అసోం అత్యాచార ఘటన: ‘నా బిడ్డను చూసి తల్లడిల్లిపోయా’ | Assam molestation case: Father says teen victim wouldnt talk | Sakshi
Sakshi News home page

అసోం అత్యాచార ఘటన: ‘నా బిడ్డను చూసి తల్లడిల్లిపోయా’

Published Sun, Aug 25 2024 8:21 AM | Last Updated on Sun, Aug 25 2024 8:21 AM

Assam molestation case: Father says teen victim wouldnt talk

దిస్‌పూర్‌:అసోంలోని నాగావ్‌ జిల్లాలో మైనర్‌ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం నాగావ్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణం జరిగిన అనంతరం ఆమెను నిందితులు రోడ్డు పక్కన వదిలేశారు. ఆమె స్పృహ కోల్పోయి స్థానికులకు కనిపించగా ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి స్పందించారు. గౌహాతిలో పనిచేస్తున్న ఆయన  సమాచారం అందగానే తమ గ్రామానికి వచ్చారు. తన కూతురుకు ఇలా జరగటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నేను నా కూతురును చూసినప్పడు ఆమె కనీసం మాట్లాడలేకపోయింది. ఈ దారుణ ఘటనతో మా గ్రామంలోని ప్రజలంతా తీవ్రమై భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. లేదంటే.. తమ ఆడపిల్లలకు కూడా ఇలాంటివి జరుగుతాయనే భయంతో జనం బతకాల్సి వస్తుంది’’ అని అన్నారు.

మరోవైపు.. ఈ ఘటనలో అరెస్టైన  ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement