
ముంబై : నా చావుకు ఎవరూ కారణం కాదంటూ.. సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడో యువకుడు. థానేలోని కళ్యాణ్‌పూర్ స్టేషన్ వద్ద గురువారం చోటు చేసుకుంది ఈ దారుణం. వివరాలు.. రోహిత్ పరదేశి(20) అనే వ్యక్తి కదులుతున్న సబర్బన్ రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పక్కన ఇతని తలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోహిత్ మృత దేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం రాజేష్ సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చనిపోయేముందు అతను వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ మెసేజ్‌లో ‘నా చావుకి ఎవరూ కారణం కాదు.. ఎవరి బలవంతం వల్లనో నేను ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. నాకు బతకాలని లేదు. నా తదనంతరం ఆస్తి మొత్తం నా సోదరుడికే చేందుతుంది’ అని వీడియో మెసేజ్‌ని రికార్డ్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.