Duck
-
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
'బాతే కదా' అని ఇలా చేశారో.. ఇక జైలుకే..!
రంగారెడ్డి: ఎయిర్‌గన్‌తో బాతును చంపిన వ్యక్తులపై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి గ్రామ శివారులోని హుస్సేన్ ఫాం హౌస్‌లో వాచ్మెన్ అహ్మద్ బాతులు, చిలుకలను పెంచుతున్నాడు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ఫహద్(27), రక్షాపురంకు చెందిన మహ్మద్ అజ్మలుద్దీన్ (35) ఫాంహౌస్‌లోకి వచ్చి ఎయిర్‌గన్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటామని అడిగారు. ఈ క్రమంలోనే రోటెక్స్ ఆర్ఎం–8 ఎయిర్‌గన్‌తో బాతును షూట్ చేసి చంపేశారు. ఇది గమనించిన వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. శనివారం సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ డకౌట్ గాకా.. గత నాలుగు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ వరుసగా 2,3,0,0 పరుగులు చేసి విఫలమయ్యాడు. కాగా సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్ ఉందని అభిమానులు పేర్కొనడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ దీపక్ చహర్ వేశాడు. రోహిత్‌తో ధోని మైండ్‌గేమ్ ఆడాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా బ్యాక్వర్డ్ పాయింట్, స్లిప్, థర్డ్‌మన్‌లో ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు. ఆ తర్వాత చహర్ బంతి వేయడానికి ముందే ధోని స్టంప్స్ దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్ వేసేటప్పుడు వికెట్ కీపర్ వికెట్లకు కాస్త దూరంగా ఉంటాడు. కానీ ధోని మాత్రం బంతి వేయడానికి ముందే స్టంప్స్ దగ్గరకు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. కానీ ఊహించినట్లుగానే చహర్ స్లోబాల్ వేశాడు. ఇక రోహిత్ ల్యాప్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లడం.. అక్కడే ఉన్న జడ్డూ సింపుల్ క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. ఇలా ధోని మైండ్‌గేమ్‌తో రోహిత్‌ను బుట్టలో వేసుకొని ఫలితం రాబట్టాడు. రోహిత్ ఔట్‌ను కామెంటేటర్లో ఎయిర్‌లో.. ధోని మాస్టర్‌మైండ్.. మంత్రం ఫలించింది అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 👉MSD comes up to the stumps 😎 👉Rohit Sharma attempts the lap shot 👉@imjadeja takes the catch 🙌 Watch how @ChennaiIPL plotted the dismissal of the #MI skipper 🎥🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/fDq1ywGsy7 — IndianPremierLeague (@IPL) May 6, 2023 చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? -
ముంబై ఇండియన్స్ తరపున 200వ మ్యాచ్.. చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. రిషి ధావన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడో బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న థర్డ్‌మన్ ఫీల్డర్ మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ వరుసగా 2,0,0.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాడు. సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనూ తన ఇంపాక్ట్ చూపలేకపోయాడు. ఇక రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ తరపున ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. అలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్‌కు ఐపీఎల్లో ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన జాబితాలో రోహిత్ చోటు సంపాదించాడు. 15 డకౌట్లతో దినేశ్ కార్తిక్, సునీల్ నరైన్, మణిదీప్ సింగ్‌లతో కలిసి రోహిత్ సంయుక్తంగా నిలిచాడు. Most ducks in IPL history: 15 - Dinesh Karthik 15 - Sunil Narine 15 - Mandeep Singh 15 - Rohit Sharma — CricTracker (@Cricketracker) May 3, 2023 చదవండి: అర్జున్ నయం.. ఆర్చర్‌ను నమ్మి తప్పు చేశాడా! -
ఎవరికి చిక్కని బట్లర్.. ఏడేళ్లలో రెండోసారి మాత్రమే
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ కెరీర్లో బట్లర్‌కు ఇది రెండో డకౌట్ మాత్రమే కావడం విశేషం. తొలి డకౌట్ అతని ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్‌లో వచ్చింది. 2016లో రైజింగ్ పుణేతో మ్యాచ్ బట్లర్‌కు తొలి ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో రెండో డకౌట్ నమోదు చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో బట్లర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. T. I. M. B. E. R! Huge Wicket for @gujarat_titans! 👏 👏@MdShami11 with his first wicket of the match! 👍 👍#RR 2 down as Jos Buttler departs. Follow the match 👉 https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/DBspi43pRo — IndianPremierLeague (@IPL) April 16, 2023 చదవండి: గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డు -
సంజూ స్టన్నింగ్ క్యాచ్.. పృథ్వీ షా చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7 పరుగులు చేసిన పృథ్వీ పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్ బంతులను ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. ఫుట్‌వర్క్ మీద ఏమాత్రం దృష్టి పెట్టని పృథ్వీ బౌల్ట్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతిని గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు. కీపర్ సంజూ శాంసన్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే మ్యాచ్‌లో పృథ్వీ షా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ ఇంపాక్ట్‌గా వచ్చి డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సీజన్లో పృథ్వీ షా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి డకౌట్ అయిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. బట్లర్ 79, యశస్వి జైశ్వాల్ 60, హెట్‌మైర్ 39 నాటౌట్ రాణించారు. How about THAT for a start! 🤯 WHAT. A. CATCH from the #RR skipper ⚡️⚡️#DC lose Impact Player Prithvi Shaw and Manish Pandey in the first over! Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/rpOzCFrWdQ — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
డకౌట్ల విషయంలో పరువు తీసుకున్న కేకేఆర్ బ్యాటర్
కేకేఆర్ బ్యాటర్ మణిదీప్ సింగ్ డకౌట్ల విషయంలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మణిదీప్ సింగ్ నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మణిదీప్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్లో మణిదీప్‌కు ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. ఇక మణిదీప్ తర్వాత ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తిక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు 14 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో ఉండగా.. పార్థివ్ పటేల్, అజింక్యా రహానే, అంబటి రాయుడులు 13సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. Two in Two by David Willey! A double wicket maiden by @david_willey 🔥🔥 Venkatesh Iyer and Mandeep Singh depart. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/FjuJoHWzLH — IndianPremierLeague (@IPL) April 6, 2023 చదవండి: Dinesh Karthik: కార్తిక్ తెలివికి కెప్టెన్ డుప్లెసిస్ ఫిదా -
'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'
టీమిండియా వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేయగానే అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. అలా వన్డే సిరీస్ ముగిసి ఇలా టి20 సిరీస్ ప్రారంభం కాగానే భారత్ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో ఆటగాళ్లకు, అభిమానులకు ఇది సాధారణమే. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే టీమిండియాపై ఎక్కడలేని కోపాన్ని చూపిస్తారు అభిమానులు. ఆరోజు మ్యాచ్‌లో ఎవరి ప్రదర్శనైతే బాగుండదో వారికి సోషల్ మీడియాలో మూడినట్లే. అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త బౌలింగ్‌తో ఇప్పటికే విమర్శలు మూటగట్టుకోగా.. తాజాగా రాహుల్ త్రిపాఠిని కూడా నెటిజన్లు ఆడేసుకున్నారు. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన త్రిపాఠి ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. పైగా జాకబ్ డఫీ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి కీపర్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నాళ్లు టి20ల్లో మూడో స్థానంలో విరాట్ కోహ్లి వచ్చేవాడు. అతని బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా కోహ్లి టి20లకు క్రమంగా దూరమవుతున్న వేళ సూర్యకుమార్ ఆ స్థానాన్ని తీసుకున్నాడు. కానీ కివీస్‌తో తొలి టి20లో సూర్య నాలుగో స్థానంలో వస్తేనే కరెక్టని.. కోహ్లి స్థానంలో రాహుల్ త్రిపాఠిని పంపించారు. కానీ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి నిర్లక్ష్యమైన షాట్ ఆడి డకౌట్ అవ్వడం అభిమానులను బాగా హర్ట్ చేసింది. అయితే ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో త్రిపాఠి మూడో స్థానంలోనే వచ్చి బ్యాటింగ్‌లో మెరిశాడు. దీంతో త్రిపాఠిని టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''కోహ్లి స్థానాన్ని అప్పగిస్తే ఇలాగేనా ఔటయ్యేది''.. ''త్రిపాఠిలో ఒక బ్యాటర్ కాకుండా జోకర్ కనబడుతున్నాడు''.. ''అతను తన టాలెంట్‌ను ఐపీఎల్ కోసం దాచుకుంటున్నట్లున్నాడు''.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు మాత్రం త్రిపాఠికి మద్దుతు తెలిపారు. ''లంకతో సిరీస్‌లో రాణించాడు కాబట్టే జట్టులో ఉన్నాడు.. ఇది అతనికి మూడో మ్యాచ్ మాత్రమే. వచ్చే మ్యాచ్‌లో రాణించే అవకాశం ఉంది.. ఒక్క మ్యాచ్‌కే తప్పు బట్టడం సరికాదు'' అంటూ పేర్కొన్నారు. Nothing just Rahul Tripathi is saving his batting talent for IPL and @SunRisers 😬 — Sanam Patel (@patelsanam) January 27, 2023 Rahul tripathi fanbois be like pic.twitter.com/wgsrdD3Az2 — Manu (@Manu_k333) January 27, 2023 Rahul Tripathi the way he played compelled us to think that , Is he a batsman or a joker ? Same way Arshdeep is also a joker Who has got nothing to do with bowling.. — Dharam (@Dharram03) January 27, 2023 చదవండి: రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్లో చెత్త రికార్డు ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు -
150వ మ్యాచ్‌లో డైమండ్ డక్.. విలన్‌గా మారిన ఆరోన్ ఫించ్
ఐపీఎల్ 2022లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒక ఊహించని పరిణామం జరిగింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లేని పరుగు కోసం ప్రయత్నించిన ఫించ్.. ఓపెనర్ నరైన్‌ను రనౌట్ చేశాడు. ఐపీఎల్లో 150వ మ్యాచ్ ఆడుతున్న నరైన్ ఆరంభంలోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్కోరు సాధించాలన్న కల తీరకుండా ఫించ్ అతనికి అడ్డుపడ్డాడు. Courtesy: IPL Twitter విషయంలోకి వెళితే.. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని ఫించ్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే షాట్ కొట్టిన వెంటనే సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. రిస్క్ అని తెలిసినా పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న హెట్‌మైర్ బులెట్ వేగంతో డైరెక్ట్ త్రో విసిరాడు. నరైన్ సగం క్రీజు దాటేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో నరైన్ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. డైమండ్ డక్ అంటే ఒక్క బంతి ఆడకుండానే వెనుదిరగడం. బహుశా ఐపీఎల్లో నరైన్‌దే తొలి డైమండ్ డక్ అనుకుంటా. కాగా నరైన్ ఔట్ విషయంలో ఫించ్‌ను తప్పుబట్టారు. తొలి బంతికే ఎందుకంత తొందర.. నరైన పాలిట ఫించ్ విలన్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే నరైన్‌ను ఔట్ చేశానన్న బాధ కలిగిందేమో తెలియదు గాని ఆ తర్వాత ధాటిగా ఆడడం మొదలుపెట్టాడు. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఫించ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత 28 బంతుల్లో 58 పరుగులు చేసి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చదవండి: IPL 2022: సీజన్లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్.. పలు రికార్డులు బద్దలు సునీల్ నరైన్ డైమండ్ డకౌట్ కోసం క్లిక్ చేయండి -
కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా?
ఐపీఎల్ 2022లో ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ ఫేలవ ఆటతీరును కనబరుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ విధించిన 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి కొనితెచ్చుకుంది. కాగా ఈసారి మెగావేలంలో ఎస్ఆర్హెచ్ ఏరికోరి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క ఆటగాడు మినహా పెద్దగా పేరున్న ఆటగాళ్లు కూడా ఎవరు లేరు. ఎస్ఆర్హెచ్ పూరన్‌పై ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలియదు గాని అతను మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటికి నుంచి ఇబ్బందిగా కనిపించిన పూరన్ చివరకు 9 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక పూరన్ ఐపీఎల్లో డకౌట్ల విషయంలో మరో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు పూరన్ ఆడిన 32 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు డకౌట్ అయ్యాడు. కాగా పూరన్ ఆటతీరుపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ''రూ. 10 కోట్లు దండగ.. ఎంతమంది వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు మారదు.. కోట్లు పెట్టి కొంటే డకౌట్ అయితే ఎలా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Sanju Samson: ఐపీఎల్ చరిత్రలో సంజూ శాంసన్ అరుదైన ఫీట్.. నికోలస్ పూరన్ ఔట్ వీడియో కోసం క్లిక్ చేయండి Nicholas Pooran registered his 6th IPL duck from the 32 innings he has played. — Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2022 When Hyderabad bats. #SRHvRR pic.twitter.com/Bt7XijdS5Y — Virender Sehwag (@virendersehwag) March 29, 2022 -
'ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా'
టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు రహానేతో పాటు చతేశ్వర్ పుజారాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో రహానే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవాతో ముంబై జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన లక్ష్యా గార్గ్ బౌలింగ్‌లో.. రహానే ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ పృథ్వీ షా కూడా 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా భారత జట్టులో రహానే తిరిగి స్ధానం దక్కించుకోవాలంటే తాను ఎంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టులోకి రావడం కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాది రంజీ సీజన్లో సౌరాష్ట్రతో జరగిన తొలి మ్యాచ్‌లో రహానే సెంచరీ సాధించాడు. దీంతో ఫామ్‌లోకి అతడు వచ్చాడని అంతా భావించారు. అయితే గోవాతో జరుగుతోన్న మ్యాచ్‌లో రహానే డకౌట్ అయ్యి మళ్లీ అందరనీ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియాలో మరో సారి రహానే ఆటతీరుపై నెటిజన్లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా" అంటు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs SL: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు... అతడికి అవకాశం ఇవ్వండి' -
సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో కోహ్లి రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి ఆఫ్‌స్టంప్ బలహీనతను అల్జారీ జోసెఫ్ చక్కగా వినియోగించుకున్నాడు. జోసెప్ వేసిన బంతిని కోహ్లి లెగ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తగిలి కీపర్ షెయ్ హోప్ చేతుల్లో పడింది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి కోహ్లి చేసిన స్కోర్లు 8,18,0.. మొత్తంగా 26 పరుగులు. మూడో వన్డేలోనైనా సెంచరీ కొడతాడని భావించిన ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లి.. ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. చదవండి: ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. విషయంలోకి వెళితే.. కోహ్లి వన్డేల్లో డకౌట్ కావడం ఇది 15వ సారి. ఈ నేపథ్యంలో డకౌట్ల విషయంలో టీమిండియా తరపున వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి కంటే ముందు సచిన్ టెండూల్కర్(20 డకౌట్లు), యువరాజ్ సింగ్(18 డకౌట్లు), సౌరవ్ గంగూలీ(16 డకౌట్లు) తొలి మూడుస్థానాల్లో నిలిచారు. అంతేకాదు వన్డేల్లో డకౌట్ల విషయంలో సురేశ్ రైనాను అధిగమించిన కోహ్లి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి చూసుకుంటే భారత మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించాడు. కోహ్లి ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లు కలిపి 32 సార్లు డకౌట్ అయి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక సెహ్వాగ్ ఓవరాల్‌గా 31 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్(34 డకౌట్లు) ఉన్నాడు. Most Ducks for India (While batting at 1 to 7) 34 - Sachin Tendulkar 32 - Virat Kohli* 31 - Virender Sehwag 29 - Sourav Ganguly#INDvWI — CricBeat (@Cric_beat) February 11, 2022 -
450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు
మైల్స్టోన్ మ్యాచ్ అంటే ఒక బౌలర్ లేదా బ్యాట్స్‌మన్‌కు దానిని గొప్పగా మలుచుకోవాలని భావిస్తారు. కోహ్లి కూడా తన 450వ మ్యాచ్‌లో సూపర్‌గా ఆడాలనుకున్నాడు. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఫలితంగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐదు బంతులాడిన కోహ్లి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా వన్డేల్లో కోహ్లి డకౌట్ అవ్వడం ఇది 14వ సారి కాగా.. ఒక స్పిన్నర్ బౌలింగ్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. తన 450వ మ్యాచ్‌లో కోహ్లి ఒక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టీమిండియా తరపున వన్డే క్రికెట్లో అత్యధిక డకౌట్ల విషయంలో మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్లను కోహ్లి దాటేశాడు. కపిల్, ద్రవిడ్‌లు వన్డేల్లో 13సార్లు డకౌట్ కాగా.. తాజా ఔట్‌తో కోహ్లి వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా, సెహ్వాగ్, జహీర్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరికంటే ముందు సచిన్ టెండూల్కర్ (20 డకౌట్లు), జగవల్ శ్రీనాథ్ (19 డకౌట్లు), అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌లు 18 డక్‌లతో, హర్భజన్ సింగ్ 17 డకౌట్లతో, గంగూలీ 16 డకౌట్లతో ఉన్నారు. -
బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు
Pat Cummins Terrific Bowling To Hameed Hasib At Last Duck Out Viral.. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది. రూట్ అర్థశతకం మినహా మిగతావారెవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రలియా తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 3 వికెట్లతో చెలరేగడమే కాదు.. తన బంతులతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ హసీబ్ హమీద్‌కు కమిన్స్ తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌన్సర్లు, షార్ట్‌పిచ్ బాల్స్‌తో కమిన్స్.. హమీద్‌ను బెంబేలెత్తించాడు. చివరకు అతన్ని డకౌట్ చేసి వారెవ్వా అనిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ కమిన్స్ వేయగా.. మొదటి నాలుగు బంతులను టచ్ చేయడానికే భయపడగా... ఐదో బంతిని టచ్ చేయాలా వద్దా అని హమీద్ అనుకునే లోపే బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ క్యారీ చేతుల్లో పడింది. అలా హమీద్ డకౌట్ అయి పెవిలియన్‌కు నిరాశగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: AUS vs ENG: పాపం రూట్.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా It's taken Pat Cummins less than one over to have an impact on his return to the side! #OhWhatAFeeling @Toyota_Aus | #Ashes pic.twitter.com/iAVB3vC33C — cricket.com.au (@cricketcomau) December 26, 2021 -
‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు!
మానవేతర జాతుల్లో కొన్ని జాతులు.. శబ్దాలను అనుకరిస్తాయనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగులు, గబ్బిలాలు, చిలుకలు, హమ్మింగ్బర్డ్స్తో పాటు.. నీటిలోని జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు సహా.. ఇలా కొన్ని పక్షులు, జంతువులు.. నిర్దిష్ట శబ్దాలను ఇట్టే నేర్చుకోగలవని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అయితే ఆ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ‘రిప్పర్ డక్’ (కస్తూరి బాతు).. అచ్చం మనిషి మాదిరి మాట్లాడటమే కాదు.. మనిషి మాదిరి తిట్టగలదని నిరూపితమైంది. అందుకు 34 ఏళ్ల కిందట రికార్డ్ అయిన ఓ ఆడియో సాక్ష్యంగా నిలిచింది. చదవండి: ఇలా మనుషుల్ని అమ్మగలరా? లేదు కదా..? డాక్టర్ పీటర్ ఫుల్లగర్ అనే పరిశోదకుడు.. 1987లో కాన్బెర్రా సమీపంలోని టిడ్బిన్ బిల్లా నేచర్ రిజర్వ్‌లో కస్తూరి బాతు మాట్లాడుతుండగా ఆ వాయిస్‌ను రికార్డ్ చేశారు. దానిలో రిప్పర్ ‘యూ బ్లడీ ఫూల్’ అని అచ్చం మనిషి తిట్టినట్లే తిట్టింది. నాడు ఆయన చేసిన రికార్డింగులను ఇటీవల నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కారెల్ టెన్ కేట్ తిరిగి వెలుగులోకి తెచ్చారు. పక్షులలో స్వర అభ్యాసంపై ప్రొఫెసర్ టెన్ కేట్ అధ్యయనం చేస్తున్నారు. తలుపు కొట్టుకుంటుండగా వచ్చే శబ్దాన్ని కూడా ఈ బాతు అనుకరించగలదని సరికొత్త అంశాన్ని గుర్తించారు. -
నేను కూడా అంటూ...మారథాన్‌లో పాల్గొన్న బాతు
వాషింగ్టన్: ఇటీవల కాలంలో మనుష్యుల మాదిరిగా తాము అన్ని చేయగలమంటూ జంతువులు, పక్షులు ఏవిధంగా అనుకరిస్తున్నాయో చూస్తునే ఉన్నాం. అచ్చం అలానే ఇక్కడొక రింక్ల్ బాతు తాను సైతం మారథాన్ చేయగలనంటూ న్యూ యార్క్ సిటీ మారథాన్‌లో పాల్గొంది. పైగా అక్కడ మారథాన్‌లో పాల్గొన్న వాళ్లలా చక్కగా నడిచేసింది. గతేడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా మారథాన్ నిర్వహించలేదన్న సంగతి తెలిసింతే. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) కానీ ఈ ఏడాది న్యూయర్క్ సిటీలో నిర్వహించిన మారథాన్‌లో బాతు పాల్గోని న్యూయార్క్ వాసులకి కనువిందు చేయడమే కాక ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా అక్కడ ఉన్న ప్రేక్షకులు సైతం కమాన్ కమాన్ అంటూ ఆ బాతుని ఉత్సాహపరిచారు. అయితే దీనికి సంబంధించిన వీడియోతోపాటు " నేను మారథాన్‌లో పరుగెత్తాను. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా పరుగెత్తుతాను" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) View this post on Instagram A post shared by Wrinkle 🦢 宙紋✨ (@seducktive) -
‘ మీ భార్య కాంగ్రెస్‌ను వీడుతుందా..?’: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘మీ సతీమణి, మేడం ప్రణీత్ కౌర్.. మీతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా.. లేదా’’ అంటూ ప్రశ్నించారు. మీ భార్య మీ నిర్ణయాలకు సానుకూలంగా.. నిలబడలేరని విమర్శించారు. అమరీందర్ సింగ్ పిడుగుపాటులో చనిపోతున్న బాతులాంటి వాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నిన్న(మంగళవారం) ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. అమరీందర్ సింగ్ తన రాజీనామా లేఖలో సిద్ధూని.. పాక్‌కు అంతరంగిక బంటూ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్‌లో అమరీందర్ సింగ్, నవజ్యోత్సింగ్ల మధ్య విబేధాలు కొనసాగుతునే ఉన్నాయి. -
నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే..
పెన్సిల్వేనియాలోని మిల్‌ఫోర్డ్‌లో ‘మంచ్కిన్’ చాలా ఫేమస్. ఎవరీ మంచ్కిన్ అనేకదా మీ డౌట్! ఇది ఒక బాతు. 20 యేళ్ల క్రిస్సీ ఎలిస్ పెంపుడు జంతువే ఈ మంచ్కిన్ అనే బాతు. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువుగా ప్రసిద్ధి కెక్కింది. ఎలాగంటే.. క్రిస్సీకి చిన్నప్పటి నుంచి బాతులను పెంచే అలవాటుంది. ఐతే టీనేజ్‌లో ఉన్నప్పుడు మంచ్కిన్ అనే బాతు ఆమె దగ్గరికి చేరింది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరిద్దరికీ కలిపి ‘డంకిన్ డక్స్’ అనే పేరుతో కామన్ ఎకౌంట్ కూడా క్రిస్సీ తెరిచేసింది. తను ఉండే టౌన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డంకిన్ డొనట్స్ పేరు ప్రేరణతో ఈ పేరు పెట్టిందట. ఇక అప్పటినుంచి వీరిద్దరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో ఆమె ఇలాంటి ఆసక్తులు, అభిరుచులను పంచుకునే వ్యక్తులతో కనెక్ట్ అయ్యింది. వీరికి టిక్‌టాక్‌లో 2.7 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో రెండు సోషల్ మీడియాల ద్వారా నెలకు ఏకంగా 3,34,363ల రూపాయలు తన యజమానికి సంపాదించి పెడుతుందట ఈ బాతు. అంతేకాకుండా పెయింటింగ్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. దీంతో న్యూయార్క్ పోస్ట్ నివేదిక ‘కష్టపడి పనిచేసే పెట్’ అని పేర్కొంది. సాధారణంగా క్యూట్ గా ఉండే రకరకాల జంతువుల వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఈ బాతు వీడియోలు మరింత క్రేజీగా దూసుకుపోతున్నాయి. చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!! View this post on Instagram A post shared by Krissy & Munchkin (@dunkin.ducks) -
"యూ బ్లడీ ఫూల్" అంటూ.. మాట్లాడుతున్న బాతులు
కాన్బెర్రా: చిలకలు, కోయిలలు, గోరింకలు మనుషులను అనుకరించడం మనకు తెలుసు. ఇదే తరహాలో కస్తూరి ఆనే పేరుగల బాతు "యూ బ్లడీ ఫూల్" అంటూ మనుషుల మాటల్ని అనుకరిస్తోంది. నెదర్లాండ్స్ ఫిలాసఫికల్ ట్రాన్సాక్షన్స్కి చెందిన రాయల్ సొసైటీ బయోలాజికల్ రీసెర్చ్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి పక్షి శాస్త్రవేత్త పీటర్ ఫుల్లగర్ రికార్డు చేసిన పాత వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. (చదవండి: ఔరా! ఈ కుండ దేనితో తయారు చేశారు.. రాయితో కొట్టినా పగలదే..) ఈ సందర్భంగా లండన్ యూనివర్సిటీ సైంటిస్ట్ కారెల్ టెన్ కేట్ మాట్లాడుతూ.." నేను మొదట బాతులు మనుషుల మాటలను అనుకరించడం నిజమా కాదా అని ఆలోచించాను. కానీ 1980లో ఆస్ట్రేలియన్ బర్డ్ పార్క్‌లో పీటర్ ఫుల్లగర్ రికార్డు చేసిన పాత వీడియోలు, పరిశోధన పత్రాలతోపాటు తాను మళ్లీ పరిశోధనలు చేసి తెలుసుకునేంత వరకు నమ్మలేదు అని అన్నారు. అయితే ఉచ్ఛారణ అనేది చాల ఆసక్తి కరమైనది, రిప్పర్ అనే వ్యక్తి మిమిక్రి బాగా చేయగలడని, మనుషుల్ని, శబ్దాలను బాగా అనుకరిస్తాడని చెప్పారు. ఇది కచ్చితంగా మానవుని వాయిస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. కొన్ని ప్రత్యేకమైన పక్షులు చిలకలు, కోయిలలు, గోరింకలు మానువునిలా మాట్లాడగలవు కానీ బాతులు మనుష్యులను అనుకరించటం అసాధారణమైనది, ప్రత్యకమైనది కూడా అని చెప్పారు. (చదవండి: షాపింగ్‌మాల్ వద్ద మాటువేసి.. లక్కీ డ్రా అంటూ..) -
బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక బ్యూటిఫుల్ వీడియోతో మరోసారి తన ఫాలోవర్స్‌ని, నెటిజనులను మెస్మరైజ్ చేశారు. అద్భుతమైన అందమైన బాతుల వీడియోను ట్విటర్‌లోషేర్ చేశారు. చాలా అందంగా ఉంది! ప్రకృతి మననుంచి ఇంకా దూరం కాలేదు అనేందుకు ఇదొక ఆశాజనక సంకేతం కావచ్చనిఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల అసోంలో కనిపించిన అరుదైన మాండరిన్ బాతుల జంట వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విటర్ వేదికగా షేర్ చేశారు. వందేళ్ల తరువాత దర్శమిచ్చిన ఈ రంగు రంగుల బాతు పర్యావేరణ ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తోంది. ఎరిక్ సోల్హీమ్ ఈ వీడియోను ట్విటర్ పోస్ట్ చేశారు. తూర్పు చైనా, రష్యాలో కనిపించే మాండరిన్ అసోంలో కనిపించింది. ప్రకృతి సృష్టించిన సోయగమిది అని ఆయన ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇవి చాలా అందంగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో వీటిని పెంచుకుంటారంటూ కొంతమంది ట్వీట్ చేశారు. కాగా ప్రపంచంలో పది అందమైన పక్షులలో ఒకటి మాండరిన్ బాతు. ఎరుపు రంగు ముక్కు, నలుపు రంగు తోక ..ఇలా సప్తవర్ణాల మేళవింపుతో ఆకర్షణీయంగా ఉండే ఈ బాతు ఎక్కువగా చైనాలో కనిపిస్తుంది. అంతేకాదు ఆడ బాతుతో పోలిస్తే.. మగ బాతు మరింత అందంగా ఉంటుందట. రష్యా, కొరియా, జపాన్‌తో పాటు చైనాలోని ఈశాన్య భాగాల్లో ఈ బాతులు ఎక్కువగా కనిపిస్తాయి. Exquisitely beautiful! And perhaps its return is a hopeful sign that nature hasn’t given up on us yet? https://t.co/wKlNo6Baq2 — anand mahindra (@anandmahindra) July 26, 2021 -
కోహ్లి డకౌట్; ఉత్తరాఖండ్ పోలీస్ వార్నింగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ 3వ వేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన విరాట్ కోహ్లీ మిడాఫ్ దిశగా ఫీల్డర్ క్రిస్ జోర్దాన్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ట్రై చేశాడు. కానీ అనూహ్యంగా బంతి బౌన్స్ కావడంతో.. కోహ్లి ఆశించిన విధంగా షాట కనెక్ట్ కాలేదు. దాంతో బంతి నేరుగా వెళ్లి క్రిస్ జోర్దాన్ చేతుల్లో పడింది. దీంతో కోహ్లి ఏమి చేయలేక నిరాశగా వెనుదిరిగాడు. అయితే కోహ్లి డకౌట్‌ను షేర్ చేస్తూ ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం తమ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. ''హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు.. బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవు. ఒకవేళ అలాకాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటేకోహ్లి మాదిరే జీవితంలోనూ డకౌట్ అవుతారు ''అంటూ ట్వీట్ చేశారు. అయితే కోహ్లిని కించపరచడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఇలా చేశామని ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం తెలిపింది. కాగా ఇంతకముందు పాకిస్థాన్‌పై 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా చేసిన నోబాల్ తప్పిదాన్ని జైపూర్ ట్రాఫిక్ పోలీసులు అప్పట్లో బ్యానర్లుగా వేయించి సిగ్నల్స్ వద్ద వాహనదారులకి అవగాహన కల్పించారు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అవగాహన కోసం పోలీసులు ఇలాంటివి వినియోగిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్ రాయ్ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది. చదవండి: సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం కోహ్లి కథ ముగిసినట్టేనా..! हेलमेट लगाना ही काफ़ी नहीं है! पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है, वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG — Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021 -
కోహ్లి చెత్త రికార్డు.. ధోనితో సమానంగా
అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులు సాధించడంలో ఎప్పుడు ముందుంటాడు. అయితే అవి చెత్త రికార్డులు కావచ్చు.. లేక మంచి రికార్డులు అయి ఉండొచ్చు. తాజాగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అండర్సన్ బౌలింగ్‌లో ఆప్‌స్టంప్ అవతల వెళుతున్న బంతిని టచ్ చేయడంతో కీపర్ ఫోక్స్ క్యాచ్‌గా అందుకున్నాడు. తద్వారా డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లి మరో చెత్త రికార్డును నమోదు చేశాడు. విరాట్ కోహ్లికి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డకౌట్. గతంలో ఎంఎస్ ధోని కూడా కెప్టెన్‌గా 8సార్లు డకౌటయ్యాడు. ఇప్పుడు కోహ్లి అతని రికార్డును సమం చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లి డకౌట్ కావడం ఇది రెండోసారి కావడం విశేషం. టెస్టుల్లో బుమ్రా కూడా 9 సార్లు డకౌట్ కాగా.. ఓవరాల్‌గా చూసుకుంటే కోహ్లి 12 సార్లు డకౌట్ అయ్యాడు. అతని కంటే ముందు ఇషాంత్ శర్మ టెస్టుల్లో 32 డకౌట్లతో టాప్‌లో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా 5వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 22 పరుగులు, అశ్విన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఓపెనర్ రోహిత్ శర్మ 49 పరుగుల వద్ద ఔట్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: రూల్స్ పక్కన పెట్టండి, నచ్చింది చేయండి: జడేజా గిల్ ఇలాగే ఆడావో.. రాహుల్, అగర్వాల్ వచ్చేస్తారు! -
అరుదైన బాతు.. 119 ఏళ్లకు ప్రత్యక్షం
డిస్పూర్: అరుదైన బాతు.. సప్తవర్ణాలతో హరివిల్లు అంతా తన ఒంటిపై పూసుకుని కనిపించే మాండరిన్ బాతు భారతదేశంలో 119 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. అస్సోంలో ఆ అరుదైన బాతు కనిపించడంతో పక్షుల ప్రేమికులు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ సరస్సులో ఈ బాతు ప్రత్యక్షమై సందడి చేస్తోంది. అన్ని రంగులతో అందంగా ఉండే ఈ పొట్టి బాతు పేరు మాండరిన్. దీని శాస్త్రీయ నామం అయెక్స్ గలెరికులాట. నిర్దేశిత కాలాల్లో కొన్ని పక్షులు వలసకు వెళ్తుంటాయి. మనదేశంలో కూడా కొన్ని పక్షులు ఇక్కడకు వస్తుంటాయి.. ఇక్కడి పక్షులు మరో చోటకు వెళ్తుంటాయి. అలా ఈ మాండరిన్ బాతు కూడా శతాబ్దం తర్వాత భారతదేశంలో కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డిబ్రూ నదికి ఒడ్డున బిల్ సరస్సు ప్రాంతం అరుదైన పక్షులు.. జంతుజాతులకు నిలయంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ఈ బాతు ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మనదేశంలో 1902లో కనిపించిన ఈ బాతు మళ్లీ ఇన్నేళ్లకు కనిపించిందని పక్షి ప్రేమికుడు బినంద హతిబోరియా తెలిపారు. ఈ బాతు 10 అందమైన పక్షుల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఈ బాతు చైనాకు సంబంధించినది తెలుస్తోంది. చైనా సంస్కృతి చిహ్నంలో ఈ పక్షి ఓ భాగం. ఆ దేశంలో చాలా విషయాల్లో ఈ బాతు ప్రస్తావన ఉంటుందంట. రష్యా, కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఈ బాతు ఎక్కువగా కనిపిస్తుంటుంది. Morning! The most handsome duck in our local pond has got to be this gorgeous mandarin duck! With his colourful plumage and gorgeous bright red beak he really does stand out from the crowd like a floating jewel! Happy Wednesday!#WednesdayMotivation pic.twitter.com/11TbBba6qz — Dr Amir Khan GP 💙 (@DrAmirKhanGP) February 17, 2021 -
అవార్డు విన్నింగ్ లెవల్లో నటించింది
ఓ బాతు ప్రయోగించిన తెలివి తేటలు సోషల్ మీడియాలో నెటిజన్ల చేత నవ్వుల పూలు పూయిస్తున్నాయి. ఆపద సమయంలో ఎదుర్కోవాల్సిన ధైర్యాన్ని, కావాల్సిన ఓపికను ప్రదర్శించిన బాతు ఆలోచన నెటిజన్లను ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ కుక్క ముందు బాతు చనిపోయినట్లు నటించింది. దీంతో కాసేపు వేచిచూసిన ఆ కుక్క అక్కడి నుంచి పక్కకు పోవడంతో బాతు మెరుపు వేగంతో లేచి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. అలా కుక్క బారిన నుంచి తన ప్రాణాలను దక్కించుకుంది. చదవండి: విరాళాలతో కరోనాను తరిమి కొడుతున్న దాతలు కాగా ఇంతకముందే దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నంద మళ్లీ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. నటించడమంటే..నిజాయితీగా మోసం చేయడం. కుక్క నుంచి తప్పించుకోవడానికి బాతు చనిపోయినట్లు నటిస్తుంది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారడంతో లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అనేక మంది కామెంట్ చేస్తూ.. బాతు తెలివి తేటలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాతు నటన అవార్డు విన్నింగ్ లెవల్లో ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం Acting is all about faking honestly😊 Duck acts as dead to escape the dog... pic.twitter.com/o4zc0W7eHt — Susanta Nanda IFS (@susantananda3) April 12, 2020 -
వైరల్ వీడియో: స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం
స్నేహం.. ఈ పదానికి అర్థం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ విషయాన్ని అయినా ముందుగా స్నేహితుని దగ్గరే చెప్పేస్తాం. మన సంతోషాలతో పాటు బాధలను కూడా పంచుకునే వాడే నిజమైన స్నేహితుడు. కుటుంబం తర్వాత ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది ఆ స్నేహితుల దగ్గరే. మరి ఆ స్నేహితులు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఇక్కడ చేపలకు దొరికింది. అవును చేపలకు ఓ మంచి స్నేహితుడు దొరికాడు. అతని పేరు బాతు. నమ్మడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవమే.. ఓ సరస్సుకు ఆనుకుని బాతులు ఉన్నాయి. అందులో ఓ బాతుకు చేపతో స్నేహం కుదిరింది. అక్కడ బాతు తింటున్న గింజలను నోటితో చేపలకు అందించింది. దీంతో అక్కడికి చేరుకునే చేపల సంఖ్య పెరిగింది. అయినా వచ్చిన వాటన్నింటికీ ఆహారాన్ని అందిస్తూనే ఉంది. ఈ దృశ్యాన్ని బెంగుళూరుకు చెందిన అటవీశాఖ అధికారి వీడియో తీసి తన ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా మంత్రముగ్దులు అవుతున్నారు. ‘‘స్వచ్ఛమైన స్నేహానికి ఇది నిదర్శనం. కేవలం జంతువులు మాత్రమే ఏలాంటి కల్మషం లేని మనస్సును కలిగి ఉంటాయి. మనం నేర్చుకోవాలనుకుంటే ప్రకృతి మనకు చాలా నేర్పిస్తుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.’’