govt land grab
-
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్‌తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్‌ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్‌కుమార్ గోయెల్‌తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్‌ను ని ర్మించాలని టీఎస్‌ఎల్‌ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్‌టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్‌ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్‌పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
మాచర్లలో 23 ఎకరాలు కాజేసిన మాజీ కౌన్సిలర్
సాక్షి, మాచర్ల: ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు. ఆ నాయకుడు వాలిపోతాడు.. చుట్టూ కంచె వేసి.. ఆ తర్వాత దర్జాగా అమ్మేస్తాడు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కౌన్సిలర్ పదవిలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీశాడు. అప్పట్లో అధికారుల కళ్లకు గంతలు కట్టాడు. ఆ కబ్జాల బాగోతాన్ని ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆయన కొనసాగిస్తున్నాడు. మాచర్ల పట్టణంలోని కోట్ల రూపాయల విలువ చేసే 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్ యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు సిద్ధమైనా రెవెన్యూ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అధికారంలో ఉందని పది సంవత్సరాలు మొదట కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టీడీపీ నాయకుడిగా వ్యవహరించిన మాజీ కౌన్సిలర్ 7వ వార్డులోని పలు చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు. ప్రభుత్వ భూమి కనపడితే చాలు ముందు రాళ్లేయటం, ఆ తర్వాత అమ్మేయటం అలవాటుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నాయకుడు దాదాపుగా 10 ఎకరాలను కాజేశాడు. ఆ ప్రభుత్వంలో కౌన్సిలర్‌గా ఉండి తాను ఆక్రమించిన ఇళ్లకు ఇంటి పన్ను పేరుతో ఖాళీ స్థలాలకు పన్ను వేయించాడు. అంతటితో ఊరుకోలేదు. ఇదంతా తన స్థలమేనని వ్యాపారం చేశాడు. తిరిగి కాంగ్రెస్ అధికారం కోల్పోగానే టీడీపీలో చేరాడు. 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. ఆ తర్వాత 7వ వార్డులోని సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో 3 ఎకరాలు, సాయిబాబా దేవాలయం వెనుక 10 ఎకరాలు, 7వ వార్డుకు వెళ్లే రహదారిలో నాలుగున్నర ఎకరాలను స్వా«ధీనం చేసుకొని రియల్ఎస్టేట్ మొదలుపెట్టాడు. ఇంత దర్జాగా వ్యాపారం చేసినా రెవెన్యూ, పురపాలక అధికారులు పట్టించుకోలేదు. అయితే ఆ కౌన్సిలర్ అంతటితో ఆగకుండా తనకు అడ్డం వచ్చిన ఓ వ్యక్తిని హత్య చేయించి కేసులో ఇరుక్కున్నాడు. హైకోర్టు ఆదేశించినా.... పోలీసులు ఆ వ్యక్తిపై రౌడీషీట్ సైతం ఓపెన్ చేశారు. అయినా ఆక్రమణలను ఆపలేదు. చివరికి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం హైకోర్టు పోలీసులకు ఆదేశాల జారీ చేయటంతో కేసులు నమోదు చేశారు. అయినా ఇప్పటికీ ఆక్రమణలను కొనసాగిస్తూ మూడు రోజులుగా ఖాళీగా ఉన్న స్థలాలలో ట్రాక్టర్ల ద్వారా రాళ్లను తోలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖాధికారులు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు అని చెప్పినా వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆక్రమణలను గుర్తించాం పట్టణంలోని 7వ వార్డులో ఇప్పటికి 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. కొంతమంది ఆక్రమణదారులపై పోలీసులకు సమాచారం ఇ చ్చాం. ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశాం. సాయిబాబా గుడి వెనుకాల 60 శాతం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. మిగతా భూ ములలో బేస్ మట్టా లు, రాళ్లు వేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –సాంబశివరావు, ఆర్ఐ -
కబ్జా గుప్పిట్లో సర్కారు భూమి
శంషాబాద్ రూరల్: ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది. రూ. కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారుల నిర్లక్ష్యం.. ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది. శంషాబాద్ మండలం.. పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 87లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పది సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందులోని కొంత స్థలం జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలకు కేటాయించారు. ఇదే సమయంలో బెంగళూరు జాతీయ రహదారి– ఔటర్ రింగు రోడ్డు అనుసంధానం కోసం కొత్తగా పీ–వన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రహదారి ఇదే సర్వే నంబరులోని భూముల నుంచి వెళ్లింది. రోడ్డుకు రెండు వైపులా దాదాపు రెండెకరాల భూమి మిగిలిపోయింది. దక్షిణం వైపు జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలను నిర్మించగా.. కొంత ఖాళీ స్థలం మిగిలింది. ఇక పీ–వన్ రోడ్డుకు ఉత్తరం వైపున సుమారు 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండిపోయింది. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న పట్టా భూముల యజమానులు ప్రభుత్వ భూమిని తమ పొలంలో కలిపేసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిని పట్టా భూముల్లో కలిపేసి ఇతరులకు విక్రయించారు. ఈ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విలువైన భూముల రక్షణ ఇంతేనా? శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుతో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పాల్మాకులలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి పక్క నుంచే నాలుగు వరసల పీ–వన్ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోనే బెంగళూరు జాతీయ రహదారి కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎకరం పొలం సుమారు రూ.కోటిన్నర వరకు ధర పలుకుతోంది. సర్వే నంబరు 87లో దాదాపు రెండు ఎకరాలు కబ్జాకు గురి కాగా.. ఈ భూములను ఆధీనంలోకి తీసుకున్న కొందరు ఇటీవలే అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
‘ఆయనేం మాట్లాడారో నాకు తెలియదు’
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అధికారుల అండతోనే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని.. ఈ అంశంతో సంబంధం ఉన్న సబ్ రిజిస్టార్లను బదిలీ చేశారు తప్పా వారి వెనుక ఉన్న ముఖ్య నాయకులను వదిలేశారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం తమకు నమ్మకం లేదని, మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా వ్యవహారంలో పెద్ద పెద్ద వాళ్ల హస్తముందని, కాంగ్రెస్ హయం నుంచి విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదన్నారు. నయీం కేసులో కూడా పోలీసుల మీద చర్యలు తీసుకొని నాయకులను వదిలేశారని అన్నారు. ఈ కేసులో అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు మీడియా హైప్ ఇచ్చిందన్నారు. చాలా మంది చేరతారని ప్రచారం జరిగినా ఎవరు చేరలేదని తెలిపారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పొత్తులపై జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదని దిగ్విజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.