డాబాగార్డెన్స్(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో పెద్ద మోసగాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి విమర్శించారు. మహిళల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఐద్వా విశాఖ నగర కమిటీ ప్లీనరీ సమావేశం సోమవారం వైశాఖి జల ఉద్యానవనంలో జరిగింది. సమావేశంలో ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ర్యాగింగ్ సంఘటనలో ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు.
నారాయణ కాలేజిలో ఇద్దరు అమ్మాయిలు చనిపోతే, వారి ప్రవర్తన మంచిది కాదని ప్రచారం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సీపట్నంలో దివ్యశ్రీ హత్య కేసులో నిందితులను శిక్షించాలని ఆందోళన చేస్తే హంతకులను కాకుండా నిరసనకారులను నిర్బంధించి కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వం నైజానికి దర్పణమన్నారు. ఎన్టీ రామారావు ఆస్తిహక్కు చట్టాన్ని తీసుకువస్తే..దేశ వ్యాప్తంగా చట్టం చేశారని, ప్రస్తుతం ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.
'దేశంలోనే పెద్ద మోసగాడు చంద్రబాబు'
Published Tue, Sep 15 2015 10:47 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement