రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం (గాల్‌బ్లాడర్) నుండి ఒకటీ రెండూ కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
బుండి జిల్లా పదంపురకు చెందిన ఒక పెద్దాయన కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడేవారు. దాదాపు సంవత్సర కాలంగా చికిత్స తీసుకుంటున్నా, ఫలితంలేదు. దీంతో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అతనికి నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద రాళ్లను గుర్తించారు. గ్లాల్ బ్లాడర్ సైజు సాధారంగా 7x4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ 12x4 సెం.మీకి పెరిగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అతనికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.
పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని, అదే అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు .ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయాన్ని తొలగించి, మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఆపరేషన్‌కు దాదాపు 30 -40 నిమిషాలు పట్టిందట. అంతేకాదు ఈ రాళ్లను లెక్కించేందుకు రెండున్నర గంటలు సమయం పెట్టింది. ఆపరేషన్ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.
పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి?
జీర్ణక్రియకు తోడ్పడేలా కాలేయం ఉత్పత్తి చేసే ద్రవం అయిన పిత్తాన్ని తయారు చేసే పదార్థాలలో అసమతుల్యత ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం క్రింద ఉన్న చిన్న అవయవం పిత్తాశయంలో రాళ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ ఎక్కువైనపుడు రాళ్లు వస్తాయి. తయారవుతాయి. ఇవి ఇసుక రేణువులంత చిన్న పరిమాణం నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్ద పరిమాణంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల పిత్తాశయంలో చాలా రాళ్లు వస్తాయి. అతి వేగంగా బరువు తగ్గడం లేదా యో-యో డైటింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవనశైలి, ఆహార అలవాట్లు, అంటే ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ , కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం ప్రధాన కారణమని డాక్టర్ జిందాల్ అభిప్రాయపడ్డారు. వీటినిసకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమైన కేన్సర్‌కు దారి తీయవచ్చని డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment