cctv footage
-
నిఘా నేత్రాలనూ వదలట్లేదు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న సీసీటీవీ కెమెరాలను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. అందులోని ఫుటేజీని వాడుకొని మోసగించేందుకు..సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారని సైబర్‌భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పాయల్ మెటర్నటీ ఆస్పత్రి సీసీటీవీ కెమెరాలను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఇళ్లు, కార్యాలయాల్లోని సీసీటీవీ కెమెరాలు సైతం హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని, కొద్దిపాటి జాగ్రత్తలతో ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చనిసైబర్ నిపుణులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఎలా హ్యాక్ చేస్తారు? సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీడ్‌ను చూసేందుకు మనం ఏర్పాటు చేసుకునే ఖాతాకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలకు డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను చాలామంది మార్చరు. దీంతో హ్యాకర్లు సులభంగా కెమెరాల్లోకి చొరబడుతున్నారు. కొన్ని సీసీటీవీ కెమెరాల సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండటం కూడా హ్యాకర్లకు కలిసొస్తుంది. బలహీనమైన వైఫై నెట్‌వర్క్‌లు కూడా హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారుతాయి. ఫిషింగ్ ఈ–మెయిల్లతో హ్యాకర్లు యూజర్ల పాస్వర్డ్లు, ఇతర సమాచారాన్ని సేకరించి హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. హ్యాక్ చేయడం వల్ల కలిగే నష్టాలు ⇒ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది. ⇒ ఇళ్లు, కార్యాలయాల్లోని ముఖ్యమైన సమాచారం దొంగిలిస్తారు. ⇒ బెదిరింపులు, బ్లాక్మెయిల్లకు గురయ్యే ప్రమాదముంది. ⇒ ఆర్థికంగా నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ⇒ సీసీటీవీ కెమెరాలకు తప్పకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోవాలి. అవి సులువుగా ఇతరులు గుర్తించలేనట్టుగా ఉండాలి. ⇒ సీసీటీవీల సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ⇒ వైఫై నెట్‌వర్క్‌ను సురక్షితంగా పెట్టుకోవాలి. ⇒ అనుమానాస్పద లింక్‌లు, ఈ–మెయిల్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ⇒ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సైబర్ పోలీసులు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ 1930లో ఫిర్యాదు చేయాలి. -
పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు
సూరత్‌గఢ్: రాజస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. సూరత్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని ఒక లెవెల్ క్రాసింగ్‌పై కేంద్ర పోలీసు బలగాలకు చెందిన ఎస్‌యూవీని ఒక రైలు బలంగా ఢీకొంది(Rajasthan Hits SUV). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఎస్యూవీ కారులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్)నకు చెందిన ముగ్గురు జవానులు ఉన్నారు. ఈ కారు పట్టాలపైకి చేరుకోగానే రైలు బలంగా ఢీకొని కొంత దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. దీనికి కారణమేమిటన్నదీ ఇంకా వెల్లడికాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో ఉన్న దృశ్యాన్ని చూస్తే ఈ పట్టాల మీదుగా రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో అటు రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను నిలువరించేందుకు ఎటువంటి గేటు లేదు. 📍Rajasthan | #Watch: An SUV of a central police force was rammed by a train at a level crossing near Suratgarh Super Thermal Power Plant in Rajasthan.CCTV footage of the accident has gone viral on social media.Local reports said there were three personnel of the Central… pic.twitter.com/Zw7GiJbd51— NDTV (@ndtv) March 22, 2025వీడియోను పరిశీలనగా చూస్తే ఎస్‌యూవీని నడుపుతున్న డ్రైవర్‌కు అటుగా రైలు వస్తున్న సంగతి తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన ఒక సీఐఎస్ఎఫ్ జవాను కారు నుంచి బయటకు దూకి పారిపోయారు. ఇంతలో రైలు ఆ ఎస్‌యూవీని ఢీకొంది. కారులోని ఇద్దరు జవానులు బయటపడేంతలో ఆ రైలు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమింగ్‌కు రూ. 3.26 కోట్ల ప్రభుత్వ సొమ్ము.. పంచాయతీ అధికారి అరెస్టు -
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
సాక్షి ప్రతినిధి, కడప: 2024 డిసెంబర్ 6వతేదీ సమయం అర్ధరాత్రి ఒంటిగంట. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఖాళీగా ఉన్న మంచంపై నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని టీడీపీ కార్యకర్తలైన ఇద్దరు యువకులు ఊపిరి ఆడకుండా తలపై దిండు అదిమిపెట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని గ్రామస్తులు, బంధువులు భావించి, అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజిలో ఆ యువకుల దాష్టీకం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) డిసెంబర్ 6న మృతి చెందాడు. మరునాడు ఉదయం మంచంపైనే వీరారెడ్డి మరణించినట్లు గమనించిన భవనం యజమాని అతని బంధువులకు తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు చేశారు. రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా వీరారెడ్డిది సహజ మరణం కాదని, హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు వీరారెడ్డి మొఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరాడకుండా చేసినట్లు అందులో కనిపించింది. కొద్దిసేపు కాళ్లు కొట్టుకున్న వృద్ధుడు ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులిద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. గ్రామస్తులంతా ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అల్లాడుపల్లె హరినాథరెడ్డి, కాల్వపల్లె నరసింహాలు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో హరినాథరెడ్డి వీరారెడ్డికి స్వయానా మనుమడు కావడం విశేషం. హత్యతో ఆగని ఆ యువకులు ఓ యువతిని చెరబట్టేందుకు ప్రయత్నించారు. దాంతో వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు కావడం, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు వారిపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. వృద్ధుడి హత్యకు కారణాలు తెలియరాలేదు. -
ఇక మీ తమాషాలు చాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను రూఢీ చేసుకునేందుకు ఆయా పోలీస్స్టేషన్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని మేం ఎప్పుడు ఆదేశించినా పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ సమర్పించకుండా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తమాషాలకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. లేనిపక్షంలో ఇలాంటి తమాషాలు కొనసాగుతూనే ఉంటాయి.’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీసీటీవీ ఫుటేజీని తమ ముందు ఉంచాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీటీవీ కాలిపోయిందని, ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై హైకోర్టు మండిపడింది.అతనిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తమ ముందున్న వ్యాజ్యాల్లో అతన్ని సుమోటోగా ప్రతివాదిగా చేర్చి, కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పింది. ఈ వ్యవహారంలో పోలీసులపై ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.సీసీటీవీ ఫుటేజీ సమర్పణకు హైకోర్టు ఆదేశం...తన సోదరుడు కటారి గోపీరాజును పోలీసులు అక్ర మంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, 7వ తేదీన అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కూడా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం, నంబవర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని పెన్‌డ్రైవ్‌లో సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది.కాలిపోయింది.. ఫుటేజీ లేదు...తాజాగా సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాచవరం ఎస్‌హెచ్‌వో దాఖలు చేసిన కౌంటర్‌ను ధర్మాసనం పరిశీలించింది. తమ స్టేషన్లో యూపీఎస్‌తో సహా సీసీటీవీ మొత్తం కాలిపోయిందని, అందువల్ల ఫుటేజీ రికార్డ్ కాలేదని, దీంతో ఫుటేజీని కోర్టు ముందుంచలేకపోతున్నామని ఎస్‌హెచ్‌వో చెప్పడాన్ని తప్పుపట్టింది. ‘కోర్టు సీసీటీవీ ఫుటేజీని అడగ్గానే మిస్టీరియస్‌గా ఆ సీసీటీవీ ఫుటేజీ కనిపించకుండా పోతోంది. మీరు (పోలీసులు) చెబుతున్నంత సింపుల్ వ్యవహారం కాదిది. మేం కఠినంగా స్పందించకుంటే ఈ తమాషా ఆగేలా కనిపించడం లేదు.ఎస్‌హెచ్‌వోపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేదా మా ఆదేశాల మేరకు సీసీటీవీ పుటేజీని కోర్టుకు సమర్పించనందుకు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్స్టేషన్లలో సీసీటీవీలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌హెచ్‌వోపై ఉంది. సీసీటీవీ పని చేయకుంటే దానిని రిపేర్ చేయించాల్సిన బాద్యూత కూడా అతనిపైనే ఉంది. ఎస్‌హెచ్‌వోపై ఎందుకు చర్యలకు ఆదేశించరాదో చెప్పండి..’ అని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. -
Niloufer Hospital: నీలోఫర్‌లో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం
నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు ఆచూకీ లభించింది. శిశువును అపహరించి ఏపీలోని అనంతపురం జిల్లాకు తరలిస్తుండగా జాతీయ రహదారి 44పై గద్వాల జిల్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ బాష దంపతులకు నెల రోజుల క్రితం జహీరాబాదు ఏరియా ఆసుపత్రిలో మగ శిశువు జని్మంచాడు. చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్థానిక వైద్యుల సలహా మేరకు తల్లిదండ్రులు గత నెల 20న శిశువును నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెల రోజుల పాటు నిలోఫర్‌లో చికిత్స పొందిన శిశువును శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి చేసే ముందు శిశువు తల్లి, అమ్మమ్మ ఆరోగ్య శ్రీ వార్డుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచి్చన బుర్ఖా ధరించిన గుర్తు తెలియని మహిళ వృద్ధురాలితో మాటలు కలిపి తాను ఇక్కడే పనిచేస్తానంటూ చెప్పింది. చిన్నారి ముద్దుగా ఉన్నాడంటూ చేతిలో తీసుకుని వృద్ధురాలి దృష్టి మరల్చి శిశువును తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో శిశువు తల్లి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు బృందాలుగా రంగంలో దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ ఆచూకీని గుర్తించి వెంటాడారు. వారసుడి కోసమే... అనంతపురం జిల్లా, ముదిగుబ్బ కు చెందిన షాహీన్ బేగం, మేకల చెరువు ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటే‹Ù, అతడి భార్య రేష్మ అలియాస్ రేణుక ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి ఫస్ట్‌లాన్సర్‌లో ఉంటున్నారు. అబ్దుల్లా, రేష్మలకు 2009లో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేష్మ ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన వారు మగశిశువును తెచ్చుకుని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను నిలోఫర్ ఆస్పత్రిని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు సాయంగా ఉండేందుకు రేష్మ తన సోదరి షాహీన్ బేగంను హైదరాబాదుకు రప్పించింది. పథకం ప్రకారం గర్భంతో ఉన్న రేష్మ చికిత్స కోసం నిలోఫర్‌కు వచి్చనట్లుగా నటించారు. ఆమెకు సహయకురాలిగా షాహీన్ బేగం ఉంది. అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ ఆసుపత్రి వద్ద వేచి ఉంది. షాహీన్ బేగం ఆసుపత్రిలో నుంచి మగ శిశువుతో బయటికి వస్తున్న వృద్ధురాలు( శిశువు అమ్మమ్మ) దగ్గరకు వెళ్లి ఆమె దృష్టి మరల్చి వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుని ఆటోలో అక్కడి నుంచి పారిపోయింది. సీసీ కెమెరాలే పట్టించాయి... నిందితులను పట్టుకునేందుకు డీసీపీ నేతృత్వంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. నిలోఫర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. సీసీ పుటేజీల్లో లభించిన ఆధారాల ప్రకారం.. ఆటోలో నుంచి నిందితులు బైక్‌పైకి మారారు. మాసాబ్ ట్యాంక్ నుంచి ఎన్‌హెచ్–44 హైవేపైకి చేరుకున్న తర్వాత వారు మారుతీ ఓమ్నీ వాహనంలోనికి షిప్టు అయ్యారు. మెహిదీపట్నం మీదుగా బైక్ కర్నూల్ హైవే రోడ్డు వైపు వెళ్తుండగా గమనించిన మధ్య మండలం డీసీపీ గద్వాల్ ఎస్పీకి సమాచారం అందించారు. ఆయన మానవపాడు, ఉండవల్లి పీఎస్‌లను అప్రమత్తం చేశారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఎస్సైలు పుట్టా మహేష్ గౌడ్, ఎస్సై చంద్రకాంత్ వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో ఉన్న మగ శిశువు, నిలోఫర్‌లో కిడ్నాప్‌నకు గురైన శిశువు ఒక్కటేనని ధృవీకరించుకున్న తర్వాత శిశువును విచారణాధికారిగా ఉన్న నాంపల్లి ఎస్సై సాయి కుమార్‌కు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. కిడ్నాప్ కేసును చేధించిన నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, డీఐ ఎం.సైదేశ్వర్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్సైలు సాయి కుమార్, డి.శాంతికుమార్, పి.ప్రదీప్, కానిస్టేబుల్స్ నాగరాజు, సాగర్, రవి వర్మ, దీపక్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. సం‘జాయ్’కుమార్! సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు ఆర్.సంజయ్‌కుమార్. మొదటి ఫొటో ఆయన నాంపల్లి ఠాణా ఇన్స్పెక్టర్గా పని చేసిన 2017 అక్టోబర్ నాటిదైతే.. రెండోది సైఫాబాద్ ఏసీపీగా (నాంపల్లి ఠాణా కూడా ఈ డివిజన్లోనిదే) ఉండగా ఆదివారం (24 నవంబర్ 2024) తీసింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ ఉదంతాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. నిలోఫర్ ఆస్పత్రి, పబ్లిక్‌గార్డెన్స్, నాంపల్లి రైల్వేస్టేషన్ తదితరాలు దీని పరిధిలో ఉండటమే దీనికి కారణం. అప్పట్లో నాంపల్లి ఇన్స్పెక్టర్గా ఉన్న సంజయ్‌కుమార్ ఆ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్న తల్లి ఒడి నుంచి కిడ్నాపైన ఫయాజ్ ఖాన్‌ను (4 నెలలు) 15 గంటల్లో కాపాడారు. శనివారం నిలోఫర్ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన నెల రోజుల వయసున్న బాబును ఆదివారం తల్లి ఒడికి చేర్చారు. రెండు సందర్భాల్లోనూ తల్లి చేతికి చిన్నారులను అందిస్తుండగా కెమెరా కళ్లకు చిక్కిన అరుదైన దృశ్యాలివీ. 2017 నాటి ఫొటో అప్పట్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో మీడియాను ఆకర్షించింది. నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్ -
బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబైలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై బాంద్రా -గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కే సమయంలో భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగింది.Complete failure of Narendra Modi Govt and Railway ministry A stampede at Platform No. 1, Bandra Terminus, occurred at 5: 10 a.m. on October 27 as heavy passenger rush led to overcrowding. Train No. 22921, the Bandra-Gorakhpur Expresspic.twitter.com/83tTNOndf4— Pritesh Shah (@priteshshah_) October 27, 2024 ాజాగా రైల్వేస్టేషన్లో రైలు రావడానికి ముందు ఎదురుచూస్తున్న ప్రయాణికులకు చెందిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు 22 కోచ్‌లతో బాంద్రా-గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ప్లాట్‌ఫామ్ మీదకు రావడంతో జనరల్ బోగీలో ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడినట్లు ఇందులో కనిపిస్తుంది. దీపావళి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు. పెద్దఎత్తున రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ద్వారా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.त्योहार के समय हर किसी का सपना होता है घर पहुंचना।#Bandra स्टेशन पर आज भीड़ और भगदड़ से कई लोग घायल हुए।रेल मंत्री जी से अनुरोध है कि त्योहारों में स्पेशल ट्रेन चलाकर यात्रियों की सुरक्षा सुनिश्चित करें।#BandraTerminus #SafeTravels pic.twitter.com/zSHMX3fThU— Shelesh Bamniya (@SheleshBamniya) October 27, 2024 గాయపడిన వారిని షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కాన్గే (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్, షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18) లుగా అధికారులు గుర్తించారు. -
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం
-
సీసీ ఫుటేజీ ఇప్పట్లో ఇవ్వలేం
తొలిరోజుమాక్ పోలింగ్‌లో ఉపయోగించిన ఈవీఎం కొత్త బ్యాటరీ స్టేటస్ 99 శాతం నుంచి 88 శాతానికి తగ్గింది. అలాంటప్పుడు పోలింగ్ రోజు 12 గంటలకు పైగా వినియోగించిన బ్యాటరీ 21 రోజుల పాటు భద్రపరిచి కౌంటింగ్ రోజు జూన్ 4న తెరిచిన తర్వాత కూడా 99 శాతం ఎలా చూపిస్తోంది? ఈ ప్రశ్నకు ఎన్నికల అధికారుల నుంచి సమాధానం లేదు.రెండో రోజుఈవీఎంలు, వీవీ ప్యాట్లలో ఓట్లను తిరిగి లెక్కించాలని ఫిర్యాదుదారులు కోరితే.. ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎంల డేటా తొలగించామని, వీవీ ప్యాట్లలో స్లిప్‌లను బర్న్ చేశామని అధికారులు చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పుడు వాటిని భద్రపరచాల్సింది పోయి ఆగమేఘాలపై ఎందుకు ధ్వంసం చేశారంటే జవాబు లేదు.మూడో రోజుతాము ఫిర్యాదులో పేర్కొన్న మూడు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నాడు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ, ఈవీఎంలను భద్రపరిచిన గోదాం వద్ద సీసీ కెమెరాల ఫుటేజీ, కౌంటింగ్ రోజు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరితే... అబ్బే.. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. సమయం పడుతుంది. అసలు ఇంకా పోలింగ్ కేంద్రాలన్నింటి సీసీ కెమెరాల ఫుటేజీని ఇంతవరకు ఒకచోట కూర్చలేదని అధికారులు చెబుతున్నారు.మాక్ పోలింగ్‌తో ఏం ఉపయోగం?విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎం గోదాంలో సోమవారం నుంచి బుధవారం వరకూ జరిగిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఫిర్యాదుదారుల సందేహాలను నివృత్తి చేయకుండానే అర్ధంతరంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల (ఎస్వోపీ) ప్రకారం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని అధికారులు మూడు రోజులుగా చెబుతూ వచ్చారు. తమ సందేహాలను నివృత్తి చేయని మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఫిర్యాదుదారులైన విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అందుకు అంగీకరించలేదు. ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రాతపూర్వకంగా బుధవారం ఎన్నికల కమిషన్‌కు తెలియజేశారు. ఈవీఎంల గోదాం నుంచి ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లాన వంశీ నిష్క్రమించడంతో మాక్ పోల్ కొనసాగించలేకపోయామని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు నివేదిక పంపించినట్లు చెప్పారు.సందేహాలకు సమాధానం శూన్యం ఈవీఎంలపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వాటిని నివృత్తి చేయకపోగా సరికొత్త అనుమానాలకు దారి తీసింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యంగా వెరిఫికేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాక్ పోలింగ్‌లో ఉపయోగించిన కొత్త బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గినప్పుడు మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం ఎందుకు చూపిస్తోందన్న ఫిర్యాదుదారుల ప్రశ్నకు ఈసీ వద్ద జవాబు లేదు. ఇక పోలింగ్ రోజు అన్ని సీసీ కెమెరాలను విజయనగరం కలెక్టరేట్లో ప్రత్యేక కేంద్రం నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినవి దాదాపుగా ప్రైవేట్ ఏజెన్సీలే. అలాంటప్పుడు ఇప్పటివరకూ వారి నుంచి ఫుటేజీని అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల ఒత్తిడి వల్ల, సమయం లేక ఫుటేజీ కూర్పు చేపట్టలేకపోయామన్న అధికారుల వివరణ విచిత్రంగానూ, మరిన్ని అనుమానాలు రేకెత్తించేదిగా ఉందని ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లాన వంశీ పేర్కొన్నారు. -
ఇలాంటి మేకవన్నె పులి మీకు తగిలిందా? మహిళలూ తస్మాత్ జాగ్రత్త!
బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వాకింగ్ వెళ్లిన మహిళను వేధింపులకు గురిచేశాడో ప్రబుద్ధుడు. తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటనసీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది.బెంగళూరుకు చెందిన మహిళ కోననకుంటె ప్రాంతంలో ఒంటరిగా మార్నింగ్ వాక్కు బయలుదేరింది. మరికొద్దిసేపట్లో రానున్న తన స్నేహితురాలికోసం వెయిట్ చేస్తోంది. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాడో తెల్లని చొక్కాలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై ఎటాక్ చేశాడు. వెనుక నుంచి ఆమెను వాటేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విస్తుపోయిన బాధితురాలు తనను తాను విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఎలాగో వదిలించుకునే వెళ్లిపోతోంటే మళ్లీ దొరకపుచ్చుకున్నాడు. గట్టిగా నోరుమూయాలని ప్రయత్నించాడు. కానీ ఆమె గట్ టిగట్టిగా అరవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆమెకు పెద్ద ముప్పు తప్పి నట్టయింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ‘@peepoye’ అనే పేరుతో ఉన్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయ్యింది. బాధిత మహిళ రాజస్థానీ అని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సౌత్ పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.🤢 A shocking incident in #Bengaluru’s Konanakunte area: A Rajasthani woman, ready for her 5 am walk and waiting for a friend, was groped by a man who crept up on her.She tried to flee, but he sped up, and covered her mouth, attempting to sexually assault her. With such men,… pic.twitter.com/v4P0eLl1lf— Akassh Ashok Gupta (@peepoye_) August 5, 2024 కాగా ఈ ఘటనపై నెటిజన్లు ముఖ్యంగా మహిళలు స్పందించారు.ఇలాంటి మేక వన్నె పులులు చాలామంది పొంచి ఉంటారంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలవాడి నుంచి మొదలు, టీచర్లు, సొంతబంధువులు కూడా సమయం చూసి ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉంటారంటూ తన అనుభవాలను షేర్ చేసు కున్నారు. గట్టిగా అరవడం, తిరిగి ఎటాక్ చేయడం లాంటివి చేయాలని సూచించారు. అంతేకాదు కుటుంబం సభ్యుల సహకారంతో ఇలాంటి దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా మరోమహిళ ఇలాంటి వేధింపులకు గురి కాకుండా చూడాలని వ్యాఖ్యానించారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై రాష్ట్ర మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికి స్వాతీ మలివాల్ బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆమెపై దాడి జరిగినట్లు చెబుతున్న సోమవారం రోజు.. సీఎం ఇంట్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను శనివారం ఆప్ బయటపెట్టగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Footage of Swati Maliwal being escorted out of Kejriwal's residence by lady security officer.She seems fine and cooperative. pic.twitter.com/xwnfJtBCDS— Nehr_who? (@Nher_who) May 18, 2024 ఈ వీడియోలో స్వాతీ మలివాల్ లేడీ పోలీసు భద్రత, పర్యవేక్షణలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లి.. బయటకు రావటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో వెళ్లినప్పుడు.. మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా లేడీ పోలీసు వెంటనే ఉంటూ చేయ్యి పట్టుకొని ఉన్నారు. ఆమె తనను పట్టుకొవద్దంటూ వారిని విడిపించుకోవడానికి వారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి అతిశీ శనివారం మీడియాతో మాట్లాడారు.‘స్వాతీ మలివాల్‌పై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానినే ఆమె బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణుల చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. స్వాతీ మలివాల్ ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా.. పోలీసులనే ఆమె బెదిరించటం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్ కుమార్‌ను సైతం ఆమె తీవ్రంగా దూషించారు. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి ఆమె ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది’ అని అతిశీ స్వాతీ మలివాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టించాయి. తపై బిభవ్ కుమార్ దారుణంగా దాడి చేశాడని, గాయాలు కూడా అయినట్లు స్వాతీ మలివాల్ ఆరోణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఆమెపై దాడి వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. -
గద్వాల్ జిల్లాలో బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్
-
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా..సాహసంతో తరిమికొట్టింది!
తుపాకీతో కాల్పులు జరుపుతున్న నలుగురు దుండగులను ధైర్యంగా ఎదిరించిందో మహిళ. కేవలం పొడవాటి చీపురు కర్ర (దులుపు కర్ర)సాయంతో షూటర్లను తరిమి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. హర్యానాలో భివానీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. షాకింగ్ దృశ్యాలకు సంబంధించిప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో హరికిషన్ తన ఇంటికి వెళ్ళే గేటు పక్కనే నిలబడి ఉన్నాడు. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బండిపై నుంచి దిగిన పిలియన్ రైడర్లు ఇద్దరు హరికిషన్‌పై కాల్పులు జరపడంతో, అతను లోపలికి పోయి, తప్పించుకున్నాడు. ఇంతలో పక్కనుంచి వచ్చిన మహిళ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించింది. కాల్పులు మోత మోగుతున్నాఏ మాత్రం వెనకడుగు వేయలేదు. షూటర్ల మీదికి కొబ్బరి పుల్లలతో కట్టిన దులుపు కర్రతో ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వారు ఆ ప్రదేశంనుంచి ఉడాయించిక తప్పలేదు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది. ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, హరికిషన్‌కు నాలుగు బుల్లెట్ గాయాలయ్యాయి. మహిళ హరికిషన్ కుటుంబసభ్యులా లేక పొరుగింటి మహిళా అనేది స్పష్టత లేదు. బాధితుడిని చికిత్స నిమిత్తం పీజీఐఎంఎస్ రోహ్తక్కు తరలించినట్లు పోలీసు అధికారి దీపక్ మీడియాకు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నారని, షూటర్లను, వారితో పాటు వచ్చిన ఇద్దరు రైడర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా రవి బాక్సర్ హత్య కేసులో హరికిషన్ నిందితుడు.ఇతనికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. హరికిషన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేశారట. Bravery. Haven't EVER seen anything close to this! 4 armed men, on a shooting spree, being chased by a middle aged woman, with a BROOM. pic.twitter.com/fbbboLW9jU — CA Mayank Parakh (@Mayank_Parakh) November 28, 2023 -
సాక్షి టీవీ చేతిలో ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం సీసీ ఫుటేజ్
-
ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?
ఆన్లైన్లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా, లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్ ఆఫర్ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు కస్టమర్లు ఫిర్యాదులు ఆధారంగా వారికి నష్టపరిహారం ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం చేస్తూ ఆహారంలో జుట్టు వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్ చేశారు. అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్లో ఇలా జరిగిందేమిటబ్బా అని ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్లో ఉంచడం క్లియర్ కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై సోషల్ మీడియాలోపోస్ట్ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ బాబులూ బీ అలర్ట్ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్బుక్లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు. ఇది చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం 15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్ ఉందనీ, అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు.. -
జువెనైల్ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన అధికారి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జువెనైల్ హోమ్‌లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్ హోమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్ పాల్ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. అదే జువెనైల్ హోమ్‌లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్ హోమ్‌లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. In #Agra's govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్‌లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్ పాల్ గతంలోప్రయాగ్ రాజ్‌లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. The department of woman and child development #UttarPradesh has suspended the accused superintendent Poonam Pal based on the investigation of #Agra DM. pic.twitter.com/jnLIxQtiQq — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. -
జనారణ్యంలో వన్యమృగాల హల్ చల్
-
వచ్చారు, పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు.. కొంచెమైతే!
-
వచ్చారు, బైక్‌లో పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు..
భోపాల్: వాహనంలో ఇంధనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, భోపాల్ మాత్రం కొందరు ఆకతాయిలు కావాలనే ఓ పెంట్రోల్ బంక్‌కు నిప్పంటినట్టు తెలుస్తోంది. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో ముగ్గురు యువకులు బంక్‌కు వెళ్లారు.సిబ్బంది పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా లైటర్ వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు పెట్రోల్ నాజిల్ ద్వారా బైక్‌కు వ్యాపించాయి. అటునుంచి పెట్రోల్ పంపుకు ఎగబాకాయి. భయంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన పెట్రోల్ పంపు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కటరా హిల్స్‌లోని రేణుగా పెట్రోల్ బంక్‌లో జరిగింది. రూ.8000 నష్టం జరిగినట్లు బంక్ యాజమాన్యం పేర్కొంది. (చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి సరైన సమయం ఏదంటే..) సంఘటన స్థలం నుంచి ఇద్దరు నిందితులు పారిపోగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. టైల్స్ వర్క్ చేసే ఇతనిపై ఇప్పటికే క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విజయ్ సింగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్లుగా గుర్తించారు. వీరు మెకానిక్ వర్క్ చేసేవారని స్థానికులు వెల్లడించారు. అయితే, నిందితులు కావాలనే లైటర్ వెలిగించారా? లేక మరే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌లో సిబ్బంది పెట్రోల్ నింపే క్రమంలో రీడింగ్ చూడడం కోసం ఓ యువకుడు లైటర్ వెలిగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డ తర్వాతే ఈ ఘటనకు అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
పార్కింగ్ చేసిన కారునే చోరీ చేస్తున్నాడు
-
భలే దొంగలు.. సీసీ ఫుటేజీ వైరల్.. ‘తొలిసారి దొంగతనం చేశాం క్షమించండి’
సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొనుగోలుదారుల్లా వచ్చి.. ► మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్‌లేని స్కార్పియో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ►ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు. ► వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్‌ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కార్పియో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేశారు. ►ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కార్మికుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు. మొదటిసారి దొంగతనం చేశామని.. వైరల్‌గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్‌లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు. సోషల్ మీడియాను ఫాలో అవుతూ.. షాపింగ్ మాల్స్‌లో దుస్తులకు ట్యాగ్స్ ఉంటాయి. వాటిని చోరీ చేస్తే మాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు స్కానర్ వద్ద దొరికిపోతామని గుర్తించిన ఈ ముఠా.. ట్యాగ్స్ లేకుండా ఉండే సాధారణ షాపుల్లో మాత్రమే చోరీలకు పాల్పడుతోంది. కొత్త స్టాక్ రాగానే కస్టమర్లను ఆకర్షించేందుకు దుకాణాదారులు సోషల్ మీడియాలో పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే ఈ ముఠా.. నిరంతరం పోస్టులను ఫాలో అవుతూ ఖరీదైన చీరలు ఉండే షాపులను టార్గెట్ చేసుకొని చోరీలు చేస్తుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
కార్పొరేటర్ భర్త హంగామా.. కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి..
సాక్షి, హైదరాబాద్: బైక్‌పై వెళుతున్న వారిని కార్పొరేటర్ భర్త కారుతో ఢీకొట్టి ఆపై దాడి చేసిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల అరుణ భర్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో న్యూ బాలాజీనగర్‌కు చెందిన బలరామకృష్ణ మీర్‌పేట చౌరస్తా నుంచి మరో వ్యక్తి డానియల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. శివసాయినగర్ కాలనీ పార్కు వద్దకు రాగానే ప్రభాకర్‌రెడ్డి తన కారుతో బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. దీంతో బలరామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభాకర్‌రెడ్డి.. బలరామకృష్ణపై దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాలరామకృష్ణ మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నన్ను, నా భార్యను బలరామకృష్ణ బూతులు తిట్టాడని ప్రభాకర్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పరస్పర ఆరోపణలు తనను చంపేందుకే ప్రభాకర్‌రెడ్డి కారుతో ఢీ కొట్టాడని బాలరామకృష్ణ ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేస్తే మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా తనపై రాజకీయంగా బురద జల్లేందుకే బాలరామకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డుకు ఎడమ వైపు కుక్క పిల్లలు ఉండడంతో వాటిని తప్పించబోయి కుడివైపు వస్తున్న బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొనడం జరిగిందని తెలిపారు. అంతేగానీ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు. కావాలనే బలరామకృష్ణ నన్ను, నా భార్యను బూతులు తిట్టాడని జిల్లెల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
Kanjhawala Case:‘సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నం.. సీబీఐకి అప్పగించాలి’
Delhi Horror: ఢిల్లీ కారు ప్రమాదంలో మృతిచెందిన అంజలి సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో తవ్వేకొద్ది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయంలో ఢిల్లీ పోలీసులు స్పందించలేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. నిందితులకు ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తాన్‌పురి కారు ప్రమాద కేసులో పోలీసుల విచారణ సంతృప్తి కరంగా లేదంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఎస్ మలివాల్ మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిధి ఫోన్ స్వాధీనం చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అది ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షం. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. పోలీసుల వైఫల్యం పోలీసులు ఇప్పటికీ యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన 13 కిలోమీటర్ల దూరంలోని అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదు. 164 సీఆర్పీసీ ప్రకారం ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేదు. కారు చక్రాల కింద యువతి మృదేహం చిక్కుకుందని ఉదయం 2.22 నిమిషాలకు పోలీసులుకు సమాచారం వచ్చింది. కానీ పోలీసులు ఉదయం.4.15 నిమిషాలకు నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 18 బృందాలుగా కాగా అంజలి సింగ్ కేసుపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. దీనిపై 18 బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు అశుతోష్‌కు చెందినదిగా.. యాక్సిడెంట్ సమయంలో అమిత్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరి(అశుతోష్, అంకుష్) ప్రయేయం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరూ మిగతా అయిదుగురు నిందితులకు స్నేహితులని పేర్కొన్నారు. అయితే వీరు ప్రమాద సమయంలో కారులో లేరని, మిగిలిన ఐదుగురు నిందితులను రక్షించేందుకు ఇద్దరూ ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏ సంబంధం లేదు నిందితులకు మృతురాలు, ఆమె స్నేహితురాలు నిధితో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితులు అనేక సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇద్దరు కొత్త నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు కారు కింద అంజలి మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఆటోలో పరారయ్యాడని, అంజలి ఫోన్ ఇప్పటి వరకు దొరకలేదని వెల్లడించారు. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. #StandWithAnjali@priyanktripathi shares more information about Ashutosh, the main owner of the car involved in the death of Anjali.@Aditi14Bhardwaj dissects the details emerging from the latest CCTV footage which shows the accused getting down & checking the car. pic.twitter.com/PiRaH6j83d — TIMES NOW (@TimesNow) January 5, 2023 -
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్
-
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
Delhi Woman's Death Case: వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్‌తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు. వారు యూటర్న్ తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. వాహనం రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 🔴#BREAKING | New CCTV Confirms Witness Account, Car Makes U-Turn, Drags Delhi Woman https://t.co/wPFfrz6eKV pic.twitter.com/DvUDIbbwfM — Breaking News (@feeds24x7) January 2, 2023 (చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది) -
వేగంగా దూసుకొచ్చిన పంత్ కారు.. వీడియో వైరల్! ప్రమాదానికి కారణం?!
Rishabh Pant Accident- CCTV Footage: భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఇక ఆ తర్వాత కారుకు మంటలు అంటుకోగా.. అగ్నికి ఆహుతైపోయింది. పంత్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీ నుంచి స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కడే కారులో.. కారణం అదేనా?! కాగా ప్రమాద సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు. ఉదయం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు పంత్ చెప్పాడని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. కారులో మంటలు చెలరేగగానే తాను విండో పగలగొట్టుకుని బయటకు దూకినట్లు పంత్ తెలిపాడన్నారు. కాగా 25 ఏళ్ల ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. కారు ప్రమాదం బారిన నేపథ్యంలో రిషభ్ పంత్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ వైపు అతడు కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తుండగా.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అతివేగం కారణంగానే పంత్ ప్రమాదం బారినపట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને આજે સવારે અકસ્માત નડ્યો અકસ્માતના CCTV સામે આવ્યા #jamawat #RishabhPantAccident #RishabhPantHospitalised #Rishabhpant17 #RishabhPantInjured #CCTV #ViralVideo pic.twitter.com/pPa8eKTWYN — Jamawat (@Jamawat3) December 30, 2022 #Rishabpant car dashed into the divider #CCTV Bhagwaan ne bas bacha liya pic.twitter.com/pZnAgWp55n — Utkarsh Singh (@utkarshs88) December 30, 2022 -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్‌లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్‌తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్‌లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు) -
వాహనాలపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మంటల్లో ఇద్దరు మృతి!
ముంబై: అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్ఆర్టీసీ)కి చెందిన ఓ బస్సు ముందున్న వాహనలను ఢీకొట్టింది. ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నాశిక్-పుణె రహదారిపై పాల్సే గ్రామం వద్ద గురువారం జరిగింది. ఈ ప్రమాదం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. పుణె జిల్లాలోని రాజ్‌గురునగర్ నుంచి నాశిక్‌కు వెళుతోంది. ఈ క్రమంలో పాల్సే గ్రామం సమీపంలో బ్రేకులు ఫెయిల్ అవగా.. నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎస్యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ‘రెండు బస్సుల మధ్య రెండు బైకులు చిక్కుకుని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌గురునగర్ నుంచి వచ్చిన బస్సుకు సైతం మంటలు అంటుకున్నాయి. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి 43 మందిని రక్షించారు. నాశిక్ అగ్నిమాపక విభాగం హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసింది.’ అని అధికారులు తెలిపారు. బ్రేకులు పని చేయక ప్రమాదానికి కారణమైన బస్సులోని కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని నాశిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం కారణంగా కొంత సమయం ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు చెప్పారు. CCTV footage of ST bus accident at Palase on Nashik-Pune highway#Accident #CCTV #Nashik_pune_Highway#Nashik #Sinnar #Palse pic.twitter.com/9BaKJ0JMUo — पाटील 🤗 (@PareshPatil11) December 8, 2022 पळसे ता.जि नाशिक येथे बस दुर्घटने मध्ये मृत्यु झालेल्या सर्वांना भावपुर्ण श्रद्धांजली. शासना तर्फे तात्काळ मदत मिळावी हि विनंती. #Palse #Accidents @CMOMaharashtra @Dev_Fadnavis जी @TV9Marathi @abpmajhatv @saamTVnews @zee24taasnews @ChivateMangesh जी pic.twitter.com/TeC2ovtyaW — Sameer kale (@SAMEER_G_KALE) December 8, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
షాకింగ్ ఘటన: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల కార్లు హాంఫట్
సినిమాలో చూస్తుంటాం అత్యంత ఖరీదైన లగ్జరీ కార్టు కొట్టేయడం. నిజ జీవితంలో కాస్త రిస్క్. కానీ ఈ ఘటన చూస్తే ఇంత సులభంగా కొట్టేయొచ్చా అని నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది. ఇక్కడొక దొంగల ముఠా కేవలం 60 సెకన్లలో చకచక సుమారు రూ. 7 కోట్లు ఖరీదు చేసే కార్లను కొట్టేశారు. వివరాల్లోకెళ్తే...ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఈ హైటెక్ దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు ఇంగ్లాండ్‌లోని థురోక్ బరో గ్రామంలో బ్రెంట్వుడ్ రోడ్ సమీపంలోని ఓ కాంపౌండ్‌లోకి చోరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను సినిమాలోని హీరోల మాదిరి ఎత్తుకెళ్లారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి గేటు తీసి సాయం చేస్తే మిగతా దొంగలు ఆ కార్లను ఎంచక్కా...డ్రైవ్ చేసుకుంటూ జస్ట్ 60 సెకన్లలో గప్‌చుప్‌గా కొట్టేశారు. సుమారు రూ. ఏడు కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఐదు లగ్జరీ కార్లను ఎత్తుకెళ్లారు. వాటిలో రెండు పోర్ష్లు, మెర్సిడెస్‌లు కాగా, ఒక మేబ్యాక్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఘటన మొతం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: వాటే ఐడియా! స్కూటర్ సాయంతో నిర్మాణ పనులు) -
బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు
బెంగళూరులో అర్థరాత్రి జరిగిన దారుణ హత్య పెద్ద కలకలం సృష్టించింది. ఒక వ్యక్తిపై కొంతమంది వ్యక్తుల గుంపు పెద్ద ఇటుక రాయితో దాడిచేసి తలపగల కొట్టి చంపేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బెంగళూరులోని కెపీ అగ్రహార ప్రాంతంలోని ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళల గుంపు ఒక చోట కూర్చొని ఉన్న వ్యక్తి వద్దకు సముహంగా వచ్చారు. కాసేపు అతనితో వాగ్వాదానికి దిగి అతడిపై దాడి చేశారు. ఇంతలో ఒక మహిళ ఒక రాయిని తీసుకువచ్చి అతడి తలపగలు కొట్టింది. మరోవైపు కొంతమంది భాదితుడిని కదలకుండ పట్టుకుని ఉండగా... ఒక వ్యక్తి రాయితో అదేపనిగా కొడుతూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఐతే బాధితుడి కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించి...పోలీసులకు సమాచారం అందించారు. కానీ సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బాదామి ప్రాంతానికి చెందినవాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Murder On CCTV In Bengaluru, Group Smashes Man's Head With Stones#Bengaluru #cctvfootage #Murder #Badami #argument #crimenews #KPAgrahara #attackers #killed #Karnataka #news #latestupdate #dailynews #IndianJourno pic.twitter.com/sF4eyTPFF0 — Indian Journo (@indianjournoapp) December 6, 2022 (చదవండి: వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు) -
Video: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఓ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలికలు దాదాపు 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్షిప్లో గల అసోటెక్ ది నెస్ట్‌లో నవంబర్ 29న ఈ ఘటన చోటుచేసుకుందిఈ దృశ్యాలన్నీ లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండగా అది సడెన్‌గా ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు భయంతో ఏడవడం ప్రారంభించారు. మరో చిన్నారి వారికి దైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది. లిఫ్ట్ డోర్‌ను బలంగా కొడుతూ.. సాయం కోసం గట్టిగా అరిచింది. అంతేగాక తన రెండు చేతులతో బలవంతంగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా అది ఓపెన్ కాపోవడంతో భయాందోళనకు గురైంది. ప్రాణ భయంతో ముగ్గురు పిల్లలు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఏడ్చడం వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు అందులోనే ఉండిపోయారు. అనంతరం ఎట్టకేలకు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు #Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice @UPGovt pic.twitter.com/D0IsBChls9 — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) December 1, 2022 ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ లిఫ్ట్‌లో జనాలు తరుచూ చిక్కుకుంటున్నారని, దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో అందులో సీనియర్ సిటీజన్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వాపోయారు. చిన్న పిల్లలు లిఫ్ట్ వాడేందుకే భయపడుతున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొసైటీలో ఉన్న లిఫ్ట్లల్లో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి.. -
పనిమనిషితో సహా జంట అనుమానాస్పద మృతి..కానీ రెండేళ్ల చిన్నారి....
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఒక జంటతో సహా వారి పనిమనిషి మృతి. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆశోక విహార్ హోంలోని వారి నివాసంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సమీర్ అహుజ్, అతని భార్య షాలు, వారి పనిమనిషి సప్నతో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఐతే వారి రెండేళ్ల చిన్నారి మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. వారి పనిమనిషి ఆ దంపతుల ఇంటికి ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో వచ్చి ఉండవచ్చన్నారు పోలీసులు. ఈ ఘటన కూడా ఆ సమయంలో జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు . ఐతే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయగా బైక్ మీద సుమారు ఐదుగురు వ్యక్తుల బైక్ మీద ఆ దంపతుల నివాసానికి వచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు. ఈ మేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్
భోపాల్: రాత్రి వేళ్లల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగిన ఈ హుండీ చోరీ అందులో ప్రత్యేకం. అర్ధరాత్రి గుడికి కారులో వచ్చిన ఓ దొంగ.. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని మాయం చేశాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘దేవుడా నన్ను క్షమించు నీ హుండీని ఎత్తుకెళ్తున్నా’ అని ఆ దొంగ ప్రార్థన చేశాడేమో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు! జబల్పుర్ గౌర్ చౌకిలో ఉన్న హనుమాన్ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో వచ్చాడు దొంగ. అంతా దీపావళి హడావుడిలో ఉండగా.. తన చేతివాటాన్ని చూపించాడు. తెల్లవారి ఓ భక్తుడు గుడికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. చేతికి విలువైన గడియారం ధరించిన వ్యక్తి గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో గత ఆగస్టులో జరిగిన చోరీలాగే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
పోలీసే దొంగలా కొట్టేస్తే ఏం చేసేది సామీ!
లక్నో: పోలీసే దొంగలా ఒక షాపు నుంచి ఎలక్ట్రిక్ బల్బ్‌ని కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ వర్మ మూసేసి ఉన్న షాపు వద్ద బల్బుని తీసేసి జేబులో పెట్టకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజేష్‌కి అక్టోబర్ 6న దసరా సంబరాలు జరుగుతున్న రోజు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ పడింది. అప్పుడే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐతే మరసటి రోజు షాప్ యజమాని వచ్చి చూడగా..బల్బు కనిపించకపోవడంతో సీసీఫుటేజ్ చెక్ చేసి చూశాడు. ఆ వీడియో ఫుటేజ్ చూసి ఆ షాపు యజమాని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ ఘటన తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించారు. అతను ఈ మధ్యే ఫుల్పూర్ పోలీస్టేషన్‌కి బదిలిపై వచ్చాడు. ఐతే కానిస్టేబుల్ రాజేష్ మాత్రం తాను బల్బు దొంగలించ లేదని బల్బు ఊడిపోతుండటంతో తీసి మళ్లీ సరిచేసి పెట్టానంటూ సమర్థించుకనే యత్నం చేస్తున్నాడు. పైగా చీకటి కాబట్టి ఫుటేజ్ అలా కనిపిస్తుందని వాదిస్తున్నాడు. గతంలో యూపీలో ఇలానే ఒక పోలీసు మొబైల్ ఫోన్‌ని కొట్టేస్తూ పట్టుబడిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: కేరళ తరహా మరో నరబలి కలకలం.. మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తూ..) -
దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్ల తెలిపారు. షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు) -
ఐసీఐసీఐ బ్యాంకులో12 కోట్లు కొట్టేసి.. షికార్లు.. చివరికి...!
సాక్షి, ముంబై: థానేలోని మన్పాడ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 12 కోట్ల నగదు కొట్టేసిన కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్‌ను పుణెలో పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం విచారణ అధికారి వెల్లడించారు. వేషం మార్చి, న్యూలుక్లో షికార్లు కొడుతున్న నిందితుడికి సంఘటన జరిగిన సుమారు రెండున్నర నెలల తరువాత పోలీసులు చెక్ పెట్టారు. అతడి వద్ద నుంచి 9 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం థానే , నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో షేక్‌ను అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ భారీ చోరికి నిందితుడు భారీ ప్లానే వేశాడు. ముంబైకి చెందిన షేక్ ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్‌గా పని చేసేవాడు. కస్టోడియన్‌గా అంటే లాకర్ తాళాలకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నగదు చూసి అతనికి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా సొమ్మును తస్కరించాలని గత ఏడాది కాలంగా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్ హోల్స్‌ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు. అంతేకాదు తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన షేక్ సోదరి నీలోఫర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్టు చేశారు. అలారం సిస్టమ్‌ను డియాక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత, షేక్ బ్యాంక్ ఖజానాను తెరిచి, నగదును కొట్టేసి అక్కడినుంచి పారి పోయాడు. ఈ ఏడాది జూలై 12న ఈ చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షేక్‌ను అరెస్టు చేసి చోరీకి గురైన మొత్తం 12.20 కోట్లలో సుమారు 9 కోట్లను రికవరీ చేయగలిగారు, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. -
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలి... ఒకరు మృతి
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..బెలూన్లు అమ్మే వ్యక్తి నార్సింగ్ నిర్లక్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుడు 35 ఏళ్ల రవిగా గుర్తించారు. అతను బెలూన్లు కొనడానికి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురైదుగురు వ్యక్తుల స్వల్ప గాయాలతో బయటపడ్డారని అన్నారు. ఈ పేలుడులో ద్విచక్రవాహనాలు, ఒక ఆటోరిక్షా దారుణంగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ ఘటన మొత్తం టెక్స్టైల్ ఫోరూం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో షాపు బయట ఒక వ్యక్తి బెలూన్లు అమ్ముతున్నాడు. కాసేపటికి హఠాత్తుగా పేలుడు సంభవించింది తదనంతరం సమీపంలోని జనాలంతా భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. #WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ — ANI (@ANI) October 3, 2022 (చదవండి: పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె) -
షాకింగ్ ఘటన: ఈ డ్రైవర్ కళ్లు మూసుకుని కారు నడిపాడా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాఘ్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొట్టటమే కాకుండా ఓ వ్యక్తిని లాక్కెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. కరోల్ బాఘ్ ప్రాంతంలో రహదారి పక్కన ఓ మహిళ స్కూటీ వద్ద నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఓ ఫార్చునర్ ఎస్యూవీ కారు దాని ముందు నిలిపి ఉంచిన కార్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. అలాగే ఓ వ్యక్తిని సుమారు 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది.ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఎస్యూవీ కారు బీభత్సంలో పదుల సంఖ్యలో వాహనాలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా.. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Video: Fortuner Rams Multiple Vehicles, Drags Man For 100 Metres In #Delhi https://t.co/DDtF49VJD5 pic.twitter.com/1PTcOihghd — NDTV (@ndtv) September 19, 2022 (వీడియో సోర్స్: ఎన్డీటీవీ) ఇదీ చదవండి: వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి.. -
కూలీ డబ్బులు ఇవ్వలేదని రూ.కోటి కారు తగలబెట్టాడు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదని యజమాని కారు తగలబెట్టి పగ తీర్చుకున్నాడు. సుమారు రూ.2 లక్షల కూలీ పైసలివ్వలేదని యజమానికి చెందిన రూ.కోటి విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. హెల్మెట్ పెట్టుకొని వచ్చి వీధిలో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి కారును తగులబెట్టడం అందులో స్పష్టంగా కన్పించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి సంబంధించి రూ.2 లక్షల కూలీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని అతను ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4 — The Viral Finder (@TheViralFinder) September 14, 2022 ఇదీ చదవండి: Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పెళ్లికూతురు పట్టరాని సంతోషంతో.. -
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
బాలుడి పైనుండి దూసుకుపోయిన కారు
-
Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగు చూసింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తీసే సమయంలో 15 నెలల బాలుడు రిహన్ అక్కడి వచ్చాడు. కాగా బాలుడిని గమనించకుండా డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడిపై కారు ఎక్కింది. రోడ్డుపై పడి ఉన్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పరుగెత్తుకొచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం నుంచి బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స అందించిన తర్వాత బాలుడి పరిస్థితి మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్ ఫైర్ -
తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు: వీడియో వైరల్
న్యూఢిల్లీ: తల్లి వద్ద హాయిగా నిద్రిస్తున్న చిన్నారిని ఒక దుండగుడు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన మధుర రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం...మధుర రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం పై తల్లి బిడ్లలు హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఒక దుండగుడు వారి వద్దకు సమీపించి నెమ్మదిగా ఆ తల్లి వద్ద నిద్రిస్తున్న ఏడునెలల చిన్నారిని అపహరించాడు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవి ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో సదరు దుండగడు వారిని సమీపంచి పిల్లాడిని ఎత్తుకుని ఫ్టాట్ ఫాం పై ఆగి ఉన్న రైలు వద్దకు పరుగెడుతున్నట్లు కనిపించంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బిడ్డ ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు. ఆ బిడ్డ ఆచూకి కోసం పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు పోలీసులు నిందితుడు ఫోటోని విడుదల చేసి, అతని గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అలాగే మథురతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్, హత్రాస్‌లో కూడా తమ రైల్వే పోలీసు బృందాలు చిన్నారి కోసం వెతుకుతున్నాయని చెప్పారు. -
సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఎందుకు చంపారు?
బీజేపీ నేత, హిందీ బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరేలా.. ఆమె అనుచరులే ఆమె మరణానికి కారణమన్న కోణంలోనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా కారణాలేంటన్నది మాత్రం పోలీసులు ఇంకా ప్రకటించకపోవడం విశేషం. తొలుత గుండెపోటు మరణంగా ప్రకటించిన వైద్యులు.. శవపరీక్షలో ఒంటిపై గాయాలున్నాయని నిర్ధారించారు. దీంతో సోనాలి ఫోగట్ మరణాన్ని అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చేశారు గోవా పోలీసులు. ఆపై ఆమె అనుచరులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు. అంతేకాదు.. తన అనుచరుల సాయంతో తూలుతూ నడుస్తున్న సోనాలి ఫోగట్ వీడియోలు(సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. అతికష్టం మీద సుధీర్ సాయంతో ఆమె రెస్టారెంట్లో నడుస్తూ కనిపించారు. ఆ ఆధారాలతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ టీం వీళ్లిద్దరినీ పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాగే త్వరలో వీళ్లిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని గోవా పోలీసులు చెప్తున్నారు. ఆ రెండున్నర గంటలు! ఆధారాలు నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు గోవా డీజీపీ జస్పాల్ సింగ్ తెలిపారు. కర్లీస్ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆమెను సుధీర్ తన భుజం మీద మోసుకుంటూ టాయిలెట్‌కు తీసుకెళ్లాడు. వెనకాలే సుఖ్విందర్ కూడా ఉన్నారు. రెండున్నర గంటల తర్వాత.. అంజువా ఏరియాలోని సెయింట్ ఆంటోనీ ఆస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఉదయం ఏడు గంటలకు వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అయితే ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదు. This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22. She can barely walk. Drunk or God knows what they drugs they gave her 😑 #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL — Rosy (@rose_k01) August 26, 2022 సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్ మృతి కేసు.. మర్డర్‌గా నిర్ధారణ కావడం ఆమె అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆమె అత్యాచారానికి గురయ్యారని, బ్లాక్‌మెయిలింగ్‌తో సుధీర్, సుఖ్విందర్లపై ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ఆమెను ఎందుకు చంపారనే కారణాన్ని మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదని గోవా పోలీసులు చెప్తుండడం గమనార్హం. అయితే ఆర్థిక కారణాలే కారణం అయ్యి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. సోనాలి ఫోగట్ హత్యకు కారణమైన గోవా కర్లీస్ రెస్టారెంట్ గతంలోనూ ఓ ఫారిన్ అమ్మాయి దారుణ హత్యాచారానికి కారణమైంది కూడా. ఆ సమయంలోనూ ‘డ్రగ్స్’ కోణంలోనే ఈ పబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తగా.. కాలక్రమంలో ఆ విషయాన్ని అంతా మరిచిపోయారు. గోవా మెడికల్ కాలేజీలో ఆమె మృతదేహానికి పరీక్షలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం బంధువులు, అభిమానుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. సోనాలి కూతురు సైతం పాడె మోసి కన్నీటి పర్యంతం అయ్యింది. అంతకు ముందు తన తల్లికి న్యాయం చేయాలంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. #SonaliPhogat's 15yrs old daughter demands justice; She said, "My mother should get justice. Proper investigation should be done. Culprit should get punished."pic.twitter.com/EzCbJVQ9KW — #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) August 26, 2022 ఇదీ చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. -
అందరూ చూస్తుండగానే... మహిళ బ్యాగ్ కొట్టేసిన బైకర్!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌కి చెందిన షాహిదా బజాజ్ ఢ్లిలీకి వచ్చి ఒక చేదు అనుభవాన్ని ఎదర్కొంది. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఒక మార్కెట్‌కి వెళ్లింది. షాపింగ్ పూర్తి అయిన తదనంతరం వారు తిరిగి తాము ఉంటున్న హోటల్‌కి వెళ్తుండగా..ఆమె పక్క నుంచే బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. సదరు బైకర్లు ఆమెని గమనిస్తూ పక్క నుంచే వెళ్తూ..ఆమె బ్యాగ్‌ని గుంజుకుని పట్టుకుపోయాడు. ఐతే ఆ దొంగ బ్యాగ్‌ని ఆమె నుంచి లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త సాయంతో లేచింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ దొంగ రద్దీగా ఉండే మార్కెట్లో అదీ కూడా అందురూ చూస్తుండగానే చోరి చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. (చదవండి: ఒకే ఇంట్లో ఆరు డెడ్‌బాడీల కలకలం.. ఏం జరిగింది?) -
ట్రైన్ వస్తున్నా లెక్క చేయక మూగ జీవికి ప్రాణ భిక్ష!
ముంబై: రైలు పట్టాలపై ఉన్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్ల వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది. ముంబై మేరీ జాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రాణాలకు తెగించిన నిఖిల్ లోఖండేను అభినందించారు నెటిజన్లు. 4.88 లక్షల వ్యూస్, 31వేల లైకులు వచ్చాయి. వీడియోలో.. రైల్వే ట్రాక్‌పై ఏమీ తెలియనట్లు నడుచుకుంటూ వెళ్తోంది ఓ శునకం. ఎదురుగా ట్రైన్ వస్తోంది. కుక్కను గమనించిన నిఖిల్ లోఖండే.. ట్రైన్‌కు వ్యతిరేంకంగా పరుగెత్తాడు. ట్రైన్ నెమ్మదిగా వస్తున్న క్రమంలో నిలిపేయాలని సైగ చేశాడు. కుక్కను ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వారికి అందించాడు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలోని నల్లాసపోరా ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు నెటిజన్లు తెలిపారు. శునకాన్ని కాపాడిన అఖిల్‌పై ప్రశంసలు కురిపించారు. View this post on Instagram A post shared by Mumbai Meri Jaan (@mumbai7merijaan) ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్! -
అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...
కరాచి: పాకిస్తాన్ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది. సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది. ఐతే ఆమె తన కొడుకు సోహిల్ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ నాసిర్, అదిల్ ఖాన్, మహ్మద్ ఖలీల్ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా. (చదవండి: కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..) -
ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!
ఇటీవల కాలంలో దొంగతనానికి వచ్చిన దొంగలు కొన్ని చిలిపి చేష్టలు చేస్తున్న ఘటనలు చూశాం. వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థంకాక బిత్తరపోతున్నారు జనాలు. మొన్నటికి మొన్న ఒక దొంగ ఐ లవ్ యూ అని ఒక లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయాడు. మరొక దొంగ ఇంత కష్టపడి దొంగతనం చేయడానికి వస్తే ఏం పట్టికెళ్లకుండా వెనుదిరగడం చాలా కష్టంగా ఉంటుందంటూ తన ఆవేదన చెబుతూ ఒక లెటర్ రాసి మరీ వెళ్లాడు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు దొంగలు సీసీటీవి వద్దకు డేర్‌గా వచ్చి ఏం చేశారో చూస్తే షాక్ అయిపోతారు. ఏం జరిగిందంటే....తమిళనాడులో రామ్‌నగర్‌లోని ఒక అపార్టమెంట్ వాసులు దొంగల బెడదతో సీసీటీవీని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో దొంగలు తరుచుగా ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. ఐతే ఒక రోజు ముగ్గురు దొంగలు ఆ అపార్టమెంట్ కాపౌండ్ వాల్ ఎక్కి నడుచుకుంటూ వచ్చారు. పైగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ వద్దకు డేర్‌గా వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అపార్ట్మెంట్ వాసులు సీసీపుటేజ్ చెక్ చేయగా ముగ్గురు దొంగలు చేసిన చిలిపి నిర్వాకం చూసి షాక్‌కి గురవుతారు. ఈ మేరకు భయంతో తులసీ రమేశ్ అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్‌ని ట్విట్టర్లో షేర్ చేస్తూ సదరు దొంగలను గుర్తించి సాయం చేయడండి అంటూ పోలీసులు ప్రజలను కోరాడు. ఐతే చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. (చదవండి: హీరోయిన్ రేంజ్లో పరుగెత్తి... చివరికి నేలకి అతుక్కుపోయింది) -
ఆ అన్న లేకుంటే తమ్ముడి పరిస్థితి ఏంటో?
వైరల్: సీసీటీవీ ఫుటేజీ ఘటనలు వైరల్ అవ్వడం షరామాములు అయ్యింది. మీడియా కంటే సోషల్ మీడియాలోనే వాటికి క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అందునా రెప్పపాటు ఘటనలు శరవేగంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతుంటాయి కూడా. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ మలప్పురంలో జరిగింది. ఓ వ్యక్తి ఇంటిపైన భాగంలో శుభ్రం చేస్తుండగా.. పట్టుతప్పి కిందపడిపోయాడు. ఆ సమయంలో అతని సోదరుడు కింద ఉన్నాడు. టెర్రెస్ పైనుంచి కింద పడిపోతున్న సోదరుడిని గమనించి.. అతను క్యాచ్ పట్టేశాడు. ఈ ఘటనలో పైనుంచి పడిన వ్యక్తి పైకిలేచి మాములుగా కనిపించగా.. అతని అన్న మాత్రం కాసేపటికి పైకి లేచాడు. ఆ అన్న గమనించకపోయినా.. స్పందించకపోయినా ఆ తమ్ముడికి కచ్చితంగా ఏదో ఒకగాయం అయ్యి ఉండేది. జులై 31న ఈ ఘటన జరిగినట్లు సీసీఫుటేజీ ద్వారా తెలుస్తోంది. pic.twitter.com/wJjBad1kuT — Vishal Dharm (@VishalDharm1) August 3, 2022 -
ప్రసాద్ గౌడ్ ను చూసి గట్టిగ అరిచిన జీవన్ రెడ్డి
-
దడ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన భారీ చోరీ మధ్యప్రదేశ్‌లోని ధార్ ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఒకేసారి నాలుగైదు ఇళ్లలో చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టయిల్. దూలపల్లి హైటెన్షన్ లైన్‌లోని మహాలక్ష్మి ఎన్క్లేవ్ అగ్రి నివాస్‌లో అశోక్ రామ ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లోని 108, 203, 202 ఫ్లాట్లలోనూ దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్లూ ఆధారంగానే ఈ చోరీ ధార్ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో 2018 నుంచి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై 98 కేసులుండగా.. వీటిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 68 ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మాన్‌సింగ్‌తో పాటు మొహబత్, రీమ్ సింగ్, కిషన్‌సింగ్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల గుర్తింపు.. అగ్రి నివాస్ అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో.. ఆ రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పేట్ బషీరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లోని వేలిముద్రలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల మేరకు నలుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తుతో నిందితులు రాష్ట్రం దాటకుండా ముమ్మర గాలింపు చేస్తున్నామన్నారు. ఐటీ, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), లా అండ్ ఆర్డర్ పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి) -
ఇబ్బందికరమైన పరిస్థితులలో సీటుకు ఉండే ప్యానిక్ బటన్‌ను నొక్కితే చాలు!
బస్సులో అతి చేస్తే... పోకిరీలు ఆ బస్సులో ఉండరు. జైలులో ఊచలు కౌంట్ చేస్తూ కూర్చుంటారు. ఆ బటన్ నొక్కితే చాలు... భద్రత ఇచ్చే బటన్ కోల్‌కతాలోని ఒక ప్రాంతం. బస్సులో కూర్చున్న కాలేజీ అమ్మాయిలు బ్యాగ్‌లో నుంచి టెక్ట్స్‌బుక్స్ తీసి చదువుకుంటున్నారు. పరీక్షకేంద్రం చేరడానికి చాలా సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఒక స్టాప్‌లో బస్సులోకి పోకిరీ బృందం ఎక్కింది. అల్లరి మొదలు పెట్టారు. పెద్దగా కేకలు. వారి దృష్టి కాలేజీ అమ్మాయిలపై పడింది. రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. న్యూస్‌పేపర్‌ను చించి ఉండలుగా చేసి అమ్మాయిలపై విసురుతూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. పరీక్షకు వెళ్లే టైమ్‌లో గొడవ ఎందుకు...అనుకున్నారేమో ఆ అమ్మాయిలు మాత్రం పుస్తకాల నుంచి తలెత్తడం లేదు. అయితే పోకిరీల ఆగడాలు మితిమీరి పోయాయి. ఒక అమ్మాయి లేచి వారితో గొడవ పడింది. అయితే వారిలో తప్పు చేస్తున్నామనే భావన ఏ కోశానా కనిపించలేదు. ఆ అమ్మాయినే తిట్టడం మొదలుపెట్టారు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు తలోమాట అనడంతో పోకిరీలు తగ్గారు. ఏదో స్టాప్ రాగానే దిగి పారిపోయారు. పరీక్షకేంద్రంలో పరీక్ష రాస్తున్నారన్న మాటేగానీ ఆ అమ్మాయిలకు మాత్రం బస్సులో పోకిరీల ఆగడాలే పదేపదే గుర్తుకువస్తున్నాయి. తెలిసిన సమాధానాలు కూడా సరిగ్గా రాయలేకపోయారు. ‘వారిని విడిచి పెట్టకుండా ఉండాల్సింది. పోలీసులకు పట్టించాల్సింది’ అనే మాటలు వారి మనసులో పదేపదే ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక ముందు వారికి బాధాకరమైన ప్రయాణ అనుభవాలు ఎదురు కాకపోవచ్చు. ఒకవేళ ఎదురైనా...పోకిరీలు తప్పించుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే... పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్భయ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవెట్ బస్సులలో సీసీ కెమెరాలతో పాటు ప్యానిక్ బటన్స్ ఏర్పాటు చేయనుంది. బస్సులో ప్రతి సీటుకు ఈ బటన్‌ను బిగిస్తారు. అత్యవసర సమయం, ఇబ్బందికరమైన పరిస్థితులలో సీటుకు ఉండే ప్యానిక్ బటన్‌ను నొక్కితే పోలీస్ కంట్రోల్‌రూమ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్‌రూమ్‌లను అలర్ట్ చేస్తుంది. వీడియో ఫుటేజిని అందిస్తుంది. ఫలితంగా... దగ్గరలోని పోలీస్‌స్టేషన్ లేదా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్లు ఎలార్ట్ అవుతాయి. పోకిరీల పనిపడతాయి. ప్యానిక్ బటన్‌ను ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించాలి? దాని సాంకేతిక ప్రాముఖ్యత, దుర్వినియోగం చేయకూడదు... వంటి విషయాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ‘బస్సులలో ప్యానిక్ బటన్ వార్త చదివి సంతోషంగా అనిపించింది. నేను చాలా సార్లు బస్సులలో రకరకాల చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. బస్సులో ప్యానిక్ బటన్లు ఉన్నాయనే భయంతో అమ్మాయిలను వేధించడానికి ఎవరూ సాహసం చేయరు’ అంటుంది సుష్మ అనే కాలేజి స్టూడెంట్. చదవండి: సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ... -
కూకట్ పల్లి వివేకానంద్ నగర్ లోని ఓ ఫ్లాట్ లో దొంగతనం
-
ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబై: అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ నెల 5వ తేదీన నాసిక్‌లోని ముంగ్సారే గ్రామంలో నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‌చల్‌చేసింది. అర్దరాత్రి ఉంటి ముందు చిన్న గోడపై పెంపుడు కుక్క కూర్చొని ఉండగా.. దూరం నుంచి చిరుతపులి అటు వైపుగా వచ్చింది. చిరుతను గమనించిన శునకం అలెర్ట్ అయి పారిపోయేందుకు ప్రయత్నించింది. చిరుత దగ్గరకు రావడంతో గోడ వైపు నుంచి అటు ఇటు దూకుతూ చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసింది. #WATCH | Leopard entered a residential area in Mungsare village of Nashik, attacked a pet dog yesterday (Source: CCTV) pic.twitter.com/OznDoeQvHR — ANI (@ANI) June 6, 2022 అయితే చిరుతపులి పట్టు వదలకుండా కుక్క వెనకాలే పరుగెత్తింది. అలా కొద్దిసేపటి తరువాత చివరకు ఆ శునకం చిరుతకు ఆహారంగా దొరికిపోయింది. చిరుతపులి తన దవడలతో కుక్కను కరచుకొని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కాగా జనావాసాల్లో చిరుతపులి సంచారంపై నాసిక్ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి వస్తుండటంతో ముంగ్సారే గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రిపూట ఇళ్లలోనే నిద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరుత సంచరిస్తుందని తెలిసి పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారని మండిపడుతున్నారు. చదవండి: అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్.. Maharashtra | We appeal to the people of Mungsare village to remain indoors at night as leopard activity has increased in this area. People must remain alert: Pankaj Garg, Deputy Conservator of Forest, Nashik pic.twitter.com/2nPNepXCQi — ANI (@ANI) June 6, 2022 -
మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ..
సాక్షి, మెదక్: విదేశీ కరెన్సీ కావాలని ఓ కిరాణ షాపులో మోసానికి పాల్పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న సాయి భైరవ కిరాణం దుకాణానికి శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విదేశీ కరెన్సీ కావాలా? అంటూ కౌంటర్‌పై కూర్చున్న శ్రీతేజతోపాటు షాపులో పని చేస్తున్న సయ్యద్, సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డిలను మాటల్లో పెట్టారు. ఈ క్రమంలో కౌంటర్లోని రూ.30 వేలతోపాటు మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకొని మోసగాళ్లు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ముందుగా దుకాణంలోకి వచ్చి మా దగ్గరున్న విదేశీ కరెన్సీ తీసుకొని ఇక్కడి డబ్బు ఇవ్వాలని కోరుతూ మాటల్లో పెట్టారు. కౌంటర్లోని డబ్బుతోపాటు కిరాణ సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకున్న సమయంలో తమకు జరిగిన సంఘటన గుర్తులేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ఆ ముగ్గురు మోసగాళ్లు నార్త్‌సైడ్ అధికారులుగా మంచి దుస్తులు వేసుకొని కారులో వచ్చినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి కిరాణం కౌంటర్లో కూర్చున్న శ్రీతేజ తండ్రి ప్రభుశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై నర్సాపూర్ ఎస్ఐ గంగరాజును వివరణ కోరగా రవిశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి. భాదితులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ తన సీట్లోంచి ముందుకు ఎగిరిపడటం, బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. -
కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య
కామారెడ్డి క్రైం: కుళాయి దగ్గర జరిగిన గొడవ ఒకరి హత్యకు కారణమైంది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన పులి గంగాధర్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నిజామాబాద్ లో, రెండవ భార్య రాజమణి కామారెడ్డిలోని వేణుగోపాలస్వామి రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటారు. మొదటి భార్య కొడుకైన రవికుమార్(40) ఏ పనీ లేకపోవడంతో రెండేళ్లుగా కామారెడ్డిలోని తన పిన్ని దగ్గరే ఉంటున్నాడు. అయితే గతంలోనే రవికి గీత అనే మహిళతో పెళ్లికాగా, ఇద్దరు కొడుకులున్నారు. పనిచేయడానికి ఇష్ట పడకపోవడంతో భార్య గీత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం తండ్రి గంగాధర్ రెండో భార్య వద్దకు వచ్చి అక్కడ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటున్న రవిని బయటకు గెంటేశాడు. అప్పటి నుంచి రాంమందిర్‌రోడ్ శివాలయం ప్రాంతంలో తిరుగుతూ ఎవరైనా పనిచెబితే చేసుకుంటూ రాత్రి గుడి అరుగులపై పడుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామాలయం ఎదురుగా ఉన్న ఓ వ్యాపార సముదాయం అరుగుపై నిద్రించా డు. అర్ధరాత్రి దాటాక రవి తలపై గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో బలం గా మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నిందితుడు రిక్షా పుల్లర్ అడ్డగారి పాండుగా గుర్తించారు. నీళ్ల కుళాయి వద్ద మంచినీళ్లు పట్టుకునే విషయంలో గొడవ జరగడంతో కక్ష పెంచుకుని ఈ హత్య చేసినట్లు పాండు విచారణలో అంగీకరించాడు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన డీఎస్పీ సోమనాథం పట్టణ ఎస్హెచ్ఓ నరేశ్, ఎస్సైలు అహ్మద్, రాములు, సిబ్బంది మల్లేశ్‌గౌడ్, సయిద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. -
బయట పోలీస్.. లోపల దొంగ.. అమెరికాలోని ఇంటి యాజమాని గుర్తించి
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అతనో కరుడుగట్టిన దొంగ.. దాదాపు 30 కేసుల్లో నిందితుడు.. అలవాటు ప్రకారం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చోరీకి వెళ్లాడు..అక్కడ సీసీ కెమెరాలున్నాయన్న విషయం అతనికి తెలియదు..అయితే అమెరికాలో ఉన్న ఓనర్.. తన ఇంట్లో దొంగ ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు..స్పందించిన పోలీసులు వచ్చి ఇంటి బయట గడియపెట్టి.. ఆ తరువాత అరెస్టుచేశారు. అచ్చం సినీఫక్కీలా ఉన్న ఈ సంఘటన దొంగను అరెస్టు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...కేపీహెచ్‌బీకాలనీ రోడ్ నెంబర్ రెండులోని ఎల్ఐజి 237లో బి. వెంకటరత్నం నివాసముంటున్నాడు. అతని ఇద్దరు కూతుళ్లు అమెరికాలో ఉంటున్నారు. మొదటి ఫ్లోర్ మినహా మిగతా ఇంటిని అద్దెకు ఇచ్చి ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు మూడు గంటల సమయంలో తయ్యపరాజు రామక్రిష్ణ అనే కరుడుగట్టిన దొంగ వెంకటరత్నం ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. గ్రౌండ్ ప్లోర్లో నివాసమున్న రాజశేఖర్‌రెడ్డి దొంగతనం జరుగుతోందని అనుమానం వచ్చి అమెరికాలోని ఇంటి యజమానికి సమాచారం అందించాడు. సీసీ కెమెరాల్లో ఇంట్లోకి దొంగ వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంకటరత్నం కేపీహెచ్‌బీ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. చదవండి: చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.. కోడి గుడ్డు కూర వండలేదని.. విధుల్లో ఉన్న డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు వచ్చి ఇంటి బయటి నుంచి గడియ పెట్టారు. ఆ తరువాత పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి కూడా గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లిన పోలీసులు దొంగ రామక్రిష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతను దొంగిలించిన వెండి వస్తువులు, నగదును ఇంటి యజమాని సూచన మేరకు అక్కడ ఉన్నవారికి అప్పగించి దొంగను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి
Lawyer Accused of Injecting Blood Into Food: కొంతమంది పైశాచికంగా ఎదుటవాళ్ల మీద కోపంతోనూ లేదా ద్వేషంతోనూ వికృతమైన పనులకు ఒడిగడుతుంటారు. అలాంటి పలు ఘటనలు గురించి విన్నాం కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన దుశ్చర్యకు ఒడిగట్టాడు. అది కూడా ఎలా చేస్తున్నాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలు విషయంలోకెళ్తే...లండన్‌లోని వ్యక్తి సూపర్ మార్కెట్లోని ఆహార పదార్థాల్లోకి తన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సూపర్ మార్కెట్లలోని ఆహార పదార్థాల్లోకి రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. ఈ మేరకు అతను చేస్తున్న పని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో సదరు షాపు వాళ్లు కస్టమర్లను పంపించేసి ఆహార పదార్థాలన్నింటిని పడేశారు. అంతేకాదు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుని నెట్టడం సిరంజీలు విసరడం వంటివి చేశాడు. పోలీసులు ఈ ఘటనల్లో సుమారు 21 సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్‌గా గుర్తించారు. అతను స్వంతంగా లీగల్ కన్సల్టెన్సీని కూడా ఉంది. అయితే సూపర్ మార్కెట్లన్నీ సుమారు రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ మేరకు పోలీసులో ప్రతి సీసీ ఫుటేజ్‌ని పరీక్షించి చూడాగా ..ఆపిల్లు, చికెన్ టిక్కా ఫిల్లెట్‌ల ప్యాకెట్లకు అతను రక్తాన్ని ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు విచారణలో అవన్నీ 37 ఏళ్ల క్రితం నాటి ఆహారంగా చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పైగా ఆ సీసీ ఫుటేజ్‌లో అతను ఒక బకెట్లో హైపోడెర్మిక్ సూదులను మోస్తున్నట్లు కూడా కనిపించిందన్నారు. కానీ నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్ మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు ఆ వింత కేసును విచారించింది. అయితే నిందుతుడి తరుఫు న్యాయవాదులు మాత్రం అతని పిచ్చివాడని, మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. మరోవైపు సైక్రియార్టిస్ట్ డాక్టర్లు కూడా అతని మానసిక పరిస్థితి గందరగోళంగా ఉందని కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన నేరంగా భావించలేకపోతున్నాం అని చెప్పారు. దీంతో లండన్ కోర్టు అతను ఈ నేరం చేసినప్పుడూ అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో విచారించమని ఆదేశించడం గమనార్హం. (చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!) -
9 నెలల చిన్నారి అపహరణ
నెల్లూరు (క్రైమ్): అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని దుండగుడు అపహరించుకుని వెళ్లాడు. నెల్లూరు నగరంలోని గుప్తాపార్కు సెంటర్లో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలు.. పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన కొమరగిరి శీనయ్య, చెంచమ్మ దంపతుల కుమార్తె ఆదిలక్ష్మికి, కుందుకూరి శీనయ్యతో వివాహమైంది. ఆదిలక్ష్మి 9 నెలల కిందట ఓ పాపకు జన్మనిచ్చి మరణించింది. దీంతో ఆమె భర్త ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మనుమరాలి సంరక్షణను శీనయ్య దంపతులే చూసుకుంటున్నారు. యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో భిక్షాటన నిమిత్తం శీనయ్య.. తన భార్య, మనుమరాలు, అత్త పోలమ్మ, బంధువు ఏడుకొండలు, మరికొందరితో కలిసి మూడు రోజుల కిందట నెల్లూరు నగరానికి వచ్చారు. భిక్షాటన చేసుకుంటూ రాత్రి వేళలో గుప్తాపార్కు వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో దుండగుడు పాపను అపహరించుకుని వెళ్లాడు. కొద్ది సేపటికి నిద్ర నుంచి తేరుకున్న శీనయ్య, చెంచమ్మలు పాప కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప అపహరణ ఘటనపై సంతపేట ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కిడ్నాప్ దృశ్యాలు, అనంతరం నిందితుడు చిన్నారిని ఆటోలో తరలిస్తున్న దృశ్యాలు రికార్డుకావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?
CCTV Footage shows Man Tries Dog Planting Faece: కొంతమంది కొందర్ని కించపరిచే ఉద్దేశంతోనో లేక శాడిజంతోనే తెలియదు గానీ కొన్ని భయంకరమైన పనులు చేస్తారు. పైగా వాటిని చూస్తే చాలా జుగుప్సకరంగా కూడా అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత చెండాలమైన పనిచేశాడో చూడండి. (చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!) అసలు విషయంలోకెళ్లితే....టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్ వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచుతాడు. ఆ ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుంది. ఆ తర్వాత చాలా మంది అక్కడ ఇస్తాంబుల్‌లో అందరికి సుపరిచితమైన వీధి కుక్క అయిన బోజీ పనిగా భావిస్తారు. అయితే ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ప్రతినిధి మురత్ ఒంగున్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడుతుంది. దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారంతో మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును చెడుగా చూపించేందుకే ఇలా చేస్తున్నారంటూ అక్కడ స్థానిక మీడియా చెబుతోంది. అంతేకాదు గతంలో మేయర్ పరువు తీయడానికి జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ (ఎకెపి) అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటజన్లు సిగ్గుతెచ్చుకోండి మరీ ఇలాంటి పనుల చేస్తారా అంటూ ఆ వ్యక్తి పై మండిపడుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా) Wow, Turkey can still surprise me with how evil people can be! Disgusting man tries to defame an opposition-darling dog, Boji, who famously travels on public transport, by planting dog shit on a seat. OK, I just read that back. Turkey is surreal.pic.twitter.com/7jmisr8heO — Can Okar (@canokar) November 20, 2021 -
సంచలనం సృష్టించిన కేసు.. 14 రోజులుగా గాలింపు.. డానియెల్ దొరికాడు..!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడు డానియెల్ కేసును వరంగల్ కమిషరేట్ పోలీసులు ఛేదించారు. పక్కా ప్లాన్ ప్రకారం బాబు ను కిడ్నాప్ చేసి అమ్మాలని నిర్ణయించుకున్న లోకల్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు.. పిల్లల అక్రమ రవాణా ఉద్దేశం ఏమైనా ఉందా అనే దిశగా లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క డానియెలేనా.. లేక గతంలో ఈ తరహాలో ఎంత మందిని కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలి సింది. రెండేళ్ల బాబు సురక్షితంగా దొరకడంతో ఇటు పోలీసు ఉన్నతాధికారులతోపాటు అటు తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి: పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..? ) 14 రోజులుగా గాలింపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని కోరుకుంటకు చెందిన దత్తా ఐశ్వర్య, ఆర్యలకు రెండేళ్ల బాబు డానిఝెల్ ఉన్నాడు. వీరు వరంగల్ మట్టెవాడ ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న జెమినీ టాకీస్ సమీపంలోనే దోమ తెరలు, దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుంచో ఐశ్వర్య అమ్మ కుటుంబం ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండడంతో బతుకు దెరువు కోసం నెలక్రితం ఇక్కడికొచ్చారు. అయితే వీరి కుమారుడు డానియెల్‌పై అగంతకుల కన్నుపడింది. ఈ నెల 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో నల్లటి రంగులో ఉన్న ‘హైదరాబాద్ టాప్ ఆటో’లో నుంచి దిగిన ఓ వ్యక్తి ఉదయం 5.03 గంటలకు బాబును కిడ్నాప్ చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న నంబర్ ప్లేట్ లేని ఆటోలో బట్టలబజార్ బ్రిడ్జి మీదుగా వెళ్లినట్టుగా సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయింది. ఆ తర్వాత ఆ ఆటో ఎటు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేక మార్గదర్శనంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. అయితే నిందితుల అచూకీ కోసం హైదరాబాద్‌లోనూ గాలించిన పోలీసులకు ఆధారం చిక్కడంతో పట్టుకున్నారు. వీరు డానియెల్‌ను అమ్మడానికే కిడ్నాప్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ? -
తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ?
సాక్షి, వరంగల్ : ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని కోరుకుంటకు చెందిన దత్తా ఐశ్వర్య, ఆర్యలకు రెండేళ్ల బాబు డానియెల్ ఉన్నాడు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న జెమినీ టాకీస్ సమీపంలోనే దోమతెరలు, దువ్వెనలు, అద్దాలు అమ్ముకునే వీరి కుటుంబం.. బుడిబుడి అడుగులు వేస్తున్న కుమారుడిని చూసుకుంటూ కష్టాలను సైతం మరిచి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఈ నెల 11న రెండేళ్ల డానియెల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అపహరించుకుని వెళ్లారు.’ తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాలు అందుబాటులో ఉన్నా.. నిందితులను అరెస్ట్ చేయడం వరంగల్‌లోని మట్టెవాడ పోలీసులకు కష్టంగా మారింది. కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన పోలీసులు నిఘానేత్రాల ద్వారా కిడ్నాప్‌ను గుర్తించి కూడా పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు బతుకమ్మ సంబురాలు...ఇంకోవైపు దసరా వేడుకలు ఉండడంతో బాబు అపహరణ కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లలు, మహిళల కేసుల విషయాల్లో సీరియస్‌గా ఉండాల్సిన ఆ ధోరణి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలేం జరిగింది... సంచార జాతులకు చెందిన ఐశ్వర్య, ఆర్య కుటుంబం వరంగల్‌లోని ఎస్వీఎన్ రోడ్డు పక్కనే టెంట్ వేసుకొని దోమతెరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటి నుంచో ఐశ్వర్య అమ్మ కుటుంబం ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండడంతో బతుకుదెరువు కోసం నెలరోజుల క్రితం వీరు కూడా ఇక్కడికి వచ్చారు. వీరి రెండేళ్ల బాబు డానియెల్‌పై ఆగంతకుల కన్నుపడింది. ఈ నెల 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో నల్లటి రంగులో ఉన్న ‘హైదరాబాద్ టాప్ ఆటో’లో ఒక వ్యక్తి అక్కడ దిగాడు. అదే ఆటోలో ఉన్న మరో వ్యక్తితో కలిసి డ్రైవర్ ఎంజీఎం వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమ్మ, పెద్దమ్మ గోవింద్ దేవీ మధ్యలో నిద్రించి ఉన్న డానియెల్‌ను ఎత్తుకెళ్లేందుకు మూడుసార్లు ప్రయత్నించాడు. ఉదయం 5.03 గంటలకు బాబును చేతిలో ఎత్తుకొని అప్పటికే అక్కడికి చేరుకున్న నంబర్ ప్లేట్ లేని ఆటోలో బట్టలబజార్ బ్రిడ్జి మీదుగా వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆ ఆటో ఎటు వెళ్లిందన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొట్టొచ్చిన నిర్లక్ష్యం... ఈ నెల 11న ఉదయం 5.15 గంటల ప్రాంతంలో లేచిన వీరికి బాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో ఆ తరువాత మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు రాజమండ్రిలో ఉన్న బాబు తండ్రి ఆర్యను రప్పించి విచారణ చేశారు. ఫిర్యాదు వచ్చిన తక్షణమే సీసీటీవీ కెమెరా ఫుటేజీలు పరిశీలించాల్సిన మట్వాడ పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా బాబు ఆచూకీ దొరక్కపోవడానికి కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఆచూకీ కనుగొనేందుకు ఎనిమిది నుంచి పది మంది సభ్యులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయని చెబుతున్నా...తొమ్మిది రోజులు కావస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు నిరుపేదలు కావడంతోనే ఎవరూ అడగరని, అందుకే కేసు ఛేదనపై దృష్టి పెట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీనిపై వరంగల్ ఏసీపీ గిరికుమార్‌ను ఫోన్లో సంప్రదించగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సమాధానమిచ్చారు. మమ్ముల్నే విచారిస్తున్నారు.. నా కుమారుడి కిడ్నాప్‌నకు సంబంధించి 12 కెమెరాల్లో చిక్కిన దృశ్యాలను చూపెట్టారు. మొదట ముందునుంచి తీసుకెళ్లినవి చూపెట్టారు. ఆ తర్వాత వెనుక నుంచి బాబును తీసినవే వీడియోలు చూపెడుతున్నారు. ఏమైందని అడిగితే మమ్ముల్నే విచారిస్తున్నారు. దొంగలను పట్టుకోవాల్సింది పోయి పగోళ్లు ఉన్నారా అంటూ మమ్ముల్నే ప్రశ్నిస్తూ ఉన్న సమయం వృథా చేస్తున్నారు. – ఆర్య, కిడ్నాపైన బాబు తండ్రి పాలు తాగే పిల్లాడు... ఠాణా చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అడిగితే వెతుకుతున్నామంటున్నారు. పాలు తాగే పిల్లాడు. కనిపించకుండా పోయి తొమ్మిదిరోజులవుతుంది. ఒక బాబు చాలనుకొని పెద ఆపరేషన్ కూడా చేయించుకున్నా. ఉన్న ఒక్కడూ కిడ్నాప్ అవడంతో మనసు మనసులో ఉంటలేదు. ఎన్నిసార్లు పోలీసులను వేడుకుంటున్నా స్టేషన్ వద్ద ఉండొద్దు బయటకు వెళ్లాలంటూ చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుందనే సమాచారాన్ని కూడా చెప్పడం లేదు. ఎంతో బాధగా ఉంది. మా బాబు క్షేమంగా ఇంటికి రావాలి. – దత్త ఐశ్వర్య, బాబు తల్లి -
పది నెలల చిన్నారిపై ఆయా పైశాచికత్వం.. గుక్కపట్టి ఏడుస్తున్నా
కోల్‌కతా: ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే.. జీవితం సాఫిగా సాగిపోతుంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులను దృష్టి పెట్టుకుని.. చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల ఆలనాపాలన విషయం ఉద్యోగం చేసే దంపతులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే పర్లేదు. కానీ బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ ఆయాల్లో కొందరు చిన్నారులనే కనికరం కూడా లేకుండా పిల్లలను హింసిస్తారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల పాప ఉంది. ఇద్దరు జాబ్ చేస్తుండటంతో చిన్నారి ఆలనపాలన చూడటానికి ఓ ఆయాను నియమించుకున్నారు. మొదట్లో బాగానే ఉంది. కానీ రాను రాను చిన్నారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చాక చిన్నారి ఆయా దగ్గరకు వెళ్లడానికి నిరాకరించేది. ఆమెనే చూస్తేనే పాప బాగా ఏడ్చేది. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు ఇంట్లో సీసీటీవీ పెట్టారు. ఆఫీస్‌కు వెళ్లాక.. అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఇక సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రాణం పోయినట్లు విలవిల్లాడారు. కారణం ఏంటంటే సదరు ఆయా ఏమాత్రం కనికరం లేకుండా పది నెలల చిన్నారిని.. దారుణంగా చితకబాదింది. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆ రాక్షసి కనికరించలేదు. (చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?) ఈ దృశ్యం చూసిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులుకు ఫిర్యాదు చేసి.. వారిని వెంటపెట్టకుని ఇంటికి వచ్చారు. ఆయాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని మెడినిపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: అర్పిత.. స్ఫూర్తి ప్రదాత -
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’
సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ బైక్ స్టంట్స్‌పై ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘మైనర్ విద్యార్థులు ఫ్లైఓవర్‌పై విన్యాసాలు చేస్తున్నారు.. ఇవి అత్యంత ప్రమాదకరం. గత ఏప్రిల్‌లో ఐదుగురు విద్యార్థులును పట్టుకున్నాం. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాం. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్సై స్టంట్లు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: చెన్నైలో ఆటో రేసింగ్.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం) ‘‘ఇద్దరు యువకులు స్టంట్లు చేసినట్టు గుర్తించాం. యువకులు టాయ్ గన్ తో విన్యాసాలు చేశారు. బైక్ రేసులు, విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బైక్ రేసులు, స్టంట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విజువల్స్ చూశాం. ఇప్పుడు వచ్చిన విజువల్స్‌లో ఉన్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకుంటాం. రేసింగ్, స్టంట్లు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇక నుంచి ఖాళీ రోడ్లు, ఫ్లై ఓవర్లపై నిఘా పెడతాం. యువకుల చేతిలో ఉన్నది డూప్లికేట్ గన్‌గా నిర్ధారించాం’’ అన్నారు. చదవండి: Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు -
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
ముంబై హత్యాచార ఘటన.. బాధితురాలి మృతి
ముంబై: మహారాష్ట్ర ముంబై సాకి నాక ప్రాంతంలో దారుణ అత్యాచారానికి గురైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాధితురాలిని గట్కోపార్ రాజావాడి ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ముంబై సాకి నాక ప్రాంతలోని ఖైరాని రోడ్ మార్గంలో శుక్రవారం దుండగులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్ చొప్పించి.. అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. విపరీతంగా రక్తస్రావం అయ్యి.. స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న బాధితురాలిని ఆ మార్గంలో వెళ్తున్న వారు గుర్తించి.. గట్కోపార్ రాజావాడి ఆస్పత్రిలో చేర్చారు. (చదవండి: గోదావరి నదీ తీరాన ఇల్లు.. నాడు ఆ వ్యక్తి చేసిన పనితో వినూత్నంగా) విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 45 ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. దారుణం అనంతరం నిందితుడు టెంపో వాహనంలో పారిపోయినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ దారుణంలో మరింత మంది పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: 80 ఏళ్ల వృద్ధుడి హత్య: ‘రూ.10 వేలు ఇస్తా.. నీ భార్యను పంపు’) ఈ ఘటన పట్ల జాతీయ మహిళా కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులను సత్వరమే అరెస్ట్ చేయాలని ముంబై పోలీసులకు సూచించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘మాకు ఇచ్చిన సమయంలోపు చార్జ్‌షీట్ దాఖలు చేస్తాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తాం’’ అన్నారు. చదవండి: సైదాబాద్ బాలిక హత్యాచార కేసు.. నిందితుడు అరెస్ట్ -
సాయి ధరమ్ మా ఇంటి నుండే బయలుదేరాడు: నటుడు నరేశ్
-
సాయి తేజ్ యాక్సిడెంట్..సీసీ టీవీ దృశ్యాలు
-
పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్
లండన్: సాధారణంగా దెయ్యాలు అనగానే అర్థరాత్రి పూట.. నిర్మానుష్య ప్రాంతంలో తిరుగుతుంటాయి.. పాడుబడిన బంగళాల్లో ఉంటాయి.. ఎవరు లేని చోట తచ్చాడతాయనే ఎక్కువగా వింటుంటాం. ఇక సినిమాలు, కథల్లో కూడా ఇలానే చూపిస్తారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ ఓ దెయ్యం ఏకంగా పబ్‌కే వస్తుంది. పైగా తాను వచ్చానని అందరికి తెలియజెప్పడం కోసం రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. కార్డిఫ్‌లోని ది లాన్స్‌డౌన్ పబ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది జూలై 26 సాయంత్రం ఓ మహిళ లాన్స్‌డౌన్ పబ్‌కి వెళ్లింది. ఓ టేబుల్ మీద కూర్చుంది. అక్కడ మొత్తం నాలుగు కుర్చీలుండగా.. ఒకదాంటో ఆమె కూర్చుంది. మిగిలిన మూడు చైర్లు ఖాళీగా ఉన్నాయి. తన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ.. మొబైల్ చూడసాగింది. ఇంతలో ఆమెకు ఎదురుగా ఉన్న వరుసలోని కుర్చీ సడెన్‌గా కదిలింది. ఇది గమనించిన సందరు మహిళ చైర్ కింద ఏమైనా ఉందేమోనని చెక్ చేసింది. ఏం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యింది. (చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..) మేనజర్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేసి ఆశ్చర్యపోయింది. ఆ కుర్చీ దానంతట అదే కదలడం చూసి ఆమె భయపడింది. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను దెయ్యాలు వంటి వాటిని నమ్మను. లాజిక్ లేని విషయాలను అసలు పట్టించుకోను. కానీ సీసీటీవీ పుటేజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని తెలిపింది. (చదవండి: జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది) దీని గురించి పబ్‌లో ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ‘‘మొదట్లో నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఓ రోజు ఉన్నట్లుండి చాక్‌బోర్డ్ దానంతట అదే ఊగడం చూశాను. అప్పుడు చాలా భయపడ్డాను. కానీ సదరు దెయ్యం మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కేవలం తన ఉనికిని మేం గుర్తించాలనే ఉద్దేశంతో ఇలా ఫర్నిచర్‌ను కదుపుతూ ఉంటుంది. నెమ్మదిగా మాకు అలవాటయిపోయింది’’ అని తెలిపింది. (చదవండి: 'ఘోస్ట్'గా కింగ్ నాగార్జున.. ఫస్ట్‌లుక్ అవుట్) పబ్ మేనేజర్ మాట్లాడుతూ.. ఇ‘‘క్కడ ఇలాంటి వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. మా పబ్‌పై ఉన్న ఇళ్లల్లో నివసించే వారికి కూడా ఇలాంటే అనుభవాలు ఎదురయ్యాయి. ఇక పబ్ టైమింగ్స్ పూర్తయ్యాక నేను బయట కూర్చుని పేపర్ వర్క్ చేసుకుంటుంటే ఫర్నిచర్‌ను కదిలిస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి. వెళ్లి చూడగానే శబ్దాలు ఆగిపోయేవి’’ అని తెలిపాడు. -
80 ఏళ్ల వృద్ధుడి హత్య: ‘రూ.10 వేలు ఇస్తా.. నీ భార్యను పంపు’
ముంబై: 80 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అన్ని రోజుల మంచివాడిగా కనిపించిన ఆ వృద్ధుడి వికృత ఆలోచనలు తెలిసిన తర్వాత నిందితుడు కుదురుగా ఉండలేకపోయాడు. వృద్ధుడు తన భార్య గురించే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో వృద్ధుడిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుట్టుగా మాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌తో పోలీసులకు చిక్కాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. షమాకాంత్ తుకరామ్ నాయక్(80) అనే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు అతడి సొంతం. ఉల్వే ప్రాంతంలో అతడికి చాలా ఆస్తులు, ప్లాట్లు, భూములు ఉన్నాయి. ఈ క్రమంలో నాయక్‌కు నవీ ముంబై ప్రాంతంలో ఉండే నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆ ప్రాంతలో చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు. (చదవండి: గోల్డ్ వడపావ్‌ను చూశారా? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!) ఈ క్రమంలో నాయక్ ప్రతిరోజు నిందితుడి షాప్ దగ్గరకు వెళ్లి.. పలకరిస్తూ ఉండేవాడు. పెద్ద వయసు వ్యక్తి కావడం.. ప్రతి రోజు షాప్ దగ్గరకు వచ్చి పలకరిస్తుండటంతో నిందితుడు.. నాయక్‌ని మంచివాడిగా భావించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత నాయక్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. 80 ఏళ్ల వయసులో కూడా కామంతో కళ్లు మూసుకుపోయి.. నిందితుడి భార్య మీద కన్నేశాడు. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన) అంతటితో ఆగక ఏకంగా తన వికృత ఆలోచన గురించి ఏకంగా నిందితుడితోనే చెప్పాడు నాయక్. ఈ క్రమంలో ఆగస్టు 29న నాయక్ నిందితుడి షాప్ వద్దకు వచ్చాడు. పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఉన్నట్లుండి నాయక్ ‘‘నీకు పది వేలు ఇస్తాను.. నీ భార్యను నా గోడౌన్‌కు పంపు.. నాకు ఆమెతో గడపాలని ఉంది’’ అని నిందితుడిని కోరాడు. అన్ని రోజులు ఎంతో మంచివాడిగా భావించిన వ్యక్తి ఇంత నిచంగా మాట్లాడేసరికి నిందితుడు తట్టుకోలేకపోయాడు. నాయక్‌ను తోసేశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్రంగా గాయలయ్యాయి. ఆ తర్వాత షాప్ షట్టర్ క్లోజ్ చేసి.. నాయక్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత వృద్ధుడి మృతదేహాన్ని బాత్రూమ్లో ఉంచాడు. ఆగస్టు 31 వరకు నాయక్ మృతదేహాన్ని బాత్రూంలోనే దాచాడు నిందితుడు. దుర్వాసన వచ్చి దొరికిపోతాననే భయంతో ఆగస్టు 31న నాయక్ మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి.. బైక్ మీద తీసుకెళ్లి ఓ కాల్వలో పడేశాడు. అయితే ఈ తతంగం అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. అయితే అప్పటికే నాయక్ కుటుంబ సభ్యులు.. అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నిందితుడు నాయక్ కుమారుడితో కలిసి వెళ్లి.. అతడు తప్పిపోయినట్లు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు) అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 29న ఏం జరిగిందని ఆరా తీయగా.. నాయక్ చివరి సారిగా నిందితుడి షాప్ దగ్గరే కనిపించాడని.. ఆ తర్వాత మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి షాప్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నాయక్‌ని చంపడానికి గల కారణలు వెల్లడించాడు. అతడిని హత్య చేసిన తర్వాత నాయక్ దుస్తులను, మొబైల్‌ని స్విచ్ఛాఫ్ చేసి పడేసినట్లు తెలిపాడు. చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి.. -
సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్.. నిజం ఏంటంటే?
సాక్షి,ముంబై: నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన యుక్త వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్ అకాల మృతిని స్నేహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్‌గా, ఉల్లాసంగా కనిపించే వ్యక్తి ఇలా ఆకస్మికంగా చనిపోవడంతో బీటౌన్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతిలో మునిగిపోయింది. కాగా జిమ్‌లో వర్కవుట్ చేసిన అనంతరం మెట్లు ఎక్కుతుండగా సిద్ధార్థ్ గుండెపోటుతో కుప్పకూలినట్లు సీసీటీవీ రికార్డు అయిందని ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సిద్ధార్థ్ శుక్లా చివరి వీడియో ఇదేనంటూ కొందరు ఈ వీడియోను తెగ తెగ షేర్ చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అనంతరం జిమ్ చేసినందుకు సడెన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? ఈ వీడియోలో ఉన్నది సిద్ధార్థ్ శుక్లానా? లేక మరెవరైనానా అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూక్ వార్ రూం(AFWA)చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో తెలిసిందేమిటంటే ఇది ముంబైలో జరిగింది కాదు. బెంగుళూరులోని ఓ జిమ్‌లో వర్కవుట్స్ అనంతరం ఓ వ్యక్తి మెట్లు ఎక్కుతూ కుప్పకూలిపోయాడు. గుండెపోటు కారణంగా ఆయన అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. బెంగుళూరు బనశంకరి పోలీసులు సైతం ఈ విషయాన్ని దృవీకరించారు. వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా ఇది ఆగస్టు25న రికార్డు అయిన దృశ్యాలుగా వీడియోలో స్పష్టమవుతుంది. దీన్ని బట్టి ఈ వీడియోలో ఉన్నది సిద్ధార్థ్ శుక్లా అంటూ వైరల్ అవుతున్న వార్త ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. చదవండి : సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్ తల్లి అంటే సిద్దార్థ్‌కు పంచప్రాణాలు.. మరణానికి ముందు కూడా.. -
‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన
లక్నో: రెండు రోజుల క్రితం లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని కొట్టింది. ఇక సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో సదరు యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదు. ఈ వీడియో చూసిన జనం.. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మాటేంటి.. పోయిన పరువు మళ్లీ తిరిగి వస్తుందా అని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో క్యాబ్ డ్రైవర్ మాటల్లోనే.. క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటిలానే నేను ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. అలంబాగ్ నహరియా చౌరహా సిగ్నల్ వద్ద వేచి ఉన్నాను. ఇంతలో సదరు మహిళ రోడ్డు మీద అజాగ్రత్తగా నడుస్తూ కనిపించింది. దాంతో నేను నెమ్మదిగా వెళ్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి ఆమె వెనక్కి వచ్చి నాపై దాడి చేసింది. మొబైల్ విసిరికొట్టింది’’ అని తెలిపాడు. ‘‘కాసేపటికి అక్కడ జనాలు మూగడంతో సమస్య మరింత పెద్దదయ్యింది. నా మాట ఎవరు వినిపించుకోలేదు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటనలో నా కారు డామేజ్ అయ్యింది. మొత్తం మీద నాకు 60 వేల రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటికి మించి నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది.. పరువు పోయింది. నా తప్పు లేకున్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటిని తిరిగి సరిచేయగలా.. నా పరువు తెచ్చివ్వగలరా’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ ఫుటేజ్ చూసిన నెటిజనులు సదరు యువతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పు లేకుండానే క్యాబ్ డ్రైవర్ని అవమానించారు.. తప్పు చేసిన యువతిని వదిలేయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు
ఎడిన్బర్గ్: దెయ్యాలు ఉన్నాయా అంటే.. చాలా మంది అవుననే అంటారు. కొద్ది మాత్రం వాటిని కొట్టి పారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాల గురించి శోధిస్తే.. లెక్కకు మిక్కిలి వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీ సాయంతో తయారు చేసిన వీడియోలే అని మనం ఈజీగా గుర్తింవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డయ్యి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడో రోడ్డు మీదనో.. నివాసా ప్రాంతాల్లో రికార్డయ్యే ఈ సంఘటనలు చూస్తే.. అబద్దం అని కొట్టి పారేయలేం.. అలా అని అవి ఏంటో కూడా కరెక్ట్‌గా చెప్పలేం. తాజాగా ఇలాంటి భయానక సంఘటన ఒకటి వెలుగు చూసింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమారెలో రిక్డారయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు. వెంటనే మతాధికారిని పిలిపించుకుని సమస్యకు పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి షాకైంది. తన గార్డెన్లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. నల్లని నీడలా ఉన్న ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన షాకైన మాక్సిన్.. మతాధికారిని ఆశ్రయించింది. తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా అలాంటి నీడలను చూశానని మాక్సిన్ తెలిపింది. తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. ఓ రాత్రి తన పార్టనర్ కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని, వారాంతం మొత్తం అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని మాక్సిన్ వివరించింది. ఇంటిపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించామని తెలిపింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగాను’’అని మాక్సిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్
-
అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనదారుడిని, అతని మిత్రుడిని నడిరోడ్డుపైనే చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ స్కూటర్‌ను ఢీకొట్టాడని కోపంతో సదరు బండి యజమాని, అతని బంధువులు వారిని రోడ్డుపైనే అడ్డగించి కర్రలతో చితకబాదుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇక వీడియో ఆధారంగా చూసుకుంటే చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి కర్రతో దాడి చేయగా.. మరో వ్యక్తి అతనిపై ముష్టి యుద్దానికి దిగాడు. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా అతనిపై పంచుల వర్షం కురిపించాడు. వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమెను పక్కకు తోసి మరి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత వారిద్దరిని పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దాడిలో వాహనదారుడి తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని ప్రాణ భయంతో నూతన జంట పరుగు.. వెంటాడి వేటాడి దారుణం दिल्ली के पालम इलाके की साद कॉलोनी में मामूली बात पर रोडरेज में लड़के की पिटाई,बाइक सवार पर रॉड से हमला pic.twitter.com/wHtX3A3pAm — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 27, 2021 -
హైదరాబాద్: సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
-
చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: జగద్గిరి గుట్ట పీఎస్ పరిధి శ్రీనివాస్ నగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. కవిత అనే మహిళ టైలర్ షాపుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వెనుక నుండి ఆమెను వెంబడిస్తూ మెడలో నుండి 3.2 తులాల బంగారు గోలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఆ మహిళ అతడిని వెంబడించగా.. రోడ్డుపై మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో దానిపై పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. చదవండి: ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. జర జాగ్రత్త.. లాక్డౌన్ ఎత్తేశారని.. లైట్ తీసుకోవద్దు! -
కిలేడీ: నడి రోడ్డుపై యువతిని చితకబాది..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డు మీద కిలేడీ వీరంగం సృష్టించింది. రోడ్డు మీద నిల్చున్న యువతి చేతిలో నుంచి మొబైల్ లాక్కెళ్లింది. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన యువతిని జుట్టుపట్టుకుని చితకబాదింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ సంఘటన ఢిల్లీ సుల్తాన్పూరి ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సుల్తాన్పూరి క్రిషన్ విహార్ ప్రాంతానికి చెందిన యువతి రోడ్డు మీద నిల్చుని ఉంది. ఇంతలో అటుగా వచ్చి కిలేడీ యువతిని గమనించి ఆమె వద్దకు వచ్చి.. చేతిలోని మొబైల్‌ని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. యువతి ప్రతిఘటించడంతో ఆమె జుట్టు పట్టుకుని చితకబాదింది. యువతిపై పిడిగుద్దులు కురిపించి.. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి ఉడాయించింది. బాధితురాలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితురాలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దాదాపు 50 మందిని ప్రశ్నించారు. చివరకు నిందితురాలిని మంగోలిపూరి ప్రాంతంలో గుర్తించారు. మహిళా చైన్ స్నాచర్ని అరెస్ట్ చేసి.. ఆమె వద్ద నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: పీకల దాకా మద్యం.. ఇద్దరి ప్రాణాలు తీశాడు -
పీకల దాకా మద్యం.. ఇద్దరి ప్రాణాలు తీశాడు
ఢిల్లీ: డ్రైవరు పీకలదాకా మద్యం తాగి కారు నడపడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని డిలైట్ సినిమా హాలు వద్ద డ్రైవరు మద్యం తాగి కారును వేగంగా నడుపుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న ఈ-రిక్షాను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ-రిక్షా డ్రైవర్‌తోపాటు ఓ మహిళ మరణించారు. ప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ-రిక్షాలో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మద్యం తాగి కారును వేగంగా నడపటం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం; 10 మంది మృతి వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో.. -
విడాకులు కోరిందని.. యూఎస్ నుంచే భార్య హత్యకు స్కెచ్
చెన్నై: సినిమాను తలదన్నే రీతిలో భార్య హత్యకు ప్లాన్ చేశాడు ఓ ఎన్నారై భర్త. తన బావ(సోదరి భర్త)తో కలిసి.. యాక్సిడెంట్‌ని తలపించేలా భార్యను హత్య చేశాడు. కానీ మృతురాలు కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సదరు ఎన్నారై భర్త దుష్ట పన్నాగం వెలుగులోకి వచ్చింది. మరణించని స్త్రీని జయభారతి(28)గా గుర్తించారు పోలీసులు. వివరాలు.. తమిళనాడు తిరువూరు జిల్లా, కిదరకొండం ప్రాంతానికి చెందిన జయభారతికి ఐదు సంవత్సరాల క్రితం విష్ణు ప్రకాశ్‌తో వివాహం అయ్యింది. అప్పటికే అతడు అమెరికాలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం అనంతరం జయభారతి కూడా అమెరికా వెళ్లింది. కానీ దంపతుల మధ్య వివాదాలు రావడంతో రెండేళ్ల క్రితం ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది. ఇక్కడే స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌లో ఉద్యోగం చేస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరిని కలపడానికి అనేకమార్లు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జయభారతి తన భర్త విష్ణుప్రకాశ్కి విడాకుల నోటీసు పంపింది. అయితే విడాకులు ఇస్తే.. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి వస్తుందని భయపడిన విష్ణు ప్రకాశ్, జయభారతి, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడం ప్రారంభించాడు. అయినప్పటికి విడాకులు వెనక్కి తీసుకోకపోవడంతో భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో ఉండే ప్లాన్ చేసి.. బావతో కలిసి దాన్ని అమలు చేశాడు. ప్రమాదాన్ని తలపించేలా హత్య చేశాడు.. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జయభారతి తన టూవీలర్‌పై ఆఫీస్‌కు వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు జయభారతి టూవీలర్‌ని ఢీకొట్టి రెప్పపాటులో అక్కడి నుంచి మాయమయ్యింది. ఇక రక్తపు మడుగులో పడి ఉన్న జయాభారతిని గమనించిన కొందరు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జయభారతి మృతి చెందింది. ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ప్రమాదం కాదని.. కావాలనే యాక్సిడెంట్ చేశారని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జయ భారతి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలించారు. అందులో ఓ ట్రక్కు కొన్ని రోజులుగా జయభారతిని వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. ట్రక్కు నంబర్ ఆధారంగా దాని యజమానిని గుర్తించి అదుపులోకి తీసుకోగా.. అతడు దాన్ని కొద్ది రోజుల క్రితమే వేరే వ్యక్తికి అమ్మానని తెలిపాడు. ఇంతలో పోలీసులు ట్రక్కులో తాము చూసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. జయ భారతి భర్తే.. ఆమెను హత్య చేసేందుకు తమకు సుపారీ ఇచ్చాడని వెల్లడించాడు. అతడి ప్లాన్ ప్రకారమే ఆ ట్రక్కు యజమాని, విష్ణు ప్రకాశ్ సోదరి భర్త సెంథిల్ కుమార్ దానిని వేరే వ్యక్తికి అమ్మాడని.. ఆ తర్వాత మరో ఇద్దరని కలుపుకుని.. జయ భారతి వాహనానికి యాక్సిడెంట్ చేసి ఆమెను హత్య చేశాని ఆ నిందితుడు వెల్లడించాడు. కేవలం 12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. సెంథిల్ కుమార్‌తో సహా మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. విష్ణు ప్రకాశ్ మీద కూడా కేసు నమోదు చేసి.. అతడిని ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల హత్య.. ప్రతీకారంగానే! -
దారుణం: చిన్నారిపై 12 కుక్కలు ఒక్కసారిగా..
లక్నో: 7 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో జరిగింది. రోడ్డు మీద ఓ బాలిక తన దారిన తాను దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆ దారిలోని కుక్కలు ఆమె మీదకు ఉరికాయి. దీంతో ఆ బాలిక భయపడి వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తింది. ఈ క్రమంలో ఆ పరిసరాల్లోని 12 కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడిగా బాలిక మీదకు ఉరికాయి. దీంతో చేసేదేమిలేక బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపుల విని సమీంలోని ప్రజలు ఆమెను రక్షించడానికి పరుగెత్తారు. అక్కడ ఉన్న కుక్కలను తరిమేసి బాలికను రక్షించారు. అయితే ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ( చదవండి: వైరల్ వీడియో: అయ్యయ్యో.. తెలిసిపోయిందా ) -
పెట్రోల్ దొంగలు బాబోయ్ దొంగలు!
కరీంనగర్ : పెట్రోల్ ధరలు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతుండటంతో పెట్రోల్ చోరీలకు పాల్పడుతున్నారు. వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వ్యక్తి బైక్ లో పెట్రోల్ ఉందో లేదో ఊపి చూసి, మరి చోరీకి పాల్పడ్డాడు. తర్వాత కొద్ది సేపటికి మరో వ్యక్తి క్యాన్ పట్టుకొచ్చి..అదే బైక్ లోని పెట్రోల్‌ను చోరీ చేసి తీసుకెళ్లాడు. అయితే ఒకే బైక్ వద్దకు ఇద్దరు వేర్వేరుగా వచ్చి పెట్రోల్ దొంగతనానికి పాల్పడటం గమనార్హం. గత కొన్ని రోజులుగా రాత్రి పూట ఇంటిముందు పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ మాయమతుందని పలువురు పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు. గత రెండు రోజుల్లోనే ఆ ప్రాంతంలో పది వాహనాల్లో పెట్రోల్ చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆ పెట్రోల్ దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. చదవండి : హైదరాబాద్: కారులో కిలోల కొద్ది బంగారం వైరల్ : ఆ దొంగోడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. -
ఒక్క దెబ్బతో తల్లి ప్రాణం తీశాడు
-
దారుణం: ఒక్క దెబ్బతో తల్లి ప్రాణం తీశాడు
న్యూఢిల్లీ: నవ మోసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి బిడ్డను కంటుంది తల్లి. అమ్మ అనే పిలుపు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన కడుపులో ఊపిరి పోసుకున్న ఆ ప్రాణి కోసం జీవితాంతం కష్టపడతుంది. తనకు చేతనైనంతలో బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. పిల్లల కోసం తన జీవితాన్నే కరిగించుకునే ఆ తల్లి కోరుకునేది చివరి దశలో చిన్న పలకరింపు.. కాస్తంత ప్రేమ. కానీ ఏందుకో ఏమో.. తమ కోసం జీవితాన్నే అర్పించిన తల్లిదండ్రులను చూసుకోవాలంటే మనసు రాదు లేదు చాలా మందికి. వృద్ధులని కూడా చూడకుండా వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పట్టెడన్నం పెట్టడానికి బరువై వారిని వదిలించుకుంటున్నారు. అది కుదరకపోతే చివరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ప్రబుద్ధుడు వృద్ధురాలైన తల్లిని కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విరుచుకుపడుతున్నారు నెటిజనులు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అంటారు కానీ అది వాస్తవం కాదు.. స్వయంగా తల్లిదండ్రులను నరకంలోకి నెట్టేవాడు అంటున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో అవ్తార్ కౌర్ అనే 76 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు కోడలుతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం పార్కింగ్ స్థలం గురించి కౌర్‌కు, పక్కింటి వారికి మధ్య వివాదం మొదలయ్యింది. అది కాస్త ముదరడంతో పొరుగింటి వారు పోలీసులకు కాల్ చేశారు. ఇంతలో కౌర్ కొడుకు కోడలు కిందకు వచ్చి జరుగుతున్న గొడవను చూశారు. తల్లి వల్ల అనవరంగా తాను పక్కింటి వారితో మాటలు పడాల్సి వచ్చిందని ఆగ్రహానికి గురైన కౌర్ కుమారుడు తల్లి చెంప మీద బలంగా కొట్టాడు. దాంతో కౌర్ కింద పడిపోయింది. వెంటనే ప్రాణాలు విడిచింది. ఆమె కొడలు కౌర్‌ని పైకి లేపడానికి ప్రయత్నించింది.. కానీ అప్పటికే ఆమె ప్రాణం పోయింది. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు కౌర్ కుమారుడు, పొరుగింటి వారి మీద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దాంతో ఈ వీడియో వైరలవుతోంది. చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు.. -
సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నించిన వాజే
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియోని నిలిపి కలకలం సృష్టించిన ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తొలత ఈ కేసును ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే దర్యాప్తు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ కేసుతో వాజేకు ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసుకు సంబంధించి వాజే మీద కేసు బుక్ చేసింది. అలానే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వాజేను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వాజే ఈ కేసు దర్యాప్తులో సమయంలో సేకరించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాజే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సేకరించిన ఆధారాలను రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. అలానే సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ మెషన్ డాటాతో పాటు తాను సేకరించిన ఇతర సమాచారాన్ని నాశనం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ప్రసుత్తం అధికారులు డిలీట్ అయిన డాటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగలించబడిందని గుర్తించారు. ఆ తర్వాత హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజేనే ఆ తర్వాత.. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహంచడంతో అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు -
పేపర్ చదువుతున్నట్టు నటన, పిల్లాడిని తీసుకుని పరార్
తిరుపతి : అలిపిరి లింక్ బస్టాండు వద్ద ఆరేళ్ల బాలుడు అపహరణకు గురి కావడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్‌పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడి వెంటబెట్టుకుని దుండగుడు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి : (భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య) (హైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం) -
కాకినాడ కార్పొరేటర్ దారుణ హత్య
కాకినాడ/కాకినాడ రూరల్: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన 9వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కంపర రమేష్ (47) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వలసపాకల గంగరాజు నగర్లో సూర్య కార్ వాష్ వద్ద రమేష్ ను అతడి మిత్రుడే కారుతో ఢీకొట్టి హతమార్చాడు. సర్పవరం సీఐ నున్న రాజు కథనం ప్రకారం.. కార్పొరేటర్ రమేష్, స్నేహితులు ముత్యాల సతీష్, సుందరవీడి వాసు గురువారం రాత్రి 8 గంటలకు సూర్య కార్ వాష్ వద్ద పార్టీ చేసుకున్నారు. మరో స్నేహితుడైన గురజాన వీరవెంకట సత్యనారాయణ (చిన్నా) అనే వ్యక్తి ఐదు రోజులుగా తనను కలవాలంటూ మెసేజ్‌లు పెడుతున్నాడని, అందువల్ల అతణ్ణి కూడా పార్టీకి పిలుద్దామని కార్పొరేటర్ రమేష్ చెప్పగా.. మిగిలిన స్నేహితులు సరేనన్నారు. దీంతో రమేష్ చిన్నాకు ఫోన్ చేసి పార్టీకి రమ్మనడంతో అతడు తన సోదరుడు కుమార్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అంతా కలిసి మద్యం సేవించిన అనంతరం చిన్నా తన సోదరుడి పుట్టిన రోజు కేక్ కటింగ్‌కు రావాలని రమేష్ ను కోరాడు. అందుకు రమేష్ నిరాకరించడంతో ఇద్దరిమధ్యా వాదులాట చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చిన్నా తన కారు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయగా.. రమేష్ అడ్డుపడ్డాడు. స్నేహితులు అతడిని పక్కకు తీసుకెళ్లగా.. తన కారు తాళం కనిపించడం లేదని, చిన్నా తీసుకుపోతున్నాడేమో అని రమేష్ మరోసారి కారుకు అడ్డుగా వెళ్లాడు. దాంతో చిన్నా తన కారుతో రమేష్ ను ఢీకొట్టాడు. కారు వేగానికి రమేష్ వలసపాకల మెయిన్ రోడ్డుపై పడిపోగా చిన్నా కారును రివర్స్ చేసి మరో రెండుసార్లు రమేష్ పైకి ఎక్కించి ముందుకు పోనిచ్చాడు. రక్తపుమడుగులో ఉన్న రమేష్ ను అతని స్నేహితులు సతీష్, వాసు సర్పవరం జంక్షన్ వద్ద గల ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నగరంలో విషాద ఛాయలు కార్పొరేటర్ కంపర రమేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన కంపర రమేష్, 2001లో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. తరువాత 2005లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 2017లో వైఎస్సార్ సీపీ తరఫున 9వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ సీపీ సిటీ కన్వీనర్‌గా, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించారు. రమేష్ హత్యతో నగరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వివిధ రాజకీయ పారీ్టల నేతలు, అభిమానులు రమేష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. పాతకక్షలే కారణం! రమేష్ హత్యకు గురైన దృశ్యాలు కార్ వాష్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రమేష్ మీద నుంచి మూడుసార్లు కారును పోనివ్వడంతో కావాలనే చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు పాతకక్షలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్టు సీఐ రాజు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. చదవండి: కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి -
అమానుషం: కారుతో మూడుసార్లు తొక్కించి..
-
సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
తంజావూరు : జిల్లాలోని కోయంబేడు వద్ద గత బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం విషయంలో సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు కీలకంగా మారాయి. ఆ సంఘటన రోడ్డు ప్రమాదం కాదని, ఆత్మహత్యని తేలింది. కేసు వివరాల్లోకి వెళితే.. గత బుధవారం కోయంబేడు ప్రాంతంలో ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి లారీ కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాక్ అయ్యే విషయం తెలిసింది. సంఘటనా స్థలం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చూడగా జరిగింది ప్రమాదం కాదని, మృతుడు ఉద్ధేశ్యపూర్వకంగానే లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. ( ఖమ్మం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకం ) వీడియోలో.. రోడ్డు మీద ఉన్న ఆటో పక్కన ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. రోడ్డు దాటడానికి అన్నట్లు వచ్చిపోయే వాహనాలను చూస్తూ ఉన్నాడు. సెకన్లు, నిమిషాలు గడుస్తున్నాయి. అతడు కొంతముందుకు వెళ్లటం, వెనక్కురావటం చేస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ముందుకు వెళ్లి అమాంతం లారీ టైర్ల కిందకు దూకాడు. టైర్లు అతడిపై నుంచి ముందుకు కదిలాయి. ఆ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. -
ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతీ ఏడాది ప్రభుత్వం, పోలీసులు అనేక చర్యలను చేపడుతున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం రహదారులు రక్తసిక్తమవుతునే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నా.. వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు పలు రకాలుగా వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే అనర్థాలను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. చదవండి: 16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్.. తాజాగా ‘ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన బైక్ రైడర్లకు సంబంధించి.. సీసీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ ఇద్దరు బైక్ రైడర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసులు సంధించిన ప్రశ్న ఆలోచింపజేసింది. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు -
13 కోట్ల విలువైన చోరి.. కాపాడని పీపీఈ కిట్
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పీపీఈ కిట్ల వినియోగం బాగా పెరిగింది. సాధారణంగా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు ధరించే ఈ కిట్‌ని.. ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి వాడి.. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని చోరి చేశాడు. ట్విస్ట్ ఏంటంటే పీపీఈ కిట్ ధరించినప్పటికి పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక అతడు దొంగతనం చేసే సమయంలో నగల షో రూం బయట ఐదుగురు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక హుబ్లీకి చెందిన మహ్మద్ షేక్ నూర్ అనే వ్యక్తి దక్షిణ ఢిల్లీ కల్క్‌జీలోని ఓ ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తున్నాడు. ఇక అతడు పని చేసే షాపుకు ఎదురుగా ఓ బంగారు నగల షో రూం ఉంది. దాంతో అతడి మనసులో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. (చదవండి: అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై) ఇక తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం పీపీఈ కిట్ ధరించి దొంగతనం చేయాలని భావించాడు. ఇక షోరూం బయట గట్టి కాపలా ఉండటంతో దాని ఎందురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి.. అక్కడి నుంచి షో రూంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన నూర్ డెస్క్ మీద నుంచి అవతలి వైపుకు దూకి.. ఆభరణాల కోసం వెతికి.. దొరికిన కాడికి తీసుకుని షో రూం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఇక అతడు షో రూంలో చేసిన విన్యాసాలు అన్ని సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నూర్‌ని గుర్తించి అరెస్ట్ చేశారు. -
కౌన్సిలర్ ఇంట్లో చోరీ; అరకిలో బంగారం మాయం!
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. అశోక్ నగర్ కాలనీలోని 15వ వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. గేటు దూకి తాళాలు పగులగొట్టి లోపలికి వచ్చిన దుండగులు.. 52 తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు 2 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ ఆయ్యాయి. వివరాలు.. కౌన్సిలర్ వనిత రామ్మోహన్ దంపతుల సమీప బంధువు శ్రీనివాస్ కూమార్తె స్నేహ వివాహం ఈ నెల 24న కామారెడ్డిలో జరిగింది. అయితే ఆ మరుసటి రోజే(డిసెంబరు 25) కౌన్సిలర్ మామయ్య లక్ష్మీరాజం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో.. స్నేహ పెళ్లికి సంబంధిన బంగారంతో పాటు బంధువుల బంగారాన్ని కూడా వనితా రామ్మోహన్ ఇంట్లో ఉంచి, లక్ష్మీరాజం అంత్యక్రియలకై మాచారెడ్డి మండలం గజ్యాయనాయక్ తండాకు వెళ్లారు.(చదవండి: భగ్గుమన్న ‘బిచ్కుంద’) ఈ క్రమంలో మూడు రోజుల అనంతరం ఉదయం ఇంటికి చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కామారెడ్డి ఇంచార్జి డీఎస్పీ శశాంక్ రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ మధుసూదన్, ఎస్ఐ రవి కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంటి ముందర బిగించిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ విషయం గురించి వనితా రామ్మోహన్ మాట్లాడుతూ.. తక్షణమే చర్యలు తీసుకుని దొంగల ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
వైరల్: దొంగలకు చెమటలు పట్టించిన పోలీసు
దొంగలు కనిపిస్తే చాలు జనాలు హడలెత్తిపోతారు. కానీ పోలీసులు మాత్రం ఆన్‌డ్యూటీలో ఉన్నా, ఆఫ్‌డ్యూటీలో ఉన్నా వారినే తిరిగి భయపెడుతుంటారు. అందుకు ఉదాహరణగా నిలిచిందీ ఘటన. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే రాజధాని మాంటెవిడియోలో నలభై ఆరేళ్ల పోలీసాఫీసర్ తన కొడుకుతో కలిసి ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాడు. ఐస్‌క్రీమ్ కొనుక్కుని తండ్రీకొడుకులిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు జాకెట్లు వేసుకుని వీళ్లు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చారు. వీళ్లను బెదిరించి డబ్బులు గుంజడం కోసం ఏదో ఆయుధాన్ని తీసేందుకు జేబులో చేయి పెట్టారు. (చదవండి: వైరల్: కూతురు స్కూల్ వీడియోలో తండ్రి డ్యాన్స్) వాళ్ల వాలకం, దొంగ చూపులు పసిగట్టిన పోలీసు వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎడమ చేతిలో ఉన్న కోన్ ఐస్‌క్రీమ్ జారవిడవకుండా పట్టుకుని, కుడిచేతితో తుపాకీ అందుకుని నిందితులపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఊహించని దెబ్బకు తోక ముడిచిన దొంగలు బతుకు జీవుడా అని అక్కడి నుంచి వెనక్కు చూడకుండా పారిపోయారు. ఈ ఘటనలో పోలీసు ఎడమ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ఏమాత్రం కింద పడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డవగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఘటనలో పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఛాతీలోకి బుల్లెట్ దిగడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. (చదవండి: పాక్ తింగరి పని.. ఫోటోలు వైరల్) -
సీసీటీవీ సాక్షిగా బయటపడ్డ తండ్రి ఘాతుకం
-
నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు కిడ్నాపర్ల విఫలయత్నం
-
కిడ్నాపర్లతో మహిళ పెనుగులాట..
-
కిడ్నాపర్లతో మహిళ పెనుగులాట.. చివరికి
న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు దుండగులతో ఓ తల్లి చిన్నపాటి యుద్ధమే చేసింది. శాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు కిడ్నాపర్ల బారి నుంచి తన బిడ్డను కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పాప కిడ్నాప్‌కు ప్రణాళిక రచించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తూర్పు ఢిల్లీ నివాసి అయిన పాప తండ్రి వస్త్ర వ్యాపారిగా తనకంటూ గుర్తింపు దక్కించుకుని లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అక్కసు పెంచుకున్న సోదరుడు.. ఎలాగైనా డబ్బు గుంజాలని భావించాడు. ఇందుకోసం పాపను అపహరించేందుకు పథకం వేసి ఇద్దరు వ్యక్తులను పురమాయించాడు. (అమ్మ కోసం ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గరే జపం) ఈ క్రమంలో బైక్‌పై సదరు వ్యక్తి ఇంటికి వెళ్లిన దుండగులు అతడి భార్యను నీళ్లు కావాలని అడిగారు. ఆమె వెనక్కి తిరగగానే చిన్నారిని ఎత్తుకుని బయటకు వచ్చారు. బైక్‌పై పారిపోయేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తుకు వచ్చిన పాప తల్లి వారి చేతుల్లో నుంచి చిన్నారిని లాక్కొంది. దీంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి ఉడాయించగా.. ఇరుగుపొరుగు వ్యక్తులు వారిని వెంబడించారు. ఈ నేపథ్యంలో పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పాప తండ్రి సోదరుడిని అరెస్టు చేశారు. రూ. 35 లక్షల కోసమే తాను దుండగులను పంపినట్లు అతడు వెల్లడించాడు. కాగా కిడ్నాప్‌కు యత్నించిన ఇద్దరు ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం. (వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే!) -
కస్టడీ డెత్: పోలీసులు చెప్పినవి అబద్ధాలే
చెన్నై: తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. (వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి) పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) -
సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్
హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తనపై పబ్‌లో జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాహుల్.. తనపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని పేర్కొన్నారు. తను టీఆర్ఎస్ పార్టీ కోసమే నిలిచానని, టీఆర్ఎస్కి ఓటు వేశానని అన్నారు. కేటీఆర్‌పై ఎంతో నమ్మకం ఉందని.. ఆయన తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనకు నిష్పాక్షిక న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘నాపై జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు చూడండి. ఆ గ్యాంగ్ నన్ను ఏవిధంగా రెచ్చగొట్టిందో, దాడి చేసిందో తెలుస్తోంది. ఈ వీడియో చూసి నిజం వైపు నిలబడండి. కేటీఆర్ సార్, నేను ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేశాను. నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాను. నేను బతికి ఉన్నంతకాలం తెలంగాణకు సేవ చేస్తాను. సార్ మేము నమ్మి నాయకులను ఎన్నుకుంటాం.. కానీ వాళ్లు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన సొంత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరులు పబ్లిక్‌లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యాను. వాళ్ల సోదరుడికి అధికారం ఉందని దాడికి పాల్పడ్డారు. (చదవండి : ‘బిగ్‌బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?) సారు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలి. నాకు న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను. ఈ కేసును పరిశీలించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి నా తప్పు ఉంటే నాపై కూడా చర్యలు తీసుకోండి. కానీ నేను( లేదా కామన్ మ్యాన్) ఒకవేళ ఆ తప్పు చేసి ఉండకపోతే అలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాలి?. మీరు నాకు, మాకందరికీ నాయకుడు. నేను నిష్పాక్షిక న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాను. ఎంతో నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి క్రూరమైన వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపాల్సిన సమయం వచ్చింది. మీరు కచ్చితంగా సరైన పనే చేస్తారని నేను నమ్ముతున్నాను. థాంక్యూ సార్’ అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. కాగా, గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో బుధవారం రాత్రి రితేష్‌రెడ్డితోపాటు మరికొందరు రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 324, 34 రెడ్‌విత్, 354 సెక్షన్ల కింద రితేష్‌రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. (చదవండి : రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి) -
సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్
-
చిన్న గొడవ పెద్దదై..
-
వీడియో: పాతబస్తీలో విచ్చలవిడిగా!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రెండు చిన్న గ్యాంగ్‌ల మధ్య వాగ్వాదం మొదలై గొడవగా మారింది. దీంతో రెండు గ్యాంగ్‌లు రోడ్డుపైనే విచ్చలవిడిగా కొట్టుకున్నాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు నమోదు కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్సాబ్ కుంట వద్ద ఈ ఘటన జరిగింది. చిన్నరోడ్ ప్రమాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో ప్రారంభమైన చిన్న గొడవ పెద్దదై.. రెండుగ్రూపులుగా మారి యువకులు కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు 100కు డయల్ చేయడంతో ఫలక్ నుమా పోలీసులు రంగంలోకి దిగారు. గొడవలో గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణమైన రెండు గ్యాంగ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు -
ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం
సాక్షి, బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్నవిమానాశ్రయ పోలీసులు, ఉన్నతా ధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసులకు చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీఎస్) ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వెహికల్లో ఉంచి, కిలోమీటరు దూరంలో కెంజార్‌లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు. బ్యాగ్‌లో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉంచారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను మోహిరింపచేసిన అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు.అలాగే నిందితుడు వెళ్లిన ఆటోరిక్షాను ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) డిఐజి అనిల్ పాండే అందించిన సమాచారం ప్రకారం నిందితుడు బ్యాగ్‌ను మంగళూరు విమానాశ్రయంలో ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో అక్కడినుంచి ఉడాయించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే బాంబును నిర్వీర్యం చేసేందుకు సంబంధిత సిబ్బంది పనిచేస్తున్నారని పాండే చెప్పారు. అలాగే అన్ని విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని విమానాశ్రయ డైరెక్టర్ వి.వి. రావు ఒక ప్రకటనలో తెలిపారు. Karnataka: Mangaluru Police releases photographs of suspect and the autorickshaw he was seen leaving in, in the CCTV footage. A suspicious bag was found at Mangaluru Airport today. https://t.co/9X3seeADZC pic.twitter.com/NKeak3rwnz — ANI (@ANI) January 20, 2020 -
సెకన్ల వ్యవధిలో ఎంత ఘోరం జరిగిపోయింది
బీజింగ్ : ప్రమాదాలనేవి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణగా చైనాలోని గ్జీనింగ్ పట్టణంలో చోటుచేసుకున్న ప్రమాదాన్ని చూస్తే అది నిజమేననిపిస్తుంది.రోడ్డుపై వెళుతున్న ఒక బస్సు బస్టాప్‌లో వచ్చి ఆగింది. ప్రయాణికులు బస్సును ఎక్కుతున్న సమయంలో ఆకస్మాత్తుగా గుంతలో కూరుకుపోయింది. తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడంతో పాటు బస్సు మొత్తం అందులోకి కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా,10 మంది ఆచూకీ లభించలేదు. కాగా ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది. అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియడం లేదు. ప్రమాద సమయంలో ప్రయాణికులు గుంతలో పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బలగాలు ఘటనా స్థలికి చేరుకొని ఆపరేషన్ నిర్వహించి బస్సును బయటికి తీశారు. కాగా గుంతలో పడిన వారిలో ఇప్పటివరకు 16 మందిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం చైనాలో కొత్తేం కాదు. ఇంతకుముందు చైనాలోని షెంజెన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో 10 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడి ఐదుగురు మృతి చెందారు. -
పౌరసత్వ ఆందోళన, ఏం జరిగిందంటే..
-
సీఏఏ రగడ : ఆ రోజు ఏం జరిగిందంటే!
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 15న ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సీటీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం తీవ్ర కలకలం రేపింది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శలు గుప్పించాయి. విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఇండియా గేట్ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. వర్సిటీలో ఉంటూ విద్యార్థులను రెచ్చగొడ్తున్న విద్యార్థేతరులను అదుపులోకి తీసుకునేందుకే తాము ప్రయత్నించామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులే హింసకు పాల్పడ్డారని చెప్పారు. తాజాగా ఆ రోజున జామియా యూనివర్సిటీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయటికొచ్చాయి. ఆ వీడియోలో నిరసనకారులు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సుకు తగలబెట్టడం, ఓ బైక్ నుంచి పెట్రోల్ తీయడం, మరో బైక్‌కు నిప్పంటించి దాని రోడ్డుపైకి లాక్కెడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. వర్సిటీ దగ్గరలో నిరసనకారులు హింసకు పాల్పడ్డారని తెలియజేయడానికే ఢిల్లీ పోలీసులు ఈ వీడియోలను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. -
మహానగరంలో ఉల్లిపాయల దోంగలు
-
దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన రాత్రి సమయంలో నలుగురు నిందితులు వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన రాత్రి 10 గంటల తర్వాత దిశను నిందితులు హతమార్చారని, అనంతరం శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్ పోసి తగులబెట్టారని, ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఇలా లారీలో మృతదేహాన్ని తీసుకువెళుతుండగా.. ఆ దృశ్యం తొండూపల్లి టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. నిందితుల లారీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. చదవండి: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి! -
పది లక్షలిస్తేనే పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో డిప్యూటీ సెక్రటరీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ‘రూ.10 లక్షలిస్తే పదోన్నతి వచ్చేలా చేస్తా.. కోరిన చోటుకు పోస్టింగ్ ఇస్తా’ అంటూ నేరుగా ఒక వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి డబ్బు డిమాండ్ చేసిన వైనం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకొచ్చింది. గుంటూరు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డా.వై.కిరణ్‌కుమార్ తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి దక్కలేదంటూ నాలుగున్నరేళ్ల పాటు అప్పటి ప్రభుత్వంతో పోరాడారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని కమిషన్ తీర్పుచెప్పింది. అధికారులు మాత్రం పదోన్నతి ఇవ్వకుండా తిప్పుకున్నారు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది. అయితే కిరణ్‌కుమార్ బావమరిది ఆనంద్... సచివాలయంలో ఆరోగ్యశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే యిర్మియా రాజును సంప్రదించి తన బావ పదోన్నతి అంశాన్ని చర్చించారు. తనకు రూ.10 లక్షలు ఇస్తే నోషనల్ ప్రమోషన్, మళ్లీ పోస్టింగ్ ఇస్తానని యిర్మియా డిమాండ్ చేశారు. ఫైలు చదివాక మిగతా విషయాలు మాట్లాడుతా నవంబర్ 4న గుంటూరులో కిరణ్‌కుమార్ నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లిన యిర్మియా.. దాదాపు 30 నిముషాలు మాట్లాడి రూ.10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నవంబర్ 20న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి రూ.50వేలు తీసుకున్నారు. ‘మీకు మూడేళ్ల నుంచి వేతనం రాలేదు కదా అది కూడా వచ్చేలా చేస్తా..మీ ఫైలు చాలా క్లిష్టంగా ఉంది. బాగా చదవాలి. అన్నీ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారు. ఫైలు పరిశీలించాక నాలుగైదు రోజుల్లో కలుస్తానని, అప్పుడు మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను క్లినిక్‌కు వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అడ్డంగా దొరికిపోయారు. వైద్యుడి నుంచి డబ్బు తీసుకుంటున్న దృశ్యాలు.. ఎడమవైపు డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు, కుడివైపున వైద్యుడి బావమరిది ఆనంద్ సీఎంవో కార్యాలయ ఆదేశాలు బేఖాతరు తనకు న్యాయం జరగడం లేదని కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆ వినతిని పరిశీలించిన సీఎం కార్యాలయం 2019 నవంబర్ 5న వైద్య ఆరోగ్యశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని, 2015లో జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసి న్యాయం చేయాలని సూచించింది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు డబ్బులు వసూలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రూ.10 లక్షలు డిమాండ్ చేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా నోషనల్ ప్రమోషన్‌పై పోరాడుతున్నాను. అప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోగా విజిలెన్స్, ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో నా బావమరిది ఆనంద్...డిప్యూటీ సెక్రటరీ యిర్మియా రాజును సంప్రదించారు. అనంతరం ఆయన నా దగ్గరకొచ్చి రూ.10 లక్షలు డిమాండు చేశారు. అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాను. మరో రెండు లక్షలు ఇవ్వాలని, మిగతా సొమ్ము పనయ్యాక ఇవ్వాలని అడిగారు. అలాగే ఇస్తానని చెప్పాను. – డా.కిరణ్‌కుమార్, ప్రొఫెసర్, జనరల్ సర్జరీ -
నీ కక్కుర్తి తగలెయ్య; నువ్వేం తల్లివి?!
బిడ్డ కోసం స్ట్రోలర్ తెచ్చేందుకు షాపునకు వెళ్లిన ఓ మహిళ దొంగతనాన్ని సీసీటీవీ బయటపెట్టింది. స్ట్రోలర్ కొట్టేసే తొందరలో ఆఖరికి బిడ్డను మర్చిపోయిన సదరు మహిళపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అసలు విషయమేమిటంటే... ఓ మహిళ తన పాపాయి, ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి న్యూజెర్సీలోని ఓ స్టోర్‌కి వెళ్లింది. ఈ క్రమంలో స్నేహితులిద్దరూ స్టోర్ యజమానితో మాటలు కలుపగా బిడ్డను పక్కన కూర్చోబెట్టిన సదరు మహిళ స్ట్రోలర్‌ను తీసుకుని ఎంచక్కా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె స్నేహితులు కూడా స్టోర్ నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత బిడ్డ లేదని గమనించి మళ్లీ ముగ్గురూ కలిసి స్టోర్‌లోకి వచ్చారు. పాపాయిని తీసుకువెళ్తుండగా వారిని పట్టుకున్న స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లపై చోరీకేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తన షాపులో జరిగిన దొంగతనాన్ని వివరిస్తూ...‘ స్ట్రోలర్ కొట్టేయాలనే తొందరలో కొంతమంది ఎవరి కోసమైతే దానిని దొంగతనం చేస్తారో చివరకు వాళ్లనే ఇలా వదిలివెళ్తారు. దొంగతనం చేయడం వారి వ్యక్తిగత విషయం. అయితే స్టోర్‌లోకి తీసుకువచ్చిన పిల్లలను అలా వదిలేసి వెళ్లకండి. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలనే ఈ వీడియో షేర్ చేస్తున్నా’ అంటూ యజమాని సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను ఫేస్బుక్లో షేర్ చేశారు. ఈ క్రమంలో.. ‘నీ కక్కుర్తి తగలెయ్యా. దొంగతనం చేస్తే చేశావు. బిడ్డను ఎలా మర్చిపోయావు. నువ్వేం తల్లివి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించుకో’ అంటూ నెటిజన్లు ఎవరికి తోచిన తీరుగా వారు కామెంట్లు చేస్తున్నారు. -
యువతి కిడ్నాప్; కీలక ఆధారాలు లభ్యం..!
సాక్షి హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న సోని(21) కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్‌గా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. 45 పైగా కేసుల్లో రవిశంకర్ నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. కిడ్నాప్‌నకు వాడిన కారును బళ్లారిలో నెల రోజుల క్రితం చోరీ చేసినట్లుగా తెలిసింది. కంకిపాడు, తల్లాడ, విజయవాడ, బళ్లారిలో అతనిపై కేసులున్నాయి. రవిశంకర్‌కు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలతో లింకులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం (23వ తేదీ) రాత్రి 8:50 గంటలకు పెద్ద అంబర్‌పేట టోల్గేట్ మీదుగా కిడ్నాపర్ కారు తీసుకెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా శ్రీశైలం వైపుగా ఆ కారు వెళ్లింది. కర్నూలు జిల్లాలో నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కేసును ఛేదించేందుకు డీసీపి సన్‌ప్రీత్‌సింగ్ పర్యవేక్షణలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయని ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు. కూతురురికి ఉద్యోగం ఇస్పిస్తానని నమ్మబలికిన ఓ దుండగుడు ఎలిమినేటి యాదగిరి కూతురు సోనిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. బొంగ్లూర్ గేటు వద్ద యాదగిరి టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఎవరు?..ఎందుకు?) మాయమాటలు చెప్పి.. మోసం : సోని తండ్రి నిందితుడికి సుమారు 35–40 ఏళ్ల్ల వయస్సు ఉంటుంది. శ్రీధర్ రెడ్డిగా పరిచయం చేస్తుకున్నాడు. తను ఉస్మానియాలో డాక్టర్‌ను అని, అతని తల్లిదండ్రులు హైకోర్టులో జడ్జిలని చెప్పాడు. తన సోదరుడు పోలీసు కమిషనర్ అని నమ్మబలికాడు. నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిందితుని మాటలు నమ్మాను. ఉదయం 7:30 గంటలకు మా టీ స్టాల్ వద్దకు వచ్చి మచ్చిక చేసుకున్నాడు. అతనితో పాటు ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళి కారును వాషింగ్ కూడా చేయించాను. పోలీసులు నా కూతురిని క్షేమంగా తీసుకురావాలను వేడుకుంటున్నా. తండ్రి అనుమానాలు.. సోని కిడ్నాప్ వ్యవహారంలో ఆమె తండ్రి యాదగిరిపై మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం యాదగిరి సోనిని అమ్మేశాడని, . పక్కా ప్లాన్‌తోనే జూలై 1న మాల్ మల్లేపల్లి నుంచి యాదగిరి బొంగుళూరుకు నివాసం మార్చినట్టు సందేహాలు వ్యక్తమతున్నాయి. కిడ్నాపర్ రవిశంకర్‌తో కలిసే యాదగిరి ఈ ప్లాన్ వేసినట్టు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ మత్తు బిస్కెట్ ఇచ్చాడనని యాదగిరి చెప్పడం అబద్దంగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఉండటంతో పోషణ భారమై యాదగిరి ఈ పథకం వేశాడమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇంతకు దిగజారాలా; సీసీటీవీ లేకపోయి ఉంటే?
తప్పుడు ఆరోపణలతో హోటల్ యాజమాన్యాన్ని ఇబ్బందులపాలు చేద్దామనుకున్న ఓ యువతి చర్యలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఆమె పన్నాగం బయటపడింది. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో సదరు యువతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆధునిక వస్త్రధారణతో ఉన్న ఓ యువతి స్థానికంగా ఉన్న జడ్జ్ రాయ్ బీన్స్ బార్ అండ్ స్టీక్ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత.. ఎవరూ చూడకుండా మెల్లగా తన షర్టు లోపల ఉన్న ఓ ఎలక్ట్రానిక్ వస్తువును నోట్లో పెట్టుకుంది. అనంతరం భోజనంలో ఇలాంటి వస్తువులు కలుపుతున్నారా అంటూ సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో సదరు యువతి స్నేహితురాలు కూడా ఆమెకు తోడైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న యజమాని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. దీంతో యువతి బండారం బయటపడింది. దురుద్దేశంతోనే ఆమె ఇలా చేసిందని గ్రహించిన హోటల్ సిబ్బంది ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ విషయం గురించి హోటల్ యజమాని మాట్లాడుతూ...‘ఈరోజు గనుక సీసీటీవీ లేకపోయి ఉంటే మాపై యువతి వేసిన నిందలు నిజమని నమ్మేవారు. దీంతో మా వ్యాపారం దెబ్బతినేది. అసలు ఆమె ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు... ‘బిల్లు ఎగ్గొట్టడానికా లేదా హోటల్ మూయించడానికా.. అసలు ఎందుకు ఇలా చేస్తారు. ఫ్రీగా తినాలనిపిస్తే ఇంతకు దిగజారాలా’ అంటూ యువతి తీరును తప్పుబడుతున్నారు. కాగా ఇటీవల చైనాలో కూడా ఓ వ్యక్తి ఇలాగే తన భోజనంలో తానే చచ్చిన ఎలుకను వేసుకుని రెస్టారెంట్ సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. -
11వ అంతస్తు నుంచి కిందపడినా..
థాయ్‌లాండ్: కేవలం ఒక్క అంతస్తు పైనుంచి పడి మరణించిన వారిని చూసుంటాం. మరి 11 అంతస్తు నుంచి పడితే... బతికే చాన్సే లేదు. కానీ థాయ్‌లాండ్‌లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినా కూడా ప్రాణాలతో బయటపడి మృత్యుంజయురాలిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే... వ్యక్తిగత పనిపై దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్లో బస చేశారు. నిద్రలో నడిచే అలవాటున్న దీచా కుమార్తె రాత్రి గది నుంచి బయటకు వచ్చింది. తర్వాత వేరే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఆ చిన్నారి నేరుగా బాల్కానీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదంతా హోటల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. చిన్నారి కిందపడిపోతూ గట్టిగా కేకలు పెట్టింది. హోటల్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఆ చిన్నారి కింద పడిపోయి స్పృహతప్పింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని.. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
పోలీస్‌స్టేషన్‌లో దెయ్యాలు?
పోలీసులంటే సామాన్య ప్రజలకు హడల్. అటువంటి పోలీసులకే నిద్రలేకుండా చేస్తున్నాయట ఆత్మలు. నేటి డిజిటల్ యుగంలోనూ ఇలాంటివేమిటని కొట్టిపారేయకండి. తుమకూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో దయ్యాల సంచారం ఖాకీలకు, ప్రజలకు భీతిగొలుపుతోంది. తుమకూరు : తుమకూరు జిల్లాలోని శిర తాలూకాలోని 4వ జాతీయ రహదారిపై ఉన్న కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్‌ను దెయ్యాల భయం ఆవహించింది. స్టేషన్‌లోని సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు అందులో రెండు ఆకారాలు స్టేషన్ ఆవరణలో సంచరించడం చూసి భయంతో వణికిపోయారు. బూడిద రంగులోని చుక్కల వంటి ఆకారాలు స్టేషన్ లోపలికి, బయటకు తిరగడం వీడియోలో కనిపించింది. ఆ సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు ఇప్పుడు టీవీ చానెళ్లలో ప్రసారం కాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతి రోజూ ప్రమాదాల్లో కనీసం ఇద్దరైనా మృత్యువాత పడుతుంటారు. గతంలో కూడా పలు ఘోరమైన రోడ్డు ప్రమాదాలో కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి లభించని ఆత్మలు దెయ్యాలై పోలీస్‌స్టేషన్‌లో తిరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దెయ్యాలున్నట్లు వదంతులు వ్యాపించడంతో రాత్రి వేళల్లో స్టేషన్ చుట్టుపక్కలకు రావడానికి ప్రజలు భీతిల్లుతున్నారు. రాత్రి వేళల్లో స్టేషన్లో పనిచేయడానికి స్టేషన్ సిబ్బంది కూడా జంకుతున్నారు. దయ్యాలను పారదోలడానికి ఏం చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. -
ప్రేమగా నీళ్లు పోయండి!
ఇది నా బిడ్డ..దీని పేరు షిమ్‌పకూ..వయస్సు నాలుగొందల ఏళ్లు..మా పూర్వీకుల కాలం నుంచీ అపురూపంగా పెంచుకుంటున్నాం.. దీన్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు.. అలాంటిదాన్ని మీరు పట్టుకెళ్లిపోయారు.. దొంగతనం చేస్తే చేశారు.. కానీ.. దానికి ప్రేమగా నీళ్లు పోయండి.. జాగ్రత్తగా చూసుకోండి.. ఎందుకంటే.. అది నా ప్రాణం.. తమ ఇంట్లోంచి అరుదైన జానిపర్స్ బోన్సాయ్ చెట్లను ఎత్తుకెళ్లిన దొంగలను ప్రాధేయపడుతూ జపాన్‌లోని టోక్యోకు చెందిన మహిళ ఫుయుమీ ఈమూరా ఫేస్బుక్లో ఈ మేరకు పోస్టు పెట్టింది.. ఆమె దిగులుకు ఓ అర్థం కూడా ఉంది. ఎందుకంటే.. దొంగలు ఎత్తుకెళ్లిన ఏడు బోన్సాయ్ చెట్ల ధర రూ.83 లక్షలు పైమాటే.. అందులో ఈ షిమ్‌పకూ ధరే రూ.40 లక్షలకు పైగా ఉంటుందట. ఈమూరా భర్త సీజీ ఈమూరా కుటుంబం బోన్సాయ్ మొక్కల పెంపకంలో ఐదవతరానికి చెందినవారు. ఐదవ బోన్సాయ్ మాస్టర్ అన్నమాట. ఈ మొక్కని కూడా 400 ఏళ్ళ క్రితం పర్వతప్రాంతం నుంచి తీసుకొచ్చారు. క్రమంగా ఆ మొక్కని బోన్సాయ్గా మార్చడానికి ఈ కుటుంబం వందల ఏళ్ళు కష్టపడింది. ఇప్పుడిది మూడడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు ఉంది. త్వరలో జరగబోయే బోన్సాయ్ ఫెయిర్ కోసం వీటిని సిద్ధం చేసి.. ఫొటోలు గట్రా తీయించారు కూడా.. ఇంతలో ఇలా జరిగిపోయింది.. పిల్లల్లా పెంచుకుంటున్న బోన్సాయ్‌లను దొంగిలించడంతో అల్లాడిపోయిన ఆ కుటుంబం చివరికి ఫేస్బుక్లో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ దొంగలంటే తనకెంతో కోపంగా ఉందని.. అయితే.. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని.. సరిగా చూసుకోకపోతే.. అవి చనిపోతాయని.. ఇది తనకెంతో బాధను కలిగిస్తుందని ఈమూరా అంటున్నారు. ఈమూరా కుటుంబం తమ తోటలోని బోన్సాయ్‌లను చూసేందుకు అందరినీ అనుమతించేవారని.. సీసీటీవీలు వంటి భద్రత ఏర్పాట్లు కూడా లేవని.. దీంతో దొంగల పని సులువైందని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం ఒక్కరోజులో జరిగిందని తాము భావించడం లేదని.. రోజుకొకటి చొప్పున తీసుకెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. దొంగతనం నేపథ్యంలో ఈమూరా ఇప్పుడు తమ బొన్సాయ్ గార్డెన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం!! -
గ్రహాలు పట్టించాయి
అనుమానితుడి ఊహాచిత్రాలను ఫిబ్రవరి 26న విడుదల చేశారు. కంజూర్‌మార్గ్ వైపు మార్గంలో ఉండే సీసీటీవీల ఫుటేజ్‌లన్నీ సేకరించారు. అటోవాలాలు, స్థానికులు, షాపు యజమానులు.. ఇలా అందరినీ విచారించడం ప్రారంభించారు. ‘నా గ్రహాలు బాగున్నాయంటారా?’‘నీ చేష్టలు అనుకూలంగా ఉంటే గ్రహాలు నీకు అనుకూలంగా ఉంటాయ్’‘నా చేష్టలు చెడ్డవి అయితే?’‘గ్రహాలు పగబట్టి పట్టిస్తాయి’జనవరి 5.2014.ఫోన్ రాకపోతే వచ్చే టెన్షన్ ఎలా ఉంటుంది? అదీ మనం ఇష్టపడే మనిషి నుంచి అయితే? జన్మనిచ్చిన సంతానం నుంచి అయితే? మరీ ముఖ్యంగా ఆడపిల్ల నుంచి అయితే? ఆ తల్లిదండ్రులు ఆ టెన్షన్ అనుభవిస్తున్నారు. ఇప్పటికి 24 గంటలు గడిచి పోయాయి వాళ్ల కూతురి నుంచి ఫోన్ వచ్చి.24 గంటలంటే. ఆ అమ్మాయికి ఏం జరిగినట్టు?ఒకరోజు ముందు జనవరి 4, 2014. విజయవాడ.‘అనూ.. నీ రాకతో క్రిస్మస్, న్యూ ఇయర్ హ్యాపీగా గడిచిపోయాయి. ఇప్పుడు వెళుతున్నావ్, మళ్ళీ ఎప్పుడు వస్తావ్’ కూతురు అనూహ్య తలమీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు తండ్రి.‘సమ్మర్లోనే డాడ్. అంటే ఇంకో ఫోర్ మంత్స్. అందుకే మీరే ముంబయ్ రండి..’ నవ్వుతూ బ్యాగ్ భుజానికి వేసుకుంది అనూహ్య. స్టేషన్‌కు బయల్దేరే సమయమైంది. అనూహ్య వారిస్తున్నా వినకుండా తల్లిదండ్రులిద్దరూ రైల్వేస్టేషన్‌కి వచ్చారు కూతురికి సెండాఫ్ ఇవ్వడానికి.‘తెల్లవారి ముంబై చేరగానే ఫోన్ చేయి’... జాగ్రత్తలు చెబుతూ ట్రెయిన్ కదిలేంతవరకు అక్కడే ఉండి, ఇంటి ముఖం పట్టారు తల్లీతండ్రి. ట్రైన్ బయలుదేరింది. తన ఉద్యోగం గురించి తలుచుకుంది అనూహ్య. మంచి ఉద్యోగం. ఇంకొన్నాళ్లు చేస్తే అమెరికాకు కూడా పంపిస్తారు. అమెరికాలో సెటిల్ కావాలి. అమ్మానాన్నలను తీసుకెళ్లాలి. ఎన్నో మంచి పనులు చేయాలి... కలలు.. ప్రతి సగటు మనిషి కనే కలలు... కాని ఆ కలలు కల్లలయ్యే దారుణ ఘడియలు ముందు ఉన్నాయా?మరుసటి రోజు.తెల్లవారి ఫోన్ కోసం ఎదురు చూశారు తల్లిదండ్రులు. రాలేదు. వాళ్లు చేశారు. స్విచ్డాఫ్ వచ్చింది. చార్జ్ అయిపోయి ఉంటుందని ఎదురు చూసి మళ్లీ చేశారు.స్విచ్డాఫ్. ఉదయం పదైపోయింది. ట్రైన్ ఏడుకల్లా చేరిపోతే ఇంకా ఫోన్ ఎందుకు చేయలేదు. హాస్టల్‌కు చేశారు.‘మీ అమ్మాయి ఇంకా రాలేదండీ’ అని చెప్పారు వాళ్లు.మనసు కీడు శంకించడం మొదలైంది.ఆఫీసుకు చేశారు.‘రాలేదే. మెసేజ్ కూడా లేదు’ అని చెప్పారు.కొన్ని ఊహాగానాలు.. కొన్ని సందేహాలు.. కొన్ని ఎదురుచూపులు... కొన్ని నిరీక్షణలు... కొన్ని ఆచూకీ యత్నాలు...24 గంటలు గడిచిపోయాయి.ఒక అమ్మాయి 24 గంటల పాటు ట్రేస్ కాలేదంటే పెద్ద ఉపద్రవం వచ్చినట్టు.వెంటనే పోలీసులను సంప్రదించారు. జనవరి 6న అనూహ్య కిడ్నాప్ అయినట్టు విజయవాడతో పాటు హైదరబాదులోనూ ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముంబై కుర్లా రైల్వేపోలీసులకు ముంబైలో ఉంటున్న అనూహ్య బంధువులు ఫిర్యాదు చేశారు. క్షణాల్లో వార్త మీడియాకు పొక్కింది. సాఫ్ట్వేర్ అమ్మాయి అదృశ్యం. ఆమె ఏమైంది? ఆమెకు ఏమైంది? ఫస్ట్ సోర్స్ పాసింజర్స్.ఆమెతో పాటు ప్రయాణించినవారి అడ్రస్‌లను తీసుకుని వారిని కలిసి అనూహ్య ఫొటో చూపించారు పోలీసులు. ‘ఈమె చివరి వరకూ ప్రయాణించిందా? మధ్యలో దిగిపోయిందా?’పోలీసుల అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. ఏదైనా ప్రేమ వ్యవహారం వల్ల ఎవరైనా అబ్బాయితో వెళ్లిపోయి ఉండొచ్చనే యాంగిల్లో ఆరా తీశారు.‘ఈ అమ్మాయి లోకమాన్య తిలక్ టెర్మినస్లోనే దిగిందండీ’ అని ఒకరిద్దరు చెప్పారు. సో.. అనూహ్య ముంబై చేరింది. టెర్మినస్‌లో దిగింది. ఆ తర్వాత ఏమైంది? జనవరి 16.ముంబై–థాణే ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కంజూరుమార్గ్ ప్రాంతంలో సర్వీసు రోడ్డు పక్కన పొదలలో ఏదో కుళ్లిన వాసన. స్థానికులు గమనిస్తే పొదల్లో యువతి శవం. కుళ్లిపోయిన స్థితిలో.పోలీసులు హడావిడిగా అక్కడకు చేరుకున్నారు. అది అనూహ్య శవమేనని తేలింది. ట్రెయిన్ దిగి నేరుగా అం«థేరి హాస్టల్ గదికి వెళ్లాల్సిన ఆమె కంజూర్మార్గ్వైపు ఎందుకు వెళ్లినట్టు? ఎవరితో వెళ్లింది..? శవం లభించిన స్థలం నుంచి మరో చోట అర కిలోమీటర్ దూరంలో ఆమె దుస్తులతో ఉన్న బ్యాగు లభ్యమైంది. అంటే ఆమె అక్కడే హత్యకు గురైంది. రెండు వారాల అన్వేషణ తర్వాత అనూహ్య శవమై తేలడంతో ముంబైతోపాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేకేత్తించింది. అనూహ్య శవం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. మెల్లగా నిరసన మొదలైంది.అనూహ్య బంధువులు, ముంబైలోని తెలుగు సంఘాలు, స్వచ్చంద సంస్థలు అనూహ్యను హత్య చేసిన నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు.పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది.జనవరి 30.పోలీసులు సీసీ టీ వీ ఫుటేజ్‌లను మళ్లీ మళ్లీ పరిశీలించడం మొదలుపెట్టారు.రైల్వే టెర్మినస్‌లోని ఒక సీసీటీవి ఫుటేజ్‌లో అనూహ్య బయటకు వెళ్తూ కన్పించింది. ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా బయటికి వెళ్తూ కన్పించాడు. ఒకటికి నాలుగుసార్లు చెక్ చేశారు. పరిచయం ఉన్నట్టుగా ఆ వ్యక్తితో మాట్లాడుతూ వెళుతోంది. ఆ వ్యక్తి ఎవరు..? ముందు నుంచే ఆ వ్యక్తి అనూహ్యకు తెలుసా..? హత్య చేసింది ఆవ్యక్తేనా..?అనుమానితుడి ఊహాచిత్రాలను ఫిబ్రవరి 26న విడుదల చేశారు. కంజూర్‌మార్గ్ వైపు మార్గంలో ఉండే సీసీటీవీల ఫుటేజ్‌లన్నీ సేకరించారు. అటోవాలాలు, స్థానికులు,షాపు యజమానులు.. ఇలా అందరినీ విచారించడం ప్రారంభించారు. ఒకతను అతణ్ణి గుర్తుపట్టాడు.‘ఇతను చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యా’ అన్నాడు.నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మఖమలాబాద్ అతని ఊరు అని కూడా తేలింది.వెంటనే బిలబిలమంటూ పోలీసులు అక్కడకు వెళ్లారు. కాని అతడు అక్కడ లేడు.లౌక్యాను ఎలా పట్టుకోవాలి?మళ్లీ వేట మొదలైంది.అతడికి పరిచయం ఉన్నవారందరినీ పోలీసులు పట్టుకొచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టారు.పెద్దగా వివరాలు దొరకలేదు.ఒకతను ‘సార్... అతనికి జాతకాల పిచ్చి. ముంబైలో ఒక సిద్ధాంతి దగ్గరకు తరచూ వెళుతుంటాడు’ అని చెప్పాడు.సిద్ధాంతిని వెతకడం పోలీసులకు కష్టం కాలేదు. ఫోటో చూపించారు.‘ఇతను ఈ మధ్యే వచ్చాడు. నీ టైమ్ బాగలేదని చెప్పాను. శాంతి జరిపించాలని చెప్పాను. మార్చి 2 డేట్ కూడా ఇచ్చాను’ అన్నాడు సిద్ధాంతి.పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2014 మార్చి 2న అంటే సంఘటన జరిగిన 50 రోజుల అనంతరం చంద్రబాన్ సానప్‌ను పోలీసులు గ్రహశాంతి జరగకమునుపే పట్టుకున్నారు. అరెస్టు అయిన చంద్రబాన్ ఈ కేసుకు సంబంధించి చిక్కుముడులన్నింటినీ విప్పాడు. నాసిక్కి చెందిన అతడు ఒక రైల్వే దొంగ. పలు రైల్వేస్టేషనలో సెల్ ఫోన్లు, లగేజీల దొంగతనాలు చేసేవాడుగా కేసులు ఉన్నాయి. కొంతకాలంగా ఈ పని మీదే ముంబైలో ఉంటుంన్నాడు.జనవరి 4న మిత్రులతో కలిసి మద్యం సేవించిన చంద్రబాన్ కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌కి వేకువజామునే దొంగతనానికి వచ్చాడు. కాని ఏం దొరకలేదు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అనూహ్యను చూశాడు. ‘ఎక్కడకు వెళ్లాలి?’ అని అడిగాడు.‘అంథేరి’ అందామె.‘300 ఇవ్వండి. దింపుతాను’ అన్నాడు. సాధారణంగా టాక్సీవాడు ఎక్కువ అడుగుతాడు. ఇతను తక్కువ అడగడంతో ఒప్పుకుని స్టేషన్ బయటకు వచ్చింది.పార్కింగ్ వద్దకు రాగానే అటోకు బదులుగా మోటార్ సైకిల్ ఉండడంతో అనూహ్య ‘ఇదేంటి?’ అంది. ‘మీకు ఎలాంటి భయంలేదు. కావాలంటే నా ఫోన్ నెంబరు, మోటర్ సైకిల్ నెంబరు కూడా తీసుకోండి’ అని చెప్పి ఆమెను ఒప్పించాడు. అప్పటికే ప్రయాణం వల్ల అలసిపోయిన ఆమె త్వరగా హాస్టల్ చేరాలనే ఆలోచనతో అతనితో మోటర్ సైకిల్‌పై వెళ్లేందుకు అంగీకరించింది. మోటార్ సైకిల్‌పై ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కంజూర్‌మార్గ్ వరకు వెళ్లిన తర్వాత పెట్రోల్ అయిపోయినట్టు ఉందని చెప్పి సర్వీస్‌రోడ్డుపైకి మళ్లించాడు.అప్పుడు ఉదయం ఏడు గంటల సమయం. చలి, మంచు వల్ల ఇంకా మబ్బుగానే ఉంది. దీంతో మనుష్య సంచారం అంతగా లేని, పైగా దట్టంగా కమ్ముకున్నట్టుగా ఉన్న చెట్ల దారికి బైక్‌ను మళ్లించాడు. ఆ దారిలో ముందు వెనుకా ఏముందో తెలియనంతగా మంచు ఉంది. అతడు దీన్ని ఆసరాగా తీసుకున్నాడు. సడన్‌గా బండి ఆపాడు. అప్పటి వరకు అతనికి దొంగతనం చేయాలన్న ఆలోచనే ఉంది. ఇప్పుడు పాడు ఆలోచన వచ్చింది.అనూహ్య ఇది గమనించింది. క్షణంలో అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించింది. అతడు ఆమెను పట్టుకున్నాడు. కోపంగా ఆమె తలను భూమికి గట్టిగా బాదాడు. స్కార్ఫ్‌తో గొంతు నులిమాడు. ఆ∙పెనుగులాటలో అనూహ్య ప్రాణాలు విడిచింది. నేరం జరిగే సమయంలో నేరం చేసేవాడు అపస్మారక స్థితికి వస్తాడు. నేరం జరిగిపోయాక ఏం జరిగిందో తెలిసేసరికి ప్రళయం వచ్చినట్టు ఒణికిపోతాడు. చంద్రబాన్ అలాగే ఒణికిపోయాడు. అనూహ్య ల్యాప్‌టాప్‌తో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని కంజూర్‌మార్గ్‌లోకి వెళ్లాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్లో తన సెల్ నెంబరు ఉంటుందని భయపడి మళ్లీ సంఘటన స్థలానికి వచ్చాడు. అయితే సెల్‌ఫోన్ కన్పించలేదు. దీంతో బైక్‌లోని పెట్రోల్‌ను కొంత తీసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. కానీ తగినంత పెట్రోల్ లేకపోవడంతో కుదరలేదు.అక్కడి నుంచి కంజూర్‌మార్గ్‌లోని మిత్రుడు నందకిషోర్‌ను కలిసి అతని బైక్‌ని అతనికి ఇచ్చేశాడు. జరిగినదంత నందకిషోర్‌కు చెప్పి అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో ములూండ్ నుంచి ఓ ట్యాంకర్లో నాసిక్‌కు వెళ్లిపోయాడు. నాసిక్‌కు పారిపోయిన చంద్రబాన్ తన గెటప్‌ను కొంత మార్చుకుని అక్కడే ఉండిపోయాడు. అయితే భయం వల్ల మళ్లీ ముంబైకి రావడం మొదలుపెట్టాడు. జ్యోతిష్యం మీద నమ్మకమున్న చంద్రబాద్ ఓ జ్యోతిష్యున్ని సంప్రదించాడు. జ్యోతిష్యుని ద్వారా తన సమయం బాగాలేదని తెలుసుకున్న చంద్రబాన్ దోషనివారణ పూజలు చేయాలనుకున్నాడు. కాని పాపం చేసినవాడి పూజలు ఫలించవని పోలీసులు చుట్టుముట్టడంతో తెలుసుకున్నాడు.పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి మే 26న 542 పేజీలున్న చార్జీషీటును దాఖలు చేశారు. 76 మంది సాక్షులను విచారించి సంబంధిత ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్టోబరు 27, 2015. కోర్టు చంద్రబాన్‌ను దోషిగా నిర్థారించింది. అక్టోబరు 30న చంద్రబాన్‌కు ఉరి శిక్ష విధించింది. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
అనుమానాల్లేవ్.. అంతా కుట్రే
-
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
నాగర్‌కర్నూల్ క్రైం: ఎన్నికల్లో ఏ చిన్న సంఘటన జరిగినా.. ఫిర్యాదులు వచ్చిన వాటికి సంబం ధిం చిన వీడియోలు, సీసీ కెమెరా పుటేజీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి అధికారి ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తున్నారని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, వీవీ ప్యాట్లపై పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ట్రబుల్ మంగర్స్(ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారు) ను బైండోవర్ చేయాలని, రిటర్నింగ్ అధికారుల తో కలిసి రూట్ మ్యాప్‌ను తయారు చేయాలని సూచించారు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు డీఎస్పీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, వారి నిర్వర్తించే బాధ్యతలను వీడియోలలో చిత్రీకరించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే అధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ఇష్టం వచ్చిన వారికే ఓటు వేసుకునేలా ప్రశాంతమైన వాతావరణం కల్పించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వేసుకోవడానికి రెవెన్యూ అ«ధికారులతో కలిసి వర్ణలేబుల్టీ మ్యాపింగ్ తయారు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన శాంతిభద్రతల నివేదికను ప్రతిరోజూ ఎన్నికల అధికారికి , కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ప్రతి నియోజకవర్గంలోమూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు వీడియోలు తీయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హైపర్ క్రిటికల్, క్రిటికల్ , నార్మల్ పోలింగ్ బూత్‌లను వెంటనే గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లను ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పని తీరు గురించి గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఓటింగ్ మిషన్ ,వీవీ ప్యాట్ల పనితీరు గురించి తెలియజేస్తూ సందేహ నివృత్తి చేయాలన్నారు. వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం వీవీ ప్యాట్ల పనితీరు గురించి కలెక్టర్ శ్రీధర్ మాక్ పోలింగ్ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన ఉండాలి ఈవీఎం, వీవీ ప్యాట్ల గురించి ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండి.. క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఎస్పీ సాయిశేఖర్ ఉంటుందన్నారు. తమ వద్దకు వచ్చి సమాచారం అడిగిన ఓటరుకు వివరాలు సవివరంగా తెలిపేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల మ్యాన్యువల్ చదివి ఉండాలని సూచించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అవగాహన సదస్సులో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహులు, పుష్పారెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పర్సు కొట్టేసి.. జేబులో పెట్టుకోబోయేలోపే
ముంబై : ఓ దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే.. అంతే చాకచక్యంగా ఓ పోలీసు అతన్ని క్షణాల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన మన్మాడ్‌లోని రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. మహారాష్ట్రాలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకోవడానికి వచ్చిన ఓ ప్రయాణికుడి పర్సును దొంగ కొట్టేసి, తన జేబులో పెట్టుకోబోయాడు. అక్కడే ఉన్న ఏఎస్ఐ దీన్ని గమనించి వెంటనే దొంగను పట్టుకున్నాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న ఏఎస్ఐను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే..
-
మీద నుంచి కారు దూసుకెళ్లినా గానీ..
-
మృత్యుంజయుడు ఈ బుడతడు..!
ముంబై : భూమ్మీద నూకలు ఉంటే చావు అంచులదాకా వెళ్లినా సరే బతికి బయటపడొచ్చు అంటారు. ముంబైకి చెందిన ఓ పిల్లాడి విషయంలోనూ ఇదే జరిగింది. మీద నుంచి కారు దూసుకెళ్లినా సరే ప్రాణాలతో బయటపడ్డాడు ఆ బుడతడు. అసలేం జరిగిందంటే.. ముంబైలోని ఘట్కోపర్కు చెందిన ఓ బాలుడు అపార్టుమెంటులోని పార్కింగ్ ఏరియాలో స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో షూలేస్ కట్టుకునేందుకు అతడు కింద కూర్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళ తన కారు(మారుతి వాగనార్)ను స్టార్ట్ చేసింది. అయితే అక్కడ పిల్లాడు ఉన్నాడన్న సంగతి గమనించిందో లేదో గానీ అకస్మాత్తుగా అతడి మీదకి కారు ఎక్కించింది. కాగా ఈ ఘటనలో ఆ పిల్లాడికి చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం. తన మీద నుంచి కారు వెళ్లిపోగానే లేచి యథావిథిగా ఆటను కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
భర్త పెట్టే టార్చర్ భరించలేక...
సాక్షి, ముంబై: భర్త పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన చంటి బిడ్డతోసహా రైల్వే ట్రాక్ మీదకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డ్రైవర్ అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయి ఆ తల్లీకూతుళ్లు నలిగిపోయారు. థానే జిల్లా భాయందర్ రైల్వే స్టేషన్లో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగో ఫ్లాట్ ఫామ్‌పై తన కూతురిని ఎత్తుకుని ఆ మహిళ రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. రైలు దగ్గరికి రాగానే ఒక్కవేటున దూకేసింది. అది గమనించిన డ్రైవర్ బ్రేకులు వేయగా.. అప్పటికే ఆ తల్లీకూతుళ్లు రైలు చక్రాల కింద పడి నలిగిపోయారు. ఆనవాళ్ల ఆధారంగా మృతులను రేణుకా పింటూ(24), ఆరోహి(2)గా నవఘడ్ పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజీల్లో ఆ షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. భర్త వేధింపులు తాళలేకనే ఆమె బిడ్డతో సహా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బుల్లెట్ బండి కొనటానికి డబ్బులు తేవాలంటూ ఆమెను భర్త ఏడాదిగా హింసిస్తున్నాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని రేణుకా తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదుతో రేణుకా భర్త రాహుల్ పింటూ సింగ్ యాదవ్‌ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. -
సీసీటీవీ కెమెరాలు చేధించిన మరో కేసు
-
అమాంతం గొంతు పట్టేసి.. షాకింగ్ దొంగతనం!
న్యూఢిల్లీ : వీధిలో ఒంటరిగా వెళుతున్న యువతిని చేతులతో బంధించి ఆమె మెడలోని బంగారు నగలను, మొబైల్ ఫోన్‌ను దోచుకెళ్లాడు ఓ దొంగ. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీలోని మాన్సరోవర్ పార్క్ ఏరియాలో ఓ యువతి రాత్రి 8-30గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఓ దొంగ ఆ యువతిని కొద్దిదూరం అనుసరించాడు. అదును చూసి ఆమెను గట్టిగా చేతులతో బంధించి పట్టుకున్నాడు. ఆ యువతి విడిపించుకోవటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పెనుగులాటలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్ ఫోన్ లాక్కుని అక్కడినుంచి పరుగులు తీశాడు. అక్కడే ఆ దొంగ కోసం వేచి ఉన్న బైక్‌లో ఎక్కి అక్కడినుంచి పరారయ్యాడు. నిస్సహాయురాలైన ఆ యువతి మెల్లగా లేచి సహాయం కోసం చూసి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
టీటీవీ దినకరన్ ఇంటిపై బాంబు దాడి సీసీటీవీ ఫుటేజ్
-
బారికేడ్‌ను విరగ్గొట్టి వీరంగం సృష్టించిన ఎమ్మెల్యే
-
టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే వీరంగం
త్రిసూర్, కేరళ : టోల్ ఫీజు కట్టమంటూ తన వాహనాన్ని ఆపేయడంతో ఆగ్రహానికి గురైన ఓ ఎమ్మెల్యే బారికేడ్‌ను విరగ్గొట్టి వీరంగం సృష్టించారు. కేరళకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ తన ఆడీ కారులో రైల్వే స్టేషనుకు బయల్దేరారు. జార్జ్ కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గమనించని టోల్ ప్లాజా సిబ్బంది ఆయన కారును చాలా సేపు ఆపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జార్జ్ కారులో నుంచి దిగి ఆటోమేటిక్ బారికేడ్‌ను ధ్వంసం చేశారు. ఇందుకు ఆయన డ్రైవర్ కూడా సాయం చేశాడు. తర్వాత టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ తతంగమంతా టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ విషయమై టోల్ ప్లాజా సిబ్బంది నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. నాకు వేరే ఆప్షన్ లేదు... ఈ ఘటనపై స్పందించిన జార్జ్ మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషనుకు వెళ్లాల్సిన తొందరలో ఉన్నాను. టోల్ ప్లాజా సిబ్బంది నా కారుపై ఉన్న స్టిక్కర్‌ను చూశారు. అయినా కూడా చాలా సేపటిదాకా వెయిట్ చేయించారు. ఈలోగా నా వెనుక ఉన్న వాహనదారులు హారన్ కొట్టడం ప్రారంభించారు. దీంతో నాకు కోపం వచ్చింది. నాకు వేరే ఉపాయం కనిపించలేదు’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా గతంలోనూ జార్జ్ ఇటువంటి చర్యలతో పలుమార్లు వార్తల్లోకెక్కారు. తనకు చెందిన హాస్టల్లో క్యాంటీన్ బాయ్ భోజనం ఆలస్యంగా తీసుకొచ్చాడన్న కారణంతో జార్జ్ అతడిపై దాడి చేశారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. -
సినిమాను తలపించే లైవ్ సూసైడ్..
సాక్షి, ముంబై: ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తూ.. వెనుక వస్తున్న రైలు ముందుకు దూకాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డవ్వడంతో ఘటన బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో ఓ రైలు అతని వెనుక నుంచి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన వ్యక్తి ఒక్కసారిగా రైలు ముందుకు దూకాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియాల్సి ఉంది. -
పుణేలో పసిపాపపై అఘాయిత్యం
సాక్షి, పుణే: అభం శుభం తెలియని మరో పసిపాప మృగాడి దురాగతానికి బలైపోయింది. అమ్మానాన్నల పక్కన ఆదమరిచి నిద్ర పోతున్న ఏడాది వయసున్న పసిపాపను ఎత్తుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. పుణెలోని లోనికాల్బార్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని మల్హరి బాన్సోద్(22)గా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు అతగాణ్ని అరెస్టు చేశారు. బుధవారం అర్థరాత్రి పాపను ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు మల్హరి. అనంతరం పాప తలను నేలకోసి కొట్టి హత్య చేశాడని లోని కల్బర్ పోలీసు స్టేషన్ సీనియర్ అధికారి వెల్లడించారు. పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని లోని కల్బార్ స్టేషన్ పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన తాము శుక్రవారం తెల్లవారుఝామున పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు పాపపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదకలో తేల్చడంతో ఆ వైపుగా పోలీసులు మల్హరిని విచారించారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా బాధిత శిశువు తల్లితండ్రులు తమిళనాడుకు చెందిన వారు. రోజుకూలీలుగా పనిచేస్తూ పుణేలో జీవిస్తున్నారు. -
పెనుమాక చోరీ కేసులో కోడలే నిందితురాలు
-
పసికందును చర్చిలో వదిలేశారు..
కొచ్చి: నవ మాసాలు మోసిన ఆ తల్లికి పుట్టిన రెండు రోజులకే పాప నచ్చలేదో.. ఆ తండ్రికి ఆ బిడ్డ ఏం పాపం చేశాడో..లేక ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ రెండు రోజుల పసికందుని చర్చిలో వదిలేసి వెళ్లారు ఓ జంట. ఈ విచార ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేరళలోని త్రిశూర్ సమీపంలోని సెయింట్ జార్జ్ ఫోర్నే చర్చి వద్ద శుక్రవారం సాయంత్రం ఓ జంట రెండు రోజుల పసికందుని వదిలి వెళ్లారు. వారు వెళ్లాక కొద్ది సేపటికి అక్కడి భద్రత సిబ్బందికి పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూసే సరికి చర్చి ప్రాంగణంలో పసికందు ఏడుస్తూ కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ పాపను ఆసుపత్రికి తరలించారు.సీసీ పుటేజీ పరిశీలించగా శుక్రవారం సాయంత్రం 8.15గంటలకు ఆ జంట మరో బిడ్డతో వచ్చి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్లారు. వెళ్లే ముందు పాప నుదిటిపై ఓ ముద్దు కూడా పెట్టారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా పాప తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను వదిలి వెళ్లాడానికి గల కారణాలు విచారణ తర్వాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. -
22 రోజులు శ్రీవారి పోటును ఎందుకు మూసేశారు?
-
క్షణం ఆలస్యమై ఉంటే.. శవమయ్యేవాడు
సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి బయటపడినపుడు పొద్దున లేచిన ఘడియ మంచిదయింది లేకపోతే ఏం అనర్థం జరిగేదోనని అనుకోవడం చాలా మందికి అలవాటు. మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు కూడా అలాగే అనుకోవాలేమో. అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శాస్త్రినగర్ మెట్రో స్టేషన్లో మయూర్ పటేల్ ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ఆగి ఉన్న రైలు ముందు నుంచి ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో రైలు కదలడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. అయితే అతడు రావడాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపడంతో మయూర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో మయూర్‌కి జరిమానా విధించడంతో ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు అధికారులు. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలా వెళ్లాలో తనకు తెలీదని, అందుకే ట్రాక్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించానని తాపీగా సమాధానం చెప్పాడు. మయూర్ సమాధానం విన్న అధికారులు అవాక్కవ్వడంతో పాటు.. కాస్త అసహనానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. -
లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
-
‘గాలి’ దొంగ.. అంతా షాక్!
షాపింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి కారు చోరీకి గురైంది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాధితుడు పోలీసులకు ఫోన్ చేసి తన కారు వివరాలు చెప్పి, చోరీ అయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగన పోలీసులు ఆరా తీయగా చోరీ చేసింది ఎవరో తెలిసి అవాక్కయ్యారు. గాలి వల్లే కారు చోరీకి గురైందని తేలడంతో ఓనర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. చైనాలోని క్విగ్డావోలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వింగ్డావో పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన కారులో షాపింగ్‌కు వెళ్లాడు. కొంతసేపటికి వచ్చి చూస్తే కారు మాయమైంది. కారు పార్కింగ్ చేసిన ప్రాంతం లో లేదని, చోరీ చేశారని పోలీసులకు ఫోన్ చేశాడు. షాపింగ్‌కు వెళ్లి అరగంటకు బయటకు రాగా తన కారు చోరీకి గురైనట్లు గుర్తించానని తెలిపాడు. అయితే సీసీటీవీ ఫుటేజీ చూసిన పోలీసులు గాలి వల్ల కారు ముందుకు కదిలిందని కొంతదూరం అలాగే వెళ్లిన తర్వాత ఆగిపోయిందని తేల్చేశారు. పార్కింగ్ చేసిన సమయంలో హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. భారీ గాలులకు కారు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయినట్లు బాధితుడికి వివరించారు. హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్న ఓనర్ కారులో ఇంటికి వెళ్లిపోయాడు. -
ఏఎస్సై మోహన్‌రెడ్డికి పోలీసుల రాచమర్యాదలు
-
బ్యాంక్ నుంచి నగదు ఎత్తుకెళ్లిన బాలుడు!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఉన్న స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌లో శుక్రవారం దొంగతనం జరిగింది. బ్యాంకులోకి వచ్చిన ఓ 12 ఏళ్ల కుర్రాడు కాసేపు అటు ఇటు తిరిగి.. ఆ తర్వాత రూ. 3 లక్షల నగదు ఉన్న ఓ బ్యాగును దొంగిలించాడు. అదేదో ఇంట్లో నుంచి స్కూలు బ్యాగ్ తీసుకెళ్లినట్లు ఏ మాత్రం బయం లేకుండా నగదు ఉన్న బ్యాగ్‌ను చేతపట్టుకెళ్లాడు. బ్యాంకు అధికారులు నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
బాలుడు బ్యాంక్ నుంచి 3 లక్షలు చోరీ
-
మరొకరితో తిరుగుతోందని కూతురి గొంతుకోశాడు!
సాక్షి, ఢిల్లీ : బంధాలు బంధుత్వాలు మంట కలిసిపోతున్నాయి. ఓ కిరాతకపు తండ్రి కన్న కూతురు మరో యువకునితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణం ఢిల్లీలోని కరవాల్ నగర్లో చోటుచేసుకుంది. డీసీపీ ఏకే సింగ్లా తెలిపిన వివరాల ప్రకారం.. కరవాల్ నగర్‌కు చెందిన సుదేశ్ కుమార్ అనే వ్యక్తి కూతురు ఇంటి పక్కనే ఉన్న ఓ యువకునితో స్నేహంగా ఉండటంతో చాలా సార్లు వారిద్దరిని హెచ్చరించాడు. అయినా వారు వినకుండా తరచూ కలుసుకుని మాట్లాడుకోవడం చూసి కుమార్ సహించలేకపోయాడు. అయితే ఈ నెల 7న సుదేశ్ కూతురుని తమ నివాసానికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రొనికా నగర శివారుకి బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ఓ డ్రైనేజీ కాలువ వద్దకు తనను తీసుకెళ్లి గొంతుకోసి అందులో పడేశాడు. ఆపై కుటుంబ సభ్యులతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కూతురు కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐపీసీ 363 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులకు మురికి కాలువలో మృతదేహం ఉందనే సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలించగా అందులో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై మురికి కాలువ వైపు పోవటాన్ని గమనించారు. అందులో ఉన్న వ్యక్తి సుదేశ్ కుమార్లా ఉండటంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. మరొకరితో సన్నిహితంగా ఉంటుదన్న కారణంతో తనను హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేజ్రీవాల్ ఇంట్లో సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్
న్యూ ఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే సూచనలే కన్పిస్తున్నాయి. సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి సేకరించిన సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్ జరిగినట్టు తెలుస్తుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కేజ్రీవాల్‌ని ఇది మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ బెయిల్ పిటిషన్‌పై తీస్ హజారి అడిషనల్ సెషన్ష్ కోర్టు జడ్జీ అంజు బజాజ్ చందన విచారణ చేపట్టారు. సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లాడని చెబుతున్న సమయానికి, సీసీటీవీలో నమోదైన సమయానికి మధ్య వ్యత్యాసం ఉందని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ సలహాదారుడు వీకే జైన్ సీఎస్ అర్థరాత్రి తర్వాత సీఎం నివాసానికి వచ్చారని పేర్కొన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. దీనిపై డిఫెన్స్ లాయర్ బీఎస్ జూన్ వాదిస్తూ సీసీటీవీలో సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి 11.24 గంటలకు వచ్చి, 11.31 కు వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. ఇది పోలీసులు చెబుతున్న సమయానికి దాదాపు నలభై నిమిషాల తేడా ఉందన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే ఏది నిజమో తెలుస్తోందన్నారు. దీనిపై పబ్బిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే జర్వాల్‌పై ఇంతకు ముందు అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జూన్, అతను ఏ కేసులోను దోషిగా తెలలేదన్నారు. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొన్నారు. ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించక ముందే కేసు నమోదు చేశారన్నారు. అందువల్ల ఈ కేసుని పరిగణలోకి తీసుకొకూడదని అన్నారు. ఈ దాడి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరగలేదని, సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూంలో జరిగిందని ఆడిషనల్ డీసీపీ హీరేంద్ర సింగ్ కోర్టుకి తెలిపారు. జర్వాల్ గతంలో కింది స్థాయి అధికారులపై దాడి చేశాడని, ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారిపై దాడికి పాల్పడ్డడాని పేర్కొన్నారు. జర్వాల్ బెయిల్ ఫిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు వెల్లడించనుంది. -
దారుణం.. ఎత్తుక్కెళ్లి మరీ రేప్ చేయబోయాడు
వాషింగ్టన్ : కాఫీ షాప్‌లో పని చేసే ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించటంతో బెదిరించి బయటకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చివరకు ఎలాగోలా ఆమె అతని నుంచి తప్పించుకుంది. వాషింగ్టన్‌లోని కెంట్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ‘హాటీ షాట్స్ ఎస్ప్రెస్సో’ అనే ఓ కాఫీ షాపు ఉంది. కస్టమర్లకు బికినీ వేసుకుని 30 ఏళ్ల మేడ్లైన్ గుయింటో అనే మహిళ కాఫీ సర్వ్ చేస్తుంటుంది(ఈ టైప్ రెస్టారెంట్లు అక్కడ సహజం). ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె తన పని చేసుకుంటుండగా.. కిటికీ గుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో ఆమెను కత్తితో బెదిరించి కిటీకి గుండానే బయటకు ఎత్తుకెళ్లాడు. ‘చీకట్లో అతని నుంచి తప్పించుకునేందుకు శాయశక్తుల కృషి చేశా.. కానీ, లాభం లేకపోయింది. బయటకు తీసుకెళ్లాక అతను నన్ను గాయపరిచాడు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అరిచా. నేను అంత ప్రతిఘటిస్తానని బహుశా అతను ఊహించకపోయి ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు’ అని ఆమె ఆ భయానక ఘటనను గుర్తు చేసుకుంటోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి నేర చరిత్ర ఉందని.. ఓ దోపిడీ కేసులో పదేళ్ల శిక్ష అనుభవించిన రేనాల్డ్స్ గత సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడంట. కెంట్ పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ -
కాఫీ షాప్ నుంచి ఎత్తుక్కెళ్లి మరీ..
-
గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో
సాక్షి, గాంధీనగర్ : ఆ యాక్సిడెంట్ వీడియో చూసిన ఎవరైనా సరే.. వారు కచ్చితంగా చనిపోయి ఉంటారనే అనుకుంటారు. అంత ఘోరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఆ యాక్సిడెంట్ జరిగింది. అయితే, అదృష్టం కొద్ది వారు ప్రాణాలతో బయటపడ్డారు. సీసీటీవీలో రికార్డు అయిన ఆ రోడ్డు ప్రమాదం గుజరాత్‌లోని ఏడారి ప్రాంతమైన బనస్కాంతలో చోటుచేసుకుంది. సరిగ్గా ప్రేమికుల రోజున తన కూతురు, భార్యతో మోటారు వాహనంపై వెళుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ ట్రక్కు వారిని అమాంతం ఢీకొట్టింది. దీంతో వారి వాహనం వారు ముగ్గురు తలా ఓ దిక్కున విసిరి వేసినట్లుగా పడ్డారు. అదృష్టం కొద్ది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. -
ఒళ్లు గగొర్పుడిచేలా యాక్సిడెంట్
-
పసికందును అమ్మజూపి..ఆపై హత్య చేసి..
-
చిన్నారి ఛాతీపై తుపాకీ పెట్టి మరీ...
ఇండోర్ : చిన్నారి ఛాతీపై తుపాకీ ఎక్కుపెట్టి ఓ వ్యక్తి దోపిడీకి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఏటీఎమ్ సెంటర్లోకి ముసుగుతో ప్రవేశించిన ఓ వ్యక్తి.. డబ్బులు డ్రా చేస్తున్న జంటను బెదిరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇండోర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎమ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఓ జంట తమ పిల్లాడితో డబ్బులు డ్రా చేయటానికి లోపలికి వెళ్లింది. ఇంతలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. అతన్ని నిలువరించే యత్నం చేయగా.. గన్ గురిపెట్టాడు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా.. సదరు వ్యక్తి ఎదురు తిరిగే యత్నం చేశాడు. వెంటనే దొంగ తుపాకీని అతని కొడుకువైపు మళ్లించాడు. దీంతో చేసేదిలేక ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేసి దొంగ చేతికి ఇచ్చేశాడు. ‘‘రాంగ్ పిన్ నంబర్ కొట్టి కాసేపు కాలయాపన చేయాలని యత్నించా. ఈలోపు ఎవరైనా వస్తారేమోనని అనుకున్నా. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు’’ అని బాధితుడు తెలిపాడు. ఘటన తర్వాత స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు అతను వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఏటీఎమ్‌లో గన్‌తో బెదిరించి దోపిడీ