
డిస్పూర్: అరుదైన బాతు.. సప్తవర్ణాలతో హరివిల్లు అంతా తన ఒంటిపై పూసుకుని కనిపించే మాండరిన్ బాతు భారతదేశంలో 119 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. అస్సోంలో ఆ అరుదైన బాతు కనిపించడంతో పక్షుల ప్రేమికులు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ సరస్సులో ఈ బాతు ప్రత్యక్షమై సందడి చేస్తోంది.
అన్ని రంగులతో అందంగా ఉండే ఈ పొట్టి బాతు పేరు మాండరిన్. దీని శాస్త్రీయ నామం అయెక్స్ గలెరికులాట. నిర్దేశిత కాలాల్లో కొన్ని పక్షులు వలసకు వెళ్తుంటాయి. మనదేశంలో కూడా కొన్ని పక్షులు ఇక్కడకు వస్తుంటాయి.. ఇక్కడి పక్షులు మరో చోటకు వెళ్తుంటాయి. అలా ఈ మాండరిన్ బాతు కూడా శతాబ్దం తర్వాత భారతదేశంలో కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డిబ్రూ నదికి ఒడ్డున బిల్ సరస్సు ప్రాంతం అరుదైన పక్షులు.. జంతుజాతులకు నిలయంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ఈ బాతు ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
మనదేశంలో 1902లో కనిపించిన ఈ బాతు మళ్లీ ఇన్నేళ్లకు కనిపించిందని పక్షి ప్రేమికుడు బినంద హతిబోరియా తెలిపారు. ఈ బాతు 10 అందమైన పక్షుల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఈ బాతు చైనాకు సంబంధించినది తెలుస్తోంది. చైనా సంస్కృతి చిహ్నంలో ఈ పక్షి ఓ భాగం. ఆ దేశంలో చాలా విషయాల్లో ఈ బాతు ప్రస్తావన ఉంటుందంట. రష్యా, కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఈ బాతు ఎక్కువగా కనిపిస్తుంటుంది.
Morning!
— Dr Amir Khan GP 💙 (@DrAmirKhanGP) February 17, 2021
The most handsome duck in our local pond has got to be this gorgeous mandarin duck!
With his colourful plumage and gorgeous bright red beak he really does stand out from the crowd like a floating jewel!
Happy Wednesday!#WednesdayMotivation pic.twitter.com/11TbBba6qz


Comments
Please login to add a commentAdd a comment