video message
-
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
న్యూఢిల్లీ: ప్రస్తుత కష్టకాలంలో మహిళలు పడుతున్న అవస్థలను కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందని, ఇదే పార్టీ గ్యారెంటీ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. ఈ మేరకు సోమవారం సోనియా ఒక వీడియో సందేశం ఇచ్చారు. ‘‘ ప్రియమైన సోదరీమణులారా.. మహిళలు దేశ స్వాతంత్రోద్యమం నుంచి నవభారత నిర్మాణం దాకా తమ వంతు అద్భుత తోడ్పాటునందించారు. అయితే మహిళలు ప్రస్తుతం ద్రవ్యోల్బణం మాటున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహిళల కష్టానికి సరైన న్యాయం దక్కేలా కాంగ్రెస్ విప్లవాత్మకమైన గ్యారెంటీని ఇస్తోంది. కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబంలోని మహిళకు ఏటా రూ.1లక్ష సాయం అందించనుంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో కర్ణాటక, తెలంగాణలో ప్రజల జీవితాలు మెరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాలలాగే కాంగ్రెస్ తాజాగా కొత్త పథకాన్ని ముందుకు తేనుంది. కష్టకాలంలో ఎల్లప్పుడూ కాంగ్రెస్ ఆపన్నహస్తం అందిస్తుంది’ అని ముగించారు. సోనియా సందేశాన్ని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీ ‘ఎక్స్’లో షేర్చేశారు. సోనియా సందేశంపై రాహుల్ స్పందించారు. ‘‘ పేద కుటుంబాల మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ ఒక్క ఓటు ఏటా మీ ఖాతాలో జమ అయ్యే రూ.1 లక్షతో సమానం. పెరిగిన ధరవరలు, నిరుద్యోగ కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్న పేద మహిళలకు మహాలక్ష్మీ పథకం గొప్ప చేయూత. అందుకే ఓటేయండి’ అని అన్నారు. -
Sunita Kejriwal: కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు. క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్ బ్లడ్‌షుగర్ లెవెల్ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి. హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన అరెస్టులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తనను ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 2వ తేదీలోగా స్పందించాలని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి సూచించారు. తదపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. -
Delhi liquor scam: త్వరలో వస్తా..అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో ఈడీ కస్టడీ నుంచి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. దాన్ని ఆయన భార్య సునీత ప్రత్యక్షప్రసారంలో చదివి వినిపించారు. ‘‘జైల్లో ఉన్నా, బయటున్నా నా జీవితంలో ప్రతి క్షణం దేశ సేవకే అంకితం. నా ప్రతి రక్తపుబొట్టు దేశం కోసమే ధారపోస్తా. మీ సోదరుడు, కుమారుడినైన నన్ను ఏ జైలూ ఎక్కువ రోజులు బంధించలేదు. త్వరలోనే బయటికొస్తా. మీకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. కష్టాల్లోనే పెరిగా. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా. అందుకే ఈ అరెస్ట్‌తో ఆశ్చర్యపోలేదు. దేశాన్ని బలహీన పరిచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాటిని ఓడించండి’’ అని బీజేపీని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘గత జన్మలో ఎంతో పుణ్యంచేసుకొని ఉంటా. అందుకే ఈ పుణ్యభూమిలో పుట్టా. కోట్లాదిగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకు కొండంత అండ’ అని అందులో కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ వాళ్లంతా నా సోదరసోదరీమణులు ‘‘ఆప్ వాలంటీర్లకు నాదో సూచన. నేను కస్టడీలో ఉన్నా çసామాజిక, సేవ కార్యక్రమాలు ఆగకూడదు. ఢిల్లీ మహిళలకు నెలకు రూ.1,000 వాగ్దానం నేనొచ్చాక నెరవేరుస్తా. నన్ను అరెస్ట్ చేశారని బీజేపీపై ద్వేషం పెంచుకోకండి. వాళ్లంతా నా సోదరసోదరీమణులు. ప్రజల ఆశీర్వా దాలతో మూడుసార్లు సీఎం అయిన నన్ను అధికార అహంకారంతో మోదీ జైళ్లో పడేశారు. ఇది ఢిల్లీ ప్రజలను వంచించడమే. ఎక్కడున్నా ప్రజాసేవలకే అంకితమవుతా. వాళ్లే నిర్ణాయక శక్తులు. జై హింద్’’ అన్నారు. ఆప్ ఢిల్లీ ఆఫీస్‌కు తాళం ఆప్ ఢిల్లీ కార్యాలయానికి సీలు వేశారని మంత్రి ఆతిషి ఆరోపించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీ ఆఫీస్‌కు వెళ్లకుండా మా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని చెప్పారు. ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ‘‘ఆఫీస్‌కు సీల్ వేయలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అందుకే వందల సంఖ్యలో వస్తున్న ఆప్ కార్యకర్తలను ఆఫీస్ వైపు వెళ్లనివ్వట్లేదు. గుమిగూడనివ్వట్లేదు’’ అని వివరించారు. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని ఆతిశీ ‘ఎక్స్’లో వెల్లడించారు. జైలులో సీఎం ఆఫీస్‌కు అనుమతి కోరతాం: భగవంత్ మాన్ ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడి నుంచి ఆయన ప్రభుత్వాన్ని నడిపేలా సీఎం తాత్కాలిక ఆఫీస్‌ను ఏర్పాటుచేసేందుకు అనుమతి కోరతామని ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ‘ఆప్‌లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీచేయ లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదనే నిబంధన ఏదీ లేదు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు తరలిస్తే అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహి స్తారు. దోషిగా తేలనంత వరకూ చట్ట ప్రకారం ఆయన జైలు నుంచి కూడా పనిచేయవచ్చు. అందుకే ఆఫీస్ కోసం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల అనుమతి కోరతాం’ అని మాన్ అన్నారు. సోదరా, తీహార్‌కు వెల్కం! కేజ్రీవాల్‌కు సుఖేశ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రియ సోదరా, కేజ్రీవాల్! నెమ్మదిగా అయినా నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్ శక్తికి ఇదో క్లాసిక్ ఉదాహరణ. వెల్ కం టూ తీహార్ క్లబ్. బాస్ ఆఫ్ తీహార్ క్లబ్‌గా ఆహ్వానిస్తున్నా. మీ డ్రామాలకు ముగింపు పడింది’’ అంటూ మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ శనివారం ఆయకు లేఖ రాశాడు. ‘‘మీ అవినీతంతా బయటపడుతుంది. ఢిల్లీ సీఎంగా 10 కుంభకోణాలు చేశారు. నాలుగింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. లిక్కర్ స్కాం కేవలం ఆరంభమే. అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయట పెడతా. నేను ఛైర్మన్‌గా, కేజ్రీ బిగ్‌బాస్‌గా, సిసోడియా సీఈఓగా, సత్యేంద్ర జైన్ సీఓఓగా తిహార్ క్లబ్ నడుపుతా‘’ అన్నాడు. -
నేను రాలేకపోతున్నా... మీరు మార్పు తీసుకురండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో మార్పు కావాలని, ఆ మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటేయాలని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలనుద్దేశించి మంగళవారం ఓ వీడియో సందేశం పంపారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులకు నమస్కారం. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. కానీ మీరు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. మీకు ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ అమరవీరుల కలలు నెరవేరడం చూడాలనుకుంటున్నా. మనందరం కలసి దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలి. మీ కలలు సాకా రం కావాలి. ఒక మంచి ప్రభుత్వం రావాలి. సోని యమ్మ అని పిలిచి మీరు నాకు చాలా గౌరవప్రదమైన అమ్మ స్థానం ఇచ్చారు. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలందరికీ నా విన్నపం. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ కి ఓటేయండి. మార్పు కావాలి. కాంగ్రెస్ రావాలి. జై తెలంగాణ. జైహింద్.’ అని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్‌ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు..!
‘నైజీరియన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి సందేశం కావొచ్చు. మీరంతా నాకు సాయం చేస్తారని భావిస్తున్నా..’ అంటూ ఇక్వెటోరియల్ గినీలో బందీగా మారిన ఓ భారత నావికుడి వీడియో సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్ గినీలో గత ఆగస్టు నెలలో ‘హీరోయిక్ ఇడున్’ అనే నౌకను అక్కడి నౌకాదళం బందించింది. అందులోని 16 మంది భారత నావికులు సహా సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆగస్టు 13న హీరోయిక్ ఇడున్ నౌకపై ఇక్వెటోరియల్ గినియా జెండా లేదనే కారణంగా నిలిపేశారు. గత 80 రోజులుగా నావికులు బందీలుగా ఉన్నారని, వారిని నైజీరియా నేవీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిక్ ఇడున్ నౌక చీఫ్ ఆఫీసర్, భారత నావికుడు సాను జోష్ తనను అదుపులోకి తీసుకునేందుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ‘నైజీరియాన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు. మీరంతా నన్ను చూస్తున్నారని, నాకు సాయం చేస్తారని భావిస్తున్నా. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతిఒక్కరికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు సాను జోష్. బందీలుగా మారిన భారత నావికులను విడిపించేందుకు భారత అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు.. గత ఆగస్టు నెల మధ్యలోనే హీరోయిక్ ఇడున్ అనే నౌకకు చెందిన భారత నావికులు సహా సిబ్బంది అంతా బందీలుగా పట్టుబడ్డారని విదేశాంగ శాఖకు తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం. మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బందీలను త్వరగా విడుదల చేయడానికి గినీ, నైజీరియా దేశాలకు చెందిన అధికారులతో చర్చిస్తున్నామని ఇక్వెటోరియల్ గినీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
‘‘మానాన్నలాగా మీరూ కావద్దు’’ : హాలీవుడ్ హీరో భావోద్వేగ వీడియో
టెర్మినేటర్ స్టార్, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంపై స్పందించారు. దయచేసి ఈ యుద్ధాన్ని ముగించండి. మీరే యుద్ధాన్ని మొదలు పెట్టారు.. మీరే కొనసాగిస్తున్నారు.. మీరే దీన్ని ముగించాలి అంటూ డైరెక్టుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే రష్యా ప్రజలకు, సైనికులకు ఉద్వేగభరితమైన సందేశంతో ఒక వీడియోను షేర్ చేశారు కాలిఫోర్నియా మాజీ గవర్నర్. రష్యా ప్రజలంటే తనకు చాలా అభిమానమని అందుకే ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నా అన్నారు. రష్యన్ ప్రజల బలం, వారి మనసు తనకు ఎపుడూ స్ఫూర్తినిస్తుందని అందుకే ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి తెలుసుకోవలసిన భయంకరమైన విషయాలున్నాయంటూ తన తొమ్మిది నిమిషాల వీడియోలో కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు. అలాగే రష్యన్ వెయిట్‌లిఫ్టర్ యూరి వ్లాసోవ్ 14 సంవత్సరాల వయస్సులో తనకు స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఉక్రెయిన్ను 'డి-నాజిఫై' చేసే యుద్ధం అని రష్యా ప్రభుత్వం చెప్పిందని తెలుసు, "ఇది నిజం కాదు. క్రెమ్లిన్‌లో అధికారంలో ఉన్నవారు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఇది రష్యా ప్రజల యుద్ధం కాదు చట్టవిరుద్ధమైన యుద్ధం. ప్రపంచం మొత్తం ఖండించిన తెలివిలేని యుద్ధం కోసం మీ జీవితాలు, మీ అవయవాలు, మీ భవిష్యత్తులు త్యాగం చేయబడుతున్నాయి. ఇప్పటికే వేలాది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం వారంతా యుద్దం చేస్తోంటే నాయకులు మాత్రం విజయంకాంక్షతో ఉన్నారు. I love the Russian people. That is why I have to tell you the truth. Please watch and share. pic.twitter.com/6gyVRhgpFV — Arnold (@Schwarzenegger) March 17, 2022 స్క్వార్జెనెగర్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో దాని చర్యలు, క్రూరత్వం కారణంగా ప్రపంచం రష్యాకు వ్యతిరేకంగా మారింది, పిల్లల ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రితో సహా రష్యన్ ఫిరంగిదళాలు బాంబులతో నేలమట్టం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్క్వార్జె నెగర్ రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాలో నాజీల కోసం పోరాడుతున్నప్పుడు తన తండ్రికి కలిగిన గాయాలను గుర్తుచేసుకున్నారు. శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోయి జీవితాంతం బాధతోనే గడిపారు, మీరు ఆయనలా బాధపడటం తనకు ఇష్టం లేదంటూ రష్యా దళాలకు సందేశమిచ్చాడు. అలాగే రష్యాల్లో ఉక్రెయిన్‌పై దండయాత్రకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను మీరు నా హీరోలు అంటూ ప్రశంసించారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి నేటికి (మార్చి, 18) 23వ రోజు. అమెరికా అధ్యక్షులు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈరోజు చర్చించనున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ ప్సాకి తెలిపారు. -
ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్ సీ టీమ్‌లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం) -
‘నీట్’కు బలైన ముగ్గురు..సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన
చెన్నె: మూడు రోజుల్లో ముగ్గురు ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై భయంతో ఆందోళన చెందుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి మరణం తమిళనాడు రాష్ట్రాన్ని కదిలించింది. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చలించిపోయారు. తమ విద్యార్థులకు బలిపీఠంగా మారిందని పేర్కొన్న స్టాలిన్ నివారణ చర్యలు చేపట్టారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ నుంచి ఉపశమనం కలిగిస్తూ అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పెట్టినా కూడా విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా ఓ యువతి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సీఎం స్టాలిన్ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తూ ఓ సందేశం విడుదల చేశారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ‘నీట్‌తో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం 24/7 పని చేసే హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టాం’ అని సీఎం స్టాలిన్ తెలిపారు. విద్యార్థులకు నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తామని ప్రకటించారు. మనస్తాపం.. ఒత్తిడితో బాధపడుతుంటే 104కు సంప్రదించాలని.. వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వీటికోసం ఏకంగా 330 మంది నిపుణులను నియమించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. ‘ప్రియమైన విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మేం మొత్తం మారుస్తాం. నీట్ రద్దు చేసేంత వరకు మేం విశ్రమించం’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. రాతి హృదయాలను కరిగిద్దాం అని పిలుపునిచ్చారు. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడ్డవద్దని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. నీట్‌పై తమిళనాడులోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. மாணவச் செல்வங்களே! மனம்தளராதீர்கள்! கெஞ்சிக் கேட்டுக்கொள்கிறேன்; ஈடில்லா உயிர்களை மாய்த்துக் கொள்ளாதீர்கள்! கல் நெஞ்சங்கொண்டோரைக் கரைப்போம்!#NEET எனும் அநீதியை ஒழிக்கும்வரை நாம் ஓயமாட்டோம்! https://t.co/sE6530aZR7 — M.K.Stalin (@mkstalin) September 15, 2021 -
మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!
ఇప్పుడు కరోనా చైన్‌ను తెంచే పనిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. భారత్‌లోనూ వేలల్లో వైరస్ బారిన పడుతున్న తరుణంలో బీసీసీఐ భారత క్రికెటర్ల ద్వారా మాస్క్‌లు ధరించేలా ప్రోత్సహిస్తోంది. స్టార్ క్రికెటర్లు కోహ్లి, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బయటికి వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే స్పృహ కల్పించేలా ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ పేరిట ఈ వీడియో సందేశం ఉంది. ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. -
కరోనాపై గెలుపొందాలి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కోవిడ్–19పై విజయం ఓ మెగా ప్రపంచకప్ విజయం లాంటిదని అన్నారు. బుధవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అన్ని ప్రపంచకప్‌లకంటే పెద్దది ఈ మహమ్మారి. దీనిపై పోరాటం చేయాలి. గెలవాలి. ఇందులో గెలిస్తే ప్రపంచకప్‌ను సాధించినట్లే. దీని కోసం మనం రెండు లక్ష్యాలు పెట్టుకోవాలి... ఒకటి ఇంట్లోనే ఉండటం. రెండోది భౌతిక దూరం పాటించడం’ అని ఈ వీడియోలో పేర్కొన్నారు. శాస్త్రి ఓ కోచే కాదు... మాజీ ఆల్‌రౌండర్, ఆ తర్వా త మంచి వ్యాఖ్యాత కూడా! అం దుకే తనదైన కామెంటేటర్ శైలిలో వీడియో సందేశమిచ్చారు. ‘కరోనా మనల్ని ఇంట్లోనే కట్టేసింది. నాలుగ్గోడలకు పరిమితం చేసిన ఈ మహమ్మారిని ఛేదించడం ప్రపంచకప్ లక్ష్యాన్ని ఛేదించడం లాంటిది. అందుకే అందరం కలసికట్టుగా ఈ కప్ గెలవాలంటే... కరోనాను ఓడించాల్సిందే. నిజానికి ఇది మామూలు ప్రపంచకప్ కప్ కాదు సుమా! అందుకే దీన్ని ఓడించేందుకు ఫైనల్ ఎలెవన్ జట్టు సరిపోదు. కోట్ల మంది టీమిండియా తరఫున పోరాడాలి. అప్పుడే గెలుస్తాం. అందరూ దృఢ సంకల్పంతో ఉండండి. కరోనాను భారత్ నుంచి తరిమేయండి’ అని రవిశాస్త్రి ప్రజల్ని జాగృతం చేస్తున్నారు. -
ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: వీధి లైట్లను ఆర్పాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కరోనాపై పోరాటానికి ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలు ఆర్పేసి సంఘీభావం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. ఇళ్లలోని విద్యుత్ వస్తువులను స్విచ్చాఫ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో లైట్లు బంద్ చేయాల్సిన పనిలేదన్నారు. వీధి లైట్లను బంద్ చేయాలని ఎటువంటి పిలుపు ఇవ్వలేదని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వీధి లైట్ల ఆర్పొద్దని స్థానిక సంస్థలకు సూచించింది. విద్యుత్ దీపాలను ఆర్పడం వల్ల పవర్‌గ్రిడ్ కుప్పకూలిపోతుందని, వోల్టేజ్ హెచ్చుతగ్గులు తలెత్తి గృహోపకరణాలు పాడవుతాయన్న వదంతులను కేంద్ర విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. అలాంటివేమి జరగబోదని పేర్కొంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని విద్యుద్ దీపాలు బంద్ చేస్తే చాలని స్పష్టం చేసింది. (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని మోదీ శుక్రవారం వీడియా సందేశంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా ప్రధాని ఇలాంటి పిలుపులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?) -
9 గంటలకు.. 9 నిమిషాల పాటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఒక వీడియో సందేశంలో ప్రధాని దాదాపుగా 11 నిమిషాల సేపు మాట్లాడారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే.... కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించి ఇవాళ్టికి 9 రోజులు గడిచాయి. ఈ తొమ్మిది రోజులలో మీరు ప్రదర్శించిన క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి అపూర్వమైనవి. కరోనా వైరస్‌పై యుద్ధంలో అహర్నిశలు శక్తియుక్తులు ధారపోస్తున్నవారికి మార్చి 22న చప్పట్లు, గంటలు కొట్టడం ద్వారా చూపించిన కృతజ్ఞత విధానం ఇప్పుడు అన్ని దేశాలకు ఆదర్శప్రాయమైంది. ఈ పరీక్షా సమయంలో జాతి సమష్టి శక్తిని అందరికీ చాటాము. దేశంలో కోట్లాది ప్రజలు ఇళ్లకే పరిమితమైన ఈ సమయంలో తాము ఒక్కరమే ఏం చేయగలం అన్న ప్రశ్న వస్తుంది. ఆ ఒంటరి భావాన్ని పోగొట్టడం ఎంతో అవసరం. దేశంలో 130 కోట్ల మంది మనకి తోడుగా ఉన్నారని సంఘీభావాన్ని చాటి చెబుదాం. మన దేశంలో ‘అహం బ్రహ్మోస్మి’అనే భావన అనాదిగా ఉన్నదే. అందువల్ల దేశం ఇంత భారీ యుద్ధం చేస్తున్నవేళ, ఎప్పటికప్పుడు ఈ అద్భుత సమైక్య శక్తి ప్రజల రూపంలో ప్రస్ఫుటం అవుతున్నదిగా అనుభూతి చెందాలి. ఈ భావనే మనలో ఆత్మస్థైరాన్ని నింపి సామూహిక లక్ష్యం వైపు అడుగులు పడేలా చేస్తుంది. కరోనా కారు చీకట్ల నుంచి కాంతి రేఖ కనపడుతుందన్న ఆశాభావంతో మనమంతా నిరంతరం ముందుకు సాగాలి. నిరాశా నిస్పృహలతో ఉన్న కరోనా వ్యాధిగ్రస్తుల్ని బయటకు తీసుకురావాలి. ఈ ఆదివారం అంటే– ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు.. మీ ఇళ్లలో ప్రవేశద్వారాల వద్ద, బాల్కనీలలో– వెలిగించిన కొవ్వొత్తులు లేదా దీపపు ప్రమిదలతో టార్చీలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లను పట్టుకొని 9 నిమిషాలపాటు నిలబడండి. ఆ సమయంలో మీ ఇళ్లలోని అన్ని విద్యుద్దీపాలనూ ఆర్పివేయండి. అలా మనం అన్నివైపుల నుంచీ ఒక్కొక్క దీపంతో నిలబడినపుడు ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో, ఆ పోరాటంలో మనం ఒంటరి కామని చెప్పుకుంటూ సామూహిక లక్ష్యసాధనకు సంకల్పం చెప్పుకుందాం. ఈ సంక్షోభ సమయంలో ఒకరికొకరం ఉన్నామనే భావన వెయ్యి ఏనుగుల బలం కలిగిస్తుంది. మనలో ఉండే ఉత్సాహానికి మించిన శక్తి ఏదీ ఈ విశ్వంలో లేదు. ఈ సందర్భంగా అందరికీ ఒక మనవి చేస్తున్నాను. వెలుగును ప్రసరింపజేసే ఈ కార్యక్రమంలో అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించండి. లక్ష్మణరేఖని దాటవద్దు. కరోనా వైరస్ గొలుసుకట్టు వ్యాప్తిని విచ్ఛిన్నం చేయగల పాశుపతాస్త్రం ఇదే . వైరస్‌ను పారద్రోలి భరతమాతను విజయపథంలో నిలబెడదాం’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, దీపాలు వెలిగించాలన్న ప్రధాని సందేశంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కరోనా బాధితులకు వైద్యం, ఉపాధి లేని వారికి ఆహారం అందించడం, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యలు వంటివాటిపై మాట్లాడతారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. -
నేడు ప్రధాని మోదీ వీడియో సందేశం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ల నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం ఇవ్వనున్నారు. ‘రేపు ఉదయం 9 గంటలకు సహచర భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటాను’ అని గురువారం ప్రధాని ట్వీట్ చేశారు. అయితే, ఆ సందేశం దేనికి సంబంధించినదనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. -
పౌరులకు వీడియో సందేశం ఇవ్వనున్న మోదీ
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9గంటలకు దేశ పౌరులతో వీడియో ద్వారా తన సందేశాన్ని పంచుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ' రేపు ఉదయం నా తోటి భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా' అంటూ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా దేశంలో రెండో దశలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మార్చి 21 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా లేక ముగిస్తారా అన్నది కీలకంగా మారింది.ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు, లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించారు. ఈ నేపథ్యంలో మోదీ శుక్రవారం ఉదయం 9గంటలకు దేశ పౌరులతో పంచుకోనున్న వీడియో సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ('తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి') At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians. कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा। — Narendra Modi (@narendramodi) April 2, 2020 -
2020 అమెరికా అధ్యక్ష బరిలో వారెన్!
వాషింగ్టన్: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్(69) ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులకు పంపిన వీడియో సందేశంలో ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ముందు, అవకాశాలపై అధ్యయనం చేసేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో తదుపరి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసరబోతున్నానని అధికారికంగా ప్రకటించిన తొలి డెమొక్రటిక్ నాయకురాలిగా ఆమె నిలిచారు. ట్రంప్ విధానాల్ని తీవ్రంగా ఎండగట్టే వారెన్ ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మసాచుసెట్స్ నుంచి సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ఇండో–అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్, హిందూ మతానికి చెందిన మరో సభ్యురాలు తులసీ గబ్బార్డ్‌లు కూడా ట్రంప్‌పై పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. -
‘నా చావుకు ఎవరూ కారణం కాదు’
ముంబై : నా చావుకు ఎవరూ కారణం కాదంటూ.. సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడో యువకుడు. థానేలోని కళ్యాణ్పూర్ స్టేషన్ వద్ద గురువారం చోటు చేసుకుంది ఈ దారుణం. వివరాలు.. రోహిత్ పరదేశి(20) అనే వ్యక్తి కదులుతున్న సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పక్కన ఇతని తలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోహిత్ మృత దేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాజేష్ సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చనిపోయేముందు అతను వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ మెసేజ్‌లో ‘నా చావుకి ఎవరూ కారణం కాదు.. ఎవరి బలవంతం వల్లనో నేను ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. నాకు బతకాలని లేదు. నా తదనంతరం ఆస్తి మొత్తం నా సోదరుడికే చేందుతుంది’ అని వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అజ్ఞాతవాసిపై పవన్ వీడియో సందేశం
-
ప్రవాసాభిమానులకు పవన్ సందేశం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. గతంలో మరే భారతీయ సినిమా రిలీజ్ చేయనంత భారీగా అజ్ఞాతవాసి సినిమాను ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకుల కోసం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు పవన్. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన పవర్ స్టార్, వారి అండగా ఇక్కడ కోట్లమంది ప్రజలు ఉన్నారని భరోసా ఇచ్చారు. ‘పద్దెనిమిదేళ్ల క్రితం బద్రి సినిమా కొన్ని సెంటర్లలో రిలీజ్ అయితేనే అది పెద్ద విజయంగా భావించాం. ఇప్పుడు అజ్ఞాతవాసి ఇంత భారీగా రిలీజ్ అవ్వటం ఆనందంగా ఉంద’న్నారు పవన్. ప్రవాసాభిమానులకు పవన్ సందేశం -
నా దగ్గర అమ్మ ఉంది!!
''ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి.. బంగ్లా ఉంది, బండి ఉంది.. నౌకర్లున్నారు.. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది.. నీ దగ్గర ఏముంది?'' ''నా దగ్గర అమ్మ ఉంది'' అంతే, ఈ మా టవినగానే.. ఆరడుగుల పొడవున్న అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా మూగబోతాడు. నాలుగు పదాల ఆ డైలాగు చెప్పినది శశి కపూర్. దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్‌కు తమ్ముడి పాత్రలో నటించిన హీరో. అలా వెండితెర మీద తన తమ్ముడి పాత్ర పోషించిన శశి కపూర్ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో ఆయన కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా ఓ వీడియో సందేశం రికార్డు చేశారు. వచ్చే నెలలో శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు బహూకరించే సందర్భంలో ఈ వీడియో ప్రదర్శిస్తారు. త్రిశూల్, సిల్సిలా, రోటీ కప్డా ఔర్ మకాన్, కభీకభీ, కాలా పత్తర్ లాంటి సినిమాల్లో కలిసి నటించిన శశి కపూర్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకోమని అడిగినప్పుడు నోట మాట రాలేదని అమితాబ్ అన్నారు. 77 ఏళ్ల శశి కపూర్ వచ్చే నెలలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. అయితే, తన ఆరోగ్యం సహకరించడం లేదని, అందువల్ల తాను స్వయంగా వచ్చి అవార్డు అందుకునే పరిస్థితి ఉండకపోవచ్చని శశికపూర్ అన్నారు. -
చంద్రబాబు వీడియో సందేశం
హైదరాబాద్: హుదూద్ తుపానుపై రాష్ట్ర ప్రజలకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో సందేశం ఇచ్చారు. తుపాను తీరం దాటేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 5 జిల్లాలలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ నుంచి తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలను పంపాలని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో)ను కోరినట్లు తెలిపారు. 13 ఎన్డీఆర్ఎఫ్ టీవీలను, 15 శాటిలైట్ ఫోన్లు సిద్ధం చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చంద్రబాబు తెలిపారు. **