చిత్తూరు(గిరింపేట): డీఎస్సీ-2012 లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లలో నకిలీవనే అనే అనుమానం వచ్చిన వాటి విచారణ శుక్రవారం ఉదయం 10గంటలకు డీఈవో కార్యాలయం లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అభ్యర్థులకు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. గత నెల ఫిబ్రవరిలో తిరుపతిలోని మహాత్మాగాంధీ మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి డీఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరి శీలించిన విషయం విదితమే. పరిశీలనానంతరం అభ్యర్థులు అందజేసిన నకలు కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తరలించారు.
అప్పటి నుంచి ఆ సర్టిఫికెట్లపై డీఈవో నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టిని పెట్టి పలుమార్లు పరిశీలించారు. అనుమానం వచ్చిన సర్టిఫికెట్లను పరిశీలించడానికి అభ్యర్థులు చదివిన సంబంధిత మండలాలకు విచారణ నిమిత్తం పంపారు. దాదాపు 8 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు నకిలీవని అనుమానం రాగా, ఆ విచారణాధికారులు వారిని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఫోన్ ద్వారా తెలియజేశారు.
నకిలీ సర్టిఫికెట్లపై నేడు విచారణ
Published Fri, Mar 4 2016 2:47 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement