సాక్షి, ముంబై: భర్త పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన చంటి బిడ్డతోసహా రైల్వే ట్రాక్ మీదకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డ్రైవర్ అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయి ఆ తల్లీకూతుళ్లు నలిగిపోయారు. థానే జిల్లా భాయందర్ రైల్వే స్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం సాయంత్రం నాలుగో ఫ్లాట్ ఫామ్‌పై తన కూతురిని ఎత్తుకుని ఆ మహిళ రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. రైలు దగ్గరికి రాగానే ఒక్కవేటున దూకేసింది. అది గమనించిన డ్రైవర్ బ్రేకులు వేయగా.. అప్పటికే ఆ తల్లీకూతుళ్లు రైలు చక్రాల కింద పడి నలిగిపోయారు. ఆనవాళ్ల ఆధారంగా మృతులను రేణుకా పింటూ(24), ఆరోహి(2)గా నవఘడ్ పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజీల్లో ఆ షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి.
భర్త వేధింపులు తాళలేకనే ఆమె బిడ్డతో సహా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బుల్లెట్ బండి కొనటానికి డబ్బులు తేవాలంటూ ఆమెను భర్త ఏడాదిగా హింసిస్తున్నాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని రేణుకా తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదుతో రేణుకా భర్త రాహుల్ పింటూ సింగ్ యాదవ్‌ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment