
డిస్పూర్: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. హసావోలో కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(గురువారం) అర్ధరాత్రి హాసావోలోని ఉమ్రాంగ్సోలోని డిస్మావో గ్రామంలో కొంత మంది దుండగులు ఏడు ట్రక్కులను తగులబెట్టారు.
దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు గుర్తించారు. వారి మృత దేహలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment