వృత్తాల్లో ఆత్మల చిత్రం, (పై చిత్రంలో) సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు
పోలీసులంటే సామాన్య ప్రజలకు హడల్. అటువంటి పోలీసులకే నిద్రలేకుండా చేస్తున్నాయట ఆత్మలు. నేటి డిజిటల్ యుగంలోనూ ఇలాంటివేమిటని కొట్టిపారేయకండి. తుమకూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో దయ్యాల సంచారం ఖాకీలకు, ప్రజలకు భీతిగొలుపుతోంది.
తుమకూరు : తుమకూరు జిల్లాలోని శిర తాలూకాలోని 4వ జాతీయ రహదారిపై ఉన్న కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్‌ను దెయ్యాల భయం ఆవహించింది. స్టేషన్‌లోని సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు అందులో రెండు ఆకారాలు స్టేషన్ ఆవరణలో సంచరించడం చూసి భయంతో వణికిపోయారు. బూడిద రంగులోని చుక్కల వంటి ఆకారాలు స్టేషన్ లోపలికి, బయటకు తిరగడం వీడియోలో కనిపించింది. ఆ సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు ఇప్పుడు టీవీ చానెళ్లలో ప్రసారం కాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తరచూ రోడ్డు ప్రమాదాలు
కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతి రోజూ ప్రమాదాల్లో కనీసం ఇద్దరైనా మృత్యువాత పడుతుంటారు. గతంలో కూడా పలు ఘోరమైన రోడ్డు ప్రమాదాలో కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి లభించని ఆత్మలు దెయ్యాలై పోలీస్‌స్టేషన్‌లో తిరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
దెయ్యాలున్నట్లు వదంతులు వ్యాపించడంతో రాత్రి వేళల్లో స్టేషన్ చుట్టుపక్కలకు రావడానికి ప్రజలు భీతిల్లుతున్నారు. రాత్రి వేళల్లో స్టేషన్‌లో పనిచేయడానికి స్టేషన్ సిబ్బంది కూడా జంకుతున్నారు. దయ్యాలను పారదోలడానికి ఏం చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment