నకిలీ ప్లాట్ల పత్రాల తయారీ ముఠా అరెస్ట్
Published Mon, Jan 2 2017 4:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలు తయారు చేసి వాటిని అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ముఠాలో ఉన్న ఐదుగురి సభ్యుల్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు రాచకొండ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రూ.1.10 లక్షల నగదు, 655 రబ్బరు స్టాంపులు, వెయ్యికిపైగా రిజిస్ట్రేషన్ రెవెన్యూ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే 332 నాన్ జుడీషియల్, 94 పాత నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
Advertisement
Advertisement