స్‌లు... అన్నీ పేపర్‌తో చేసినవే. తాను తయారు చేసివన్నీ ఫ్రెండ్స్‌కు, బంధువులకు కానుకలుగా ఇచ్చేది. ‘ఎప్పుడూ ఇవేనా? అని బోర్ కొట్టింది కొన్నాళ్లకు. అందుకే యూట్యూబ్ వీడియోలతో నేర్చుకున్న ఆర్ట్‌నే కొంత డెవలప్ చేసుకుందామని.. బొమ్మల ప్రయోగం చేశా. బాగా కుదిరాయి. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆఫ్రికన్ డాల్స్ తయారీమీద పడ్డా. కాగితంతోనే. ముందు ఒకటి చేశా. చాలా బాగా వచ్చింది. తర్వాత పది.. ముందుకన్నా అద్భుతంగా ఉన్నాయన్నారు ఇంట్లో వాళ్లు. అంతే ఇక ఆగలేదు. వాటన్నిటినీ మా అన్నయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమందైతే ఏకంగా కొనడానికే ముందుకొచ్చారు. అసలు అమ్మడమనే ఆలోచనేలేదు నాకు. అదే చెప్పాను వాళ్లకు. కాని వినలేదు. చేసేది లేక ఎంతో కొంత వాళ్లనే ఇమ్మన్నాను. అలా కొనడమే కాక అలాంటి ఇంకో 25 బొమ్మలను ఆర్డర్ చేశారు కూడా. ఆశ్చర్యం నాకు’ అని చెప్తుంది రాధిక. ఆఫ్రికన్ డాల్స్ రాధిక చేతిలో రూపుదిద్దుకున్న ఆఫ్రికన్ డాల్స్ సోషల్ మీడియాలో ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్‌కు ఫార్వర్డ్ అయి అందరికీ తెలిశాయి. డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అది చిన్న సైజు కుటీర పరిశ్రమగా మారింది రాధికకు.‘నిజానికి ఈ క్రాఫ్ట్‌ను ఓ మెంటల్ థెరపీగా స్టార్ట్ చేశా. ఈ బొమ్మలను చేస్తున్నంతసేపు హ్యాపీగా.. హాయిగా ఉంటాను. ఇంకే ఆలోచనా రాదు. దీంతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కాని ఇప్పుడదో బిజినెస్‌గా మారింది. నమ్మలేకున్నాను. చెప్పాను కదా.. ఎక్కువసేపు కూర్చోలేను అని. ఆ కూర్చున్నంతలోనే ఈ బొమ్మలను చేస్తున్నాను’ అంది రాధిక చేతిలో ఉన్న ఆఫ్రికన్ డాల్‌ను ఆప్యాయంగా తడుముతూ.ఇప్పటివరకు రెండువందల పైచిలుకు బొమ్మలు అమ్ముడుపోయాయి. నూటయాభై రూపాయల నుంచి ఏడువందల రూపాయల మధ్య ఉంటుంది వాటి వెల.ప్రస్తుతం ప్రైవేట్‌గా పదకొండో తరగతి పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతోంది రాధిక. నిజానికి పదకొండు, పన్నెండు తరగతులను స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలని ఆమె తాపత్రయం. కాని కోయంబత్తూరులోని స్కూళ్లు ఆమెను చేర్పించుకోవడానికి సిద్ధంగా లేవు. రకరకాల కారణాలు చెప్పి, సాకులు చూపి ఆమెకు ప్రవేశం ఇవ్వడం లేదు.‘నాలాంటి వాళ్లకు స్కూల్లో చదువుకునే ఆవకాశమే ఉండదా? వ్యాపకంతో ఎంత బిజీగా ఉన్నా ఆర్నెల్ల కిందటిదాకా ఇలాంటి నెగటివ్ ఆలోచనలతోనే సతమతమయ్యా. ఒక్కోసారి నా జీవితం ఇలా ఒక ఫెయిల్యూర్‌లా ఎండ్ అయిపోతుందా అని కూడా భయపడ్డా’ అంటుంది రాధిక. పాజిటివ్ ఎనర్జీ ఎంతటి ప్రతికూలతలు తనను చుట్టుముట్టినా.. వాటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోగల సత్తా ఆమెది. ఇప్పుడు తన తల్లిదండ్రులు, సోదరుడి సహాయంతో తన పేపర్ క్రాఫ్ట్‌ను వ్యాపారంగా వృద్ధి చేయాలనుకుంటోంది. ఆఫ్రికన్ డాల్స్‌నే కాకుండా.. కార్టూన్ క్యారెక్టర్స్, అబ్దుల్ కలాం వంటి ప్రసిద్ధుల బొమ్మలనూ తయారు చేసే పనిలో ఉంది.పాజిటివ్‌నెస్‌కు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం ఉంటుంది?! -
అంతు చిక్కని రాధిక హత్య కేసు
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో మూడు రోజుల విచారణలో ఏమీ తేలకపోవడంతో గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం కరీంనగర్ చేరుకుంది. హైదరాబాద్ సీటీ పోలీసు విభాగం నుంచి క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన బృందం కరీంనగర్ పట్టణం విద్యాగనర్‌లోని రాధిక ఇంటికి వెళ్లి వివిధ కీలకమైన ఆధారాలు సేకరించారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తర్వాత కూడా తెలుసుకునే త్రీడీ క్రైం సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫారో 3డీ స్కానర్, బాడీ ప్లూయిడ్ కిట్స్ వంటివి ఉపయోగించి పలు ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి అడిషినల్ డీసీపీ చంద్రమోహన్తోపాటు టూ టౌన్ సీఐ దేవారెడ్డిని రాధిక ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పూర్వపరాలు వివరించిన తర్వాత క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. (మిస్టరీగా మారిన రాధిక హత్య..) ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆధారాలు... హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ క్లూస్‌టీం బృందం రాధిక హత్య జరిగిన బెడ్రూంలో రక్తపు మరకలు పడిన చోటు, ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఆధారాలు సేకరించారు. త్రీడీ క్రైంసీన్ ఫొటోగ్రఫీ, వీడీయోగ్రఫీతో ఘటన జరిగిన ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీశారు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం కడిగిన స్థలం, గతంలో ఇక్కడి క్లూస్‌టీం సేకరించిన ఆధారాల గురించి వివరంగా తెలుసుకొనిఅవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. నూతన టెక్నాలజీతో కావాల్సిన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. (హంతకుడు ఎవరు..?) ఆధారాలు సేకరిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రీఫైనల్ పరీక్ష రోజే హత్య..! రాధిక హత్య జరిగిన రోజే రెండో ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు 10వ తేదీ నుంచి వారాంతం వరకు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు పరీక్ష జరిగింది. కానీ ప్రీఫైనల్ పరీక్షలకు హాజరు కాలేదు. ఒక వేళ హాజరు కావాలనుకుంటే పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలి. అంటే మధ్యాహ్నం 12 నుంచి 1గంటల మధ్య కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రాధిక హత్య జరిగిన తీరు చూస్తే మాత్రం దాదాపుగా మధ్యాహ్నమే జరిగి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ కళాశాలకు వెళ్లాలనుకుంటే సిద్దమమ్యేటప్పుడు హత్య గురై ఉంటుందా..? అంతకుముందే హత్యకు గురైందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది. హంతకుడి జాడేది..? రాధిక హత్య కేసు విచారణ నాలుగవ రోజుకు చేరినప్పటికీ హంతకుడెవరో తెలియలేదు. గతంలో సేకరించిన ఆధారాలు, ఫోన్‌కాల్ డాటా, సీసీ పుటేజీల పరిశీలన, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం వంటివి చేసినా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫోరెన్సిక్ నిపుణులు కేసుకు కావాల్సిన ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్టుల వచ్చాక కేసు ఛేదనకు కావాల్సిన ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడెవరనే విషయంపై ఇటు పోలీసుల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాక ఏమైనా ముందుకు సాగుతుందో చూడాల్సిందే. చదవండి : గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య -
కోటీశ్వరి కౌసల్య
కౌసల్య ‘ప్రత్యేక ప్రతిభావంతురాలు’! ఇప్పుడు కోటీశ్వరి. ప్రపంచంలోనే ఒక గేమ్ షోలో కోటి గెలిచిన తొలి ‘స్పెషల్లీ చాలెంజ్డ్’ మహిళా కంటెస్టెంట్! ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని చాటిన కౌసల్యా కార్తిక.. మాట్లాడలేరు. వినలేరు. అందుకే ఆమెలా ఆమె సాధించిన విజయం కూడా ప్రత్యేకమైనది. కౌసల్య (31) పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోని మదురైలో. బియస్సీ టెక్నాలజీ, ఎం.ఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశారు. ఎంబిఏ కూడా. ఇన్నీ చదివిన కౌసల్య పుట్టు మూగ, చెవుడు. కౌసల్యకు భర్త, ఏడాది పిల్లాడు ఉన్నారు. కౌసల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో జూనియర్ అసిస్టెంట్. చిన్న వయస్సు నుండే తెలివైన పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్ టూ వరకు నాగర్ కోయిల్ లోని బదిరుల పాఠశాలలో చదివింది. ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ ర్యాంకే. బిఎస్సీ, ఎం.ఎస్సీ, ఎంబిఏలో కూడా గోల్డ్ మెడలిస్ట్. కౌసల్యకు రెండు కలలు ఉండేవి. మొదటిది తాను చదివిన బదిరుల పాఠశాలకు సాయం చేయాలి. రెండోది ఇటలీ లేదా స్విట్జర్లాండ్ పర్యటన చేయాలి. ఈ రెండు కలలతో పాటు.. ఆత్మ విశ్వాసం ఇప్పుడు ఆమెను ‘కోటీశ్వరి’ని చేసింది. కలర్స్ చానెల్ వాళ్లు తమిళంలో మహిళల కోసం ప్రత్యేకంగా గత ఏడాది డిసెంబరు 23న ‘కోటీశ్వరి’ అనే గేమ్ షో ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ షో ప్రసారం అవుతోంది. సీనియర్ నటి రాధిక అనుసంధానకర్తగా వ్యవరిస్తున్నారు. ఈ ‘షో’లోనే కౌసల్య కోటి రూపాయలు సాధించారు. రాధిక అడిగిన ప్రశ్నలను లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకుని సమాధానాలను అందించిన కౌసల్య.. సుదీర్ఘంగా జరిగిన గేమ్‌లో కోటి రూపాయల బహుమతి సాధించారు. షో మొదటి సీజన్లోనే కోటిరూపాయల ప్రైజ్ మనీ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ప్రత్యేక ప్రతిభావంతురాలి’గా కౌసల్య నిలిచారు. కోటిరూపాయల ఫైనల్ ఎపిసోడ్ జనవరి 21 రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ్ చానెల్లో ప్రసారం అయింది. ‘‘ఈ షో ద్వారా నా రెండు కలలు నిజం కాబోతున్నాయి’’ అంటూ కౌసల్య ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఒక ప్రత్యేక ప్రతిభావంతురాలు కౌసల్యను ప్రపంచం చూడటం ఇదే మొదటిసారి అని రాధిక అభినందనల వర్షం కురిపించారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై -
ఎం.ఆర్. రాధా బయోపిక్
ఎం.ఆర్ రాధ... తమిళంలో పాపులర్ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
దసరా అంటే శక్తికి ఉత్సవం. చెడును సంహరించిన మంచి శక్తి. చీకటిని చీల్చిన వెలుగు శక్తి. భావోద్వేగాలను జయించిన నిగ్రహ శక్తి. తనను తాను నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసపు శక్తి! అంటే శక్తికి ఆయుధం ఆత్మవిశ్వాసమే.. దసరా సందేశమూ అదే.. స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలని!! అలాంటి కథానాయికలను పరిచయం చేసిన కొన్ని సినిమాలు, ఆ శక్తి స్వరూపిణుల గురించి... ‘ఆయుధ పూజ’ సందర్భంగా..! అమ్మ కడుపులోంచే ఆడపిల్ల వినమ్రత, అణకువ, త్యాగం అనే పర్యాయ పదాలను జన్మనామాలుగా స్థిరపర్చుకొని ఈ భూమ్మీద పడ్తుంది. వీటన్నిటినీ ‘పరాధీన’ అనే ఒక్క ట్యాగ్‌తో కుదించేయొచ్చు. ఈ ఒక్క ఎలిమెంట్‌తో టన్నుల కొద్దీ సెంటిమెంట్‌ను పండించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు నాడు.. నేటికి కూడా! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ అమ్మ, భార్య, అక్క, చెల్లికి కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు.. కుటుంబ సేవలో గంధం చెక్కలా అరిగి తరించాలనే సందేశాన్నీ నూరిపోశాయి. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని అహంకారిగా చూపించాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఆ మూస రీళ్లను పెట్టెలో అట్టిపెట్టే కొన్ని భిన్నమైన చిత్రాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు ఆత్మగౌరవం అని చాటే సినిమాలు. వాటిల్లో ముఖ్యమైనవి అంతులేని కథ, ఇది కథ కాదు, న్యాయం కావాలి, 47 రోజులు, కోకిలమ్మ, తలంబ్రాలు. పనికి గౌరవం గంపెడు సంతానాన్ని కని.. పోషించలేక భయంతో తండ్రి పారిపోతే , వ్యసనాలకు బానిసైన అన్న బాధ్యత మరిచిపోతే.. వారి స్థానాన్ని భర్తీ చేసి ఆ ఇంటికి పెద్దగా మారి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటుంది ఆత్మాభిమానం గల కూతురు సరిత.. అంతులేని కథ సినిమాలో. ఆ ఇంట్లో తనకంటూ ఓ ప్రత్యేక గది, ప్రత్యేక హోదాను ఏర్పాటు చేసుకున్న సరిత ఇంట్లో వాళ్లందరికీ అహంకారిగా కనిపిస్తూంటుంది. కాని ప్రేక్షకులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. కుటుంబానికి ఆర్థిక వనరుగా ఉన్న పురుషుడికి ఎలాంటి హోదానిస్తారో స్త్రీకి అలాంటి హోదానే ఇవ్వాలి అని చాటిన సినిమా. అందుకే సరిత ఓ పురుషుడిలా తనకు ఓ ప్రత్యేక గదిని, హోదాను తీసుకుంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం అంటే వేణ్ణీళ్లకు చన్నీళ్లే కాదు ఇంటిని నడిపించే దిక్కు అని చెప్తుంది. ‘పని నీది ఏటీఎమ్ కార్డ్ నాది’ అనే పురుష భావనకు చెక్ పెడ్తుంది. ఆత్మగౌరవంతో ఇల్లు దాటి ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచాన్ని నెగ్గుకొచ్చిన తీరును చూపిస్తుంది. శక్తికి ప్రతీకగా నిలబెడుతుంది. ‘అంతులేని కథ’ దర్శకుడు కె. బాలచందర్. సరితగా జయప్రద, వ్యసనపరుడైన అన్న మూర్తిగా రజనీకాంత్ నటించారు. సింగిల్ మదర్ పెళ్లికి ముందు ప్రేమ.. ఏవో కారణాల వల్ల పెళ్లిదాకా రాదు. పెద్దలు కుదిర్చిన వరుడు సుగుణాకర్ రావుతో మూడుముళ్లు వేయించుకుంటుంది సుహాసిని (జయసుధ). మూణ్ణాళ్లలోనే అతనొక శాడిస్ట్ అని రుజువవుతుంది. అప్పటికే ఓ బిడ్డ పుడ్తాడు. ఇక భరించలేక విడాకులు తీసుకొని ఒంటరి తల్లిగా కొత్త జీవితం మొదలుపెడ్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా! తోడుగా ఆమె అత్తగారూ వస్తుంది. కోడలిని మరో పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. సుహాసిని ఆ ప్రయత్నంలో ఉండగా మారిపోయి మంచి మనిషి అయినట్టు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు సుగుణాకర్‌రావు కేవలం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే. తర్వాత ఆ విషయం అర్థమైన సుహాసిని మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా బిడ్డను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతుంది. వెంట అత్తగారూ వెళ్తుంది. కోడలి చంకలోంచి మనవడిని తన భుజమ్మీదికి తీసుకుంటుంది ఆమె బాధ్యతలో సాయపడ్డానికి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని, మగ తోడు లేకుంటే మహిళకు జీవితం లేదు అన్న స్టేట్మెంట్ను వెక్కిరించిన సినిమా. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం తోడుంటే ఒంటరిగానే కాదు ఒంటరి తల్లిగా కూడా జీవనయానం చేయొచ్చు అని నిరూపించింది.. ‘ఇది కథ కాదు’. ఇవ్వాళ్టి ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు స్ఫూర్తి. అత్తాకోడళ్ల అనుబంధాలకు ప్రేరణ. ‘ఇది కథ కాదు’ చిత్రం.. మహిళకు ఆత్మవిశ్వాసం అవసరాన్ని ప్రొజెక్ట్ చేసిన వాస్తవం. గుర్తింపుకోసం పోరాటం ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛ తీర్చుకొని, ఆమెను తల్లిని చేసి ఆ బిడ్డకు తనే తండ్రి అన్న రుజువేంటి అని ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన అతని మీద పోరాటం చేసి విజయం సాధించిన ఆమె ఆత్మవిశ్వాసం కథే ‘న్యాయం కావాలి’. ఇక్కడ విజయం అంటే నయానో భయానో తప్పు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. ఆత్మవిశ్వాసంతో కోర్టులో నిలబడి అన్ని రకాల పురుషాహంకార పరీక్షలను తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. చేసిన తప్పుకి అతను కుంగిపోవడం. ఆమె నా బిడ్డకు తల్లే అని అతని మనసు ఘోష పెట్టడం. పశ్చాత్తాపంతో ఆమె గడప తొక్కి ‘నాకు భార్యగా నీ చేయి అందించు’ అని ఏడ్వడం. చిరునవ్వుతో ఆమె తిరస్కరించి ఆడపిల్ల గౌరవాన్ని కాపాడ్డం. పందొమ్మిది వందల ఎనభైల్లోనే వచ్చిన ఈ చైతన్యంలో ‘ఆమె’ భారతిగా రాధిక, ‘అతను’ సురేశ్‌గా చిరంజీవి నటించారు. దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి. ‘కొత్త మలుపు’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్. తర్వాత చాన్నాళ్లకు కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమాదీ ఇంచుమించు ఇలాంటి కథే. ప్రేమించి మోసపోతే ఏడుస్తూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతుంది. అతనికి గుణపాఠం చెప్తుంది. జీవిత, రాజశేఖర్, నందమూరి కళ్యాణచక్రవర్తి నటించారు. పెళ్లే పరమావధి కాదు ‘47 రోజులు’ సినిమా లైన్ ఇది. వైశాలి ఓ పల్లెటూరి అమ్మాయి. ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న కుమార్ ఏరికోరి ఆ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్ తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో పై పోర్షన్లో ల్యూసీ అనే ఒక అమ్మాయి ఉంటూంటుంది. ‘‘ఆమె ఎవరు?’’ అని అడిగిన వైశాలికి ‘‘ఫ్రెండ్’’ అని చెప్తాడు. తన వేలికి కుమార్ తొడిగిన వెడ్డింగ్ రింగ్‌ను సరిచేసుకుంటూ అతణ్ణి అడుగుతుంది ల్యూసి ‘‘ఆమె ఎవరు?’’ అని వైశాలిని ఉద్దేశించి. ‘‘నా పిచ్చి చెల్లెలు’’ అని చెప్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు కుమార్. ల్యూసీకి చెప్పినట్టుగా వైశాలినీ తన పిచ్చి చెల్లెలుగా నటింపచేయడానికి తనలోని శాడిస్ట్‌ను బయటకు తెస్తాడు కుమార్. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసకు గురిచేస్తాడు. ఈలోపే వైశాలి గర్భవతి అవుతుంది. బండారం ల్యూసీకి తెలియొద్దని నాటు పద్ధతిలో వైశాలికి అబార్షన్ చేయించాలనుకుంటాడు. అక్కడే ఉన్న తెలుగు డాక్టర్ శంకర్ సహాయంతో తప్పించుకుని బయటపడి ఇండియా చేరుకుంటుంది వైశాలి.ఆమె కథను సినిమాగా తీసే క్రమంలో వైశాలిని కలవడానికి వస్తుంది ఆ పాత్ర పోషించనున్న సరిత. ‘‘మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మీరు’’ అని ప్రశ్నిస్తుంది సరిత. ‘‘పెళ్లి తప్ప ఆడదాని జీవితానికి ఇంకో అర్థం లేదా?’’ అంటూ అరిచేస్తుంది వైశాలి. అదీ ఆమె ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ చేసిన మరో మూస.. సెంటిమెంట్. మోసకారి, శాడిస్ట్ భర్తను కాదనుకున్నాక అతని బిడ్డనూ మోయడానికి ఇష్టపడదు ఆమె. మాతృత్వం అనే సోకాల్డ్ సెంట్మెంట్ను పక్కకునెట్టి అబార్షన్ చేయించుకుంటుంది. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైశాలిగా జయప్రద, కుమార్‌గా చిరంజీవి నటించారు. వినిపించిన ఉనికి వినికిడి శక్తిలేని కోకిలమ్మ.. ఒక డొమెస్టిక్ వర్కర్. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే యాంబీషియస్ కుర్రాడు అద్దెకు వస్తాడు. వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు మంచి విమర్శకురాలిగా మారుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బుకు తగ్గట్టు తన ప్రవర్తననూ మార్చుకుంటాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడుతుంది. కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని జీవితాన్ని ఈదే శక్తిగా మలచుకుంటుంది. తన పక్కింట్లోనే ఉంటున్న ఓ అవిటి స్నేహితురాలు భర్తను పోగొట్టుకుంటే ఆమెకు అండగా నిలుస్తుంది. ఆ గాయకుడు తన భార్యతో వెళ్తున్న కారు మొరాయిస్తే చేతుల్లేని తన స్నేహితురాలి సహాయంతో ఆ కారుని తోసి అతణ్ణి ముందుకు నడిపించి తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని వినిపిస్తుంది. ఇవీ.. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో స్త్రీని శక్తి స్వరూపిణిగా చూపించిన చిత్రాలు. సినిమారంగంలోని విద్యార్థులకు సిలబస్‌గా స్థిరపడ్డ విజువల్ పుస్తకాలు. – సరస్వతి రమ -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ఓ యువకుడు పెట్టిన పోస్టు ఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది. ఈ పోస్టు కారణంగా ఆ యువతి, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడడంతో విధ్వంసకర పరిస్థితి చోటుచేసుకుంది. సాక్షి, చెన్నై: ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫొటోలను మార్పింగ్ చేయడం, వారి పరువును బజారు కీడ్చే రీతిలో వ్యవహరించే మృగాళ సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ఇలాంటి పోస్టింగ్‌ల కారణంగా ఆ యువతులు, ఆ కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురి కావడమే కాదు, బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో పట్టుబడే వారితో కఠినంగా వ్యవహరించకపోవడం కాబోలు, తప్పుల మీద తప్పులు చేస్తూ యువతుల జీవితాలతో చెలగాటం ఆడే వారి సంఖ్య పెరుగుతున్నదని చెప్పవచ్చు. అలాగే, పోలీసులు సైతం సామాజిక వర్గాల నేతల ఒత్తిళ్లతో పట్టుబడే వారిని మందలించి వదలి పెట్టడం, ఆ తదుపరి తీవ్ర పరిణామాలు ఎదురైన పక్షంలో పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా కడలూరులో ఘటన వెలుగుచూసింది. మొదటి నుంచి వేధింపులు.... కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌కుప్పంకు చెందిన నీలకంఠం కుమార్తె రాధిక (20) కడలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కళాశాలలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెను అదే ప్రాంతానికిచెందిన పన్నీరు కుమారుడు ప్రేమ్‌కుమార్ టీజింగ్‌లతో వేధించే వాడు. తొలుత పెద్దగా పట్టించుకోనప్పటికీ, చివరకు అతడి చర్యలు శ్రుతిమించడంతో రాధికకు మనోవేదన తప్పలేదు. ఫేస్ బుక్‌లోనూ వేధించడం మొదలెట్టడంతో తనలోని ఆగ్రహాన్ని రాధిక బయటపెట్టింది. ఫేస్బుక్ ద్వారానే ప్రేమ్‌కుమార్‌కు చీవాట్లు పెట్టింది. అయితే, ప్రేమ్‌కుమార్ మరింత ఆగ్రహానికిలోనై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరి మధ్య తొలుత ఫేస్బుక్లో పెద్ద సమరమే సాగింది. చివరకు విసిగి వేసారిన రాధిక ఈ వేధింపుల గురించి తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో ప్రేమ్‌కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం అన్నది ఇరు సామాజిక వర్గాల మధ్య సమరం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనేతలు, పెద్దల జోక్యంతో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు మందలించి వదలి పెట్టారు. మారుతాడుకుంటే..కక్ష కట్టాడు... పోలీసులు మందలించడంతో ప్రేమ్‌కుమార్ మారతాడని రాధిక భావించింది. అయితే, ఆమెపై అతగాడు కక్ష పెంచుకోవడమే కాదు, ఆమె పరువు బజారుకీడ్చేందుకు తగ్గ సమయం కోసం వేచి చూసినట్టున్నాడు. ఈ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో వడలూరు పార్వతీపురంలో ఉన్న మేనత్త కుమారుడు విఘ్నేష్(23) ప్రేమలో రాధిక పడింది. ఈ ఇద్దరు తిరుగుతుండడం కుటుంబీకుల దృష్టికి చేరింది. ఇరు కుటుంబాల పెద్దలు ఆ ఇద్దరికి వివాహం చేయడానికి నిర్ణయించారు. చదువులు పూర్తి అయ్యాక పెళ్లి చేద్దామన్నట్టుగా ముందుకు సాగారు. దీంతో రాధిక, విఘ్నేష్‌ల ఆనందానికి హద్దే లేదని చెప్పవచ్చు. అయితే, ఈ ఆనందాన్ని ఆవిరి చేయడమే కాదు, ఆ ఇద్దరి పెళ్లి జరగకూడదని, ఇరు కుటుంబాల మధ్య వివాదాన్ని రేపే రీతిలో తనలోని మానవ మృగాన్ని ప్రేమ్‌కుమార్ బయటకు తీశాడు. సమయం కోసం వేచి ఉన్న ప్రేమ్‌కుమార్ కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో రాధిక ఫొటోలను మార్ఫింగ్ చేసే పనిలో పడ్డారు. అ సభ్యకరంగా ఉన్న ఆ ఫోటోలను ఫేస్బుక్లో పెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న రాధిక తీవ్ర మనస్తాపానికి గురి అయింది. తన పరువు బజారుకెక్కడంతో కలత చెంది సోమవారం ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణం తెలుసుకున్న కుటుంబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రేమ్‌కుమార్ ఇళ్లు, వారి బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం భగ్గుమనడంతో పరస్పరం దాడులు సాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేయత్నం చేశారు. అదే సమయంలో రాధిక ఆత్మహత్య చేసుకున్న సమాచారం చెవిన పడడంతో విఘ్నేష్ మనోవేదనలో పడ్డారు. రాధిక లేని జీవితం తనకు వద్దు అని భావించినట్టున్నాడు. సెంగం పాళయం వద్ద ఓ చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు విఘ్నేష్ వేలాడుతుండడాన్ని చూసిన అటు వైపుగా వెళ్లిన వారు ఆందోళనకు లోనయ్యారు. కిందకు దించగా, అప్పటికే మరణించి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ్‌కుమార్ పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా రాధికా, విఘ్నేష్ ఆత్మహత్య చేసుకోవడం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. రోడ్డెక్కిన ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ప్రేమ్‌కుమార్ సామాజిక వర్గానికి చెందిన వారి వాహనాలపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడలూరు జిల్లా యంత్రాంగం బలగాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. చివరకు మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసే వరకు మృతదేహాల్ని తీసుకోబోమని తేల్చడంతో అతడి కోసం వేట మొదలెట్టారు. తన కోసం పోలీసులు గాలిస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం కోర్టులో ప్రేమ్‌కుమార్ లొంగిపోయాడు. దీంతో ఇద్దరి మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆ గ్రామంలో పరిస్థితి మరలా అదుపు తప్పకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాగా, ఈ వ్యవహారంపై పీఎంకే నేత రాందాసు తీవ్రంగానే స్పందించారు. ఇప్పుడు ఎవరు ఎవర్ని వేధిస్తున్నారో అన్నది స్పష్టం అవుతుందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలకు భద్రత అన్నది కరువు అవుతోందని, ఇప్పుడు ఇద్దర్నిపొట్టన పెట్టుకున్న ప్రేమ్‌కుమార్ లాంటి వారితో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా, లేదా అని పరోక్షంగా వీసీకే నేత తిరుమావళవన్‌ను హెచ్చరించడం గమనార్హం. -
యంజీఆర్ – యంఆర్ రాధల కథేంటి?
తమిళ సినీ చరిత్రలో యంజీఆర్‌ను యంఆర్ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ చర్చ జరిగే టాపిక్. ఈ కాల్పుల్లో యంజీఆర్ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్‌ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్ రాధా మీద ఓ బయోపిక్ రూపొందనుండటమే. నటి, యంఆర్ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్ రధన్ మీడియా వర్క్స్‌పై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మళ్లీ డ్యూయెట్
డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్కమ్ బ్యాక్. జనం ఒకసారి ఒక హిట్ పెయిర్‌ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్‌గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్‌తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్‌బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్‌తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ. సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్‌ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం. ప్రభు–మధుబాల ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మేన్’ సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్‌లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు. అమితాబ్–రమ్యకృష్ణ కెరీర్ పీక్‌లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్‌తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్‌బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్లో ఉన్న అమితాబ్‌కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శోభన–సురేశ్ గోపి మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను ఆడియన్స్‌కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధిక–శరత్ కుమార్ రాధిక– శరత్ కుమార్ ఆఫ్‌స్క్రీన్ కపుల్. ఆన్‌స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు. సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు. స్వీట్ కపుల్–గులాబ్ జామూన్ ఈ ఏడాది మరో రీ–యూనియన్ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్‌కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం. నువ్వు నేను – మరో సినిమా కోలీవుడ్‌లో సూర్య–జ్యోతికలది సూపర్‌హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్‌బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
షాక్‌లో ఉన్నా
బాంబ్ బ్లాస్టులతో శ్రీలంక వణికిపోయింది. చర్చిలు, హోటల్స్‌లో ఆదివారం బాంబ్ బ్లాస్టులు జరగడంతో సుమారు 185 మందికిపైగా చనిపోయారు. ఈ భారీ పేలుళ్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు నటి రాధికా శరత్‌కుమార్. బాంబు పేలుళ్లకు కొద్ది గంటల ముందు వరకూ ఆ హోటల్లోనే బస చేశారట రాధిక. ఈ విషయాన్ని ట్వీటర్లో ఆమె తెలుపుతూ – ‘‘ఓ మై గాడ్.. శ్రీలంకలో వరుస బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. నేను హోటల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు సంభవించింది. ఇంకా నమ్మలేకపోతున్నాను. షాక్‌లో ఉన్నాను’’ అని పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగిన ఈ విషాదానికి అన్ని సినీ ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. -
జతగా...
20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత శరత్ కుమార్, రాధిక దంపతులు ఆన్ స్క్రీన్ కూడా జోడీగా నటించనున్నారు. గతంలో ‘నమ్మ అన్నాచ్చి, సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక కలసి నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా విక్రమ్ ప్రభు హీరోగా ధన దర్శకత్వంలో ‘వానమ్ కొట్టటుమ్’ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మడోనా సెబాస్టియన్ కథానాయిక. ఈ చిత్రానికి కథ– మాటలు మణిరత్నం, ధన సమకూర్చారు. జూలైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
చిన్నితెర పెద్ద రికార్డ్!
పెద్ద తెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో బుల్లి తెర మీదా అంతే సంఖ్యలో అభిమానులను అలరించారు సీనియర్ నటి రాధిక. తాజాగా బుల్లితెర మీద పెద్ద రికార్డ్ నెలకొల్పారు. సుమారు 3430 గంటలు సీరియల్స్‌లో కనిపించారట. ‘‘టెలివిజన్ సీరియల్స్‌లో సుమారు 6850 ఎపిసోడ్స్‌లో నటించాను. అంటే 3430 గంటలు. ఇలాంటి ఫీట్ సాధించినందుకు నటిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రెండు నెలలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. మళ్లీ జూన్ నుంచి సరికొత్త అవతారంలో సన్టీవిలో రాత్రి 9.30 అలరిస్తూనే ఉంటాను. నాకు ఎల్లప్పూడు ప్రేమను పంచే అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాథిక. -
ద్వేషం స్థానంలో ప్రేమ నిండాలి
‘‘ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మనం (ఆగ్రహావేదన). అవును.. మా నాన్నగారు సూపర్ బ్లెస్డ్. అద్భుతమైన భార్య దొరికారు. నలుగురు సంతానం ఉన్నారు. ఒక మనవడు ఉన్నాడు. ఆయన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంది. మాది మిక్స్డ్ ఫ్యామిలీ. మమ్మల్ని ట్రోల్ (విమర్శించే) చేసే వారి మనసుల్లోని ద్వేషం స్థానంలో ప్రేమ నిండుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రేయాన్. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? నటిరాధిక మొదటి కుమార్తె రేయాన్. కాగా, శరత్‌కుమార్, రాధికలు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఇటీవల శరత్ కుమార్, రాధికల పెళ్లిరోజు సందర్భంగా రేయాన్ తన కొడుకుతో శరత్–రాధికలు ఉన్న ఫోటోను ‘లవ్‌బర్డ్స్. హ్యాపీ యానివర్సరీ’ అనే ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. రేయాన్ చేసిన ఈ పోస్ట్‌ను కొందరు నెటిజన్లు ‘‘శరత్‌కుమార్ ఈజ్ బ్లెస్డ్. రెండో భార్య రాధిక మొదటి కుమార్తె (రేయాన్) కొడుకుతో శరత్ కుమార్’’ అని హేళన చేసే విధంగా పేర్కొన్నారు. ఈ కామెంట్‌కే రేయాన్. పైవిధంగా స్పందించారు. రేయాన్ చేసిన పోస్ట్‌ను రాధిక ట్యాగ్ చేసి...‘‘రేయాన్.. మన బాధ ఎవరికీ తెలీదు. కానీ మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలను చూడటానికి అర్హత లేని గుడ్డివారు ట్రోల్ చేస్తున్నారు. వారిని అలాగే వదిలేయ్. అలాగే వేదనతో బతకనివ్వు. మనం మనలాగే హ్యాపీగా ఉందాం’’ అని అన్నారు రాధిక.