dispur
-
అసోం అత్యాచార ఘటన: ‘నా బిడ్డను చూసి తల్లడిల్లిపోయా’
దిస్పూర్:అసోంలోని నాగావ్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం నాగావ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణం జరిగిన అనంతరం ఆమెను నిందితులు రోడ్డు పక్కన వదిలేశారు. ఆమె స్పృహ కోల్పోయి స్థానికులకు కనిపించగా ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి స్పందించారు. గౌహాతిలో పనిచేస్తున్న ఆయన సమాచారం అందగానే తమ గ్రామానికి వచ్చారు. తన కూతురుకు ఇలా జరగటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘నేను నా కూతురును చూసినప్పడు ఆమె కనీసం మాట్లాడలేకపోయింది. ఈ దారుణ ఘటనతో మా గ్రామంలోని ప్రజలంతా తీవ్రమై భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. లేదంటే.. తమ ఆడపిల్లలకు కూడా ఇలాంటివి జరుగుతాయనే భయంతో జనం బతకాల్సి వస్తుంది’’ అని అన్నారు.మరోవైపు.. ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు. -
కాంగ్రెస్ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్
డిస్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఉన్న ఒక వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ వీడియోలో ఈశాన్య రాష్ట్రాలను తొలగిస్తూ ఉంచిన భారతదేశం మ్యాప్ ఫోటోను జత చేస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలపై ఇదే కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చైనాకు అమ్మేశారా? హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే తొందరలో ఈశాన్య రాష్ట్రాలపై వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టుకున్నారు. భారతదేశం పటంలో ఈశాన్య రాష్ట్రాలను తొలగించి విదేశాల్లో కలిపేశారు. బహుశా మొత్తం భూమిని ఏదైనా పొరుగుదేశానికి అమ్మెందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉంటారని అన్నారు. దీని కోసమేనా రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు వెళ్లారు. లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలైన షర్జీల్ ఇమామ్‌కు వారి పార్టీలో సభ్యత్వం ఏమైనా కల్పించారా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూడగానే షాకయ్యా. కాంగ్రెస్ పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలను చైనాకు అమ్మేసిందా ఏంటనుకున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే పాల్పడిన దేశ వ్యతిరేక చర్య అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగబోయే లోక్‌సభ ఎన్నికలు వారిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. Seems the Congress party has secretly struck a deal to sell the entire land of North East to some neighbouring country. Is this why Rahul went abroad? Or has the party given membership to Sharjeel Imam? pic.twitter.com/oO9fLp86p8 — Himanta Biswa Sarma (@himantabiswa) September 16, 2023 ఎగతాళి చేయబోయి.. అసలు వివాదం మొదలవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ బాలీవుడ్ క్లాసిక్ 'దీవార్' సినిమాలోని అమితాబ్ బచ్చన్ శశి కపూర్ మధ్య జరిగే సంభాషణను పేరడీ చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మోదీ మాట్లాడుతూ.. ' నా దగ్గర ఈడీ, పోలీస్, అధికారం, డబ్బు. స్నేహితులు అనీ ఉన్నాయి.. నీ దగ్గరఏముంది? అని అడగగా రాహుల్ పాత్ర సమాధానమిస్తూ నా దగ్గర తల్లి లాంటి యావత్ భారతదేశమే ఉందని సమాధానమిస్తారు. వీడియో వరకు అంతా బాగానే ఉంది కానీ వెనుక వైపున గోడకు తగిలించిన భారతదేశం మ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలను లేపేయడమే అసలు వివాదానికి తెరతీసింది. ఇంకేముంది ఈ స్క్రీన్‌షాట్‌ను తీసుకుని అదే సొషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాయి బీజేపీ వర్గాలు. नरेंद्र मोदी: मेरे पास ED है, पुलिस है, सत्ता है, पैसा है, दोस्त है.. क्या है तुम्हारे पास? राहुल गांधी: मेरे साथ पूरा देश है ❤️ pic.twitter.com/IMY6MHVz8q — Congress (@INCIndia) September 16, 2023 ఇది కూడా చదవండి: వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ.. -
ట్రక్కులకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవ దహనం
డిస్పూర్: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. హసావోలో కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(గురువారం) అర్ధరాత్రి హాసావోలోని ఉమ్రాంగ్సోలోని డిస్మావో గ్రామంలో కొంత మంది దుండగులు ఏడు ట్రక్కులను తగులబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు గుర్తించారు. వారి మృత దేహలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు -
నన్ను జైల్లోనే ఉంచేందుకు కుట్ర
గువాహటి: తనను జైల్లోనే ఉంచేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుట్రలు సాగిస్తున్నారని, ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)పై ఒత్తిడి పెంచుతున్నారని అస్సాం స్వతంత్ర ఎమ్మెల్యే, రాయ్జోర్ దళ్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారుడిని పరామర్శించేందుకు అఖిల్‌కు ఎన్ఐఏ కోర్టు రెండు రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. ఆయన శనివారం జోర్హాట్ జిల్లాలోని సలేన్‌ఘాట్ గ్రామంలో తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నీ తెలుసని అన్నారు. ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు అస్సాంలో చేయొద్దని ముఖ్యమంత్రికి హితవు పలికారు. ప్రజాస్వామ్య నిబంధనలు పాటించాలని సూచించారు. సీఎం శర్మ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మే నాయకుడే అయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే తన విడుదల కోసం కేబినెట్ నిర్ణయం తీసుకునేదన్నారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన అఖిల్ గొగోయ్‌ను 2019 డిసెంబర్ 12న జోర్హాట్లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉంటున్నారు. అఖిల్ జైల్లో నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. చదవండి: వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్! మిషన్ 2022పై కమలదళం కసరత్తు -
కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా? రచయిత్రి వ్యాఖ్యలు దుమారం
గౌహతి: ఛత్తీస్‌గడ్‌లో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫేసుబుక్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ‘జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో మరణిస్తే అమరులా? అని ప్రశ్నించింది. అలాగైతే మిగతా సిబ్బంది కూడా అమరవీరులే అవుతారని రచయిత్రి శిఖాశర్మ పేర్కొన్నారు. గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి ఆమె ఫేసుబుక్ పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రచయిత్రి శిఖాశర్మను డిస్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శిఖాశర్మ ఫేస్బుక్లో చేసిన పోస్టు ఇదే.. ‘జీతం పొందేవారు మృతి చెందేవారిని అమరవీరులుగా గుర్తించొద్దు. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో మృతి చెందుతారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు మీడియా! ’ అని స్థానిక భాషలో ఆమె రాసింది. శిఖా శర్మ ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది కూడా. -
అరుదైన బాతు.. 119 ఏళ్లకు ప్రత్యక్షం
డిస్పూర్: అరుదైన బాతు.. సప్తవర్ణాలతో హరివిల్లు అంతా తన ఒంటిపై పూసుకుని కనిపించే మాండరిన్ బాతు భారతదేశంలో 119 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. అస్సోంలో ఆ అరుదైన బాతు కనిపించడంతో పక్షుల ప్రేమికులు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ సరస్సులో ఈ బాతు ప్రత్యక్షమై సందడి చేస్తోంది. అన్ని రంగులతో అందంగా ఉండే ఈ పొట్టి బాతు పేరు మాండరిన్. దీని శాస్త్రీయ నామం అయెక్స్ గలెరికులాట. నిర్దేశిత కాలాల్లో కొన్ని పక్షులు వలసకు వెళ్తుంటాయి. మనదేశంలో కూడా కొన్ని పక్షులు ఇక్కడకు వస్తుంటాయి.. ఇక్కడి పక్షులు మరో చోటకు వెళ్తుంటాయి. అలా ఈ మాండరిన్ బాతు కూడా శతాబ్దం తర్వాత భారతదేశంలో కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డిబ్రూ నదికి ఒడ్డున బిల్ సరస్సు ప్రాంతం అరుదైన పక్షులు.. జంతుజాతులకు నిలయంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ఈ బాతు ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మనదేశంలో 1902లో కనిపించిన ఈ బాతు మళ్లీ ఇన్నేళ్లకు కనిపించిందని పక్షి ప్రేమికుడు బినంద హతిబోరియా తెలిపారు. ఈ బాతు 10 అందమైన పక్షుల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఈ బాతు చైనాకు సంబంధించినది తెలుస్తోంది. చైనా సంస్కృతి చిహ్నంలో ఈ పక్షి ఓ భాగం. ఆ దేశంలో చాలా విషయాల్లో ఈ బాతు ప్రస్తావన ఉంటుందంట. రష్యా, కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఈ బాతు ఎక్కువగా కనిపిస్తుంటుంది. Morning! The most handsome duck in our local pond has got to be this gorgeous mandarin duck! With his colourful plumage and gorgeous bright red beak he really does stand out from the crowd like a floating jewel! Happy Wednesday!#WednesdayMotivation pic.twitter.com/11TbBba6qz — Dr Amir Khan GP 💙 (@DrAmirKhanGP) February 17, 2021 -
రూ.300కోట్లు,300కేజీల గోల్డ్, గన్స్ ఏమైనట్లు?
ఆలయంలోని కాళికాదేవి విగ్రహం కింద పెద్ద గొయ్యి. అందులో రూ.300 కోట్ల నగదు, 300 కేజీల బంగారం, నాలుగు ఏకే 47 తుపాకులు. భారీ నిధి కావటంతో దానిని స్వాధీనం చేసుకోవటానికి ఆర్మీ రంగంలోకి దిగింది. అధికారులు గర్భగుడిలోకివెళ్లి కాళీ విగ్రహాన్ని పక్కకు జరిపారు. అందరూ షాక్. అక్కడ నిధిలేదు. ఆర్మీ వస్తోందన్న సమాచారంతో ఎవరో నిధిని మాయం చేశారు. ఈ సంఘటన అసోం రాజధాని డిస్ పూర్ లో 2014, జూన్ 1న జరిగింది. అంతకు కొద్దిరోజుల ముందే ఆ ఆలయ ధర్మకర్త, అతని భార్య దారుణ హత్యకు గురయ్యారు. హత్యలపై కేసు నమోదయిందికానీ, నిధిని ఎవరు దొంగిలించారనే విషయాన్ని స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. ఒక ఆర్మీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి మాత్రం ఏదో తేడా జరుగుతోందని అనుమానించాడు. దొంగతనం జరిగిన కొద్ది సేపటికే అక్కడికి చేరుకుని కొన్ని ఆధారాలను సేకరించి, వాటిని సుప్రీంకోర్టుకు సమర్పిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశాడు. 300 కోట్ల రూపాయలు, 300 కేజీల బంగారం, నాలుగు తుపాకులు.. ఇంత భారీ మొత్తాన్ని అంత ఈజీగా కొల్లగొట్టడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గర్హించింది. టెంపుల్ ట్రెజర్ రాబరీపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు మూడురోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ మాజీ అధికారి మనోజ్ కుమార్ కౌశల్ కథనం ప్రకారం ఈ మిస్టరీ వెనుక అతిభారీ కుట్రలు దాగున్నాయి. ఈ ఉదంతం అసలెలా మొదలైందంటే.. తేయాకు తోటలకు ప్రసిద్ధిగాంచిన అసోం అనేక తీవ్రవాద సంస్థలకు నెలవు. జాతుల మధ్య వైరంగా ప్రారంభమైన తగాదా చివరికి దేశవ్యతిరేక కార్యకలాపాల వరకు వెళ్లింది. ఉల్ఫా, ఎన్ డీఎఫ్ బీ లాంటి సంస్థలు ఆ రాష్ట్రంలో చేసిన విధ్వంసం అంతాయింతాకాదు. ఈ తీవ్రవాద సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు టీ తోటల యజమానులు. రకరకాలుగా యజమానులను బెదిరించి తీవ్రవాదులు డబ్బువసూలు చేస్తారు. డిస్ పూర్ లోని ఓ టీతోట యజమాని మృదుల్ భట్టాచార్య.. అసోం టీ గార్డెజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. తీవ్రవాదుల ఆదేశాల మేరకు భట్టాచార్య భారీ నగదు, బంగారం, తుపాకులను సేకరించి ఆయన టీతోటలోని కాళీ మాత ఆలయంలో దాచాడు. అయితే డబ్బు పోగేసిన రెండుమూడు రోజులకే ఆయనను, ఆయన భారను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. దుండగులు టీతోటలోని ఆలయం బయటి నుంచి సొరంగం నిధిని ఎత్తుకుపోయినట్లు ఆర్మీ మాజీ అధికారి కౌశల్ చెబుతున్నారు. దొంగతం జరిగిన రెండు రోజుల తర్వాత కొందరు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమఅయిందని, వారంతా హత్యకు గురైన భట్టాచార్య సన్నిహితులేనని, ఈ మేరకు రహస్యంగా సేకరించిన 11 బ్యాంక్ అకౌంట్ల వివరాలు కోర్టుకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కౌశల్ అందించిన ఆధారాలన్నీ సహేతుకమని కోర్టులో తేలేదాకా టెంపుల్ ట్రజరీ రాబరీ మిస్టరీనే!