Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒక ఊహించని పరిణామం జరిగింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లేని పరుగు కోసం ప్రయత్నించిన ఫించ్.. ఓపెనర్ నరైన్‌ను రనౌట్ చేశాడు. ఐపీఎల్‌లో 150వ మ్యాచ్ ఆడుతున్న నరైన్ ఆరంభంలోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్కోరు సాధించాలన్న కల తీరకుండా ఫించ్ అతనికి అడ్డుపడ్డాడు.
Courtesy: IPL Twitter
విషయంలోకి వెళితే.. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని ఫించ్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే షాట్ కొట్టిన వెంటనే సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. రిస్క్ అని తెలిసినా పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న హెట్‌మైర్ బులెట్ వేగంతో డైరెక్ట్ త్రో విసిరాడు. నరైన్ సగం క్రీజు దాటేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో నరైన్ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. డైమండ్ డక్ అంటే ఒక్క బంతి ఆడకుండానే వెనుదిరగడం. బహుశా ఐపీఎల్‌లో నరైన్‌దే తొలి డైమండ్ డక్ అనుకుంటా.
కాగా నరైన్ ఔట్ విషయంలో ఫించ్‌ను తప్పుబట్టారు. తొలి బంతికే ఎందుకంత తొందర.. నరైన పాలిట ఫించ్ విలన్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే నరైన్‌ను ఔట్ చేశానన్న బాధ కలిగిందేమో తెలియదు గాని ఆ తర్వాత ధాటిగా ఆడడం మొదలుపెట్టాడు. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఫించ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత 28 బంతుల్లో 58 పరుగులు చేసి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చదవండి: IPL 2022: సీజన్‌లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్.. పలు రికార్డులు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment