
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. గతంలో మరే భారతీయ సినిమా రిలీజ్ చేయనంత భారీగా అజ్ఞాతవాసి సినిమాను ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకుల కోసం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు పవన్. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన పవర్ స్టార్, వారి అండగా ఇక్కడ కోట్లమంది ప్రజలు ఉన్నారని భరోసా ఇచ్చారు. ‘పద్దెనిమిదేళ్ల క్రితం బద్రి సినిమా కొన్ని సెంటర్లలో రిలీజ్ అయితేనే అది పెద్ద విజయంగా భావించాం. ఇప్పుడు అజ్ఞాతవాసి ఇంత భారీగా రిలీజ్ అవ్వటం ఆనందంగా ఉంద’న్నారు పవన్.
ప్రవాసాభిమానులకు పవన్ సందేశం
Comments
Please login to add a commentAdd a comment