
రాజాతో రచ్చ రచ్చ!
మార్నింగ్ టు మిడ్–నైట్ షూటింగ్ చేసినా... రవితేజలో ఎనర్జీ వన్ పర్సెంట్ కూడా డ్రాప్ కాదు తెలుసా! ఆయనతో నటిస్తే ఓ కిక్ వస్తుందని పలువురు నటీనటులు చెబుతుంటారు.
మార్నింగ్ టు మిడ్–నైట్ షూటింగ్ చేసినా... రవితేజలో ఎనర్జీ వన్ పర్సెంట్ కూడా డ్రాప్ కాదు తెలుసా! ఆయనతో నటిస్తే ఓ కిక్ వస్తుందని పలువురు నటీనటులు చెబుతుంటారు. ఇప్పుడా కిక్‌లో ఉన్నారు రాధిక. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్న ‘రాజా.. ది గ్రేట్’లో రాధిక పోలీస్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ, రాధిక, సంపత్‌రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్‌లో రవితేజతో కలసి దిగిన సెల్ఫీను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘మ్యాడ్‌నెస్ ఆన్ సెట్స్’ అని రాధిక పేర్కొన్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ‘దిల్’ రాజు.