cheater
-
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'చీటర్'.. ఆసక్తిగా పెంచుతోన్న ట్రైలర్!
రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం "చీటర్". ఈ సినిమాను బర్ల నారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్ పతాకoపై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!) ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. "మేము అనుకున్నట్లుగానే సినిమా వచ్చింది. మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడ్డారు. మంచి అవుట్ పుట్ వచ్చింది. ప్రేక్షకులకు కథ తప్పకుండా నచ్చుతుంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారు అని నమ్మకం ఉంది'. అని అన్నారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ.. 'సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించండి.' అని అన్నారు. ఈ చిత్రంలో రాధిక, అనిత,మల్లేశం, నిషాన్, గౌటి రాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట.. సీమకు చంద్రబాబు ద్రోహం
“అమరావతిలో లక్షల కోట్లు ఖర్చుపెట్టేసి టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచేయాలి. కానీ వెనుక బడిన రాయలసీమకు కనీసం హైకోర్టు కూడా అవసరం లేదట. ఉత్తరాంధ్రకు ముందే గుండు సున్నా కొట్టేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమపైనా విషం చిమ్మేశారు. మొత్తానికి తనకు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకే ప్రాంతమూ నగరమూ ముఖ్యమే కాదని చంద్రబాబు నాయుడు చాటి చెప్పారు. రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న న్యాయరాజధాని వద్దే వద్దని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారు.” రాయలసీమలో పర్యటిస్తోన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క తన అవినీతిని ఐటీ నోటీసులు బట్టబయలు చేయడంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ఉన్నారు. మరో పక్క రాయలసీమ వాసులు న్యాయ రాజధాని ప్రస్తావన తీసుకురాగానే చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుకొచ్చింది. అంతే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమకు హైకోర్టు ఎందుకు? అని ఎదురు ప్రశ్రించారు. కావాలంటే హై కోర్టు బెంచ్ ఇస్తే అదే ఎక్కువ అని కూడా తీర్పు చెప్పారు. రాయలసీమ ప్రజల ఓట్లతో రాజకీయ బిక్ష పెడితే రాజకీయాల్లో ఎదిగి కుదరకపోతే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. తనను అంతటి వాణ్ని చేసిన రాయలసీమ ప్రజల రుణాన్ని ఎలా తీర్చుకోవాలా? అని ఆయన ఆలోచించాలి. అలాంటిది రాయలసీమకు ఎలా ద్రోహం తలపెడదామా అన్న ఆలోచనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార.. అభివృద్ది వికేంద్రీకరణల్లో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించిస సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయ రాజధానిగానూ చేయాలని ఆయన నిర్ణయించారు. అయితే కర్నూలులో హై కోర్టు పెడితే ఏం వస్తుంది? నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయంతే అని చంద్రబాబు విషం చిమ్మారు. తాజాగా చంద్రబాబు రాయలసీమ పర్యటనలో సీమ న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ప్రస్తావన తీసుకురాగనే చంద్రబాబుకు మండుకొచ్చేసింది. రాయలసీమకు హైకోర్టు అవసరమే లేదని తెగేసి చెప్పారు. కావాలంటే ఓ బెంచ్ ఇస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు పెడితేనే నాలుగు జిరాక్స్ షాపులు తప్ప ఏవీ రావన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ పెడితే కర్నూలుకు ఏం వస్తుందో చెప్పాలంటున్నారు రాయలసీమ హక్కుల వేదిక నేతలు. బాగా అభివృద్ది చెంది.. రాజధానికి అన్ని విధాలా అనువైన నగరంగా అందరూ ఒప్పుకునే విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు చంద్రబాబు. అక్కడ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలే అంటున్నారంటూ బుకాయిస్తున్నారు చంద్రబాబు. ఇటు రాయలసీమకు హైకోర్టు అవసరం లేదంటూ ఈ ప్రాంతంపైనా విషం చిమ్ముతున్నారు. తాను తన బంధువులు.. తన ఎల్లో మీడియా అధినేతలు.. టీడీపీ సీనియర్లు వారి బంధువులు భూములు కొని అట్టేపెట్టుకున్న అమరావతిలో మాత్రం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే లక్షన్నర కోట్లకు పైగా ఖర్చే చేసేయాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. చదవండి: ‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’ ఏ అమరావతి జపం చేస్తున్నారో అదే అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం ముసుగులోనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అడ్డంగా భోంచేసిన వైనాన్ని ఐటీ శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తాను జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు నాయుడికి అర్ధమైపోయింది. తాను చేసిన తప్పేంటో తనకి తెలుసు. ఆ తప్పుకు శిక్ష ఏం పడుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఉక్రోషంలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ చాలునని విషం కక్కుతున్నారని రాయలసీమకు చెందిన న్యాయవాదులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు, సాక్షి -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ‘చీటర్’
చంద్రకాంత్ దూత్త, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘చీటర్’. ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ పతకం పై పరుపతి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ బర్ల దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నారాయణ బర్ల మాట్లాడుతూ.. ‘మంచి యాక్షన్ సనివేషాలతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా వచ్చింది. అద్భుతమైన కథ కథనం తో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం’అన్నారు. ‘రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గోవా, ఆరాకు, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాం’అని నిర్మాత పరుపతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాధికా, అనిత, బాబు రావు, గౌతి రాజు, మల్లేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
గన్ షాట్: చంద్రబాబు నెంబర్ 1 మోసగాడు..
-
కారు కావాలా బాబు? మా దగ్గర ధర కొంచెం తక్కువే..
వేలూరు: కార్ల విక్రయాల పేరుతో లక్షలు స్వాహా చేస్తున్న నకిలీ ఎస్ఐ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వివరాల మేరకు.. తిరువళ్లరు జిల్లా సుంగాచత్రంకు చెందిన రోహిణి(32)కి గత ఏడాది రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన వ్యాపారి దినేష్ కుమార్ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో రోహిణి తాను చెన్నైలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నట్లు తెలిపింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను విక్రయిస్తున్నానని, ఎవరైనా కొనుగోలు చేయాలను కుంటే తనను సంప్రదించాలని నమ్మించింది. అది నమ్మిన దినేష్ కుమార్ రోహిణికి రూ.2 లక్షలు, ఈమె భర్త చంద్రుకు రూ.12 లక్షలు ఇచ్చి రెండు కార్లు కావాలని కోరాడు. కొద్ది రోజులకు తన స్నేహితులకు మరో రెండు కార్లు కావాలని రోహిణి అకౌంట్లోకి రూ.10 లక్షలు జమ చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా రోహిణి నుంచి కార్లు అందకపోవడంతో దినేష్‌కుమార్ వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రోహణి నకిలీ ఎస్ఐగా నటిస్తూ పలువురి వద్ద లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఉద్యోగాల పేరిట వంశీకృష్ణ దాదాపు రూ. 5కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 500 మంది యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఆన్లైన్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే వంశీకృష్ణ టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవాడు. అయితే, వంశీకృష్ణ.. స్కీంల పేరుతో అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. -
ప్రేమ పేరిట అమ్మాయిలకు ఎర.. నమ్మిన స్నేహితులను కూడా
సాక్షి, పెద్దపల్లి, ఖమ్మం : పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట్లలో పరిచయమయ్యే మహిళలే కాకుండా స్నేహితులను మాయమాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన మోసగాడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాహుల్ ప్రస్తుతం హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం వెబ్సైట్లో వివరాలు నమోదు చేసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాహుల్ రూ.15.5లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా మరికొంత డబ్బు తీసుకుంటూ, ఇచ్చేస్తున్న ఆయన అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు తీసుకుని ఫైనాన్స్ సంస్థలో కుదవపెట్టగా తనను మోసం చేసినట్లు తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ ప్రత్యేక బృందాలతో గాలించి రాహుల్‌ను అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు. అయితే, రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్ ఎల్బీ.నగర్లో, 2013లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఏసీపీ సారంగపాణి వివరించారు. చదవండి: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి ఇటీవల స్నేహితులను కూడా ఐటీ సమస్యలు ఉన్నాయని నమ్మించి రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలిపారు. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్‌ఖలీల్ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ. 2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ. 2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని చెప్పారు. -
మ్యాట్రిమోనీ యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి..
చిత్తూరు అర్బన్: అతడు చదువుకుంది ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు వచ్చింది. చేస్తున్నపని నచ్చలేదు. మానేశాడు. దుర్వ్యసనాల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషించాడు. ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ, నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాల వెబ్సైట్లలో ఉంచాడు. వీటి ఆసరాగా వందమందికిపైగా యువతులను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. ఈ మోసాలకు పాల్పడ్డ చిత్తూరుకు చెందిన కరణం రెడ్డిప్రసాద్ (42)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ ఈ వివరాలను మీడియాకు వివరించారు. అరక్కోణంలో స్థిరపడి మోసాలు చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పిళ్లై పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్‌కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్‌గా రివర్షన్ ఇచ్చారు. దీంతో ఉద్యోగం మానేసిన రెడ్డిప్రసాద్ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్య, కుమార్తె అతడి నుంచి వేరుగా ఉంటున్నారు. మ్యాట్రిమోనీ (వివాహాలను కుదిర్చే ఆన్లైన్ సంస్థలు) యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్‌లు కూడా అప్లోడ్ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్లైన్లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్లో చెప్పేవాడు. పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్‌కి ఫోన్ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెడ్డిప్రసాదే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వందమందికిపైగా యువతుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు చెప్పాడు. 2019లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్ చేశారు. యువతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మోసపోవడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఇతడి ద్వారా మోసపోయినవాళ్లు చిత్తూరు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించడంలో ప్రతిభచూపిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ప్రియురాలిని కాదని మరోక అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన యువకుడు
-
వరుడి నిర్వాకం!...పీటల మీద ఆగిన పెళ్లి
అనంతపురం(ఉరవకొండ): పెళ్లి పేరుతో నమ్మించి అవసరాలు తీర్చుకున్న అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పెద్దలు కుదిర్చిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన వంచకుడిపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన మేరకు.. ఉరవకొండకు చెందిన ఓ యువతిని స్థానిక రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వాహకుడు షర్పీద్దున్ ప్రేమించాడు. దాదాపు 14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి తన అవసరాలు తీర్చుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే గుత్తికి చెందిన యువతితో షర్పీద్దున్కు ఈ నెల 9న వివాహాన్ని కుటుంబ పెద్దలు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి ఈ నెల 8న ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే గుత్తిలోని వధువు తరఫు పెద్దలకు సమాచారం అందించారు. దీంతో బుధవారం గుత్తిలోని కల్యాణ మంటపంలో నిఖా తంతు ఒక్కసారిగా ఆగిపోయింది. పోలీసులు షర్పీద్దున్పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వరుడు షర్పీద్దున్ తీరును ఏవగించుకుని వధువు తరఫు కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు సమాచారం. -
వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ
కర్నూలు: ఎదుటి వ్యక్తుల అవసరాలే ఈ మోసగాడికి పెట్టుబడి. మాయ మాటలతో బురిడీ కొట్టిస్తాడు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సంక్షేమ పథకాలు ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరార్థులను చేర దీసి రూ.లక్షల్లో గుంజేశాడు. ఇలా పలువురిని మోసగించి పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోక కలెక్టర్ పీఏనంటూ కొంతమంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతని నేర చరిత్రను కర్నూలు డీఎస్పీ కెవి.మహేష్, మూడవ పట్టణ సీఐ తబ్రేజ్‌తో కలిసి ఆదివారం తన కార్యాలయంలో వివరించారు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. బండి ఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన తాటికొండ పెద్దమౌలాలి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో వక్రమార్గం పట్టాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు పాసైన కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనంటూ పరిచయం చేసుకునేవాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు పాస్ చేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అవి క్లియర్ చేయడానికి ఐదు శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇదే తరహాలోనే ఈ నెల 12వ తేదీన తుగ్గలి ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ నవీన్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనని పరిచయం చేసుకున్నాడు. పెండింగ్ బిల్లులను పాస్ చేయడానికి రూ.లక్ష తన అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో పదేపదే ఫోన్ చేసి బెదిరించడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు కూడా 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి కర్నూలు శివారులో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితుడి నేరాల చిట్ట.. ►నంద్యాల ప్రాంతానికి చెందిన పేదలకు ఇళ్లు ఇప్పిస్తానని రూ. 22 లక్షలు వసూలు చేశాడు. మున్సిపాలిటీకి సంబంధించి నకిలీ రసీదులు ఫోర్జరీ సంతకా లతో పట్టాలిచ్చి మోసం చేశాడు. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు. ►గడివేముల ప్రాంతానికి చెందిన కొంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ. 6 లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు. ►ఆత్మకూరు ప్రాంతంలో కొంతమంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని తహసీల్దార్, ఆర్డీఓ, సబ్–రిజి్రస్టార్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారుచేసిచ్చాడన్న ఫిర్యాదు మేరకు 2018లో బండిఆత్మకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ►తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
రాయపర్తి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చాక కాదు పొమ్మంటున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఏఎస్సై సదయ్య కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఉబ్బని రాజకుమారి(25) తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఈ క్రమంలో ఒక్కతే ఇంటివద్ద ఉంటుంది. మండలంలోని మైలారానికి చెందిన గబ్బెట శ్రీకాంత్‌కు రాజకుమారికి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. నవంబర్ 29న వర్ధన్నపేట సీహెచ్‌సీలో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు బాబుకు నాకు సంబంధం లేదు అంటూ వదిలేస్తున్నాడు. అతనిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
10మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్న శామ్యూల్ విలియమ్స్
-
ప్రేమ పేరిట మహిళలకు వల
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట మహిళలకు వలవేసి వారిని మోసం చేసి బెదిరింపులకు పాల్పడడం.. రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవిస్తున్న ఓ నిత్య ప్రేమికుడిని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బాలాజీనగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం రావూరు గారమానికి చెందిన తాటిచెట్ల వాసు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏసీలు బిగించేందుకు, సర్వీస్ చేసేందుకు పలువురికి ఇళ్లకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో అక్కడున్న మహిళలు, యువతులను పరిచయం చేసుకునేవాడు. వారి వివరాలను సేకరించి తరచూ వారికి ఫోన్లు చేయడం, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో చాటింగ్ చేసి వారిని ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పి లోబర్చుకునేవాడు. వారి స్నేహితురాల వివరాలను తెలుసుకుని ఇదే తరహాలో వంచించేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవించసాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వాసు నగరంలోని చిన్నబజారుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. సదరు మహిళ ద్వారా ఆమె స్నేహితురాలైన వరంగల్ జిల్లా కె.సముద్రంకు చెందిన ఓ మహిళకు వలవేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను తీసుకుని నెల్లూరుకు వచ్చాడు. ఇందుకూరుపేటలోని గంగమ్మగుడిలో వివాహం చేసుకుని కాపురం పెట్టాడు. అనంతరం ఆమెను పీడించి డబ్బులు తీసుకుని తీవ్రంగా హింసించడంతో బాధిత మహిళ తన స్వగ్రామానికి వెళ్లింది. వాసుపై కె.సముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.12 లక్షలు కాజేశాడు అనంతరం ఇందుకూరుపేటకు చెందిన ఓ యువతికి ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ప్రేమిస్తున్నాని సందేశాలు పంపి ఆమెను లోబర్చుకుని మోసం చేశాడు. కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటూ నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థినికి వలవిసిరాడు. ఆమెకు మాటలు చెప్పి రూ.12 లక్షలు నగదు కాజేశాడు. ఈ మేరకు బాధితురాలు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు ఇదే తరహాలో పలువురిని మోసగించినట్లు విచారణలో వెల్లడై ంది. అదేక్రమంలో 2013లో వాసు సైదాపురం పోలీసు స్టేషన్ పరిధిలో స్నేహితులతో కలిసి డెకాయిటీకి పాల్పడ్డాడని తేలింది. అతడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. జాగ్రత్త.. విద్యార్థినులు, యువతులు, మహిళలు సోషల్ మీడియాను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ మురళీకృష్ణ సూచించారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని దుండగులు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. తీయని మాటలు చెబుతూ ప్రేమిస్తున్నాని నమ్మబలికే ఈ తరహా వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిత్య ప్రేమికుడిని అతి చాకచక్యంగా అరెస్ట్ చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై రమేష్, నాలుగో నగర హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌ను డీఎస్పీ అభినందించారు. -
మాట్రి‘మోసగాడికి’ అరదండాలు!
సాక్షి, సిటీబ్యూరో: గోవాలో పుట్టి పెరిగాడు... చదువు అబ్బకపోయినా మంచి మాటకారి.. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు... వీటి నుంచి గట్టెక్కేందుకు ‘మాట్రిమోనియల్ ఫ్రాడ్స్’ మొదలెట్టాడు... తానో ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఎర వేసి పెళ్లా ప్రస్తావన తెచ్చాడు... తల్లికి అనారోగ్యమంటూ అందినకాడికి దండుకున్నాడు... ఈ పంథాలో అనేక మంది యువతులను మోసం చేసిన ఘరానా మోసగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. గోవా ‘ప్రభావం’తో చదువుకు దూరం... నెల్లూరుకు చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా బిల్డర్. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం గోవాలో స్థిరపడ్డాడు. అతడికి అక్కడే జీవన్‌కుమార్ పుట్టాడు. చిన్నప్పటికీ నుంచి అక్కడే పెరిగిన జీవన్‌పై ‘స్థానిక పరిస్థితుల’ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చదువు అబ్బక పదో తరగతితోనే పుల్‌స్టాప్ పెట్టాడు. చాలా కాలంగా ఫేస్బుక్లో వివిధ పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం అతడికి అలవాటు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా... గత ఏడాది తండ్రి సైతం మరణించడంతో జీవన్ ఒంటరయ్యాడు. తనకు ఉన్న ‘క్వాలిఫికేషన్స్’తో ఉద్యోగాల కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో ప్రకాశం జిల్లాలో ఉన్న నానమ్మ దగ్గరకు వచ్చేశాడు. ఆమె తన పింఛన్‌తోనే మనువడిని పోషిస్తోంది. ఫొటో, పేరు మార్చేసి ప్రొఫైల్... కొన్నేళ్లుగా తనకు ఉన్న ‘ఫేస్బుక్ అనుభవాన్ని’ మాట్రిమోనియల్ సైట్స్‌లో వాడాలని కుట్ర పన్నాడు. మారు పేరు, ఫొటోలతో పాటు లేని అర్హతలను అందులో పొందుపరిచి మోసాలకు తెరలేపాడు. ఇన్‌స్ట్రాగామ్ నుంచి గుజరాత్‌కు చెందిన మోడల్ పృథ్వీష్ శెట్టి ఫొటోను డౌన్లోడ్ చేసుకుని దీనిని వినియోగించి తన పేరు రిషి కుమార్‌గా పేర్కొంటూ జూన్‌లో జీవన్సాథీ.కామ్ వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అందులో తాను పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందానని, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైస్సెస్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పొందుపరిచాడు. దీని ఆధారంగా అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన యువతులకు రిక్వెస్ట్‌లు పంపాడు. ఫొటో, ప్రొఫైల్స్ చూసిన అనేక మంది అతడిని సంప్రదించారు. దీంతో జీవన్‌కుమార్ తన పథకాన్ని అమలులో పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘కనిపించకుండా’... సదరు యువతుల వద్ద పెళ్లి ప్రతిపాదన చేసే జీవన్ ఫోన్ నెంబర్లు తీసుకునే వాడు. బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించి వారితో మాట్లాడటం, చాటింగ్ చేయడం చేసేవాడు. నకిలీ ఫొటోతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యువతులను కలవకుండా జాగ్రత్తలు పడ్డాడు. కొందరు వీడియో చాటింగ్ చేద్దామన్నా... వద్దంటూ వారించేవాడు. పూర్తిగా తనను నమ్మారని భావించిన తర్వాత తన తల్లికి క్యాన్సర్ అంటూ కథ చెప్పేవాడు. వైద్య ఖర్చుల పేరు చెప్పి వారి నుంచి నగదును తన బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించేవాడు. మరికొందరి నుంచి క్రెడిట్/డెబిట్‌కార్డుల వివరాలు, ఓటీపీలు తీసుకుని ఆన్లైన్లో షాపింగ్‌లు చేసేవాడు. ఇలా ఐదు నెలలుగా ఐదుగురిని మోసం చేశాడు. ఇతడిపై అక్కడి సైబర్ క్రైమ్ ఠాణాల్లోనూ కేసులు నమోదైనా ఇప్పటి వరకు ఎవరూ గుర్తించి పట్టుకోలేదు. విలాసవంతమైన జీవితం... నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి నుంచి రూ.2.4 లక్షలతో సహా బెంగళూరు, ఢిల్లీ, ఒడిస్సాలకు చెందిన నలుగురి నుంచి రూ.20 లక్షలు స్వాహా చేశాడు. ఈ సొమ్ముతో జీవన్ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేవాడు. గోవాలో ఎంజాయ్ చేయడంతో పాటు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే ఆరు ఐ–ఫోన్లు, రూ.33 వేలతో యాపిల్ వాచ్, రూ.2.4 లక్షలతో బైక్, రూ.13 వేలతో యాపిల్ ఇయర్ ఫోన్లు తదితరాలు ఖరీదు చేశాడు. ఓ యువతి నుంచి డబ్బు తీసుకుని తర్వాత ఆమెతో సంప్రదింపులకు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ మార్చేసేవాడు. ఇలా మోసపోయిన సికింద్రాబాద్ యువతి గత నెల మొదటి వారంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిరంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్, ఎస్సై మధుసూదన్‌రావు, కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, మురళీ నిందితుడు ప్రకాశం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. ఇతడి నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసిన అధికారులు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.4.8 లక్షలు ఫ్రీజ్ చేశారు. -
ట్రూకాలర్‌లో డీజీపీ అని పెట్టుకొని..
సాక్షి, హైదరాబాద్ : ట్రూకాలర్ ఈ స్మార్ట్ యాప్ గురించి తెలియని వారుండరు. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే వారి పేరును తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. ఈ యాప్ వాడే వ్యక్తులు తమ పేరును రిజిస్టర్ చేసుకుంటారు. అందరూ వాళ్ల అసులు పేరు లేకపోతే ముద్దుపేరు పెట్టుకుంటారు. కానీ తెలివిమీరిన ఓ వ్యక్తి పెట్టుకున్న పేరు, అతడు చేసిన మోసాలు కటకటాలపాలు చేసేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి పారిశ్రామికవాడ, ఫేజ్–5లో బిట్ల వెంకటేశ్వరరావు అనే పారిశ్రామికవేత్తకు ఉజ్వల ఇండస్ట్రీస్ పేరిట పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 2017 డిసెంబరులో సికింద్రాబాద్‌కు చెందిన ఆర్ఈ కేబుల్స్ ప్రతినిధి హితేష్ జైన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. కాగా కంపెనీ వ్యవహరాలన్నీ హితేష్ జైన్ తమ్ముడు జతిన్ జైన్ చూసుకునేవాడు. ఈ క్రమంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పరిశ్రమ యజమాని వెంకటేశ్వరరావు జతిన్జైన్ను నిలదీశాడు. దీనిపై వివాదం ఏర్పడగా వెంకటేశ్వరరావు చర్లపల్లి అసోసియేషన్ ప్రతినిధులను ఆశ్రయించాడు. అసోసియేషన్ ప్రతినిధులు జతిన్ జైన్‌కు ఫోన్ చేశారు. వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నేనెవరో మీకు తెలుస్తుంది...ఒక్కసారి ట్రూ కాలర్ చెక్ చేసుకోండి అంటూ బెదిరింపు లకు పాల్పడుతూ ఫోన్ కట్ చేశాడు. తరువాత ట్రూకాలర్‌లో చూడగా డీజీపీ–టీఎస్ అని రావడంతో అసోసియేషన్ ప్రతినిధులు బాధితునితో కలిసి మంగళవారం డీజీపీని కలిశారు. వెంటనే స్పందించిన డీజీపీ, సీపీతో మాట్లాడారు. రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు జతిన్జైన్ను అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రబాబు మోసగాడని మోదీ తెలుసుకోలేకపోయారు!
సాక్షి, నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసగాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోలేకపోయారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి రూ. 16800 కోట్లు ప్రధానమంత్రి కేటాయించగానే.. చంద్రబాబు కొనియాడారని, కానీ, అవినీతి, అక్రమాల కారణంగా కేంద్రం నుంచి ఆ నిధులను చంద్రబాబు తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. నెల్లూరులో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత దోపిడీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబుని రాబోయే ఎన్నికల్లో తరిమితరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కన్నా పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటివరకు రూ. లక్ష 55 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చిందని తెలిపారు. కేంద్రం మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు. చివరికీ మరుగుదొడ్ల నిర్మాణంలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని, అవినీతి, అరాచకాలు, అక్రమాలు తప్ప పాలన లేదని అన్నారు. టీడీపీ అవినీతికి కట్టుబడితే.. బీజేపీ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. -
చిక్కినా చిక్కులే!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఒకే పంథాలో వరుస మోసాలకు పాల్పడుతున్న ‘గ్రేట్ చీటర్’ అఫ్తాబ్ అహ్మద్ షేక్ చిక్కడం ఒక ఎత్తయితే... అతడిని విచారించడం మరో ఎత్తు. ఇంటరాగేషన్ చేయడానికి ప్రయత్నించే పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. మరోపక్క ఈ ఘరానా నేరగాడు అనేక సందర్భాల్లో ‘ప్లీడెడ్ గిల్టీ’ విధానం అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా తయారయ్యే అఫ్తాబ్ ఎదుటి వారిని బురిడీ కొట్టించడానికి ముందు వారి మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి, అవసరాలను అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్‌ను ఎంపిక చేసుకుంటాడు. మాటలతో గారడీ చేసి తన ‘పని’ పూర్తి చేసుకుంటాడు. ఈ పంథాలో రెచ్చిపోయే అఫ్తాబ్‌ను పట్టుకోవడం సైతం పోలీసులకు సవాలే. పాతబస్తీలోని రెయిన్‌బజార్ ప్రాంతంలో ఇతడి నివాసం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో? ఎవరిని మోసం చేస్తాడో? తెలియని పరిస్థితి. కొన్ని రోజుల పాటు అతడి ఇంటి వద్ద కాపుకాస్తే తప్ప పట్టుకోలేరు. రమ్మంటే రక్తం వస్తుంది... ఇంత కష్టపడిన పోలీసులు అఫ్తాబ్‌ను పట్టుకున్నప్పటికీ అతడిని పూర్తిస్థాయిలో విచారించడం, కాజేసిన డబ్బు/సొత్తు రికవరీ చేయడం అంత తేలికకాదు. శరీర అవయవాలతో పాటు రక్తం కూడా అతడి ‘చెప్పు చేతల్లోనే’ ఉండటం దీనికి ప్రధాన కారణం. పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించిన వెంటనే తాను చేసిన నేరాల చిట్టా విప్పుతాడు. రికవరీ కోసం సిద్ధమవుతున్నారనే సరికి అఫ్తాబ్‌కు ‘అనారోగ్యం’ వచ్చేస్తుంది. తొలుత కళ్లు తేలేయడంతో పాటు ఏదో ఒక చేతికి పక్షవాతం వచ్చినట్లు వంచేస్తాడు. ఆపై నోరు, చెవి నుంచి రక్తం కారేలా చేస్తాడు. దీనిని చూసిన పోలీసులు ఏదో జరుగుతోందనే భయంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అతడికి ఏం జరిగిందనేది గుర్తించడానికి వైద్యులు అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందంటారు. అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాని నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అతడు కోలుకున్నాక జైలుకు తరలించేస్తారు. గత ఏడాది ఓ ప్రత్యేక విభాగానికి చిక్కినప్పుడు అఫ్తాబ్ ఇదే పంథా అనుసరించి రికవరీలు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తాజాగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినప్పుడూ ఇదే ‘మంత్రం’ ప్రయోగించాడు. దీంతో అధికారులు ఇతగాడిని పాతబస్తీలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయం గుర్తించి చెప్పడంతో తమదైన శైలిలో విచారించిన టాస్క్‌ఫోర్స్ మొత్తం 18 తులాల బంగారం రికవరీ చేయగలిగింది. లాయర్ ఖర్చులు, ఎన్బీడబ్ల్యూలు నో... సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులు ప్రాథమికంగా ఓ లాయర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ద్వారా బెయిల్ తీసుకుని కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇలా హాజరుకాకుంటే ఆ నిందితుడిపై న్యాయస్థానం నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కే అఫ్తాబ్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం, లాయర్‌ను ఫీజులు చెల్లించడం ఇబ్బందికరంగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ప్లీడెడ్ గిల్టీ కోసం ప్రయత్నిస్తాడు. అంటే.. ఆయా కేసుల్లో దర్యాప్తు పూర్తయి, చార్జ్షీట్లు దాఖలయ్యే వరకు జైల్లోనే ఉంటాడు. ఆపై న్యాయమూర్తి ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించేస్తాడు. దీనినే సాంకేతికంగా ప్లీడెడ్ గిల్టీ అంటారు. దీంతో కోర్టు అతడికి శిక్ష విధించేస్తుంది. అది పూర్తి చేసుకున్న తర్వాతే జైలు నుంచి బయటకు వస్తుంటాడు. ఇది సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే బెయిల్ తీసుకుంటాడని పోలీసులు పేర్కొన్నారు. అనేక కేసుల్లో సాక్షులు, ఫిర్యాదుదారులకు సైతం తన ‘అనారోగ్యం’ చూపించి రా>జీ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఫ్తాబ్ 2007 నుంచి నగరంలో నేరాలు చేస్తున్నప్పటికీ ఒక్క కేసులోనూ ఎన్బీడబ్ల్యూ జారీ కాలేదని వివరిస్తున్నారు. ఇతగాడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసుల పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఎయిమ్స్‌లో.. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’
సాక్షి, న్యూఢిల్లీ : అద్నన్ ఖుర్రమ్ 19 ఏళ్ల యువకుడు. ఎంతటివారినైనా బురిడీ కొట్టించగల ఘనుడు. తన ప్రతిభతో డాక్టర్ సీటు సంపాదించలేకపోయాడు గానీ ప్రొఫెసర్ల కళ్లుగప్పి ఐదు నెలలపాటు ఎయిమ్స్ జూనియర్ డాక్టర్‌గా నటిస్తూ లబ్ది పొందాలని చూశాడు. చివరికి మోసం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. బీహార్ టూ ఢిల్లీ.. బీహార్‌కు చెందిన అద్నన్ ఖుర్రమ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్లతో పరిచయం పెంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్(ఆర్డీఏ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో ఖుర్రమ్ తనను తాను జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా వారికి పరిచయం చేసుకున్నాడు. మోసం బయటపడిందిలా.. ఆర్డీఏ చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమాల్లో, మారథాన్లలో ఖుర్రం చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఆ కారణంగానే అతని మోసం బయటపడింది. మామూలుగా జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు 18 నుంచి 20 గంటల డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేయకుండా ఖుర్రం ఎప్పుడూ బయటే కనిపించేవాడని, దాంతో అతనిపై అనుమానం కలిగిందని డాక్టర్ హర్జీత్ సింగ్ భట్టి తెలిపారు. వెంటనే విద్యార్థుల ప్రవేశ పట్టికతో పాటు స్టైఫండ్ పొందే విద్యార్థుల జాబితా పరిశీలించగా ఖుర్రమ్ పేరు ఎక్కడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో సుమారు 2 వేల మంది రెసిడెంట్ డాక్టర్లు ఉంటారని.. అందుకే ఖుర్రం మోసాన్ని కనుక్కోలేకపోయామని తెలిపారు. అంతేకాకుండా నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చే వీఐపీలతో ఫొటోలు దిగడానికి మాత్రమే ఆసక్తి చూపేవాడని పేర్కొన్నారు. అలా రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ వంటి ప్రముఖ వ్యక్తులతో ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. జూనియర్ డాక్టర్లుగా చెప్పుకుంటూ తమ కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు పొందారన్నారు. ఖుర్రంను అరెస్టు చేసిన పోలీసులు సెక్షన్ 419(మోసం), సెక్షన్ 468(ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసాలు
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో యువతులకు వలవేసి పెళ్లి చేసుకున్నట్లు మభ్యపెట్టి వారి నుంచి అందినకాడికి దండుకొని మోసాలకు పాల్పడుతున్న యువకుడిపై జూబ్లీహిల్స్‌పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కార్వాన్, మొఘల్‌నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ అనే యువకుడు ఏడాది క్రితం కావూరిహిల్స్ ఫేజ్–1కు చెందిన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అనంతరం ఆమె వద్ద కిలో బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని జల్సాల కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. మూడు నెలలుగా ఆమెను వేధించడమేగాక ఇంట్లో నుంచి తరిమివేశాడు. బాధితురాలు అతని వైఖరిపై ఆరా తీయగా అప్పటికే మరో నలుగురు యువతులను ఇదే తరహాలో మోసం చేసి వారి నుంచి బంగారం, నగదు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె షరీఫ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే అతను శనివారం రాత్రి బాధితురాలిని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45కు తీసుకువచ్చి కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. లేని పక్షంలో వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. షరీఫ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ మోసగాడు అరెస్టు
కాకినాడ రూరల్: ఫేస్బుక్ ప్రేమ పేరుతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను మోసగించి, బెదిరించి డబ్బులు, బంగారు, మోటార్‌సైకిళ్లు దోచుకుంటున్న యువకుడిని సర్పవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం సర్పవరం స్టేషన్లో కాకినాడ డీఎస్పీ రవివర్మ, సర్పవరం సీఐ చైతన్యకృష్ణ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కాకినాడ రాజీవ్‌గాంధీ లా కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతున్న ఉప్పాడ గ్రామానికి చెందిన స్వామిరెడ్డి శ్రీనివాసరావు (28) ఫేస్బుక్ ప్రేమపేరుతో మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న అమ్మాయిలను, వివిధ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను, మోటార్‌సైకిళ్లను దోచుకుంటున్నాడన్నారు. తన పేరు షాలినీ కుసిరెడ్డి అని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్టు ఫేస్బుక్లో పరిచయం చేసుకుని, బాగా పరిచయమైన తరువాత తన పేరు స్వామిరెడ్డి శ్రీనివాసరావు అని చెబుతున్నాడన్నారు. రూ.కోటి, రూ.రెండు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిస్తానని తనను ప్రేమించమంటూ వేధిస్తున్నాడని పోలీసులు వివరించారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదా శారీరకంగా కలవాలని లేకపోతే అధిక మొత్తంలో డబ్బులు, బంగారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడని డీఎస్పీ రవివర్మ వివరించారు. డబ్బులు, బంగారం ఇవ్వక పోతే ఫేస్బుక్, వాట్సాప్‌లలో వారి ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా నెట్లో పెడతానని బెదిరించేవాడన్నారు. స్వామిరెడ్డి శ్రీనివాసరావు విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిని, అమలాపురం కిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వేధింపులకు గురి చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు డీఎస్పీ రవివర్మ, సీఐ చైతన్యకృష్ణ వివరించారు. కిమ్స్ కళాశాల విద్యార్థిని నుంచి రూ. 10వేలు, జేఎన్టీయూకే విద్యార్థినిని బెదిరించి రూ.80వేల నగదు, బంగారు బ్రాస్లెట్, ఉంగరం వసూలు చేశాడన్నారు. అదే విధంగా విశాఖపట్నానికి చెంది ఐఓసీఎల్‌లో పని చేస్తున్న ఒక ఆమెను బ్లాక్ మెయిల్ చేసి రూ.18 వేలు వసూలు చేశాడని, కాకినాడకు చెందిన విద్యార్థిని నుంచి హోండా యాక్టీవా మోటర్ సైకిల్, విశాఖపట్నానికి చెందిన ఆమెకు సంబంధించి టీవీఎస్ జ్యూపిటర్ మోటర్‌సైకిల్‌ను దొంగిలించాడన్నారు. ఇదే విధంగా విశాఖపట్నానికి చెందిన ఒక మైనరు బాలికను వంచించి న్యూడ్ వీడియో తీసి డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడన్నారు. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ రవివర్మ, సీఐ చైతన్యకృష్ణ వివరించారు. -
చీటర్ పట్టివేత
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సదరం సర్టి ఫికెట్ ఇప్పిస్తానంటూ ఓ వికలాంగురాలి నుంచి డబ్బు వసూలు చేసి, ముఖం చాటేసిన చీటర్‌ను సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 8న ధర్మవరం తారకరామాపురానికి చెందిన రామలక్ష్మి సదరం సర్టిఫికెట్ కోసం ఓపీ నంబర్ 9కి వెళ్లింది. ఓపీ వద్ద ఓ వ్యక్తి వైకల్యం సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు రూ.వెయ్యి ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో రామలక్ష్మి తన వద్ద అంత లేదని రూ.600 మాత్రమే ఉందని చెప్పింది. ఉన్న డబ్బులు ఇవ్వాలని, సర్టిఫికెట్ ఇచ్చే ముందు మిగతా రూ.400 ఇవ్వాలని చెప్పాడు. సర్టిఫికెట్ వస్తుందన్న ఆశతో ఆమె రూ.600 సమర్పించుకుంది. మొదట ఆధార్‌కార్డు జిరాక్స్ చేసుకుని రావాలని, తాను ఇక్కడే ఉంటానని తెలిపాడు. జిరాక్స్ చేయించుకుని ఓపీ వద్దకు వస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడంతో తాను మోసపోయానని రామలక్ష్మి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ దృష్టికి తీసుకెళ్లింది. చాకచక్యంగా.. ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో నమోదైన ఫొటోను సెల్లో తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఓపీ నంబర్ 9 వద్ద మరోసారి సదరు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ సూపర్వైజర్లు ఇర్ఫాన్, నరేష్ గట్టిగా నిలదీయడంతో రామలక్ష్మి నుంచి సర్టిఫికెట్ కోసం డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. తన పేరు రెడ్డప్పరెడ్డి అని, ఊరు నల్లమాడ మండలం అయ్యన్నగారిపల్లి అని తెలిపాడు. అనంతరం అతడిని సెక్యూరిటీ సిబ్బంది టూటౌన్ పోలీసులకు అప్పగించారు. -
రంగస్వామి లీలలు గుట్టురట్టు..
సాక్షి, హైదరాబాద్ : చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్బుక్ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్బుక్ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 20 మంది మహిళలు ఇతగాడి బారిన పడ్డారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించి చాలామంది మిన్నకుండిపోగా, ఓ బాధితురాలు మాత్రం ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో రంగస్వామి గుట్టురట్టు అయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బుక్కరాయపట్నంకు చెందిన రంగస్వామి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. జల్సాలకు అలవాటు పడ్డ అతడు చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడేవాడు. చదివింది ఐదో తరగతే అయినా ఫేస్బుక్ వాడటంలో రంగస్వామి దిట్ట. దీన్నే అస్త్రంగా భావించిన అతడు ఒంటరి మహిళలను టార్గెట్ చేశాడు. వారిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి లక్షల్లో దండుకొని పరారయ్యేవాడు. నగరంలోని నాచారం, లాలాపేట్, లాలాగూడలకు చెందిన సుమారు 20 మందికి పైగా మహిళలు మోసపోయారు. వీరంతా ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారు కావడం విశేషం. పరువు పోతుందని చాలా మంది బాధితులు బయటకు రాలేదు. అయితే లాలాగూడకు చెందిన ఓ మహిళ రంగస్వామి తనను మోసం చేశాడని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి లక్షల్లో వసూలు చేసి పరారయ్యాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేశారు. రంగస్వామికి ఇదివరకే నేరచరిత్ర ఉంది. చైన్ స్నాచింగ్, హత్యాయత్నం బెదిరింపు కేసులుకూడా నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా అతగాడి బుద్ధి మాత్రం మారలేదు. ప్రస్తుతం అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
ఘరానా మోసగాడి అరెస్ట్
ఏలూరు అర్బన్ : పోలీస్, విజిలెన్స్, ఏసీబీ అధికారినంటూ రేషన్ డీలర్లు లక్ష్యంగా నేరాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని గణపవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వలిశెల రత్న వివరాలు వెల్లడిం చారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన అయితం రవిశేఖర్ అనే వ్యక్తి విలాసాలకు బానిసై మోసగాడికి మారాడు. తాను పోలీస్, విజిలెన్స్, ఏసీబీ అధికారినంటూ ప్రజ లకు పరిచయం చేసుకోవడంతో పాటు దొంగిలించిన కార్లకు ప్రభుత్వ నంబర్ ప్లేట్లను అమర్చుకుని వాటిపై ప్రభుత్వ వాహనం అని రాయించుకుని తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి తాను విజిలెన్స్ అధికారినంటూ హ డావుడి చేసేవాడు. కేసు లేకుండా చేస్తానని డీలర్లను నమ్మించి వారి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేసేవాడు. ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సొమ్ములు వసూలు చేసుకుని పరారయ్యేవాడు. నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో అలపాటి రాజ్యలక్ష్మి అనే రేషన్ షాపు డీలర్ భార్యను మోసగించి 25 కాసుల బంగారు ఆభరణాలు, ఉంగుటూరుకు చెందిన పారంపాటి రాఘవేంద్రరావును ఏసీబీ అధికారినంటూ మోసగించి స్విఫ్ట్ డిజైర్ కారును అపహరించుకుపోయాడు. ఇలా ఇప్పటి వరకూ 80కు పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు శిక్ష కూడా అనుభవించాడు. చివరిగా నల్గొండ జిల్లా భువనగిరిలో మోసానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించి గతేడాది విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 11 నేరాలకు పాల్ప డ్డాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ టి.సత్యనారాయణ పర్యవేక్షణలో సీసీఎస్ పోలీసులు, గణపవరం పోలీసు సిబ్బంది నిందితుడిని బాదంపూడి వై.జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి నుంచి 341 గ్రాముల బంగారు ఆభరణాలు, నకిలీ ఐడెంటిటీ కార్డులు, నకిలీ కార్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ రత్న వివరించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, గణపవరం సీఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.