Photo: IPL Twitter
రింకూ సింగ్.. ఇప్పుడొక సంచలనం. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ రింకూ సింగ్‌ను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసేసింది. ఎంతలా అంటే రెండు రోజుల నుంచి రింకూ సింగ్ ఇంకా ట్విటర్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లోనే కనబడేంతలా. ఒక్క మ్యాచ్ అతని దశను మారుస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు.
Photo: IPL Twitter
తాజాగా ఎన్డీటీవీకి రింకూ సింగ్ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్య్వూలో అతను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. మేము సంపాదించడం మొదలెట్టాకా కూడా నాన్న తన సొంతకాళ్లపై నిలబడడానికే ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నాడు. క్రికెటర్ కాకముందు కుటుంబం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. దేవుడి దయ వల్ల ఇప్పుండంతా బాగానే ఉందని తెలిపాడు.
''నా కుటుంబం సంతోషంగా ఉండడం కోసం ఎంతో చేస్తున్నా. గతంలో ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయాయి. మేము ఎదిగాకా నాన్నను జాబ్ మానేయాలని చెప్పాం. ఆయన 30 ఏళ్లుగా ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కానీ ఆయన తన సొంతకాళ్లమీదే బతకాలని నిర్ణయించుకొని జాబ్ వదలడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇక కెరీర్‌లో ఎదగకముందు సోదరుడితో కలిసి నాన్నతో వెళ్లి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవాళ్లం.
Photo: IPL Twitter
నాన్నకు నేను క్రికెట్ ఆడడం ఇష్టం ఉండేది కాదు. నాకు డబ్బు కావాలంటే నాన్నతో పాటు వెళ్లి సిలిండర్లు వేసేవాడిని. కానీ ఇంట్లో అమ్మ ఇచ్చిన సపోర్ట్‌తో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టడం చాలా కష్టం. ముందు మనల్ని మనం డొమొస్టిక్ క్రికెట్‌లో నిరూపించుకోవాల్సిందు. గత 6-7 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. కేకేఆర్ ఫ్రాంచైజీ నన్ను నమ్మి అవకాశమిచ్చింది. దానిని నిలబెట్టుకుంటా'' అని పేర్కొన్నాడు.
ఇక రింకూ సింగ్ తమ్ముడు కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన రింకూ సింగ్ తమ్ముడు జిల్లా స్తాయి క్రికెట్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో రింకూ సింగ్ ఇప్పటివరకు 20 మ్యాచ్‌లాడి 349 పరుగులు సాధించాడు.
#NDTVExclusive | "Family Was In Debt, Problems Over Now," KKR Hero Rinku Singh Tells NDTV pic.twitter.com/m6BF1pPMpo
— NDTV Videos (@ndtvvideos) April 11, 2023
చదవండి: RCB Vs LSG: మ్యాచ్ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా!
5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్?
Comments
Please login to add a commentAdd a comment