
రైళ్లు స్టేషన్లలో ఆగినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రధాన స్టేషన్లలో వద్దో, జంక్షన్ల వద్దో ట్రైన్లను శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉండటం మనకు తరుచు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. దానికో ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. అది కూడా ట్రైన్ కదులుతున్నప్పుడే క్లీనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. మనోడికి ఆ ట్రైన్ నీట్ గా కనిపించలేనట్లు ఉంది. అందుకే అలా క్లీనింగ్ చేసినట్లు ఉన్నాడు.
రైల్వే ట్రాక్ పక్కగా ఉండే వాటర్ \హోస్ తీసుకుని వచ్చే వెళ్లే ట్రైన్లపై నీళ్లు కొడుతూ ఉన్నాడు. అయితే ఒక ట్రైన్ పై వాటర్ హోస్ తో క్లీన్ చేయడాన్ని ఒక యూజర్ తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ‘రెడ్డిట్’ తన ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మనోడికి ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు’ అని ఒకరు రియాక్ట్ కాగా, ప్యాసింజర్ల పై కోపంలా ఉంది. ప్రత్యేకంగా ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న ప్రయాణికుల్నే టార్గెట్ చేసి అలా వాటర్ స్ప్రే చేస్తున్నాడు’ అని మరొకరు స్పందించారు. ‘ ఇలా కొడితే ట్రైన్ ఖాళీ అయ్యి తనకు సీట్ దొరుకుతుందని కాబోలు’ అని మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యారు.

Comments
Please login to add a commentAdd a comment