ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9గంటలకు దేశ పౌరులతో వీడియో ద్వారా తన సందేశాన్ని పంచుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ' రేపు ఉదయం నా తోటి భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా' అంటూ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా దేశంలో రెండో దశలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మార్చి 21 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా లేక ముగిస్తారా అన్నది కీలకంగా మారింది.ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు, లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించారు. ఈ నేపథ్యంలో మోదీ శుక్రవారం ఉదయం 9గంటలకు దేశ పౌరులతో పంచుకోనున్న వీడియో సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
('తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి')
At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
— Narendra Modi (@narendramodi) April 2, 2020
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
Comments
Please login to add a commentAdd a comment