ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం | SEBI Ban on NDTV Prannoy Roy | Sakshi
Sakshi News home page

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

Published Sat, Jun 15 2019 8:48 AM | Last Updated on Sat, Jun 15 2019 8:48 AM

SEBI Ban on NDTV Prannoy Roy - Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లైన ప్రణయ్‌ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్, హోల్డింగ్‌ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సెబీ నిషేధించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్‌ రాయ్, రాధికా రాయ్‌లు బోర్డ్‌ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏడాది కాలంలో ఏ లిస్టెడ్‌ కంపెనీలో కూడా డైరెక్టర్‌గా వ్యవహరించకూడదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించలేదని, అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని సెబీ వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement