Death overs
-
‘డెత్ ఓవర్లలో బౌలింగ్ కత్తి మీద సామే’
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా. జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.ఇటీవలి కాలంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్‌లో కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.మ్యాచ్‌పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రమాదక బౌలర్‌గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. -
#RinkuSingh: ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ధైర్యం!
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ నిస్సందేహంగా ఒక సంచలనం. డెత్ ఓవర్లలో అతను చూపిస్తున్న తెగువ బహుశా ఈ మధ్య కాలంలో పెద్దగా చూసింది లేదు. సీజన్ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్ల బాది రింకూ సింగ్ హీరో అయిపోయాడు. కేకేఆర్‌కు సంచలన విజయం కట్టబెట్టి డెత్ ఓవర్ల కింగ్ అనిపించుకున్నాడు. తాజాగా శనివారం లీగ్ చివరి అంకంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో దాదాపు కేకేఆర్‌ను గెలిపించినంత పని చేశాడు. 2 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 40 పరుగులు అవసరమైన దశలో తనలోని హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపాడు రింకూ సింగ్. డెత్ ఓవర్లు అనగానే రింకూ సింగ్‌కు ఎక్కడలేని ధైర్యం వస్తోంది.మాములుగా అయితే డెత్ ఓవర్లలో.. కొండంత లక్ష్యం ఉంటే ఏ బ్యాటర్ అయినా ఒత్తిడిలో పడతాడు. కానీ రింకూ సింగ్ దీనికి పూర్తి రివర్స్‌లా ఉన్నాడు. డెత్ ఓవర్లు అనగానే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగిపోతున్నాడు. ఒక్క పరుగుతో కేకేఆర్ ఓడిపోవచ్చు.. కానీ రింకూ సింగ్ తన సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసులు మరోసారి దోచుకున్నాడు. రింకూ సింగ్ లాంటి నిఖార్సైన ఫినిషర్ అవసరం టీమిండియాకు ఇప్పుడు చాలా ఉంది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ ఫినిషర్‌గా వచ్చి 149 స్ట్రైక్‌రేట్‌తో 374 పరుగులు చేయడం విశేషం. అతని ఖాతాలో నాలుగు అర్థసెంరీలు ఉన్నాయి. తన బ్యాటింగ్‌తో దుమ్మురేపిన రింకూ సింగ్‌ను త్వరలో టీమిండియాలో చూడడం ఖాయంగా కనిపిస్తోంది. Rinku Singh hain inka naam🙌, namumkin nahin inke liye koi kaam 🤩 #KKRvLSG #IPLonJioCinema #TATAIPL #EveryGameMatters | @KKRiders pic.twitter.com/2YbgkciPW5 — JioCinema (@JioCinema) May 20, 2023 The whole LSG team congratulated Rinku Singh. Rinku Singh is the hero! pic.twitter.com/ipvLCF5XZg — Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023 చదవండి: ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు -
డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌కు దొరికిన ఆణిముత్యం రింకూ సింగ్. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ తర్వాత కూడా అదే టెంపోను కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ డెత్ ఓవర్లలో కింగ్‌గా మారిపోయాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ స్లోపిచ్‌పై తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికి రింకూ సింగ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులతో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కేకేఆర్ 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. Photo: IPL Twitter ఈ క్రమంలోనే రింకూ సింగ్ ఒక రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(17-20 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకూ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 197.53 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తర్వాత షిమ్రోన్ హెట్‌మైర్ 200 స్ట్రైక్‌రేట్‌తో 144 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. టిమ్ డేవిడ్ 213.11 స్ట్రైక్‌రేట్‌తో 130 పరుగులతో మూడో స్థానంలో.. ఇక ద్రువ్ జురేల్ 205 స్ట్రైక్‌రేట్‌తో 115 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు కేకేఆర్ జట్టు మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసిన కేకేఆర్.. మిడిల్ ఓవర్లలో(7-14 ఓవర్లు) 9.75 రన్‌రేట్‌తో 78 పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది. ఇక డెత్ ఓవర్లలో(15-20 ఓవర్లు) ఐదు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. కాగా మిడిల్ ఓవర్లలో కేకేఆర్ ఈ సీజన్లో 8.9 రన్‌రేట్‌తో 801 పరుగులు చేయడం విశేషం. కేకేఆర్ మినహా ఏ జట్టు మిడిల్ ఓవర్లలో ఇన్ని పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాయి. Rinku Singh's rescue innings for KKR: KKR 3/16 & he scored 35(28) KKR 3/92 & he scored 42*(23) KKR 5/142 & he scored 40(15) KKR 3/47 & he scored 46(33) KKR 3/128 & he scored 48*(21) KKR 5/96 & he scored 58*(31) KKR 4/70 & he scored 53*(33) KKR 3/35 & he scored 46(35) pic.twitter.com/urCRHrlDLl — Johns. (@CricCrazyJohns) May 4, 2023 చదవండి: సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ -
వికెట్లు తీసేవాడేమో.. తప్పు చేశాడని బౌలింగ్ ఇవ్వకుంటే ఎలా?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. 15 ఓవర్ల వరకు 130/4తో సాధారణంగా ఉన్న గుజరాత్ స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులకు చేరుకుంది. అంటే చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 97 పరుగులు చేసింది. మిల్లర్, అభినవ్ మనోహర్లకు తోడుగా రాహుల్ తెవాటియా చివర్లో విధ్వంసం సృష్టించడంతో గుజరాత్ 200 మార్కు దాటింది. అయితే గ్రీన్ వేసిన 18వ ఓవర్ ముంబైకి కలిసి రాలేదు. ఆ ఓవర్లో అభినవ్ మనోహర్ రెండు సిక్సర్లు కొట్టగా.. మిల్లర్ ఒక సిక్సర్ కొట్టడంతో మొత్తంగా ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మెరిడిత్ బౌలింగ్‌లోనూ మూడు సిక్సర్లు వచ్చాయి. ఆ తర్వాత చివరి ఓవర్లో తెవాటియా మరో రెండు సిక్సర్లు బాదాడు. అర్జున్ను నమ్మని రోహిత్ అయితే వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్ కనబరిచాడు. రెండు ఓవర్లు వేసిన అతను 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అర్జున్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకొని ముంబై కొంప ముంచాడు. ఈ మ్యాచ్‌లో కూడా మరోసారి అలాగే వేస్తే ఏం చేయలేమని రోహిత్ భావించి ఉంటాడు. కానీ గుజరాత్‌తో మ్యాచ్‌లో అర్జున్ బౌలింగ్ కాస్త బెటర్ అనిపించింది. ఆ 18వ ఓవర్ కామెరాన్ గ్రీన్‌తో కాకుండా అర్జున్‌తో వేయించి ఉంటే బాగుండేదని.. వికెట్లు తీసేవాడేమోనని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు. చదవండి: 'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!' -
ఆ చిన్న కిటుకు మర్చిపోయారు.. అదే పాక్ ఓటమికి దారి
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్‌గా అవతరించింది. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్‌కు విజయాన్ని కట్టబెట్టింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు బోల్తా పడడం.. పాక్ ఓటమికి కారణ మని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ''16 ఓవర్లలో 119/4తో ఉన్న పాక్.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవంగా అయితే అక్కడినుంచి ఓవర్ కు 10 పరుగులు రాబట్టినా స్కోరు దాదాపుగా 160-165 పరుగులకు చేరుకొనేది. ఈ పిచ్‌పై ఇది నిజంగా సవాల్ విసిరే స్కోరు. కానీ, ఎంసీజీ గ్రౌండ్ బౌండరీలను పాక్ బ్యాటర్లు సరిగా అర్థం చేసుకోలేదు. ఈ కిటుకును పసిగట్టకపోవడం వల్లే డెత్ ఓవర్లలో వారు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు కూడా తెలివిగా బౌండ్రీ 85 మీటర్ల దూరం ఉన్న వైపే షాట్లు ఆడే విధంగా బంతులు విసిరి.. పాక్ బ్యాటర్లను ఉచ్చులోకి లాగారు. కొంచెం బుర్ర ఉపయోగించి సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకొచ్చినా పరిస్థితి మరో రకంగా ఉండేది.ఇదే పాక్ ఓటమికి ప్రధాన కారణం.'' అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: బాబర్‌కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ ముగిసిన ప్రపంచకప్.. కోహ్లి సరికొత్త రికార్డు -
ఇంగ్లండ్ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు
టి20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజృంభించింది. మొదట బ్యాటింగ్‌లో.. ఆపై బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై విజయం అందుకొని సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌కు చివరి ఆరు ఓవర్లు మాత్రం బాగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా చేజింగ్‌లో చివరి ఆరు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కింగ్స్ అనిపించుకుంటున్నారు. డెత్ ఓవర్లలో బౌలింగ్ బాగా వేయడమనేది సవాల్‌తో కూడుకున్నది. పరుగులు కట్టడం చేయడమే ఎక్కువ అనుకుంటే ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై చూసుకుంటే గత ఐదు మ్యాచ్‌ల్లో చివరి ఆరు (15-20) ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు ఏకంగా 26 వికెట్లు తీశారు. ఇందులో ఆస్ట్రేలియాపై పెర్త్ వేదికగా 48 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు, కాన్బెర్రా వేదికగా ఆసీస్‌పైనే 56 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు, ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌పై పెర్త్ వేదికగా 30 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు, మెల్బోర్న్ వేదికగా ఐర్లాండ్‌పై 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు, బ్రిస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌పై 45 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసింది. చేజింగ్‌లో ఇంగ్లండ్ చివరి ఆరు ఓవర్లలో వికెట్లు తీసిన ప్రతీసారి విజయాలు అందుకోవడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే బట్లర్ సేన కివీస్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40), గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలం కావడం కివీస్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. చదవండి: అంచనాలు తలకిందులైన వేళ.. ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవం.. డూ ఆర్ డై మ్యాచ్‌లో కివీస్‌పై విజయం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్'
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్‌లో చేయడంలో విఫలమం కావడం జట్టు ఓటమికి దారితీసిందని ధావన్ తెలిపాడు. కాగా ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు అఖరి ఓవర్లలో మాత్రం తెలిపోయారు. ప్రోటీస్ బ్యాటర్లు క్లసన్, మిల్లర్ బౌండరీల వర్షం కురిపించారు. అఖరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. మిల్లర్, క్లసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారివిడిచారు. ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్‌లో కూడా టీమిండియా అంతగా రాణించలేకపోయింది. ధావన్, గిల్, కిషన్, గైక్వాడ్ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే సంజూ శాంసన్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న సంజూ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధావన్ మాట్లాడుతూ.. "40 ఓవర్లకు 250 పరుగులు చిన్న లక్ష్యమేమి కాదు. స్వింగ్, స్పిన్ అయ్యే వికెట్‌పై మేము చాలా పరుగులు ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కూడా అంతగా రాణించలేకపోయాం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాము. ఇక బ్యాటింగ్‌లో కూడా ఆరంభం మంచిగా లేదు. కానీ సంజూ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమైనది. అఖరిలో శార్థూల్, సంజూ జట్టును గెలిపిస్తారని భావించాము. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తాం" అని పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: 'దటీజ్ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి' -
'మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం బాగు చేసుకోండి'
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవరల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్-2022లోనూ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించకున్న భువీ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన భువీ.. ఏకంగా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఆసీస్ సొంతమైంది. ఈ క్రమంలో తన చెత్త బౌలింగ్ కారణంగానే భారత్ డెత్ ఓవర్లలో విఫలమైంది అని భువనేశ్వర్ నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్‌ను ట్రోల్‌చేస్తున్న ట్రోలర్స్‌కు అతడి భార్య నుపుర్ నగర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రోల్స్ చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని సోషల్ మీడియా వేదికగా నగర్ ఫైర్ అయింది. "ఈ రోజుల్లో చాలా మంది ఏ పనికి రానివారు. వాళ్లు ఏమి చేయరు. ఖాళీగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ ఒకరిపై విమర్శలు, ద్వేషం వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్లకు చాలా సమయం ఉంది. వారందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే.. మీ మాటల వల్ల ఎవరూ ప్రభావితం కారు. అంతేకాకుండా మీ ట్రోల్స్‌ను కూడా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇతరలను విమర్శించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కోసం మీ జీవితాలను బాగు చేసుకోవడం. అది మీకు చాలా కష్టమే అని నాకు తెలుసు" అని నగర్ ఇన్స్టాగ్రామ్ రాసుకొచ్చింది. చదవండి: Ind vs Aus 2nd T20: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సూపర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఒత్తిడిని దరి చేరనీయకుండా సూపర్ స్పెల్ వేశాడు. రెండు వైడ్లు సహా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ కీలకమైన స్టోయినిస్ వికెట్‌ను పడగొట్టి ఆర్సీబీకి ఊరటనిచ్చాడు. ఒక రకంగా ఆర్సీబీ మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది ఈ ఓవర్లోనే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న హర్షల్.. లక్నోతో మ్యాచ్ తర్వాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ పేరు సంపాదించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్షల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడు ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఆ ఒత్తిడి అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక బౌలర్లో నెర్వస్‌లో సూపర్ బౌలింగ్ చేయడం ముఖ్యం. దానిని ఇవాళ లక్నోతో మ్యాచ్‌లో సాధించాను. గత రెండు- మూడేళ్లుగా హర్యానా తరపున డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ బాగా రాటుదేలాను. అలాంటి సందర్భాలను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలనుకున్నా. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ అవకాశం వచ్చింది. మ్యాచ్ ఓడిపోతే ఇంటిబాటే అన్న సందర్భంలో బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి చాలెంజ్‌లను సమర్థంగా స్వీకరిస్తా. వచ్చే సౌతాఫ్రికా సిరీస్‌కు భువనేశ్వర్‌తో కలిసి కొత్త బంతిని పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022 LSG Vs RCB: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే -
ధోని అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఫీట్ సాధించాడు. మ్యాచ్‌లో సీఎస్కే 200 పరుగుల మార్క్‌ను దాటడంలో ధోని కీలకపాత్ర వహించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు, 1 ఫోర్ ఉన్నాయి. ఈ సీజన్లో ఎక్కువగా ఆఖర్లోనే బ్యాటింగ్‌కు వస్తున్న ధోని ఫినిషర్‌గా అదరగొడుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ధోనీ.. ఆ తర్వాత కూడా తక్కువ స్కోర్లే చేసినప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే ధోని ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో భాగంగా డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికి తనలో ఫినిషర్ ఇంకా బతికే ఉన్నాడని ధోని రుజువు చేశాడు. కాగా ఇదే మ్యాచ్ ద్వారా ధోనీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. టీ20ల్లో కెప్టెన్‌గా ఆరువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా టి20 కెప్టెన్‌గా ధోని 186 ఇన్నింగ్స్‌లో 6015 పరుగులు చేశాడు. ధోనీ కన్నా ముందు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్‌గా 6వేల పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: భళా సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో అతిపెద్ద విజయం -
ఐపీఎల్ 2021: ముంబై పేరిట పలు చెత్త రికార్డులు
చెన్నై: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాక ఇబ్బంది పడిన ముంబై ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. దీంతో పాటు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో పాటు మొత్తంగా (16-20 ఓవర్లు మధ్య) 22 వికెట్లు పోగొట్టుకుంది.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లోనూ ముంబై 16 మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో 23 వికెట్లు పోగొట్టుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 63 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ 33 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో బిష్ణోయి 2, షమీ 2, అర్ష్‌దీప్,దీపక్ హూడా తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. రాహుల్ 33, గేల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: మేము తప్పులు చేశాం: రోహిత్ శర్మ -
‘డెత్’లో పడేస్తాడు...
పదునెక్కుతున్న బుమ్రా బౌలింగ్ చివరి ఓవర్లలో భారత్ ఆయుధం ఫలితం వెనుక కఠోర శ్రమ ఏంట్రా నీ అల్లరి... బయటకి వెళ్లి ఆడు కో... కొద్దిసేపు నిద్రపోవాలి... శబ్దం రాకుం డా ఆడు... 12 ఏళ్ల వయసులో బుమ్రా ఇంట్లో బౌలింగ్ చేస్తుంటే అతడి తల్లి మందలింపు ఇది. ఓవైపు ఆడాలని కోరిక... మరోవైపు అమ్మ నిద్రపోతోందనే ఆలో చన... ఏం చేయాలి..? శబ్దం రాకుండా గోడకు బంతి విసరడం ఎలా..? ఆ చిట్టి బుర్రకు ఓ ఆలోచన వచ్చింది. గోడ, గచ్చు కలిసే చోటకు బంతి విసిరితే పెద్దగా శబ్దం రాదు. అంతే... అదే పనిగా అక్కడే బంతులు వేయడం విసరడం మొదలుపెట్టాడు. నిజానికి అప్పుడు బుమ్రాకు తెలియదు. ఈ ఆలోచన తనని యార్కర్లు వేయడంలో నిష్ణాతుడిని చేస్తుందని... భారత్‌కు ‘డెత్’ ఓవర్లలో ఓ స్పెషలిస్ట్‌గా మారతానని..! ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి : గతంతో పోలిస్తే భారత క్రికెట్లో వచ్చిన ఓ పెద్ద సానుకూల మార్పు... బుమ్రా. గతంలో ఎక్కడ ఏ టోర్నీ ఆడినా డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చే బౌలర్లతో ధోని తలపట్టుకునేవాడు. కానీ బుమ్రా వచ్చిన తర్వాత కెప్టెన్‌కు పెద్ద తలనొప్పి తగ్గింది. చివరి ఓవర్లలో ప్రత్యర్థులను కదలనీయకుండా యార్కర్లు వేస్తూ బుమ్రా ఇప్పుడో సంచలనంగా మారాడు. బుమ్రా బలమంతా అతని బౌలింగ్ యాక్షన్‌తోనే ప్రారంభమవుతుంది. ఇది అతను ఎవరినో చూసి నేర్చుకున్నది కాదు. సహజంగానే తన ప్రయత్నం లేకుండా ఇదే తరహాలో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. అదృష్టం ఏమిటంటే స్కూల్ స్థాయినుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు కాస్త భిన్నంగా కనిపిస్తోంది అనే మాటే తప్ప ఏ కోచ్ కూడా యాక్షన్‌ను మార్చుకోమని సలహా ఇవ్వలేదు. ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీలో దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో బుమ్రాకు తనపై నమ్మకం ఏర్పడింది. ఇక తన బలమైన యార్కర్లను మరింతగా పదునెక్కించేందుకు అతను తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన తర్వాత అతను మలింగకు శిష్యుడిగా మారిపోయాడు. తనలాగే భిన్నమైన యాక్షన్ ఉండటం, ఈతరంలో అతనిలాగా యార్కర్లు వేసేవారు లేకపోవడంతో బుమ్రా నేర్చుకునేందుకు సరైన వేదిక లభించింది. చిన్న సందేహం మొదలు పెద్ద ఆలోచన వరకు అన్నీ అతనికి మలింగతోనే. ఐపీఎల్లో జట్టు మారమని కొందరు సలహా ఇచ్చినా మలింగ కోసమే బుమ్రా అక్కడే ఉండిపోయాడు. స్లో బంతులు, బౌన్సర్లు కూడా బాగానే వేస్తున్నా, నీకంటూ ఒక ప్రత్యేక బలం ఉండాలనే మలింగ సూచనతో పూర్తిగా యార్కర్లపైనే దృష్టి పెట్టాడు. టాప్ బౌలర్ల యార్కర్ల వీడియోలన్నీ సేకరించి తనను తాను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ధోనిని అద్భుత యార్కర్‌తో బౌల్డ్ చేయడం... ఆ తర్వాత తనకు అలాంటి బౌలర్ కావాలని కెప్టెన్ కోరడమే బుమ్రాకు ఆసీస్ పర్యటన అవకాశం ఇప్పించింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే మిస్‌ఫీల్డ్, తర్వాత మరో సునాయాస క్యాచ్ వదిలేయడం, ఆ తర్వాత అదే బ్యాట్స్‌మన్ చేతిలో ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు బాదుడు... ఇంత జరిగాక ఒక 22 ఏళ్ల బౌలర్ స్థైర్యం దెబ్బ తింటుంది. కానీ బుమ్రా తన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 13 పరుగులే ఇచ్చాడు. ఇందులో ఏకంగా ఆరు యార్కర్లు ఉన్నాయి. అంటే సగం బంతులు అతను యార్కర్లను ఉపయోగిస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన అద్భుతం గురించే అంతా చర్చ జరిగింది కానీ అంతకుముందు ఓవర్లో బుమ్రా కేవలం 6 పరుగులే ఇవ్వడం అసలు విజయానికి పునాది వేసింది. ఆసీస్‌తో మ్యాచ్ కూడా అతని బౌలింగ్‌కు రీప్లేలా కనిపించింది. తొలి ఓవర్లోనే ఖాజా నాలుగు ఫోర్లు బాదడంతో 17 పరుగులు ఇచ్చేశాడు. అయితే తర్వాతి మూడు ఓవర్లలో బుమ్రా 3, 3, 9 పరుగులు ఇచ్చాడు. కీలకమైన సమయంలో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేశాడు. ఎంతటి ఒత్తిడిలోనూ నియంత్రణ తప్పకుండా బౌలింగ్ చేయడమే బుమ్రాపై కెప్టెన్ ప్రశంసలు కురిపించేలా చేస్తోంది. అవకాశం ఇవ్వకూడదు సాధారణంగా ప్రపంచ క్రికెట్లో భిన్నమైన శైలితో వచ్చిన ఆటగాళ్లు తొందరగానే ఆ ప్రభను కోల్పోవడం, ప్రత్యర్థులు వారిని పట్టేయడం చాలా సందర్భాల్లో జరిగింది. వైవిధ్యం కనబర్చలేక ఎంతో మంది సాధారణ క్రికెటర్లుగానే మిగిలిపోతే, కొంత మంది మాత్రమే ఎప్పటికప్పుడు తమని తాము అప్డేట్ చేసుకుంటూ నిలబడ్డారు. బుమ్రా ఇప్పటికి 15 టి20లతో పాటు ఒక వన్డే ఆడాడు. కానీ అంత సులభంగా ఎవరికీ లొంగలేదు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్‌లోని మైదానాల్లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. టి20 ప్రమాణాల ప్రకారం మంచి సగటు, ఎకానమీతో అతను బౌలింగ్ చేస్తున్నాడు. గత 3 నెలల వ్యవధిలోనే కీలక సభ్యుడిగా ఎదిగిన అతను ప్రపంచకప్ విజేత జట్టులో భాగం అయ్యేందుకు మరో రెండు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నాడు. ఆ కోరిక నెరవేరాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా సత్తా చాటాలి.