కాంగ్రెస్‌ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్‌ | Himanta Sarma Flags Map Error In Congress Deewar Video | Sakshi
Sakshi News home page

ఈశాన్య రాష్ట్రాలను తొలగించి భారత మ్యాప్.. కాంగ్రెస్‌ వివాదాస్పద వీడియో

Published Sun, Sep 17 2023 8:51 AM | Last Updated on Sun, Sep 17 2023 11:39 AM

Himanta Sarma Flags Map Error In Congress Deewar Video  - Sakshi

డిస్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఉన్న ఒక వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ వీడియోలో ఈశాన్య రాష్ట్రాలను తొలగిస్తూ ఉంచిన భారతదేశం మ్యాప్ ఫోటోను జత చేస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలపై ఇదే కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

చైనాకు అమ్మేశారా?
హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే తొందరలో ఈశాన్య రాష్ట్రాలపై వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టుకున్నారు. భారతదేశం పటంలో ఈశాన్య రాష్ట్రాలను తొలగించి విదేశాల్లో కలిపేశారు. బహుశా మొత్తం భూమిని ఏదైనా పొరుగుదేశానికి అమ్మెందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉంటారని అన్నారు. దీని కోసమేనా రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు వెళ్లారు. లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలైన షర్జీల్ ఇమామ్‌కు వారి పార్టీలో సభ్యత్వం ఏమైనా కల్పించారా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూడగానే షాకయ్యా. కాంగ్రెస్ పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలను చైనాకు అమ్మేసిందా ఏంటనుకున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే పాల్పడిన దేశ వ్యతిరేక చర్య అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగబోయే లోక్‌సభ ఎన్నికలు వారిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

ఎగతాళి చేయబోయి.. 
అసలు వివాదం మొదలవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ బాలీవుడ్ క్లాసిక్ 'దీవార్' సినిమాలోని అమితాబ్ బచ్చన్ శశి కపూర్ మధ్య జరిగే సంభాషణను పేరడీ చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మోదీ మాట్లాడుతూ.. ' నా దగ్గర ఈడీ, పోలీస్, అధికారం, డబ్బు. స్నేహితులు అనీ ఉన్నాయి.. నీ దగ్గరఏముంది? అని అడగగా రాహుల్ పాత్ర సమాధానమిస్తూ నా దగ్గర తల్లి లాంటి యావత్ భారతదేశమే ఉందని సమాధానమిస్తారు. వీడియో వరకు అంతా బాగానే ఉంది కానీ వెనుక వైపున గోడకు తగిలించిన భారతదేశం మ్యాప్‌లో ఈశాన్య  రాష్ట్రాలను లేపేయడమే అసలు వివాదానికి తెరతీసింది. ఇంకేముంది ఈ స్క్రీన్‌షాట్‌ను తీసుకుని అదే సొషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాయి బీజేపీ వర్గాలు.  

ఇది కూడా చదవండి: వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement