Shashi Kapoor
-
తెలివితక్కువదానిలా ఉన్నావంటూ ఆ హీరో తిట్టాడు: సీనియర్ హీరోయిన్
కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు హీరోయిన్లు మొహమాటపడుతుంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాల్సిందే! కాదూ, కూడదు అని చెప్తే చిత్రయూనిట్ అసలు ఒప్పుకోదు. తనకు అలాంటి ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైందంటోంది అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ.9 ఏళ్ల వయసులోనే ఆయనకు ఫ్యాన్తొమ్మిదేళ్ల వయసులోనే శశి కపూర్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తనతో కలిసి తొలిసారి ఫకీరా చిత్రంలో నటించాను. అందులో దిల్ మే తుజే బితకర్ అని ఓ పాట ఉంటుంది. సత్యనారాయణ్గారు కొరియోగ్రఫీ చేశారు. శశి కపూర్ రావడానికి ముందే నేను సెట్‌కు వెళ్లిపోయాను. నా వల్ల కాలేదుకొరియోగ్రాఫర్ చెప్తున్న స్టెప్పులు చాలా అభ్యంతరకరంగా అనిపించాయి. ఆ పాటలో హీరోతో సన్నిహితంగా మెదిలే సన్నివేశాలున్నాయి. నా వల్ల కాక ఏడ్చేశాను. నాకు ఇష్టం లేదు, అలాంటి సీన్స్‌లో నటించలేను అని నా మేకప్మెన్తో చెప్తూ ఏడ్చేశాను. ఇంతలో ఆ గదిలోకి శశి కపూర్ వచ్చాడు. ఏమైంది నీకు? అని ప్రశ్నించాడు. నేను ఆ సీన్స్ చేయలేనన్నాను. తెలివితక్కువదానిలా ఉన్నావే!అందుకాయన ఎందుకని చేయవు? అలాంటప్పుడు యాక్టర్ అవుతా అని మీ అమ్మకు చెప్పేముందు ఇలాంటవన్నీ ఉంటాయని తెలియలేదా? తెలివితక్కువదానిలా ఉన్నావే..! అని తిట్టి వెళ్లిపోయాడు. నీచుడు, నాతో ఇంత దురుసుగా మాట్లాడేంటి అని నేనూ తిట్టుకున్నాను. కానీ అరగంట తర్వాత ఆయన ప్రతి స్టెప్ మార్పించేశాడు. సాంగ్‌లో చాలావరకు సీన్స్ తీసేయించాడు. అప్పుడు ఆయన గొప్పతనం అర్థమైంది' అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కాంగ్రెస్ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్
డిస్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఉన్న ఒక వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ వీడియోలో ఈశాన్య రాష్ట్రాలను తొలగిస్తూ ఉంచిన భారతదేశం మ్యాప్ ఫోటోను జత చేస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలపై ఇదే కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చైనాకు అమ్మేశారా? హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే తొందరలో ఈశాన్య రాష్ట్రాలపై వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టుకున్నారు. భారతదేశం పటంలో ఈశాన్య రాష్ట్రాలను తొలగించి విదేశాల్లో కలిపేశారు. బహుశా మొత్తం భూమిని ఏదైనా పొరుగుదేశానికి అమ్మెందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉంటారని అన్నారు. దీని కోసమేనా రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు వెళ్లారు. లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలైన షర్జీల్ ఇమామ్‌కు వారి పార్టీలో సభ్యత్వం ఏమైనా కల్పించారా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూడగానే షాకయ్యా. కాంగ్రెస్ పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలను చైనాకు అమ్మేసిందా ఏంటనుకున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే పాల్పడిన దేశ వ్యతిరేక చర్య అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగబోయే లోక్‌సభ ఎన్నికలు వారిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. Seems the Congress party has secretly struck a deal to sell the entire land of North East to some neighbouring country. Is this why Rahul went abroad? Or has the party given membership to Sharjeel Imam? pic.twitter.com/oO9fLp86p8 — Himanta Biswa Sarma (@himantabiswa) September 16, 2023 ఎగతాళి చేయబోయి.. అసలు వివాదం మొదలవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ బాలీవుడ్ క్లాసిక్ 'దీవార్' సినిమాలోని అమితాబ్ బచ్చన్ శశి కపూర్ మధ్య జరిగే సంభాషణను పేరడీ చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మోదీ మాట్లాడుతూ.. ' నా దగ్గర ఈడీ, పోలీస్, అధికారం, డబ్బు. స్నేహితులు అనీ ఉన్నాయి.. నీ దగ్గరఏముంది? అని అడగగా రాహుల్ పాత్ర సమాధానమిస్తూ నా దగ్గర తల్లి లాంటి యావత్ భారతదేశమే ఉందని సమాధానమిస్తారు. వీడియో వరకు అంతా బాగానే ఉంది కానీ వెనుక వైపున గోడకు తగిలించిన భారతదేశం మ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలను లేపేయడమే అసలు వివాదానికి తెరతీసింది. ఇంకేముంది ఈ స్క్రీన్‌షాట్‌ను తీసుకుని అదే సొషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాయి బీజేపీ వర్గాలు. नरेंद्र मोदी: मेरे पास ED है, पुलिस है, सत्ता है, पैसा है, दोस्त है.. क्या है तुम्हारे पास? राहुल गांधी: मेरे साथ पूरा देश है ❤️ pic.twitter.com/IMY6MHVz8q — Congress (@INCIndia) September 16, 2023 ఇది కూడా చదవండి: వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ.. -
ఆస్కార్ వేడుకలో శ్రీదేవికి నివాళి
లాస్ ఏంజెల్స్: 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన వేడుక సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. అవార్డులు ప్రకటించే ఏడాదిలో కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించడం ఆస్కార్‌లో సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవిని ఆస్కార్ వేదిక గౌరవించింది. శ్రీదేవి జ్ఞాపకార్థం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై అమెకు నివాళులర్పించారు. శ్రీదేవితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత శశి కపూర్‌కు కూడా స్మృత్యంజలి ఘటించారు. వీరిద్దరి చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది. ‘ఇన్ మెమొరియం’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ స్టార్ రోజర్ మౌరే, మేరీ గోల్డ్బెర్గ్, జోహాన్ జోహోన్సన్,జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్‌లకు కూడా అకాడమీ అవార్డుల వేదిక నివాళర్పించింది. -
శశికపూర్‌కు బాలీవుడ్ ఘన నివాళి
-
శశికపూర్ చనిపోతే శశిథరూర్‌కు ఫోన్స్.!
న్యూఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు శశికపూర్ సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్యాస విడిచిన విషయం తెలిసిందే. అయితే టైమ్స్ నౌ చానెల్ అత్యుత్సాహం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను ఇబ్బందులకు గురిచేసింది. శశికపూర్‌కు బదులు శశిథరూర్ మృతి చెందినట్లు సదరు టీవీ చానెల్ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. దీంతో శశిథరూర్ అభిమానులు ఆయన ఆఫీసుకు కాల్ చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ‘శశికపూర్ చనిపోవడం బాధాకరమైన విషయం. కొంత మంది నేను మరణించినట్లు భావించారు. నా కార్యాలయానికి సోమవారం ఉదయం నుంచి ఫోన్సు వచ్చాయి. కొంత మంది జర్నలిస్టులు కూడా ఫోన్ కాల్స్ చేసి తన ఆరోగ్య విషయం గురించి తెలుసుకున్నారు. నాకేం కాలేదు. శశికపూర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఇక తప్పును గుర్తించిన టైమ్స్‌నౌ చానెల్ శశిథరూర్‌ను క్షమాణలు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. I feel a part of me is gone. A great actor, smart, cosmopolitan, impossibly handsome & w/a name that was often confused w/mine. (My office got two calls from journalists today about my reportedly serious ill-health!) I will miss #ShashiKapoor. Condolences2his family&all his fans pic.twitter.com/fSz3jafPZJ — Shashi Tharoor (@ShashiTharoor) 4 December 2017 Thanks. No problem. Mistakes happen. Glad to be able to crack a smile at a tragic moment. https://t.co/3VxIpZ5yED — Shashi Tharoor (@ShashiTharoor) 4 December 2017 -
తప్పులో కాలేసిన బీబీసీ : శశికపూర్‌కు బదులు...
బ్రాడ్కాస్ట్ సర్వీసుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బీబీసీ తప్పులో కాలేసింది. అలనాటి మేటి బాలీవుడ్ నటుడు శశికపూర్ మృతిచెందిన సందర్భంగా బీబీసీ న్యూస్ తప్పుడు వీడియో క్లిప్‌ను షేర్చేసింది. శశికపూర్ మరణం గురించి మాట్లాడుతూ.. వీడియో క్లిప్‌లో రిషి కపూర్, అమితాబ్ బచ్చన్లను బ్రాడ్కాస్ట్ చేసింది. దీంతో వెంటనే బీబీసీ న్యూస్ ఛానెల్‌పై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. అనంతరం తప్పును తెలుసుకున్న బీబీసీ-ఎడిటర్ పౌల్ రోయల్, తాము చేసిన అతిపెద్ద తప్పుకు క్షమాపణ చెప్పారు. శశికపూర్ మృతి సందర్భంగా షేర్ చేసిన వీడియోలో తప్పుడు చిత్రాలను చూపించినందుకు వెర్రీ సారీ అంటూ పౌల్ ట్వీట్ చేశారు. సాధారణంగా ఇలాంటి తప్పులు జరుగవు, పొరపాటున జరిగినందుకు క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు. బీబీసీ బ్రాడ్కాస్ట్ చేసిన ఈ వార్తపై మాత్రం ట్విట్టర్ యూజర్లు పెద్ద ఎత్తునే విమర్శల వర్షం కురిపించారు. Hang on @bbcnews Shashi Kapoor has died not Amitabh Bachan or Rishi Kapoor, who you've weirdly used to illustrate the story. pic.twitter.com/48jo6DGjU6 — Media Diversified (@WritersofColour) December 4, 2017 Did BBC News at 10 cover the Shashi Kapoor story but just showed footage of Amitabh Bhachan and Rishi Kapoor? I'm no Bollywood expert but that's what it looked like to me. My sister thought Amitabh had died as well!? 😳 — Trishna Bharadia (@TrishnaBharadia) December 4, 2017 @BBCNews Too bad BBC News at 10 you broadcasted the news of Shashi Kapoors demise with film snippets of Rishi Kapoor and Amitabh Bachchan in it, two completely wrong and totally alive actors. Correct film, Kabhi Kabhi, but wrong actors aired. Very stupid and rude indeed! — Dee Akther (@DeeAkther) December 4, 2017 #BBCNewsTen is very sorry wrong images were used to mark the death of Shashi Kapoor. Not our usual standards and I apologise for any upset. — Paul Royall (@paulroyall) December 4, 2017 -
శశికపూర్ కన్నుమూత
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు శశికపూర్(79) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. పాతతరం కథా నాయకుడు పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడే శశికపూర్. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 1961లో ధర్మపుత్ర సినిమాలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన శశికపూర్ 116 చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లవర్‌బాయ్‌గా70, 80వ దశకాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్‌వంటి సినిమాలు చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో గౌరవించింది. శశికపూర్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ప్రముఖుల సంతాపం శశికపూర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ఆయన నటించి, నిర్మించిన ఎన్నో సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయని, సినీ, నాటక రంగానికి ఆయన సేవలు శ్లాఘనీయమన్నారు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆయన ప్రజల హృదయాల్లో ఎన్నటికీ నిలిచిపోతారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శశికపూర్ మృతి తీవ్ర విచారం కలిగించిందని ప్రధాని మోదీ తెలిపారు. సినీ, నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారని చెప్పారు. శశికపూర్ అద్భుతమైన నటుడని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఒక సినీ దిగ్గజం వెళ్లిపోయిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు. -
శశి వదనుడు
ఈ సంవత్సరం కపూర్ ఫ్యామిలీకి క్రిస్మస్ లంచ్ లేనట్టే. కేండిల్స్ వెలగవు. కేక్స్ షేర్ కావు. అందరూ నవ్వుకుంటూ ఎదురూ బొదురూ కూచుని శశికపూర్ పెదాల మీద విరిసే ఆ చిర్నవ్వును చూస్తూ భోం చేయలేరు. ప్రతి సంవత్సరం శశి కపూర్ కిస్మ్రస్కు కపూర్ కుటుంబ సభ్యులందరినీ తన ఇంటికి పిలిచి లంచ్ ఇస్తాడు. ఎవరు ఎక్కడ ఉన్నా తప్పక హాజరు కావాల్సిందే. ఇది తన గతించిన భార్య జెన్నిఫర్ జ్ఞాపకార్థం. జెన్నిఫర్ అంటే శశి కపూర్‌కు ప్రాణం. శశి కపూర్ అంటే కపూర్ కుటుంబానికి ప్రాణం. తండ్రి పృధ్వీరాజ్ కపూర్ పులి. వెళ్లిపోయాడు. ఆయన కడుపున మూడు పులి పిల్లలు పుట్టాయి. రాజ్ కపూర్– వెళ్లిపోయాడు. షమ్మీ కపూర్– వెళ్లిపోయాడు. ఇక ఆ తరానికి ఆఖరు జ్ఞాపకంగా శశికపూర్ ఈ సాయంత్రం వరకూ ఉన్నాడు. వెళ్లిపోయాడు. ఈ డిసెంబర్ మాసంలో ఇది కరుకైన జ్ఞాపకం. శశి కపూర్‌ని ఆ ఇంట్లో ‘హ్యాండ్సమ్ కపూర్’ అనేవారు. కారణం ఆ ఇంట్లో ఊబకాయం ఉంది. పృధ్వీరాజ్ కపూర్ ఆ వొంటితో బాధ పడ్డాడు. రాజ్‌కపూర్ తొందరగా దాని బారిన పడ్డాడు. షమ్మీ కపూర్ ముందు నుంచీ బొద్దు కపూరే. ఒక్క శశికపూరే చక్కగా, పలుచగా, చలాకీగా ఉండేవాడు. అందుకే అతడు హ్యాండ్సమ్. గమనించి చూడండి. అతడి కింద పళ్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఆ రోజుల్లో కాస్మటిక్ డెంటిస్ట్రీ లేదు. అయినా తాను ఆ పళ్లను ఒక మేజిక్ వెనుక దాచి పెట్టగలిగాడు. ఆ మేజిక్– చిర్నవ్వు. శశికపూర్ ఎంత అందంగా నవ్వేవాడంటే ఆ నవ్వుకే అతడికి చాలామంది స్త్రీ అభిమానులు ఉండేవారు. రాజేష్ ఖన్నా ఫ్యాన్స్‌లో ఉడుకు నెత్తురు అమ్మాయిలు లోకానికి తెలుసు. కాని నిశ్శబ్దంగా అంతకు సమానమైన స్త్రీ అభిమానాన్ని పొందినవాడు శశికపూర్. అతడు ఇండియాకు శోభన్‌బాబు. పృధ్వీరాజ్ కపూర్‌కు పెళ్లయ్యాక పదిహేనేళ్లకు పుట్టాడు శశి కపూర్. అతడికి ఊహ తెలిసే నాటికే రాజ్‌కపూర్, షమ్మీ కపూర్ తండ్రితో కలిసి సినిమా రంగంలో నాటక రంగంలో పని చేస్తున్నారు. శశికపూర్‌ను కూడా ఈ ఇంటి పురుగు కుట్టింది. చిన్న వయసులోనే బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. డిగ్రీని దాదాపు చదివినంత పని చేశాడు. ఆ తర్వాత అద్దం ముందు ముఖం చూసుకుంటూ నిలుచున్నాడు. కపూర్ కుటుంబంలో ఒక ఆనవాయితీ ఉంది. చెరువులో తోసి చోద్యం చూస్తుంటారు. ఎవరికివారు కష్టపడి పైకి రావాల్సిందే. రాజ్ కపూర్ అలాగే వచ్చాడు. షమ్మీ కపూర్ అలాగే వచ్చాడు. హీరోల తమ్ముడు... ‘శశి బాబూ’ అని పిలిచి గారం చేద్దాం అని బాలీవుడ్ కూడా అనుకోలేదు. ఎక్కే గడప దిగే గడపగా అతణ్ణి తిప్పి మూడు స్టూడియోల నీళ్లు తాగించింది. ఆ రోజుల్లో జేబులో రూపాయి లేకుండా టీకి ఠికానా లేకుండా శశికపూర్ తిరిగాడన్నది వాస్తవం. రూమ్మేట్, ఆ తర్వాతి కాలంలో ‘మిస్టర్ భారత్’ బిరుదాంకితుడైన మనోజ్ కుమార్‌తో కలిసి ముంబై ఆకాశంలో నక్షత్రాలను చూపుడువేలితో కలుపుతూ తమ భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఇద్దరూ కుడి ఎడమలుగా హీరోలయ్యారు. కాని శశికపూర్‌కు శాపం పట్టుకుంది. ఫ్లాపుల శాపం. 1961లో శశికపూర్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ధరమ్పుత్ర’ రిలీజయ్యింది. దేశ విభజన నేపథ్యంలో యశ్‌చోప్రా దర్శకత్వం వహించిన సినిమా అది. క్లీన్ ఫ్లాప్. ప్రారంభం అదిరిపోతేనే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది ఫ్లాపంటే... ఆ తర్వాత శశికపూర్ సినిమాలు ఆరేడు రిలీజయ్యాయి. అన్నీ ఫ్లాప్స్. వీటిలో అతడు నటించిన ఇండో– ఇంగ్లిష్ సినిమాలు ‘ది హౌస్హోల్డర్’, ‘షేక్స్‌స్పియర్ వాలా’ వంటివి కూడా ఉన్నాయి. నడుమ వచ్చిన ‘వక్త్’ హిట్ అయినా దాని ప్రధానవాట రాజ్‌కుమార్, సునీల్‌దత్‌లు తన్నుకుపోయారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు కరువునైనా భరించవచ్చుకానీ హీరోయిన్ కరువును భరించలేరు. శశి కపూర్‌కు హీరోయిన్ కరువు వచ్చింది. ప్రతి హీరోయిన్ ‘అతనా... అతని పక్కన నేను చేయను. ఫ్లాప్ హీరో’ అని తప్పించుకోవడం మొదలుపెట్టారు. కాని అతనిలోని సరస్వతి దేవి అతణ్ణి చల్లగా చూసింది. వీణలోని నాలుగు తీగలు మీటి ఒక హీరోయిన్ని రప్పించింది. ఆ హీరోయిన్ అతడితో యాక్ట్ చేసింది. ఆ సినిమా రిలీజయ్యింది. ఆశ్చర్యం. సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. ఈ హిట్ శశి కపూరేనా ఆ ఫ్లాప్ శశి కపూర్ అని అందరూ మణికట్లు విదుల్చుకోవడం మొదలుపెట్టారు. అలా అతడి దశను మార్చిన సినిమా– ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’.ఆ హీరోయిన్ నందా. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. దాంతో హీరోయిన్లు శశి కపూర్ ఎదుట క్యూలు కట్టారు. మన తెలుగు రాజశ్రీ అతడితో ‘ప్యార్ కియే జా’లో డ్యూయెట్స్ పాడింది. తర్వాతి కాలంలో అతడికి కోడలు వరసైన బబిత ‘హసీనా మాన్ జాయేగీ’లో ఎదపై వాలింది. ‘కన్యాదాన్’లో ఆశా పరేఖ్ ఏడడుగులు నడిచింది. ఫైనల్ టచ్‌ను కలకత్తా నుంచి వచ్చిన ఒక రసగుల్ల అమ్మాయి ఇచ్చింది. పేరు – రాఖీ. సినిమా ‘షర్మిలీ’. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత శశి కపూర్‌ను మరి కదిల్చేవారు లేకపోయారు. పృధ్విరాజ్ సినీ వారసత్వానికి రాజ్ కపూర్, షమ్మీ కపూర్ ఉన్నారు. కాని తండ్రి నాటక రంగ వారసత్వానికి శశి కపూరే ఆధారంగా నిలిచాడు. ఇవాళ ఆర్.కె.స్టూడియోలో ఒక వారగా పృథ్వీ థియేటర్ దర్ఫంగా నిలుచుని ఉందంటే అది అతడి కృషి, అతడి భార్య జెన్నిఫర్ పరిశ్రమ వల్లే సాధ్యమైంది. శశికపూర్‌కు ఇంగ్లిష్ భాష పట్ల, ఇంగ్లిష్ నాటకం పట్ల మంచి అభిరుచి ఉంది. సినిమాల్లో నటిస్తూనే నాటకాల్లోనూ తన తృష్ణ తీర్చుకునేవాడు. దాని వల్ల అతడికి జరిగిన మేలు– పాత్ర ప్రాముఖ్యం గ్రహించగలడం. అది హీరో పాత్రనా సహాయక పాత్రనా అనేది ముఖ్యం కాదు. ఆ పాత్రలో మనం చేయగలిగింది ఏదైనా ఉందా చూడగలగడం. అందుకే అతడు చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేశాడు. అవి అతడికే పేరు తెచ్చాయి– హీరోలతో సమానంగా. ‘దీవార్’లో అమితాబ్‌తో చెప్పిన డైలాగ్‌ను ఎవరు మర్చిపోతారు. నేరస్తుడైన అమితాబ్ ‘మేరే పాస్ బంగ్లా హై, గాడీ హై, పైసా హై, బ్యాంక్ బేలెన్స్ హై... తేరే పాస్ క్యాహై?’ అనంటే పోలీసైన శశి కపూర్ తొణక్కుండా బెణక్కుండా ఛాతీని మెల్లగా పొంగిస్తూ ‘మేరే పాస్ మా హై’ అంటాడు. ఆ ఒక్క డైలాగుతో సినిమా తన అకౌంట్లో వేసుకున్నాడు. ఆస్కార్ వేదిక మీద రెహమాన్ గుర్తు చేసుకున్న డైలాగ్ అదే. అది శశి కపూరే ప్రతిభే. ‘రోటీ కప్డా ఔర్ మకాన్’, ‘కభీ కభీ’, ‘త్రిశూల్’, ‘కాలా పత్థర్’, ‘షాన్’, ‘సిల్సిలా’, ‘నమక్ హలాల్’ వంటి అనేక సినిమాలలో అతడు సపోర్టింగ్ రోల్స్ చేసినా అవి అతడిలోని దమ్మును చూపాయి. అమితాబ్ కంటే తాను వయసులో పెద్దవాడు. కాని చాలా సినిమాల్లో తమ్ముడుగా నటించాడు. ఒక దశలో శశిని అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్గా పత్రికలు కామెంట్ చేశాయి. ఏమిటి చేయడం? ప్రతి పాత్రా అతణ్ణే ప్రియుడిగా తలచి వెంట పడుతుంటే. డెబ్బయ్యవ దశకంలో ముఖ్యంగా ఆ దశకం సెకండ్ హాఫ్‌లో అతడు ఉన్నంత బిజీగా ఏ హీరో లేడు. ఎంత బిజీ అంటే రాజ్‌కపూర్ తన సినిమా ‘సత్యం శివం సుందరం’లో బుక్ చేద్దామంటే అతడి దగ్గర డేట్స్ లేవు. అందుకే రాజ్ కపూర్ శశి కపూర్‌ని ‘టాక్సీ కపూర్’ అని వెక్కిరించేవాడు. రోజంతా ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకు టాక్సీలో పరుగు పెడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడని ఆయన చిరాకు. కాని అంత బిజీలో కూడా శశి కపూర్ ‘కలియుగ్’, ‘జునూన్’ వంటి భిన్నమైన సినిమాలలో నటించి అభిరుచి కలిగిన ప్రేక్షకుల దృష్టిలో ఎదిగాడు. సొంత బేనర్– ‘ఫిల్మ్ వాలాస్’ స్థాపించి గోవింద్ నిహలానితో ‘విజేత’, అపర్ణా సేన్‌తో ‘36 చౌరంగీ లేన్’, గిరిష్ కర్నాడ్‌తో ‘ఉత్సవ్’ తీశాడు. ‘ఉత్సవ్’ను క్లాసికల్ దృష్టితో ఒక స్థాయి ప్రేక్షకులు చూస్తే అందులో శృంగార సన్నివేశాలను వెతుక్కుంటూ మరో స్థాయి ప్రేక్షకులు చూశారు. ఉత్సవ్’లో రేఖకు వచ్చిన పేరు శశికపూర్ కలిగించిన ప్రాప్తం. 26 ఏళ్లు కాపురం చేసి, ముగ్గురు సంతానాన్ని తన గుర్తుగా మిగిల్చి భార్య జెన్నిఫర్ 1984లో కేన్సర్‌తో మరణించింది. మేకప్ ఉంటే హీరో కాని అది తీస్తే అతడు భార్య చాటున దాగే పసివాడు. శశి కపూర్ ఆ వియోగాన్ని తట్టుకోలేకపోయాడు. తిండి మానేశాడు. ఎక్కువ తినేశాడు. అసలు తాగలేదు. పూర్తిగా తాగేశాడు. కేవలం రెండేళ్ల కాలంలో అతడు ఎంత విరక్తిలోకి జారుకున్నాడంటే ఆకారాన్నే కోల్పోయాడు. అందుకే 1986లో వచ్చిన ‘న్యూ ఢిల్లీ టైమ్స్’ అతడి ఆఖరి మెరుపు అయ్యింది. ఆ తర్వాత స్వీయ వలయపు సుషుప్తి కొనసాగింది. అప్పుడప్పుడు కొంత టీవీలో కొన్ని సినిమాల్లో కనిపించి 1998 తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు. డిసెంబర్ చలి అధికమైంది. చలి కోత కంటే శశికపూర్ మరణకోత ఎక్కువగా బాధిస్తున్నది. ప్రేక్షకులు ఒక నటుడి నుంచి కేవలం రంజింపచేసే కాలక్షేపం మాత్రమే ఆశించి ఊరుకోరు. అతడితో బాండ్ ఏర్పరుచుకుంటారు. అతడిపాటు ప్రయాణిస్తుంటారు. అతడికి సంబంధించిన జ్ఞాపకాలు దాచుకుని ఉంటారు. అలాంటి నటుడు శాశ్వతమైన వీడ్కోలు తీసుకున్నప్పుడు ఒక కుదుపును అనుభవిస్తారు. ఇవాళ అలాంటి కుదుపు ఉంది. చలికాలాలు మరెన్నో వస్తాయి. కాని శశి కపూర్‌లాంటి ప్రియతమ కళాకారుణ్ణి దోచుకుని వెళ్లే చలికాలాలు మాత్రం మరెప్పటికీ రావద్దు. గుడ్ బై హీరో. దేశాంతర ప్రేమ కులాంతర వివాహం, మతాంతర వివాహం అంటేనే బెంబేలెత్తి పోయే ఆ రోజుల్లో శశి కపూర్ ఏకంగా దేశాంతర వివాహం చేసుకునేంత గాఢంగా జెన్నిఫర్‌ను ప్రేమించాడు. ఆమె బ్రిటిష్ నటి. తండ్రి వచ్చి కలకత్తాలో థియేటర్ చేసేది. అక్కడే శశి కపూర్ తన తండ్రి ట్రూప్‌తో పాటు ఆమెను కలిశాడు. తొలిచూపులో ప్రేమ... మలి చూపులో ఆరాధన... నా భార్య ఈమే అని నిశ్చయించుకున్నాడు. కపూర్ ఫ్యామిలీ అభ్యంతరం చెప్పలేదు కాని జెన్నిఫర్ తండ్రి చాలా ముందు వెనుక ఆడాడు. చివరకు షమ్మీ కపూర్ భార్య గీతా బాలి చొరవతో ఆ పెళ్లి జరిగింది. వీళ్ల పిల్లల్లో పెద్దవాడు యాడ్‌ఫిల్మ్ రంగంలో ఉన్నాడు. కుమార్తె సంజనా పృధ్వీ థియేటర్ బాధ్యతలు చూసుకుంటున్నది. మరో కుమారుడు కరణ్ టాప్ మోడల్‌గా పని చేసి లండన్‌లో సెటిల్ అయ్యాడు. అలా జెన్నిఫర్ వారసత్వం ఆమె మాతృభూమి మీద కూడా కొనసాగుతూ ఉంది. మరో విశేషం ఏమిటంటే ‘జునూన్’ సినిమాలో జెన్నిఫర్ అత్తగా నటిస్తే శశి ఆమెకు అల్లుడుగా నటించాడు. ఇలా నటించిన భార్యభర్తలు వీరేనేమో. పిల్లలను ప్రేమించిన తండ్రి శశి కపూర్ పిల్లలంటే చాలా ప్రాణం. తన తండ్రి పృధ్వీరాజ్ కపూర్‌తో చనువుగా ఉండలేకపోయినందున తాను తన పిల్లలతో చనువుగా ఉంటూ ఆ వెలితిని పూడ్చుకునే ప్రయత్నం చేసేవాడు. తను హీరో కనుక గుంపు ఉన్న చోట ఇబ్బంది కనుక పిల్లలను జూకు తీసుకు వెళ్లాలంటే పర్మిషన్ అడిగి తెల్లవారు జామున ఆరు గంటలకు తీసుకువెళ్లేవాడట. జనం వచ్చేలోపల వారిని తీసుకుని వచ్చేసేవాడట. మన శోభన్‌బాబుకు మల్లే ఆదివారాలు షూటింగ్ చేయడం అనేది పూర్తిగా మానుకునేవాడు శశి కపూర్. ఆ రోజు మూడు పూటలా పిల్లలతో భోజనం చేస్తేనే అతనికి సంతృప్తి. సెట్స్‌లో కూడా ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం అతడికి అలవాటు. ‘హాయ్.. నా పేరు శశి కపూర్’ అని లైట్ బాయ్స్ దగ్గరకు వెళ్లి వారితో కలిసి టీ తాగేవాడు. అన్నట్టు అతడికి పెద్దన్న రాజ్ కపూర్ అంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి డబ్బులేని సమయంలో రాజ్ కపూరే ఇచ్చి పెళ్లికి సాయం చేశాడట. ఆ విషయం పిల్లలతో కూడా పదే పదే చెప్పేవాడు. ఖిల్ తే హై గుల్ యహా... అందరికీ హిట్ పాటలుంటాయి. కాని శశి కపూర్ పాటల విషయంలో ఇంకొంచెం అదృష్టవంతుడు. చాలా చాలా హిట్ పాటలు అతడి అకౌంట్లో పడ్డాయి. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నానా కర్తే ప్యార్ తుమ్హీ సే కర్ బై ఠే’, ‘పర్ దేశియోంసే నా అఖియా మిలానా’ పెద్ద హిట్స్. ‘తుమ్ బిన్ జావూ కహా’ పాట ‘ప్యార్ కా మౌసమ్’లో అతడిదే. ఇక ఎవర్ గ్రీన్ హిట్ ‘లిఖ్ఖేజో ఖత్ తుజే’ ఎన్నిసార్లు విని మరెన్నిసార్లు వినడానికి సిద్ధమవుతూనే ఉన్నాం. ‘షర్మిలీ’లో ‘ఖిల్ తే హై గుల్ యహా’, ‘ఓ మేరి ఓమేరి ఓ మేరి షర్మిలీ’... రెండూ వాడని గులాబీల వంటి పాటలు. ‘లే జాయేంగే లేజాయేంగే దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘ఘుంగురూ కి తరా బజ్తా రహా హూమై’ పాటలు ‘చోర్ మచాయే షోర్’ సినిమాలోనివి. హిట్స్. ‘సర్ సే సర్ కే సర్ కే చునరియా’ (సిల్ సిలా) పాటలో జయబాధురితో కనిపించడం కూడా బాగుంటుంది. మన తెలుగులో ‘మంచి మనసులు’గా రీమేక్ అయిన ‘ఆ ... గలే లగ్‌జా’లో శశి కపూర్, షర్మిలా టాగూర్లు స్కేట్ చేస్తూ పాడే పాట ‘వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్’ వండర్ఫుర్ ఆర్.డి.బర్మన్ హిట్. ఇక ఈ ఆర్.డి.బర్మనే ‘దీవార్’లో శశి కపూర్ చేసిన ‘కెహెదూ తుమ్హే యా చుప్ రహూ’తో ఇంకా చాలా ఉన్న ఈ లిస్ట్‌ను ఈ పాటతో ఆపుదాం. అది– ‘జానూ మేరి జాన్ మై తుజ్ పే ఖుర్బాన్’.. (షాన్). నేరస్తుడైన అమితాబ్ ‘మేరే పాస్ బంగ్లా హై, గాడీ హై, పైసా హై, బ్యాంక్ బేలెన్స్ హై... తేరే పాస్ క్యాహై?’ అనంటే పోలీసైన శశి కపూర్ తొణక్కుండా బెణక్కుండా ఛాతీని మెల్లగా పొంగిస్తూ ‘మేరే పాస్ మా హై’ అంటాడు. ఆ ఒక్క డైలాగుతో సినిమా తన అకౌంట్లో వేసుకున్నాడు. – ఖదీర్ -
ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత
ముంబయి : అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ (79) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న శశికపూర్ నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. కబీ కబీ, దుస్రా ఆద్మీ, జమీన్ ఆస్మాన్ లాంటి పలు హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అమితాబ్‌తో కలిసి శశికపూర్ దివార్, నమక్ హలాల్ చిత్రాల్లో నటించారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కెతో పాటు ఎన్నో అవార్డులను శశికపూర్ అందుకున్నారు. ఆగ్ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. శశికపూర్ హీరోగా నటించిన తొలి చిత్రం ధర్మపుత్ర. ఆయన చివరి చిత్రం సైడ్ స్ట్రీట్స్ (1999). పాతతరం కథానాయకుడు పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడే శశికపూర్. మరోవైపు శశికపూర్ మృతి పట్ల బాలీవుడ్ విషాదంలో ముగినిపోయింది. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సంతాపం తెలిపారు. -
ముగ్గురు లెంజడరీ హీరోలు కలిసి పాడిన వేళ!
ముంబై: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ అరుదైన ఫొటోను ట్విట్టర్లో తన అభిమానులతో పంచుకున్నారు. లెంజడరీ హీరోలు రాజ్‌కపూర్, శశికపూర్‌తో కలిసి తాను పాట పాడుతున్న ఫొటో అది. అలానాటి మధురజ్ఞాపకమది. 'అప్పట్లో సోవియట్ రష్యాలో ఉన్న తాష్కెంట్లో రాజ్‌కపూర్ జీ, శశికపూర్‌జీతో కలిసి 'సారే జహా సే అచ్చా' అనే పాట పాడాను' అంటూ ఆ జ్ఞాపకాన్ని బిగ్ బీ నెమరువేసుకున్నారు. ఈ ఏడాది 'పీకూ' సినిమాతో ఘనవిజయం సాధించిన అమితాబ్ బచ్చన్ త్వరలోనే 'వజీర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'వజీర్'లో ఫర్హాన్ అఖ్తర్, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. T 2096 - With Raj Kapoor ji and Shashi ji in Tashkent, then Soviet Russia .. singing 'sare jahan se achcha' ..! pic.twitter.com/HPtZreF2kk — Amitabh Bachchan (@SrBachchan) December 29, 2015 -
గోవాలో శశికపూర్ చిత్రోత్సవం
శశికపూర్... పరిచయ వాక్యాలు అవసరంలేని పేరిది. ఎనన్ని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఒకటా.. రెండా.. నలభై ఏళ్ల సినిమా చరిత్ర ఆయనది. నాలుగు దశాబ్దాల్లో 160 చిత్రాల్లో నటిస్తే, వాటిలో పన్నెండు ఆంగ్ల చిత్రాలుండటం విశేషం. బాలనటునిగా, హీరోగా, నిర్మాతగా, దర్శకునిగా సినిమా రంగంలో పలు శాఖల్లో తన ప్రతిభ నిరూపించుకుని ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనిపించుకున్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు దాదాసాహెబ్ పురస్కారం (2014) తెచ్చి పెట్టాయి. ఇప్పటివరకూ ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందు కున్న శశికపూర్‌కు గోవాలో జరగనున్న 46వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ)లో ఓ అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెల 20 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ చిత్రోత్సవాల్లో శశికపూర్ నటించిన ‘హౌస్ హోల్డర్’, ‘షేక్స్పియర్వాలా’, ‘దీవార్’, ‘జునూన్’, ‘కలియుగ్’, ‘ఉత్సవ్’, ‘ఢిల్లీ టైమ్స్’, ‘ఇన్ కస్టడీ’ - ఇలా 8 చిత్రాలను స్పెషల్ రెట్రాస్పెక్టివ్ విభాగంలో ప్రదర్శించనున్నారు. ఈ విషయం గురించి శశికపూర్ తనయుడు నటుడు కునాల్ కపూర్ స్పందిస్తూ - ‘‘మా నాన్నగారు నటించిన 8 చిత్రాలను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాలని డీఎఫ్‌ఎఫ్ (డైరక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్) కమిటీ తీసు కున్న నిర్ణయం మాకు సంతోషంగా ఉంది. కానీ, అనారోగ్య కారణాల వల్ల ఆయన స్వయంగా ఈ వేడుకకు హాజరు కాలేరు’’ అని తెలిపారు. -
దాదాసాహెబ్ అవార్డు అందుకున్న శశికపూర్
-
శశికపూర్‌కు దాదా ఫాల్కే పురస్కారం ప్రదానం
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ఆదివారం పశ్చిమ ముంబైలోని ఫృధీ థియేటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్‌కు అరుణ్ జైట్లీ అందజేశారు. ఈ కార్యక్రమానికి శశికపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 2013 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం శశికపూర్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శశికపూర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను పురస్కారం అందుకోవడానికి న్యూఢిల్లీ రాలేనని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దాంతో ఆదివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదగా శశికపూర్ దాదా ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 2011లో శశికపూర్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం విదితమే. -
నా దగ్గర అమ్మ ఉంది!!
''ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి.. బంగ్లా ఉంది, బండి ఉంది.. నౌకర్లున్నారు.. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది.. నీ దగ్గర ఏముంది?'' ''నా దగ్గర అమ్మ ఉంది'' అంతే, ఈ మా టవినగానే.. ఆరడుగుల పొడవున్న అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా మూగబోతాడు. నాలుగు పదాల ఆ డైలాగు చెప్పినది శశి కపూర్. దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్‌కు తమ్ముడి పాత్రలో నటించిన హీరో. అలా వెండితెర మీద తన తమ్ముడి పాత్ర పోషించిన శశి కపూర్ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో ఆయన కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా ఓ వీడియో సందేశం రికార్డు చేశారు. వచ్చే నెలలో శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు బహూకరించే సందర్భంలో ఈ వీడియో ప్రదర్శిస్తారు. త్రిశూల్, సిల్సిలా, రోటీ కప్డా ఔర్ మకాన్, కభీకభీ, కాలా పత్తర్ లాంటి సినిమాల్లో కలిసి నటించిన శశి కపూర్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకోమని అడిగినప్పుడు నోట మాట రాలేదని అమితాబ్ అన్నారు. 77 ఏళ్ల శశి కపూర్ వచ్చే నెలలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. అయితే, తన ఆరోగ్యం సహకరించడం లేదని, అందువల్ల తాను స్వయంగా వచ్చి అవార్డు అందుకునే పరిస్థితి ఉండకపోవచ్చని శశికపూర్ అన్నారు. -
నడవలేని స్థితిలో ఉన్నా! రాలేను..!!
2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం ప్రసిద్ధ హిందీ నటుడు శశికపూర్‌ను వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారానికి శశికపూర్ పూర్తి అర్హుడు అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే పురస్కారాన్ని స్వయంగా వెళ్లి, స్వీకరించే పరిస్థితిలో శశికపూర్ లేరు. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌కి పరిమితమైన తాను వచ్చే నెలలో జరగబోయే అవార్డు వేడుకకు హాజరు కాలేననీ, అందుకు తనను క్షమించమనీ శశికపూర్ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చరిత్రలో ఇలా జరగడం రెండో సారి. 2012 సంవత్సరానికి బాలీవుడు విలన్ ప్రాణ్‌కు ఈ అవార్డు వరించింది. ఆయన కూడా నడవలేని స్థితిలో ఉండటంతో ఈ అవార్దును ఆయన స్వగృహంలో అందజేశారు. -
శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
అంతర్జాతీయం ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు దేశాల్లోనే.. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు మధ్య ఆదాయ దేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, ఇండోనేషియాలో ఉన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) మార్చి 19న తన నివేదికలో పేర్కొంది. 2014లో బలమైన ఆర్థిక వృద్ధి చూపిన ఈ దేశాల్లో 363 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్న వారున్నట్లు తెలిపింది. 2014-15 ప్రపంచ ఆహార విధాన నివేదిక (జీఎఫ్‌పీఆర్) ఈ దేశాలు తమ ఆహార విధానాలను మార్చుకోవాలని కోరింది. పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టిసారించాలని, వ్యవసాయంలో లింగ వ్యత్యాసం తొలగించాలని, అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు గ్రామీణ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరింది. ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ బెంజిమెన్ నెతన్యాహూ మరోసారి ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగనున్నారు. మార్చి 18న జరిగిన ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ పార్లమెంటు నెస్సెట్‌లోని 120 స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుంది. అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఇతర చిన్నపార్టీలతో కలిసి నెతన్యాహూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టారు. జాతీయం కనిష్టంగా ‘టోకు ధరల సూచీ’ ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015 ఫిబ్రవరిలో -2.06 శాతంగా నమోదైంది. ఇంత కనిష్ట స్థాయిలో నమోదు కావడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. వరుసగా నాలుగో నెల ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ఈ రేటు తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 16న విడుదల చేసిన గణాంకాల్లో ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడించింది. నల్లధనం నియంత్రణ బిల్లుకు ఆమోదం విదేశాల్లో దాచిన నల్లధనం కేసులకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ మార్చి 17న ఆమోదం తెలిపింది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల (పన్ను విధింపు) బిల్లు-2015కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం దాచిపెట్టిన ఆదాయం, ఆస్తులకు సంబంధించిన పన్నులపై 300 శాతం జరిమానా విధిస్తారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది. విదేశీ ఆస్తులకు సంబంధించిన వివరాలు సరిగా చూపకపోయినా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోయినా విచారణ పరిధిలోకి వస్తారు. ఈ కేసుల్లో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. పన్ను విధించదగ్గ ఆదాయం లేకపోయినప్పటికీ విదేశీ ఆస్తుల సొంతదారు, లబ్ధిదారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. వీటిలో విదేశీ ఖాతా తెరిచిన తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి. నేరానికి పాల్పడిన వారు వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించడానికి అనుమతి ఉండదు. జాట్ల కోటాను రద్దుచేసిన సుప్రీంకోర్టు జాట్ వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కేంద్ర జాబితాలో చేర్చుతూ గతంలో జారీఅయిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 17న రద్దు చేసింది. 2014, మార్చిలో యూపీఏ ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది. అయితే జాట్లను ఓబీసీల్లో చేర్చాల్సిన అవసరం లేదంటూ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ చేసిన సిఫార్సును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. జాట్లు బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉన్నారు. అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం దేశీయంగా రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్).. ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని మార్చి 18న ఒడిశాలోని చాందీపూర్‌లో చేపట్టారు. క్షిపణిని సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి కదులుతున్న లక్ష్యం వైపు ప్రయోగించారు. యుద్ధ విమానం నుంచి క్షిపణి విడిపోయి, 2 కి.మీ. ఎత్తులో కదులుతున్న లక్ష్యాన్ని అడ్డుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన అతిచిన్న క్షిపణి అస్త్ర. దీని పొడవు 3.8 మీటర్లు. ఇది 15 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. సూపర్సోనిక్ వేగంతో శత్రు విమానాలను అడ్డుకొని, ధ్వంసం చేయగలదు. ప్రతినెలా 7 నుంచి టీకాల వారం వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ ఏడాది తొలివిడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమ చిత్రం ‘కోర్టు’ డెరైక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలనచిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వీటిని విజేతలకు మే 3, 2015న అందజేస్తారు. ఉత్తమ ఫీచర్ చలనచిత్రం: కోర్టు (మరాఠీ); ఉత్తమ పాపులర్ చలనచిత్రం: మేరీ కోమ్ (హిందీ); ఉత్తమ బాలల చలనచిత్రం: కాక్కా ముత్తైతమిళం); ఎలిజబెత్ ఏకాదశి (మరాఠీ); ఉత్తమ నటుడు: విజయ్ (నాను అవనల్లా అవళు, కన్నడ); ఉత్తమ నటి: కంగనా రనౌత్ (క్వీన్, హిందీ); ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (చోటుష్కోనే, బెంగాలీ); ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రం (తెలుగు): చందమామ కథలు క్రీడలు కెప్టెన్‌గా ధోనీ రికార్డు భారత క్రికెట్ జట్టును వంద వన్డేల్లో గెలిపించిన కెప్టెన్‌గా ఎం.ఎస్.ధోనీ రికార్డు సృష్టించాడు. మార్చి 19న బంగ్లాదేశ్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో విజయంతో ఈ గుర్తింపు లభించింది. ధోనీ 178 వన్డేల్లో 100 విజయాలు సాధించాడు. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియేతర ఆటగాడు ధోనీనే. రికీ పాంటింగ్ (165), అలెన్ బోర్డర్ (107) ధోనీ కంటే ముందున్నారు. సానియా జోడీకి ఇండియన్ వెల్స్ టైటిల్ సానియా మీర్జా స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 21న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జోడీని సానియా-హింగిస్ జోడీ ఓడించింది. విజేతగా నిలిచిన వీరికి రూ.కోటి 83 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సానియాకు కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్ కాగా, హింగిస్‌కు 42వ డబుల్స్ టైటిల్. ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విస్)ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు 50వ ఏటీపీ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సిమోనా హలెప్ గెలుచుకుంది. ఈమె ఫైనల్లో జెలెనా జంకోవిచ్‌ను ఓడించింది. ప్రపంచకప్‌లో మార్టిన్ గప్తిల్ అత్యధిక స్కోర్ న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ ప్రపంచకప్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు. మార్చి 21న వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో గప్తిల్ 237 (163 బంతుల్లో) పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్. వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్. వన్డేల్లో భారత్‌కు చెందిన రోహిత్‌శర్మ నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. వార్తల్లో వ్యక్తులు మాధవ్ గాడ్గిల్‌కు టైలర్ పురస్కారం ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ 2015 సంవత్సరానికి పర్యావరణ విజయానికిచ్చే టైలర్ అవార్డుకు ఎంపికయ్యారు. గాడ్గిల్ పశ్చిమ కనుమల ఎకాలజీ ఎక్స్పర్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని సథరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ సహాయంతో టైలర్ ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 1973లో ఈ అవార్డును ఏర్పాటు చేసింది. గాడ్గిల్‌తో పాటు ఈ అవార్డుకు అమెరికన్ మెరైన్ ఎకాలజిస్టు జేన్ లుబ్చెంకో కూడా ఎంపికయ్యారు. వీరిద్దరికి రెండు లక్షల డాలర్ల నగదు బహుమతిని సమానంగా అందజేస్తారు. బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షునిగా వెంకట్రామన్ రామకృష్ణన్ బ్రిటన్‌లోని ప్రముఖ సంస్థ రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ ఎన్నికయ్యారు. దీనికోసం జరిగిన ఎన్నికల ఫలితాలను మార్చి మూడో వారంలో ప్రకటించారు. రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వెంకట్రామన్ గుర్తింపు సాధించారు. 1660లో స్థాపించిన రాయల్ సొసైటీ అధ్యక్షుడు బ్రిటన్ ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తారు. రామకృష్ణన్ 2009లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ మృతి సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ (91) సింగపూర్‌లో మార్చి 23న మరణించారు. మలేసియా నుంచి సింగపూర్ విడిపోవడంలో ప్రధానపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు లీ క్వాన్ ఎంతో కృషిచేశారు. లీ 31 ఏళ్ల పాటు 1959 నుంచి 1990లో పదవి నుంచి వైదొలగే వరకు ప్రధానిగా పనిచేశారు. లీ కుమారుడు లూంగ్ సింగపూర్ ప్రధానిగా ఉన్నారు. శ్రీలంక మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు ఫీల్డ్ మార్షల్ హోదా శ్రీలంక అత్యున్నత సైనిక హోదా ఫీల్డ్ మార్షల్‌ను ఆ దేశ మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు మార్చి 22న కొలంబోలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ప్రదానం చేశారు. ఆయన ఈ హోదాను పొందిన తొలి శ్రీలంక జాతీయుడు. ఉగ్రవాదంపై సాధించిన విజయానికి ఆయనకు ఈ హోదా దక్కింది. 2009లో తమిళ టైగర్స్‌పై విజయం సాధించే దిశగా ఆయన సైన్యాన్ని నడిపారు. ఆయన్ను 2010లో అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కింద జైలుకు పంపింది. ఆయన రెండేళ్లు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ ఒత్తిడితో 2012లో విడుదలయ్యారు. జైలుశిక్ష వల్ల ఏడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కోల్పోయారు. శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న రాజ్‌కపూర్ అనంతరం ఈ పురస్కారాన్ని అందుకోనున్న మూడో వ్యక్తి శశికపూర్. పురస్కారం కింద ఆయన స్వర్ణకమలం, రూ. 10 లక్షల నగదు అందుకోనున్నారు. 2014 ఏడాదికి ఫాల్కే అవార్డ్ గ్రహీతగా కపూర్‌ను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నమక్‌హలాల్, దీవార్, కభీకభీ తదితర హిట్ సినిమాల్లో కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్, ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ ప్రస్తుతం కిడ్నీ, ఇతర వయో సంబంధ వ్యాధులతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ అమెరికా విద్యా మండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల చైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి 16న వాషింగ్టన్లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణూ 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజేంద్రసింగ్కు స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ప్రతిష్టాత్మక స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015కు ఎంపికయ్యారు. వాటర్ మ్యాన్‌గా పిలిచే రాజేంద్రసింగ్ గ్రామీణుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు విశేష కృషిచేశారు. రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన 1959లో జన్మించారు. అనేక దశాబ్దాలుగా కరవుపై పోరాటం చేస్తున్నారు. గ్రామీణ సమాజాల్లో సాధికారతకు కృషిచేస్తున్నారు. సామాజిక పరంగా నీటి పరిరక్షణ, నిర్వహణకు కృషిచేసినందుకు ఆయనకు 2001లో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. స్టాక్‌హోం వాటర్ ప్రైజ్‌ను 1991లో స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పింది. ఈ అవార్డు కింద 1,50,000 డాలర్లు అందజేస్తారు. -
మూవీ ముచ్చట్లు - శశి కపూర్
-
'దాదాసాహెబ్ ఫాల్కే' శశి కపూర్
-
ఖిల్ తే హై గుల్ యహా...
శోభన్‌బాబు పర్సనల్ బ్రీఫ్‌కేస్‌లో ఎప్పుడూ రెండు ఫొటోలు ఉండేవి. రెండూ శశికపూర్వే. ఒకటి పాతది. ఒకటి కొత్తది. ఒకటి సన్నగా అందంగా ఉన్న ఫొటో. రెండోది లావుగా ఊబగా అయిపోయిన ఫొటో. ‘శశికపూర్లా నేను మారకూడదు. తిండి దగ్గర ఆరోగ్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ ఫొటోలు’ అని శోభన్‌బాబు చెప్పేవారు. శశికపూర్ అలా కావాలని అయ్యాడా?నిర్లక్ష్యంగా ఉన్నాడా? జెన్నిఫర్- బ్రిటిష్ నటి- నవ్వితే థేమ్స్ నది పలకరింపులా ఉండేది. శశికపూర్‌తో ప్రేమలో పడింది. దేశం కాని దేశం. భాష కాని భాష. సంప్రదాయం కాని సంప్రదాయం. పైగా కపూర్ల ఇంటి కోడలి హోదా. ధైర్యంగా అడుగుపెట్టింది. శశికపూర్ అంటే ఆమెకు ఎంత ప్రేమ అంటే ఊబకాయం శాపంగా ఉన్న ఆ కుటుంబంలో శశి దాని బారిన పడకుండా అతణ్ణి వెజిటేరియన్‌గా మార్చింది. ఆ రోజుల్లోనే ఆర్గానిక్ ఫుడ్‌ను పరిచయం చేసింది. రోజూ ఈతకు వెళ్లాల్సిందే. వ్యాయామం చేయాల్సిందే. అందమైన మొగుణ్ణి అందంగా ఉంచుకోవాలి కదా. శశికపూర్ అందంగానే ఉన్నాడు- ఆమె జీవించి ఉన్నంత వరకూ. ఆ తర్వాత? కేన్సర్ జెన్నిఫర్‌ని చాలా చిన్న వయసులో తీసుకెళ్లి ్లపోయాక- ఆమె గుర్తుగా అతడికి నలుగురు పిల్లల్ని ఇచ్చి వెళ్లి పోయాక- శశికపూర్ మనిషిలా మిగల్లేదు. ఈ పేరూ ప్రతిష్ట డబ్బూ ఐశ్వర్యం ఎందుకు? ఆమే లేనప్పుడు తాను మాత్రం ఎందుకు? ధ్వంసం చేసేశాడు... మనసునూ శరీరాన్నీ. కసి. శోభన్‌బాబుకు ఈ కథ తెలిసి ఉండొచ్చు... తెలిసి ఉండకపోవచ్చు. కాని ప్రతి పర్యవసానం వెనుకా ఒక తెలియని ఉదంతం ఉంటుంది. ఇలాంటి ఉదంతం. శశికపూర్‌కు బాల్యం నుంచి ఒక్కటే తెలుసు. యాక్టింగ్. తండ్రి పృధ్వీరాజ్ కపూర్ పెద్ద నటుడు. అన్న రాజ్‌కపూర్ స్టార్. మరో అన్న షమ్మీ కపూర్ది అదే దారి. తనకేం తక్కువ? ‘ఆగ్’, ‘ఆవారా’ సినిమాల్లో రాజ్‌కపూర్‌కు చిన్నప్పటి వేషం వేసేశాడు. అందరూ బాగా చేస్తున్నావ్ అన్నారు. ఇంకేంటి? పెద్దయ్యాక స్టార్ కావడమే. పెద్దయ్యాడు. స్టార్ కాలేదు. రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. తనలాగే వేషాల కోసం తిరుగుతున్న మనోజ్ కుమార్‌కు రూమ్మేట్ అయ్యాడు. అతణ్ణి దొందు అన్నారు. ఇతణ్ణీ దొందే అన్నారు. దొందూ దొందే. మా నాన్న... మా తాత అక్కడ చెల్లవు. నువ్వు గొప్పవాడివా కాదా అది తేల్చు ముందు అన్నారు. ఏవో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. కాస్తో కూస్తో ఆడుతూ ఉన్నాయి. కొన్ని డింకీలు. నెమ్మదిగా పేరు వచ్చింది. ఫ్లాప్ హీరో! హీరోయిన్లు శశికపూర్ పేరు చెప్తేనే పారిపోతున్నారు. అతడు తప్ప ఎవరైనా సరే. ఏం చేయాలి? అప్పుడొక ఆపద్బాంధవురాలు అతడికి తారసపడింది. నీకేంవోయ్ చాలా మంచి యాక్టర్‌వి అని ధైర్యం చెప్పింది. నీ పక్కన నేను యాక్ట్ చేస్తాను ఉండు అని ముందుకు వచ్చింది. హీరోయిన్ నంద! ఇద్దరూ కలిశారు. పూలు విరబూసే కాలం వచ్చింది. విరబూశాయి. జబ్ జబ్ ఫూల్ ఖిలే! పెద్ద హిట్. మ్యూజికల్ హిట్. ఒక రొమాంటిక్ హీరో జన్మెత్తాడు. అవును. పులి కడుపున పులే పుడుతుంది. కాకుంటే పంజా దెబ్బ కొంత ఆలస్యంగా తగిలింది. శశి కపూర్ విజృంభించాడు. ‘నీంద్ హమారి ఖ్వాబ్ తుమ్హారే’, ‘రూఠా న కరో’. ‘మొహబ్బత్ ఇస్కో కెహెతే హై’... అన్నీ నందాతోనే. అన్నీ హిట్. ఇవి వస్తుండగానే అటు బి.ఆర్.చోప్రా ‘వక్త్’, ఇటు మన ‘ప్రేమించి చూడు’ రీమేక్ ‘ప్యార్ కియా జా’.... సినిమాల వెంట సినిమాలు. సరిగ్గా అప్పుడే బెంగాల్ నుంచి ఒక పిల్లతెమ్మెర బయలుదేరి బొంబాయి తీరాన్ని తాకింది. పేరడిగితే ‘రాఖీ’ అన్నారు. శశి కపూర్‌తో ఒక సినిమా అని కూడా అన్నారు. బంగారం ఉంది. తావి వచ్చింది. బంగారానికి తావి అబ్బడం అంటే ఏమిటో ప్రేక్షకులకు తెలిసింది. ఖిల్ తే హై గుల్ యహా ఖిల్ కె బిఖర్ నే కో... ‘షర్మిలీ’- సూపర్ డూపర్ హిట్. అందులోని పాటలు... ఇప్పటికీ హిట్. సరే... ఇవన్నీ ఎవరైనా చేయగలరు. దేశం ఉలిక్కిపడేలా చేయగలగాలి. అలాంటి పాత్ర ఒకటి తగలాలి. తగిలింది. దీవార్! అమితాబ్ కంటే శశికపూర్ వయసులో పెద్దవాడు. కాని ‘దీవార్’లో అతడి తమ్ముడి వేషం వేశాడు. సినీ పరిశ్రమ దస్తూర్ అలాగే ఉంటుంది. ‘రోటీ కపడా మకాన్’లో తాను లీడ్ రోల్ చేస్తున్నప్పుడు అమితాబ్ చేతులు కట్టుకుని చాలా చిన్నపాత్ర వేస్తున్నాడు. ఇవాళ అతడు స్టార్డమ్కు వస్తే తాను చిన్న పాత్ర వేస్తున్నాడు. కాని అతడికి తెలుసు. పాత్ర చిన్నదైనా గొప్ప నటుడికి ఒక్క సన్నివేశం చాలు. ఒక్క డైలాగైనా ఏం? ఆ సినిమాలో ఆ నిర్మానుష్యమైన రాత్రి.... ఆ పాతకాలపు వంతెన... స్మగ్లర్‌గా మారిన అన్న... నీతి కోసం నిలబడిన ఇన్స్పెక్టర్ తమ్ముడు.... అన్న తనని తాము సమర్థించుకుంటున్నాడు... తమ్ముడి మీద ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. ‘మేరే పాస్ బిల్డింగే హై.. ప్రాపర్టీహై.. బ్యాంక్ బేలన్స్ హై... బంగ్లా హై... గాడీ హై... తుమ్హారే పాస్ క్యా ైెహ ?’... తమ్ముడు జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి? పొగరుగా కాదు. అహంకారంగా కాదు. తల ఎగరేస్తూ కాదు. ఆదర్శం ఎంత వినమ్రంగా ఉంటుందో అంత వినమ్రంగా. జవాబు చెప్పాడు. ‘మేరే పాస్ మా హై’.... చిన్న డైలాగ్. దేశమంతా లేచి చప్పట్లు కొట్టింది. ఇవాళ్టికీ కొడుతూనే ఉంది. మేరే పాస్ మా హై... అమితాబ్, ధర్మేంద్ర, రాజేష్‌ఖన్నా, జితేంద్ర, శతృఘ్నసిన్హా... ఈ దుమారంలో వీళ్ల కంటే ఎక్కువగా బిజీని అనుభవించినవాడు శశి కపూర్. ఎక్కువ సంపాదించినవాడు కూడా. ప్రతి సినిమాలో శశికపూర్ కావాలి. ఏ పాత్ర అయినా అతడే వేయాలి. ఎందుకంటే ఏ పాత్ర వేసినా తాను సినిమాకు బలంగా నిలుస్తాడు. అంతే తప్ప సినిమాను తనకు బలంగా చేసుకోడు. అది గమనించిన అమితాబ్ శశికపూర్‌ను దశాబ్దాల పాటు వదల్లేదు. ‘సుహాగ్’, ‘దో ఔర్ దో పాంచ్’, ‘కాలా పత్థర్’, ‘కభీ కభీ’, ‘త్రిషూల్’, ‘షాన్’... ఒక దశలో పత్రికలు శశికపూర్‌ని ‘అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్’గా కితాబిచ్చాయి. తేడాగా ఉన్నా ప్రశంస ప్రశంసే. బిజీ కొనసాగింది. అది కూడా ఎంతగా అంటే రాజ్ కపూర్ అడిగితే ‘సత్యం శివం సుందరం’కు శశికపూర్ దగ్గర డేట్స్ లేవు! దాంతో ఒళ్లు మండిన రాజ్‌కపూర్ అతడికి ‘టాక్సీ కపూర్’ అని బిరుదు ఇచ్చాడు. రోజుకి రెండు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ ఎప్పుడూ ఒక స్టుడియో నుంచి ఇంకో స్టుడియోకి ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సినిమాలు సైన్ చేస్తున్నాడని రాజ్‌కపూర్ కంప్లయింట్. కాని తానేం చేయగలడు? అన్నను మించిన తమ్ముడు. కాని నిజానికి ఇదంతా నటన. కాదు కాదు ఇదసలు నటనే కాదు. శశి కపూర్‌కు ఆ సంగతి బాగా తెలుసు. ‘థర్డ్‌రేట్ స్టంట్మేన్కు ఇవ్వాల్సిన వేషాలన్నీ నాకిస్తున్నారు’ అని చిరాకు పడ్డాడు చాలాసార్లు. తనలోని నటుణ్ణి అతడు ఈ చెత్త సినిమాలతో మరణశయ్య ఎక్కించలేదు. సజీవంగా ఉంచడానికి తండ్రి వారసత్వంగా వదిలివెళ్లిన ‘పృథ్వీ థియేటర్స్’ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంగ్లిష్ నాటకాలు వేశాడు. ఇస్మాయిల్ మర్చంట్‌తో కలిసి అనేక ఇండో అమెరికన్ సినిమాల్లో నటించాడు. సత్యజిత్ రే దర్శకత్వంలో సినిమాల కోసం, టీవీ కోసం యాక్ట్ చేశాడు. అంతటితో ఊరుకోక తానే సొంత నిర్మాణ సంస్థ- ఫిల్మ్ వాలాస్- స్థాపించి శ్యామ్ బెనగళ్ (కలియుగ్, జునూన్), గోవింద్ నిహలాని (విజేత), అపర్ణా సేన్ (36 చౌరంగీ లేన్) వంటి పారలల్ దర్శకులతో పారలల్ సినిమాలు తీశాడు. డబ్బు సంపాదించడం ఉద్దేశం కానే కాదు. చిన్న ఫ్రేమ్... చిన్న షాట్.. చిన్న డైలాగ్... ఒక నటుడి ఆకలి తీర్చేది. ప్రయోగాలకు వెనుకాడలేదు. గిరిష్ కర్నాడ్ దర్శకత్వంలో ‘ఉత్సవ్’... శశి కపూర్ ఏదో అనుకుని తీశాడు. దేశం మరేదో అనుకుని చూసింది. పెద్ద హిట్. వెంట వైఫల్యం లేకపోతే మజా ఏముంది? ‘అజూబా’ తీశాడు. ముక్కు కాలింది. మంచిదే. హిందీ సినిమాల్లో రొమాంటిక్ హీరో అంటే దేవ్ ఆనంద్. తర్వాత? శశి కపూర్. అందరు హీరోయిన్లు ఆయన పక్కన నటించడానికి ఇష్టపడ్డారు. సాధన, ముంతాజ్, మౌసమీ చటర్జీ, జీనత్ అమాన్, హేమమాలిని... ఆ సినిమాలూ ఆ పాటలూ జనం మెచ్చారు. శశికపూర్ ఖాతాలో చాలా హిట్ పాటలున్నాయి. లిస్టు రాస్తే వేళ్లు నొప్పి పుడతాయి. హమ్ చేస్తే అంటుకుని వెంట బడతాయి. ‘పర్ దేశియోంసే న అఖియా మిలానా’ (జబ్ జబ్ ఫూల్ ఖిలే) ‘తుమ్ బిన్ జావూ కహా’ (ప్యార్ కా మౌసమ్) ‘లిఖ్ఖే జో ఖత్ తుఝే’ (కన్యాదాన్) ‘వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్’ (ఆ.. గలే లగ్‌జా) ‘ఏక్ డాల్ పర్ తోతా బోలే’ (చోర్ మచాయే షోర్) ‘కెహదూ తుమ్హే యా చుప్ రహూ’ (దీవార్) షారూక్‌ఖాన్ చాలా రుణపడి ఉన్నాడు శశికపూర్‌కి. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ టైటిల్ శశికపూర్ యాక్ట్ చేసిన ‘చోర్ మచాయే షోర్’ సినిమా పాటలోనిదే. ఇటీవల వచ్చిన ‘జానే తూ యా జానేనా’... హిట్ సినిమా కూడా శశికపూర్ పాటే. ఇంకా వేయి పాటలు ఉండవచ్చు. కాని శశికపూర్ అంటే ఒకే పాట... ఒకటే జ్ఞాపకం... ఖిల్ తే హై గుల్ యహా.. ఖిల్ కే బిఖర్ నే కో... దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన సందర్భంగా ఈ అందమైన నటుడికో గులాబీ పూమాల. - ఖదీర్ -
అమితాబ్‌తో కలిస్తే హిట్టే!
వాడిపోవడానికి అతను పుట్టింది మహా వృక్షం నీడలోకాదు.. వృక్షానికి తోడుగా.. ఊడలా! ఆ తోడులో నేర్చిన పాఠాలతో మళ్లీ తానే ఓ నటవృక్షంగా ఎదిగేంతలా! భారతీయ సినిమాకు మూల పురుషులు, పురుడు పోసిన మహానుభావులు ఎందరెందరో ఉన్నా బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ పుట్టింది మాత్రం ఫృథ్వీరాజ్ కపూర్ ఇంట్లోనే! అయితే ఆ ఘనత రాజ్ కపూర్ స్టార్‌డమ్‌తోనే ముగిసిపోలేదని రుజువు చేశాడు మరో స్టార్‌గా ఎదిగిన శశి కపూర్! తండ్రి, సోదరుడిలాగే నటనను మాత్రమే శ్వాసించిన శశి.. సోలో హీరోగా కంటే ఎక్కువగా మల్టీస్టార్ సినిమాల్లో నటించారు. అనారోగ్యం నుంచి కోలుకుని 2015, మార్చి 18న 77వ పుట్టినరోజు వేడుక జరుపుకొన్న రాజ్ కపూర్.. వారం తిరగక ముందే మరో తీపి కబురు రుచిచూశాడు. తండ్రి, సోదరుడు సొంతం చేసుకున్న ఘనతను తాను కూడా సాధించి బాలీవుడ్‌కు కపూర్ కుటుంబం అందించిన సేవలను, తద్వారా లభించిన ప్రతిష్టను మరోసారి గుర్తుచేశాడు. 2014 సంత్సరపు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్న ఆయన అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసును కొల్లగొట్టినవే! నమక్ హలాల్, దీవార్, ఇమ్మాన్ ధరం, కాలా పత్తర్, త్రిశూల్ రోటీ కపడా ఔర్ మకాన్, సుహాగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడన్ని హిట్లిచ్చారు శశీ, అమితాబ్! -
'దాదాసాహెబ్ ఫాల్కే' శశి కపూర్
భారతీయ చలనచిత్ర రంగం గౌరవ ప్రదంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. బాలీవుడ్ వెటరన్ హీరో శశి కపూర్‌ను వరించింది. 2014 సంవత్సరానికిగానూ ఆయనకు ఈ అవార్డును దక్కింది. నటుడిగానే కాక, నిర్మాత, దర్శకుడిగానూ ఖ్యాతి గడించిన శశి కపూర్ విభిన్న పాత్రలకు పెట్టిందిపేరు. 1938, మార్చి18న కోల్‌కతాలో జన్మించిన శశి.. తన తండ్రి ఫృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌తోపాటు ప్రయాణిస్తూ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. సంగ్రామ్, దండపాణి చిత్రాల్లో బాలనటుడిగా బాలీవుడ్ రంగప్రవేశం చేసి 50కిపైగా సిసిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. రెండుసార్లు జాతీయ అవార్డు, మూడుసార్లు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన 1999 తర్వాత నటనకు స్వస్తిచెప్పారు. అప్పటినుంచి ఆరోగ్య కారణాలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
ఆస్పత్రిలో చేరిన శశికపూర్
ముంబై: ఒకప్పటి బాలీవుడ్ హీరో శశికపూర్ ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా ఆస్పత్రిలో చేరారు. శ్వాస ఆడక ఇబ్బందిపడుతూ 76 ఏళ్ల శశికపూర్ నిన్న సాయంత్రం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ అస్పత్రి(కెడిఏహెచ్)లో చేరారు. ఇన్టెన్సివ్ కేర్ యూనిట్(ఐసియు)లో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ నరెయిన్ చెప్పారు. శశికపూర్ ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 160 చిత్రాలలో నటించిన శశికపూర్ మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. 2010లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచ్ఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు గతంలో బైపాస్ సర్జరీ చేశారు. **