Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. రిషి ధావన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడో బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న థర్డ్‌మన్ ఫీల్డర్ మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
గత మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ వరుసగా 2,0,0.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాడు. సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ తన ఇంపాక్ట్ చూపలేకపోయాడు. ఇక రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ తరపున ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం.
అలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్‌కు ఐపీఎల్‌లో ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన జాబితాలో రోహిత్ చోటు సంపాదించాడు. 15 డకౌట్లతో దినేశ్ కార్తిక్, సునీల్ నరైన్, మణిదీప్ సింగ్‌లతో కలిసి రోహిత్ సంయుక్తంగా నిలిచాడు.
Most ducks in IPL history:
— CricTracker (@Cricketracker) May 3, 2023
15 - Dinesh Karthik
15 - Sunil Narine
15 - Mandeep Singh
15 - Rohit Sharma
Comments
Please login to add a commentAdd a comment