నా దగ్గర అమ్మ ఉంది!! | amitabh bachchan films a video to salute shashi kapoor | Sakshi
Sakshi News home page

నా దగ్గర అమ్మ ఉంది!!

Published Thu, Apr 23 2015 2:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

నా దగ్గర అమ్మ ఉంది!!

నా దగ్గర అమ్మ ఉంది!!

''ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి.. బంగ్లా ఉంది, బండి ఉంది.. నౌకర్లున్నారు.. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది.. నీ దగ్గర ఏముంది?''

''నా దగ్గర అమ్మ ఉంది''

అంతే, ఈ మా టవినగానే.. ఆరడుగుల పొడవున్న అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా మూగబోతాడు. నాలుగు పదాల ఆ డైలాగు చెప్పినది శశి కపూర్. దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్కు తమ్ముడి పాత్రలో నటించిన హీరో. అలా వెండితెర మీద తన తమ్ముడి పాత్ర పోషించిన శశి కపూర్ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో ఆయన కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా ఓ వీడియో సందేశం రికార్డు చేశారు.

వచ్చే నెలలో శశికపూర్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు బహూకరించే సందర్భంలో ఈ వీడియో ప్రదర్శిస్తారు. త్రిశూల్, సిల్సిలా, రోటీ కప్డా ఔర్ మకాన్, కభీకభీ, కాలా పత్తర్ లాంటి సినిమాల్లో కలిసి నటించిన శశి కపూర్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకోమని అడిగినప్పుడు నోట మాట రాలేదని అమితాబ్ అన్నారు. 77 ఏళ్ల శశి కపూర్ వచ్చే నెలలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. అయితే, తన ఆరోగ్యం సహకరించడం లేదని, అందువల్ల తాను స్వయంగా వచ్చి అవార్డు అందుకునే పరిస్థితి ఉండకపోవచ్చని శశికపూర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement