biggest
-
కోడి కాదిది.. హోటల్
ఇదేదో రాక్షస కోడి అనుకుంటున్నారా? అదేమీ కాదు. ఆ ఆకారంలో ఉన్న హోటల్. కోడి ఆకృతిలోని హోటళ్లలో ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇది ఫిలిప్పీన్స్‌లో కంపుస్టోహన్లోని హైలాండ్ రిసార్ట్‌లో ఉంది. 115 అడుగుల ఎత్తు, 92 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పున్న ఈ హోటల్లో సకల సదుపాయాలతో కూడిన 15 గదులున్నాయి. ఈ నిర్మాణం తన భార్య ఆలోచనంటూ రిసార్టు యజమాని మురిసిపోతున్నాడు. ఫిలిప్పీన్స్ తుఫాన్లకు, వరదలకు పెట్టింది పేరు. వాటన్నింటినీ తట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఈ నిర్మాణాన్ని కేవలం ఆర్నెల్లలో పూర్తి చేశారట! -
గార్ధభ సంరంభం
గాడిదల సంతలు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గాని, రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని లునియావాస్ గ్రామంలో జరిగేది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గాడిదల సంత. ఏటా దసరా నవరాత్రుల్లో ఇక్కడ గాడిదల సంత జరుగుతుంది. దాదాపు ఐదువందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పురాతనమైన గాడిదల సంతగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ సంత జైపూర్–ఆగ్రా రహదారిపై ఏకంగా 22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నవరాత్రుల రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఎటుచూసినా గాడిదలే కనిపిస్తాయి. ఈ సంతకు వివిధ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తమ గాడిదలను తీసుకు వస్తారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ సంతను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు రాజస్థాన్ పర్యాటక శాఖ ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనివల్ల ఈ సంతకు దేశ విదేశాల పర్యాటకులు కూడా వస్తుండటం విశేషం. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతూ వస్తోందని చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో ‘ఖాలాకానీ’ అని స్థానికులు పిలుచుకునే ‘కాళరాత్రి’ అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గార్ధభం కనుక ఇక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సంతలో గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా, గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందేలు, గాడిదలు లాగే బళ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ సంతలో స్వదేశీ జాతులకు చెందిన కథియవాడీ, మార్వాడీ గాడిదలకు, అఫ్గాన్ గాడిదలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఈ సంతలో గాడిదలకు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టి మరీ అమ్ముతుంటారు. గత ఏడాది ప్రియంకా చోప్రా పేరు ఉన్న గాడిదకు ఏడువేల రూపాయల ధర పలికినట్లు ఒక వర్తకుడు చెప్పాడు. ఈ సంతలోని గాడిదల ధరలు మూడువేల రూపాయల నుంచి పదిహేనువేల రూపాయల వరకు ఉంటాయి. అఫ్గాన్ గాడిదలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. గాడిదల అందాల పోటీలు, పరుగు పందేలు వంటి వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన గాడిదల యజమానులకు వేర్వేరు దశల్లో ఐదువందల నుంచి పదివేల రూపాయల వరకు నగదు బహుమతులు కూడా ఉంటాయి. -
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
కోటా: రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు.500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న ఈ రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ రావణుని బొమ్మ తన మెడను పక్కకు తిప్పి, కత్తిని ప్రయోగించనుంది. ఈ బొమ్మను తయారు చేసేందుకు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్టోబర్ 12న దసరా సందర్భంగా రావణ దహనం జరగనుంది. అలాగే ఇక్కడ దసరా జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.రావణునితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలను కూడా దహనం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. కోటా మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీకి చెందిన కళాకారులకు ఈ బొమ్మల తయారీ పనులను అప్పగించింది. 15 మంది కళాకారుల బృందం రావణుడి వంశాన్ని సిద్ధం చేస్తోంది. రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండగా, మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలు 60 అడుగుల ఎత్తున ఉంటాయి. రావణుడి వంశం తయారు చేసేందుకు రూ.7.30 లక్షలు ఖర్చు అవుతున్నదని నిర్వాహకులు తెలిపారు.ఇది కూడా చదవండి: కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ.. -
ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి?
తన మాటల చతురతతోనే కాదు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రధాని మోదీ అందరినీ ఆకట్టుకుంటారు. ఇంతకీ ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి? ఈ ప్రశ్నకు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏమి సమాధానమిచ్చారు?తన రాజకీయ జీవితంలో తాను 250 జతల దుస్తులు కలిగి ఉన్నానని తనపై ఒకమారు ఆరోపణ వచ్చిందని మోదీ తెలిపారు. ఈ ఆరోపణను కాంగ్రెస్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్‌సింగ్ చౌదరి చేశారని, ఓ బహిరంగ సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారని ప్రధాని మోదీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఆ సమయంలో తాను ప్రజలతో.. ‘250 కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కావాలా? లేక 250 జతల బట్టలు ఉన్న ముఖ్యమంత్రి కావాలా?’ అని అడిగానని మోదీ గుర్తుచేసుకున్నారు. అప్పుడు గుజరాత్ ప్రజలు 250 జతల దుస్తులు కలిగిన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పారన్నారు. ప్రధాని మోదీ ఆ ఇంటర్వ్యూలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. నాడు చౌదరి ఆరోపణలను తాను అంగీకరించానని మోదీ తెలిపారు. అయితే ఆ మాజీ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ రోజు జరిగిన బహిరంగ సభలో.. ఆయన చెప్పిన సంఖ్య(250)లో సున్నా తప్పు లేదా రెండు తప్పు అని తాను చెప్పానని మోదీ అన్నారు. అయినప్పటికీ ఆ ఆరోపణను స్వీకరిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. మోదీ నెలకు రూ.1.6 లక్షల జీతం తీసుకుంటూ, అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా బ్రాండ్ మోదీ గురించి ప్రధానిని అడిగినప్పుడు, బ్రాండ్ అంటే ఏమిటో? అది ఎలా పనిచేస్తుందో తనకు తెలియదన్నారు. జనం మోదీ జీవితాన్ని, పని తీరును చూస్తున్నారన్నారు. ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.. వృద్ధురాలైన తన తల్లి చివరి రోజుల్లో ఉన్నప్పుడు తల్లితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో గడపడానికి మించిన బ్రాండ్ ఏముంటుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనిని చూసి తన జీవితం భిన్నమైనదని దేశం అర్థం చేసుకున్నదని మోదీ పేర్కొన్నారు. -
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది?
పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందంటారు. పుస్తకాలు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాయి. అలాంటి పుస్తకాలకు నిలయం లైబ్రరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? పుస్తకాలు మనిషికి మంచి మిత్రుని లాంటివని పెద్దలు చెబుతుంటారు. ఒంటరితనాన్ని పోగొట్టే దివ్య ఔషధం పుస్తకమేనని కూడా అంటారు. నచ్చిన పుస్తకాలను చదివేందుకు పుస్తకప్రియులు లైబ్రరీకి వెళుతుంటారు. కొంతమంది లైబ్రరీలో గంటల తరబడి ఉండేందుకు ఇష్టపడతారు. మన దేశంలో లైబ్రరీలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో ఉంది. దీనిని బ్రిటిష్ లైబ్రరీ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 20 కోట్ల పుస్తకాలు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 1973, జూలై ఒకటిన నెలకొల్పారు. ఈ లైబ్రరీ గతంలో బ్రిటిష్ మ్యూజియంలో భాగంగా ఉండేది. ఈ లైబ్రరీకి వెళ్లి ఎవరైనా అక్కడి పుస్తకాలు చదువుకోవచ్చు. -
2019లో భారీ విజయాన్నందుకున్న ఎంపీలు వీరే!
2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచిన టాప్- 5 అభ్యర్థులంతా బీజేపీకి చెందినవారే కావడం విశేషం. వారెవరో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారో తెలుసుకుందాం. 1. నవ్సారి (గుజరాత్). సీఆర్ పాటిల్ ఈ స్థానం నుండి 2019లో బీజేపీ చెందిన సీఆర్ పాటిల్ 6 లక్షల 89 వేల 668 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేష్ పటేల్‌పై విజయం సాధించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ.. సీఆర్‌పాటిల్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. సీఆర్ పాటిల్ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విజయ పతాకం ఎగరేశారు. 2. కర్నాల్ (హర్యానా)- సంజయ్ భాటియా హర్యానాలోని ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా 6 లక్షల 56 వేల 142 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మపై విజయం సాధించారు. సంజయ్ భాటియాకు 70 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సంజయ్ భాటియాకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. 3. ఫరీదాబాద్ (హర్యానా)- కృష్ణపాల్ గుర్జార్ హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ గుర్జార్ కాంగ్రెస్ అభ్యర్థి అవతార్ భదానాపై 6 లక్షల 38 వేల 239 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ కృష్ణపాల్ గుర్జార్‌ను రంగంలోకి దించింది. 4. భిల్వారా (రాజస్థాన్) - సుభాష్ చంద్ర బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పాల్ శర్మపై 6 లక్షల 12 వేల ఓట్లతో విజయం సాధించారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ టికెట్ కోసం పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. 5. వడోదర (గుజరాత్)- రంజన్‌బెన్ భట్ గుజరాత్‌లోని వడోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్ 5.89 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ పటేల్‌పై విజయం సాధించారు. బీజేపీ మరోసారి రంజన్‌బెన్ భట్‌ను రంగంలోకి దించింది. గత రెండు లోభసభ ఎన్నికల్లోనూ ఆయన విజయం దక్కించుకున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి నుంచి వైదొలగినప్పటి నుంచి రంజన్‌బెన్ భట్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. -
ధగధగ..సెగసెగ.. అతిపెద్ద స్ఫటికాల గుహ ఎక్కడంటే?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటికాల గుహ. బయటి నుంచి లోపలకు చూస్తే, భారీ స్ఫటిక శిలలు ధగధగలాడుతూ కనిపిస్తాయి. గుహ లోలోపలికి వెళుతుంటే మాత్రం తాళలేనంత వేడిసెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ స్ఫటికాల గుహ మెక్సికోలోని చిహువాహువా సమీపంలో ఉంది. నైకా గనితో ఈ గుహను అనుసంధానించారు. ఇందులో జిప్సమ్, క్యాల్షియమ్ ఖనిజాల వల్ల ఏర్పడిన స్ఫటిక శిలలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. ఈ గుహను పూర్తిగా పరిశీలించడం ఎవరికీ సాధ్యం కాదు. లోలోపలకు వెళితే, అక్కడి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. లోపలి గాలిలో తేమ 90–99 శాతం మేరకు ఉంటుంది. గని కార్మికులైన జువాన్, పెడ్రో అనే సోదరులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో పాతికేళ్ల కిందట ఈ గుహను గుర్తించారు. గుహలోని నేలకు అడుగు భాగంలో కరిగే స్థితిలో ఉన్న లావా కారణంగానే ఈ గుహలో విపరీతమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఇదేం పిచ్చి! పెదవులు పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి..! అన్న సామెతో ఊరికే రాలేదేమో. కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతలా అంటే? వారితో ఉండే కుటుంబ సభ్యులకు సైతం ఛీ అనిపించేలా జుగుప్సకరంగా ఉంటారు. పోనీ స్నేహితులు, శ్రేయోభిలాషులు నచ్చచెప్పి మారుద్దామన్నా వినరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా మొండిగా ఉంటారు. అలాంటి కోవకు చెందిందే బల్గేరియన్ మహిళ. తాను ప్రత్యేకంగా ఉండాలనకోవడం ఓకే. కానీ మరింత విలక్షణంగా ఉండాలనుకోవడం భరించలేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఆమె కూడా అలానే తన పెదాలే అందరికంటే పెద్దగా ఉండాలని ఏం చేసిందో వింట్ షాకవ్వుతారు. అసలేం జరిగిందంటే..బల్గేరియాకు చెందిన ఆండ్రియా ఇవనోవా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తాను అందరిలోనూ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది. ఎంతలా అంటే తనను తాను పూర్తిగా మార్చుకునేంత. అంటే పూర్తిగా ఆమె ఆహార్యం సైతం మారిపోవాలనుకుంటుంది. అందుకోసం సర్జరీలు కూడా చేసుకుని మార్చేసుకుంటుంది. ఏమోందో ఏమోగానీ! ఆమె పెదాలు పెద్దగా ఉండాలనుకుంది. అదికూడా ప్రంపంచంలో అందరికంటే తన పెదాలే పెద్దగా ఉండాలనేది ఆమె కోరిక. అలా ఉంటేనే తాను అందంగా ఉంటానని ఆమె ప్రగాఢంగా నమ్ముతోంది. అందుకోసం 2018 నుంచి పలు క్లినిక్‌లను సంప్రదించి వాటిలో ది బెస్ట్ కాస్మెటిక్ క్లినిక్‌ని ఎంచుకుని మరీ సర్జరీ చేయించుకుంది. ఈ ప్రక్రియను ఆమె 22 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించింది. 2019 నాటికి పెదవులకు సంబంధించి సుమారు 15 ఇంజెక్షన్లు తీసుకుంది. అలా ఇప్పటి వరకు దాదాపు 26కు పైగా లిప్ ఇంజెక్షన్లు తీసుకోవడం గమనార్హం. ఈ బ్యూటీ సర్జరీ కోసం ఆమె సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేసింది. అంతేగాదు ఈ పెద్ద పెదాలతో చాలా సంతోషంగా ఉన్నానని, పైగా ఇప్పుడు తాను చాలా అందంగా కనిపిస్తున్నాని చెబుతుండటం విశేషం. ఇప్పుడామె ఆమె అతి పెద్ద బుగ్గలు ఉండాలనుకుంటోందట. ఆ పనిలోనే ఉన్నానని కూడా చెబుతోంది. తాను ఏ సెలబ్రెటీలా ఉండకూడదని కోరుకుంటుందట. ఎప్పటికీ తాను చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తానని అంటోంది. ఆమె ఇలా అందం కోసం తన శరీరంలో చాలా భాగాలకు ఇలానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కూడా. ఇవేం వింత కోరికలో గానీ శరీరం మొత్తం సర్జరీలతో కుళ్లబొడిపుంచుకుంటోంది. పైగా లక్షలు లక్షలు ఖర్చుపెట్టేస్తోంది. అయితే ఇదంతా ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం ఉండదట. ఇలా అందం కోసం చేస్తున్న ప్రక్రియలన్నీ ప్రాణాంతకంగా మారుతాయమోనని ఆమె కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారని సమాచారం. కానీ ఇవనోవా మాత్రం ముఖ సౌందర్యం కోసం ఇలాంటి ప్రక్రియలు కొనసాగిస్తానని తెగేసి చెబుతోంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి బ్యూటీ సర్జరీలు చేయించుకుంటానని అంటోంది. పైగా సోషల్ మీడియాలో తానే ప్రపంచంలోనే అతి పెద్ద పెదవులు కలిగి ఉన్నానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. View this post on Instagram A post shared by Andrea Ivanova (@andrea88476) (చదవండి: గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!) -
సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు
ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. యూనిలాడ్ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. -
గచ్చిబౌలిలో ది సాగా బిగ్గెస్ట్ కార్నివాల్ పోస్టర్ లాంచ్(ఫొటోలు)
-
అత్యంత పెద్ద కోట ఇది.. అసలు దీని చరిత్ర ఏంటి?
-
విజయదశమిపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి. ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం. -
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్‌లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీసు ఇండియాలోనే..చూస్తే వావ్ అంటారు! (ఫోటోలు)
-
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ ఇండియాలో.. ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రపంచంలో ఎత్తైన భవనాలు, లగ్జరీ మాన్షన్స్ అనగానే మనకి దుబాయ్ గుర్తుకొస్తుంది. కదా ఇపుడు ప్రపంచం లోనే పెద్దది, అత్యాధునికమైన ఆఫీస్ నిర్మాణం ఆసక్తికరంగా మారింది. పాపులర్ పెంటగాన్, బుర్జ్ ఖలీఫా భవనాలను మించి మన దేశంలో ఇది ఖ్యాతిని దక్కించుకోనుంది. అదీ డైమండ్ కేంద్రంగా. డైమండ్స్ అనగానే జెమ్ క్యాపిటల్, గుజరాత్‌లోని సూరత్ తొలత మదిలో మెదులుతుంది. ఇంతకీ ఆ రికార్డ్ బ్రేకింగ్ బిల్డింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో రానున్న భవనం పెంటగాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని వృద్ధిని చూపుతుంది, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది భారతదేశ స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు , సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. (యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు ) Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat's diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv — Narendra Modi (@narendramodi) July 19, 2023 బెల్జియన్ నగరమైన ఆంట్వెర్ప్ను ప్రపంచంలోని వజ్రాల వ్యాపార కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది సూరత్. ఈ నగరం ఇపుడు యుఎస్‌లోని ఆర్లింగ్టన్లోని పెంటగాన్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వంటి ప్రపంచంలోని అనేక ముఖ్యమైన కార్యాలయ సముదాయాలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ అధికారికంగా టాప్‌లో నిలిచింది. ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్ ప్రపంచంలో టాప్‌లో నిలిచింది. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) సూరత్ డైమండ్ బోర్స్ ఈ బిల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ సమాచారం ప్రకారం బహుళ-మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా నిలుస్తోంది. సూరత్ డైమండ్ బోర్స్ నిర్మించడానికి నిర్మించడానికి మొత్తం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3వేల 200 కోట్ల ఖర్చయిందిట. దీనిని గుజరాత్లో జన్మించి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారత ప్రధాని మోదీ దీన్నిఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్, మార్బుల్ ఫ్లోరింగ్‌తో అద్భుతమైన ఈ భవనంలో ఈ సంవత్సరం 65వేల ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 35కు పైగా ఎకరాలలో విస్తరించి వున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులున్నాయి. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ ఏడాది నవంబర్‌లో అఫీషియల్‌గా కార్యకలాపాలను ప్రారంభించనుంది. కట్టర్లు, పాలిషర్లు ,వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్"గా ఉంటుంది. . డైమండ్ మైనింగ్ , క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది గుజరాత్ నగరం నుండి రైలులో ముంబైకి వచ్చిపోయే, కొన్నిసార్లు ప్రతిరోజూ వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంనది ప్రాజెక్ట్ సీఈవో మహేష్ గాధవి మాటల్ని ఉటంకిస్తూ సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. -
ప్రపంచంలో ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు - అడుగడుగునా రాజసం (ఫోటోలు)
-
12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్!
World's Largest Private Palace in India: ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది ప్యారిస్లోనో లేదా వేరే ఇతర దేశాల్లోనో ఉంటుందనుకుంటారు. కానీ ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రైవేట్ ప్యాలెస్ భారతదేశంలోనే ఉంది. అదే 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' (Laxmi Vilas Palace). ఈ ప్యాలెస్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ వేలకోట్లలో ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను గుర్తు చేస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకుటుంబానికి హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈయన రాధికారాజే గైక్వాడ్‌ను వివాహం చేసుకున్నారు. హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) 170 గదులతో కూడిన ఈ ప్యాలెస్ లోపల గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దర్బార్ హాల్ వెనీషియన్ మొజాయిక్ ఫ్లోర్, వెలుపల నీటి ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది. అంతే కాకుండా ఇందులో పాత ఆయుధాలు, శిల్పాలతో మ్యూజియం ఉంది. ఇందులో ప్రేమ్ రోగ్, దిల్ హి తో హై, సర్దార్ గబ్బర్ సింగ్, గ్రాండ్ మస్తీ వంటి అనేక సినిమా షూటింగులు జరిగాయి. -
Genocide: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే...
మారణహోమం అనేది మానవత్వాన్ని సమూలంగా మంటగలిపే దుశ్చర్య. 1941లో జరిగిన హోలోకాస్ట్ మారణహోమం ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతారు. ఈ ఘటనకు 82 ఏళ్లు దాటాయి. జర్మన్ నియంత హిట్లర్ సారధ్యంలో జరిగిన ఈ దారుణ మారణ హోమంలో ఏకంగా 60 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇంతేకాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాలలో మారణహోమాలు చోటు చేసుకున్నాయి. వాటిలో అత్యంత భీకరమైన 5 మారణ హోమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హోలోకాస్ట్‌లో 60 లక్షల యూదులు... 1939లో జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వింది. హిట్లర్ యూదులనందరినీ తుదముట్టించడానికి తన వ్యూహాలను అమలు చేశాడు. 1941లో ఆష్విట్జ్‌లోని నాజీ హోలోకాస్ట్ సెంటర్లోని హిట్లర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి యూరప్‌లోని పలు దేశాల నుండి యూదులను తీసుకువచ్చారని చెబుతారు. తరువాత వృద్ధులను, వికలాంగులను గ్యాస్ ఛాంబర్లలో పెట్టి హత్య చేశారు. వీరి గుర్తింపు పత్రాలన్నింటినీ ధ్వంసం చేసి, వారి చేతులపై ప్రత్యేక గుర్తును వేశారు. ఈ శిబిరంలో యూదులను నాజీ సైనికులు రకరకాలుగా హింసించేవారు. వారు యూదులకు శిరోముండనం చేసేవారు. చాలీచాలనంత ఆహారం ఇచ్చేవారు. విపరీతమైన చలిలో కూడా వారికి ధరించడానికి దుస్తులు ఇచ్చేవారు కాదు. వీరిలో ఎవరైనా అనారోగ్యం పాలయినా లేదా పని చేయలేని స్థితిలో ఉన్నా వారిని గ్యాస్ ఛాంబర్లో ఉంచేవారు. లేదా కొట్టి చంపేవారు. ఖైదీలకు బహిరంగ శిక్ష విధించేవారు. తద్వారా అక్కడున్న ఇతరులను భయాందోళనలకు గురిచేసేవారు. హోలోకాస్ట్‌లో సుమారు 60 లక్షల యూదులు హత్యకు గురయ్యారని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఇది నాటి యూదుల జనాభాలో మూడింట రెండు వంతులని చరిత్ర చెబుతోంది. కంబోడియా మారణహోమం దక్షిణ అమెరికా దేశమైన కంబోడియాలో 1970వ దశాబ్ధంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పోల్ పాట్ నాయకత్వంలో ఖైమర్ రూజ్ పాలనలో ప్రజలపై విపరీతమైన దౌర్జన్యాలు జరిగాయి. 1975 నుంచి 1979 సంవత్సరాల మధ్య సుమారు 20 లక్షల మంది మరణించారు. ఈ సంఖ్య నాటి కంబోడియా మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు అని చెబుతారు. పాల్ పాట్, ఖైమర్ రూజ్లకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, దాని నియంత మావో జెడాంగ్ మద్దతు పలికారు. ఖైమర్ రూజ్‌కు 90 శాతం విదేశీ సహాయం చైనా నుండి వచ్చినట్లు అంచనాలున్నాయి. ఇందులో ఆర్థిక, సైనిక సహాయం కూడా ఉంది. ఏప్రిల్ 1975లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఖైమర్ రూజ్.. అల్ట్రా-మావోయిజం విధానాల ఆధారంగా సాంస్కృతిక విప్లవం ద్వారా దేశాన్ని సోషలిస్ట్ అగ్రేరియన్ రిపబ్లిక్‌గా మార్చడానికి ప్రయత్నించారు. అధిక పని, ఆకలి, పెద్ద ఎత్తున మరణశిక్షల కారణంగా ఈ పాలనలో సుమారు 20 లక్షల మంది మరణించారు. అయితే 1978లో వియత్నామీస్ సైన్యం దాడి చేసి ఖైమర్ రూజ్ పాలనను అంతమొందించడంతో ఈ మారణహోమం ముగిసింది. ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు.. రష్యా సర్కాసియన్ మారణహోమం 1864లో రష్యా సారధ్యంలో సర్కాసియన్ మారణహోమం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల పాటు జరిగిన ఈ మారణహోమంలో రష్యా సైన్యం సాగించిన దురాగతాల కారణంగా 2.5 మిలియన్ల మంది మరణించారు. ఆ సమయంలో 90 శాతం సర్కాసియన్ ప్రజలు రష్యా సైన్యం చేతిలో హతమయ్యారు. కొందరు తరిమివేతకు గురయ్యారు. నాటి రష్యా సైన్యం దురాగతాలు గుర్తుకు వచ్చినప్పుడు ఇప్పటికీ ఆక్కడి ప్రజలు భయంతో వణికిపోతారు. నాటికాలంలో రష్యన్ సైనికులు సిర్కాసియన్ గర్భిణుల కడుపులను చీల్చి, లోపలి శిశువులకు బయటకు తీసేవారని చెబుతారు. ఇంతోకాదు గర్భిణుల కడుపులోని పిండాలను బయటకు తీసి కుక్కల ముందు విసిరేవారని చరిత్ర చెబుతోంది. రష్యన్ జనరల్ గ్రిగరీ ఇక్కడి ప్రజలపై ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు చేసేవాడు. తన ప్రయోగాలలో ఏదైనా విఫలమైనప్పుడు, అతను వారిని చంపేసేవాడు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఇక్కడి ప్రజలు ఆశ్రయం కోసం పొరుగు దేశమైన టర్కీకి పారిపోయేవారు. ఆర్మేనియన్ మారణహోమం ఆర్మేనియా, ఇతర చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం 1915లో ఒట్టోమన్ సైన్యం 15 లక్షల మందిని హత్యచేసింది. ఇది ఆర్మేనియా, టర్కీ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో లక్షలాది యూదుల ఊచకోత, వారిపై జరిగిన దురాగతాల గురించి ఎంత చర్చ జరిగిందో, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఆర్మేనియన్ పౌరులు గురించి ఆ స్థాయిలో చర్చ జరగకపోవడం విశేషం. ఆర్మేనియా ప్రజలపై తాను పాల్పడిన విధ్వంసానికి టర్కీ ఏనాడూ బహిరంగంగా క్షమాపణలు చెప్పలేదు. దీనికి విరుద్ధంగా టర్కీకిచెందిన ఇస్లామిక్ నియంత రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమధ్య ఆర్మేనియాపై జరిగిన యుద్ధంలో అజర్‌బైజాన్‌కు మద్దతు పలికారు. అజర్‌బైజాన్‌కు అవసరమైన అన్ని సహాయాలను అందించారు. ఇది ఆర్మేనియన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించింది. బోస్నియా మారణహోమం ఒక అంచనా ప్రకారం ఈ మారణకాండలో బోస్నియా సెర్బ్ సైనికులు ఏకంగా 8 వేల మంది ముస్లింలను హత్యచేశారు. మృతులలో ఎక్కువ మంది 12 నుంచి 77 ఏళ్ల మధ్య వయసు వారేకావడం విశేషం. ఈ ఊచకోత చాలా భయంకరంగా సాగింది. చాలా మంది ప్రజలను పాయింట్ బ్లాంక్ రేంజ్లో (నుదుటి మధ్య) కాల్చారు. ఈ ఊచకోత తరువాత బోస్నియా మాజీ సెర్బ్ కమాండర్ జనరల్ రాట్కో మ్లాడిక్ కసాయిగా పేరొందాడు. 1992లో యుగోస్లేవియా విడిపోయిన సమయంలో బోస్నియన్ ముస్లింలు, క్రొయేషియన్లు స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా ఓటు వేశారు. సెర్బియన్లు దీనిని బహిష్కరించారు. కొత్త దేశం ఎలా ఏర్పడుతుందనే అంశంపై సెర్బ్ సమాజం- ముస్లిం సమాజం మధ్య వివాదం చెలరేగింది. ఆ సమయంలో సెర్బ్‌లు, ముస్లింలకు మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇరువర్గాలు తుపాకులతో దాడికి తలపడ్డాయి. ఈ అంతర్యుద్ధంలో వేలాది మంది మరణించగా లక్షలాదిమంది వలసబాట పట్టారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద డంపింగ్ యార్డ్లు
-
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద ఆనకట్టలు
-
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
ఇండోనేషియా పాపువా గినియా దీవులలో 3 కిలోల బరువున్న అరటిపండు
-
ఇండియాలోనే బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్.. ఒకేసారి 15-20 మంది తినేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాకాహారం మాత్రమే తినే తనపేరిట మాంసాహార బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్లో శనివారం సోనూసూద్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని ఒకేసారి 15 నుంచి 20 మంది తినవచ్చన్నారు. ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మ, గౌతమ్‌లను ఆయన అభినందించారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులో బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను సోనూసూద్‌తో అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తా.. రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని సినీ/చారిటీ స్టార్ సోనూసూద్ వెల్లడించారు. హైదరాబాద్‌తో తనకు దగ్గర అనుబంధం ఉందనీ, తన భార్య తెలుగు మహిళని తెలిపారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ క్లబ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘కరోనా తీవ్రత తగ్గిపోయినా సమస్యలతో మమ్మల్ని సంప్రదించేవారు తగ్గలేదు. ప్రస్తుతం షిరిడీలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తెలంగాణలో మరొకటి రానుంది. పంజాబ్‌లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి సమీప భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఓ ఉచిత పాఠశాల ఉండేలా చూడాలనేది మా కోరిక. చాలా రాజకీయ పార్టీలు నన్ను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు లేదు. చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. చెక్‌లు అందించి సాయం చేయడం మాత్రమే కాదు.. చెక్‌లు అందించి, చారిటీలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పర్సనల్ టచ్ చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలికను నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించాం. ఆమె సోదరుడు తోడుగా వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమెను రక్షించలేకపోయాం. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఇద్దర్నీ కోల్పోయారు. దీంతో వీలైనప్పుడల్లా నాగ్‌పూర్‌లోని వారి తల్లిదండ్రులను కలవడం అలవాటు చేసుకున్నా. ఇదే నేను ఇష్టపడే పర్సనల్ టచ్.. అని సోనూసూద్ చెప్పారు. చదవండి: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్ -
27 ఏళ్ల తరువాత యూకే కేంద్ర బ్యాంక్ షాకింగ్ నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ బాటలో పయనించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. ద్రవ్యోల్బణం ముప్పు, అధిక ధరలు, ఇంధన ధరలు తదితర ఆందోళనల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను 1.25 నుంచి 1.75 శాతానికి పెంచింది. పెరుగుతున్న ధరల కట్టడికి ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు ప్రకటించింది. పలువురు విశ్లేషకులు,పెట్టుబడిదారుల అంచనాల కనుగుణంగానే బీవోఈ గవర్నర్ ఆండ్రూ బెయిలీ 50 బీపీఎస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపును ప్రకటించారు. 1995 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు. ఆహార, ఇంధన ధరల సంక్షోభంతో యూకే ద్రవ్యోల్బణం 9.4 శాతం వద్ద జూన్‌లో 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. తరువాత ఇది దాదాపు 11 శాతానికి చేరుతుందని అంచనా. (Suryansh Kumar: వావ్!13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్! మరి ఆదాయం!) వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 15 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 27 ఏళ్లలో అతిపెద్ద వడ్డీ రేటు పెంపు ప్రకటించడం గమనార్హం. రుణాలు తీసుకోవడం, ఖర్చుల తగ్గింపు లాంటి చర్యల్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వడ్డీరేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి. (ఇదీ చదవండి: Honda Dio Sports: హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!) -
ప్రపంచంలోనే అతి పెద్ద చికెన్ ఎగ్ రోల్ ఎక్కడో తెలుసా?
కోల్‌కతా: కోల్‌కతా వీధుల్లో పుచ్కా, ఆలు చాప్, హక్కా నూడుల్స్ కంటే నోరూరించే వంట ఏదైనా ఉందంటే, అది అక్కడ దొరికే బాహుబలి చికెన్ రోల్. అంత రుచికరంగా ఉంటుంది కాబట్టే అక్కడ భోజన ప్రియులు ఈ రోల్ కోసం ఎగబడతారు. ఈ విషయాన్ని సిటీ ఆఫ్ జాయ్ నుంచి వచ్చిన వారందరూ ఖచ్చితంగా అంగీకరిస్తారు. గ్రైండ్ చేసిన చికెన్ మాంసం, వివిధ రకాల సాస్‌లు, సుగంధ ద్రవ్యాలు, దోరగా వేయించిన ఉల్లిపాయలతో వీటనన్నింటిని కలిపి చేసిన ఈ రోల్‌ను తింటుంటే మరోకటి లాగించాలనే కోరిక కలగక తప్పదు ఎవరికైనా అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. కోల్‌కతా గారియాలో ఫుడ్ జాయింట్ లోని ఈ చికెన్ రోల్ టేస్ట్ పరంగ ఎంత బాగుంటుందో ,దీని సైజు పరంగా కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఎంతంటే 'ప్రపంచంలోనే అతిపెద్ద' చికెన్ ఎగ్ రోల్ అని పిలిచేంత. మరి ధర చూస్తే కేవలం రూ. 349 మాత్రమే. ఇండియా ఈట్ మానియా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఈ రోల్ తయారీ విధానాన్ని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి చూసిన వాళ్ల నోరు ఊరిస్తోంది. అందులో ఒక వ్యక్తి నాలుగు పరాటాలను కలిపి 23-26 అంగుళాల పెద్ద రోల్‌ను సిద్ధం చేశాడు. మూడు గుడ్లతో బేస్‌గా చేసిన తరువాత, మిశ్రమ కూరగాయలు, మటన్ కబాబ్స్, సోయా చాప్, మటన్ షమ్మీ కబాబ్స్, పన్నీర్ టిక్కా, చికెన్ కేబాబ్స్ వంటి వివిధ రకాల పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నారు. ఇక రోల్ తయారీ భాగం చివరన ముక్కలు చేసిన ఉల్లిపాయలు, టొమాటో కెచప్, గ్రీన్ చిల్లి సాస్, మసాలాస్, మయోన్నైస్, నిమ్మరసం, తురిమిన జున్నుతో అందంగా అలంకరించి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. View this post on Instagram A post shared by India Eat Mania (@india_eat_mania) ( చదవండి: ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం ) -
పెట్టుబడుల సునామీ : టాప్‌లోకి జియో
సాక్షి, ముంబై: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టెలికాం రంగంలో సునామిలా దూసుకొచ్చి అతి తక్కువ టారిఫ్ లతో డేటా సేవలను సామాన్యులకు చేరువ చేసింది. ఫలితంగా కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. తాజాగా జియో భారీ పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద నాల్గవ కంపెనీగా అవతరించింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ భాగస్వామ్యంతో జియో మార్కెట్ క్యాప్ పరంగా ఈ రికార్డు సృష్టించింది. మూడు వారాల వ్యవధిలో మూడు మెగా డీల్స్ సాధించిన జియో దిగ్గజం కంపెనీల వరుసలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్‌లను ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు ఎంటర్ ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో వుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్) జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటా రూ. 11,367 కోట్లకు కొనుగోలు చేయడంతో జియో ఈ ఘనతను సాధించింది. మరోవైపు ఈ డీల్ ప్రకటించిన తరువాత శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 4 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ జియోలో గత మూడు వారాల్లోనే మొత్తం రూ. 60,596 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందిన మూడు దిగ్గజ కంపెనీలు ముందుకురావడం గమనార్హం. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) చదవండి : కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ -
ఒక్క నెలలోనే యస్ బ్యాంకు రికార్డు లాభం
సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంకు రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్ ఝన్‌ఝన్ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్లు ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి 61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర్శన కనబర్చిన కంపెనీగా దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు నవంబరు 5వ తేదీన రాకేష్ ఝన్ ఝన్‌వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద 52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ బ్రాండ్ వన్‌ప్లస్ అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు వన్‌ప్లస్ 7, 7 ప్రొ ఆవిష్కరింది. సందర్భంగా కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే ముంబై, పుణేలలో రెండు ఎక్స్పీరియన్స్ స్టోర్లను ప్రారంభించినట్టు తెలిపింది. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భవనంలో అతిపెద్ద వన్ ప్లస్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నామని కంపెనీ సీఈవో పీట్ లౌ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించనట్టు తెలిపారు. గొప్ప సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా ఐటీ, టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌కు పేరుందన్నారు. పాత కొత్త టెక్నాలజీల మధ్య వారధిగా వన్‌ప్లస్ నిలుస్తుందన్నారు పీట్. సంప్రదాయ హైదరాబాద్ ఎర్ర ఇటుకలతో, దుమ్మును ఆకర్షించని శ్వేత సౌధాన్ని అద్భుతమైన డిజైన్, సహజకాంతితో తీర్చిదిద్దునున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా వన్‌ప్లస్‌కు ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ సెంటర్ ఉంది. We are excited to announce that we will be opening the biggest OnePlus store in the World later this year in Hyderabad. #OnePlus7SeriesLaunch pic.twitter.com/oxFoKghgcc — OnePlus India (@OnePlus_IN) May 14, 2019 -
విప్రో అతిపెద్ద డీల్: షేరు జంప్
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజ సంస్థ విప్రో అమెరికన్ కంపెనీనుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. 1.6 బిలియన్ల డాలర్ల కాంట్రాక్టును స్వాధీనం చేసుకుంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. అలైట్ సొల్యూషన్స్ నుంచి 1.6 బిలియన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాలకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టును గెలుచుకుంది. దీంతో స్టాక్మార్కెట్లో విప్రో భారీ విన్నర్‌గా ఉంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో విప్రో షేరు సోమవారం దాదాపు 5.5 శాతం జంప్‌చేసింది. సమీకృత సొల్యూషన్లు, సర్వీసులు అందించేందుకు ఇల్లినాయిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లింకన్‌షైర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల దేశీ సంస్థ విప్రో లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. అలైట్ సొల్యూషన్స్ నుంచి లభించిన కాంట్రాక్టు పదేళ్లకాలంపాటు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ఒప్పంద కాలంలో 150-160 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు విప్రో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా డిజిటల్ టెక్నాలజీస్, ఆటోమేషన్, అనలిటిక్స్ సంబంధ సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. అలైట్ సొల్యూషన్స్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత హెల్త్, వెల్త్, హెచ్ఆర్, ఫైనాన్స్ సొల్యూషన్స్ అందిస్తుంటుంది. -
షావోమి మరో రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌మేకర్, షావోమి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోను దాఖలు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ కంపెనీ హాంగ్ కాంగ్ మార్కెట్లో గురువారం ఈ అతిపెద్ద ఐపీవోను సమర్పించింది. బ్లూమ్‌బర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2014 తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఐపీవోగా భావిస్తున్నారు. ఈ లిస్టింగ్‌తో కంపెనీవిలువ100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తర్వాత చైనాలో అతిపెద్ద టెక్ ఐపీవోగా నిలవనుంది. 2014 లో అలీబాబా గ్రూప్ 21.8 బిలియన్ డాలర్లను సేకరించింది. షిప్మెంట్ వారీగా ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, హాంగ్ కాంగ్ ఎక్స్చేంజెస్ అండ్ క్లియరింగ్ లిమిటెడ్‌కు ఐపీవో దరఖాస్తును సమర్పించింది. 2017 నాటికి దాని ఆదాయం 114.62 బిలియన్ యువాన్లతో (18 బిలియన్ డాలర్లు) గా ఉంది. 2016 లో 67.5 శాతం పెరిగింది. 2017 లో ఆపరేటింగ్ లాభం 12.22 బిలియన్ యువాన్లుగా నమోదు చేసింది. కాగా 2016లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సేల్స్ నమూనాలను పునరుద్ధరించడం, ఇండియాలోభారీ విస్తరణ ద్వారా తిరిగి బౌన్స్ అయింది. దీంతో ఇండియాలో అతిపెద్ద విక్రయదారుడిగా ఉన్న శాంసంగ్‌కు ప్రధాన ప్ర్యతర్థిగా నిలిచింది. -
టీసీఎస్-నీల్సన్ భారీ డీల్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) భారీ ఆర్డర్‌ను సాధించింది. టెలివిజన్ రేటింగ్ మేనేజ్మెంట్ సంస్థ నీల్సన్ తో అతి భారీ విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. టిసిఎస్-నీల్సన్ ఒప్పందం పునరుద్ధరణలో భాగంగగా ఈ భారీ డీల్ కుదిరింది. 2.25 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.14,కోట్లు) అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టును గెలుచుకుంది. టీసీఎస్‌తో ఈ కాంట్రాక్టును ఐదు సంవత్సరాల వరకు (2025) పొడిగించామని, ఈ డీల్ డిసెంబర్ 31, 2025 న ముగుస్తుందని నీల్సన్ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ (అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఫైలింగ్‌లో దీనికి సంబంధించిన వివరాలను అందించింది. ఇండియన్ ఐటీలోనే బిగ్గెస్ట్ డీల్ తాజా డీల్ ప్రకారం నీల్సన్ నుంచి 2017నుంచి 2020వరకు ప్రతి సంవత్సరం 320 మిలియన్ డాలర్లు ఆదాయాన్ని, 2021 నుంచి 2024 వరకు 139.5 మిలియన్ డాలర్లు, 2025 నాటికి 186 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని టీసీఎస్ పొందనుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ కు ఇది ఒక కీలక మైన ఒప్పందంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ ఐటీ పరిశ్రమలోనే ఇది అతి పెద్ద డీల్‌గా నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు పోటీగా భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా టీసీఎస్ రెండవ స్థానంలో నిలిచింది. ఆర్ఐఎల్ మొదటిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంతో రాబోయే సంవత్సరాల్లో అత్యధిక విలువైన భారతీయ కంపెనీలను అధిగమిస్తుందని భావిస్తున్నారు. కాగా 2007 లో టీసీఎస్-నీల్సన్ మధ్య1.2 బిలియన్ డాలర్ల మేర , 2013లో దాదాపు రెట్టింపు విలువతో 10 సంవత్సరాలకుగాను 2.5బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదిరింది. దీన్ని మరో మూడేళ్ల పాటు 2020వరకు పొడిగించింది. -
బల్దియాలో భారీ కుంభకోణం
-
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
-
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
న్యూయార్క్: ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఖాతాలో మరోసారి పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి. గతంలోనే ఒకసారి తమ ఖాతాలు భారీగా హ్యాకింగ్ కు గురయ్యాయని ధృవీకరించిన యాహూ మరోసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తమ ఖాతాలపై మరో మేజర్ సైబర్ ఎటాక్ జరిగిందని యాహూ వెబ్ సైట్ లో ప్రకటించింది. దాదాపు 100కోట్ల (1బిలియన్)కు పైగా ఖాతాలు హ్యాక్ అయినట్టు ప్రకటించడం ఆందోళన రేపింది. తమ వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు తెలిపింది. 2013 ఆగస్టులో జరిగిన ఈ దాడి చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు పలు సూచనలు చేస్తూ తమ పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన యాహూ మరిన్ని కష్టాల్లో చిక్కుకుపో్యింది. 2014లోనూ యాహూ తమ నెట్వర్క్ నుంచి 50 కోట్ల యూజర్ల అకౌంట్ల వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. 50 కోట్ల యూజర్ల సమాచారం హ్యాకింగ్ గురవడమే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సైబర్ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల మంది యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని తెలపడం కలకలం రేపుతోంది. గతంలో తమ యూజర్ల వివరాలను తస్కరించిన హ్యాకర్లు అప్పటి లాగే ఇప్పుడు కూడా యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, టెలిఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లతో పాటు, ఎన్క్రిప్టెడ్, అన్ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అపహరించినట్లు తెలిపింది. అయితే తమ యూజర్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సమాచారం, పేమెంట్ డేటా మాత్రం అపహరణకు గురికాలేదని యాహూ స్పష్టం చేసింది. కాగా ఇంటర్నెట్ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టిన సంస్థ అష్టకష్టాలు పడింది. చివరికి అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్ 4.8బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే యాహూ న్యూస్ సర్వీస్ తోపాటు, బ్లాగింగ్ ప్లాట్ ఫాం టంబ్లర్, ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్, యాహూ ఫినాన్స్ ద్వారా టెక్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదమే అతిపెద్ద శత్రువు
-
ఉగ్రవాదమే అతిపెద్ద శత్రువు
► అఫ్ఘానిస్తాన్‌లో భారత రాయబారి డాక్టర్ షైదా మొహమ్మద్ అబ్దాలి ►ఘనంగా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచానికి అతి పెద్ద శత్రువు ఉగ్రవాదమని అఫ్ఘానిస్తాన్‌లో భారత రాయబారి డాక్టర్ షైదా మొహమ్మద్ అబ్దాలి పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అబ్దాలి మాట్లాడుతూ నిరక్షరాస్యత, పేదరికం వంటిసామాజిక సమస్యలకు ఉగ్రవాదం కారణమన్నారు. వర్సిటీలు శక్తిమంతమైన మానవ వనరుల నిర్మాణ కేంద్రాలుగా మారాలని సూచించారు. యువతరం విజ్ఞాన, నైపుణ్యాలను అభివృద్ధి పరచుకుని తమలోని శక్తియుక్తులను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. అఫ్ఘానిస్తాన్‌కు చెందిన 22 మంది విద్యార్థులు విజ్ఞాన్ వర్సిటీలో విద్యనభ్యసిస్తుండగా, దేశంలోని మరో 20 వర్సిటీల్లో 16 వేల మంది చదువుతున్నారని వివరించారు. స్నాతకోత్సవం సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఇకోల్ సెంట్రల్ డి నాన్‌టెస్ సంస్థకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల డెరైక్టర్ ఆచార్య ఫౌడ్ బెన్నీస్, పంచసహస్ర అవధాని మేడసాని మోహన్, మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అనంతరం 1,279 మంది విద్యార్థులకు డిగ్రీలు, 18 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.రామ్మూర్తినాయుడు, వీసీ డాక్టర్ సి.తంగరాజ్, రెక్టార్ డాక్టర్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ డీన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజిమెంట్ డాక్టర్ వి.మధుసూదనరావు, స్నాతకోత్సవ కన్వీనర్ పీఎంవీ రావు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఐదు వారాల్లో అతిపెద్ద పతనం
ముంబై: అంచనాలకనుగుణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. ఒకదశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివర్లో కొద్దిగా కోలుకుంది. లాభాల స్వీకరణ, ఫెడ్ వడ్డీరేట్ పెంపుభయం, భారత కరెన్సీ రూపాయి బలహీనత భారత ఈక్విటీ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. 25,417 దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో 24,966 దగ్గర, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 7,615దగ్గర ముగిసింది. దాదాపు అన్ని ప్రధాన రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. రియాల్టీ, ఫార్మా రంగాల్లోని నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఇటీవల లాభాలతో జోరుమీదున్న మార్కెట్లు , ఐదువారాల అతి భారీ పతనానికి చేరుకున్నాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు గురువారంతో ముగియనుండటం కూడా మదుపర్లను ఆలోచనలో పడవేసింది. ఫలితంగా సెన్సెక్స్ పాతిక వేలకు పైన, నిఫ్టీ కీలక మద్దతుస్థాయి 7,700 పాయింట్లకుపైన నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాయి. అటు వచ్చేనెల 5న ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరపు తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షను ప్రకటించనుంది. రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తదితర విషయాలు పరిశీలించాల్సిన అంశాలని ఎనలిస్టుల అంచనా. రాబోయే రోజుట్లో దేశీయ మార్కెట్లు పుంజుకోవడానికి ముందు ఇది స్వల్ప విరామమని, కొంత కరెక్షన్ కు గురయ్యే అవకాశం ఉందని ఎస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో భారతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయని చెప్పారు. -
ప్రపంచంలోనే పెద్ద శ్మశానంగా మారనున్న ఫేస్బుక్!
లండన్ః సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కొన్నాళ్ళకు శ్మశానంగా మారనుందట. వినియోగదారుల సంఖ్య రోజురోజకూ పెరిగిపోతుండటంతో ఇంటర్నెట్ నిపుణులు ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోటిమందికి దాటిపోయిన యూజర్ల సంఖ్యపై అంచనాకు వచ్చిన నిపుణులు... 2098 సంవత్సరం నాటికి ఫేస్ బుక్ లో ఖాతాదారులకంటే మృతుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఫేస్ బుక్ పేజీల్లో స్మృతుల పేజీలు దర్శనమివ్వడాన్ని బట్టి నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులు మరణిస్తే ఆ పేజీని తొలగించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఖాతాదారుడి వివరాలు తెలిసినవారు మరొకరుంటే తప్పించి దాన్ని ఎవ్వరూ లాగిన్ చేసే అవకాశం లేదు. దీంతో ఆ సామాజిక మాధ్యమంలో మరణించిన ఖాతాదారుడి పేజీని స్మృతుల పేజీగా మారుస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అతడి కుటుంబ సభ్యులుగాని, స్నేహితులుగాని ఖాతాను కొనసాగిస్తుంటేమాత్రం ఆపేజీ బతికే ఉంటోంది. అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థి హచెమ్ సాధిక్కి అదే నిర్థారించారు. ఫేస్ బుక్ లో వినియోగదారుల సంఖ్య ఇదే రీతిలో కొనసాగితే 2098 నాటికల్లా అదో శ్మశానంగా మారుతుందని అధ్యయనాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. మరణించినవారి ఖాతాలను సైతం ఆ నెట్వర్క్ ఇదే విధంగా కొనసాగిస్తే సంస్థ వృద్ధి రేటు సైతం భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆన్లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ 'డిజిటల్ బియాండ్' లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడు ప్రపంచంలో ఫేస్ బుక్ వినియోగదారులు 9,70,000 మంది మరణించనున్నట్లు తెలుస్తోంది. అదే 2010 లో 3,85,368 మంది, 2012 లో 5,80,000 మరరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో కొనసాగించని ఖాతాలనుగాని, మరణించినవారి ఖాతాలను గాని ఫేస్ బుక్ స్వచ్ఛందంగా తొలగించేందుకు ముందుకు రాకపోవడంతో కొంతకాలానికి బతికున్నఖాతాదారులకంటే మరణించినవారి సంఖ్యే పెరిగిపోతుందని అధ్యయనాలద్వారా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఫేస్ బుక్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తులు, డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్లలో నామినీలను నియమించినట్లు... తమ ఖాతా వివరాలు తెలిసిన మరొకరిని నియమించుకోవాలని ఫేస్ బుక్ యూజర్లకు సూచించే ఉద్దేశ్యంలో ఉంది. ఈ పద్ధతిలో మరణించినవారి లెక్కల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. -
'దేశంలోనే పెద్ద మోసగాడు చంద్రబాబు'
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో పెద్ద మోసగాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి విమర్శించారు. మహిళల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఐద్వా విశాఖ నగర కమిటీ ప్లీనరీ సమావేశం సోమవారం వైశాఖి జల ఉద్యానవనంలో జరిగింది. సమావేశంలో ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ర్యాగింగ్ సంఘటనలో ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. నారాయణ కాలేజిలో ఇద్దరు అమ్మాయిలు చనిపోతే, వారి ప్రవర్తన మంచిది కాదని ప్రచారం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సీపట్నంలో దివ్యశ్రీ హత్య కేసులో నిందితులను శిక్షించాలని ఆందోళన చేస్తే హంతకులను కాకుండా నిరసనకారులను నిర్బంధించి కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వం నైజానికి దర్పణమన్నారు. ఎన్టీ రామారావు ఆస్తిహక్కు చట్టాన్ని తీసుకువస్తే..దేశ వ్యాప్తంగా చట్టం చేశారని, ప్రస్తుతం ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.