Prannoy Roy
-
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్‌లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్‌కు స్పందన బాగానే లభిస్తోంది -
మీ షేర్లు, మార్కెట్ విలువను తెలపండి
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధికా రాయ్‌ల షేర్లు, వాటి విలువను శుక్రవారం నాడు తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే... కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ది పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద 45 రోజులలోపు డిపాజిట్ చేయాలని సెబీ గత ఏడాది నవంబర్ చివర్లో ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్డీటీవీ ప్రమోటర్లపై రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సెబీ ఆదేశాలపై ఎన్డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించారు. అయితే ఇన్సైడర్ లావాదేవీ ద్వారా అక్రమంగా పొందినట్లు సెబీ గుర్తించిన మొత్తంలో 50 శాతం డిపాజిట్ చేయాలని శాట్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాయ్ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. తమ వద్ద తగిన వేరే ఆదాయ వనరులు ఏవీ లేనందున, సెబీ జరిమానాకు ఎన్డీటీవీ షేర్లనే హామీగా పెడతామని రాయ్ దంపతుల తరఫు న్యాయవాది ముకుల్ రోతంగీ ఆఫర్ చేశారు.దీనిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ నేతృత్వంలోని ధర్మాసనం షేర్ల విలువ స్టేట్మెంట్ను శుక్రవారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్ ప్రణయ్ రాయ్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఎన్డీటీవీ ప్రమోటర్లైన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్, హోల్డింగ్ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సెబీ నిషేధించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు బోర్డ్ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏడాది కాలంలో ఏ లిస్టెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్‌గా వ్యవహరించకూడదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించలేదని, అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని సెబీ వివరించింది. -
మీడియా అధిపతికి సీబీఐ ఝలక్!
న్యూఢిల్లీ: అనూహ్యరీతిలో సీబీఐ సోమవారం ఉదయం జాతీయ న్యూస్ చానెల్ ఎన్టీటీవీ సహ యాజమానులైన ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ ఇళ్లలో దాడులు నిర్వహించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ధ్రువీకరించింది. అయితే, ఎన్టీటీవీ కార్యాలయంలో ఈ సోదాలు జరగలేదు. ఎన్టీటీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ఇలా మొత్తం నాలుగుచోట్ల సీబీఐ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 2008లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన గతవారం సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రణయ్‌రాయ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 366 కోట్లు రుణంగా తీసుకొని.. రూ. 50 కోట్లు తక్కువ చెల్లించినట్టు సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. -
సారీ చెప్పిన చాణక్య, ప్రణయ్ రాయ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఊహించడంలో తాము పొరపాటు చేశామని, దాంతో ప్రజలను కూడా అయోయమానికి గురిచేశామని.. అందుకు క్షమాపణ చెబుతున్నామని టుడేస్ చాణక్య ప్రతినిధులు, ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ చెప్పారు. ప్రణయ్ రాయ్ ఒక వీడియో సందేశం ద్వారా ఇది ఎలా జరిగిందో వివరిస్తే, టుడేస్ చాణక్య ట్విట్టర్ ద్వారా తన క్షమాపణలను ప్రకటించింది. తమ సర్వే నిపుణులు ప్రజల నాడి పట్టడంలో విఫలమైనట్లు ఇద్దరూ ఒప్పుకొన్నారు. ప్రణయ్ రాయ్ దాదాపు 30 ఏళ్ల నుంచి ఎన్నికల విశ్లేషణలో నిపుణుడిగా పేరొందారు. ఆయన అంచనాలు కూడా ఈసారి తలకిందులు కావడం గమనార్హం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దాదాపు 150 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని టుడేస్ చాణక్య, ఎన్డీటీవీ బల్లగుద్ది మరీ చెప్పాయి. ఎన్డీటీవీ తాను తొలుత ఇచ్చిన అంచనాలను సవరించుకుంటూ శుక్రవారం రాత్రి ఎన్డీయే విజయం ఖాయమని చెప్పింది. ఆదివారం ఉదయం కూడా తొలి గంట సమయంలో ఆధిక్యాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉండటంతో.. ఇదే ట్రెండు కొనసాగితే ఎన్డీయే అధికారం చేపట్టడం ఖాయమంటూ ప్రఖ్యాత ఎన్నికల విశ్లేషణ నిపుణుడు ప్రణయ్ రాయ్ చెప్పారు. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. -
టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్
హైదరాబాద్ : సీమాంధ్రలో తమ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఎన్డీ టీవీ సీఈవో ప్రణయ్ రాయ్‌కిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. సీమాంధ్రలోని 175 సీట్లలో టీడీపీకి 40 సీట్లు కూడా రావన్నారు. సీమాంధ్రకు హైదరాబాద్‌ను దూరం చేసి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి ఇంజిన్‌లాంటి హైదరాబాద్‌ను తొలగించి సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. ప్రణయ్‌రాయ్: ఎన్నికల ప్రచారంలో ఇలాంటి భావోద్వేగ వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. మీకు ఇది అంత పట్టున్న ప్రాంతం కూడా కాదు. సీమాంధ్రలో కన్నా.. ఎక్కువ ఎమోషన్ కనిపిస్తోందా? వైఎస్ జగన్: సీమాంధ్రలో ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది ప్రణయ్‌రాయ్: రాయలసీమలో కూడా ఇంతేనా? వైఎస్ జగన్: రాయలసీమైనా... కోస్తాంధ్ర అయినా పెద్దగా తేడా ఉండదు. రెండు ప్రాంతాలు కూడా ఒకే రకమైన అభిప్రాయంతో ఉంటాయి. శ్రీకాకుళం నుంచి చివరివరకూ ఒకేరకమైన ధోరణి కనిపిస్తుంది. అధికారంలో వచ్చే ఏపార్టీ అయినా.. క్లీన్‌స్వీప్ చేస్తుంది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుంది. తమిళనాడు తరహా రాజకీయ ప్రవర్తన కనిపిస్తుంది. కాని తెలంగాణలో దీనికి భిన్నంగా ఉంటుంది. మెజార్టీ సీట్లు సాధించే ఏపార్టీకూడా సగానికిపైగా సీట్లు సాధించే అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ కేవలం 26 సీట్లు మాత్రమే సాధించింది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 10 సీట్లే వచ్చాయి. సీమాంధ్రలో అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. క్లీన్ స్వీప్ ఉంటుంది. ఆప్రాంతంలో రాజకీయ ధోరణి అలానే ఉంటుంది. గడచిన 30 ఏళ్ల ఫలితాలను చూస్తే... ఇదే తెలుస్తుంది. ప్రణయ్ రాయ్: మీరు ఎన్ని నెలలనుంచి ఇలా ర్యాలీలు, రోడ్‌షోలు చేస్తున్నారు? వైఎస్ జగన్: గడచిన నాలుగు సంవత్సరాలు నేను ఇవి చేస్తూనే ఉన్నా... ప్రణయ్‌రాయ్: ప్రత్యేకించి మహిళలు... మరింత భావోద్వేగాలను చూపుతున్నారు? వైఎస్ జగన్ : మిగతావారితో పోలిస్తే.. మహిళలు నన్ను హృదయపూర్వంగా ఆశీర్వదిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతలు. ప్రణయ్‌రాయ్: బీజేపీ, టీడీపీల పొత్తు.. కొంతశాతం మైనార్టీ ఓటర్లను మీకు దూరంచేస్తుందంటారా? వైఎస్ జగన్: బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నా.. లేకున్నా.. పెద్దగా ప్రభావం ఉండదు. ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ , టీడీపీ పొత్తు వల్ల పెద్దగా మార్పు ఉండదు. కాకుంటే ఒకటి రెండు శాతం ఓట్లలో తేడా ఉండొచ్చు. కాని, ఈతేడా ఓట్లు, సీట్లుగా మారవు. సీమాంధ్రలో బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎలాంటి సీట్లూ రావు. 175 సీట్లలో టీడీపీ 40 సీట్లు దాటదు. ప్రణయ్‌రాయ్: మీరు కూడా ఎన్నికల గణాంకాల విశ్లేషకులే. మీరు కూడా ఎవరికెన్నిసీట్లో చెప్తున్నారు. మీ ఆలోచనల్లో... మీ భావాల్లో మీనాన్న ఎక్కువ కనిపిస్తున్నారు? వైఎస్ జగన్: ఇప్పటికీ ఆయన బతికే ఉన్నారు. కారణం ఏంటంటే.. ఆయన చాలా చేశారు. ఆయన వదిలివెళ్లిన ప్రేమాభిమానాలను ప్రజలు చూపిస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చేసారికి తమ సొంత ఇంటి మనిషిలా చూస్తున్నారు. సొంత కొడుకుగా, మనవడిగా, సొంత తమ్ముడిగా, అన్నగా నన్ను అభిమానిస్తున్నారు. ఇదంతా నాన్న చేసినదానివల్లే. దాన్ని నిలబెట్టుకుంటానని, మరింత మెరుగ్గా సేవలందిస్తానని వారికి మరింత భరోసానివ్వాలి.