kota
-
ఖాళీ అవుతున్న కోచింగ్ సిటీ.. ఆత్మహత్యలే కారణమా?
కోటా: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్‌లోని కోటాలోగల కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిపోతోంది. ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, హాస్టల్ యాజమాన్యాలు ఏంచేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నాయి.కోచింగ్‌పై తొలగిన బ్రమకోటాలోని కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ఇంతవరకూ ఉన్న బ్రమలు తొలగిపోవడమైతే, మరొకటి విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడమేనని చెబుతున్నారు. అలాగే లెక్కకుమించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వీరు అందించే విద్యానాణ్యత తగ్గిపోతున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.వేల కోట్ల టర్నోవర్‌కు గండికోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1.10 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35 శాతం తక్కువ. రూ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు రూ.3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది.కనీస హాస్టల్ అద్దె కూడా కరువు2018 నుంచి 2022 వరకు ఒకరికి నెలకు హాస్టల్ అద్దె రూ.15-16 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు ఒకరి నుంచి రూ. 3000 కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. నెలకు రూ.2500 అద్దె తీసుకున్నా 30 శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు. స్థానికంగా చాలా మంది అప్పులు చేసి హాస్టళ్లు నిర్మించుకున్నారని, విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు.ఆత్మహత్యలే కారణమా?స్థానికంగా ఉన్న హాస్టళ్లు గతంలో విద్యార్థులను పీడించిమరీ డబ్బులు వసూలు చేశాయని, అందుకే వాటికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి ఇక్కడ చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువు ఒత్తిడే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా కోటాకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.ప్రముఖ కోచింగ్ సెంటర్లకు మరిన్ని బ్రాంచీలుమరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దేశంలోని వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి. 2020 వరకు 10 కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 80 నుండి 100 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంట్లర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.పరిష్కారం కోసం మల్లగుల్లాలుప్రస్తుతం కోటా కోచింగ్ పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న హాస్టళ్ల యజమానులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరిష్కారం దిశగా యోచిస్తున్నారు. విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే కోచింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కూడా కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
కోటా జోరుకు కళ్లెం
కోటా: రాజస్తాన్‌లోని కోటా. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా పేరున్న నగరం. విద్యార్థులతో కళకళలాడుతూ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కాసులు కురిపించే ఈ నగరం కళ తప్పుతోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి కాలంలో కోటాకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? శిక్షణ కోసం వచ్చే విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, కోచింగ్ సెంటర్లను వేరే ప్రాంతాలకు విస్తరించడం వంటి కారణాలూ దీని వెనుక ఉన్నాయని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదనే నిబంధన వల్ల ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోటాకు ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు విద్యార్థులు వస్తుంటారు. వీరి వల్ల నగరంలోని అన్ని రంగాలకు కలిపి ఏటా సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం ఉండేది. అయితే, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్ష వరకు తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయం కూడా ఈసారి ఒక్కసారిగా సగానికి సగం, రూ.3,500 కోట్లకు పడిపోయింది.నిర్వాహకుల ధీమాఅత్యుత్తమ శిక్షణకు కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని, విద్యార్థులకు ఇతర నగరాల్లో లేనటువంటి అనుకూల వాతావరణం ఇక్కడ ఉన్నందున ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్తాన్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కౌన్సిల్ జోనల్ చైర్ పర్సన్ గోవింద్రామ్ మిట్టల్ బల్లగుద్ది చెబుతున్నారు. బెంగళూరులో మాదిరిగా కోటాలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలనూ పారిశ్రామిక వేత్తలు పరిశీలిస్తున్నారని వివరించారు. ప్రైవేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో సగానికి సగం, నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ పారిశ్రామికవేత్తలు..ఐటీ హబ్‌లను కోటాకు మార్చాలంటూ బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిప తులను కోరడం, కొందరు ఓకే అనడం జరిగిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్, కోటా–బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైందని ఆయన వివరించారు.వాయిదాలకు సైతం కష్టంగా ఉంది‘గతేడాది వరకు రోజులో 60 మంది వరకు విద్యార్థులు నా ఆటోలో ప్రయాణించే వారు. మంచి ఆదాయం ఉండటంతో కుటుంబ పోషణ ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఉండేది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 20కి తగ్గింది. ఆదాయం కూడా పడిపోయింది. రుణంపై కొనుగోలు చేసిన వాహనానికి కిస్తీలు చెల్లించేందుకు సైతం ఇబ్బందవుతోంది’అని స్థానిక ఆటో డ్రైవర్ ఒకరు చెప్పారు.ఇబ్బందుల్లో హాస్టళ్ల యజమానులుకోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిన మాట నిజమేనని కోటా హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ ఒప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 30 శాతం నుంచి 40 శాతం మేర పడిపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పలు హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్న కొందరు యజమానులు వాయిదాలు చెల్లించలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నగరంలో ఉన్న 4,500 హోటళ్లలో చాలా చోట్ల విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు 40–50 శాతానికి మధ్య పడిపోయిందన్నారు. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆత్మహత్యల పరంగా చూసే దేశంలోని 50 నగరాల తర్వాత దిగువన కోటా ఉంది. అయితే, ఆత్మహత్య ఘటనల ప్రచారంతో ప్రతికూల ప్రభావం పడింది’అని నవీన్ అన్నారు. హాస్టళ్లలో రూం అద్దెలు నెలకు రూ.15వేలుండగా ఇప్పుడది రూ.9 వేలకు తగ్గిందని, చాలా హాస్టళ్లు ఖాళీగానే ఉన్నాయని స్థానిక కోరల్‌పార్క్ ప్రాంతంలోని హాస్టల్ యజమాని ఒకరన్నారు. -
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
కోటా: రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు.500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న ఈ రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ రావణుని బొమ్మ తన మెడను పక్కకు తిప్పి, కత్తిని ప్రయోగించనుంది. ఈ బొమ్మను తయారు చేసేందుకు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్టోబర్ 12న దసరా సందర్భంగా రావణ దహనం జరగనుంది. అలాగే ఇక్కడ దసరా జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.రావణునితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలను కూడా దహనం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. కోటా మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీకి చెందిన కళాకారులకు ఈ బొమ్మల తయారీ పనులను అప్పగించింది. 15 మంది కళాకారుల బృందం రావణుడి వంశాన్ని సిద్ధం చేస్తోంది. రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండగా, మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలు 60 అడుగుల ఎత్తున ఉంటాయి. రావణుడి వంశం తయారు చేసేందుకు రూ.7.30 లక్షలు ఖర్చు అవుతున్నదని నిర్వాహకులు తెలిపారు.ఇది కూడా చదవండి: కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ.. -
ఏకంగా 6110! కడుపా? రాళ్ల గుట్టా? డాక్టర్లే ఆశ్చర్యపోయిన వైనం
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం (గాల్‌బ్లాడర్) నుండి ఒకటీ రెండూ కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బుండి జిల్లా పదంపురకు చెందిన ఒక పెద్దాయన కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడేవారు. దాదాపు సంవత్సర కాలంగా చికిత్స తీసుకుంటున్నా, ఫలితంలేదు. దీంతో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అతనికి నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద రాళ్లను గుర్తించారు. గ్లాల్ బ్లాడర్ సైజు సాధారంగా 7x4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ 12x4 సెం.మీకి పెరిగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అతనికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని, అదే అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు .ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయాన్ని తొలగించి, మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఆపరేషన్‌కు దాదాపు 30 -40 నిమిషాలు పట్టిందట. అంతేకాదు ఈ రాళ్లను లెక్కించేందుకు రెండున్నర గంటలు సమయం పెట్టింది. ఆపరేషన్ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి?జీర్ణక్రియకు తోడ్పడేలా కాలేయం ఉత్పత్తి చేసే ద్రవం అయిన పిత్తాన్ని తయారు చేసే పదార్థాలలో అసమతుల్యత ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం క్రింద ఉన్న చిన్న అవయవం పిత్తాశయంలో రాళ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ ఎక్కువైనపుడు రాళ్లు వస్తాయి. తయారవుతాయి. ఇవి ఇసుక రేణువులంత చిన్న పరిమాణం నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్ద పరిమాణంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల పిత్తాశయంలో చాలా రాళ్లు వస్తాయి. అతి వేగంగా బరువు తగ్గడం లేదా యో-యో డైటింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవనశైలి, ఆహార అలవాట్లు, అంటే ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ , కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం ప్రధాన కారణమని డాక్టర్ జిందాల్ అభిప్రాయపడ్డారు. వీటినిసకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమైన కేన్సర్‌కు దారి తీయవచ్చని డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బుధవారం శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతుంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు అని వెల్లడించారు.గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10మంది పిల్లలను సిఫార్సు చేయొచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికి కలిపి 7880 మంది విద్యార్ధులను కేవీల్లో చేర్పించే అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది. -
కోటాలో జేఈఈ విద్యార్ధి ఆత్మహత్య.. ఏడాదిలో 12వ ఘటన
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ప్రాణాలు విడిచాడు. బిహార్‌కు చెందిన జేఈఈ విద్యార్ధి సందీప్ కుమార్ తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో నివసిస్తున్న ఇతర విద్యార్ధులు కిటికీలోంచి మృతదేహాన్ని చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మరణించిన విద్యార్థి బిహార్‌లోని నలందకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సందీప్ కుమార్ గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. సందీప్ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే చనిపోవడంతో మేనమామ చదువుల ఖర్చులు భరిస్తున్నాడని చెప్పారు. అతన్ని (సందీప్) కోటా ఇన్స్టిట్యూట్లో మేనమామే చేర్పించాడని తెలిపారు. విద్యార్ధి చనిపోయే ఒక రోజు ముందు మామ అతని ఖాతాలో డబ్బు జమ చేసినట్లు తెలిసిందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని,అతడి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది పన్నెండవ ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
నూత్‌పల్లిలో చారిత్రక గడి
డొంకేశ్వర్: మండలంలోని నూత్పల్లి పాతూరు గడి కోటకు చరిత్రాత్మక చరిత్ర ఉంది. ఈ పురాతన కోటను రాజులు పరిపాలించారని చరిత్రకారులు చెబుతున్నారు. రాజులు ఇక్కడి నుంచి వెళ్తూ గడీని పోలీస్‌పటేల్‌గా ఉన్న తమ తాతగారైన పొద్దుటూరి నర్సింహారెడ్డికి అప్పగించినట్లు ఆయన మనువడు రాంచందర్‌రెడ్డి వెల్లడించారు. గడీని అప్పగించిన తర్వాత ఇక్కడ ఇళ్లు నిర్మించుకొని నివాసమున్నట్లు ఆయన చెప్పారు. ఐతే, ఎత్తయిన ఈ గడీని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చేవారు. 1982లో ఎస్సారెస్సీ ప్రాజెక్టును నిర్మించడంతో పాత నూత్పల్లి గ్రామంతో పాటు కోట కూడా ముంపునకు గురైంది. ప్రస్తుతం ప్రతీ వర్షాకాలంలో గడీ కొంతమేర ముంపునకు గురై ఎండాకాలంలో తేలుతుంది. ఇప్పుడు గడీ చుట్టూ చెట్లు, చెలము పెరిగి నిర్మానుష ప్రాంతంగా మారింది.ముఖద్వారం కోట గట్టిదనం..సుమారు 400 ఏళ్ల క్రితం నిర్మించిన గడీ కోట ముఖద్వారం ఇప్పటికీ గట్టిదనంతో కనిపిస్తోంది. ఎత్తయిన ముఖద్వారం బురుజును పెద్దరాతి బండలు, పొడవైన ఇటుకలతో నిర్మించారు. అగంతకులు కోటలోకి చొరబడకుండా చుట్టూ ప్రహారి ఉండేది. అది ప్రస్తుతం కూలిపోయింది. కాగా నలుదిక్కులా నూతులు(బావులు) కూడా ఉన్నాయి. కోటకు కాపాలాదారులు ఉండేవారు. కోటలోనే మైసమ్మ గుడి కూడా ఉంది. దొంగలను బంధించడానికి కోటలో రాతితో కట్టిన ‘కొటేరు’ ఉంది. కోట నుంచి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు సొరంగం కూడా ఉంది. ఇవన్నీ చూసిన పోలీస్ పటేల్ మనువళ్లు రాంచందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో నివాసం ఉంది. నాటి కాలంలో గడీలో గడిపిన క్షణాలను రాంచందర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. -
'కోటా ఫ్యాక్టరీ' సీజన్ 3 విడుదల ప్రకటన వచ్చేసింది
ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు భారీ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తి అయిన తర్వాత మరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 'కోటా ఫ్యాక్టరీ' వెబ్ సిరీస్ సీజన్ 3 జూన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్ కోసం రాజస్థాన్‌లోని కోటా అనే ప్రాంతానికి వెళ్తుంటారు. ఐఐటీ కోచింగ్ కోసం ఎక్కువగా విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు. సీటు సాధించే క్రమంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. కొందరైతే దానిని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అక్కడ ఉన్న విద్యార్థుల జీవితాల ఆధారంగా 2019లోనే 'కోటా ఫ్యాక్టరీ' మొదటి సీజన్ వచ్చింది.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఆ రెండు సీజన్స్ భారీ హిట్ అందుకోవడంతో.. జూన్ 20న మూడో సీజన్ రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కోటా ఫ్యాక్టరీలో అందరినీ మెప్పించే పాత్ర జీతూ భయ్యా.. అందులో జితేంద్ర కుమార్ జీవించేశాడు.సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీవీఎఫ్ సంస్థ నిర్మించిన ఈ సీరిస్ జూన్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం.. వారంలో రెండో ఘటన
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్‌లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్‌పోర్టు నగరలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్‌కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్‌ను హాస్టల్లోనే వదిలి వెళ్లాడు. వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్‌కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్‌లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
సారీ, నేను ఓడిపోయాను..!
కోటా: పరీక్షల ఒత్తిడికి మరో నిండు ప్రాణం బలైంది. రాజస్తాన్‌లోని కోటాలో జేఈఈకి ప్రిపేర్ అవుతున్న నిహారిక సింగ్(18) అనే విద్యార్థిని ఉరేసుకుని తనువు చాలించింది. ‘‘మమ్మీ, పాపా! నేను జేఈఈ సాధించలేను. నేను ఓడిపోయాను. నేను మంచి కూతుర్ని కాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. సారీ, నాకిక వేరే దారి లేదు’’ అని పేర్కొన్న సూసైడ్ నోట్ ఆమె గదిలో పోలీసులకు లభించింది. స్థానిక శివ విహార్ కాలనీలో కుటుంబంతో ఉంటున్న నిహారిక ఈ నెల 30, 31వ తేదీల్లో జేఈఈ పరీక్ష రాయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదువుల్లో ఒత్తిడిని తట్టుకుని, పరీక్ష రాయ లేకనే ఉరివేసుకున్నట్లు సూసైట్ నోట్‌ను బట్టి అర్థమవుతోందని వారన్నారు. ఉదయం 10 గంటలైనా నిహారిక బయటికి రాకపోవడంతో అమ్మమ్మ గది తలుపు తట్టింది. ఎంతకూ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా, వెంటిలేటర్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతూ నిహారిక విగతజీవిగా కనిపించింది. ఈ పరిణామంతో వారు హతాశులయ్యారు. చదువులో ముందుండే నిహారిక జేఈఈ పరీక్షపై ఒత్తిడికి గురవుతోందని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. జేఈఈతోపాటు ఎక్కువ స్కోరు కోసం 12వ తరగతి పరీక్షను సైతం ఆమె రాయాల్సి ఉందన్నారు. నిహారిక తండ్రి స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఝలావర్ జిల్లా అకౌడాఖుర్ద్కు చెందిన ఈ కుటుంబం మూడేళ్లుగా కోటాలో ఉంటోంది. కోటాలో వారం వ్యవధిలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యల్లో ఇది రెండోదని పోలీసులు పేర్కొన్నారు. నీట్‌కు ప్రిపేరవుతున్న యూపీకి చెందిన మహ్మద్ జయిద్ జనవరి 13న హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. కోటాలో గత ఏడాది 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇదే ప్రథమం
జైపూర్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఇంజినీరింగ్ కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కేంద్రంగా పేరొందిన కోటాలో గత ఏడాది 29 ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోవడం గురించి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇదే తొలి విద్యార్థి ఆత్మహత్య. యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్(18) అనే విద్యార్థి కోట హాస్టల్లో ఉంటూ జేఈఈ మెయిన్స్ కోచింగ్‌లో చేరాడు. మంగళవారం అర్ధరాత్రి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ లాంటివి కనిపించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాత్రి 11:00 ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్ల అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆత్మహత్యలు తగ్గడం లేదు. ఇదీ చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్ -
ఊహించని పరిణామం.. మంత్రిని సన్మానిస్తుండగా కూలిన స్టేజ్
రాజస్థాన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కోటాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిగా నియమితులైన బీజేపీ నేతను సన్మానిస్తుండగా..స్టేజీ కుప్పకూలింది. దీంతో పలువురు బీజేపీ నాయకులు కిందపడటంతో గాయాలయ్యాయి. వివరాలు.. రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. కేబినెట్లోని మంత్రులకు నేడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. సంగోత్ ఎమ్మెల్యే హీరాలాల్ నగర్‌కు సైతం మంత్రి బాధ్యతలు అప్పజెప్పింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం తొలిసారి మంత్రి తన సొంత నియోజక వర్గానికి విచ్చేశారు. అక్కడ ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హీరాలాల్‌కు స్వాగతం పలికేందుకు జనం అధికంగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు మంత్రికి పూలమాలలు వేస్తుండగా అకస్మాత్తుగా స్టేజ్ కుప్పకూలింది. कोटा में राज्यमंत्री हीरालाल नागर के स्वागत समारोह में टूटा मंच • मंत्री नागर, सांगोद प्रधान सहित 5 लोगों को आई चोट, दो की हालत बताई जा रही गंभीर#kota #Rajasthan pic.twitter.com/LiKRMMbYsy — Avdhesh Pareek (@Zinda_Avdhesh) January 4, 2024 ఈ ఘటనలో మంత్రి సహా వైదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ప్రజల్లోనూ, స్థానికంగానూ గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామపెద్ద సహా ఐదుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి హీరాలాల్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయన ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అయితే స్టేజ్‌ను 15 మంది ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేయగా.. 40 మంది ఒకేసారి నిల్చోడంతో బరువు ఎక్కువై కూలినట్లు తెలిసింది. -
కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన
రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు ఎంతటి చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా కోటాలో మరో విద్యార్థి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది. వివరాలు.. పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫరీద్ హుస్సేన్ కోటాకు వచ్చి వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్ పరిక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వక్ఫ్ నగర్ ప్రాంతంలో ఇతర విద్యార్థులతో కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గదిలో ఒంటరిగా ఉన్న హుస్సేన్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్లిన స్నేహితులు రాత్రి 7 గంటలకు గది వద్దకు వచ్చేసరికి బయట నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కాల్ చేయగా ఫోన్ లిఫ్ట్‌చేయలేదు. తలుపులు పగలగొట్టి చూడగా.. హుస్సేన్ విగత జీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, అతని మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! కాగా వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’ లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే 2023లోనే అత్యధికంగా ఆత్మహత్య కేసులు(28) నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు విద్యార్థుల బలవన్మరణాలను ఆపేందుకు కోటాలోని వసతి గృహాల్లో , భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు. -
అత్యంత పెద్ద కోట ఇది.. అసలు దీని చరిత్ర ఏంటి?
-
ఒత్తిడితో పిల్లల్ని ఇంకా చంపుదామా?
మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. ఎన్ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతి నెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ప్లేస్మెంట్లు, జీతం ప్యాకేజీల కథలతో ఈ వ్యవస్థ యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తోంది. అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. అయినా విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నాం. ఈ ప్రాణాపాయ విద్యకు బలంగా ‘నో’ అని చెప్పాలి. ఈ మధ్య ఓ దీర్ఘకాలిక ఆందోళన నాతో ఘర్షించడం మొదలెట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నామా? విద్య పేరిట, ‘విజయం’ కోసం జరిగే పరుగుపందెంలో కొందరు ‘బలహీనమైన’, ‘భావోద్వేగా నికి లోనయ్యే’ యువకులు తమ జీవితాలను అంతం చేసుకుంటున్న ప్పటికీ, దీన్నంతా మామూలు వ్యవహారం లానే చూస్తున్నామా? ఇలాంటి విద్య... విద్యార్థి స్ఫూర్తినే నాశనం చేస్తుందనీ, సామాజిక మానసిక వ్యాధిని సాధారణీకరిస్తుందనీ చెబుతూ, మధ్యతరగతి తల్లిదండ్రులతోనూ, ఉపాధ్యాయులతోనూ నేను తరచుగా కమ్యూని కేట్ చేయడానికి ప్రయత్నించాను. గణాంకాల ద్వారా వారిని ఒప్పించేందుకు కూడా ప్రయత్నించాను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం, ఆ ఏడాది 13,089 మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. అంటే ప్రతిరోజూ 35 కంటే ఎక్కువ చొప్పున అన్నమాట. అయినప్పటికీ, నేను ఒక తిరస్కరణ లేక నిరాకరణ స్థితిని ఎదుర్కొంటున్నాను. మన కాలంలో వాతావరణ అత్యవసర పరిస్థితికి చెందిన కఠినమైన వాస్తవికతను మనం ఎలాగైతే తిరస్కరిస్తున్నామో దాదాపుగా ఇదీ అంతే! మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. మరో వైపున ఎన్ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. అయినప్పటికీ, మనం మౌనంగా ఉండటానికే ఇష్టపడతాం లేదా దానిని కేవలం ఒక అపసవ్యతగా భావిస్తాం. అదే విధంగా, ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతినెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. నిజానికి, జీవితాన్నే నిరాకరించే ఈ పోటీ వ్యాప్తికి సంబంధించిన వ్యవస్థీకృత, సామాజిక కారణాల గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే, అధిక జనాభా కలిగిన ఈ దేశంలో ఉద్యోగాల కొరత ఉంది. ఉదారవాద కళలు, మానవ శాస్త్రాల విలువ తగ్గిపోయింది. ఇంజినీరింగ్, వైద్యశాస్త్రాలు, బిజినెస్ మేనేజ్మెంట్, ఇతర సాంకేతిక కోర్సులపై మక్కువ పెరిగింది. సంస్కృతిపై, విద్యపై నయా ఉదార వాద దాడి కారణంగా జీవిత ఆకాంక్షల మార్కెటీకరణ జరిగింది. అన్నింటికంటే మించి, ‘యోగ్యత’ లేదా ‘బలవంతులదే మనుగడ’ సిద్ధాంతాలకు పవిత్రత కల్పించడం కోసం... అన్యాయమైన సామాజిక వ్యవస్థలో ఒక జీవన విధానంగా అతి పోటీతత్వాన్ని లేదా సామాజిక డార్వినిజంను అంగీకరించడం జరిగింది. మన పిల్లలు, యువ విద్యార్థులు బాధపడుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. దీర్ఘకాలిక ఒత్తిడి, భయం, ఆందోళన, ఆత్మహత్య ధోరణులతో వారు జీవిస్తున్నందున, మనం మౌనంగా ఉండలేం. ఈ అన్యాయాన్ని మనం సాధారణీకరించలేం. ఒక ఉపాధ్యాయునిగా, ఈ విధమైన ఏ విద్యనైనా ఏమాత్రం సందిగ్ధత లేకుండా మనం విమర్శించాలనీ, దీని ద్వారా కొత్త అవ కాశాల కోసం ప్రయత్నించాలనీ నేను భావిస్తాను. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవడం లేదు. కానీ ఈ విద్యా వ్యవస్థలో భాగమైన ప్రతి యువ విద్యార్థి కూడా మానసిక ఒత్తిడి, ఆందోళన, ‘వైఫల్యానికి’ సంబంధించిన అమితమైన భయాలతో అననుకూల మైన వాతావరణంలో పెరుగుతున్నారనేది కూడా అంతే నిజం. ప్రేమ, సహకారానికి సంబంధించిన ఆవశ్యకత; పట్టుదల, ప్రశాంతతకు సంబంధించిన కళ ద్వారా భూమ్మీద మన ఉనికి తాలూకు హెచ్చు తగ్గులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం; సాధారణ విషయాలలో జీవి తానికి సంబంధించిన నిజమైన నిధిని కనుగొనడానికి వీలు కల్పించే బుద్ధిపూర్వక స్థితి... ఇలా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అవ కాశం లేని, నిజంగా ముఖ్యమైన వాటిని పెంపొందించడంలో ఆసక్తి లేని వ్యవస్థ ఇక్కడ ఉంది. ఒక సీతాకోక చిలుక చిన్న పసుపు పువ్వుతో ఆడుకోవడం, ముసలి నాయనమ్మ కోసం ఒక కప్పు టీ తయారు చేయడం, ఆమెతో పారవశ్యంలో ఒక క్షణం పంచుకోవడం, లేదా శీతా కాలపు రాత్రి ఒక నవలను చదవడం... ఇలాంటి వాటికి బదులుగా, ఈ వ్యవస్థ అన్ని గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. ఇది యువ మనసులను అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. పాఠశాలల నుండి కోచింగ్ ఫ్యాక్టరీల వరకు, మనం విద్యను అన్ని రకాల ప్రామాణిక పరీక్షలను ‘ఛేదించే’ ఒక వ్యూహంగా కుదించి వేశాము. గొప్ప పుస్తకాలను చదవడం, వినూత్న ఆలోచనలను అన్వేషించడం, చర్చించడం, వాదించడం, సైన్ ్స, సాహిత్యం, కళలతో ప్రయోగాలు చేయడం వంటి వాటి కంటే పరీక్షలు, మార్కులు చాలా ముఖ్యమైనవి కావడంతో నిజమైన అభ్యాసం దెబ్బతింటోంది. ‘వేగా నికి’ సంబంధించిన మాంత్రికతతో ఓఎమ్ఆర్ షీట్లో ‘సరైన’ సమా ధానాన్ని టిక్ చేయగల సామర్థ్యమే విలువైనది అయిపోయింది. ఎమ్సీక్యూ – కేంద్రీకృత పరీక్షా వ్యూహాలను విక్రయించే మార్గ దర్శక పుస్తకాలు యువ అభ్యాసకుల మానసిక స్థితిని వలసీకరించడం ప్రారంభించాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.ఈ వ్యవస్థ సౌందర్యం, సృజనాత్మకత, ఉత్సుకత లేనిది. ఇది యాంత్రికమైన, ప్రామాణికమైన, కరుడు గట్టిన మనస్సులను తయారు చేస్తుంది. ఉపకరణ ‘మేధస్సు’కు మాత్రమే అది విలువ నిస్తుంది. దీనిలో సృజనాత్మక కల్పన లేదా తాత్విక అద్భుతం లేదు. కోచింగ్ సెంటర్ వ్యూహకర్త మీ బిడ్డను సూర్యాస్తమయాన్ని చూడ డానికీ, ఒక పద్యం చదవడానికీ లేదా సత్యజిత్ రే చలన చిత్రాన్ని మెచ్చుకునేలా ప్రేరేపించాలనీ మీరు ఆశించలేరు. ఈ బోధకులు మీ పిల్లలను వేగంగా పరిగెత్తమని, ఇతరులను ఓడించమని, భౌతిక శాస్త్రాన్ని లేదా గణితాన్ని కేవలం ప్రవేశ పరీక్ష మెటీరియల్‌గా కుదించుకోమని, అతని/ఆమె స్వీయ–అవగాహనను ఐఐటీ–జేఈఈ లేదా నీట్ ర్యాంకింగ్‌తో సమానం చేయమని మాత్రమే అడగగలరు. మరో మాటలో చెప్పాలంటే, ఈ విధమైన విద్య ఒక వ్యక్తిని సాంస్కృతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా దారిద్య్రంలోకి నెడుతుంది. ఇది జీవితం కోసం, దాని లోతైన అస్తిత్వ ప్రశ్నల కోసం ఎవరినీ సిద్ధం చేయదు. కార్ల్ మార్క్స్ ఒకప్పుడు ‘సరుకుల మాయ’గా భావించిన దానిని ఈ విధమైన సాధనా విద్య చట్టబద్ధం చేస్తోంది. అవును, మన పిల్లలు ఒక విధంగా శిక్షణ పొందవలసి ఉంటుంది, తద్వారా వారు ఒక ధర ట్యాగ్‌తో వస్తువులుగా లేదా ‘ఉత్పత్తులుగా’ ఉద్భవించవలసి ఉంటుంది. కఠినమైన వాస్తవాన్ని అంగీకరించండి. చాలా హైప్ చేయబడిన ఐఐటీలు, ఐఐఎమ్‌లు – మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చూసే అంతిమ మోక్షమైన ‘ప్లేస్మెంట్లు మరియు జీతం ప్యాకేజీల’ పురాణాల ద్వారా యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తాయి. మన పిల్లలను, ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి గల వ్యక్తు లుగా చూడకుండా, కేవలం ‘పెట్టుబడి’ లేదా విక్రయించదగిన వస్తు వుల స్థాయికి తగ్గించి, మనం న్యూరోటిక్, ఆందోళనతో కూడిన, అధిక ఒత్తిడితో కూడిన తరాన్ని సృష్టించడం కొనసాగిస్తాము. ‘మోటివేషనల్ స్పీకర్ల’ను ‘స్వయం–సహాయ’ పుస్తకాల మార్కెట్‌ను అభివృద్ధి చేయ డానికి వ్యవస్థ అనుమతించినప్పటికీ, పెరుగుతున్న ఆత్మహత్యల రేటును అరికట్టడం అసాధ్యం. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, శ్రద్ధగల పౌరులుగా, మనం అప్రమత్తంగా ఉండాలి, మన స్వరం పెంచాలి, ఈ ప్రాణాపాయ విద్యకు నో అని చెప్పాలి, కొత్త అవగాహనను ఏర్పరచాలి. మన పిల్లలకు జీవితాన్ని ధ్రువీకరించే, కరుణను పెంచే మరో దృక్పథాన్ని అందించాలి. అవిజిత్ పాఠక్ వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 26వది..
జైపూర్: పోటీ పరీక్షల హబ్‌గా పేరొందిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ కోటాకు వచ్చిన విద్యార్థి నీట్ పరీక్షల కోసం సొంతంగానే సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోటాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజా మరణంతో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం. కేటాలో నీట్ సంబంధిత విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ మరణాలను అరికట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. విద్యార్థులు నివసించే హాస్టళ్లకు జాలీలు కట్టడం, హ్యాంగింగ్ ఫ్యాన్లను వాడటం వంటి చర్యలు చేపట్టారు. విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదీ చదవండి: MS Swaminathan: ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత -
రాజస్థాన్ సీఎంకు షాక్.. సొంత పార్టీ ఎమ్మెల్యే వినూత్న నిరసన
ఆధిపత్య పోరు, నేతల మధ్య విబేధాలు వంటి సంక్షోభ సమస్యలతో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిండా వివాదంలో మునిగిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకత వ్యక్తమైంది. గహ్లోత్‌కు నిరసనగా కోటా జిల్లాలోని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మంగళవారం గుండు కొట్టించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన మాటలు, సూచలను పట్టించుకోకుండా అవినీతిపరుడైన గనులశాఖమంత్రి ప్రమోద్ జైన్ భాయకు సీఎం గహ్లోత్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గుండు గీయించుకున్న తర్వాత ఆ వెంట్రుకలను సీఎంకు పంపించారు. దాంతోపాటు ఓ లేఖ కూడా పంపారు. ఖాన్ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలో చేర్చలేదని.. దీంతో సీఎం మీద ఉన్న గౌరవం, విశ్వాసం చచ్చిపోయాయని లేఖలో విమర్శించారు. ‘ఎవరైనా చనిపోతే వారి సన్నిహితులు(బంధువలు) గుండు కొట్టించుకోవడం మన సంప్రదాయం.. అందుకే నేను గుండు గీయించుకుని.. ఆ వెంట్రుకలను మీకు పంపుతున్నా. సీఎం పదవి శాశ్వతం కాదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కోటా జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, అశోక్ చందన తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ సమస్యలపై ధర్నా చేసిన నాలుగు రోజులకు బుండి జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. కోటా నగరంలోని గుమన్‌పురా ప్రాంతంలోని తన నివాసం వద్ద మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. చదవండి: వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
Kota: మరో ఇద్దరు.. ఈ ఏడాదిలోనే 24 మంది!
రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు ఎంతటి చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్ పరిక్షకు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల అవిష్కర్ శంబాజీ కస్లే, ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు. పరీక్ష రాసిన వెంటనే.. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అవిశంకర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. గత మూడేళ్లుగా తల్వాన్డీ ప్రాంతంలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి అద్దె గదిలో ఉంటూ నీట్ యూజీకి సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోచింగ్ సెంటర్లో పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని గంటల్లోనే మరో విద్యార్థి.. వెంటనే ఇనిస్టిట్యూట్ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బిహార్‌కు చెందిన ఆదర్శ్ రాజ్ తన అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ఇతను కూడా పరీక్ష రాయగా.. అనంతరం రూమ్‌కు వచ్చి సాయంత్రం 7 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్ తన బంధువులతో కలిసి ఉంటుండగా.. అతను కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇద్దరి వద్ద కూడా ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి.. రెండు నెలలు బంద్ వరుస విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ కోచింగ్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా గదుల్లోని ఫ్యాన్లకు యాంటీ సుసైడ్ డివైజ్‌లను ఇన్స్టాల్ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఒకరోజు ఎలాంటి పరీక్షలు, తరగతులు నిర్వహించకుండా హాలీడే ఇవ్వాలని ఆదేశించారు. 24కు చేరిన సంఖ్య పోటీ ప్రవేశ పరీ క్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్తాన్‌లోని కోటా పట్ట ణం ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 24కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది మరణించారు. ప్రస్తుతం కోటాలో దేశం నలుమూలల నుంచి వచ్చి దాదాపు మూడు లక్షల మంది వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. హాస్టల్ భనాలకు వలలు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్లను స్ప్రింగ్‌లకు బిగించారు. తాజాగా అన్ని హాస్టల్ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది దుర్మరణం -
కోటాలో భవంతులకు వలలు
కోటా: పోటీ ప్రవేశ పరీ క్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్తాన్‌లోని కోటా పట్ట ణం ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఏకంగా 20 మంది విద్యార్థులు బలవన్మ రణానికి పాల్పడడంతో జిల్లా యంత్రాంగం ఆత్మహత్యల నిరోధానికి ఎన్నో చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్లను స్ప్రింగ్‌లకు బిగించారు. ఇప్పుడు తాజాగా అన్ని హాస్టల్ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు భవనాలపైకి ఎక్కి దూకకుండా ‘సూసైడ్ ప్రూఫ్’ వలలు బిగించే కార్యక్రమాన్ని అన్ని హాస్టళ్లు యుద్ధప్రాతిపదికన అమరుస్తున్నాయి. ‘భవనాల వెలుపల, బాల్కనీల్లోనూ పెద్ద పెద్ద వలలు బిగించాం. ఇవి 150 కేజీల బరువులను సైతం మోయగలవు. ఎవరైనా విద్యార్థి భవనంపై నుంచి దూకినా ఈ వలలో పడతారు. గాయాలు కావు’ అని అమ్మాయిల హాస్టల్ నిర్వహిస్తున్న వినోద్ గౌతమ్ వివరించారు. ‘ఫ్యాన్లకు స్ప్రింగ్‌లు, భవనాలకు వలల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలను దాదాపు అడ్డుకోవచ్చు. విద్యార్థులను హాస్టల్స్‌లో విడిచి వెళుతున్న తల్లిదండ్రులు ఆందోళనతో ఉంటారు. ఇలాంటి నివారణ చర్యల కారణంగా తల్లిదండ్రుల్లో ధైర్యం కాస్తంత ఎక్కువ అవుతుంది’ అని గౌతమ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి చర్యలు తాత్కాలికంగా ఆత్మహత్యలను నిరోధించగలవేమో. కానీ విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించాలి. అదే అసలైన పరిష్కారం’ అని కొందరు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన
జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 'స్బ్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల'ను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిలయంగా ఉంటుంది రాజస్థాన్‌లోని కోటా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి(18) చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. #WATCH | Spring-loaded fans installed in all hostels and paying guest (PG) accommodations of Kota to decrease suicide cases among students, (17.08) https://t.co/laxcU1LHeW pic.twitter.com/J16ccd4X0S — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023 అయితే.. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిగతులను మార్చాలని, అందుకు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
కోటా: రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరు పొందిన కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లోని గయకు చెందిన 18 ఏళ్ల వయసున్న వాలీ్మకి ప్రసాద్ మంగళవారం రాత్రి అద్దెకి ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వాలీ్మకి పక్క గదిలోనే ఉంటున్న విద్యార్థులు రాత్రి అతని తలుపు కొడితే తియ్యకపోయే సరికి అనుమానం వచ్చి ఇంటి యజమానికి చెప్పారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను శవమై కనిపించాడు. వెంటనే వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాలీ్మకి రెండేళ్లుగా కోటాలోనే ఉంటున్నాడు. కోటాలో విద్యార్థి ఆత్మహత్యల్లో ఈ నెలలో ఇది నాలుగోది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ప్రతీ విద్యారి్థకి సైక్రియాటిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇప్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్ కోటాలో ఏం జరుగుతోంది?
రాజస్తాన్‌లోని కోటా. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణలేంటి ? విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించలేరా? కోటాలో ఏ కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్ హాలు, లగ్జరీ ఫరీ్నచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, ఫైవ్ స్టార్ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్ జలోర్‌కు చెందిన పుషే్పంద్ర సింగ్ , బిహార్‌కు చెందిన భార్గవ్ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్ ప్రజాపతి .. గత కొద్ది రోజుల్లో కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు వీరంతా. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యనున్న వారే. మనీష్ నాలుగు నెలల క్రితమే కోటాలో ఇంజనీరింగ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. బుధవారమే అతని తండ్రి వచ్చి కొడుకుని చూసి క్షేమసమాచారాలు అడిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన తన ఊరు చేరకుండానే మనీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచి్చంది. అంతే ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ మధ్య కాలంలో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిçÜ్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే, 2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 18 మంది బలవన్మరణం చెందారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ► ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ► కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్స్. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేరి్పస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యారి్థకి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ► కోటాలో కోచింగ్ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్థరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ‘‘ఏదో ఒకరోజు బాగా నిద్ర వచ్చి పావుగంట ఎక్కువ సేపు పడుకుంటే గిల్టీగా ఫీలవుతాను. తోటి వారి కంటే వెనకబడిపోతానన్న భయం వేస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాను’’ అని ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న సమర్ అనే విద్యార్థి చెప్పాడు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది. ► కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కోవిడ్ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులకి చదివే అలవాటు తప్పిపోయింది. దానికి తోడు కోవిడ్ సోకిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చదువుల ఒత్తిడి మరింతగా కుంగదీస్తోంది. ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. ► కోటాలో కోచింగ్‌కే ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా అవుతుంది. నిరుపేద కుటుంబాల విద్యార్థులకి తల్లిదండ్రులు చేసిన అప్పే ఎప్పుడూ కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ లేత మనసులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కోచింగ్ సెంటర్ల పరీక్షల్లో ఫెయిలైనా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యకి నివారణ మార్గాలేంటి ? విద్యార్థుల వరస ఆత్మహత్యలతో కోచింగ్ సిటీ కోటాపై వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రాజస్తాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 24/7 పనిచేసే హెల్ప్‌లైన్ నెంబర్లు, పోలీసుల ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. మానసిక ప్రశాంతతనిచ్చే యోగా, ధ్యానం, జుంబా డ్యాన్స్‌లు వంటి క్లాసులు కూడా కొన్ని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలు సరిపోవని అనూ గుప్తా అనే టీచర్ చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు 24 గంటలూ పోటీ పరీక్షల్లో టెక్నిక్కులను బోధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, పోటీ ప్రపంచంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించే పోరాటస్ఫూర్తిని విద్యార్థుల్లో కలి్పంచడం లేదని అనూ పేర్కొన్నారు. ఎలాగైనా బతకగలమన్న ధీమా విద్యార్థుల్లో నింపినప్పుడే ఆత్మహత్యల్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువు మీద పెట్టే సమయానికి, ఇతర కార్యక్రమాలకి ఇచ్చే సమయానికి మధ్య సమతుల్యత ఉండాలని అహ్లా మాత్రా అనే సైకాలజిస్ట్ చెప్పారు. రోజుకి 18 గంటలు చదువు రుద్దేయడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోటా ఫ్యాక్టరీకి పంపించే ముడి పదార్థాలుగా చూస్తున్నారని ఇప్పుడు వారిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో వారు ఉపయోగపడతారన్న ధోరణి నుంచి బయటకు రావాలని అవిజిత్ పాఠక్ అనే సైకాలిజిస్టు సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ బిల్లుని తీసుకురావాలని భావిస్తోంది.ఆ బిల్లు వెంటనే తీసుకువచ్చి విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. వారంలో మూడో కేసు
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. మానసిక ఒత్తిడి, చదవు భయంతో బంగారు భవిష్యత్తును చేజేతులారా చిదిమేస్తున్నారు. వారానికి ఒక ఆత్మహత్య కేసు నమోదవ్వడం కలవరపెడుతున్నాయి. తాజాగా కోటాలో గురువారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచాడు. కోటాలో గడిచిన వారం రోజుల వ్యవధిలో విద్యార్ధి ఆత్మహత్య నమోదవ్వడం ఇది మూడోది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌కు చెందిన 17 ఏళ్ల మనీష్ ప్రజాపత్ ఆరు నెలల కిత్రం కోటాకు వచ్చాడు. ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏమైందో ఏమో కానీ గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. కాగా కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 21కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే చదువులో ఒత్తిడి వల్ల అక్కడ విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
కోటాలో రాలిన మరో విద్యా కుసుమం.. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని..
కోటా(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్జోత్ చాబ్రా కోటాలోని ఓ శిక్షణా కేంద్రంలో ‘నీట్’ కోచింగ్ తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. మన్జోత్కు అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్‌ను అప్రమత్తం చేశారు. విద్యార్థి గది తలుపులను బద్దలు కొట్టి చూడగా మృతదేహం కనిపించింది. కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్‌కి యాంటీ సూసైడ్ పరికరాలు అమర్చారు. దీంతో మన్జోత్ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ని చుట్టుకొని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ అతడి గదిలో ఒక లేఖ లభ్యమైనట్లు చెప్పారు. మన్జోత్ చాలా తెలివైనవాడని, అందరితో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు. కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. చదువుల్లో ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. -
కాసేపట్లో వివాహం.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. Rajasthan | 9 bodies have been recovered after a car fell into the Chambal river in Kota. Among those who have lost their lives including a groom were going to Ujjain for the wedding: Kota Police — ANI (@ANI) February 20, 2022 వివరాల ప్రకారం.. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నకోటా పోలీసులు క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (చదవండి: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?) -
సంబరాల దసరా
దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయ దశమి. తమలోని దుర్గుణాలను తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించ మని అమ్మవారిని కొలుచుకునే వేడుకే దసరా. ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు జగన్మాతను భక్తి శ్రద్దలతో పూజించి, 10వ రోజు పండగ జరుపుకోవడం ఆనవాయితీ. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం కారణంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇకనైనా కరోనా మహమ్మారినుంచి విముక్తి ప్రసాదించమని శరణు వేడుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాది పండుగను నిర్వహించుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, సకల శుభాలు వరించేలా ఆ దుర్గామాత దీవించాలని కోరుకుంటూ సాక్షి.కామ్ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
Kota: 127 ఏళ్లలో 2 సార్లు మాత్రమే వేడుకలకు అంతరాయం.. అంతేగానీ..
కోట దసరా పండుగ రాజస్థాన్ రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశంలోనే గుర్తించదగిన వేడుక. కోట నగరం, దసరామేళా మైదాన్‌లో 25 రోజుల పాటు జరిగే ఈ వేడుక దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకే చోట చేరి పండగ చేసుకుంటున్నట్లు ఉంటుంది. విజయదశమి రోజున రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను కాల్చివేయడంతో పూర్తవుతుంది. టపాకాయలు నింపిన బొమ్మల మీదకు రాముడి వేషంలో ఉన్న ఓ కుర్రాడు అగ్ని బాణం వేస్తాడు. దాంతో టపాకాయలు పేలుతూ బొమ్మలు మూడూ కుప్పకూలిపోతాయి. ఈ వేడుకను చూడడానికి లక్ష మందికి పైగా వస్తారు. అన్ని రోజుల వేడుకలకూ కలిపి పదహారు లక్షలకు పైగా వస్తారు. కోట దసరా వేడుకలకు దేశం నలుమూలల నుంచి కళాకారులను ఆహ్వానించి ఆయా ప్రదేశాల సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో కవి సమ్మేళనాలు, భజన గీతాలాపనలు, సింధీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె బండి సవారీలు, సంగీత కచేరీలు, జానపద కళలు, నాట్యరీతులు... ఇవీ అవీ అనే తేడా లేకుండా అన్ని దేశంలోని ప్రాంతాల కళలూ ప్రదర్శితమవుతాయి. దసరా సందర్భంగా పదిహేను వందల స్టాల్స్ వెలుస్తాయిక్కడ. కళాకారులు మాత్రమే కాదు... వ్యాపారులు కూడా దేశం నలుమూలల నుంచి వస్తారు. కోటలో దసరా వేడుకలు 1893లో మహారావ్ ఉమేద్ సింగ్ హయాంలో మొదలయ్యాయి, ఈ 127 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే వేడుకలకు అంతరాయం కలిగింది. ఇండో– పాక్ యుద్ధం సందర్భంగా 1971లో బ్లాక్ అవుట్ నేపథ్యంలో వేడుకలు జరగలేదు. గత ఏడాది కోవిడ్ కారణంగా వేడుకలు ఘనంగా జరగలేదు. చదవండి: Mysore: కాగడాల కవాతు... 4 వేలు పెట్టి విఐపి గోల్డ్‌కార్డ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే! దసరా ఉత్సవాలు 75 రోజుల ముందే మొదలు -
అదరగొడుతున్న ఆయు, పిహు... కోటిన్నర సబ్స్క్రైబర్స్
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదైనా సరే ‘ది బెస్ట్’ ఇవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో పిల్లల కోసం కష్టపడడమేగాక, మరికొన్నిసార్లు వాళ్లు కూడా చిన్నపిల్లల్లా మారిపోతుంటారు. అచ్చం ఇలాగే మారిపోయిన... ఆయు, పిహు తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అందులో పిల్లలతోపాటు తాము కూడా వివిధ రకాల ఆటలలో పాల్గొంటూ ఆ వీడియోలను తమ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. కంటెంట్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రస్తుతం వీరి ఛానల్ కిడ్స్ విభాగంలో దాదాపు కోటిన్నర సబ్స్క్రైబర్స్తో టాప్‌టెన్‌లో దూసుకుపోతోంది. రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందిన పియూష్, రుచి కల్రా దంపతులకు 2007 ఏప్రిల్ 2న ప్రకృతి(పిహు), 2013 ఆగస్టు 27న ఆయుష్(ఆయు)లు పుట్టారు. ఆయుకు మూడున్నర ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి ఆన్లైన్లో చూసే అన్ బాక్సింగ్, రివ్యూ వీడియోలను ఆసక్తిగా గమనించేవాడు. రోజూ తను చూసే వీడియోలను ఆయు ఇష్టపడుతుండడంతో పిల్లలకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఆయుకు చూపించాలని పియూష్‌కు అనిపించింది. అయితే పిల్లల వీడియోలు దాదాపు అన్నీ యానిమేటెడ్వే కావడం, కొన్ని హిందీలో లేకపోవడంతోపాటు లైవ్‌గా ఎవరైనా యాక్షన్ చేసి చెప్పేవి కూడా ఏవీ కనిపించలేదు. పిల్లలకు మరిన్ని విషయాలు నేర్పించాలంటే మాతృ భాషలోనే ఉంటే బావుంటుందని ఆయన 2017 మేలో ‘ఆయు అండ్ పిహు షో’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ షోలో ఐదేళ్ల ఆయు, పదకొండేళ్ల పిహులు పిల్లలకు నచ్చే నీతి కథలు, మంచి అలవాట్లు, వివిధ రకాల పోటీలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసేవారు. పిల్లలతో ప్రారంభించిన ఛానల్ అయినప్పటికీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దేందుకు లైటింగ్, కెమెరా, హై ఎండ్ గేమింగ్ ల్యాప్ టాప్‌ను ఏర్పాటు చేసి, పిల్లలు కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంటే పియూష్, రుచిలు వాటిని షూట్ చేయడం, స్క్రిప్ట్ రెడీ చేయడం, ఎడిట్ చేయడంతోపాటు, షోలో లోటుపాట్లను సరిచేసేవారు. వాస్తవికథలతో... ప్రారంభంలో కుకింగ్ పాఠాలు, మంచి అలవాట్ల పైన వీడియోలు రూపొందించి ఛానల్లో అప్లోడ్ చేసేవారు. మేలో ఛానల్ ప్రారంభించినప్పటికీ మరుసటి ఏడాది మార్చివరకు సబ్‌స్కైబర్స్ సంఖ్య వెయ్యి లోపే ఉండేది. నీతికథలను మరింత బాగా చెప్పగలిగితే వ్యూవర్స్ సంఖ్య పెరుగుతుందన్న ఆలోచన రావడంతో...అప్పటి వరకు వినని హిందీ నీతి కథలను ప్రత్యేకంగా రూపొందించి వినిపించడం ప్రారంభించారు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కథలుగా చెప్పడం, నీతితోపాటు కాస్త కామెడీ కూడా ఉండేలా కథలను తయారు చేసి ఛానల్లో అప్లోడ్ చేసేవాళ్లు. దీంతో ఛానల్ బాగా పాపులర్ అయ్యింది. ‘ఏక్ జూట్’(అబద్దం) వీడియోకు ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కోటికి పైగా సబ్స్క్రైబర్స్... నీతికథల వీడియోలు షూట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో.. వీటితోపాటు ఛాలెంజింగ్ వీడియోలు చేసి అప్లోడ్ చేసేవారు. ప్రతి గురువారం కొత్త వీడియో, లఘు చిత్రాలు, చాలెంజింగ్ గేమ్‌లు, ఫ్యామిలీ కామెడీ, యాక్టివిటీ లెర్నింగ్ కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడంతో.. 2018 జూన్ నాటికి ఆయు అండ్ పిహు షో లక్షమంది సబ్స్క్రైబర్ల ను దాటేసింది. సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. వీరి ఛానల్ వేగంగా పాపులర్ అవ్వడానికి కారణం ఆయు, పియూలే. అక్కాతమ్ముడు అన్ని యాక్టివిటీల్లో చురుకుగా పాల్గొని వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడంతో సబ్స్క్రైబర్స్ సంఖ్య కోటీ నలభైలక్షలకు చేరింది. ఆయు పిహులతోపాటు తల్లిదండ్రులు పియూష్, రుచిలుకూడా యాక్టివిటీల్లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే వీరి ఛానల్‌కు సిల్వర్, గోల్డ్, డైమండ్ బటన్లు కూడా వచ్చాయి. ప్రస్తుతమున్న కిడ్స్ యూ ట్యూబ్ ఛానళ్లల్లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న వాటిలో ఆయు అండ్ పిహు షో కూడా ఒకటిగా ఉంది. చదవండి: వరకట్న హత్యలు: జాగ్రత్త... ఉద్యోగం ఊడుతుంది -
ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్ పోస్టులు.. ఆన్లైన్లో అప్లై చేయండి
ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 పోస్టులు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(మెడికల్).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► విభాగాలు: నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ తదితరాలు. ► అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. »వయసు: 40ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021 ► వెబ్సైట్: https://www.icmr.gov.in ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 26 ఫ్యాకల్టీ పోస్టులు ఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ(డీటీయూ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 26 ► పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పరిశోధన/టీచింగ్ అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ప్రజంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్మెంట్ బ్రాంచ్, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, షాబాద్ దౌలత్‌పూర్, భావనా రోడ్, ఢిల్లీ–110042 చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.08.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 18.08.2021 ► వెబ్సైట్: www.dtu.ac.in ఐఐఐటీ, కోటాలో 21 నాన్‌టీచింగ్ పోస్టులు జయపురలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ), కోటా.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 21 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ లైబ్రేరియన్–01, టెక్నికల్ అసిస్టెంట్–02, టెక్నీషియన్–05, సూపరింటెండెంట్–02, అకౌంటెంట్–01, జూనియర్ అసిస్టెంట్–06, ఆఫీస్ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్/బీఆర్క్/ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 27ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021 ► వెబ్సైట్: www.iiitkota.ac.in -
వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో..
జైపూర్: రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో పట్టపగలే బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో ఒక షాపు యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సదరు షాపు యజమాని తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. మొత్తం 38 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. ఈ పరిణామంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు లోనయ్యి బయటికి వచ్చే దైర్యం చేయలేదు. కాగా కైలాష్ మీనా అనే పండ్ల వ్యాపారిపై దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇదే విషయమై కైలాష్ మీనా స్పందింస్తూ.. '' రెండు బైక్ లపై ఆరుగురు యువకులు వచ్చారు. వారు ఎందుకు తనపై హత్యాయత్నం చేశారో తెలియదు. పండ్లు, కూరగాయల కమిషన్ ఏజెంట్ అయిన నేను కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నా. తనకెవరూ శత్రువులు లేరు. అలాంటిది వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలియడం లేదు. అయితే తనపై దాడి చేసేందుకు వచ్చిన దుండగుల్లో ఒక్కరిని కూడా గుర్తుపట్టలేకపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కాగా కైలాష్ మీనా ఈ మండిలో తోటి వ్యాపారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటాడని తెలిసింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: 13 వాహనాలు ధ్వంసం: ఎస్ఐ కుమారుడు సహా ఇద్దరి అరెస్టు దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి #WATCH | Rajasthan: 6 bike-borne men fired bullets at a shop in the fruits & vegetable market in Gumanpura of Kota y'day. Shop's owner was present inside at the time of incident, he's unhurt. Police say, "CCTV footage is being examined & efforts being made to arrest the accused" pic.twitter.com/JsKzhytfC8 — ANI (@ANI) June 15, 2021 -
ప్రతి రోజూ ‘పండు’గే.. ఏడాది పొడవునా మామిడి
సాక్షి, రాజస్థాన్: పండ్ల రారాజు మామిడి పండును ఆస్వాదించాలంటే వేసవికాలం కోసం ఎదురుచూడాల్సిన పనిలేదంటున్నారు రాజస్థాన్‌కు చెందిన శ్రీకిషన్ సుమన్. ఏడాది పొడవునా మామిడి పండు అందు బాటులో ఉంటుందని చెబుతున్నారు ఈ రైతు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన శ్రీకిషన్ వినూత్న రకం మామిడిని అభివృద్ధి చేశారు. దీనికి సాధారణ మామిడిలో ఉన్న రోగ నిరోధక సామర్థ్యంతోపాటు ప్రధానమైన వ్యాధులను నిరోధించే శక్తి ఉందంటున్నారు. తియ్యటి ఈ మామిడిని అధిక సాంద్రత ఉన్న తోటల పెంపకంతో పాటు ఇంట్లో కుండల్లో సాగు చేయొచ్చని చెబుతున్నారు. మామిడి గుజ్జులో తక్కువ పీచుపదార్థం ఉంటుందని పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. రెండో తరగతి తర్వాత పాఠశాలకు స్వస్తి చెప్పిన సుమన్ కుటుంబ వృత్తి అయిన తోటపనిలో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులు గోధుమలు, వరి పండించడంపై ఆసక్తి చూపుతుంటే సుమన్ పూల పెంపకంపై దృష్టిపెట్టారు. గోధుమలు, వరిపై వర్షాలు, జంతువుల దాడి ప్రభావం ఉంటుందని, లాభాలు తక్కువగా ఉంటాయని సుమన్ గ్రహించారు. భిన్న రకాల రోజా పూల పెంపకంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత మామిడిపైనా ఆయన దృష్టి మళ్లింది. 2000 ఏడాదిలో పండ్ల తోటలో ముదురు ఆకుపచ్చ రంగు ఆకులున్న ఓ మామిడి ఏడాదంతా పూతరావడం గుర్తించారు. దీంతో ఆ చెట్టు నుంచి ఐదు అంటు మొక్కలు వేసి సంరక్షణ ప్రారంభించారు. ‘సదా బహార్’ అని పిలిచే ఈ రకాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సుమన్‌కు ఏకంగా 15 సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో అంటు మొక్కలు రెండేళ్లలో దిగుబడి ఇచ్చాయి. కొత్త రకాలను గుర్తించే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) సదాబహార్‌ను పరిశీలించి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ, ఫార్మర్స్ రైట్ యాక్ట్, ఐకార్-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనటిక్ రీసోర్స్(ఎన్‌బీపీజీఆర్)లో రిజిస్టర్‌కు అనుమతించింది. రాష్ట్రపతి భవనంలోని మొఘల్ గార్డెన్లో ఈ మొక్కను నాటేలా చర్యలు తీసుకుంది. ‘ఎవర్ గ్రీన్’రకాన్ని అభివృద్ధి చేసిన శ్రీకిషన్‌ను ఎన్ఐఎఫ్.. తొమ్మిదో నేషనల్ గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్, ట్రెడిషినల్ నాలెడ్జ్ అవార్డుతో సత్కరించింది. దేశ విదేశాల నుంచి 2017-20 మధ్య ఏకంగా 8,000 ఆర్డర్లు వచ్చాయని సుమన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, గోవా, బిహార్, చత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఛండీగఢ్ రాష్ట్రాల రైతులకు 2018-20 మధ్య సుమారు 6వేల మొక్కలు సరఫరా చేశానన్నారు. క్రిషి విజ్ఞాన్ కేంద్రాల్లో 500 మొక్కలుపైగా నాటామని, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లోని పరిశోధన సంస్థలకు అందజేశానని సుమన్ తెలిపారు. చదవండి: కోళ్ల పెంపకంతో వేల ఆదాయం -
గంటల వ్యవధిలో 9 మంది చిన్నారుల మృతి
జైపూర్: రాజస్తాన్‌లోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది నవశాత శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఈ ఏడాది కూడా ఇదే రీతిన నవజాత శిశువులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 రోజుల వయస్సులోపు వారే అని రాజస్తాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. (చదవండి: 480 గ్రాముల శిశువు) ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. డివిజనల్ కమిషనర్ కేసీ మీనా, జిల్లా కలెక్టర్ ఉజ్జవల్ రాథోర్ గురువారం సాయంత్రం ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. చిన్నారుల మరణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. శిశువుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కాగా కోటా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోగ్య మంత్రికి పంపిన నివేదిక ప్రకారం, పుట్టుకతోనే వైఫల్యాలు రావడంతో ముగ్గురు శిశువులను జేకే లోన్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వీరికి చికిత్స అందిస్తుండగా.. మరణించారు. మిగితా శిశువులవి ఆకస్మిక మరణాలు అని నివేదికలో తెలిపారు. -
లోక్‌సభ స్పీకర్ నివాసంలో విషాదం
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్ నిబంధనల నడుమ స్వస్థలం రాజస్తాన్‌లోని కిషోరాపూర్ ముక్తిధామంలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. (చదవండి: జశ్వంత్ సింగ్ కన్నుమూత) కాగా పితృవియోగంతో విషాదంలో మునిగిపోయిన ఓం బిర్లా, ఆయన కుటుంబానికి సహచర ఎంపీలు, బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శీకృష్ణ బిర్లా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక ఓం బిర్లా రాజస్తాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. I am deeply pained to know about the demise of respected Shri Shrikrishna Birla Ji, father of LS Speaker Shri Om Birla Ji @ombirlakota. My condolences to Shri Om Birla Ji and his family. Om Shanti. — Mukul Roy (@MukulR_Official) September 29, 2020 -
వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు
కోట : రాజస్తాన్‌లోని కోటలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. సాకెట్లో నుంచి వెంటిలేటర్ ప్లగ్ తీసి, ఎయిర్‌కూలర్ ప్లగ్ పెట్టడంతో ఒక రోగి మరణించాడు. వివరాలు.. కరోనా వైరస్ అనే అనుమానంతో ఒక 40 ఏళ్ల వ్యక్తిని రాజస్తాన్‌లోని మహారావు భీమ్ సింగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో బాగా వేడిగా ఉండటంతో, రోగి కుటుంబ సభ్యులు బయటి నుంచి ఎయిర్ కూలర్ తీసుకువచ్చారు. కూలర్‌ను ఆన్ చేసేందుకు.. వెంటిలేటర్ కనెక్ట్ అయి ఉన్న సాకెట్లో వెంటిలేటర్‌కు సంబంధించిన ప్లగ్‌ను తీసి, కూలర్ ప్లగ్‌ను పెట్టారు. అరగంట తరువాత వెంటిలేటర్లో చార్జింగ్ అయిపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. పొరపాటున రోగి కుటుంబ సభ్యులే వెంటిలేటర్ ప్లగ్‌ను తీసేశారని ఎంబీఎస్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.(కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి) అయితే ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో జూన్ 15న సదరు వ్యక్తిని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చినట్లు వెల్లడించారు. ఇంతలోనే కుటుంబసభ్యుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, వారు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. -
విద్యార్ధుల కోసం కోటి రూపాయలు..
పాట్నా: రాజస్తాన్‌లోని కోట నగరం నుంచి తమ రాష్ట్ర పౌరులను తరలిచేందుకు బిహార్ ప్రభుత్వం కోటి రూపాయలు చెల్లించిందని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. కోట నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు 17 రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఖర్చులను రాజస్తాన్ ప్రభుత్వమే భరించాలని తెలిపారు. కానీ రాజస్తాన్ ప్రభుత్వం బిహార్ ప్రభుత్వమే చెల్లించాలని చెప్పడంతో 17 రైళ్లను ఏర్పాటు చేయడం కోసం తమ ప్రభుత్వం కోటి రూపాయలు డిపాజిట్ చేసిందని తెలిపారు. విద్యార్థుల కోసం ఆ మొత్తం చెల్లించడం రెండు ప్రభుత్వాలకు పెద్ద విషయం ఏం కాదని సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) కోటకి బిహార్‌కి మధ్య దూరం 1300 కిలోమీటర్లు ఉండటంతో విద్యార్థులను బస్సుల ద్వారా తరలించడం లేదని తెలిపారు. అంతదూరం బస్సులో ప్రయాణించడం కష్టమని, లాక్డౌన్ కారణంగా తినడానికి ఎక్కడ ఏవి లభించవని, అలాంటప్పుడు విద్యార్ధులు రైళ్లలో రావడమే మంచిదని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్, జనతాదళ్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ పార్టీలు 3000 బస్సులు, 300 రైళ్ల గురించి మాట్లాడుతున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. పేదల పట్ల ఇంత శ్రద్ధ ఉన్న వీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళమిస్తే పేద రాష్ట్రమైన బిహార్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద‘ని సుశీల్ కుమార్ పేర్కొన్నారు. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
75 బస్సుల్లో స్వస్థలాలకు విద్యార్థులు
రాయ్‌పుర్(ఛత్తీస్‌ఘడ్) : లాక్‌డౌన్‌తో రాజస్థాన్‌లోని కోటా వద్ద చిక్కుకుపోయిన 2వేల మంది విద్యార్దులు 75 బస్సుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. వీరికి రాయ్‌పుర్‌లో స్క్రీనింగ్ పరీక్షలు జరిపించి ఇళ్లకు పంపిస్తున్నారు. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌కు కోటాలో ప్రత్యేకమైన శిక్షణ సంస్థలు ఉన్నాయి. ప్రతియేటా లక్షల సంఖ్యలో విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వెళుతుంటారు. ఈ ఏడాది కూడా అలాగే వెళ్లి లాక్డౌన్లో చిక్కుకుపోయారు. అయితే ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, ఆయా చోట్ల చిక్కుకుపోయిన విద్యార్దుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విదానం పాటించకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజస్తాన్ లోని కోటా వద్ద నిలిచిపోయిన యూపీ విద్యార్దుల కోసం 300 బస్ లు ఏర్పాటు చేసి తరలించింది. ఈ అంశంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథపై మండిపడ్డారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాజస్థాన్‌లోని కోట నగరంలో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తీసుకురావడం కుదరదని నితీశ్‌కుమార్ స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే వరకు విద్యార్థులను తీసుకురాలేమని చెప్పారు.(ఇప్పట్లో కుదరదు: సీఎం) -
యూపీ ప్రభుత్వ తీరుపై బిహార్ సీఎం ఆగ్రహం
పట్నా : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వతీరుపై బిహార్ సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి 300 బస్సులను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని యూపీ ప్రభుత్వం పంపింది. అదే రీతిలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించకపోవడం అన్యాయం అని నితిష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'కోటాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత కుటుంబాలకు చెందిన వారు. చాలా మంది విద్యార్థులు కోటాలోనే వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. వారిని అంత అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఏముంది. అదే సమయంలో ఎన్నో రోజులుగా నిరాశ్రయులుగా ఉన్న బిహార్‌కు చెందిన వలస కార్మికుల విషయంలో ఎందుకు ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తున్నారు' అని నిప్పులు చెరిగారు. విద్యార్థులను లాక్డౌన్ సమయంలో తిరిగి రప్పించడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. మార్చిలో ఢిల్లీ నుంచి కార్మికులను తరలించడం కూడా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇదే సమయంలో, ఎక్కడివారు అక్కడే ఉండి కరోనా వ్యాప్తి అరికట్టడానికి సహకరించాలని బిహార్‌కు చెందిన విద్యార్థులు, వలస కార్మికులకు ఉద్దేశించి నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికుల రక్షణ కోసం బిహార్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని తెలిపారు. -
ఘోర ప్రమాదం, 24మంది దుర్మరణం
జైపూర్ : రాజస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 24మంది జలసమాధి అయ్యారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి మేజ్ నదిలో పడిపోయింది. బుండీ కోటలాల్ సోట్ సమీపంలోని మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40మంది ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం... బంధువులతో కలిసి కోటా నుంచి సవాయ్‌మాధోపూర్ వెళుతోంది. అయితే బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి నదిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు నదిలో పడిపోయినవారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు : మనస్తాపంతో ఓ మహిళ ... ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోట మండలం ఊనుగుంటపాలెంకు చెందిన నాగార్జున, రాణి భార్యభర్తలు. వీరికి ప్రదీప్ (5), సుధీర్ (2) సంతాపం. కాగా కొంతకాలంగా నాగార్జున నెల్లూరులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. అతడు అక్కడే ఉంటూ...వారంలో ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయితే తమను కూడా నెల్లూరుకు తీసుకు వెళ్లాలంటూ కొద్దిరోజులుగా రాణి భర్తను కోరుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కుటుంబాన్ని అక్కడకు తీసుకు వెళతానంటూ సర్థి చెబుతూ వచ్చాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో బంధువులు, స్థానికులు కలగచేసుకుని, ఇద్దరికి సర్ధి చెప్పారు. నాగార్జున యథావిథిగా నెల్లూరు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో రాణి నిన్న రాత్రి ఇద్దరు పిల్లలకు విషం తాగించి, వారు చనిపోయిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తెల్లారినా ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్కింటివాళ్లు వచ్చి చూడగా అప్పటికే పిల్లలతో పాటు రాణి కూడా విగతజీవిగా పడిఉంది. సమాచారం అందుకున్న నాగార్జున స్వగ్రామానికి చేరుకుని భార్య, పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించాడు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
జవాబుదారీతనం ఉండాలి
కోటా (రాజస్తాన్): రాజస్థాన్‌లోని కోటాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జేకే లోన్ ఆస్పత్రిలో 107 మంది చిన్నారుల మరణాలపై ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విమర్శించారు. చిన్నారుల మరణం చాలా బాధించిందని, దీనికి ఎవరో ఒకరు జవాబుదారీతనం వహించాలని వ్యాఖ్యానించారు. శిశువుల మరణాలపై ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయంపై తాము మరింత సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలను పైలట్ శనివారం పరామర్శించి ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై తాము మరింత బాధ్యతగా ఉండాలి, ఆ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. -
సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు!
జైపూర్: కోటలోని జేకే లోన్ ప్రభుత్వాసుపత్రిలో వంద మంది శిశువులు మరణించిన ఘటనపై రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు సచిన్ పైలట్ స్పందించారు. ఈ విషాదకర ఘటనపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అన్నింటికీ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రయోజనం ఉండదని చురకలు అంటించారు. కోటలో నెలరోజుల వ్యవధిలో వంద మంది నవజాత శిశువులు మరణించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కోటా నియోజకవర్గం నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్ చేసిన తర్వాత.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్పందించారు. ఈ క్రమంలో ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ ఎల్ మీనాను తొలగించి, దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య విద్యా శాఖ కార్యదర్శికి అప్పగించారు. అయినప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత బీజేపీ ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సీఎం అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు.(అందుకే వాళ్లంతా మరణించారు! ) ఈ క్రమంలో శనివారం కోట ఆస్పత్రిని సందర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది చాలా సున్నిమతమైన అంశం. శిశువుల మరణానికి మనమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 నెలలు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చుంటే సరిపోదు. జవాబుదారీతనం పెరగాలి. గతం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించే చర్చ అవసరం. ఇటువంటి ఘటనలు జరిగినపుడు ఎవరూ బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు. ఎంతో మంది పిల్లలు చనిపోయారు. వసుంధరా రాజే పొరపాట్ల వల్ల ప్రజలు ఆమెను అధికారానికి దూరం చేశారు. కాబట్టి మనం బాధ్యతగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాగా రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాజస్తాన్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు వినిపించనప్పటికీ.. సీనియర్ నేత అశోక్ గెహ్లోత్‌నే సీఎం పదవి వరించింది. సచిన్‌ను ఆయన డిప్యూటీగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇక సచిన్ సొంత ప్రభుత్వం గురించి ఇలా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి.(కోట ఆసుపత్రి మృత్యుగీతం) Rajasthan Deputy Chief Minister Sachin Pilot on #KotaChildDeaths: I think our response to this could have been more compassionate and sensitive. After being in power for 13 months I think it serves no purpose to blame the previous Govt's misdeeds. Accountability should be fixed. pic.twitter.com/kpD9uxMfUy — ANI (@ANI) January 4, 2020 -
అందుకే వాళ్లంతా మరణించారు!
జైపూర్ : ఢిల్లీ నుంచి ఆరుగురు వైద్యుల బృందం శనివారం రాజస్తాన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలోని కోటా జిల్లాలోని జేకేలోన్ పిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా శిశువులు మరణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడానికి ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఆరుగురు డాక్టర్లు ఆసుపత్రిని సందర్శించారు. గత డిసెంబర్ నెలలో 107 మంది శిశువులు మృత్యువాత పడగా కేవలం 23, 24 తేదీల్లో వంద మంది పిల్లలు జన్మిస్తే ..వారిలో పది మంది మరణించడం గమనార్హం. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్య పరికరాల కొరత వల్లే వీరంతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. అదే విధంగా కోటా నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నలోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆసుపత్రిని సందర్శించి.. మృత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగు పరచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు సార్లు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇక శిశువుల మరణాల విషయాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. శిశువుల మరణాలను సంబంధించి నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కేంద్ర కమిషన్ సైతం ఆసుపత్రులలో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల్లో 50 శాతానికి పైగా పనికిరానివని, ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ఆక్సీజన్ సరఫరాతో సహా ప్రాథమిక సదుపాయాలు లేవని కమిషన్ నివేదిక ఇచ్చింది. మరోవైపు... గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంలో 963 మంది పిల్లలు జెకెలోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించగా, అంతకుముందు ఈ సంఖ్య 1,000 కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఇదిలావుండగా ఆసుపత్రిలోని శిశువులు మరణానికి కారణమైన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ శనివారం అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లుగా బీజేపీ రాష్ట్రంలోని వైద్య సదుపాయాలను నాశనం చేసిందని, ఇప్పుడు తమ పార్టీ దాన్ని వాటిని మెరుగుపరుస్తోందని రావత్ పేర్కొన్నారు. -
కోట ఆసుపత్రి మృత్యుగీతం
రాజస్తాన్‌లోని కోట నగరంలోవున్న జేకే లోన్ ప్రభుత్వాసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో వంద మంది శిశువులు మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ వరస మరణాలపై మీడియాలో కథనాలు వెలువడ్డాక నాయకులు మేల్కొన్న దాఖలా కనబడింది. కోట స్థానం నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మరణాలపై చేసిన ట్వీట్ చూశాక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్పందించి ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ ఎల్ మీనాను తొలగించి, దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య విద్యా శాఖ కార్యదర్శికి అప్పగించారు. కానీ అంతకు మినహా ప్రత్యేకించి తీసుకున్న దిద్దుబాటు చర్యలేవీ లేవని ఆ తర్వాత కూడా కొనసాగిన శిశు మరణాలు వెల్లడించాయి. డిసెంబర్లో మొదటి 24 రోజుల్లో 77మంది పిల్లలు చనిపోగా 23–24 మధ్య మరో పదిమంది మరణించారు. ఈ అయిదారు రోజుల్లో మరో 13మంది చనిపోయారు. న్యూమోనియా మొదలుకొని విషజ్వరాల వరకూ అనేక కారణాలతో ఇవి సంభవించాయి. కోటలోని ప్రభుత్వాసుపత్రి అతి పెద్దది. 2014 మొదలుకొని అక్కడ సగటున ఏటా వేయిమంది పిల్లలు మృతి చెందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు ఆ సైతం ఆ సంఖ్య 900 దాటింది. రెండేళ్లక్రితం 63మంది శిశువుల ప్రాణాలు హరించిన గోరఖ్‌పూర్ ఆసుపత్రిగానీ, ఇప్పుడు కోట ఆసుపత్రిగానీ మన దేశంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ప్రత్యక్ష ఆనవాళ్లు. నిరుపేద రోగులు జబ్బుపడితే దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తప్ప తగుమాత్రం వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడం అసాధ్యమవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సౌకర్యాలు ఇప్పటికీ సక్రమంగా అందటం లేదు. ప్రాథమిక వైద్య కేంద్రాలు పెద్ద సంఖ్యలోనేవున్నా అక్కడ అవసరమైన మందులు లభ్యం కావడం లేదు. వైద్యులు అందుబాటులో వుండటం లేదు. కనుకనే రోగంబారిన పడినవారు ఇరుగు పొరుగు ఇచ్చే సలహాతో ఏదో ఒకటివాడి, అది ముదిరాక పెద్దాసుపత్రులకు వెళ్తున్నారు. కానీ అక్కడ సైతం అరకొర సౌకర్యాలే లభ్యమవుతున్నాయి. ఇప్పుడు కోట ప్రభుత్వాసుపత్రిలోనూ అదే సమస్య. ఒకపక్క ఆ రాష్ట్రంలో ఎముకలు కొరికే చలివుండగా ఆ ఆసుపత్రికి తలుపులు, కిటికీలు కూడా సక్రమంగా లేవని దాన్ని సందర్శించిన జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది. ఆ ఆసుపత్రి ఆవరణలో పందులు తిరుగాడుతున్నాయని వివరించింది. ఒక శిశువును ఉంచాల్సిన మంచంపై ఇద్దరు ముగ్గుర్ని వుంచి వైద్యం చేస్తున్నారని ఆరోపించింది. కోట ఆసుపత్రిలో ఇంకా వైపరీత్యాలున్నాయి. శిశువుకు తగినంత వెచ్చదనాన్ని అందించడానికి వినియోగించే రేడియెంట్ వార్మర్లు 70 శాతం పనికిమాలినవేనని కమిషన్ తెలిపింది. అలాగే నలుగురు శిశువుల సంరక్షణకు ఒక నర్సు వుండాలని నిబంధనలు చెబుతుంటే కోట ఆసుపత్రిలో 13మందికి ఒక నర్సు పని చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సకు వినియోగించే ఉపకరణాలు మొత్తం 533 వుండగా సరైన నిర్వహణ కొరవడిన కారణంగా అందులో 320 పనిచేయడం లేదని కమిషన్ ఎత్తిచూపింది. ఆపదలోవున్న నవజాత శిశువులకు కావలసిన ఆక్సిజెన్‌ను సిలెండర్ల ద్వారా కాక పైప్లైన్ల ద్వారా అందించాల్సివుండగా ఆ సదుపాయమే లేదని పేర్కొంది. ఇన్ని లోపాలున్నప్పుడు కోట ప్రభుత్వాసుపత్రిలో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడంలో వింతేమీ లేదు. అటువంటివి జరగకపోతే ఆశ్చర్యపోవాలి. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అరికట్టడంలో మన దేశం కొంత మేర ప్రగతి సాధించింది. 2006లో ప్రతి వేయిమంది శిశు జననాల్లో 57 మరణాలుంటే 2013నాటికి ఆ మరణాల సంఖ్య 33కి తగ్గింది. అలాగే ప్రసూతి మరణాలు కూడా 26.9 శాతం తగ్గాయి. అయితే ఇప్పటికీ ఇంక్యుబేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు సక్రమంగా లేక ప్రభుత్వాసుపత్రుల్లో నెలలు నిండని శిశువుల మరణాలు, బలహీన శిశువుల మరణాలు ఇంకా అధికంగానే వుంటున్నాయి. రాజస్తాన్‌లోని పెద్ద నగరంలోని పెద్దాసుపత్రిలో పిల్లలకు చికిత్స చేయడానికి అవసరమైన సదుపాయాలు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఆసుపత్రికి ఎక్కువమంది శిశువులు ఎలాంటి అనారోగ్య సమస్యలతో వస్తారో, వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అవసరమవుతాయో ఆసుపత్రి నిర్వహణకు బాధ్యతవహించే అధికారులకు తెలియదనుకోలేం. ఆ రాష్ట్రంలోని ఆరోగ్యమంత్రిత్వ శాఖకు అవగాహన లేదనుకోలేం. ఏటా అదే ఆసుపత్రిలో వేయిమంది పిల్లలు మరణిస్తుంటే కారణమేమిటని ఆరా తీసేంత తీరిక కూడా వీరెవరికీ లేకపోయింది. పైగా చికిత్సపరంగా ఎలాంటి లోపాలూ లేవని ముఖ్యమంత్రి గెహ్లోత్ చెప్పుకుంటున్నారు. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 2019లో మరణాలు తగ్గాయంటున్నారు. కానీ తాను అధికారంలోకొచ్చి ఏడాదైనా కోట ఆసుపత్రిలో ఉపకరణాలు అంత అధ్వాన్న స్థితిలో ఎందుకున్నాయో, తగినంతమంది సిబ్బంది ఎందుకు లేరో...ఇలాంటì ఆసుపత్రులు మరెన్ని వున్నాయో గెహ్లోత్ ఆత్మ విమర్శ చేసుకునివుంటే బాగుండేది. ఇప్పుడు కోట ఆసుపత్రిలో సంభవించిన వరస మరణాలు చూశాకైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. ఆసుపత్రుల్లో వున్న లోటుపాట్లేమిటో సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి. 2030కల్లా ప్రపంచ దేశాలన్నీ సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పదిహేడింటిలో పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, నాణ్యత గల విద్య వగైరాలతోపాటు ఆరోగ్యం కూడా వుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలను మెరుగుపరచవలసివుంది. అయిదేళ్ల లోపు శిశు మరణాల నియంత్రణలో, ప్రసూతి మరణాల నియంత్రణలో మన దేశం మెరుగైన స్థితిలో వున్నదని అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ తెలిపింది. ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తే తప్ప వ్యాధుల్ని అరికట్టడంలో, పసిపిల్లల మరణాలు నియంత్రించడంలో పూర్తి విజయం సాధించలేం. -
మాయావతి అనూహ్య విమర్శలు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కోటాలో 100మందికిపైగా చిన్నారులు మృతి చెందిన ఉదంతంలో ప్రియాంకగాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కోటాలో చిన్నారుల మరణాలపై రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ మొద్దు నిద్ర నటిస్తోందని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాయావతి ట్విటర్లో మండిపడ్డారు. ఇది తీవ్ర ఖండనార్హమని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధినాయకత్వం, ముఖ్యంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఈ విషయమై మౌనంగా ఉండటం మరింత ఖండనీయమైన అంశమన్నారు. యూపీలో సీఏఏ అల్లర్లలో బాధితుల కుటుంబసభ్యులను కలుస్తున్న మాదిరిగానే కోటాలో పిల్లలను కోల్పోయిన నిరుపేద తల్లులను కలిస్తే బాగుండేది’ అని ఆమె ట్విటర్లో అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే కోటాలో చిన్నారులు చనిపోయారని ఆమె ఆరోపించారు. కోటాలోని బాధితులను కూడా ప్రియాంకగాంధీ పరామర్శించి ఉంటే.. యూపీలో ఆమె పరామర్శ యాత్రలను రాజకీయ అవసరంగా పరిగణించి ఉండేవారు కాదని ఆమె పేర్కొన్నారు. కోటాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత కొద్దిరోజుల్లో 100దాకా నవజాత శిశువులు చనిపోయారని కథనాలు వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక, ప్రియాంక నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలపడితే.. అది తన ఓటుబ్యాంకును దెబ్బతీసే అవకాశముందనే భయంతోనే మాయావతి ఇటీవలికాలంలో ప్రియాంకను తీవ్రంగా విమర్శిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకోవడం కలకలం రేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే పది మంది శిశువులు మృతి చెంది ఆ తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చారు. కోటలోని జేకేలాన్ ఆసుపత్రిలో డిసెంబరు 23న ఆరుగురు, డిసెంబరు 24న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు ఆడ శిశువులుండగా, మిగతా ఐదుగురు మగ శిశువులున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెండ్ డా.హెచ్ఎల్ మీనా మాట్లాడుతూ ‘సాధారణంగా ఆసుపత్రిలో రోజుకు ఒకటి, రెండు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ రెండురోజుల్లో పదిమంది చిన్నారులు మరణించడం బాధాకరం, కానీ సాధారణమే. చాలా వరకు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని కోరామ’ని పేర్కొన్నాడు. అయితే ఆక్సిజన్ అందక, ఇన్ఫెక్షన్ కారణంగా, పలు కారణాల రీత్యా శిశువులు పుట్టిన 48 గంటల్లోనే మృతి చెందారని ఓ వైద్యుడు తెలిపాడు. కాగా ఇదే ఆసుపత్రిలో డిసెంబర్ నెలలోనే ఇప్పటివరకు 77 మంది చిన్నారులు మరణించడం గమనార్హం. -
ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్ అభ్యంతరం!
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్దానీ-2 సినిమాపై రాజస్తాన్‌లోని కోటా వాసులు నిరసన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలతో తెరకెక్కిన సినిమాలో తమ పట్టణం పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న కోటా గురించి ఇలాంటి సీన్లు చిత్రీకరించి సిటీ వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా మాట్లాడుతూ... సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ సినిమాలో పట్టణం పేరును ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదు. కల్పిత కథ కోటాలో జరిగిందని చెప్పడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే. కాగా 2014లో బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘మర్దానీ’ సినిమాకు సీక్వెల్‌గా మార్దానీ-2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా కిరాతకమైన అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇందులో శక్తిమంతమైన పోలీసు అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ మరోసారి తన నటనా విశ్వరూపం ప్రదర్శించనున్నారు. అయితే పాశవిక అత్యాచారాలే ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో పదే పదే కోటా పేరును ప్రస్తావిస్తాంచడం నిరసనకు కారణమైంది. కాగా మార్దానీ-2 ను డిసెంబర్ 13న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.(మర్దానీ 2 ట్రైలర్: ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..) -
వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యలు
జైపూర్: ఓ కులానికి మద్దతుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ కులాలు, మతాలను ప్రోత్సహించడం ఏంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్‌లో కోటాలో మంగళవారం జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా (బ్రాహ్మణ) ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటా. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నాం. సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన ప్రసంగ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గుజరాత్ ఎమ్మెల్యే, ఉద్యమ నేత జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేస్తూ.. ‘రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ ఇలా కులాలను ప్రోత్సహించడం సరికాదు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కులాలను పెంచిపోషిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై పౌరహక్కుల సంఘం కూడా స్పందించింది. స్పీకర్ వ్యవహారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. బాధ్యత గల పదవిలో ఉన్న బిర్లా ఇలా ఓ వర్గాన్ని పొగుడుతూ మాట్లాడం సరికాదని ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని పేర్కొంది. समाज में ब्राह्मणों का हमेशा से उच्च स्थान रहा है। यह स्थान उनकी त्याग, तपस्या का परिणाम है। यही वजह है कि ब्राह्मण समाज हमेशा से मार्गदर्शक की भूमिका में रहा है। pic.twitter.com/ZKcMYhhBt8 — Om Birla (@ombirlakota) September 8, 2019 -
కూలీ కొడుకు.. జేఈఈలో మెరిశాడు
కోట: కొన్నేళ్ల కిందటి వరకు లేఖ్‌రాజ్ భీల్ జేఈఈ మెయిన్ పరీక్ష గురించి విని ఉండడు. అలాంటిది ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. రాజస్తాన్‌లోని ఓ గిరిజన గ్రామానికి చెందిన మొదటి ఇంజనీర్‌గా లేఖ్‌రాజ్ ఘనత సాధించనున్నారు. లేఖ్‌రాజ్ తల్లిదండ్రులు మంగీలాల్, సర్దారీ భాయ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎమ్ఎన్ఆర్ఈజీఏ) కింద పని చేసే రోజువారీ కూలీలు. ‘నాకు ఇంజనీర్ అంటే ఏంటో తెలీదు. నా కొడుకు డిగ్రీ చదువుతాడని నేను కలలో కూడా అనుకోలేదు. మా గ్రామం నుంచి భీల్ వర్గం నుంచి ఇంజనీర్ అవుతున్న మొదటి వ్యక్తి నా కొడుకు కావడంతో నా ఆనందానికి అవధుల్లేవు’అని చమర్చిన కళ్లతో లేఖ్‌రాజ్ తండ్రి మంగీలాల్ అన్నారు. తమ కుటుంబ పరిస్థితి లేఖ్‌రాజ్‌తో చక్కదిద్దుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. తమ గ్రామంలో చదువుకోకుండా కూలీలుగా మిగిలిపోతున్న వారికి చదువు విలువను నేర్పాలనుకుంటున్నట్లు లేఖ్‌రాజ్ తెలిపారు. -
స్పీకర్‌గా బిర్లా ఏకగ్రీవం
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాజస్తాన్‌లోని కోటా నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయిన బిర్లా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తదితరులు మద్దతు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల బరిలో బిర్లా ఒక్కరే ఉండటంతో ఆయనను స్పీకర్‌గా ఎంపికచేస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయినట్టు ప్రొటెం స్పీకర్ వీరేంద్ర ప్రకటించారు. ప్రధాని మోదీ స్వయంగా బిర్లాను స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా పలువురు ఎంపీలు పోడియం వద్దకు వచ్చి కొత్త స్పీకర్‌ను అభినందించారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతిపక్షాలు నూతన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాయి. ‘సభ నిర్వహణలో మీకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం, అధికార పక్షం తరఫున నేను హామీ ఇస్తున్నాను. సభలో మీ మాటే చెల్లుతుంది. మా వాళ్లతో సహా ఎవరు హద్దుమీరినా మీరు కఠిన చర్య తీసుకోవాలి’ అని మోదీ అన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు బిర్లా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇస్తానని అన్నారు. సభను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు విపక్షాలకు తగినంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ కొత్త స్పీకర్‌ను కోరారు. స్పీకరే సభకు అధిపతి అని, దేశ స్వాతంత్య్రానికి, జాతికి ఆ పదవి ప్రతిబింబమని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇంతవరకు లోక్‌సభ చాలా తక్కువ బిల్లులనే స్థాయీ సంఘానికి సిఫారసు చేస్తూ వస్తోందని, ఇకనైనా ఆ తీరు మారాలన్నారు. బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల్లో ప్రాంతీయ, చిన్న పార్టీల సభ్యులకు తగినంత సమయం కేటాయించాలని అకాలీదళ్ ఎంపీ సుఖ్బీర్సింగ్ బాదల్, ఆప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ సూచించారు. -
అయ్యో.. నా కొడుకును నేనే చంపేశానా!
జైపూర్ : రాజస్తాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరునెలల వయసున్న బాలుడిని కన్నతల్లే నీళ్లలో ముంచి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీపికా గుజ్జర్(35) అనే మహిళ భర్త సీతారాం, కుమారుడు శివతో కలిసి కోటాలోని సరస్వతి కాలనీలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి తన కుమారుడిని మిద్దెపైకి తీసుకువెళ్లి అక్కడున్న వాటర్ ట్యాంకులో పడేసింది. అనంతరం మళ్లీ వచ్చి తన గదిలో ఎప్పటిలా నిద్రపోయింది. అయితే కాసేపటి తర్వాత నిద్రలేచిన సీతారాం.. శివ ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో వెంటనే బంధువులకు సమాచారం అందించగా.. వారంతా బాలుడి కోసం వెదకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంకులో చిన్నారి మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీపికాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘ అయ్యో..! నా కొడుకును నేను చంపానా. అలా జరిగి ఉండదు. నాకేమీ గుర్తులేదు అంటూ దీపిక బోరున విలపించింది’ అని పోలీసులు పేర్కొన్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితురాలు ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. కాగా గతంలో ఆమె ఇద్దరు పిల్లలు కూడా చిన్న వయసులోనే చనిపోయారని.. అయితే వారిది సహజ మరణమేనని వెల్లడించారు. -
11 స్థానాలు.. 14 మంది ఎమ్మెల్యేలు
సాక్షి, కోట: 1955లో తొలిసారిగా నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జిల్లా నుంచి తొలిసారిగా 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. జిల్లాలో 11 నియోజక వర్గాలు కాగా ప్రకాశం జిల్లాతో మూడు ఉమ్మడి నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండెపి, నందిపాడు ఇందులో ఉండేవి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రజాపార్టీ, ప్రజాసొసైటీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైనవిగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు ఉన్నా ఈ ఎన్నికల్లో కొందరు స్వతంత్రులు ఎన్నికవడం విశేషం. 1955లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 8,89,214 మంది ఓటర్లు ఉన్నారు. నెల్లూరు, కావలి, ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నందిపాడు, కందుకూరు, కొండేపి అసెంబ్లీ స్థానాలకు ఓపెన్ కేటగిరిలో ఎన్నికలు జరిగాయి. వెంకటగిరి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం ఉమ్మడి నియోజకవర్గాలుగా ఉండేవి. రెండు సార్లు బెడవాడ విజయం తొలిసాధారణ ఎన్నికల్లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి స్థానాల్లో జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి నెల్లూరులో ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఉదయగిరి నుంచి షేక్ మౌలాసాహెబ్, కందుకూరు నుంచి కొండయ్యచౌదరి, కొండెపి నుంచి చెంచురామానాయుడు వంటి ప్రముఖులు విజయం సాధించారు. నందిపాడు నుంచి వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా, కావలి నుంచి బత్తెన రామకృష్ణారెడ్డి ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి స్థానాల్లో ఆరుగురు ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి బసవరెడ్డి శంకరయ్య, స్వర్ణ వేమయ్య సీపీఐ తరపున గెలుపొందారు. వెంకటగిరి నుంచి పాదిలేటి వెంకటస్వామి, కమతం షణ్ముగం, గూడూరు నుంచి పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి, మేర్లపాక మునుస్వామి జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.. -
కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
కోట: ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటలో చోటు చేసుకుంది. బిహార్ శివాన్ జిల్లాలోని హర్దోబరకు చెందిన జితేశ్ (17) గుప్తా ఐఐటీ–జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం మూడేళ్లుగా ఇక్కడి ఇన్స్టిట్యూట్లో సన్నద్ధం అవుతున్నాడు. మంగళవారం హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఈశ్వర్ సింగ్ వెల్లడించారు. కాగా ఐదు రోజుల్లో ఇది మూడో ఆత్మహత్య కావడం గమనార్హం. ‘జితేశ్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయగా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు తన స్నేహితునికి ఫోన్ చేశారు. కిటికీలోంచి జితేశ్ ఫ్యాన్‌కు వేలాడి ఉండటం చూసిన అతని స్నేహితుడు అధికారులకు సమాచారం అందించాడు’అని తెలిపారు. అయితే పోలీసులు జితేశ్ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌కు చెందిన దీక్షా సింగ్ (17) అనే నీట్ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మరో ఐఐటీ అభ్యర్థి దీపక్ దదీచ్ (16) శనివారం మధ్యాహ్నం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో కోటలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య జితేశ్‌తో కలిపి 19 మందికి చేరింది. -
బ్యాటింగ్ ఇవ్వలేదని కత్తితో దాడి..
కోటా: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్లో బ్యాటింగ్ అవకాశం ఇవ్వలేదని ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటంతో ఆ యువకుడు మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ కుమార్‌సింగ్ (17) కోటా నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో నీట్ పరీక్ష కోసం మూడేళ్ల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. రాహుల్ భటీ అనే స్థానికుడు తన మిత్రులతో కలసి శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా తనకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వమని అతుల్ వారిని అడిగాడు. సమ్మతించిన వారు బ్యాటింగ్ అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని ఓవర్ల తర్వాత బ్యాటింగ్ ఇవ్వమంటే అతుల్ ఒప్పుకోలేదు. మరికొన్ని బాల్స్ వేయమని కోరాడు. చిన్నగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఆగ్రహానికి గురైన రాహుల్ తన దగ్గరున్న కత్తితో అతుల్‌ను పొడిచాడు. తీవ్రగాయాలపాలైన అతుల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టు ఎదుట హాజరుపరచడంతో.. 3 రోజుల కస్టడీ విధించింది. -
సర్వీస్ ఛార్జీ పేరిట ఐఆర్సీటీసీ నిర్వాకం
జైపూర్: సర్వీస్ టాక్స్ పేరుతో ఐఆర్సీటీసీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. తన నుంచి రూ.35 అదనంగా వసూలు చేయటంపై రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో 9 లక్షల మంది ప్రయాణికుల నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగానే ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్, 2017లో కోటాకు చెందిన సుజిత్ స్వామి అనే ఇంజనీర్ కోటా నుంచి న్యూఢిల్లీ వరకు టికెట్ బుక్ చేసుకున్నాడు. జూలై 2న అతను ప్రయాణించాల్సి ఉంది. అయితే టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటంతో ఆ యువకుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో టికెట్ డబ్బులు రిఫండ్ అయ్యాయి. మొత్తం రూ. 765 టికెట్ ధరకుగానూ రూ.665 అతనికి వెనక్కి వచ్చింది. లెక్క ప్రకారం చూసుకుంటే అతనికి రూ.65 మాత్రమే ఛార్జీ చేయాల్సి ఉంది. కానీ, అదనంగా రూ. 35 వసూలు చేయటంతో అతను న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ వివరణ ప్రకారం... అదనపు ఛార్జీల వ్యవహారంపై సుజిత్ తొలుత ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశాడు. మిగతా సొమ్మును త్వరలోనే రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ అతనికి బదులిచ్చింది. కానీ, అది జరగలేదు. దీంతో ఆర్టీఐ కింద వివరణ కోరగా.. దానికి ఐఆర్సీటీసీ ఇచ్చిన వివరణను అతను మీడియాకు చూపించాడు. ‘రైల్వే కమర్షియల్ సర్క్ఘులర్ 43’ ప్రకారం.. జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ అమలు(జూలై 1వ తేదీ తర్వాత)లోకి వచ్చాక టికెట్ రద్దు చేసుకుంటే వారికి కూడా సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ లెక్కన సుజిత్‌కు రిఫండ్ చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే సుజిత్ నుంచి రూ.100(రూ.65 క్లరికల్ ఛార్జ్+సర్వీస్ టాక్స్ రూ.35) వసూలు చేయటం జరిగింది అని తెలిపింది. అంతేకాదు ఆర్టీఐ కింద స్వామి దాఖలు చేసిన మరో లేఖలో ఆశ్చర్యానికి గురిచేసే విషయం వెలుగు చూసింది. మొత్తం 9 లక్షల ప్రయాణికుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేశారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 11 రోజుల మధ్య ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకుని.. ఆపై రద్దు చేసుకున్న వారికి ఇలాగే ఛార్జీల పేరుతో కోతలు విధించారు. ఆ సొమ్ము మొత్తం రూ.3.34 కోట్లుగా తేలింది. చాలా మంది ప్రయాణికులు ఈ విషయం తెలీకపోగా.. మరికొందరు తెలిసినా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆర్టీఐ వివరణలో ఉందని స్వామి చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై లోక్‌అదాలత్‌లో సుజిత్ స్వామి పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అదాలత్.. రైల్వే బోర్డు చైర్మన్‌కి, పశ్చిమ మధ్య రైల్వే జీఎంకి, ఐఆర్సీటీసీ జీఎంకీ, కోటా డివిజినల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది. -
ఒక కోట వంద ప్రశ్నలు
-
'పద్మావతి' వివాదం.. బద్దలైన థియేటర్!
-
'పద్మావతి' వివాదం.. బద్దలైన థియేటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాక వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన ఓ థియేటర్‌పై దాడి చేసింది. కర్ణిసేన కార్యకర్తలు ఆకాశ్ థియేటర్‌పై దాడి చేసి కౌంటర్ అద్దాలను, కిటికిలను ధ్వంసం చేశారు. ఆకాశ్ థియేటర్లో తాజాగా ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ విషయంలో తెలుసుకున్న రాజ్‌పుత్ వర్గీయులు కర్ణిసేన ఆధ్వర్యంలో థియేటర్‌పై దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా స్పందించారు. ప్రజాస్వామికంగా ఎవరైనా నిరసన తెలుపవచ్చునని, కానీ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. చట్టప్రకారం చర్యలు తప్పవని కర్ణిసేనను ఆయన హెచ్చరించారు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. -
సగం కిరోసిన్‌కు ‘పొగ’
– అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కుదింపు -4 లీటర్లకు బదులు 2 లీటర్లే – ఈనెల కోటా నుంచే అమలు కాకినాడ సిటీ : పేదల సంక్షేమమే తమ లక్ష్యమని ఆర్భాటంగా ప్రచారం చేసుకునే తెలుగుదేశం ప్రభుత్వమే ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో భారం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి చౌకధరలలో పంపిణీ చేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక బియ్యం, పంచదార, కిరోసిన్ మినహా మిగిలిన పామాయిల్, గోధుమపిండి, కందిపప్పులకు ఒక్కొక్కటిగా మంగళం పాడింది. తాజాగా ఈనెల కోటా నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించింది. ఇప్పటివరకు నాలుగు లీటర్లు ఇస్తున్న కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించింది. ‘పొగరహితం’ పేరుతో త్వరలో మొత్తానికి మంగళం! జిల్లా వ్యాప్తంగా 2,647 చౌకదుకాణాల పరిదిలో 16,08,711 మంది అన్నపూర్ణ, అంత్యోదయ అన్నయోజన, తెలుపు కార్డుదారులున్నారు. గ్యాస్ లేని కార్డుదారులకు అర్బన్ ప్రాంతాల్లో 4 లీటర్లు, రూరల్ ప్రాంతాల్లో 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తుండగా గ్యాస్ ఉన్న కార్డుదారులకు అన్ని ప్రాంతాల్లో ఒక లీటరు ఇస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ప్రతి నెలా జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో గ్యాస్ లేనివారికి 2 లీటర్లు, గ్యాస్ ఉన్న వారికి ఒక లీటరు పంపిణీ చేస్తారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులు సుమారు 65 వేల మందికి 4 లీటర్లకు బదులు రెండు లీటర్లే అందనుంది. ఇదిలా ఉండగా కిరోసిన్ అనేది ఒక్క వంటకే కాకుండా ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెబుతూ రాష్ట్రాన్ని పొగరహితంగా ప్రకటించే సాకుతో భాగం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా సబ్సిడీపై ఇచ్చే ఒకటి, రెండు లీటర్ల కిరోసిన్‌ను కూడా రానున్న రెండు, మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉందన్న అనుమానం బలపడుతోంది. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు త్వరితంగా మంజూరు చేఏందుకు చర్యలు తీసుకోవాలన్న ఆదేశం వెనుక లక్ష్యం అదేనంటున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారుల్లో వంట గ్యాస్ ఉన్న వారు 13,10,669 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ 2 లీటర్లే జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులకు 4 లీటర్ల కిరోసిన్ పంపిణీ జరిగేది. ఈనెల నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకూ 2 లీటర్లే ఇవ్వనున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. -వి.రవికిరణ్, జిల్లా పౌరసఫరాల అధికారి కిరోసిన్‌లో కోత దారుణం అర్బన్ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించడం దారుణం. వంట గ్యాస్ ఉన్నా కార్డుదారులు అనేక సందర్భాల్లో కిరోసిన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ లేనప్పుడు కిరోసిన్ దీపాలపై ఆధారపడే పేదలు ఉన్నారు. - పలివెల వీరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు -
చేతులెత్తేశారు!
‘ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు’ బ్రేక్ - కార్పొరేషన్ పరిధిలో రేషన్ షాపు నిర్వాహకుల ససేమిరా - కోటా కార్డులకే సరుకులిస్తామని స్పష్టం - ఇతరులకు ఇవ్వలేమని తేల్చిన వైనం - వలస కుటుంబాలకు తప్పని అవస్థలు - 28 షాపులకు అధిక రేషన్ కోటా ఇవ్వండి - ప్రభుత్వాన్ని కోరిన జిల్లా జాయింట్ కలెక్టర్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రేషన్ సరుకులు ఏ రేషన్ దుకాణంలోనైనా తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుకు బ్రేక్ పడుతోంది. నిర్ణీత కోటా కార్దుదారులకు మించి రేషన్ కోసం ఇతర ప్రాంతాల వారు వస్తుండటంతో తమ పరిధిలోని కార్డుదారులకు చివరకు సరుకులు లేకుండా పోతున్నాయని కొద్ది మంది రేషన్‌షాపు యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి పరిధిలోని కార్డుదారులకు వారే రేషన్ ఇవ్వాలని... వేరే షాపునకు వస్తే సరుకులు ఇవ్వమని తేల్చి చెప్పేందుకు రేషన్‌షాపు యాజమాన్యాలు నిర్ణయించాయి. వాస్తవానికి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ–పాస్ విధానంలో కుటుంబంలోని సభ్యులు ఎవరైనా వేలిముద్రలు వేసి రాష్ట్రంలోని ఏ రేషన్‌షాపు నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, తాజాగా రేషన్‌షాపు యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో ఎక్కడైనా రేషన్ విధానానికి బ్రేకులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుదారుల అధిక రద్దీ ఉన్న షాపులకు అదనపు కోటా సరుకులను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ కోరారు. మా కార్డులకే రేషన్ జిల్లాలో 11 లక్షల 52 వేలకుపైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు రేషన్ సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా 2,414 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ–పాస్ విధానం అమలుతో జిల్లాలో ఏ కార్డుదారైనా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కలిగింది. గ్రామాల్లో రేషన్‌కార్డులు ఉండే అనేక మంది కూలీ కోసం పొట్టచేతబట్టుకుని కర్నూలు నగరానికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ–పాస్ విధానం అమలుతో ప్రధానంగా బతికేందుకు వలస వచ్చిన కుటుంబాలు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండే షాపులల్లోనే రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. అయితే, వీరు ముందుగానే రేషన్ సరుకులు తీసుకోవడంతో ఆ షాపు పరిధిలో ఉండే కార్డుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి సరుకులు కాస్తా మిగలడం లేదు. ఫలితంగా వీరు రేషన్‌షాపు డీలర్లతో వాదనకు దిగుతున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలోని 28 రేషన్షాపులల్లో ఈ సమస్య ప్రధానంగా ఉంది. దీంతో వీటికి అదనపు కోటా రేషన్ సరుకులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని జేసీ కోరారు. అదనపు కోటా ఇవ్వండి ప్రధానంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 28 షాపుల్లో సరఫరా చేసిన కోటాకు మించి రేషన్‌దారులు సరుకుల కోసం వస్తున్నారని అధికారులు లెక్క తేల్చారు. గత మూడు నెలల కాలాన్ని పరిగణలోనికి తీసుకుని ఎక్కడైతే కార్డులకు మించి సరుకులు కావాలనే డిమాండ్ ఉందో.. అలాంటి షాపులను గుర్తించారు. ఈ విధంగా ఎంపిక చేసిన 28 రేషన్ షాపులకు అదనపు కోటా సబ్సిడీ సరుకులకు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు తాజాగా లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం స్పందించి అదనపు కోటా సరఫరా చేస్తే ఈ–పాస్ విధానం అమలుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. ప్రభుత్వాన్ని కోరాం జిల్లాలో కొన్ని రేషన్‌షాపుల వద్ద ఈ–పాస్ విధానంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల పరిధిలోని కార్డుదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారని సమాచారం అందింది. అందువల్ల ఈ విధంగా సమస్యలున్న 28 రేషన్‌షాపులకు అదనపు కోటా సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అనుమతి వచ్చిన వెంటనే ఇబ్బందులు లేకుండా చూస్తాం. – హరికిరణ్, జాయింట్ కలెక్టర్ -
27 ఏళ్లుగా 144 సెక్షన్
- రాజస్తాన్‌లోని కోటాలో 1989 నుంచి ఆంక్షలు -కోర్టులు చెప్పినా.. మారని పరిస్థితి వారం రోజులు 144 సెక్షన్ ఉంటేనే అమ్మో అంటాం. కానీ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 27 ఏళ్లుగా.. 144 సెక్షన్ నీడలో జీవితం గడుపుతున్నారు రాజస్తాన్‌లోని కోటా వాసులు. ప్రముఖ విద్యాకేంద్రమైన కోటాలో.. 144 సెక్షన్ వల్ల ఓ పండగలేదు, ఊరేగింపు లేదు. పెళ్లికి, చావుకు తప్ప మిగిలిన సమయాల్లో నలుగురికి మించి కనబడితే.. పోలీసులు ఉతికేస్తారు. కోటాలోని బజాజ్ ఖానా, ఘంటాగఢ్, మక్బారా పఠాన్, తిప్తా ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. రెండు కిలోమీటర్ల పొడవుండే ఈ ప్రాంతాల్లో మైనారిటీలు ఎక్కువగానివసిస్తున్నారు. ఐఐటీ విద్యాకేంద్రం కోటా.. దేశవ్యాప్తంగా కోటాకు మంచి పేరుంది. ఐఐటీ పోటీ పరీక్షలకోసం ఇక్కడున్న కోచింగ్ సెంటర్లలో చేరేందుకు దేశం నలుమూలలనుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు వస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికే మెజారిటీ ర్యాంకులొస్తాయని నిరూపితమైంది. కానీ.. ఇదే కోటాలోని ఓ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా 144 సెక్షన్ అమల్లో ఉండటం ఆశ్చర్యకరమే. అప్పటినుంచీ..1989లో ఒకసారి కోటాలో మత ఘర్షణలు రేగాయి. కొన్ని రోజులకే కోటాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి కుదురుకున్నా.. ఈ ప్రాంతాల్లో మాత్రం చాలా ఉద్రిక్తంగానే ఉంది. దీంతో 144 సెక్షన్ పొడిగించారు. ఆ తర్వాత ఎప్పుడేమవుతుందోనని పొడిగిస్తూనే ఉన్నారు. అయితే.. నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, అంతా ప్రశాంతంగానే ఉన్నా తమను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు అంటున్నారు. కోర్టుకెళ్లినా.. 20 ఏళ్ల తర్వాత 2009లో స్థానికులంతా కోర్టుకెళ్లారు. 144ను ఎత్తేయాలని విన్నవించారు. కోర్టుకు ప్రభుత్వం సానుకూలంగా సమాధానమిచ్చి కర్ఫ్యూ ఎత్తేస్తామని చెప్పినా.. ఇంతవరకు అది అమలు చేయలేదు. దీనిపై అధికార వర్గాలు కూడా ఈ ప్రాంతం చాలా సున్నితమైందని, ఎప్పుడైనా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడొచ్చని.. అందుకే 144 సెక్షన్ కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం, అధికారుల తీరును ఆర్టీఐ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రజల హక్కులను సర్కారు కాలరాస్తోందని విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆర్నెల్లకు మించి 144 సెక్షన్ అమలు చేయకూడదని కానీ.. ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి ప్రజల తలరాతలు మారటం లేదని న్యాయవాదులంటున్నారు. -
మూలనపడేశారు..
చాలాపాఠశాలల్లో విరిగిపోయిన ‘స్నేహబాల’ ఫర్నీచర్ పట్టించుకోని అధికారులు విద్యాశాఖాధికారుల ఆదేశాలు పాఠశాలలో అమలుకు నోచుకోవడంలేదు. విద్యార్థులు కోసం ఫర్నీచర్ ఏర్పాటుచేసినా అవి వినియోగంలోలేవు. మూలనపడి విరిగిపోయే స్థితికి చేరుకున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదు. పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్‌ను ఫర్నీచర్ మరమ్మతులకు వినియోగించుకునే అవకాశం ఉన్నా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడంలేదు. కోట : 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల తీరప్రాంతం అతలాకుతలమైంది. పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో తీరప్రాంత మండలాల్లోని పాఠశాలలకు స్నేహబాల కార్యక్రమం ద్వారా ఫర్నిచర్, విద్యాసామగ్రిని అందజేశారు. జర్మనీకి చెందిన యూనిసెఫ్ బందం ఈ కార్యక్రమానికి చేయూతనందించింది. ఈ బందం అన్నీ తీరప్రాంత మండలాల్లోనూ పర్యటించి పాఠశాలల వివరాలు సేకరించి సహాయసహకారాలు అందించింది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 210 పాఠశాలల్లో విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు వీలుగా ఫర్నిచర్ ఇచ్చారు. కోట మండలంలో 67 పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువుగా ఉన్న నాలుగు పాఠశాలలు మినహా అన్నీ పాఠశాలలకు ఫర్నిచర్‌ను కేటాయించారు. దీనికోసం ఒక్కో పాఠశాలకు రూ.50వేలు వరకు నిధులు వెచ్చించారు. విరిగిన కుర్చీలే దర్శనం.. ఫర్నీచర్ సమకూరినా వినియోగించకపోవడతో కొద్ది సంవత్సరాలుగా పాఠశాలల్లో విరిగిన కూర్చీలే కనబడుతున్నాయి. అనేక పాఠశాలల్లో ఫర్నిచర్ సామగ్రి దెబ్బతిని, మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఉపాధ్యాయులు వాటిని మూలనపడేశారు. యూనిసెఫ్ ఫర్నీచర్‌ను వినియోగించాలని ఓసారి ఖచ్చితమైన ఆదేశాలు అందడంతో కొందరు ఉపాధ్యాయులు తమ సొంతనిధులతో మరమ్మతులు జరిపించారు. ఇటీవల మండలంలో పర్యటించిన విద్యాశాఖ మానిటరింగ్ టీం సభ్యులు ఫర్నిచర్ ఉపయోగించని నాలుగు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నివేదిక పంపారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు. మండలంలో 27 పాఠశాలల్లో ఫర్నీచర్‌ను విద్యార్థుల అవసరాల మేరకు వినియోగిస్తున్నారు. మిగతా పాఠశాలల్లో అవి ఎందుకూ పనికిరాకుండా మూలనపడే ఉన్నాయి. -
'కోట'లో 12వ ఆత్మహత్య
కోట: ఐఐటీ, మెడికల్ ప్రవేశ పరీక్షల శిక్షణకు దేశంలోనే పేరుగాంచిన కోట(రాజస్థాన్)లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ శిక్షణా కేంద్రాల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తరచూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా బిహార్‌లోని మోతిహరి జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ సింగ్ అనే విద్యార్థి కోటలోని తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది కోటలో ఇది 12వ ఆత్మహత్య. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు ప్రిపేరవుతున్న కుమార్ సింగ్ ఆత్మహత్యకు కొద్దినిమిషాల ముందు తల్లిదండ్రులతో మాట్లాడాడని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాధాకృష్ణ తెలిపారు. అతడి గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. జూలై 5న బిహార్ కే చెందిన నిఖిల్ కుమార్ అనే మెడికల్ శిక్షణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే నెలలో బిహార్ కు చెందిన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. -
పొర్లుకట్టలు పటిష్టం చేస్తాం
కోట : పుచ్చలపల్లి, కర్లపూడి గ్రామాల్లో స్వర్ణముఖి పొర్లుకట్టలను జిల్లా కలెక్టర్ జానకి మంగళవారం పరిశీలించారు. గతేడాడి వరదల సమయంలో పొర్లు కట్టలు కోతకు గురైన ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్లపూడి రైతులు తమ సమస్యలను ఆమె దష్టికి తెచ్చారు. రైతుల సహకరిస్తేనే పనులు త్వరగా పూర్తి చేయగలుగుతామని కలెక్టర్ తెలిపారు. కొత్తపాళెం నుంచి సిద్దవరం వరకు 2.5కిలో మీటర్లు మేర స్వర్ణముఖి చల్లకాలువ పొర్లు కట్టలకు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉందన్నారు. బ్రీచ్‌లకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్న ఆక్వారైతుల విన్నపాన్ని ఆమె అంగీకరించలేదు. పనులు ప్రారంభిస్తే మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పొర్లు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను మ్యాప్ద్వారా పరిశీలించారు.ఆమె వెంట సబ్‌కలెక్టర్ గిరీషా, జలవనరుల శాఖ ఈఈ నారాయణ్‌నాయక్, డీఈ ఆనంద్, ఏఈ ఫరూక్, తహసీల్దార్ లీలారాణి, కర్లపూడి సర్పంచ్ చెంచురాఘవరెడ్డి, ఆనంద్‌రెడ్డి ఉన్నారు. -
కట్నం కింద వేపమొక్క ఇచ్చాడు!
కోట: కట్నం లేకుండా వివాహం చేసుకునే యువకులు కరువైపోతున్న ఈ రోజుల్లో రాజస్థాన్ కోటా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కట్నం కింద ఓ కుటుంబం కట్నంగా వేపచెట్టును తీసుకుని జిల్లా మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఢాకర్ కేరి గ్రామానికి చెందిన శకుంతల కబ్రా తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. ప్రభుత్వ పనులకు సంబంధించిన అప్లికేషన్లు నింపడానికి గ్రామస్థులకు సాయపడుతుంటుంది. భిల్వారా జిల్లాలోని లడ్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో కబ్రాకు ఆమె తండ్రి వివాహం చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం లక్ష్మణ్ కుటుంబసభ్యులను సంప్రదించిన ఆయన తన కూతురు, ఒక వేప మొక్కను తప్ప కట్నం ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని వారితో చెప్పాడు. వరుడి కుటుంబసభ్యులు ఇందుకు అంగీకరించారు. లడ్ పూర్ నుంచి ఓ చిన్న ట్రక్కులో దాదాపు 70 మంది కబ్రా, లక్ష్మణ్ వివాహానికి ఢాకర్ కేరికి తరలివచ్చారు. వారందరి ముందు ఒక వేపమొక్కను తీసుకువచ్చి లక్ష్మణ్ కు కబ్రా తండ్రి అందించాడు. కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం జిల్లా మొత్తం వ్యాపించింది. కట్నం లేకుండా వేపమొక్క తీసుకుని వివాహం చేసుకున్నారంటా.. అంటూ అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం ఇవ్వకుండా వివాహం చేసుకోవడంపై వధువు కబ్రా మాట్లాడుతూ.. వేప మొక్కను తన వివాహానికి ఆమె తండ్రి కట్నంగా ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. కట్నం కోసం మహిళలను వేధిస్తున్న ఈ రోజుల్లో తన పెళ్లి సమాజానికి ఆదర్శం అవుతుందని చెప్పారు. -
జైల్లో ఉంటూ.. అరుదైన రికార్డు!
జైపూర్: జైలులో తండ్రితోపాటు కలిసి ఓపెన్ కారాగారంలో ఉంటూ ఓ కుర్రాడు ఐఐటీ సీటు సాధించాడు. జేఈఈ పరీక్ష పాసయ్యాడు. పూల్ చంద్ అనే వ్యక్తి ఓ నేరానికి సంబంధించి కోట ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓపెన్ జైలులో కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతి ఉండటంతో తండ్రితోపాటే అక్కడ ఉండేందుకు అతడి కుమారుడు పీయూష్ మీనా సిద్ధమయ్యాడు. పేదరికమే ఈ పరిస్థితికి దారితీసింది. తండ్రి వారించినా వినకుండా జైలులోనే 8 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు ఉండి వెలుతురు సరిగా రాని గదిలో ఉంటూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమై విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీ కింద 453వ ర్యాంక్ సాధించాడు. ఓపెన్ జైలులో కుటుంబసభ్యులను శిక్షను అనుభవించేవారితోపాటే ఉండనివ్వడంతోపాటు రోజూవారీ అవసరాల కోసం పనికి కూడా బయటకు వెళ్లి రావచ్చు. కాగా, తండ్రి పూల్ చంద్ కు ఇష్టం లేకపోయినా.. హాస్టల్, కోచింగ్ ఫీజులకు డబ్బు సరిపోకపోవడంతో పీయూష్ మీనా 2014 జులైలో జైలుకు వచ్చేశాడు. ఈ విషయంపై మాట్లాడిన మీనా తండ్రి బంధువులు, స్నేహితులు అందరిని సంప్రదించగా లక్ష రూపాయలు ఏర్పాటు అయ్యాయని కోచింగ్, హాస్టల్ ఫీజుకు రెండు లక్షలు అవసరమయ్యాయని తెలిపారు. ఎలాగైనా బిడ్డను చదివించుకోవాలని గతంలో ప్రభుత్వ టీచర్ అయిన తాను ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ గా ప్రయత్నిస్తే, నేరస్థుడిని కావడం మూలాన అవేమీ దొరకలేదని, దాంతో మెడికల్ స్టోర్ లో హెల్పర్ గా పనిచేసినట్లు వివరించారు. జేఈఈలో ర్యాంక్ సంపాదించడంపై మాట్లాడిన పీయూష్ మీనా.. మొదట్లో జైల్లో చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పాడు. కచ్చితమైన నిబంధనలు ఉండటంతో పాటు రాత్రి 11గంటలకు లైట్లన్నీ ఆర్పివేస్తారని తెలిపాడు. జైలు గది మరీ చిన్నదిగా ఉండటంతో పాటు వెలుతురు కూడా ఎక్కువగా వచ్చేది కాదని చెప్పాడు. తాను రోజూవారీ సిలబస్ ను పూర్తి చేయడానికి చదువుకునే సమయంలో తన తండ్రి బయట ఉండేవారని వివరించాడు. ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేసిన పీయూష్ శిక్షాకాలం ముగిసిన తర్వాత తండ్రి బాగోగులు చూసుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. మొత్తం 12 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్న పూల్ చంద్ ఇప్పటికి 10ఏళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేశాడు. -
ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ...
ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తర్వాత కూడా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓసీలకు 100 మార్కులు కటాఫ్ పెడితే, ఘజియాబాద్‌కు చెందిన కృతి త్రిపాఠి ఏకంగా 144 మార్కులు తెచ్చుకుంది. కాస్త కష్టపడితే ఆమెకు ఐఐటీలో సీటు గ్యారంటీగా వస్తుందని కూడా అందరూ చెప్పారు. కానీ, అసలు ఆమె కల వేరు.. తనకు ఇంజనీరింగ్ చదవడమే ఇష్టం లేదు. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనుకుంది. ఐఐటీలో బీటెక్ చేస్తే అంతరిక్ష శాస్త్రవేత్త కావడం అసాధ్యం. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా ఆమెను బీటెక్ చేయించాలనుకున్నారు. ఇంజినీరింగ్ చదవక తప్పదనే ఒత్తిడితో 17 ఏళ్ల కృతి త్రిపాఠి బలవన్మరణానికి పాల్పడింది. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఐదు పేజీల ఆత్మహత్య లేఖ రాసిన కృతి ఐదంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయింది. కృతి కుటుంబం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి కోటాకు తరలివచ్చింది. జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటా కోచింగ్ సెంటర్లకు ఫేమస్. ఇక్కడే ఆమె కోచింగ్ తీసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆమె తండ్రి కోటాలో ఉండగా, తల్లి ఘజియాబాద్‌లో ఉంది. ఉదయం 8.30 గంటల సమయంలో కృతి తండ్రి అన్షుమన్ జిమ్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆయనకు భార్య నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి అపార్టుమెంట్ పై నుంచి దూకేసినట్లు పొరుగువాళ్లు చెప్పారని, ఒకసారి వెళ్లి చూడమని ఆమె అన్నారు. వెంటనే అన్షుమన్ అక్కడకు వెళ్లగా.. విగతజీవిగా పడి ఉన్న తన కూతురు కనిపించింది. అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్స్‌లో ఆమెకు 144 మార్కులు వచ్చాయి. అయినా ఇంజినీరింగ్ ఇష్టం లేదంటూ కృతి ఆత్మహత్య చేసుకుంది. కోటా నుంచి మొత్తం 35వేలమంది జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. అయితే, కుటుంబసభ్యుల అంచనాలు, ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు (కోట) : అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం రాఘవాపురంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాఘవాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మీ(32), అంకయ్యలు భార్యాభర్తలు. అయితే గత కొన్ని రోజులుగా తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అంకయ్య భార్యను హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాకాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆవకాయ చూపులు
హీరోయిన్ రజనీని పెళ్లిచూపులు చూసుకోవడానికి శుభలేఖ సుధాకర్ తన అన్నయ్యలతో కోట శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు. కానీ వాళ్లు అన్నయ్యలు కాదు... గున్నయ్యలు. ముగ్గురూ కారులోంచి దిగుతారు. కోట: రండి..రండి.. శుభలేఖ సుధాకర్: నమస్కారం అండి.. నా పేరు కుక్కుటేశ్వరరావు, వీళ్లిద్దరూ నా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఇతను ఘనోదరుడు. కోట: వీరబాహుడు, ఘనోదరుడా.. అదేంటండి రాక్షసుల పేర్లు. శుభలేఖ: మా నాన్నగారు అదో టైపు మనిషిలేండి! మామూలుగా అందరూ దేవుళ్ల పేర్లు పెడతారు. కానీ మాకు రాక్షసుల పేర్లు పెట్టారు. అందరూ వెళ్లి మంచం మీద కూర్చుంటారు. కోట: కూర్చోండి బాబూ కూర్చోండి. వీరబాహుడు: మా తమ్ముడికి కాబోయే భార్యకు వంట, ఆటాపాటా వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. కోట: మా అమ్మాయని చెప్పుకోవడం కాదు గాని బాగా ఆడగలదు పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి కన్నాంబ, కాంచనమాల ఇలా అన్నమాట. ఘనోదరుడు: కన్నాంబ, కాంచనమాల... వాళ్లిద్దరూ ముసలాళ్లు అయిపోయి చనిపోయారు కదండి..! కోట: వాళ్లు పోయారా! నాకు తెలీదు లేండి! నేను సినిమా చూసి పాతికేళ్లు దాటింది. బ్రహ్మానందం అప్పటికే లడ్టూలు అవీ తీసుకొస్తుంటే, కోట గబాలున వెళ్లి కోట: ఏమిటిరా ఇది అరగుండు వెధవా... ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతుందనుకుంటున్నావా! బ్రహ్మీ: పెళ్లి వారు వస్తున్నారని అమ్మగారే చేశారండయ్య. ఈ మాత్రం పెట్టకపోతే బా..బా.. బాగుండదని... కోట: బాగుండటం ఏమిటి నీ బొంద.. మనుషుల సైజులు చూశావా. ఒక్కొక్కడు తిరుపతి కొండంత ఉన్నాడు..ఊదే స్తారు.. వీర: ఏమిటవి టిఫిన్లా..? వెరీ గుడ్ తీసుకురండి ఓ పనైపోతుంది. రెండోసారి వచ్చారు. శుభలేఖ సుధాకర్: నమస్కారం అండీ... కోట: కాఫీలు అవి టీబీలోనే తాగొచ్చారు కదా..? వీరబాహుడు: కాఫీలే తాగాం. టిఫిన్లు చేయలేదు. మీ ఇంట్లో తిందామని. కోట: మా ఇంట్లో టిఫిన్లు లేవు. అసలు మా ఇంట్లో ఉప్పు లేదు. ఉప్పు లేకుండా ఎలా తింటారు. ఘనోదరుడు: అయ్యో పర్లేదండి! ఏవండి జానకమ్మగారూ... కోట: ఇప్పుడు అదెందుకండీ! నన్ను తింటున్నారు చాలట్లేదూ..! జానకమ్మ: రండి బాబూ రండి ఘనోదరుడు: ఇంట్లో ఆవకాయ ఉందామ్మ కోట: ఆవకాయా! అమ్మో కారం. శుభలేఖ సుధాకర్: వీళ్లు పచ్చళ్లు తినరండీ... పెచ్చులు మాత్రమే తింటారు. బ్రహ్మి (స్వగతం): తిక్క కుదిరింది తింగరి పీనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా ఆ మొహం చూడు. పోతావ్రొరేయ్ నిత్య నికృష్ట. ఏ ఏటికాయేడు నువ్వు నిలవుంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా తెప్పించు. పోతావ్రొరేయ్... నాశనమైపోతావ్..! వీరబాహుడు, ఘనోదరుడు జాడీలోంచి పచ్చడి ముక్కను తీసుకుని నీళ్లలో ముంచి తింటూ ఉంటారు కోట పట్టరాని కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇంతలో శు.సు: బాగుందండీ... నాకు చాలా బాగా నచ్చింది. కోట: ఏమిటి ఆవకాయనా? శు.సు: కాదండీ మీ అమ్మాయి. మరి ఆటాపాటా..? కోట: ఎలాగో మాష్టారు వచ్చి పాఠం చెప్పే టైమైంది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్లు... ఆవకాయ ముక్కల్ని నవిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. వీరబాహుడు: అబ్బే దీనిని ఆపడం ఎందుకండీ... దేనికదే! ప్రేక్షకుల నవ్వు... ఆ వెనుక పాట మొదలైపోతాయి. - శశాంక్ బూరుగు -
హ్యాపీ బర్త్‌డే కోట