
కోటా: రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు.
500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న ఈ రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ రావణుని బొమ్మ తన మెడను పక్కకు తిప్పి, కత్తిని ప్రయోగించనుంది. ఈ బొమ్మను తయారు చేసేందుకు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్టోబర్ 12న దసరా సందర్భంగా రావణ దహనం జరగనుంది. అలాగే ఇక్కడ దసరా జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రావణునితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలను కూడా దహనం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. కోటా మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీకి చెందిన కళాకారులకు ఈ బొమ్మల తయారీ పనులను అప్పగించింది. 15 మంది కళాకారుల బృందం రావణుడి వంశాన్ని సిద్ధం చేస్తోంది. రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండగా, మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలు 60 అడుగుల ఎత్తున ఉంటాయి. రావణుడి వంశం తయారు చేసేందుకు రూ.7.30 లక్షలు ఖర్చు అవుతున్నదని నిర్వాహకులు తెలిపారు.
ఇది కూడా చదవండి: కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ..
Comments
Please login to add a commentAdd a comment