
అరుదైన దృశ్యం.. నాగుపాముకు ఓ వ్యక్తి బాటిల్‌తో నీరు తాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా మంగళవారం షేర్ చేయడతో వైరల్‌గా మారింది. దీనికి ‘ప్రేమ, నీరు.. ఈ రెండు జీవితంలో ముఖ్యమైనవి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న నాగుపాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి వాటర్ బాటిల్ అందించాడు.
అప్పుడు ఆ పాము నీరు గుటగుట తాగేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 9వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘విషపూరితమైన నాగుపాముకు అంత దగ్గర వెళ్లడమంటే సాధారణ విషయం కాదు’, ‘ధైర్యం, కరుణ రెండూ ఒకేసారి పనిచేస్తున్నాయి’, ‘ఇది నిజంగా నమ్మశక్యం కాని దృశ్యం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Love & water...
— Susanta Nanda IFS (@susantananda3) February 16, 2021
Two best ingredients of life pic.twitter.com/dy3qB40m6N
(చదవండి: త్వరపడండి: పద్యాలు చెప్తే లీటర్ పెట్రోల్ ఉచితం!)
(ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ)
Comments
Please login to add a commentAdd a comment