పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు | Rajasthan Train Running on the Track hits suv Cisf Personal cctv Footage | Sakshi
Sakshi News home page

పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు

Published Sun, Mar 23 2025 8:33 AM | Last Updated on Sun, Mar 23 2025 8:33 AM

Rajasthan Train Running on the Track hits suv Cisf Personal cctv Footage

సూరత్‌గఢ్‌: రాజస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. సూరత్‌గఢ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ సమీపంలోని ఒక లెవెల్‌ క్రాసింగ్‌పై కేంద్ర పోలీసు బలగాలకు చెందిన ఎస్‌యూవీని ఒక రైలు బలంగా ఢీకొంది(Rajasthan Hits SUV). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ‍ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌యూవీ కారులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌)నకు చెందిన ముగ్గురు జవానులు ఉన్నారు. ఈ కారు పట్టాలపైకి చేరుకోగానే రైలు బలంగా ఢీకొని కొంత దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. దీనికి కారణమేమిటన్నదీ ఇంకా వెల్లడికాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో ఉన్న దృశ్యాన్ని చూస్తే ఈ పట్టాల మీదుగా రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో అటు రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను నిలువరించేందుకు ఎటువంటి గేటు లేదు.  
 

వీడియోను పరిశీలనగా చూస్తే ఎస్‌యూవీని నడుపుతున్న డ్రైవర్‌కు అటుగా రైలు వస్తున్న సంగతి తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన ఒక సీఐఎస్‌ఎఫ్‌ జవాను కారు నుంచి బయటకు దూకి పారిపోయారు.  ఇంతలో రైలు ఆ ఎస్‌యూవీని ఢీకొంది. కారులోని ఇద్దరు జవానులు బయటపడేంతలో ఆ రైలు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌ గేమింగ్‌కు రూ. 3.26 కోట్ల ప్రభుత్వ సొమ్ము.. పంచాయతీ అధికారి అరెస్టు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement