న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం వాటాల కోసం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఓపెన్ ఆఫర్ నవంబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 5తో ముగియనుంది. షేరు ఒక్కింటికి రూ. 294 రేటుతో ఈ ఆఫర్ పరిమాణం రూ. 492.81 కోట్లుగా ఉండనుంది.
ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులకు దశాబ్దం క్రితం రూ. 400 కోట్ల రుణం ఇచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ ఎన్‌డీటీవీలో పరోక్షంగా 29.15 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాల కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం ఎన్‌డీటీవీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి బీఎస్‌ఈలో రూ. 366 వద్ద క్లోజయ్యాయి.
చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.
Comments
Please login to add a commentAdd a comment