రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ‘చీటర్‌’ | Cheater Movie Latest Updates | Sakshi
Sakshi News home page

రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ‘చీటర్‌’

Published Sat, Feb 25 2023 3:42 PM | Last Updated on Sat, Feb 25 2023 3:42 PM

Cheater Movie Latest Updates - Sakshi

చంద్రకాంత్ దూత్త, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘చీటర్‌’. ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ పతకం పై   పరుపతి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ బర్ల దర్శకత్వం వహిస్తున్నారు.  షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నారాయణ బర్ల మాట్లాడుతూ.. ‘మంచి యాక్షన్ సనివేషాలతో  సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.  సినిమా చాలా రిచ్ గా వచ్చింది. అద్భుతమైన కథ కథనం తో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం’అన్నారు. 

‘రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.  గోవా, ఆరాకు, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాం’అని నిర్మాత పరుపతి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాధికా, అనిత, బాబు రావు, గౌతి రాజు, మల్లేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement