fake documents
-
కడపలో భూచోళ్లు!
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులురెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్‌తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్‌ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్‌కుమార్ గోయెల్‌తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్‌ను ని ర్మించాలని టీఎస్‌ఎల్‌ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్‌టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్‌ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్‌పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు. -
‘డీఎస్సీ’కి నకిలీల బెడద!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్‌ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.మోసాల్లో మచ్చుకు కొన్ని ..∙ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
ఐదేళ్లలో రూ. 300 కోట్లు.. నకిలీ వీసా ముఠా గుట్టురట్టు
ఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. సెప్టెంబర్ 2 తేదీన సందీప్ అనే వ్యక్తి నకిలీ స్వీడిష్ వీసాతో ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఓ భారీ నకిలీ వీసా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు నాలుగైదు వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసి ఈ ముఠా రూ. 300 కోట్లు సందపాదించనట్లు అధికారులు పట్టుపడిన సందీప్ అనే వ్యక్తి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ అలీ అనే ఏజెంట్ ద్వారా రూ. 10 లక్షలకు సందీప్ నకిలీ వీసా పొందాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ అలీతో పాటు అతని సహచరులు శివ గౌతమ్, నవీన్ రానాలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శివ గౌతమ్.. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఏజెంట్ల బల్బీర్ సింగ్ , జస్విందర్ సింగ్ పేర్లను చెప్పాడు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని మనోజ్ మోంగా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో పలు దేశాలకు చెందిన నకిలీ వీసాలు తయారు చేసినట్లు వారు వెల్లడించారు. పోలీసులు తిలక్ నగర్‌లోని ఫ్యాక్టరీపై దాడి చేసి గ్రాఫిక్ డిజైన్‌లో డిప్లొమా చేసిన మనోజ్ మోంగాను అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం.. జైదీప్ సింగ్ అనే వ్యక్తిని మనోజ్ కలిశాడు. మనోజ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ చూసి.. జైదీప్ నకిలీ వీసాలను తయారుచేయమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా వాటిని సంబంధిచి అవసరమైన సామగ్రిని కూడా అందించాడు. ఈ ముఠా ప్రతి నెలా 30 నుంచి 60 నకిలీ వీసాలు తయారు చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో వీసా స్టిక్కర్‌ను సిద్ధం చేస్తారు. ప్రతి నకిలీ వీసాకు సుమారు 8 నుంచి 10 లక్షలకు విక్రయిస్తారు. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్‌లను ద్వారా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులతో మాట్లాడి నకిలీ వీసాలు అందిస్తారు.ఇప్పటి వరకు ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేశామని, 16 నేపాలీ పాస్‌పోర్ట్‌లు, రెండు భారతీయ పాస్‌పోర్ట్‌లు, 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని ఐజీఐ ఎయిర్పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. నకిలీ వీసాల తయారీలో ఉపయోగించిన ప్రింటర్లు, లామినేటింగ్ షీట్లు, ల్యాప్‌టాప్‌ల ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.చదవండి: బాలికపై లైంగిక దాడి.. తృణమూల్ నేత అరెస్టు -
57 ఎకరాలు.. రూ.22.80 కోట్లు
జోగిపేట(అందోల్): ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అనిల్‌కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన అంజమ్మ, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నారాయణఖేడ్ పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడీ గ్రామానికి చెందిన సుధాకర్, ముకుందానాయక్ తండాకు చెందిన రవీందర్‌లు రియల్టర్లు. వీరు ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు చెందిన వ్యవసాయభూమిని ఎకరాకు రూ.39 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదే భూమిని హైదరాబాద్‌కు చెందిన యాదగిరిరెడ్డికి ఎకరాకు రూ.40 లక్షలు చొప్పున రూ.22.80 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ కింద మే 3వ తేదీన యాదగిరిరెడ్డి తన స్నేహితుడు వాసుదేవరెడ్డి ఖాతా ద్వారా రూ.11లక్షలు సంజీవరెడ్డికి చెల్లించారు. నెలరోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో యాదగిరిరెడ్డికి అనుమానం వచి్చంది. దీంతో అందోలు గ్రామంలోని ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీయగా.. తాము ఈ భూమిని ఎవరికి విక్రయించలేదని చెప్పడంతో యాదగిరిరెడ్డి కంగుతిన్నాడు.తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కాపీలను చూపించగా, అవి నకిలీవని తేలాయి. దీంతో సంగారెడ్డి ఎస్పీ రూపే‹Ùకు ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జోగిపేట సీఐ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణ చేపట్టింది. నిందితులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివ, హోంగార్డు సురేశ్‌లను సీఐ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్‌కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్‌గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్‌ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్‌కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్‌డీని అడ్డుపెట్టుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్‌గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్‌కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్‌పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్‌పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్‌పోర్టులో వీ.ఎం.థామస్‌గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్‌పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
Ministry of Telecom: తప్పుడు సిమ్‌లు 21 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్‌లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్‌కార్డులను సంపాదించి యాక్టివేట్ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్లో ఆ సిమ్‌లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది. సైబర్ నేరాలకు దుర్వినియోగం! తప్పుడు పత్రాలతో పొందిన సిమ్‌లను ఆయా వ్యక్తులు సైబర్ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్ సిమ్‌ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్‌లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్‌నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది. -
నకిలీ ధ్రువ పత్రాల నియంత్రణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: జనన, మరణ నమోదు (సవరణ చట్టం–2023)పై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ పత్రాలను నియంత్రించేందుకు పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన కోసం తగిన సమాచారాన్ని అందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిస్టర్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన, మరణ రిజిస్ట్రేన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు జాబితా సవరణ, వివాహ రిజిస్ట్రేషన్, పాస్‌పోర్టు జారీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ పాస్‌పోర్ట్‌ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్‌పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో 108 పాస్‌పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, మూడు ప్రింటర్లు, 11 పెన్‌డ్రైవ్‌లు, ఒక స్కానర్, పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్‌పోర్టుల వరకు హైదరాబాద్‌కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్‌లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో టచ్‌లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్‌కు ఒక్కో పాస్‌పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో స్లాట్లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్‌పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్‌ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ ముఠా నుంచి పాస్‌పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర! నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది. అరెస్టు అయింది వీరే! అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు. -
నకిలీ దందా.. దామచర్ల చుట్టూనే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రబ్బరు స్టాంపుల కుంభకోణం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలను పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే మూడు డాక్యుమెంట్లు...ఆరు రబ్బరు స్టాంపుల చందంగా విరాజిల్లింది. ఈ దందా అంతా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అండదండలతోనే ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో వేళ్లూనుకుపోయింది. దామచర్ల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణానికి రింగ్ లీడర్‌గా అవతారమెత్తాడు. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, దామచర్ల ప్రధాన అనుచరురాలు పెరంమూరు వరలక్ష్మి అలియాస్ పెద్దిశెట్టి వరలక్ష్మికి 2012లో స్టాంప్ వెండర్ లైసెన్స్‌ను ఇప్పించాడు. అప్పటి నుంచే ఆమె దస్తావేజులను కేవలం నకిలీ డాక్యుమెంట్ల తయారీకి విక్రయిస్తూ ఈ రాకెట్‌కు తెరతీసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దామచర్ల తన అనుచరులను శాఖకు బదిలీ చేయించుకోవడంతో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణానికి అడ్డే లేకుండా పోయింది. నకిలీల చేతిలో 1100 దస్తావేజులు జిల్లా కోర్టు ప్రాంగణానికి సమీపంలో దస్తావేజులు విక్రయించేందుకు వరలక్ష్మికి ఒక దుకాణం కూడా ఏర్పాటు చేయించి దాన్ని దామచర్ల ప్రారంభించాడు. అప్పటి నుంచి దస్తావేజులను నకిలీ దందాలు చేసే ముఠాలకు మాత్రమే విక్రయిస్తూ భారీగా ఆర్జించింది. నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపుల కుంభకోణం వెలుగు చూడటంతో ఎస్పీ మలికాగర్గ్ సిట్‌ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో స్టాంప్ వెండర్ వరలక్ష్మి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆమె నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారికి, సంతకాలు ఫోర్జరీ చేసే వాళ్లకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంది. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు దాదాపు 1100 దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేలింది. వరలక్ష్మికి పార్టీ పదవులెన్నో... నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ విభాగం అసోసియేషన్‌కు కార్యదర్శి పదవిని కూడా ఇప్పించాడు. ఆ తరువాత ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్ పార్టీ అభ్యర్థిగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు నలుగురిని కాదని వరలక్ష్మికి టిక్కెట్ ఇప్పించాడు. టిక్కెట్ ఇప్పించటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా దామచర్లే పెట్టుకున్నాడన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే దామచర్ల ఆమెను ఎంతగా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని.. సిట్ దర్యాప్తులో టీడీపీ నాయకుల పాత్రలు వెలుగుచూస్తుడడంతో అధికార పార్టీపై నెపం వేసేందుకు దామచర్ల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకున్నారు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఈ దర్యాప్తును కోరిందే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దోషులు ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎంఓలో ఉన్న కీలక అధికారులను సైతం ఆయన కోరిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి ఎల్లో మీడియా ప్రతి రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తోంది. రూ.100 దస్తావేజు రూ.10 వేలకు విక్రయం... ఒంగోలు కేంద్రంగా దస్తావేజులు అక్రమ విక్రయాలకు పెద్దిశెట్టి వరలక్ష్మి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా రూ.100 విలువైన దస్తావేజును అదే ధరకు అమ్మాలి. అయితే ఒక్కో చోట స్టాంపు వెండర్లు రూ.100 విలువ చేసే దస్తావేజుకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసుకుంటారు. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే వరలక్ష్మి మాత్రం రూ.100 దస్తావేజును రూ.10 వేలకు విక్రయించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంది. దానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యేగా దామచర్ల అండదండలే. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ సురేష్ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు... దస్తావేజుల కుంభకోణంలో వరలక్ష్మి పాత్ర వెలుగుచూడడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజాపానగాలరోడ్డులో నివాసం ఉంటే వరలక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్పీ మలికాగర్గ్ నేతృత్వంలోని సిట్ బృందం ఆమె కదలికలపై నిఘా పెట్టింది. అయితే టీడీపీలోని ప్రధాన నాయకులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొని కాపాడుతున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు, ఫోన్ నంబర్లు మారుస్తూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మితో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వారి కదలికలపై కూడా సిట్ నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు కోర్టుల్లో కేసుల రూపంలో కొనసాగుతున్నట్లు కూడా సిట్ బృందానికి సమాచారం వచ్చింది. అనేక సమస్యలకు, ఆస్తులు వివాదాల్లోకి వెళ్లటానికి కూడా వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు ప్రధానంగా ఉన్నటు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలనలో 1100 దస్తావేజులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో దస్తావేజులను అక్రమార్కులకు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఫేక్ డాక్యుమెంట్లపై ముమ్మర దర్యాప్తు
ఒంగోలు: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయరెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శుక్రవారం భేటీ అయ్యారు. ఒంగోలులో గత పది సంవత్సరాలకుపైగా జరుగుతున్న ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం అంశాలపై నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా గురువారం సీఎంవోలో భేటీ అయిన అంశాలపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయని, అందుకు గల కారణం ఏమిటనేది కూడా విచారించాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే బాలినేని తెలియజేసిన అంశాలపై సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి తక్షణమే కలెక్టర్, ఎస్పీలను సీఎంవోకు పిలిపించుకుని ముగ్గురి సమక్షంలో చర్చించడం, అనంతరం ఒంగోలు నియోజకవర్గ ప్రజలు, నాయకులు బాలినేని భద్రతను దృష్టిలో ఉంచుకుని వెనక్కు పంపిన గన్మెన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంవో అధికారులు సూచించడంతో బాలినేని అంగీకరించారు. అలాగే ఈ వ్యవహారాన్ని తొందరగా తేల్చాలని, అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించినట్టు తెలిసింది. ఫేక్ డాక్యుమెంట్స్, భూ రిజిస్ట్రేషన్ వివాదాలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తీసుకెళ్లారు. ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వాటన్నింటిపై విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తావించారు. విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించగలుగుతామన్నారు. దీనిలో జరుగుతున్న జాప్యం వల్లే తాను మనస్తాపానికి గురయ్యానని, అందువల్లే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి సమస్యను తీసుకొచ్చామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, వారిలో నెలకొన్న ఆందోళన తొలగించాలనే ఉద్దేశంతోనే కేవలం పోలీసు డిపార్టుమెంట్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకుపోయేందుకు గన్మన్లను వెనక్కు పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై ధనుంజయరెడ్డి కలెక్టర్‌తో, ఎస్పీతో చర్చించారు. విచారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే సీఐడీ సహకారం కూడా తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించారు. శుక్ర, శనివారాల్లో సీఎంవో అధికారులతో బాలినేని భేటీ అంశాలపై మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలను సీఎంవో కార్యాలయం కూడా ఖండిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అంతే కాకుండా తప్పుడు కథనాల అంశాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, దానిపై ఆయన ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించినట్లు సీఎంవో అధికారులు బాలినేనికి వివరించారు. అదే విధంగా ఒంగోలులో సుమారు 25 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించి అతి త్వరలోనే నిధులు విడుదలచేసి పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు. ఒంగోలులో ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి సరఫరా స్కీము టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడానికి ఉన్న జాప్యాన్ని కూడా సీఎంవో కార్యాలయం దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు బాలినేనికి స్పష్టం చేశారు. కొత్తపట్నం బకింగ్‌హాంపై కెనాల్‌పై జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి, ఆర్యవైశ్య ఆరామక్షేత్రం పనులు గురించి చర్చించారు. -
హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
హైదరాబాద్: వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్న నకిలీ డాక్టర్‌ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లో అప్పగించారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం సాహెబ్ నగర్లో నివాసం ఉంటున్న దేవులపల్లి కార్తీక్ రాజు ఈ నెల 13న తలనొప్పి, నరాల బాధతో ఎల్బీనగర్లోని సిరీస్ రోడ్‌లోని సిరినగర్ కాలనీలో ఉన్న జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ సెంటర్‌కు వచ్చాడు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే నకిలీ డాక్టర్ కార్తీక్‌రాజును పరీక్షించి మందులు ఇవ్వకుండా...నీకు చేతబడి చేశారని, పూజలు చేయాలంటూ సలహా ఇచ్చాడు. 22వ తేదీన అమావాస్య నాడు పూజలు జరిపిస్తానని చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడు. ఇతని తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆదివారం జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ హస్పిటల్‌పై దాడి చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని..అతని వద్ద నుంచి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కాజేశారని నటి గౌతమి ఫిర్యాదు
తన ఆస్తిని కాజేశారని నటి గౌతమి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29వ తేదీ మరిన్ని వివరాలను అందించడానికి తిరువణ్ణామలై ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమచారం. గౌతమి 2004లో క్యాన్సర్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఆస్తులకు పవర్ ఏజెంట్‌గా అళగప్పన్ అనే రియల్ఎస్టేట్ ఏజెంట్‌ను నియమించుకున్నారు. కాగా అళగప్పన్ ఆయన కుటుంబ సభ్యులు శ్రీపెరంబత్తూర్లోని గౌతమికి చెందిన రూ.25 కోట్ల ఆస్తులను పోర్జరీ పత్రాలతో ఆక్రమించినట్లుగా సోమవారం చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలైలో 2019లో రూ.48 లక్షలతో 4 ఎకరాల భూమిని కోనుగోలు చేశానని.. ఇప్పుడు కోట్ల విలువ చేస్తుందని.. ఆ భూమిని అళగప్పన్, అతని భార్య నాచ్చాన్ కాజేశారని తన న్యాయవాది ద్వారా తిరువణ్ణామలై జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అళగప్పన్, అతని భార్యను స్టేషన్‌కు పలిపించారు. డీఎస్పీ అన్నాదురై, ఇన్స్పెక్టర్ కవిత విచారించారు. కాగా ఈ కేసులో మరిన్ని ఆధారాలను సమర్చించడానికి నటి గౌతమి ఈ నెల 29వ తేదీ తిరువణ్ణామలై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. -
బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత
సాక్షి, తిరుపతి: ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో టీడీపీ నేత బ్యాంకును బురిడీ కొట్టించి రూ. 8 కోట్లకుపైగా రుణం తీసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రామచంద్రాపురం మండలానికి చెందిన బీఎన్ రెడ్డి కుటుంబం దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు నవీన్‌రెడ్డి, కోడలు ప్రియాంకా చౌదరి కొంత కాలం క్రితం తిరుపతిలో స్థిరపడ్డారు. 2016, మే 28న నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సమక్షంలో ప్రియాంక చౌదరి రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ద్వారా అప్పట్లో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 జూలై 8న తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్బీఐ ఎస్ఎంఈ బ్రాంచ్‌లో ఓసారి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. కొంతకాలం తర్వాత మరలా రూ. 3.5 కోట్లు రుణం తీసుకున్నారు. 9 ఎకరాలు తమదేనంటూ.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పీర్లగూడలో చిన్నశ్రీరాములు పేరుతో సర్వే నంబర్ 157, 159, 160లో ఉన్న 9 ఎకరాల భూమి, అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్న నారియా ఎంటర్ప్రైజెస్ గ్రానైట్ ఇండస్ట్రీ రికార్డులను ఎస్బీఐకు స్యూరిటీగా సమరి్పంచి ఎస్బీఐ నుంచి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. ప్రస్తుత తిరుపతి జిల్లా పుత్తూరు పాలమంగళంలోని సిరీనా రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో రూ. 3.5 కోట్లను రుణంగా పొందారు. ఆ రుణం పొందిన వెంటనే బ్యాంకుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నారియా ఎంటర్‌ప్రైజెస్‌ను అమ్మేశారు. ఆ తరువాత ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఎన్పీఏగా గుర్తించి స్యూరిటీగా పెట్టిన ఆస్తుల అమ్మకానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పీర్లగూడలో ప్రియాంకా చౌదరి, నవీన్‌రెడ్డి పేరుతో ఎలాంటి భూములు లేవని, బ్యాంకుకు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ డాక్యుమెంట్లని నిర్ధారించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో గతేడాది అక్టోబర్ 3న తిరుపతి ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రూ. 4.90 కోట్లకు సంబంధించిన కేసుకు సంబంధించి మాత్రమే బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని, ఇది సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిన కేసు అని బ్యాంకు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
మంగళగిరిలో భూకబ్జా.. రూ.15 కోట్ల భూమిపై రియల్టర్లు, టీడీపీ నాయకుల కన్ను
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జాతీయరహదారి వెంట ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారులు పంజా విసురుతున్నారు. నకిలీ పత్రాలు తయారుచేసి ఆ భూముల్ని అమ్మేస్తున్నారు. తాజాగా నకిలీ పత్రాలతో భూమి అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై భూమి యజమాని పోలీసుల్ని ఆశ్రయించారు. నగరంలో జాతీయరహదారి వెంబడి ఉన్న శ్రీకృష్ణచైతన్య వృద్ధాశ్రమానికి దగ్గరలో 123/1 సర్వే నంబరులో 67 సెంట్ల భూమి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. సుమారు రూ.15 కోట్ల విలువైన ఈ భూమిపై మంగళగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకుల కన్ను పడింది. నగరానికి చెందిన చంద్రమౌళి పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెట్టారు. రూ.4.50 కోట్లకు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు విశాఖపట్నం కి చెందిన తన అనుచరుడు కోటేశ్వరరావు పేరిట అగ్రిమెంట్ రాయించారు. అగ్రిమెంట్ అయిన వెంటనే భూమిని చదును చేసి మట్టి తోలసాగారు. దీంతో మంగళగిరికి చెందిన సాంబశివరావు ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, తనకు అగ్రిమెంట్ ఉందని బయటకొచ్చారు. మొత్తం రూ.2.50 కోట్లు ఇస్తానని, భూమి ఖాళీ చేయాలని కోటేశ్వరరావుతో బేరాలాడసాగారు. ఈ విషయం తెలియడంతో ఆ భూమి అసలు యజమాని విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన గిరీశ్ మంగళవారం రాత్రి ఆ భూమి వద్దకు చేరుకున్నారు. ఈ భూమి మీదేననే ఆధారాలు తీసుకురావాలని కోటేశ్వరరావు అనడంతో గిరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఆధారాలు తీసుకురావాలని పోలీసులు సూచించారు. తాను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నానని, తహసీల్దారుతోను, రిజిస్ట్రార్‌తోను మాట్లాడానని కోటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై తహసీల్దారును, రిజిస్ట్రార్‌ను అడగగా.. తమను రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించలేదని తెలిపారు. దస్తావేజులు, లింకు దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి, పోలీసులు విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఐ అంకమ్మరావును అడగగా.. స్థల వివాదంపై ఫిర్యాదు అందిందని తెలిపారు. తాను సెలవులో ఉన్నానని, విధులకు వచ్చి న తరువాత విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రూ.కోటి విలువ చేసే స్థలం కొట్టేయాలని..
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోటి విలువ చేసే భూమిని కొట్టేయాలని పథకం రచించిన ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్‌తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం వివరాలు వెల్లడించారు. ►బీబీనగర్‌లోని రాఘవాపూర్‌కు చెందిన దొంతి సత్తిరెడ్డి స్థానికంగా వ్యాపారి. కొన్నేళ్లుగా మాగ్జిమా రిసార్ట్స్ ఫామ్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 204, 221లోని 2,420 గజాల రెండు ప్లాట్లు ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. యజమానుల రాకపోకలు లేకపోవటంతో దానిని స్వాహా చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించడంలో సిద్ధహస్తుడైన పాత నేరస్తుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసరలోని చీర్యాలకు చెందిన దాడి ధర్మేందర్ రెడ్డిని సంప్రదించాడు. ►ఇద్దరు కలిసి సదరు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సంపాదించారు. అనంతరం ధర్మేందర్ రెడ్డి సూచన మేరకు ఉప్పర్‌పల్లికి చెందిన సయ్యద్ నజీర్ ఉర్ రహ్మాన్ (ప్రస్తుతం మరణించాడు) నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. వీటి సహాయంతో భూమిని ఇతరులకు విక్రయించాలని భావించారు. ►ఇందుకోసం ముందుగా భూమిని జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్లాట్ల అసలు యజమానులైన కేబీ ఖురానా, అనిల్ ఖురానాల వయసుకు సరిపోయే లా వ్యక్తులను చూడాలని కోరుతూ బోరబండకు చెందిన మహ్మద్ షౌకాత్ అలీని సంప్రదించారు. ►దీంతో కేబీ ఖురానా లాగా యూసుఫ్‌గూడకు చెందిన గొర్రె రమేష్, అనిల్ ఖురానా లాగా వల్లపు రాములు నటించారు. ఆ పైన ప్లాట్లను బోరబండకు చెందిన చాకలి రాముకు జీపీఏ చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు చేశారు. రసూల్‌పురకు చెందిన మహ్మద్ ఇబ్రహీం, యూసుఫ్‌గూడకు చెందిన వాలి బాలకృష్ణ సాక్షి సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ల సహాయంతో సత్తిరెడ్డి, ధర్మేంద్రరెడ్డి ఆయా ప్లాట్లను రూ.65 లక్షలకు విక్రయించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ కూపీ లాగడంతో ముఠా లింకు బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా 12 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్లాట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఇబ్రహీం, బాలకృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.7 లక్షల నగదు, 9 నకిలీ డాక్యుమెంట్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పలు నకిలీ డాక్యుమెంట్స్‌తో భారీ మొత్తంలో అవినీతి
-
AP: 87 మంది హోంగార్డులు తొలగింపు.. ఏ ఒక్కర్నీ వదలం
సాక్షి, చిత్తూరు: అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. ఇందుకు ప్రధాన బాధ్యులు టీడీపీ నేతలు.. వారి మాటను కాదనలేకపోయిన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనలో 87 మంది హోంగార్డులను తొలగిస్తూ శనివారం అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖను కుదిపేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. బయటపడింది ఇలా.. హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్–పేమెంట్. అగి్నమాపక, టీటీడీ, ఆరీ్టసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్ఐ మురళీధర్ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, మూణ్ణెల్ల క్రితం వన్‌టౌన్‌లో ఆర్ఐ మురళీధర్ ఈ విషయమై ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మణికంఠ అనే హోంగార్డును విచారించగా.. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతల ఆదేశాలతో తాను, యువరాజ్, జయకుమార్, కిరణ్ తదితరులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బులు వసూలుచేసి, అప్పటి అధికారులకు లంచంగా ఇచ్చి హోంగార్డు ఉద్యోగాలు పొందినట్లు అంగీకరించాడు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ మరిన్ని వివరాలు రాబట్టారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) అరెస్టులకు న్యాయపరమైన సలహాలు హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేపుడు పాస్‌పోర్టు, డీఓ (డ్యూటీ ఆర్డర్)ను అధికారులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చేటపుడు నిజమైన హోంగార్డును పుత్తూరు అగి్నమాపక శాఖలో విధులు కేటాయిస్తున్నట్లు టైపుచేసి, ఇతనితో పాటు అదనంగా మరో ఐదుగురు నకిలీ హోంగార్డుల పేర్లను టైపుచేసి డీఓ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంటారు. ఇలా ఏకంగా 87 మందిని పలు సంస్థల్లో నియమించేశారు. ఇందులో కీలకపాత్ర పోషించింది టీడీపీ హయాంలో చినబాబుకు కుడిభుజంగా మెలగిన చిత్తూరు జిల్లా పార్టీ నేతగా తెలుస్తోంది. ఇతను ఆడమన్నట్లు ఆడిన అప్పటి చిత్తూరు పోలీసు బాసు, ఓ ప్రత్యేక డీఎస్పీ సైతం ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు. మరోవైపు.. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరుకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కొందరు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలుచేసిన మొత్తంలో కొంత ఉన్నతాధికారులకు ఇచ్చి మిగిలిన సొమ్ము చిన్నబాబుకు అందజేశారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అప్పటి ఐపీఎస్ అధికారి, డీఎస్పీలు, ఆర్ఐలతో పాటు టీడీపీ నేతలను అరెస్టుచేయడానికి పోలీసులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తమ్ముళ్లలో వణుకు.. నిజానికి.. పోలీసుశాఖలో అంతర్లీనమైన హోంగార్డులు విధుల్లోకి చేరాలంటే నోటిఫికేషన్, శారీరక దేహదారుఢ్య పరీక్షలు, తుదిగా రాత పరీక్షల్లో ప్రతిభ చూపించడం తప్పనిసరి. అయితే, ఇవేమీ లేకుండా 2014–2019 మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పోలీసుశాఖలోకి దాదాపు 87 మంది హోంగార్డులు చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నకిలీ హోమ్‌గార్డులు నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంగార్డుల తొలగింపు విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో చిత్తూరుకు చెందిన తెలుగు తమ్ముళ్లు వణికిపోతున్నారు. ఏ ఒక్కర్నీ వదలం ఇది చాలా పెద్ద నేరం. అసలు ఎలాంటి పరీక్షలు, శిక్షణ లేకుండా పోలీసుశాఖలో చేరిపోవడం అంటే తమాషా కాదు. ప్రాథమికంగా 87 మంది హోంగార్డులను డీఐజీ తొలగించారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు అని తేలితే ఆ హోంగార్డులను సైతం అరెస్టుచేస్తాం. ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. – వై. రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు. -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్‌కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో తేలింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
డీవీ నాయుడు ఎక్కడున్నాడు?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు, నకిలీ ఎన్ఓసీ కేసులో కీలకసూత్రధారి డీవీ నాయుడు గురించి ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆరా తీశారు. మంగళవారం ఉదయం సెల్ కాన్ఫరెన్స్‌లో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్పతో ఎస్పీ మాట్లాడారు. న్యాయవాదులకు అందుబాటులో ఉన్న డీవీ నాయుడు మీకు మాత్రం కనిపించకుండా పోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక ఈ కేసులో నిందితులైన మనోజ్‌ను అక్టోబర్ 17న, ఫిర్యాదుదారుల్లో ఒకరైన శ్రీనివాసులును అదే నెల 18న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో ఫిర్యాదిదారి, కేసులో కీలకసూత్రధారి అయిన డీవీ నాయుడు జిల్లాను వీడి బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాడు. ఈ విషయాన్ని నాయుడు తనకు సన్నిహితంగా ఉన్న సమీప బంధువొకరికి చేరవేశాడు. సదరు సమీప బంధువు రెండు రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి జిల్లాలో జరుగుతున్న విషయాలను వివరించి తిరిగి వచ్చాడు. ఆ వెళ్లి వచ్చిన సన్నిహితుడెవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా అనంతపురానికి చెందిన మీడియా ప్రతినిధి ఒకరు ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి ‘డీవీ నాయుడు తప్పేమీ లేదు’ అని చెప్పినట్లు సమాచారం. ఆ మీడియా ప్రతినిధికి డీవీ నాయుడు గురించి తెలిసే ఉంటుందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. మరో రెండు రోజుల్లో డీవీ నాయుడు శ్రీలంక నుంచి రావాల్సి ఉంది. వీసా గడువు ముగుస్తుండటంతో అతను బెంగళూరు, ఢిల్లీ మినహా మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం లేదు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా పట్టుకోవాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. -
‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!
ఐటీలో రోజుకో అంశం తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. నిన్నటి వరకు మూన్‌లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్‌పై చర్చ నడవగా, తాజాగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తాజగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ తమ నియామక ప్రక్రియలో కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై వేటు వేసింది. సంస్థలో ఉద్యోగం పొందడానికి నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇతర తప్పుడు పత్రాలను ఉపయోగించిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ఆ ఉద్యోగులపై వేటు.. యాక్సెంచర్ కంపెనీ కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తుందని, కంపెనీ నియమ, నిబంధలను పాటించని వారిపై వేటు తప్పదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి కొందరు ఉద్యోగాలు పొందారన్న విషయం తెలియడంతో వారిని తొలగించింది. అయితే అలా పని చేస్తున్నా వారిలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న దానిపై యాక్సెంచర్ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. వీటితో పాటు మరో అంశంపై స్పందిస్తూ.. నకిలీ జాబ్ పోస్టుల పట్ల అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది. యాక్సెంచర్‌లో ఉద్యోగం కోసం కొన్ని ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలు, కొందరు వ్యక్తులు ఉద్యోగార్థుల వద్ద డబ్బు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. వాటిని నమ్మకండి యాక్సెంచర్‌లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్ధకు, వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బ్లాగ్ పోస్ట్‌లో హెచ్చరించింది. యాక్సెంచర్‌లో జాబ్ కోసం ఏ ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ సంస్థలో నియామకం కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని, ఉద్యోగాల కోసం ఎవరూ ఎప్పుడూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. కలెక్టర్ పేరుతో టీడీపీ నేతలు నకిలీ ఎన్వోసీ తయారు చేశారు. కూడేరులో రూ.20 కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా స్థానిక తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్, ఎస్ఐ, ట్రెజరీ ఉద్యోగి.. టీడీపీ నేతలతో చేతులు కలిపారు. వారి స్కెచ్ బయటకు రావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, కూడేరు భూబాగోతం కేసును పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు. నోరు మెదపొద్దు.. పెనుకొండ: సీబీఐ దాడులపై ఎక్కడేగాని నోరు మెదపరాదని టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మేలని, లేకుంటే లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని తన అనుచర గణాన్ని ఆయన అప్రమత్తం చేసినట్లు సమాచారం. రైల్వే పనులకు సంబంధించి కాంట్రాక్ట్‌లు నిర్వహిస్తున్న వెంకటేశ్వర చౌదరి అధికారులతో కలసి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ధ్రువీకరణ కావడంతో గత శుక్రవారం పెనుకొండలోని వెంకటేశ్వర చౌదరి ఇంటిపై సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర చౌదరితో పాటు ఇతర కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాల వివరాలు, పుస్తకాలను సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరందరి ఖాతాలతో పాటు సన్నిహితుల బ్యాంక్ ఖాతాలనూ సీబీఐ అధికారులు సీజ్ చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాక ఆర్థిక నేరాలకు సంబంధించి భార్యాభర్తలు బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని కూడా స్థానికులు అంటున్నారు. -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది.