సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి మెరుగుపరిచేందుకు అవసరమైన కొన్ని కీలక రంగాలను పున:ప్రారంభించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని సడలింపులతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మతపరమైన ప్రదేశాలతో పాటు ఇతర సంస్థల పున:ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే మరిన్ని రంగాలు, సంస్థలు ఇప్పటికీ లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వాటిని జూలై రెండోవారం నుంచి తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. (‘ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’)
త్వరలో పున: ప్రారంభించేందుకు దృష్టి పెట్టిన రంగాలు ఇవే..
మెట్రో రైళ్లు: మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22 నుంచి మెట్రో రైలు సేవలను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 25న జనతా కర్ఫ్యూను ప్రకటించి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే దశల వారీగా అమలవుతన్న లాక్‌డౌన్‌లో కేంద్రం సడలింపులతో కూడిన కొన్ని రవాణా సేవలకు అనుమతించింది. కానీ మెట్రో రైల్వే సేవలకు మాత్రం అనుమతించలేదు. దీనిపై మెట్రో అధికారులు మే 30న ట్వీట్ చేస్తూ తదుపరి ఆదేశం వచ్చే వరకు మెట్రో సేవలు అనుమతి లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక లాక్‌డౌన్ మొదటి దశ మార్గదర్శకాలలో జూన్ 30 వరకు సబర్బన్ రైళ్లతో పాటు మెట్రో రైల్ సేవలు కూడా మూసివేయబడతాయని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే అత్యవసర సేవల విభాగంలో పనిచేసే వారి కోసం ముంబై సబర్బన్ రైళ్లను కెటాయించారు. (పునః ప్రారంభ సంబరం..)
పాఠశాలలు, కళాశాలలు:
కరోనా వ్యాప్తిని అరికట్టేందు పలు రంగాలతో పాటు విద్యాసంస్థలను కూడా ప్రభుత్వం మూసివేసింది. దీంతో అన్ని స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాగా పాఠశాలను, కళాశాలను తిరిగి జూలైలో తెరిచేందుకు కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడటంతో. జూన్ 30 తర్వాత పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర, రాష్ట్ర బోర్డులు తెలిపాయి.
రైల్వేలు: గత నెలలో కొన్ని రైల్వే సేవలను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయి సేవలకు కేంద్రం అనుమతించలేదు. 51 రోజుల లాక్‌డౌన్ తరువాత, మే 12 నుంచి రైల్వే శాఖ క్రమంగా రైల్వే సేవలను తిరిగి ప్రారంభించింది. అంతేగాక గత నెలలో 15 జతల రైళ్లతో ఢిల్లీ - డిబ్రుగా, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తవి రైల్వే స్టేషన్లను కలుపుతూ సేవలను ప్రారంభించింది. కోవిడ్-19 వారి కోసం కేటాయించిన 20,000 బోగీలను దృష్టిలో ఉంచుకుని కోచ్‌ల లభ్యత ఆధారంగా సేవలను తిరిగి ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment