రూ.600 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా!... శేరిలింగంపల్లిలో 12.09 ఎకరాల స్థలంపై కన్ను
ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టి
రంగారెడ్డి–2 జాయింట్ సబ్ రిజిస్టర్‌తో కుమ్మక్కు
39అంతస్తుల్లో నివాస, వాణిజ్య భవన నిర్మాణానికి స్కెచ్
ఆరుగురు నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్‌తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్‌ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు.
రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్‌ఎల్‌పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు.
39 అంతస్తుల్లో భారీ భవనం...
ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్ నవీన్‌కుమార్ గోయెల్‌తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు.
జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కు..
రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్‌తో కలసి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు.
రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం..
ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్‌ను ని ర్మించాలని టీఎస్‌ఎల్‌ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్‌టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్‌సీ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్‌ను సైతం ఇచి్చంది.
కుట్ర బయటపడిందిలా...
శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్‌ఎల్‌పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్‌పై బీఎన్‌ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment