hoses
-
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
రైళ్లు స్టేషన్లలో ఆగినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రధాన స్టేషన్లలో వద్దో, జంక్షన్ల వద్దో ట్రైన్లను శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉండటం మనకు తరుచు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. దానికో ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. అది కూడా ట్రైన్ కదులుతున్నప్పుడే క్లీనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. మనోడికి ఆ ట్రైన్ నీట్ గా కనిపించలేనట్లు ఉంది. అందుకే అలా క్లీనింగ్ చేసినట్లు ఉన్నాడు.రైల్వే ట్రాక్ పక్కగా ఉండే వాటర్ \హోస్ తీసుకుని వచ్చే వెళ్లే ట్రైన్లపై నీళ్లు కొడుతూ ఉన్నాడు. అయితే ఒక ట్రైన్ పై వాటర్ హోస్ తో క్లీన్ చేయడాన్ని ఒక యూజర్ తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ‘రెడ్డిట్’ తన ఖాతాలో పోస్ట్ చేసింది.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మనోడికి ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు’ అని ఒకరు రియాక్ట్ కాగా, ప్యాసింజర్ల పై కోపంలా ఉంది. ప్రత్యేకంగా ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న ప్రయాణికుల్నే టార్గెట్ చేసి అలా వాటర్ స్ప్రే చేస్తున్నాడు’ అని మరొకరు స్పందించారు. ‘ ఇలా కొడితే ట్రైన్ ఖాళీ అయ్యి తనకు సీట్ దొరుకుతుందని కాబోలు’ అని మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యారు. -
రెండిళ్లలో చోరీ
కారేపల్లి : కారేపల్లిలోని రెండు ఇళ్లలో గురువారం చోరీ జరిగింది. సమ్మక్క సరక్క జాతరకు కుటుంబసమేతంగా వెళ్లిన ఇళ్ల తాళాలను దొంగలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. బాధితులు తెలిపిన వివరాలు.. మేదర బజార్‌కు చెందిన చింతల రాంబాబు కుటుంబం, అంబేడ్కర్ సెంటర్ మెయిన్ రోడ్‌లోని ముద్ద నూరి లక్ష్మీనారాయణ కుటుంబం కలిసి మేడారం జాతరకు మంగళవారం వెళ్లారు. జాతర వెళ్లిన సంగతి తెలుసుకున్న దొంగలు ఆ ఇళ్లకు వేసిన తాళాలను పగలగొట్టారు. బీరువాలను గడ్డపార, పట్టుకారులతో పగలగొట్టారు. రాంబాబు ఇంట్లో వెండి పట్టీలు, గ్లాసులు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. లక్ష్మీనారాయణ ఇంట్లో నుంచి విలువైన సామానుతోపాటు కొంత నగదు చోరీ చేశారు. రాంబాబు ఇంటి తలుపు తాళాలు తీసి ఉండడం, లోపలికి కోతులు వెళుతుండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. చోరీ జరిగినట్టుగా గమనించి ఇంటి యజమానికి ఫోన్లో సమాచారమిచ్చారు. రాంబాబు, లక్ష్మీనారాయణ, వారి కుటుంబీకులు తిరిగొచ్చారు. లక్ష్మీనారాయణ ఇంట్లో కూడా చోరీ జరిగిన విషయం.. వారు వచ్చిన తర్వాతనే బయటపడింది. -
నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి
కర్నూలు(టౌన్): నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆశాఖ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో మొదటి దశలో 18,618 ఇళ్లు మంజూరు అయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పేరుతో జిల్లాలో 1.89 లక్షల మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కను జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలను జిల్లాలో 13, 733 ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ఈ– ఆఫీసు పాలన అమలు చేయాలన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, పట్టణ ప్రణాళిక విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి, ఎమ్మిగనూర్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు.