ఐపీఎల్ 16వ సీజన్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ నిస్సందేహంగా ఒక సంచలనం. డెత్ ఓవర్లలో అతను చూపిస్తున్న తెగువ బహుశా ఈ మధ్య కాలంలో పెద్దగా చూసింది లేదు. సీజన్ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్ల బాది రింకూ సింగ్ హీరో అయిపోయాడు. కేకేఆర్‌కు సంచలన విజయం కట్టబెట్టి డెత్ ఓవర్ల కింగ్ అనిపించుకున్నాడు.
తాజాగా శనివారం లీగ్ చివరి అంకంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో దాదాపు కేకేఆర్‌ను గెలిపించినంత పని చేశాడు. 2 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 40 పరుగులు అవసరమైన దశలో తనలోని హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపాడు రింకూ సింగ్. డెత్ ఓవర్లు అనగానే రింకూ సింగ్‌కు ఎక్కడలేని ధైర్యం వస్తోంది.మాములుగా అయితే డెత్ ఓవర్లలో.. కొండంత లక్ష్యం ఉంటే ఏ బ్యాటర్ అయినా ఒత్తిడిలో పడతాడు. కానీ రింకూ సింగ్ దీనికి పూర్తి రివర్స్‌లా ఉన్నాడు.
డెత్ ఓవర్లు అనగానే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగిపోతున్నాడు. ఒక్క పరుగుతో కేకేఆర్ ఓడిపోవచ్చు.. కానీ రింకూ సింగ్ తన సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసులు మరోసారి దోచుకున్నాడు. రింకూ సింగ్ లాంటి నిఖార్సైన ఫినిషర్ అవసరం టీమిండియాకు ఇప్పుడు చాలా ఉంది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ ఫినిషర్‌గా వచ్చి 149 స్ట్రైక్‌రేట్‌తో 374 పరుగులు చేయడం విశేషం. అతని ఖాతాలో నాలుగు అర్థసెంరీలు ఉన్నాయి. తన బ్యాటింగ్‌తో దుమ్మురేపిన రింకూ సింగ్‌ను త్వరలో టీమిండియాలో చూడడం ఖాయంగా కనిపిస్తోంది.
Rinku Singh hain inka naam🙌, namumkin nahin inke liye koi kaam 🤩 #KKRvLSG #IPLonJioCinema #TATAIPL #EveryGameMatters | @KKRiders pic.twitter.com/2YbgkciPW5
— JioCinema (@JioCinema) May 20, 2023
The whole LSG team congratulated Rinku Singh.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023
Rinku Singh is the hero! pic.twitter.com/ipvLCF5XZg
చదవండి: ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment