సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్‌లో ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
Unfollowing @ndtv
Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ
— KTR (@KTRTRS) November 30, 2022
కొత్త డైరెక్టర్లు
ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్‌లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్‌లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు.
ఎన్డీటీవీ షేరు జోరు
మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది.
Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx
— Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022
కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్‌ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్‌కు స్పందన బాగానే లభిస్తోంది
Comments
Please login to add a commentAdd a comment