
దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధింపుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం క్లారిటీ ఇచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే.. లాక్‌డౌన్ అవసరం ఉండదని తెలిపారు. థర్డ్ వేవ్ ఉధృతి తక్కువగానే ఉందని.. వైరస్ కట్టడికి కొన్ని ఆంక్షలు అమలుచేస్తే సరిపోతుందని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ రేపు మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, ఇటీవల కరోనాబారినపడ్డ అరవింద్ కేజ్రీవాల్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నెల 4న ఆయనకు వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్‌ను జయించారు.
(చదవండి: భారత్‌లో థర్డ్‌వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు)
करोना से ठीक होकर मैं वापिस आपकी सेवा में हाज़िर हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2022