NDTV
-
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం
న్యూఢిల్లీ: అద్భుత ప్రగతి పథంలో దూసుకెళ్తూ ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్ సదస్సులో ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేసి పలు అంశాలపై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. డబుల్ ఏఐ ప్రయోజనాలు ‘‘మూడోసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుతమైన ప్రతిపథంలో నడిపిస్తున్నాం. యుద్దాలు, సంక్షోభాలుసహా ప్రపంచాన్ని పలు సమస్యలు పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణంలా మారింది. రెండు ఏఐల అదనపు ప్రయోజనాలు భారత్సొంతం. ఒకటి ఆశావహ ఇండియా(ఏఐ), కాగా మరోకటి కృత్రిమమేథ(ఏఐ). ఈ రెండింటి కలయికతో భారత్ వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆపత్కాలాల్లో ప్రపంచం భారత్‌ను ఒక స్నేహితునిలా చూస్తుంది. కోవిడ్ మహమ్మారివేళ ఎన్నో దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరాచేసింది. ఏ దేశంతోనూ భారత్ బంధం గాలివాటంగా ఏర్పడలేదు. ఎంతో నమ్మకం, సత్సంబంధాలతో బలోపేతమైంది. భారత్ బాగుపడితే అసూయపడే దేశాలు లేవు. ఎందుకంటే భారత దేశ అభివృద్ధి ఫలాలు ప్రపంచదేశాలకూ పనికొస్తాయని అందరికీ తెలుసు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైతే ప్రపంచమే సంబరాలు చేసుకుంది. చరిత్రలోకి తొంగిచూస్తే ప్రపంచఅభివృద్ధిలో భారతపాత్ర ఎనలేనిదని స్పష్టమవుతోంది. అయితే గత దశాబ్దాల్లో వలసపాలన కారణంగా ప్రపంచ పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 యుగం మొదలైంది. అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటోంది’’ అని అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్యవిలువల్ని మేళవించాం ‘‘ డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువల్ని సమ్మిళితం చేశాం. అలాంటి సాంకేతికతే సాధికారత, పారదర్శకతలకు పనిముట్టుగా మారుతుంది. సాంకేతిక దన్నుతో ఎదిగిన యూపీఐ, పీఎం గతి శక్తి, ఓఎన్డీసీ వంటివి ఇందుకు మేలిమి తార్కాణాలు. ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందడం మాత్రమేకాదు ఒక శక్తిగా అవతరిస్తోంది. పేదరికం వంటి సవాళ్లు ఉన్నాయని తెలుసు. త్వరితగతిన నూతన విధాననిర్ణయాలను అమలుచేస్తూ సంస్కరణలు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారు ‘‘మానవాళి చరిత్రలో 21 శతాబ్దపు ఈ కాలం ఎంతో ముఖ్యమైంది. సమస్యలను పరిష్కరించుకుంటూనే సుస్థిరాభివృద్ధిని సాధించాలి. మానవాళికి మెరుగైన భవిష్యత్తు అవసరం. అందుకోసం భారత్ పాటుపడుతోంది. దేశంలో గత ఆరుదశాబ్దాల్లో తొలిసారిగా వరుసగా మూడుసార్లు ఒకే ప్రభుత్వానికి ప్రజలుపట్టంకట్టారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారని హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ రుజువుచేశాయి. మూడోదఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేం రూ.9 లక్షల కోట్ల విలువైన మౌలికవసతుల ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ 125 రోజుల్లో స్టాక్‌మార్కెట్ సైతం ఆరేడు శాతం వృద్ధిని చూపిస్తోంది’’ అని మోదీ అన్నారు. మోదీ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ సదస్సులో మాట్లాడారు. ‘‘ బ్రిటన్‌లో మార్గరేట్ థాచర్, టోనీ బ్లెయిర్ కాలం నుంచి చూసినా మా దేశంలో ఎవరూ మూడోసారి ప్రధాని కాలేదు. మీరు(మోదీ) మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు’’ అని కామెరూన్ పొగిడారు. -
మరో మీడియా సంస్థను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్ఎస్లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
9 భాషల్లో ఎన్డీటీవీ న్యూస్ ఛానల్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో భాగమైన మీడియా దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) తొమ్మి ది భారతీయ భాషల్లో న్యూస్ ఛానల్స్‌ను మొదలుపెట్టే యోచనలో ఉంది. దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సంస్థ తెలియజేసింది. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. అనుమతులు వచ్చాక చానళ్ల ప్రారంభ తేదీలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల వాటాలను కూడా కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గతేడాది డిసెంబర్లో కంపెనీని పూర్తిగా దక్కించుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్డీటీవీ రూ. 221 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
'రావడం అంత ఈజీ కాదు; అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం'
రింకూ సింగ్.. ఇప్పుడొక సంచలనం. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ రింకూ సింగ్‌ను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసేసింది. ఎంతలా అంటే రెండు రోజుల నుంచి రింకూ సింగ్ ఇంకా ట్విటర్లో ట్రెండింగ్ లిస్ట్‌లోనే కనబడేంతలా. ఒక్క మ్యాచ్ అతని దశను మారుస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. Photo: IPL Twitter తాజాగా ఎన్డీటీవీకి రింకూ సింగ్ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్య్వూలో అతను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. మేము సంపాదించడం మొదలెట్టాకా కూడా నాన్న తన సొంతకాళ్లపై నిలబడడానికే ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నాడు. క్రికెటర్ కాకముందు కుటుంబం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. దేవుడి దయ వల్ల ఇప్పుండంతా బాగానే ఉందని తెలిపాడు. ''నా కుటుంబం సంతోషంగా ఉండడం కోసం ఎంతో చేస్తున్నా. గతంలో ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయాయి. మేము ఎదిగాకా నాన్నను జాబ్ మానేయాలని చెప్పాం. ఆయన 30 ఏళ్లుగా ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కానీ ఆయన తన సొంతకాళ్లమీదే బతకాలని నిర్ణయించుకొని జాబ్ వదలడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇక కెరీర్లో ఎదగకముందు సోదరుడితో కలిసి నాన్నతో వెళ్లి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవాళ్లం. Photo: IPL Twitter నాన్నకు నేను క్రికెట్ ఆడడం ఇష్టం ఉండేది కాదు. నాకు డబ్బు కావాలంటే నాన్నతో పాటు వెళ్లి సిలిండర్లు వేసేవాడిని. కానీ ఇంట్లో అమ్మ ఇచ్చిన సపోర్ట్‌తో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టడం చాలా కష్టం. ముందు మనల్ని మనం డొమొస్టిక్ క్రికెట్లో నిరూపించుకోవాల్సిందు. గత 6-7 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. కేకేఆర్ ఫ్రాంచైజీ నన్ను నమ్మి అవకాశమిచ్చింది. దానిని నిలబెట్టుకుంటా'' అని పేర్కొన్నాడు. ఇక రింకూ సింగ్ తమ్ముడు కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన రింకూ సింగ్ తమ్ముడు జిల్లా స్తాయి క్రికెట్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇక ఐపీఎల్లో రింకూ సింగ్ ఇప్పటివరకు 20 మ్యాచ్‌లాడి 349 పరుగులు సాధించాడు. #NDTVExclusive | "Family Was In Debt, Problems Over Now," KKR Hero Rinku Singh Tells NDTV pic.twitter.com/m6BF1pPMpo — NDTV Videos (@ndtvvideos) April 11, 2023 చదవండి: RCB Vs LSG: మ్యాచ్ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా! 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? -
సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు
వెల్స్పన్ ఇండియా సీఈవో సోషల్ మీడియా స్టార్ దిపాలి గోయెంకా ఎన్డీటీవీ స్వత్రంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సెబీ మాజీ ఛైర్మన్ యూకే సిన్హాతో పాటు మార్చి 27, 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా దిపాలి ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీంతో ఫోర్బ్స్ ఆసియా అండ్ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందిన దిపాలి గోయెంకా ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరీ దిపాలి గోయెంకా ? ప్రపంచంలోని అతిపెద్ద గృహ వస్త్ర కంపెనీలలో ఒకటైన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సీఎండీ టెక్స్టైల్ మాగ్నెట్ దిపాలి గోయెంకా సైకాలజీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. దిపాలి గోయెంకా భర్త బీకే గోయెంకా వెల్స్పన్ గ్రూప్ చైర్మన్. 18 సంవత్సరాల వయస్సులో బీకే గోయెంకాను వివాహం చేసుకున్నారు దిపాలి. బీకే గోయెంకా ఇటీవల ముంబైలో రూ.240 కోట్లతో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఇంటి విలువ రూ.150 కోట్లు కావడంతో ఆ ఇంటి విలువ రతన్ టాటా ఇంటి కంటే ఖరీదైన ఇల్లుగా నిలిచింది. రూ.19 వేల కోట్ల కంపెనీకి సీఎండీగా రూ. 19000 కోట్ల కంపెనీకి సారధి, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలి గోయెంకా సోషల్ మీడియా స్టార్ కూడా. ఆమె ట్విటర్, ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 191కే ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె స్టార్ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వెల్స్పన్ గ్రూప్‌లో 25వేల ఉద్యోగులతో 2.3 బిలియన్ల డాలర్ల ఆదాయంతో టాప్ టెక్స్టైల్ కంపెనీగా దూసుకుపోతోంది. ఇన్నోవేషన్, బ్రాండ్స్ అండ్ సస్టైనబిలిటీపై దృష్టి సారించి వెల్స్పన్ హోమ్ టెక్స్టైల్ వ్యాపారాన్ని బిలియన్ డాలర్లతో ప్రపంచస్థాయికి చేర్చడంలో ఆమెది కీలక పాత్ర. అసోచామ్ ఉమెన్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన దిపాలీ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఉన్నారు. చిన్నతనంలోనే పెళ్లి సాంప్రదాయ మార్వాడీ నేపథ్యం నుండి వచ్చిన తనకు సాధారణంగానే చిన్న వయస్సులో పెళ్లి అయిందని, అయినా మరింత నేర్చుకోవాలనే పట్టుదలతో దేన్నీ ఆపలేదని చెప్పారు. తన కుమార్తెలకు 10, 7 ఏళ్లు నిండిన తర్వాత తిరిగి కరియర్ మీద దృష్టిపెట్టినట్టు స్వయంగా దిపాలి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డిజైన్ స్టూడియోతో ప్రారంభించి, 2003లో, దిపాలి గోయెంకా స్పేసెస్, ప్రీమియం బెడ్ అండ్ బాత్ బ్రాండ్‌ను ప్రారంభించారు. తనకెదురైన ప్రతీ చాలెంజ్‌ను ఒక అవకాశంగా తీసుకొని ఎదిగారు. సీఈవో విత్ సోల్ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2016, ఆగస్టు ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ సరఫరా చేసిన ప్రీమియం ఈజిప్షియన్ కాటన్ షీట్లు చౌకగా ఉన్నాయనే ఆరోపణలతో అమెరికన్ రిటైలర్ టార్గెట్ వెల్స్పన్ ఇండియాతో అన్ని డీల్స్‌ను ముగించింది. అపుడు వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేలా సాహసంగా ముందుకు సాగారు. ప్రస్తుతం వెల్స్పన్ ఇండియా అమెరికాకు బెడ్ అండ్ బాత్, రగ్గు ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు. కస్టమర్-ఫస్ట్ అప్రోచ్ సూత్రాన్ని ఫాలో అయ్యే దిపాలి కూడా దాతృత్వంలో కూడా ముందే ఉన్నారు. అందుకే తన ప్రొఫైల్ బయోలో సీఈవో విత్ సోల్ రాసుకున్నారామె. -
అదానీ పవర్‌పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్‌ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్‌ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్‌లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్‌లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
అదానీ గ్రూప్ గూటిలో ఎన్డీటీవీ
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ తాజాగా 27.26 శాతం వాటాను సొంతం చేసుకుంది. వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ వాటా 64.71 శాతానికి ఎగసింది. వెరసి ఎన్డీటీవీపై పూర్తి నియంత్రణను సాధించింది. గత వారం రాయ్ జంట తమకుగల 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్డీటీవీలో రాయ్‌లకు సంయుక్తంగా 32.26 శాతం వాటా ఉంది. తాజా లావాదేవీ తదుపరి రాయ్‌ల వాటా(2.5 % చొప్పున) 5 శాతానికి పరిమితమైంది. షేరుకి రూ. 342.65 ధరలో 1.75 కోట్ల షేర్లను చేజిక్కించుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. మైనారిటీ వాటాదారులకు చెల్లించిన(ఓపెన్ ఆఫర్) ధరతో పోలిస్తే ఇది 17 శాతం అధికంకాగా.. తద్వారా రాయ్ జంట రూ. 602 కోట్లు అందుకుంది. అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ద్వారా వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. రాయ్‌ల రాజీనామాలు యాజమాన్య నియంత్రణ పూర్తిస్థాయిలో చేతులు మారిన నేపథ్యంలో వ్యవస్థాపకులు ప్రణవ్ రాయ్, రాధికా రాయ్‌సహా మరో నలుగురు డైరెక్టర్లు బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అంతేకాకుండా కనీస వాటా మాత్రమే మిగిలిన మాజీ ప్రమోటర్లు కంపెనీలో తమను పబ్లిక్ కేటగిరీ వాటాదారులుగా పరిగణించమంటూ బోర్డుని అభ్యర్థించారు. ఇందుకు బోర్డు అనుమతించగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, వాటాదారులు ఆమోదముద్ర వేయవలసి ఉన్నట్లు ఎన్డీటీవీ తెలియజేసింది. బోర్డు నుంచి తప్పుకున్న డైరెక్టర్లలో డారియస్ తారాపోర్వాలాతోపాటు, స్వతంత్ర డైరెక్టర్లు కౌశిక్ దత్తా, ఇంద్రాణి రాయ్, జాన్ మార్టిన్ ఓలోన్ ఉన్నారు. ఇప్పటివరకూ ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కోచైర్పర్శన్ పదవిలో ఉన్న విషయం విదితమే. మరోవైపు అమన్ కుమార్ సింగ్‌ను నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా, సునీల్ కుమార్‌ను స్వతంత్ర నాన్‌ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు 2.6% లాభపడి రూ. 348 వద్ద ముగిసింది. -
ఎన్డీటీవీపై అదానీ పట్టు
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించనుంది. మీడియా సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 5 శాతం మినహా మిగిలిన తమ వాటాను విక్రయించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందుకు అదానీ గ్రూప్ దాదాపు రూ. 648 కోట్లు వెచ్చించనుంది. దేశీయంగా అతిపెద్ద, తొలి ప్రయివేట్ రంగ వార్తా చానళ్ల సంస్థ ఎన్డీటీవీని ఏర్పాటు చేసిన రాయ్ దంపతుల వాటాను ఇటీవల అదానీ గ్రూప్ అధిగమించిన సంగతి తెలిసిందే. రాయ్‌ల సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో తొలుత 29.18% వాటాను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మరికొంత వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఎన్డీటీవీలో అదానీ వాటా 37.44% కాగా.. రాయ్‌ల వాటా 32.26%. దీనిలో 27.26% వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనుంది. ఈ వాటాను ఈ నెల 30 తదుపరి ఒకేసారి లేదా దశలవారీగా విక్రయించనున్నట్లు ఎన్డీటీవీ ఎక్ఛ్సేంజీలకు సమాచారమిచ్చింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 69.71%కి జంప్చేయనుంది. రాయ్ వాటా విక్రయ వార్తలతో ఎన్డీటీవీ షేరు 2.5% బలపడి రూ.340 వద్ద ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఎలా ఉంటే స్వతంత్రత?
జర్నలిజంలో సాహసం అంటే, ఆ పదం ప్రభుత్వానికి విరోధిగా ఉండాలన్న ఒత్తిడి చేస్తుంది. అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాలి. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే మదింపు చేయాలి. ప్రభుత్వాన్ని పొగడటం చాలా సులభం. కానీ విమర్శించడమే కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందుకొస్తాయి. ఎన్డీటీవీ ఛానల్లో గౌతమ్ అదానీ మెజారిటీ వాటాదారుగా మారిన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఛానల్‌ను స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాథమికంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. అయితే మీడియా స్వాతంత్య్రం పట్ల ఆయన అభిప్రాయాలను బట్టి దీన్ని చూడాల్సి ఉంటుంది. భారతదేశంలోని 400 వార్తా ఛానల్స్‌లో నేను ఎక్కువగా చూసేది ఎన్డీటీవీ. అయితే తరచుగా దానిలో వచ్చే అంశాల పట్ల, ఆ ఛానల్ యాంకరింగ్ పట్ల నేను విమర్శనాత్మకంగా ఉంటున్నప్పటికీ, అదే సమయంలో ఆ రెండింటినీ ఆరాధిస్తుంటాను. కాబట్టే ఛానల్‌ని గణనీయంగా మార్చేసే అధికారంతో అతి త్వరలో గౌతమ్ అదానీ ఎన్డీటీవీ మెజారిటీ వాటాదారుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇది మనకు తెలిసిన రూపంలోని ఎన్డీటీవీకి ముగింపు పలకనుందా? ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అదానీ తన భవిష్యత్ పథకాల గురించి మాట్లాడారు. నాకు తెలిసి నంతవరకూ, ఆయన ఈ ఒక్కసారి మాత్రమే ఈ విషయం మీద ఇలా మాట్లాడారు. ఎన్డీటీవీని స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు చెప్పారు. ప్రాథమి కంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. కానీ అది నిజమేనా? మిగిలిన ఇంటర్వ్యూ విశ్వసనీయ సందేహాల కోసం మంచి కారణాలనే ప్రతిపాదిస్తుంది. మీడియా స్వతంత్రతపై అదానీ భావన నుంచి అవి పుట్టుకొస్తున్నాయి. ‘‘స్వాతంత్య్రం అంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని నువ్వు చెప్పడం అన్నమాట. ఎవరూ దానిపై తగవులాడరు. కానీ అదే సమయంలో, ప్రభుత్వం ప్రతిరోజూ సరైన పని చేస్తున్నప్పుడు దాని గురించి చెప్పే సాహసం నీకు ఉండాలి’’ అని అదానీ జోడించారు. ప్రతిరోజూ మంచి పని చేస్తున్న ప్రభుత్వం ఏది? అలాంటి ప్రభుత్వం ఏదీ నాకు తెలీదు. అలాంటి పనిని గుర్తించడానికి మీకు సాహసం ఎందుకు కావాలి? ఆ పదం జర్నలిజపు విస్తృత సముదాయాన్ని బట్టి మిమ్మల్ని కేవలం విరోధిగా మాత్రమే ఉండాలని ఒత్తిడి చేస్తుంది. కానీ అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే వారు మదింపు చేయవలసి ఉంటుంది. ఒక పక్షం వహించకూడదు లేదా తటస్థంగా కూడా ఉండకూడదు. ప్రభుత్వాన్ని పొగడటం నిజానికి చాలా సులభం. వారు దాన్ని ఇష్టపడతారు కూడా. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే చాలా కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందు కొస్తాయి. మీడియా స్వాతంత్య్రానికి సంబంధించిన అదానీ భావన దీన్ని స్వీకరిస్తుందని నేను చెప్పలేను. ఆయన పదజాలం అలా స్వీకరించదనే సూచిస్తుంది. అయినప్పటికీ అదానీకి ఎన్డీటీవీ కోసం పెద్ద పథకాలే ఉన్నాయి. ఆ ఛానల్‌కి అంతర్జాతీయ పాదముద్రను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ లేదా ‘అల్ జజీరా’తో సరిపోల్చే స్థాయిలో భారతదేశానికి ఒక్క మీడియా సంస్థ కూడా లేదని కూడా ఆయన అన్నారు. ఇది రెండు విషయాలను సూచి స్తోంది. అదానీ ఎన్డీటీవీలో చాలా పెట్టుబడి పెట్టబోతున్నారు. బహుశా ఆయన ఆ ఛానల్ విశ్వసనీయతను కాపాడవచ్చు. ఎందు కంటే అలా కాపాడకపోతే, ఫైనాన్షియల్ టైమ్స్, అల్ జజీరా స్థాయిని అది సాధించలేదు మరి!. ఇక్కడ సమస్య ఏమిటంటే, మీడియా స్వాతంత్య్రంపై ఆయన భావనతో ఈ ప్రశంసించదగిన ఆకాంక్ష ఘర్షణ పడుతోంది. పైగా, ఇది ఆయనను ఒక భయంకరమైన సందిగ్ధంలో ఉంచుతోంది. లేదా రెండు సందిగ్ధాలు అని కూడా చెప్పవచ్చు. ఎన్డీటీవీ ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వ ప్రచార అంగంగా మాత్రమే చూస్తారు. అప్పుడు అది ఫైనా న్షియల్ టైమ్స్, అల్ జజీరా స్థాయికి ఎన్నటికీ పెరగలేదు. అదానీకి అర్థం కానిది ఏమిటంటే, విమర్శనాత్మకంగా ఉండే దాని వస్తు గతతత్వం, సాహసమే ఫైనాన్షియల్ టైమ్స్‌ని గొప్ప పత్రికగా మలిచిందన్నదే! అల్ జజీరా విషయంలో కూడా ఇది నిజమే. కాక పోతే ఖతార్‌లో తన సొంత ప్రభుత్వ వార్తలను కవర్ చేసే విషయంలో మాత్రం ఇది నిజం కాకపోవడం విషాదం. మరొకటి జరగవచ్చు. ఎన్డీటీవీని గ్లోబల్‌గా మార్చడానికి తగి నంత డబ్బు అదానీ వద్ద ఉంది. దాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకూ చేరుకోగలిగే ఉపగ్రహాలపై అదానీ వెచ్చించగలరు. అయితే ఆ టీవీ ఛానల్ విశ్వసనీయతనే నిర్లక్ష్యం చేసినప్పుడు ఎవరైనా దాన్ని చూడగలరా? బహుశా తాము వదిలిపెట్టి వెళ్లిన గడ్డ గురించి ఇప్పటికీ బాధపడుతున్న, పూర్తిగా స్వదేశంలో లేని కొద్దిమంది ప్రవాస భారతీయులు మాత్రమే ఆ ఛానల్‌ని చూడవచ్చు తప్ప మరెవరూ చూడబోరు. అదానీ చెప్పని మరో విషయం ఉంది. కానీ తన కొత్త ఛానల్ కోసం తన మనస్సులో ఉన్న ఏ విషయానికైనా నిజానికి అది కీలకమైంది. ఎన్డీటీవీకి విశిష్టమైన స్వభావం, విశ్వసనీయమైన వీక్షకులు, అత్యంత అధిక ప్రతిష్ఠ ఉన్నాయి. ఈ ఛానల్‌ని కొనడానికి వందలాది కోట్లు వెచ్చించిన తర్వాత (దాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి వేల కోట్లు కూడా వెచ్చించవచ్చు) దాని ప్రతిష్ఠను దిగజార్చి నష్టం కలిగించేలా మార్పులు చేపట్టగలరా? అందుచేత ఆ ఛానల్ ఉత్తమ యాంకర్లు, కరెస్పాండెంట్లను ఆయన అట్టిపెట్టు కోవచ్చు. వీరే లేకుంటే ఎన్డీటీవీ ఉత్త హార్డ్‌వేర్ లాగా మాత్రమే ఉంటుంది. కానీ వారి వస్తుగత పనితత్వాన్ని, వారి వాక్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసినట్లయితే వారు సంస్థలో కొనసాగుతారా? బహుశా, ఇదే ఆయన ఆలోచనలను కాస్త పదును పెట్టవచ్చు. సంస్థ నుంచి వెళ్లిపోయేవారి స్థానంలో కొత్త జర్నలిస్టులను నియమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ మంచి జర్న లిస్టులను వెతకడమే చాలా కష్టమైన పని. అలాంటివారు ఇప్పటికే చక్కటి వేతనాలతో సురక్షిత స్థానాల్లో ఉండవచ్చు. తమకు సుపరిచితం కాని వ్యవహారంలోకి అడుగుపెట్టి వారు తమను తాము ఎందుకు బలిపెట్టుకుంటారు?. - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
ఎన్డీటీవీలో అదానీ పైచేయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో భాగంగా ఇన్వెస్టర్లు 53.27 లక్షల షేర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎన్డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను పొందిన అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల షేర్ల కొనుగోలుకి సిద్ధపడింది. శుక్రవారం(2న) ముగింపు ధర రూ. 415తో పోలిస్తే ఆఫర్ ధర 41 శాతం తక్కువకాగా.. షేర్ల కొనుగోలు నేడు(5న) ముగియనుంది. కార్పొరేట్ ఇన్వెస్టర్లు సై ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కార్పొరేట్ ఇన్వెస్టర్లు 39.34 లక్షల షేర్లు, రిటైలర్లు 7 లక్షలకుపైగా, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) 6.86 లక్షల షేర్లు చొప్పున టెండర్ చేశారు. ఇవి ఆఫర్లో 32 శాతంకాగా.. 8.26 శాతం వాటాను అదానీ గ్రూ ప్ సొంతం చేసుకోనుంది. వెరసి ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి బలపడనుంది. తద్వారా ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణవ్ రా య్, ఆయన భార్య రాధికా రాయ్‌ల సంయుక్త వా టా 32.26 శాతాన్ని మించనుంది. దీంతో చైర్మన్ పదవికి అదానీ గ్రూప్ అభ్యర్థిని నియమించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైర్మన్సహా ఇద్దరు డైరెక్టర్లను నియమించవచ్చని తెలియజేశాయి. ప్రస్తుతం ఎన్డీటీవీకి ప్రణవ్ రాయ్ (15.94 శాతం వాటా) చైర్‌పర్శన్‌గా, రాధిక(16.32 శాతం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాటాల రీత్యా వీరిరువురూ డైరెక్టర్లుగా కొనసాగేందుకు వీలుంది. -
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్‌లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్‌కు స్పందన బాగానే లభిస్తోంది -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌కు స్పందన
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లో భాగంగా మూడో రోజు గురువారాని(24)కల్లా దాదాపు 28 లక్షల ఎన్డీటీవీ షేర్లు టెండరయ్యాయి. ఎన్డీటీవీ వాటాదారుల నుంచి 1.67 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలుకి అదానీ గ్రూప్ షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. ఆఫర్ డిసెంబర్ 5న ముగియనుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆఫర్లో 16.54 శాతానికి సమానమైన 27,72,159 షేర్లు లభించాయి. అయితే గురువారం బీఎస్ఈలో ఎన్డీటీవీ షేరు ఆఫర్ ధరతో పోలిస్తే 25 శాతం అధికంగా రూ. 368కు ఎగువన ముగియడం గమనార్హం! క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించిన విషయం విదితమే. వెరసి ఎన్డీటీవీలో 26 శాతం అదనపు వాటాకు అదానీ గ్రూప్ రూ. 493 కోట్లు వెచ్చించనుంది. దశాబ్దకాలం క్రితం ఎన్డీటీవీకి రూ. 400 కోట్ల రుణాలు సమకూర్చిన వీసీపీఎల్ ఇందుకుగాను వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్ ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు నిర్ణయించింది. తద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్డీటీవీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. -
ఎన్డీటీవీకి అదానీ ఆఫర్ షురూ
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ ఎన్డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 294 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ నెల 22న ప్రారంభమై డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించింది. దశాబ్దంక్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. తద్వారా న్యూస్గ్రూప్ సంస్థలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఫలితంగా అక్టోబర్ 17న వాటాదారుల నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే సెబీ నుంచి అనుమతులు ఆలస్యంకావడంతో తాజాగా ఇందుకు తెరతీసింది. వెరసి షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల ఎన్డీటీవీ ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఆఫర్‌కు పూర్తి స్పందన లభిస్తే రూ. 492.81 కోట్లు వెచ్చించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ 23 శాతం తక్కువ! చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
’అదానీ–ఎన్డీటీవీ’ ఓపెన్ ఆఫర్‌కు సెబీ ఓకే
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాల కోసం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఓపెన్ ఆఫర్ నవంబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 5తో ముగియనుంది. షేరు ఒక్కింటికి రూ. 294 రేటుతో ఈ ఆఫర్ పరిమాణం రూ. 492.81 కోట్లుగా ఉండనుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు దశాబ్దం క్రితం రూ. 400 కోట్ల రుణం ఇచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో పరోక్షంగా 29.15 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాల కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం ఎన్డీటీవీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి బీఎస్ఈలో రూ. 366 వద్ద క్లోజయ్యాయి. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే. -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాలను కొనుగోలు చేసే దిశగా ఓపెన్ ఆఫర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓపెన్ ఆఫర్ లెటర్ ముసాయిదాను పరిశీలించి, అభిప్రాయాలు తెలపాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలిచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్) అనే సంస్థను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 29.18 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 17న ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు అప్పట్లో వీసీపీఎల్ తెలిపింది. కానీ డీల్‌పై ఎన్డీటీవీ ప్రమోటర్ అయిన ఆర్ఆర్పీఆర్ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి కారణంగా సాధ్యపడలేదని తాజాగా పేర్కొంది. ఓపెన్ ఆఫర్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 294 చొప్పున దాదాపు 1.67 కోట్ల షేర్లను (26 శాతం) వీసీపీఎల్ కొనుగోలు చేస్తుందంటూ ఇష్యూని నిర్వహిస్తున్న జేఎం ఫైనాన్షియల్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని బట్టి ఓపెన్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 1న ముగియాలి. మరోవైపు, బుధవారం ఎన్డీటీవీ షేరు రూ. 332.90 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. -
ఎందుకు? ఐటీ అనుమతి అవసరంలేదు..ఎన్డీటీవీ వాటాపై అదానీ గ్రూప్!
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో వాటా కొనుగోలుకి ఆదాయపన్ను(ఐటీ) శాఖ అనుమతి అక్కర్లేదని భావిస్తున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటా కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని తెలియజేసింది. ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌కు దశాబ్దంక్రితం వీసీపీఎల్ రూ. 403 కోట్ల రుణాలిచ్చింది. తదుపరి వీసీపీఎల్‌ను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్పీఆర్కు అందించిన రుణాలకుగాను ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకోగల వారంట్లను వీసీపీఎల్ పొందింది. ఇటీవల ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకుంటున్నట్లు వెల్లడించింది. తద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.5 శాతం వాటాను వీపీసీఎల్ పొందనుంది. వెరసి ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. అయితే ఇందుకు ఐటీ అధికారుల అనుమతి అవసరమంటూ ఎన్డీటీవీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. చదవండి👉 అదానీకే ‘లంక’ ప్రాజెక్ట్‌లు! -
ఎన్డీటీవీ వాటా కొనుగోలు: కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్‌కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్‌ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది. చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్ఆర్పీఆర్ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. -
అదానీ దూకుడు, ఓపెన్ ఆఫర్ డేట్ ఫిక్స్, షేర్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీగ్రూప్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి తన ఓపెన్ ఆఫర్‌ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది.1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలుకు సంబంధించిన ఈ ఓపెన్ ఆఫర్లో ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించిందని జేఎం ఫైనాన్షియల్ ప్రకటించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ అనుబంధ సంస్థల ద్వారా బహుళ-లేయర్డ్ లావాదేవీలతో ఎన్డీటీవీలో మొత్తం 55శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్, మీడియా సంస్థలో 29.18వాటాను కొనుగోలు చేయాలనే గ్రూప్ ప్రణాళికలకు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్ కోసం తాత్కాలిక ప్రారంభ తేదీగా అక్టోబర్ 17ని నిర్ణయించింది.ఇష్యూకు మేనేజర్ జేఎం ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఆఫర్ తాత్కాలికంగా నవంబర్ 1న ముగియనుంది. ఓపెన్ ఆఫర్‌కు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్లో పూర్తి అంగీకారం ఉందని భావించి, కొనుగోలుదారు, ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 26శాతం వరకు పొందవలసి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 294 ధరతో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే, ఓపెన్ ఆఫర్ మొత్తం రూ. 492.81 కోట్లుగా ఉంటుంది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కాగా ఆగస్టు 23న, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌లో 99.99 శాతం వాటాను కలిగి ఉన్న విశ్వప్రధాన కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్‌లో భాగమైన వీపీసీఎల్ వాటా తీసుకున్నామని వివరించింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్, ఏఎంఎన్ఎల్, ఏఈఎల్ కలిసి ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Share Pledging Case: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!) -
అదానీ బిడ్‌పై సెబీకి ఎన్డీటీవీ.. స్పష్టత కోరిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్
న్యూఢిల్లీ: బలవంతపు టేకోవర్ సవాళ్లు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఆశ్రయించింది. వీసీపీఎల్‌కు జారీ చేసిన వారంట్లను ఈక్విటీగా మార్పుచేసే అంశంపై స్పష్టత కోసం ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ లిమిటెడ్ సెబీని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్ఆర్పీఆర్ తాజా చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. వారంట్ల ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.5 శాతం వాటాను వీసీపీఎల్ పొందనుంది. తద్వారా ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. కాగా.. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లను 2020 నవంబర్ 27న సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ నిషేధం ఇంకా కొనసాగుతున్నందున వారంట్లను ఈక్విటీగా మార్పు చేసేందుకు ఆర్ఆర్పీఆర్ సెబీ నుంచి స్పష్టతను కోరుతోంది. షేరు జూమ్ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ కౌంటర్‌కు కొద్ది రోజులుగా డిమాండ్ పెరిగింది. దీంతో మరోసారి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 21 బలపడి రూ. 449 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నాలుగు వారాల్లో ఈ షేరు రూ. 263 నుంచి 70 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 186 లాభపడింది. -
ఎన్డీటీవీ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
సెబీ అనుమతిపై ఎన్డీటీవీ ప్రమోటర్లకు అదానీ కౌంటర్
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతులు అవసరంలేదని అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఆర్ఆర్పీఆర్ లేవనెత్తిన అంశాలు నిరాధారమని, న్యాయపరంగా ఆమోదనీయంకావని, సత్యదూరాలని వ్యాఖ్యానించింది. దీంతో వెనువెంటనే వారంట్ల స్థానే ఈక్విటీల కేటాయింపునకు డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఆర్ఆర్పీఆర్కు ఇచ్చిన రుణాలకుగాను పొందిన వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ నిర్ణయించడం తెలిసిందే. తద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థలో 99.5% వాటాను పొందనుంది. ఫలితంగా ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను సొంతం చేసుకోనుంది. కాగా నవంబర్ 2020లో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ తన ప్రమోటర్లను షేర్లను కొనడం లేదా విక్రయించకుండా రెండేళ్లపాటు నిషేధించిందని, అందువల్ల నవంబర్ వరకు వీసీపీఎల్‌కు షేర్లను బదిలీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్న ఎన్డిటివి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌పై అదానీ గ్రూప్ స్పందించింది. -
సెబీ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన ప్రమోటర్ల వాటా కొనుగోలుకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అంటూ వార్తా చానళ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా స్పష్టం చేసింది. చెల్లించని రుణాలస్థానే ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ లిమిటెడ్‌లో వాటాను చేజిక్కించుకునేందుకు వీసీపీఎల్.. సెబీ అనుమతి పొందవలసి ఉన్నట్లు పేర్కొంది. 2020 నవంబర్ 27న కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్‌లను సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. తద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోలు, విక్రయం లేదా సెక్యూరిటీల మార్కెట్లలో ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ నిషేధం 2022 నవంబర్ 26న ముగియనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎన్డీటీవీ వివరించింది. దీంతో గడువుకంటే ముందుగానే ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరిగా తెలియజేసింది. మంగళవారం వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించిన విషయం విదితమే. వారెంట్ల నిబంధనలు కీలకం ఎన్డీటీవీ బలవంతపు టేకోవర్‌కు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలలో వారెంట్ల జారీలో చోటుచేసుకున్న నిబంధనలు కీలకంగా నిలవనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్‌నకు చెందిన వీసీపీఎల్ నుంచి వారెంట్ల జారీ ద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ గతంలో దాదాపు రూ. 404 కోట్ల రుణాలు పొందింది. వీటిని ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.9 శాతం వాటాను పొందినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. వెరసి ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమోటర్లకు ఈ విషయం తెలియదంటూ ఎన్డీటీవీ పేర్కొంది. దీంతో వారెంట్ల జారీలో అంగీకరించిన నిబంధనలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. రేటింగ్‌పై ఎఫెక్ట్... బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా భారీగా విస్తరిస్తోంది. అయితే రుణాల ద్వారా చేపడుతున్న ఈ కొనుగోళ్లు కంపెనీ రేటింగ్‌పై ఒత్తిడిని పెంచుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. 1988లో కమోడిటీల ట్రేడర్‌గా ప్రారంభమైన గ్రూప్ మైనింగ్, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు తదితర పలు రంగాలలో భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇటీవలే సిమెంట్ రంగంలో 10.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లకు తెరతీసింది. -
అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!
అటు సంపదలోనూ, ఇటు విభిన్న వ్యాపార విస్తరణలోనూ పోటీ పడుతున్న కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తాజాగా మీడియా విభాగంలోనూ సై అంటున్నారు. రుణాలను ఈక్విటీగా మార్పు చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో 29 శాతానికిపైగా వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. మెజారిటీ వాటాపై కన్నేసింది. ఇప్పటికే బ్రాడ్‌క్యాస్టింగ్ సంస్థ నెట్వర్క్ 18ను ముకేశ్ అంబానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే!! న్యూఢిల్లీ: వార్తా చానళ్ల మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్(ఎన్డీటీవీ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 4 ముఖ విలువగల దాదాపు 1.68 కోట్ల షేర్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకంటే ఆఫర్ ధర అధికమని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఎన్ఎస్ఈలో ఎన్డీటీవీ షేరు సోమవారం ముగింపు ధర రూ. 359కాగా.. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం షేరుకి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి (రూ. 18 లాభపడి) రూ. 377 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఓపెన్ ఆఫర్ ధర కంటే 28% అధికం! 55 శాతానికి ఎన్డీటీవీలో వారంట్ల మార్పిడి ద్వారా అదానీ గ్రూప్ దాదాపు 30% వాటాను సొంతం చేసుకుంది. దీంతో పబ్లిక్ నుంచి మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ విజయవంతమైతే ఎన్డీటీవీలో 55%పైగా వాటాను అదానీ గ్రూప్ పొందే వీలుంది. ఏఎంజీ మీడియా నెట్వర్క్స్కు పూర్తి అనుబంధ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేట్ లిమిటెడ్(వీసీపీఎల్) వారంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్‌లో 99.5% వాటాను చేజిక్కించుకుంది. దీంతో ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను పొందింది. ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్పీఆర్. వెరసి వీసీపీఎల్‌తో పాటు అదానీ మీడియా నెట్వర్క్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉమ్మడిగా ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాయి. 26% వాటాకు సమానమైన 1,67,62,530 షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు సంస్థలో సంయుక్తంగా 32.26% వాటా ఉంది. కాగా.. అదానీ గ్రూప్ రూ. 114 కోట్లకు కొనుగోలు చేసిన వీసీపీఎల్ గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ సంస్థ కావడం కొసమెరుపు! మాతో చర్చించ లేదు వారంట్ల మార్పిడి ద్వారా ఆర్ఆర్పీఆర్లో వాటా చేజిక్కించుకున్న విషయంపై ప్రమోటర్లతో వీసీపీఎల్ చర్చించలేదు. అనుమతి కోరలేదు. ఈ విషయం వీసీపీఎల్ జారీ నోటీసు ద్వారా ఈరోజే ప్రమోటర్లకు తెలిసింది. వాటా విక్రయించేందుకు ప్రమోటర్లు ఎవరితోనూ చర్చించడంలేదు’. – ఎన్డీటీవీ -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్‌లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట!
Gautham Adani And NDTV Issue: తమ టీవీ ఛానల్ యాజమాన్య మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిరాధరామైనవని ఎన్డీటీవీ ప్రకటించింది. ఎన్డీటీవీ అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం కానీ, గతంలో కానీ ఎవరితో చర్చలు జరగలేదని ఆ టీవీ ఛానల్ ఫౌండర్లు, మేజర్ షేర్ హోల్డర్లయిన ప్రణయ్‌రాయ్, రాధికలు ప్రకటించారు. రిలయన్స్‌కి పోటీగా పోర్టుల బిజినెస్‌లో దూసుకుపోతున్న అదాని గ్రూపు ఇటీవలే గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీలో భారీ లక్ష్యాలను రిలయన్స్ గ్రూపు ప్రకటించిన కొద్ది రోజులకే అదానీ గ్రూపు నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రకటన వెలువడింది. తాజాగా అదే పరంపరలో రిలయన్స్ తరహాలోనే బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ మీడియా రంగంలో అడుగు పెడుతున్నారంటూ గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెరపైకి సీనియర్ జర్నలిస్ట్ ఇటు బిజినెస్, అటు పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే పలు మీడియా సంస్థల్లో ఉన్నత హోదాలో పని చేసిన సీనియర్ జర్నలిస్టు సంజయ్ పుగాలియా ఇటీవల అదానీ గ్రూపులో చేరారు. దీంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. పెరిగిన షేర్ల ధర మీడియా రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్న గౌతమ్ అదానీ ఎన్డీటీవీని కొనబోతున్నట్టు బిజినెస్ సర్కిళ్లలో ప్రచారం జరిగింది. రెండు రోజుల్లోనే ఈ ప్రచారం ఊపందుకోవడంతో ఒక్కసారిగా షేర్ మార్కెట్లో ఎన్డీటీవీ షేర్లు పది శాతం మేర పెరిగాయి. అంతా వదంతులే ప్రభుత్వం విధానాల్లో లోపాలను ఎత్తి చూపడంతో ఎన్డీటీవీది ప్రత్యేక శైలి. అలాంటి ఛానల్ యాజమాన్య మార్పులకు లోనవుతుందంటూ జరుగుతున్న ప్రచారం పెరిగిపోవడంతో ఆ టీవీ ఫౌండర్లు స్పందించారు. తమ ఛానల్ అమ్మడం లేదంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు... పుకార్లను కొట్టి పారేశారు. చదవండి : హైడ్రోజన్ ఉత్పత్తిలోకి అదానీ