నకిలీ దస్తావేజులతో కొనుగోలుదారులను మోసగించే ముఠాను శనివారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ(కృష్ణాజిల్లా): నకిలీ దస్తావేజులతో కొనుగోలుదారులను మోసగించే ముఠాను శనివారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 5న కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో యలమంచిలి శేఖర్‌బాబు అనే వ్యక్తిని పలివేటి కృష్ణప్రసాద్(55) స్థల కొనుగోలు విషయంలో మోసం చేశాడనే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా గురించి తెలుసుకున్నారు.
గుంటూరుకు చెందిన చింతం రమణారెడ్డి అలియాస్ పలివేటి కృష్ణప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనితో ఖాళీ స్టాంపు పేపర్లు విక్రయించే వెళ్లచెరువు కృష్ణారావు, రబ్బరు స్టాంపులను తయారు చేసే అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి(48)లు కలసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు పలు ఏరియాల్లోని వెంచర్ల సర్వేనంబర్లతో నకిలీ స్టాంపు పేపర్లు తయారుచేసి కొనుగోలు దారులను మోసం చేశారు. వీరి పై దృష్టి పెట్టిన కంకిపాడు పోలీస్ బృందం నిందితులను అరెస్ట్ చేసి భారీగా నకిలీ స్టాంపు పేపర్లు, దస్తావేజులను స్వాధీనం చేసుకుంది.