చెన్నై: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాక ఇబ్బంది పడిన ముంబై ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. దీంతో పాటు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో పాటు మొత్తంగా (16-20 ఓవర్లు మధ్య) 22 వికెట్లు పోగొట్టుకుంది.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ ముంబై 16 మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో 23 వికెట్లు పోగొట్టుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 63 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ 33 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో బిష్ణోయి 2, షమీ 2, అర్ష్‌దీప్,దీపక్ హూడా తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. రాహుల్ 33, గేల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: మేము తప్పులు చేశాం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment