సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.
ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్‌ను అనడానికి రేవంత్‌కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.
బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్‌రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.
అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్‌లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్‌లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.
మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్‌రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment