కుమార్తె సంగీత్ వేడుకలో ఇరగదీసిన రాధిక
తమిళసినిమా(చెన్నై): సినీనటి రాధిక కూతురు రెయాన, మిథున్‌ల వివాహ సంగీత్ వేడుక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని తాజ్‌హోటల్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులు పులువురు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
లతారజనీకాంత్, భాగ్యరాజ్ పూర్ణిమ, సుహాసిని, త్రిష, రమ్యకృష్ణ, శోభన, మధుబాల, స్నేహ, ప్రసన్న, నమిత, ఐశ్వర్యాధనుష్, దర్శకుడు సుందర్.సి, కుష్బు, జయం రవి, లక్ష్మి మంచు, వెంకటేశ్, శ్రీకాంత్, వందన, శాంత కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సినీతారలు ఉత్సాహంగా డాన్సులు చేశారు. ముఖ్యంగా పెళ్లికూతురి తల్లి రాధిక చేసిన నృత్యాలు అలరించాయి.